
ఐపీఎల్-2025 (IPL 2025) ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఓ దశలో సునయాసంగా మ్యాచ్ గెలిచేలా కన్పించిన ఢిల్లీ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తొలి ఓటమి చవిచూడాల్సింది. అయితే ఢిల్లీ వికెట్లను కుప్పకూల్చడంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీలక పాత్ర పోషించాడు. డగౌట్ నుంచే తన మాస్టర్ మైండ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు హిట్‌మ్యాన్.
అసలేమి జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 7 ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో అప్పటికే రాహుల్, స్టబ్స్ ఉన్నారు. ఇదే సమయంలో బంతి మార్చాలని అంపైర్‌లకు ముంబై జట్టు అభ్యర్థించింది.
వారి అభ్యర్ధను అంగీకరించిన అంపైర్‌లు బంతిని మార్చారు. వెంటనే డగౌట్‌లో ఉన్న రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. రోహిత్.. హెడ్ కోచ్ జయవర్దనే, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ కర్ణ్ శర్మతో బౌలింగ్ చేయించాలని హార్దిక్‌కు సైగలు చేశాడు. రోహిత్ మాట విన్న పాండ్యా.. కర్ణ్‌ను 14వ ఓవర్ వేసేందుకు ఎటాక్‌లో తీసుకొచ్చాడు.
అయితే రోహిత్ ఊహించినట్టే ఆ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌కు ఫలితం దక్కింది. అద్భుతమైన ఫామ్‌లో స్టబ్స్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. బంతి పొడిగా ఉన్నందున, రోహిత్ ప్రణాళిక సరిగ్గా పనిచేసింది. ఆ తర్వాత 16 ఓవర్ వేసిన కర్ణ్..కేఎల్ రాహుల్‌ను సైతం బోల్తా కొట్టించాడు.
రాహుల్ వికెట్‌తో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. కాగా డగౌట్‌లో కూర్చుని మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ నంబర్ వన్ కెప్టెన్ ఎలా అయ్యాడో మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(18).. ఫీల్డింగ్‌లో బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలోనే కర్ణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.
#MI's spinners 𝙩𝙪𝙧𝙣𝙚𝙙 the game on its head! 🙌
Here’s how the experts broke down their coaching staff's spot-on call to bring them in at just the right moment 🗣#IPLonJioStar 👉 #LSGvCSK | MON, 14th APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/POK9x6m9Qc— Star Sports (@StarSportsIndia) April 13, 2025