SRH VS GT: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను.. అదే నన్ను పైకి లేపింది: సిరాజ్‌ | IPL 2025: Siraj Comments After Winning POTM Against SRH | Sakshi
Sakshi News home page

SRH VS GT: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను.. అదే నన్ను పైకి లేపింది: సిరాజ్‌

Published Mon, Apr 7 2025 10:40 AM | Last Updated on Mon, Apr 7 2025 10:53 AM

IPL 2025: Siraj Comments After Winning POTM Against SRH

Photo Courtesy: BCCI

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో సిరాజ్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. నిన్న (ఏప్రిల్‌ 6) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం​ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. 

తద్వారా గుజరాత్‌ సన్‌రైజర్స్‌ను వారి సొంత ఇలాకాలో (ఉప్పల్‌ స్టేడియంలో) చిత్తుగా ఓడించింది. ఈ ప్రదర్శనకు గానూ సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ (4-0-19-3) సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శనకు కూడా సిరాజ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతకుముందు గుజరాత్‌ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించడంలోనూ సిరాజ్‌ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సిరాజ్‌ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్‌ శర్మ, రికెల్టన్‌లను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు) తీశాడు.

సిరాజ్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెచ్చిపోవడంతో గుజరాత్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఓడిన ఈ జట్టు ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. గుజరాత్‌ ఈ స్థాయిలో సత్తా చాటడంలో సిరాజ్‌దే ప్రధాన పాత్ర. 

సన్‌రైజర్స్‌పై ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్‌ ఇలా అన్నాడు. సొంత మైదానంలో ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఇవాళ మ్యాచ్‌లో నా కుటుంబ సభ్యులు జనం మధ్యలో ఉన్నారు. అదే నన్ను పైకి లేపింది. నేను ఏడు సంవత్సరాలు ఆర్సీబీకి ఆడాను. నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడ్డాను. అది నాకు ఇప్పుడు పనిచేస్తోంది. ఓ సమయంలో నేను దానిని జీర్ణించుకోలేకపోయాను (ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు).

అయినా నిరాశపడకుండా ఫిట్‌నెస్ మరియు ఆటపై దృష్టి పెట్టాను. నేను చేసిన తప్పులపై వర్కౌట్‌ చేశాను. ప్రస్తుతం నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. టీమిండియా తరఫున స్థిరంగా ఆడుతున్నప్పుడు జట్టులో స్థానం​ కోల్పోవడం నిజంగా బాధించింది. అయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నాను. ఐపీఎల్‌ కోసం ఎదురు చూశాను. కసితో వర్కౌట్‌ చేసి సత్ఫలితాలు సాధిస్తున్నాను. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement