
Photo Courtesy: BCCI
ఐపీఎల్‌లో ప్రస్తుత ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు ఉంది. ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బౌల్ట్ రికార్డు కలిగి ఉన్నాడు. తాజాగా ఈ రికార్డును బౌల్ట్ మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ మరోసారి తొలి ఓవర్‌లో వికెట్ తీసి తన తొలి ఓవర్ వికెట్ల సంఖ్యను 30కి (96 మ్యాచ్‌లు) పెంచుకున్నాడు.
ఐపీఎల్‌లో బౌల్ట్ తర్వాత తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్‌కు దక్కుతుంది. ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్న భువీ ఐపీఎల్ తొలి ఓవర్లలో 27 వికెట్లు (126 మ్యాచ్‌లు) తీశాడు. ఈ రికార్డుకు సంబంధించి బౌల్ట్, భువీ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ తొలి ఓవర్‌లో ప్రవీణ్ కుమార్ 15, సందీప్ శర్మ 13, దీపక్ చాహర్ 13 వికెట్లు తీశారు.
కాగా, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ తొలి ఓవర్‌లోనే సునీల్ నరైన్‌ను డకౌట్ చేశాడు. తద్వారా కేకేఆర్ పతనానికి నాంది పలికాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం పేసర్ (ముంబై ఇండియన్స్) అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది.
అశ్వనీ కుమార్‌తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) రాణించడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది (16.2 ఓవర్లలో).
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్‌దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఈ సీజన్‌లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్‌లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది.