Gujarat Titans
-
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
వరుస ఓటముల నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్ డానియల్ వెటోరి (Daniel Vettori) కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము దూకుడైన బ్యాటింగ్ విధానానికే కట్టుబడి ఉంటామని.. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా ప్రణాళికలు అమలు చేయడం ముఖ్యమని పేర్కొన్నాడు. తాను, తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఇలాంటి పరాజయాలకు భయపడే రకం కాదని.. త్వరలోనే తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.కాగా గతేడాది ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కమిన్స్ బృందం.. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఏకంగా ఫైనల్ వరకు చేరింది. అయితే, ఆఖరిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ ఏడాది టీమిండియా స్టార్లు మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ రాకతో మరింత పటిష్టంగా మారిన రైజర్స్.. ఆటలో మాత్రం తేలిపోతోంది.వరుసగా నాలుగు ఓటములు!ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం తర్వాత రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి మీడియాతో మాట్లాడాడు.మా బ్యాటింగ్ శైలి మారదుఈ సందర్భంగా.. ‘‘దూకుడుగా బ్యాటింగ్ చేయాలన్న మా శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే, పరిస్థితులను కూడా మేము బాగా అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్ల బౌలింగ్ విభాగం పట్ల గౌరవం కలిగి ఉండాలి. వారి వ్యూహాలను అర్థం చేసుకునేలా ప్రణాళికలు రచించుకోవాలి.ప్రణాళికల అమలులో విఫలంమా జట్టులోని ముగ్గురు టపార్డర్ బ్యాటర్ల కోసం వివిధ రకాల ప్రణాళికలు సిద్ధం చేసినా.. సరైన సమయంలో వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నది వాస్తవం. అయితే, నేనైనా.. ప్యాట్ అయినా.. మా కెరీర్లో భయపడిన సందర్భాలు లేవు.అయితే, వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం స్వాగతించదగ్గ విషయం కాదని మాకూ తెలుసు. ఈ పరాజయాలు కచ్చితంగా ఈ సీజన్లో మా లక్ష్యాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు’’ అని వెటోరి చెప్పుకొచ్చాడు. కాగా ఆదివారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిఓపెనర్లు అభిషేక్ శర్మ (18), ట్రవిస్ హెడ్ (8)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (17) పూర్తిగా విఫలమయ్యారు. ఇక నితీశ్ రెడ్డి (31), క్లాసెన్ (19 బంతుల్లో 27), కమిన్స్ (9 బంతుల్లో 22) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో రైజర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.ఈ క్రమంలో.. రైజర్స్ విధించిన నామమాత్రపు టార్గెట్‌ను 16.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ ఛేదించింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(61), వాషింగ్టన్ సుందర్ (49), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (35 నాటౌట్) అదరగొట్టారు. ఇక అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుని రైజర్స్‌ని దెబ్బ కొట్టిన టైటాన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (4/17)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్3️⃣ wins on the trot 💙A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @gujarat_titans pic.twitter.com/tYB1Dt5mdd— IndianPremierLeague (@IPL) April 6, 2025 -
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఏకపక్ష విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.కాగా, ఈ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లఘించినందుకు గానూ గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మకు భారీ జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత పెట్టారు. అలాగే ఓ డీ మెరిట్ పాయింట్ కూడా కేటాయించారు.ఈ మ్యాచ్‌లో ఇషాంత్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. ఈ నిబంధన మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాల దుర్వినియోగంతో వ్యవహరిస్తుంది. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా వికెట్లను లేదా ప్రకటన బోర్డులను లేదా సరిహద్దు కంచెలను లేదా డ్రెస్సింగ్ రూమ్ సామాగ్రికి నష్టం కలిగిస్తే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించినట్లు లెక్క. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్ ఇషాంత్ శర్మకు అంత కలిసి రాలేదు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాంత్ ఇచ్చిన పరుగులు సన్‌రైజర్స్ స్కోర్‌లో 30 శాతం. ఈ సీజన్ మొత్తంలో కూడా ఇషాంత్ ఇంతే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. సహచర పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణిస్తున్నా ఇషాంత్ చెత్త బౌలింగ్‌తో విసుగుతెప్పించాడు. ఈ సీజన్లో ఇషాంత్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇందులో 8 ఓవర్లు వేసి 107 పరుగులు సమర్పించుకున్నాడు.ఈ సీజన్లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడిన ఐదో క్రికెటర్ ఇషాంత్. అతనికి ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, లక్నో బౌలర్ దిగ్వేశ్ రతీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. వీరిలో కెప్టెన్లు స్లో ఓవర్ రేట్‌కు బాధ్యులు కాగా.. దిగ్వేశ్ రతీ తన నోట్ బుక్ సెలబ్రేషన్స్‌కు గానూ జరిమానా ఎదుర్కొన్నాడు. -
‘మీకసలు మానవత్వం ఉందా?’.. గిల్- ఇషాన్‌పై నెటిజన్లు ఫైర్.. కానీ ఓ ట్విస్ట్!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తమ ఫీల్డర్ నొప్పితో విలవిల్లాడుతుంటే... అతడు మాత్రం ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో కలిసి నవ్వులు చిందించడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడింది.ఆరంభంలోనే షాకులుఉప్పల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు అతడి నమ్మకాన్ని వమ్ముకానీయలేదు. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ ట్రవిస్ హెడ్ (8)ను పెవిలియన్‌కు పంపిన టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్.. తదుపరి ఐదో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18)ను కూడా అవుట్ చేశాడు.ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఎనిమిదో ఓవర్ రెండో బంతికి టైటాన్స్ మరో పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, అంతకంటే ముందు.. అంటే ఆరో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఇషాన్ ఎదుర్కొన్నాడు.గ్లెన్ ఫిలిప్స్నకు గాయంఅవుట్ సైడ్ ఆఫ్ దిశగా ప్రసిద్ వేసిన షార్ట్ బాల్‌ను పాయింట్ వైపు తరలించగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న టైటాన్స్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. మైదానంలో కుప్పకూలి నొప్పితో విలవిల్లాడగా.. వాషింగ్టన్ సుందర్ అతడికి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఇంతలో ఫిజియో కూడా వచ్చి ఫిలిప్స్‌ను పరీక్షించి.. మైదానం బయటకు తీసుకువెళ్లాడు.ఇషాన్- గిల్ నవ్వులుఅయితే, ఆ సమయంలో నితీశ్ రెడ్డితో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన గిల్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. ఇషాన్ తన భుజంపై చేయి వేయగా.. గిల్ కూడా నవ్వులు చిందిస్తూ సరదాగా సంభాషిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గిల్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.glenn phillips is lying in pain and these two buddies are gossiping like they're in some college park 😭😭😭#SRHvGT pic.twitter.com/172aqoAtM4— 🍂 (@jaaniyeeex) April 6, 2025మీకసలు మానవత్వం ఉందా?‘‘సొంత జట్టు ఆటగాడు గాయపడి.. నొప్పితో బాధపడుతుంటే.. కెప్టెన్ మాత్రం ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాడితో ముచ్చట్లు పెడుతున్నాడు. ఆటగాళ్ల మధ్య స్నేహం తప్పు కాదు. కానీ పరిస్థితికి తగ్గట్లుగా హుందాగా , కాస్త మానవత్వంతో వ్యవహరించాలి. మ్యాచ్ అయిపోయిన తర్వాత కావాల్సినంత సేపు జోకులు వేసుకోవచ్చు’’ అంటూ గిల్‌కు చురకలు అంటిస్తున్నారు.కాగా ఇషాన్- శుబ్‌మన్ గిల్ అండర్-19 స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోనూ ఓపెనింగ్ జోడీగా రాణించారు. వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఉంది. అయితే, టైటాన్స్- రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడు గాయపడిన వేళ.. ఇలా నవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవడం వీరిపై విమర్శలకు దారితీసింది.Left national team to chase IPL money. Got injured without playing a ball.- Glenn Phillips proving once again, greed has its own price. 🥲 #GTvSRH pic.twitter.com/S0urYUhW7q— MUHAMMAD SAMI (@mrsalaar96) April 6, 2025 కానీ ఓ ట్విస్ట్!అయితే, అప్పటికి ఫిలిప్స్ పరిస్థితిని గిల్ చూడకపోవడం గమనార్హం. విషయం తెలిసిన వెంటనే అతడు తమ ఫీల్డర్ దగ్గరికి వెళ్లినట్లు కనిపించింది. దీంతో.. ‘‘తెలిసీ తెలియక మాట్లాడవద్దు’’ అంటూ ట్రోలర్స్‌కు గిల్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ టాపార్డర్ అభిషేక్ శర్మ(18), ట్రవిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) మరోసారి విఫలం కాగా.. నితీశ్ రెడ్డి 34 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇతరులలో హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) కాస్త వేగంగా ఆడారు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.గిల్ సూపర్ బ్యాటింగ్టైటాన్స్ పేసర్లు మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని టైటాన్స్ 16.4 ఓవర్లలోనే ఛేదించింది.ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత అర్థ శతకం సాధించగా.. వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్) అదరగొట్టారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీకి రెండు, కమిన్స్‌కు ఒక వికెట్ దక్కాయి.3️⃣ wins on the trot 💙A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @gujarat_titans pic.twitter.com/tYB1Dt5mdd— IndianPremierLeague (@IPL) April 6, 2025 చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
పసలేదు బ్రో.. సన్‌రైజర్స్ ఆట తీరుపై అభిమానుల నిరాశ (ఫొటోలు)
-
SRH VS GT: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను.. అదే నన్ను పైకి లేపింది: సిరాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. నిన్న (ఏప్రిల్ 6) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. తద్వారా గుజరాత్ సన్‌రైజర్స్‌ను వారి సొంత ఇలాకాలో (ఉప్పల్ స్టేడియంలో) చిత్తుగా ఓడించింది. ఈ ప్రదర్శనకు గానూ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ (4-0-19-3) సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శనకు కూడా సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు గుజరాత్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించడంలోనూ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సిరాజ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, రికెల్టన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు) తీశాడు.సిరాజ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెచ్చిపోవడంతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఈ జట్టు ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. గుజరాత్ ఈ స్థాయిలో సత్తా చాటడంలో సిరాజ్‌దే ప్రధాన పాత్ర. సన్‌రైజర్స్‌పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ ఇలా అన్నాడు. సొంత మైదానంలో ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఇవాళ మ్యాచ్‌లో నా కుటుంబ సభ్యులు జనం మధ్యలో ఉన్నారు. అదే నన్ను పైకి లేపింది. నేను ఏడు సంవత్సరాలు ఆర్సీబీకి ఆడాను. నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడ్డాను. అది నాకు ఇప్పుడు పనిచేస్తోంది. ఓ సమయంలో నేను దానిని జీర్ణించుకోలేకపోయాను (ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు).అయినా నిరాశపడకుండా ఫిట్నెస్ మరియు ఆటపై దృష్టి పెట్టాను. నేను చేసిన తప్పులపై వర్కౌట్ చేశాను. ప్రస్తుతం నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. టీమిండియా తరఫున స్థిరంగా ఆడుతున్నప్పుడు జట్టులో స్థానం కోల్పోవడం నిజంగా బాధించింది. అయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నాను. ఐపీఎల్ కోసం ఎదురు చూశాను. కసితో వర్కౌట్ చేసి సత్ఫలితాలు సాధిస్తున్నాను. -
‘ట్రావిషేక్’ మళ్లీ ఫెయిల్!.. ఇదేం బ్యాటింగ్? సహనం కోల్పోయిన కావ్యా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు రోజురోజుకీ అధ్వానంగా తయారవుతోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన కమిన్స్ బృందం.. తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. సొంత మైదానం ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.సమిష్టి వైఫల్యంతో పరాజయాల సంఖ్యను నాలుగుకు పెంచుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం టాపార్డర్ దారుణంగా విఫలం కావడమే. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma), ట్రవిస్ హెడ్ (Travid Head) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకోవడం.. జట్టులోకి కొత్తగా వచ్చి వన్‌డౌన్‌లో ఆడుతున్న టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ కూడా వరుస మ్యాచ్‌లలో చేతులెత్తేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది.టాపార్డర్ మరోసారి కుదేలుగుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ బ్యాటింగ్ త్రయం దారుణంగా విఫలమైంది. అభిషేక్ 16 బంతుల్లో 18 చేసి నిష్క్రమించగా.. హెడ్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఈ ఇద్దరి వికెట్లను హైదరాబాదీ స్టార్, గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు.Hyderabad + New ball = Miyan Magic!#MohammedSiraj rocks #SRH early with the big wicket of #TravisHead in the opening over! 👊🏻Watch LIVE action ➡ https://t.co/meyJbjwpV0#IPLonJioStar 👉 SRH 🆚 GT | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2… pic.twitter.com/Vokiul9meR— Star Sports (@StarSportsIndia) April 6, 2025 సహనం కోల్పోయిన కావ్యా మారన్ఇక ఓపెనర్ల వరుస వైఫల్యాలతో విసుగెత్తిన సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘‘అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంత ఘోరంగా అవుటవుతారా? ఇదేం బ్యాటింగ్’’ అన్నట్లుగా హావభావాలు పలికిస్తూ తలను బాదుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Ruk jao bhai kya kar rahe ho Normal cricket khel lo ab 🤣🤣Kavya maran's reactions 🤌🏽🤣 pic.twitter.com/O39QTMNgPc— ••TAUKIR•• (@iitaukir) April 6, 2025సిరాజ్ ‘స్ట్రోక్’ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (18), ట్రవిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) మరోసారి చేతులెత్తేయగా.. నితీశ్ రెడ్డి (31) రాణించాడు. హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27), కమిన్స్ (9 బంతుల్లో 22) వేగంగా ఆడి స్కోరును 150 పరుగుల మార్కు దాటించారు.గుజరాత్ బౌలర్లలో లోకల్ బాయ్ సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు కూల్చారు. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు రైజర్స్ పేసర్ షమీ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ సాయి సుదర్శన్‌ను 5 పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు.గిల్, వాషీ, రూథర్‌ఫర్డ్ ధనాధన్అదే విధంగా.. ప్రమాదకర బ్యాటర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్ కమిన్స్ డకౌట్ చేశాడు. అయితే, రెండు కీలక వికెట్లు తీసిన ఆనందం సన్‌రైజర్స్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. నాలుగో స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ధనాధన్ (29 బంతుల్లో 49) దంచికొట్టాడు.ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (16 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35) తన పవర్ హిట్టింగ్తో గిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గిల్, వాషీ, రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్ కారణంగా 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయఢంకా మోగించింది.Glorious shots on display 🫡Captain Shubman Gill led from the top and remained unbeaten with a well constructed innings of 61(43) 👏Scorecard ▶ https://t.co/Y5Jzfr7tkC#TATAIPL | #SRHvGT | @ShubmanGill pic.twitter.com/1CWQU5gd82— IndianPremierLeague (@IPL) April 6, 2025 చదవండి: SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్ -
SRH VS GT: బౌలర్లే మ్యాచ్‌లు గెలిపిస్తారు.. సిరాజ్‌లోని ఎనర్జీ వేరే లెవెల్: గిల్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సీజన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానానికి పడిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. లోకల్ బాయ్ సిరాజ్ (4-0-17-4) చెలరేగడంతో అతి కష్టం మీద 152 పరుగులు చేయగలిగింది. సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ (4-0-25-2), సాయి కిషోర్ (4-0-24-2) కూడా సత్తా చాటడంతో సన్‌రైజర్స్ ఒక్కో పరుగు చేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 18, ట్రవిస్ హెడ్ 8, ఇషాన్ కిషన్ 17, నితీశ్ రెడ్డి 31, క్లాసెన్ 27, అనికేత్ వర్మ 18, కమిందు 1, సిమర్జీత్ డకౌటయ్యారు. ఆఖర్లో కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ కూడా ఆదిలో తడబడింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ (0) వికెట్లు కోల్పోయింది. అయితే శుభ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు).. వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) సహకారంతో గుజరాత్‌ను మరో 20 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో షమీ 2, కమిన్స్ ఓ వికెట్ తీశారు.మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. టీ20 ఫార్మాట్లో బౌలర్లే గేమ్ ఛేంజర్లు. చాలా మంది భారీ హిట్టర్ల గురించి మాట్లాడుకుంటారు కానీ, బౌలర్లే మ్యాచ్‌లు గెలిపిస్తారు. నేటి మ్యాచ్‌లో మేము మైదానం అంతటా షాట్లు ఆడాలనుకున్నాము. అదే నేను, సుందర్ డిస్కస్ చేసుకున్నాము.సుందర్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే బరిలోకి దిగి ఉండాల్సింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజు అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. మేము మంచి క్రికెటింగ్ షాట్లు ఆడాలనుకున్నాము. ఓసారి 30-40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే, అదే మనల్ని ఆటలోకి తీసుకెళ్తుంది. బౌలింగ్, ఫీల్డింగ్ సమయంలో సిరాజ్ ఇచ్చే ఊపు అంటువ్యాధి లాంటిది. అది జట్టు మొత్తానికి పాకుతుంది. ఫీల్డ్‌లో అతనిలోని ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రోజు అతను బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. -
SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. తమ హోం గ్రౌండ్లో (ఉప్పల్ స్టేడియం) జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో వారికిది వరుసగా నాలుగో ఓటమి. గుజరాత్ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లోనే ఓడి, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. ఎస్ఆర్హెచ్పై విజయం అనంతరం ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ చిట్టచివరి స్థానానికి పడిపోయింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు లోకల్ బాయ్ సిరాజ్ చుక్కలు చూపించాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (8), అభిషేక్ శర్మను (18) పవర్ ప్లేలోనే పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మరో డేంజర్ బ్యాటర్ అనికేత్ వర్మను (18) కూడా ఔట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ (4-0-25-2), సాయి కిషోర్ (4-0-24-2) కూడా సత్తా చాటడంతో సన్‌రైజర్స్ అతి కష్టం మీద 152 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. ఆఖర్లో కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 17, నితీశ్ రెడ్డి 31, క్లాసెన్ 27, కమిందు 1, సిమర్జీత్ డకౌటయ్యారు. షమీ 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు తమ సహజ శైలికి భిన్నంగా జిడ్డుగా ఆడారు.స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా ఆదిలో తడబడినప్పటికీ.. ఆతర్వాత కుదురుకుంది. శుభ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఓ పక్క గిల్ బాధ్యతాయుతంగా ఆడుతుంటే వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయాడు. సుందర్ ఔటయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా గుజరాత్ మరో 20 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్(5), జోస్ బట్లర్ (0) విఫలమయ్యారు. గుజరాత్ పవర్ ప్లేలోనే వీరిద్దరి వికెట్లు కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో షమీ 2, కమిన్స్ ఓ వికెట్ తీశారు.మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వికెట్ (పిచ్) చాలా కఠినంగా ఉండింది. మ్యాచ్ ఆరంభంలో వికెట్లు తీస్తే ఆటలోకి వచ్చినట్లే. బంతి ఎక్కువగా స్పిన్ కాలేదు. మంచు ప్రభావం కూడా ఉండింది. అయినా వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి పేసర్లును ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండింది. -
హైదరాబాద్ ను ఓడించిన గుజరాత్
-
‘నాలుగు’తో నగుబాటు
ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేవరకు ఒక్క సిక్స్ కూడా లేదు... ఒకదశలో వరుసగా 6 ఓవర్ల పాటు కనీసం ఫోర్ కూడా రాలేదు... విధ్వంసక బ్యాటింగ్‌తో మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలతో విరుచుకుపడే సన్‌రైజర్స్ జట్టేనా ఇది? మొదటి మ్యాచ్ తర్వాత గతి తప్పిన బ్యాటింగ్‌తో హైదరాబాద్ అదే వైఫల్యాన్ని కనబర్చింది. ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా నాలుగో ఓటమితో సన్‌రైజర్స్ ఆఖరి స్థానంతోనే మరింత అథమ స్థితికి చేరింది. గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన సొంతగడ్డపై నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్‌ను కుప్పకూల్చాడు. పవర్‌ప్లేలో అతను ఓపెనర్లను అవుట్ చేసిన తర్వాత హైదరాబాద్ జట్టు కోలుకోలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అలవోకగా ఛేదించింది. గిల్, సుందర్, రూథర్‌ఫోర్డ్ రాణించడంతో మరో 20 బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్ జట్టు గెలుపు ఖాయమైంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియంలోనూ కోలుకోలేకపోయిన జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ సిరాజ్ (4/17) పదునైన బౌలింగ్‌తో రైజర్స్‌ను దెబ్బ తీయగా... సాయికిషోర్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు), తొలిసారి టైటాన్స్ తరఫున ఆడిన వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు గెలుపు సులువైంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 56 బంతుల్లో 90 పరుగులు జోడించారు. గిల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 21 బంతుల్లో 46 పరుగులు భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్లు విఫలం... టి20 క్రికెట్లో తొలిసారి ట్రవిస్ హెడ్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు)కు సిరాజ్ బౌలింగ్ చేశాడు. అయితే ఈ పోరాటం ఐదు బంతులకే పరిమితమైంది. మొదటి ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన హెడ్‌ను చివరి బంతికి సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు)ను కూడా సిరాజ్ వెనక్కి పంపడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్ 45 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నితీశ్, హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే నితీశ్ మరీ నెమ్మదిగా ఆడాడు. భారీ షాట్లు ఆడటంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఐదో ఓవర్ నుంచి 10వ ఓవర్ వరకు హైదరాబాద్ బ్యాటర్లు ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ నమోదు కాలేదు. రషీద్ బౌలింగ్‌లో క్లాసెన్ ఈ సిక్స్ బాదాడు. నాలుగో వికెట్‌కు నితీశ్, క్లాసెన్ 39 బంతుల్లో 50 పరుగులు జోడించారు. క్లాసెన్ అవుటైన తర్వాత తక్కువ వ్యవధిలో నితీశ్, కమిందు (1), అనికేత్ వర్మ (18) కూడా వెనుదిరిగారు. చివర్లో ప్యాట్ కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ధాటిగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. 15–19 ఓవర్ల మధ్య 34 పరుగులే రాబట్టిన రైజర్స్ ఇషాంత్ వేసిన ఆఖరి ఓవర్లో గరిష్టంగా 17 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ తన తొలి ఓవర్లో సాయి సుదర్శన్ (5)ను వెనక్కి పంపగా, బట్లర్ (0)ను కమిన్స్ అవుట్ చేశాడు. అయితే సన్‌రైజర్స్ ఆనందం ఇక్కడికే పరిమితమైంది. గిల్, సుందర్ కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. సిమర్జిత్ ఓవర్లో సుందర్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టైటాన్స్ స్కోరు 48 పరుగులకు చేరింది. మరోవైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 36 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో అనికేత్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగిన సుందర్ అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. 41 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. అభిషేక్ ఓవర్లో అతను 4 ఫోర్లు బాదడం విశేషం. ఆ తర్వాత మ్యాచ్ ముగించేందుకు టైటాన్స్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 19 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100 వికెట్లు పడగొట్టిన 19వ భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా 26వ బౌలర్‌గా సిరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 97 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు. 4/17 ఐపీఎల్ చరిత్రలో సిరాజ్ తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలుసన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) తెవాటియా (బి) సిరాజ్ 18; హెడ్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 8; ఇషాన్ కిషన్ (సి) ఇషాంత్ (బి) ప్రసిధ్ 17; నితీశ్ రెడ్డి (సి) రషీద్ (బి) సాయికిషోర్ 31; క్లాసెన్ (బి) సాయికిషోర్ 27; అనికేత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 18; కమిందు (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 1; కమిన్స్ (నాటౌట్) 22; సిమర్జిత్ (బి) సిరాజ్ 0; షమీ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–50, 4–100, 5–105, 6–120, 7–135, 8–135. బౌలింగ్: సిరాజ్ 4–0–17–4, ఇషాంత్ శర్మ 4–0–53–0, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–31–0, సాయికిషోర్ 4–0–24–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయిసుదర్శన్ (సి) అనికేత్ (బి) షమీ 5; గిల్ (నాటౌట్) 61; బట్లర్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 0; సుందర్ (సి) అనికేత్ (బి) షమీ 49; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–106. బౌలింగ్: షమీ 4–0–28–2, కమిన్స్ 3.4–0–26–1, సిమ్రన్‌జీత్ 1–0–20–0, ఉనాద్కట్ 2–0–16–0, అన్సారీ 4–0–33–0, కమిందు మెండిస్ 1–0–12–0, అభిషేక్ శర్మ 1–0–18–0. ఐపీఎల్లో నేడుముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
తీరు మారని ఎస్ఆర్హెచ్.. వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సన్‌రైజర్స్ విఫలమైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. మహ్మద్ సిరాజ్ ఆదిలోనే హెడ్, అభిషేక్‌ను ఔట్ చేసి సన్‌రైజర్స్‌ను దెబ్బతీశాడు. సిరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు.గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో ఊదిపడేసింది. గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. గిల్ (43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(49), రూథర్ ఫర్డ్(35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో షమీ రెండ వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్ ఓ వికెట్ సాధించారు. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పడిపోయింది. -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. 'సెంచరీ' కొట్టిన మహ్మద్ సిరాజ్
ఐపీఎల్-2025లో టీమిండియా ఫాస్ట్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు.అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ ఔట్ చేశాడు. ఓవరాల్‌గా సిరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన వందో ఐపీఎల్ వికెట్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్‌గా సిరాజ్ మియా రికార్డులకెక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. ఈ ఏడాది సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో సిరాజ్ రెండో స్ధానంలో ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్ -
SRH Vs GT: ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్..
IPL 2025 GT vs SRH Live updates: ఐపీఎల్-2025లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి.గుజరాత్ ఘన విజయంఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(49), రూథర్ ఫర్డ్(35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్ ఒక వికెట్ సాధించాడు.గుజరాత్ మూడో వికెట్ డౌన్..వాషింగ్టన్ సుందర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన సుందర్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.10 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 82/210 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(40), శుబ్‌మన్ గిల్(36) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న గుజరాత్..7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(29), శుబ్‌మన్ గిల్(21) ఉన్నారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(19), సుందర్(3) ఉన్నారు.గుజరాత్‌కు భారీ షాక్..153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాయిసుదర్శన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ స్కోరంతంటే?ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మరోసారి సత్తాచాటాడు. సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ డౌన్..ఎస్ఆర్హెచ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఐదో వికెట్‌గా నితీష్ కుమార్ రెడ్డి(31), ఆరో వికెట్‌గా కమిందు మెండిస్(1) పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన క్లాసెన్.. సాయిశ్రీనివాస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కిషన్.. ప్రసిద్ద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(5), నితీశ్ కుమార్ రెడ్డి(8) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్‌అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన అభిషేక్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న కిషన్, అభిషేక్4 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(11), అభిషేక్ శర్మ(18) ఉన్నారు.ఎస్ఆర్హెచ్కు బిగ్ షాక్.. హెడ్ ఔట్‌టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. 8 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ఇషాన్ కిషన్ వచ్చాడు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. అర్షద్ ఖాన్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు. సిమర్జీత్ సింగ్ స్దానంలో జయదేవ్ ఉనద్కట్ వచ్చాడు. ఎస్ఆర్హెచ్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, మహమ్మద్ షమీగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ -
SRH Vs GT: ప్రతి బంతికి సిక్సర్ కొట్టాలంటే కాదు.. బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలి..!
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 6) సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఓడి ఆతర్వాత వరుసగా రెండు విజయాలు సాధించిన గుజరాత్ మాంచి జోష్‌లో ఉండగా.. తొలి మ్యాచ్‌లో మాత్రమే గెలిచి ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్ ఢీలాగా కనిపిస్తుంది.ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వై నాట్ 300 అన్న విషయాన్ని పక్కన పెట్టి గెలుపు కోసం ఆడాలి. కేవలం బ్యాటింగ్‌నే నమ్ముకోకుండా బౌలర్లను కూడా సరిగ్గా వినియోగించుకోవాలి. జట్టులో షమీ, కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా సన్‌రైజర్స్ ఎందుకో బౌలింగ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్ మెరుపులే ఉండాలంటే అది సాధ్యపడదు. సన్‌రైజర్స్ ఇకనైనా కాస్త తగ్గి తక్కువ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.విధ్వంసకర వీరులుగా చెప్పుకునే ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రతి బంతినీ సిక్సర్ కొట్టాలన్న ఆలోచనలు మానుకొని బేసిక్స్మై దృష్టి పెట్టాలి. ఈ ముగ్గురు భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో తొందరగా ఔటవుతుండటంతో ఆతర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఎంత జాగ్రత్తగా ఆడినా సత్ఫలితాలు రావడం లేదు. నితీశ్ రెడ్డి కూడా ప్రతి బంతిని సిక్సర్‌గా మలచాలన్న దృక్పథాన్ని మానుకోవాలి.క్లాసెన్ లేటుగా బరిలోకి దిగుతుండటంతో ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అనికేత్ వర్మ మిడిలార్డర్లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. కమిందు మెండిస్ బౌలర్‌గా పనికొచ్చినా అతన్ని నిఖార్సైన టీ20 ఆల్‌రౌండర్ అనలేము. కమిన్స్ బౌలర్‌గా ప్రతి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. షమీ గత మ్యాచ్‌లో (కేకేఆర్) పర్వాలేదనిపించినా ఆ ముందు మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయాడు. హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్ అంతంతమాత్రంగా ఉన్నారు. టీ20 స్పెషలిస్ట్ ఆడమ్ జంపా తొలి రెండు మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పక్కన పెట్టారు.ఆల్‌రౌండర్ల ట్యాగ్‌తో ఉండే ట్రవిస్ హెడ్, నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మకు అస్సలు బౌలింగే ఇవ్వడం లేదు. లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వియాన్ ముల్దర్ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోతే సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు. బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని టాప్-3 బ్యాటర్లకు చెప్పాలి. ప్రతిసారి బ్యాటర్లతోనే నెట్టుకురావాలంటే కష్టమని బౌలర్లకు గట్టి మెసేజ్ పంపాలి. మొత్తంగా వై నాట్ 300 అనే అలోచనను తీసి వేయాలి. -
సన్‌రైజర్స్ కోలుకునేనా!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2025లో తమ తొలి మ్యాచ్‌లో 286 పరుగులు చేసి రాజస్తాన్‌పై ఘనవిజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఒక్కసారిగా పడిపోయింది. సొంత మైదానంలో లక్నో చేతిలో ఓడిన టీమ్...ఆపై వరుసగా ఢిల్లీ, కోల్‌కతా చేతుల్లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు మళ్లీ హోం గ్రౌండ్‌కు చేరిన జట్టు వరుస ఓటముల నుంచి కోలుకోవాలని పట్టుదలగా ఉంది.నేడు జరిగే పోరులో గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఐపీఎల్లో అతి పెద్ద పరాజయాన్ని గత మ్యాచ్‌లో మూటగట్టుకున్న టీమ్‌ను మళ్లీ ముందంజలో నిలిపే బాధ్యత బ్యాటర్లపైనే ఉంది. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ చెలరేగితే భారీ స్కోరు సాధించవచ్చు. క్లాసెన్ మెరుగ్గానే ఆడుతున్నా... నితీశ్ రెడ్డి ఇంకా ఫామ్‌ను అందుకోలేదు. కమిందు మెండిస్ ఆల్‌రౌండ్ ఆట సానుకూలాశం. షమీ, కమిన్స్ బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపించాల్సి ఉంది. బెంగళూరుపై చెలరేగిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు గుజరాత్ తరఫున తన సొంత ఊరిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సుదర్శన్, గిల్, బట్లర్ తదితరులతో టైటాన్స్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. -
డీఎస్పీ సిరాజ్‌కు సెల్యూట్.. ఆర్సీబీ ఓడను ముంచేశాడు: హర్భజన్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం(ఏప్రిల్ 2) చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ చిత్తు చేసింది. ఈ విజయంలో గుజరాత్ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర. తన మాజీ జట్టుపై సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫిల్ సాల్ట్ (13 బంతుల్లో 14), దేవ్‌దత్ పడిక్కల్ (3 బంతుల్లో 4), లియామ్ లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54)లను సిరాజ్ ఔట్ చేశాడు. సిరాజ్తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కుర్పించాడు. తన మాజీ జట్టుపై సిరాజ్ ప్రతీకారం తీర్చుకున్నాడని హర్భజన్ అన్నాడు."ఐపీఎల్-2025లో మహ్మద్ సిరాజ్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఆర్సీబీపై తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే చాలా సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడినప్పటికి అతడిని వారు రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు అదే సిరాజ్ ఆర్సీబీ ఓడను ముంచేశాడు. డీఎస్సీ సిరాజ్‌కు సెల్యూట్. ఇది ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనే. సిరాజ్‌కు అభినందనలు.రషీద్ ఖాన్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లో కూడా గుజరాత్ బాగా రాణించింది" అని తన యూట్యూబ్ ఛానల్లో భజ్జీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) రాణించారు.గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు సాయికిషోర్ రెండు, అర్షద్, ప్రసిద్ద్, ఇషాంత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. జోస్ బట్లర్(73) ఆజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయిసుదర్శన్(49) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: IPL 2025: గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ -
గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ
ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడ తన స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. "వ్యక్తిగత కారణాల" కారణంగా రబాడ సౌతాఫ్రికాకు వెళ్లినట్లు గుజరాత్ టైటాన్స్ మెనెజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.అయితే అతడు ఎప్పుడు తిరిగి భారత్‌కు వస్తాడన్న విషయాన్ని గుజరాత్ వెల్లడించలేదు. కాగా బుధవారం(ఏప్రిల్ 2)న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కు కూడా రబాడ దూరమయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో రబాడ లేనప్పటికి గుజరాత్ టైటాన్స్ మాత్రం ఘన విజయాన్ని అందుకుంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ వంటి గుజరాత్ స్పీడ్ స్టార్లు అద్బుతంగా రాణించారు. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 6న ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా రబాడ దూరమయ్యే అవకాశముంది.ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన రబాడ.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే రబాడ తనదైన ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు.చదవండి: పాక్ క్రికెట్ జట్టుకు మరోసారి జరిమానా -
IPL : సిరాజ్ పగ కోహ్లి ఫ్యూజులౌట్
-
IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఊహకందని ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్ తీసిన ఇషాంత్.. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన అరుదైన ఘనతను సాధించాడు. తొలి ఐపీఎల్ సీజన్లో (2008) నాటి ఆర్సీబీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. తాజాగా అదే ఫ్రాంచైజీ ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్‌ను పెవిలియన్‌కు పంపాడు.ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి రేర్ ఫీట్‌ను ఎవరూ సాధించలేదు. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన తొలి మరియు ఏకైక బౌలర్ ఇషాంత్ శర్మనే. 2008 సీజన్లో కేకేఆర్ తరఫున ఆడుతూ తన స్పెల్ తొలి ఓవర్లోనే నాటి ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ.. ఐపీఎల్ 2025 సీజన్లో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్‌ను కూడా తన స్పెల్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు.అప్పుడూ, ఇప్పుడూ ఆర్సీబీ కెప్టెన్లను ఔట్ చేసింది చిన్నస్వామి స్టేడియంలోనే కావడం మరో విశేషం. ఇక్కడ ఒకే ఒక్క తేడా ఏంటంటే.. నాడు తన స్పెల్ తొలి బంతికే ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. ప్రస్తుత సీజన్లో తన స్పెల్ రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఇషాంత్ ఒకడు. 36 ఏళ్ల ఈ ఢిల్లీ పేసర్ 2018 సీజన్ మినహాయించి ప్రతి ఐపీఎల్లో ఆడాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు చెలరేగడంతో ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. -
IPL 2025: సాయి సుదర్శన్ ఖాతాలో ఘనమైన రికార్డు
తమిళనాడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గత కొంతకాలంగా గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ చెన్నై చిన్నోడు.. ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్‌లు ఆడి 48.80 సగటున, 127.19 స్ట్రయిక్‌రేట్‌తో 1220 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మరో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన సాయి.. ఓ ఘనమైన ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా చూసినా 28 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఘనత షాన్ మార్ష్‌కు దక్కుతుంది. మార్ష్ 28 ఇన్నింగ్స్‌ల తర్వాత 1267 పరుగులు చేశాడు.ఐపీఎల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లుషాన్ మార్ష్- 1267సాయి సుదర్శన్- 1220లెండిల్ సిమన్స్- 1076మాథ్యూ హేడెన్- 1076క్రిస్ గేల్- 1071భీకర ఫామ్‌లో సాయిప్రస్తుత ఐపీఎల్లో సాయి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి, మరో హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లో సాయి ప్రదర్శనలు పతాక స్థాయిలో ఉన్నాయి. ఇందులో సాయి ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు చేశాడు.గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో సాయి స్కోర్లు..49 (36) vs RCB63 (41) vs MI74 (41) vs PBKS103 (51) vs CSK 6 (14) vs RCB84* (49) vs RCB65 (39) vs DCఐపీఎల్ అరంగేట్రం నుంచి సీజన్ల వారీగా సాయి స్కోర్లు..2022- 5 మ్యాచ్‌ల్లో 145 పరుగులు (ఓ హాఫ్ సెంచరీ)2023- 8 మ్యాచ్‌ల్లో 362 (3 హాఫ్ సెంచరీలు)2024- 12 మ్యాచ్‌ల్లో 527 (సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు)2025- 3 మ్యాచ్‌ల్లో 186* (2 హాఫ్ సెంచరీలు)సాయి అరంగేట్రం నుంచి గుజరాత్ టైటాన్స్‌కే ఆడుతున్నాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు సాయిని గుజరాత్ రూ.8.50 కోట్లకు రీటైన్ చేసుకుంది.కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో సాయి కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. సాయి 36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 49 పరుగులు చేశాడు. సాయికి బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) తోడవ్వడంతో గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. రెండు విజయాలతో (ఈ మ్యాచ్‌తో కలుపుకుని) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సాయి (186 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్‌లో నికోలస్ పూరన్ (189) ఉన్నాడు. సాయి సహచరుడు బట్లర్ (166) మూడో స్థానంలో నిలిచాడు. -
నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ జట్టుకు దూరమైన కసి అతడి ఆటలో కనిపిస్తోందని.. త్వరలోనే అతడు టీమిండియాలో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాడు. కాగా హైదరాబాదీ పేసర్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడాడు.ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)జట్టులోనూ చోటివ్వలేదు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన సిరాజ్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను పక్కనపెట్టి ఉంటారని పేర్కొన్నాడు.ఆర్సీబీ వదిలేసిందిఅయితే, జాతీయ జట్టుకు దూరం కావడం వల్ల దొరికిన విశ్రాంతిని పొడగించకుండా.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందు ఈ పేస్ బౌలర్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏడేళ్ల పాటు తమతో ప్రయాణం చేసిన సిరాజ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది.టైటాన్స్ అక్కున చేర్చుకుందిఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్.. తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టోన్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా.. గుజరాత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు సిరాజ్. నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించిందిఈ నేపథ్యంలో భారత మాజీ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. అతడిలో ఆ కసి కనిపించింది. యువ ఫాస్ట్ బౌలర్ నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాం. అతడు తిరిగి గాడిలో పడ్డాడు.అంతేకాదు.. ‘మీరు నన్ను తీసుకోలేదు కదా!.. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను’ అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఇదే తరహాలో సిరాజ్ ముందుకు దూసుకవెళితే కచ్చితంగా భారత జట్టులో త్వరలోనే పునరాగమనం చేస్తాడు.కొత్త బంతితో చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా రాణించాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 12 లేదా 13 పరుగులు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అయితే, నాలుగో ఓవర్లో మాత్రం కాస్త తడబడ్డాడు. లేదంటే.. ఇంకో వికెట్ అతడి ఖాతాలో చేరేదే. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టడం సానుకూలాంశం’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సమయంలో సిరాజ్ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘అతడు కొత్త బంతితో మెరుగ్గా రాణించలేడు. అందుకే పక్కనపెట్టాం’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ సిరాజ్‌ను ఉద్దేశించి పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ టైటాన్స్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఆర్సీబీపై ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ విజయంచదవండి: అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు! -
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
టాపార్డర్ వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) అన్నాడు. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల భారీ స్కోరు సాధించలేకపోయామని పేర్కొన్నాడు. అయితే, ఒక్క మ్యాచ్‌తో తమ బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ చేసి చూడలేమని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా పాటిదార్ ఆర్సీబీ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో అతడి సారథ్యంలో ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌పై చెపాక్‌లో చరిత్రాత్మక విజయం సాధించింది. పదిహేడేళ్ల విరామం తర్వాత చెన్నైని తమ సొంతగడ్డపైనే ఓడించింది.అయితే, తాజాగా తమ సొంత మైదానంలో మాత్రం ఆర్సీబీ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆర్సీబీ సారథిగా పాటిదార్ ఖాతాలో తొలి పరాజయం నమోదైంది.పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయాంఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘పవర్ ప్లే తర్వాత మా దృక్పథం మారిపోయింది. 200 కాకపోయినా.. కనీసం 190 పరుగుల మార్కు అందుకోవాలని భావించాం. అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది.దూకుడుగా ఆడాలన్న మా ఆలోచన సరైందే. కానీ పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. పవర్ ప్లేలో మేము వరుసగా మూడు వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఒక్కటి కాదు.. ఏకంగా మూడు వికెట్లు కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.ఆ ముగ్గురు అద్భుతంఆ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింతగా అనుకూలించింది. అయినప్పటికీ మా బౌలర్లు మ్యాచ్‌ను 18వ ఓవర్ వరకు తీసుకురావడం అభినందనీయం. తక్కువ స్కోరును కాపాడేందుకు వారు అద్భుతంగా పోరాడారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు.అయితే, ఈ మ్యాచ్‌లో జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేసిన తీరు మాకు సానుకూలాంశం. మా బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. వరుస విరామాల్లో వికెట్లు పడినా.. ఆ ముగ్గురు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడం శుభపరిణామం’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది ఆర్సీబీ. ఓపెనర్లు విరాట్ కోహ్లి (7), ఫిల్ సాల్ట్ (14)తో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(4) పూర్తిగా విఫలమయ్యారు. రజత్ పాటిదార్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరాడు.BIG WICKET! 🙌🏻Inform Gen Bold star, #RajatPatidar has to make his way back as Gen Gold star #IshantSharma traps in front! 👊🏻Watch LIVE action ➡ https://t.co/GDqHMberRq#IPLonJiostar 👉🏻 #RCBvGT | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! |… pic.twitter.com/xY8lb4sCN1— Star Sports (@StarSportsIndia) April 2, 2025సిరాజ్ తీన్మార్ఇలాంటి దశలో లియామ్ లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32) వేగంగా ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 169 పరుగులు చేయగలిగింది.గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్ల (3/19)తో చెలరేగగా.. సాయి కిషోర్ రెండు, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ చెరో వికెట్ దక్కించున్నారు.ఇక కేవలం రెండు వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసిన టైటాన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫలితంగా టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం లభించింది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై గుజరాత్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహ్మద్ సిరాజ్ (3/19).చదవండి: ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సారా టెండూల్కర్They came to Bengaluru with a motive 💪And they leave with 2⃣ points 🥳@gujarat_titans complete a comprehensive 8⃣-wicket victory ✌️ Scorecard ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT pic.twitter.com/czVroSNEml— IndianPremierLeague (@IPL) April 2, 2025 -
ఏడేళ్లు ఆర్సీబీకి ఆడాను.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: సిరాజ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్ (GT) అడ్డుకట్ట వేసింది. ఆర్సీబీని వారి సొంత మైదానంలోనే ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా ఐపీఎల్-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన బెంగళూరు జట్టు ఖాతాలో తొలి పరాజయం నమోదు కాగా.. టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం లభించింది.ఇక ఆర్సీబీపై టైటాన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన జట్టుపై ఇలాంటి ప్రదర్శన నమోదు చేయడం మిశ్రమ అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.భావోద్వేగానికి గురి చేసింది‘‘నేను కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ఇక్కడే (ఆర్సీబీ) ఉన్నాను. రెడ్ జెర్సీ నుంచి బ్లూ జెర్సీకి మారటం నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అయితే, బంతి చేతిలోకి రాగానే నా మూడ్ మారిపోయింది.చాలా రోజులుగా ఆటతో నేను బిజీగానే ఉన్నాను. అయితే, అనుకోకుండా లభించిన విశ్రాంతి కారణంగా.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడంతో పాటు బౌలింగ్‌లో నా తప్పులను సరిదిద్దుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. వేలంలో గుజరాత్ టైటాన్స్ నన్ను కొనుగోలు చేయగానే.. మొదట ఆశిష్ (ఆశిష్ నెహ్రా) భాయ్‌తో మాట్లాడాను.బౌలింగ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలని.. ఇతర విషయాలను పట్టించుకోవద్దని ఆయన నాకు చెప్పాడు. అదే విధంగా.. ఇషూ భాయ్ (ఇషాంత్ శర్మ) కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పవద్దని నాకు సూచించాడు. వారు నాలో ఆత్మవిశ్వాసం నింపారు.పిచ్ ఎలా ఉన్నా.. పర్లేదు మనపై మనకు నమ్మకం ఉన్నపుడు పిచ్ పరిస్థితులు మన ప్రదర్శనను ప్రభావితం చేయలేవు. నేను రొనాల్డో అభిమానిని. కాబట్టే వికెట్ తీసిన ప్రతిసారీ అలా సెలబ్రేట్ చేసుకున్నా’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.A Phil Salt orbiter 🚀followed by...A Mohd. Siraj Special \|/ 🫡It's all happening in Bengaluru 🔥Updates ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT | @mdsirajofficial pic.twitter.com/a8whsXHId3— IndianPremierLeague (@IPL) April 2, 2025 సిరాజ్ పేస్ పదును.. ఆర్సీబీకి షాకులుఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి (7)ని అర్షద్ ఖాన్ వెనక్కి పంపగా.. అతడి స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఫిల్ సాల్ట్ (14)ను కూడా అదే రీతిలో పెవిలియన్‌కు పంపాడు.ఇలా టాపార్డర్ కుప్పకూలడంతో ఆర్సీబీ కష్టాల్లో కూరుకుపోగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ (12) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడం ప్రభావం చూపింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అతడు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 40 బంతుల్లో 54 పరుగులతో లియామ్ జోరు మీదున్న వేళ సిరాజ్ మరోసారి తన పేస్ పదును చూపించి.. ఆర్సీబీని దెబ్బకొట్టాడు.ఇక వికెట కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (21 బంతుల్లో 33) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. సాయి కిషోర్ అతడిని అవుట్ చేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు (18 బంతుల్లో 32) మెరిపించగా.. ప్రసిద్ కృష్ణ అతడి జోరుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా వాళ్లలో కృనాల్ పాండ్యా (5), భువనేశ్వర్ కుమార్ (1 నాటౌట్) విఫలం కాగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్‌తో రాణించారు. సాయి కిషోర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) వికెట్ కోల్పోయింది.బట్లర్ ధనాధన్అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49)కు జతైన వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడితో పాటు షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (18 బంతుల్లో 30) వేగంగా ఆడి.. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి టైటాన్స్ పని పూర్తి చేసింది.రూ. 12.25 కోట్లకు కొనుగోలుఇదిలా ఉంటే.. సిరాజ్ ఏడేళ్ల పాటు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. అయితే, మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది. వేలంపాటలోనూ సిరాజ్‌పై ఆర్సీబీ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సిరాజ్ విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో సెలక్టర్లు అతడికి చోటివ్వలేదు. మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు పెద్దపీట వేసి.. సిరాజ్‌ను తప్పించారు. దీంతో సిరాజ్‌కు విరామం లభించగా.. ఫిట్నెస్ మెరుగుపరచుకుని.. మరింత కఠినంగా సాధన చేశాడు. చదవండి: భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల -
వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
-
RCB Vs GT: బెంగళూరుకు సిరాజ్ షాక్
ఏడేళ్ల పాటు బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ సిరాజ్... తొలిసారి ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడుతూ నిప్పులు చెరిగాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున తన పాత సహచరులపై బుల్లెట్ బంతులతో ప్రతాపం చూపాడు. ఫలితంగా ఐపీఎల్లో టైటాన్స్ రెండో విజయం నమోదు చేసుకోగా... రెండు విజయాల తర్వాత బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. సిరాజ్ ధాటికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన బెంగళూరు జట్టు... ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా ఓటమిని ఆహ్వానించింది. బ్యాటింగ్‌లో బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్ గెలుపొందింది. బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బెంగళూరు... బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. గత సీజన్ వరకు ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సిరాజ్ (3/19) గుజరాత్ టైటాన్స్ తరఫున చెలరేగిపోగా... అతడి బౌలింగ్‌ను ఆడలేక బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... జితేశ్ శర్మ (33; 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7), దేవదత్ పడిక్కల్ (4) కెప్టెన్ రజత్ పాటీదార్ (12), ఫిల్ సాల్ట్ (14), కృనాల్ పాండ్యా (5) విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ 3 వికెట్లు, సాయికిషోర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. సూపర్ సిరాజ్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. అర్షద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో అనవసర షాట్‌కు యత్నించిన కోహ్లి ఫైన్ లెగ్‌లో ప్రసిధ్ చేతికి చిక్కాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తదుపరి ఓవర్లో పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ టైటాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సాల్ట్‌ను కూడా సిరాజ్ బుట్టలో వేసుకున్నాడు. ఈ మధ్య పాటీదార్‌ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో... బెంగళూరు జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్... చివర్లో డేవిడ్ ధాటిగా ఆడారు. 15 ఓవర్లు ముగిసేసరికి 105/6తో ఉన్న ఆర్సీబీ... చివరి 5 ఓవర్లలో 64 పరుగులు జోడించింది. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ను తదుపరి ఓవర్లో సిరాజ్ అవుట్ చేశాడు. చివరి ఓవర్లో డేవిడ్ 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేసింది. అలవోకగా... ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. లక్ష్యం చిన్నది కావడంతో ఆ జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్సీబీ... బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) త్వరగానే అవుటైనా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగిన ఈ జంట రెండో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జతచేసింది. అనంతరం సుదర్శన్ అవుట్ కాగా... రూథర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) సిరాజ్ 14; కోహ్లి (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అర్షద్ 7; దేవదత్ పడిక్కల్ (బి) సిరాజ్ 4; పాటీదార్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 12; లివింగ్‌స్టోన్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 54; జితేశ్ శర్మ (సి) తెవాటియా (బి) సాయికిషోర్ 33; కృనాల్ పాండ్యా (సి అండ్ బి) సాయికిషోర్ 5; టిమ్ డేవిడ్ (బి) ప్రసిధ్ కృష్ణ 32; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–35, 4–42, 5–94, 6–104, 7–150, 8–169. బౌలింగ్: సిరాజ్ 4–0–19–3; అర్షద్ ఖాన్ 2–0–17–1; ప్రసిధ్ కృష్ణ 4–0–26–1; ఇషాంత్ 2–0–27–1; సాయికిషోర్ 4–0–22–2; రషీద్ ఖాన్ 4–0–54–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 49; గిల్ (సి) లివింగ్‌స్టోన్ (బి) భువనేశ్వర్ 14; బట్లర్ (నాటౌట్) 73; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–32, 2–107. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–23–1, హాజల్‌వుడ్ 3.5–0–43–1; యశ్ దయాళ్ 3–0–20–0; రసిక్ సలామ్ 3–0–35–0; కృనాల్ పాండ్యా 3–0–34–0; లివింగ్‌స్టోన్ 1–0–12–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X హైదరాబాద్‌వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్.. ఆతర్వాత గేర్ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ జట్టు 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. లివింగ్‌స్టోన్ (33), టిమ్ డేవిడ్ (6) క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ ఇంకా ఆశలు పెట్టుకుంది.రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేస్తుంది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆర్సీబీని పేసర్ అర్షద్ ఖాన్ తొలి దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7) ఔట్ చేశాడు. ఆతర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు సిరాజ్ లైన్లోకి వచ్చాడు. సిరాజ్ అతని వరుస ఓవర్లలో పడిక్కల్ (4), సాల్ట్‌ను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు. Mo Siraj 🔥pic.twitter.com/2cbgtJIhNi— CricTracker (@Cricketracker) April 2, 2025ఆతర్వాత ఇషాంత్ అద్భుతమైన బంతితో కెప్టెన్ పాటిదార్‌ను (12) ఎల్బీడబ్ల్యూ చేశాడు. లేట్‌గా (11వ ఓవర్) బౌలింగ్‌కు దిగిన సాయికిషోర్ తన రెండో ఓవర్లోనే మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన జితేశ్ శర్మను (33) ఔట్ చేశాడు. సాయి కిషోర్ తన మూడో ఓవర్లో మరో ఫలితం రాబట్టాడు. ఈసారి కిషోర్ కృనాల్ పాండ్యాను (5) బోల్తా కొట్టించాడు. భారీ హిట్టర్లు లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్‌పై ఆశలు పెట్టుకుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ సాల్ట్ వికెట్ తీసిన విధానం అందరినీ ఆకర్శించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి సాల్ట్ సిరాజ్ బౌలింగ్‌లో 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఆతర్వాతి బంతికి సిరాజ్ సాల్ట్‌పై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. సాల్ట్ వికెట్లు వదిలి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. సిరాజ్ బంతిని నేరుగా వికెట్లపైకి సంధించి సాల్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు తీసిన నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్లే కావడం విశేషం. సిరాజ్ బౌలింగ్‌లో సాల్ట్ కొట్టిన సిక్సర్ ఈ సీజన్లో అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డైంది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా 105 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. -
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్12.3వ ఓవర్: 107 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్ఛేదనను నిదానంగా ప్రారంభించిన గుజరాత్ ఆతర్వాత గేర్ మార్చి లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 11.5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47), జోస్ బట్లర్ (39) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. గేర్ మార్చిన బట్లర్అప్పటివరకు నిదానంగా ఆడిన బట్లర్ రసిక్ సలామ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో బట్లర్ 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 75/1గా ఉంది. బట్లర్ 26, సాయి సుదర్శన్ 32 పరుగులతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 66 బంతుల్లో 95 పరుగులు చేయాలి. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్4.4వ ఓవర్: 170 పరుగుల ఛేదనలో గుజరాత్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (14) ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (15), జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 170.. నిదానంగా ఆడుతున్న గుజరాత్170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిదానంగా ఆడుతుంది. మూడు ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ 7, సాయి సుదర్శన్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లివింగ్‌స్టోన్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాది చివరి బంతికి ఔటైన టిమ్ డేవిడ్ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీసిరాజ్ బౌలింగ్‌లో బట్లర్ క్యాచ్ పట్టడంతో లివింగ్‌స్టోన్ (54) ఔటయ్యాడు.లివింగ్‌స్టోన్ హాఫ్ సెంచరీరషీద్ ఖాన్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది లివింగ్‌స్టోన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్ డౌన్14.2వ ఓవర్: 104 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి కృనాల్ పాండ్యా (5) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్ (24), టిమ్ డేవిడ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.4వ ఓవర్: 94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి జితేశ్ శర్మ (33) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్‌కు (19) జతగా కృనాల్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/410 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/4గా ఉంది. లివింగ్‌స్టోన్ (8), జితేశ్ శర్మ (23) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 6.2వ ఓవర్: ఆర్సీబీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆ జట్టు 42 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 35 పరుగులకే 3 వికెట్లు డౌన్4.4వ ఓవర్: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం ఫిల్ సాల్ట్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రజత్ పాటిదార్‌కు (6) జతగా లివింగ్‌స్టోన్ క్రీజ్‌లోకి వచ్చాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో విరాట్‌ను ఆర్షద్ ఖాన్ ఔట్ చేయగా.. మూడో ఓవర్లో సిరాజ్ అద్భుతమైన బంతితో పడిక్కల్‌ను (4) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆర్సీబీకి షాక్.. రెండో ఓవర్లోనే విరాట్ ఔట్ఆర్సీబీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7) అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 12/1గా ఉంది. పడిక్కల్ (4), సాల్ట్ (1) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఓవర్లోనే సాల్ట్ బతికిపోయాడు..!సాల్ట్‌కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జోస్ బట్లర్ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అంతకుముందు తొలి బంతికే సాల్ట్ ఔట్ కావాల్సింది. అయితే బంతి ఫీల్డర్లు లేని చోట ల్యాండైంది.ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. గుజరాత్ తరఫున రబాడ స్థానంలో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. రబాడ వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్‌కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మగుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. గుజరాత్ రెండింట ఓ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. కేకేఆర్, సీఎస్కేపై విజయాలు సాధించగా.. గుజరాత్.. పంజాబ్ చేతిలో ఓడి, ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. -
IPL 2025: హార్దిక్ పాండ్యాకు మరో షాక్
ఓటమి బాధలో (గుజరాత్ చేతిలో) ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ హార్దిక్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం హార్దిక్‌కు ఈ ఫైన్ విధించబడింది. ఈ సీజన్లో హార్దిక్ జట్టు చేసిన మొదటి తప్పిదం కాబట్టి 12 లక్షల జరిమానాతో సరిపుచ్చారు.హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు సంబంధించిన నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గత సీజన్లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ మూడు సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. ఇందుకు గానూ హార్దిక్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. గత సీజన్ వరకు ఓ జట్టు మూడు సార్లు (ఒకే సీజన్లో) స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ నిషేధించేవారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆ రూల్‌ను ఎత్తి వేశారు. ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ తప్పిదాల కారణంగా కెప్టెన్లపై నిషేధం ఉండదు. కేవలం జరిమానాలు మాత్రమే ఉంటాయి.ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబై సీఎస్కే చేతిలో ఓడింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయింది. తొలుత బౌలింగ్ చేసి గుజరాత్‌ను భారీ స్కోర్ (196/8) చేయనిచ్చిన ఆ జట్టు.. ఆతర్వాత ఛేదనలో (160/6) చేతులెత్తేసింది. గుజరాత్ బౌలర్లు సొంత పిచ్ అడ్వాన్టేజ్ను వినియోగించుకుని ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (4-0-29-2) బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఛేదన కీలక దశలో బంతులు వృధా (17 బంతుల్లో 11) చేసి జట్టు ఓటమిని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ (కెప్టెన్‌గా) చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. రాబిన్ మింజ్‌ను తనకంటే ముందు బ్యాటింగ్‌కు పంపిన హార్దిక్ పెద్ద తప్పిదమే చేశాడు. మింజ్ కీలక దశలో బంతులను వృధా చేసి (6 బంతుల్లో 3) చీప్‌గా ఔటయ్యాడు. తుది జట్టు ఎంపికలోనూ హార్దిక్ పెద్ద తప్పులే చేశాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతం చేసిన విజ్ఞేశ్ పుతుర్‌ను, భారీ హిట్టర్.. అందులోనే గత సీజన్లో అహ్మదాబాద్‌లో సెంచరీ చేసిన విల్ జాక్స్‌కు తప్పించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. -
IPL 2025: గుజరాత్ బౌలర్‌పై నోరు పారేసుకున్న హార్దిక్.. వైరల్ వీడియో
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, గుజరాత్ స్పిన్నర్ సాయి కిషోర్ గొడవ పడ్డారు. ముంబై ఓటమి ఖరారైన దశలో తొలుత సాయి కిషోర్ హార్దిక్‌ను గెలికాడు. డాట్ బాల్ వేసిన ఆనందంలో ముంబై కెప్టెన్ వైపు బిర్రుగా చూశాడు. GAME 🔛Hardik Pandya ⚔ Sai Kishore - teammates then, rivals now! 👀🔥Watch the LIVE action ➡ https://t.co/VU1zRx9cWp #IPLonJioStar 👉 #GTvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, & JioHotstar pic.twitter.com/2p1SMHQdqc— Star Sports (@StarSportsIndia) March 29, 2025ఇందుకు హార్దిక్ కూడా ధీటుగా స్పందించాడు. సాయి కిషోర్‌తో కంటితో యుద్దం చేస్తూనే దుర్భాషలాడాడు. అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మ్యాచ్ అనంతరం హార్దిక్, సాయి కిషోర్ ఒకరినొకరు హగ్ చేసుకోవడం కొసమెరుపు. హార్దిక్, సాయి కిషోర్ గతంలో కలిసి గుజరాత్‌కు ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్‌తో గొడవపై సాయి కిషోర్ ప్రజెంటేషన్ సందర్భంగా కూడా స్పందించాడు. హార్దిక్ నాకు మంచి మిత్రుడని అన్నాడు. మైదానంలో ఇలాగే ఉండాలి. అక్కడ ఎవరైనా ప్రత్యర్థులే. మేము విషయాలను వ్యక్తిగతంగా తీసుకోము. మేము మంచి పోటీదారులం. ఆట ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని అన్నాడు.కాగా, ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ యావరేజ్‌గా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయగా.. హార్దిక్ బౌలింగ్‌లో రాణించి, బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. స్లో వికెట్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ (196/8) చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది. -
ముంబైపై గుజరాత్ ఘన విజయం
-
GT VS MI: మొదటి మ్యాచ్‌కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్ బౌలింగ్ అద్భుతం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్ (196/8) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన క్లాస్‌ను ప్రదర్శించాడు. శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) భారీ స్కోర్లు చేయకపోయిన బాగా ఆడారు. స్లోగా ఉన్న పిచ్‌పై ఈ ముగ్గురు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడాము. ఇది మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్‌కు ముందే ఈ పిచ్‌పై ఆడాలని నిర్ణయించుకున్నాము. ఈ వికెట్ మాకు సూటైంది. బంతి పాతబడిన తర్వాత ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే పవర్ ప్లేలోపే వీలైనన్ని పరుగులు సాధించేందుకు ప్రయత్నించాము. మనందరం ప్రణాళికలు వేసుకుంటాము. కొన్ని వర్కౌట్ అవుతాయి. మరికొన్ని కావు. రషీద్ ఖాన్‌ను తన కోటా నాలుగు ఓవర్లు వేయించకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. వాస్తవానికి రషీద్‌ను ఆఖర్లో బౌలింగ్ చేయిద్దామనే అనుకున్నాను. కానీ పేసర్లు బాగా బౌలింగ్ చేస్తుండటంతో అతన్ని బరిలోకి దించలేదు. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
GT VS MI: మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు.. రెండిటిలోనూ విఫలమయ్యాం: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 29) గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. హోం గ్రౌండ్లో (అహ్మదాబాద్) జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ముంబైని చిత్తు చేసింది. స్లోగా ఉన్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (196/8) చేసిన గుజరాత్.. ఆతర్వాత దాన్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుకు గుజరాత్ బ్యాటర్లు, బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. తొలుత బ్యాటింగ్‌లో వారు ఎక్కువ రిస్క్ చేయకుండానే పరుగులు రాబట్టారు. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనలోని క్లాస్‌ను ప్రదర్శించాడు. శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) కూడా బాగా ఆడారు. వీరు చేసింది తక్కువ పరుగులే అయినా ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ (9), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18), రాహుల్ తెవాటియా (0), రషీద్ ఖాన్ (6), రబాడ (7 నాటౌట్), సాయి కిషోర్ (1) నిరాశపర్చినా చివరికి గుజరాత్ మంచి స్కోరే చేసింది. సాయి సుదర్శన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే గుజరాత్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ముంబై ప్రధాన పేసర్లు బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1) బాగానే బౌలింగ్ చేసినా స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబైను గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. సిరాజ్ ఇద్దరు ముంబై ఓపెనర్లను పవర్ ప్లేలోనే ఔట్ చేశాడు. తొలుత రోహిత్‌ను (8) క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆతర్వాత మరో ఓపెనర్ రికెల్టన్ను (6) కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ దశలో గుజరాత్ తమ ఏస్ పేసర్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) ఇద్దరూ బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ విఫలమయ్యాం. రెండు విభాగాల్లో 15-20 పరుగులు తక్కువ పడ్డాయని అనుకుంటున్నాను. ఫీల్డ్‌లో ప్రాథమిక తప్పులు చేసాము. దానికి వల్ల ప్రత్యర్థులకు 20-25 పరుగులు అదనంగా వచ్చాయి. టీ20ల్లో మ్యాచ్ ఫలితాన్ని ఈ పరుగులే నిర్దేశిస్తాయి. గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ఛాన్స్‌లు ఎక్కువగా తీసుకోలేదు. పిచ్ కఠినంగా ఉందని వారికి కూడా తెలుసు. వారు ప్రమాదకర షాట్లు ఆడకుండా పరుగులు సాధించగలిగారు. ఈ పరాజయానికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. ఇంకా ప్రారంభ దశల్లోనే ఉన్నాము. బ్యాటర్లు టచ్‌లోకి రావాలి. వారు త్వరలోనే సామర్థ్యం మేరకు రాణిస్తారని ఆశిస్తున్నాను. గుజరాత్ బౌలర్లు స్లో డెలివరీలను అద్భుతంగా బౌల్ చేశారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. కొన్ని బంతులు నేరుగా వికెట్లపైకి వచ్చాయి. కొన్ని బౌన్స్ అయ్యాయి. ఇలాంటి బంతులను ఎదుర్కోడం బ్యాటర్లకు చాలా కష్టం. గుజరాత్ బౌలర్లు నేను బంతితో చేసిందే చేసి సఫలమయ్యారు. -
గుజరాత్ గెలుపు బోణీ
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన టీమ్ సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరిచింది. బ్యాటింగ్‌లో సాయిసుదర్శన్, బౌలింగ్‌లో ప్రసిధ్, సిరాజ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు గత మ్యాచ్‌లాగే అన్ని రంగాల్లో విఫలమైన ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. అహ్మదాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్ గెలుపు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్‌లు), తిలక్‌వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (2/18), సిరాజ్ (2/34) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కీలక భాగస్వామ్యాలు... గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్–3 నెలకొల్పిన రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు జట్టు స్కోరులో కీలకంగా నిలిచాయి. తొలి వికెట్‌తో గిల్‌తో 78 పరుగులు (51 బంతుల్లో) జోడించిన సుదర్శన్, రెండో వికెట్‌కు బట్లర్‌తో 51 పరుగులు (32 బంతుల్లో) జత చేశాడు. సుదర్శన్, గిల్ ధాటిగా ఆడుతూ 7 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 66 పరుగులకు చేరింది. గిల్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన బట్లర్ కూడా కొద్ది సేపు ధాటిని ప్రదర్శించాడు. 33 బంతుల్లో వరుసగా రెండో మ్యాచ్‌లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తయింది. షారుఖ్ ఖాన్ (9)ను ముందుగా పంపిన ప్రయత్నం ఫలితం ఇవ్వకపోగా, రూథర్‌ఫోర్డ్ (18) రాజు ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి సుదర్శన్‌ను బౌల్ట్ అవుట్ చేయడంతో గుజరాత్ జోరుక బ్రేక్ పడింది. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు 17 పరుగులు మాత్రమే సాధించి 4 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 200 పరుగులు దాటలేకపోయింది. ముంబై తరఫున రెండో మ్యాచ్ ఆడిన ఆంధ్ర పేస్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజు ఐపీఎల్లో తన తొలి వికెట్ సాధించడం విశేషం. రాణించిన తిలక్... ఛేదనలో ముంబై పూర్తిగా తడబడింది. తిలక్‌వర్మ, సూర్యకుమార్ క్రీజ్‌లో ఉన్న సమయంలోనే జట్టు గెలుపుపై ఆశలు ఉండగా...ఇది మినహా మిగతా ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (8) తర్వాతి బంతికి వెనుదిరగ్గా, రికెల్టన్ (6)ను కూడా సిరాజ్ బౌల్డ్ చేశాడు. తిలక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రబాడ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో ఎండ్‌లో సూర్య కూడా తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మూడో వికెట్‌కు 42 బంతుల్లో 62 పరుగులు జత చేసిన తర్వాత తిలక్‌ను ప్రసిధ్ వెనక్కి పంపాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన ఈ స్థితినుంచి ముంబై కోలుకోలేకపోయింది. 27 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 63; శుబ్‌మన్ గిల్ (సి) నమన్ (బి) పాండ్యా 38; బట్లర్ (సి) రికెల్టన్ (బి) ముజీబ్ 39; షారుఖ్ (సి) తిలక్ (బి) పాండ్యా 9; రూథర్‌ఫోర్డ్ (సి) సాంట్నర్ (బి) చహర్ 18; తెవాటియా (రనౌట్) 0; రషీద్ (సి) పాండ్యా (బి) రాజు 6; రబాడ (నాటౌట్) 7; సాయికిషోర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–78, 2–129, 3–146, 4–179, 5–179, 6–179, 7–194, 8–196. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–34–1, దీపక్ చహర్ 4–0–39–1, ముజీబ్ 2–0–28–1, హార్దిక్ పాండ్యా 4–0–29–2, సాంట్నర్ 3–0–25–0, సత్యనారాయణ రాజు 3–0–40–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) సిరాజ్ 8; రికెల్టన్ (బి) సిరాజ్ 6; తిలక్‌వర్మ (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 39; సూర్యకుమార్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 48; మిన్జ్ (సి) ఇషాంత్ (బి) సాయికిషోర్ 3; పాండ్యా (సి) సిరాజ్ (బి) రబాడ 11; నమన్ (నాటౌట్) 18; సాంట్నర్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–8, 2–35, 3–97, 4–108, 5–120, 6–124. బౌలింగ్: సిరాజ్ 4–0–34–2, రబాడ 4–0–42–1, ఇషాంత్ 2–0–17–0, రషీద్ 2–0–10–0, సాయికిషోర్ 4–0–37–1, ప్రసిధ్ 4–0–18–2. ఐపీఎల్లో నేడుఢిల్లీ X హైదరాబాద్‌వేదిక: విశాఖపట్నంమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X చెన్నై వేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నిప్పులు చెరిగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముంబైను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, సాయికిషోర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు. -
శుబ్‌మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఒకే వేదికలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్న రెండో ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్ వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకున్నాడు.తద్వారా ఈ ఫీట్‌ను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, సన్‌రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ మైదానంలో 22 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. గేల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 19 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 105 మ్యాచ్‌లు ఆడి 3287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గిల్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణచదవండి: IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్..!? -
ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం
IPL 2025 MI vs GT live updates and highlights: ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయంఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.ముంబై ఐదో వికెట్ డౌన్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సూర్య.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 24 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులోకి నమాన్ ధీర్ వచ్చాడు.ముంబై మూడో వికెట్ డౌన్..తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాబిన్ మింజ్ వచ్చాడు. ముంబై విజయానికి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(37) ఉన్నారు.9 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 86/29 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), తిలక్ వర్మ(35) ఉన్నారు.సిరాజ్ ఆన్ ఫైర్.. ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై.. రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(18), సూర్యకుమార్(8) ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్.. ముంబై తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు.సుదర్శన్ హాఫ్ సెంచరీ.. ముంబై ముందు భారీ టార్గెట్అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సమిష్టగా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.19 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 186/6గుజరాత్ టైటాన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లో ఆఖరి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సుదర్శన్(63) ఔట్ కాగా.. 19 ఓవర్లో వరుస క్రమంలో రాహుల్ తెవాటియా, రూథర్ ఫర్డ్ ఔటయ్యారు. 19 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.గుజరాత్ మూడో వికెట్ డౌన్.. షారూఖ్ ఔట్షారూఖ్ ఖాన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షారూఖ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన బట్లర్.. ముజీబ్ ఉర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(49), షారూఖ్ ఖాన్(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(42), బట్లర్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. శుబ్‌మన్ గిల్ ఔట్‌శుబ్‌మన్ గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన గిల్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్, సుదర్శన్గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయిసుదర్శన్(32), శుబ్‌మన్ గిల్(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(13), సాయిసుదర్శన్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ -
ఐపీఎల్లో నేటి (మార్చి 29) మ్యాచ్.. ముంబైతో గుజరాత్ 'ఢీ'
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మార్చి 29) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై నిరాశగా ఉన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో పరాజయం పాలయ్యాయి. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విదేశీ విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కై (29), తిలక్ వర్మ (31) పర్వాలేదనిపించినా అవి వారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు కావు. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో నిషేధం ఎదుర్కొన్నాడు. గుజరాత్‌తో నేటి మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉంటాడు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి ఉంటుంది. సీఎస్కేతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్‌కు ఓ అణిముత్యం దొరికాడు. 24 ఏళ్ల స్పిన్నర్ విజ్ఞేశ్ పుతుర్ సీఎస్కేతో మ్యాచ్‌లో మ్యాజిక్ చేశాడు. కేరళకు చెందిన పుతుర్ జాతీయ స్థాయిలో ఎలాంటి మ్యాచ్‌లు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి తన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబైకు పుతుర్ అద్భుతమైన బౌలింగ్ మినహా ఎలాంటి ఊరట లభించలేదు. పుతుర్ రాణించినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ సామర్థ్యం మేరకు రాణించలేదు. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాహర్.. ఆతర్వాత బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.ర్యాన్ రికెల్టన్ (వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్ పుతుర్గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో పరాజయంపాలైనప్పటికీ.. బ్యాటింగ్‌లో అదరగొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (74), శుభ్‌మన్ గిల్ (33), బట్లర్ (54), రూథర్‌ఫోర్డ్ (46) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మధ్య ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు కాస్త వేగంగా ఆడి ఉంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిచేదే. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన బౌలర్లందరూ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సిరాజ్, రబాడ.. గుజరాత్ తురుపుముక్క రషీద్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ అదే స్థాయిలో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ ఒక్కడే రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముంబైతో జరుగబోయే నేటి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్హెడ్ టు హెడ్ రికార్డులు..ఐపీఎల్లో గుజరాత్, ముంబై ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, ముంబై రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. గుజరాత్‌కు ముంబైపై సొంత మైదానంలో ఘనమైన రికార్డు ఉంది. ఆ జట్టు ముంబైపై సాధించిన మూడు విజయాలు అహ్మదాబాద్‌లో వచ్చినవే. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అహ్మదాబాద్ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. ఈ పిచ్‌పై గత మ్యాచ్‌లో పంజాబ్ 243 పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ 232 పరుగులు చేసింది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ అల్టిమేట్ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం వదులుకున్న అయ్యర్.. లీగ్ చరిత్రలో రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో 90 ప్లస్ స్కోర్లు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృషించాడు. 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ డెబ్యూలో అజేయమైన 93 పరుగులు (కేకేఆర్‌పై) చేసిన అయ్యర్.. తాజాగా పంజాబ్ కెప్టెన్‌గా అరంగేట్రంలో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో శ్రేయస్ మరో విషయంలోనూ రికార్డుల్లోకెక్కాడు. కెప్టెన్సీ అరంగేట్రంలో మూడో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా తన రికార్డును తనే మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత సంజూ శాంసన్‌కు దక్కుతుంది. సంజూ 2021లో రాయల్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో (పంజాబ్‌పై) 119 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు సంజూ శాంసన్ మాత్రమే.ఐపీఎల్లో కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు..119 - సంజు శాంసన్ (RR vs PBKS, వాంఖడే, 2021)99* - మయాంక్ అగర్వాల్ (PBKS vs DC, అహ్మదాబాద్, 2021)97* - శ్రేయస్ అయ్యర్ (PBKS vs GT, అహ్మదాబాద్, 2025*)93* - శ్రేయస్ అయ్యర్ (DC vs KKR, ఢిల్లీ, 2018)88 - ఫాఫ్ డుప్లెసిస్ (RCB vs PBKS, ముంబై, 2022)గుజరాత్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ మరో మైలురాయిని కూడా తాకాడు. శ్రేయస్ టీ20ల్లో 6000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.మూడు జట్లకు కెప్టెన్‌గా..ఐపీఎల్లో శ్రేయస్ ఖాతాలో మరో ఘనత కూడా వచ్చి చేరింది. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్.. ఐపీఎల్లో మూడు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రేయస్ ఐపీఎల్లో ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయస్‌కు ముందు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్లో మూడు ఫ్రాంచైజీలకు సారథ్యం వహించారు.మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్ తన తొలి మ్యాచ్‌లోనే సఫలమయ్యాడు. శ్రేయస్ వ్యక్తిగతంగానూ సత్తా చాటడంతో గుజరాత్‌పై పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శ్రేయస్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటినా ప్రయోజనం లేకుండా పోయింది. -
GT VS PBKS: నిస్వార్థమైన కెప్టెన్, సెంచరీ ముఖ్యం కాదన్నాడు: శ్రేయస్‌పై శశాంక్ ప్రశంసలు
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీని త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్‌కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం శశాంక్ సింగ్‌కు స్ట్రయిక్ ఇచ్చి నిస్వార్దమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. కెప్టెన్ త్యాగాన్ని శశాంక్ వృధా కానివ్వలేదు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ఫలితంగా పంజాబ్ భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లో శశాంక్ చేసిన పరుగులే అంతిమంగా పంజాబ్ గెలుపుకు దోహదపడ్డాయి.ఒకవేళ శ్రేయస్ జట్టు ప్రయోజనాలు పట్టించుకోకుండా సెంచరీనే ముఖ్యమనుకునే ఉంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమిపాలయ్యేది. ఎందుకంటే గుజరాత్, పంజాబ్ మధ్య పరుగుల తేడా కేవలం 11 పరుగులు మాత్రమే. శ్రేయస్ వ్యక్తిగత స్వార్దం చూసుకుని సెంచరీ కోసం ప్రయత్నించి ఉంటే చివరి ఓవర్లో మహా అయితే 10-15 పరుగులు వచ్చేవి. ఇదే జరిగి ఉంటే పంజాబ్ 230-235 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చేది. అప్పుడు గుజరాత్ సునాయాసంగా లక్ష్నాన్ని ఛేదించి ఉండేది.పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు. శశాంక్‌కు సైతం స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం రాలేదు. భారీ షాట్టు ఆడే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు.జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. శశాంక్ సింగ్ సైతం మ్యాచ్ అనంతరం తన కెప్టెన్‌ను కొనియాడాడు. శశాంక్ మాటల్లో.. టీ20ల్లో, ముఖ్యంగా ఐపీఎల్లో సెంచరీ చేసే అవకాశం అంత ఈజీగా రాదు. కానీ మా కెప్టెన్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. చివరి ఓవర్ మొత్తం నన్నే స్ట్రయిక్ తీసుకొని భారీ షాట్లు ఆడమన్నాడు. తన సెంచరీ గురించి ఆలోచించొద్దని చెప్పాడు. నేను స్వయంగా స్ట్రయిక్ రొటేట్ చేస్తానని చెప్పాను. కానీ అతను నాకు సెంచరీ ముఖ్యం కాదని చెప్పాడు. ఇలా చెప్పాలంటే ఏ కెప్టెన్‌కు అయినా చాలా గట్స్ ఉండాలి. మా కెప్టెన్‌కు ఆ గట్స్ ఉన్నాయి. శ్రేయస్ నన్ను ప్రతి బంతిని సిక్సర్ లేదా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించమని చెప్పాడు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కెప్టెన్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్‌తో నేను రెచ్చిపోయాను.కాగా, శ్రేయస్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్), శశాంక్‌తో పాటు (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: అతడి యార్కర్లు అద్భుతం.. మా విజయావకాశాలను మేమే వదులుకున్నాం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్) సెంచరీ చేసే అవకాశం ఉన్నా, వదలుకుని తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య, ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు దోహద పడ్డారు.భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. అయితే మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వారిని దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ 15, 16, 17 ఓవర్లలో గుజరాత్ కేవలం 18 పరుగులే చేయగలిగింది. ఇక్కడే ఆ జట్టు మ్యాచ్‌ను కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వరుస యార్కర్లతో విరుచుకుపడి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్, రూథర్‌ఫోర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అయినా వారి మెరుపులు సరిపోలేదు. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు రాబట్టలేకపోవడమే గుజరాత్ కొంపముంచింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్), శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు (నాటౌట్), ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ డకౌట్ కాగా.. ఒమర్జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్న్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు లభించాయి. అయితే మేము వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. చాలా పరుగులు ఇచ్చామని అనుకుంటున్నాను. మా విజయావకాశాలను చేజేతులా వదులుకున్నాం. 15, 16, 17 ఓవర్లలో కేవలం 18 పరుగులే చేసాము. మొదటి మూడు ఓవర్లు కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాము. ఇక్కడే మేము ఆటను కోల్పోయాము. చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. సీజన్‌కు మంచి ప్రారంభం లభించిందని అనుకుంటున్నాను.విజయ్ కుమార్ వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 15 ఓవర్లు బెంచ్‌పై కూర్చొని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి యార్కర్లు వేయడం అంత సులభం కాదు. వరుసగా యార్కర్లు వేయగలిగినందుకు వారికి (పంజాబ్ బౌలర్లు) క్రెడిట్ ఇవ్వాలి. ఈ వికెట్ బ్యాటింగ్ చేసేందుకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈజీగా 240-250 పరుగులు స్కోర్ చేయవచ్చు. అయితే ఆ స్కోర్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. -
సెంచరీ త్యాగం చేసినందుకు బాధ లేదు.. ఆ పరుగులే మమ్మల్ని గెలిపించాయి: శ్రేయస్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే తన మార్కు చూపించాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా, త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్ కెప్టెన్సీ ప్రభావం ఈ మ్యాచ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. బౌలర్లను మార్చడం, ఫీల్డ్‌ను సెట్ చేయడం, వ్యూహాలు పన్నడంలో శ్రేయస్ తిరుగులేని నాయకుడని మరోసారి నిరూపితమైంది. అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్‌లను శ్రేయస్ అద్భుతంగా వాడుకున్నాడు. వ్యక్తిగతంగా సఫలమైన శ్రేయస్ సహచరుల్లో స్పూర్తి నింపడంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఫలితంగా పంజాబ్ ఐపీఎల్లో తమ రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.అహ్మదాబాద్ వేదికగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. గుజరాత్ నిర్ణయం తప్పని అరంగేట్రం ఆటగాడు ప్రియాంశ్ ఆర్య ఆదిలోనే నిరూపించాడు. 24 ఏళ్ల ఈ గవర్నమెంట్ టీచర్ కొడుకు (ఆర్య) తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు ఏమాత్రం లేకుండా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (8 బంతుల్లో 8; ఫోర్) ఆదిలోనే ఔటైనా శ్రేయస్ అయ్యర్ ఆర్యతో జతకట్టి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 73 పరుగులు చేసింది.బౌండరీతో ఖాతా ఓపెన్ చేసిన శ్రేయస్ ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బీస్ట్ మోడ్‌లోకి వచ్చాడు. 3 సిక్సర్లు, బౌండరీ సహా 24 పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్ తొలి బంతికే బౌండరీ బాది 95 పరుగులకు చేరిన శ్రేయస్.. ఆతర్వాత సెంచరీ చేసే అవకాశమున్నా (11 బంతులు మిగిలున్నాయి) శాశాంక్ సింగ్‌కు స్ట్రయిక్ ఇచ్చి అతని చేత విధ్వంసం సృష్టింపజేశాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన శశాంక్.. 5 బౌండరీలు సహా 23 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్ డకౌట్ కాగా.. ఒమర్జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు సైతం మెరుపు అరంభమే లభించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. 14 ఓవర్ల వరకు గుజరాత్ టార్గెట్‌ను ఛేజ్ చేసేలా కనిపించింది. ఈ దశలో పంజాబ్ బౌలర్లు విజయ్‌కుమార్ వైశాక్, జన్సెన్, అర్షదీప్ గుజరాత్ బ్యాటర్ల జోరుకు కళ్లెం వేశారు. విజయ్‌కుమార్ గుజరాత్ బ్యాటర్లను బాగా కట్టడి చేశాడు. అంతిమంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం శుభపరిణామం. తొలి బంతికే బౌండరీ కొట్టాను. అదే నన్ను ముందుకు నడిపించింది. రబాడ బౌలింగ్‌లో ఫ్లిక్ సిక్స్ కాన్ఫిడెన్స్‌ను పెంపొందించింది. చివరి ఓవర్లో శశాంక్ చేసిన పరుగులు చాలా కీలకం. సెంచరీ మిస్ చేసుకున్నందుకు బాధ లేదు. మేము ఓ టార్గెట్‌ను సెట్ చేసుకున్నాము. దాని కోసం ముందుకు వెళ్లాము. వైశాక్ అద్భుతంగా రాణించాడు. తొలి బంతి నుంచే యార్కర్లు వేయడం ప్రారంభించాడు. యార్కర్ల ప్లాన్ అమలు చేయడంలో అర్షదీప్ కీలకపాత్ర పోషించాడు. బంతి రివర్స్ స్వింగ్ అవుతుందని అర్షదీప్ చెప్పాడు. బంతికి ఉమ్ము రాయడం కలిసొచ్చిందని అనుకుంటున్నాను. అర్షదీప్ సాయి సుదర్శన్‌ను ఔట్ చేయడంతో మా గెలుపుకు బీజం పడింది. ఇదే ఊపును తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము. -
GT Vs PBKS: పంజాబ్ తొలి పంచ్
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ పంజా విసిరింది. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య మెరుపులు... చివర్లో శశాంక్ సింగ్ ఫినిషింగ్ టచ్... ఇన్నింగ్స్ ఆసాంతం శ్రేయస్ అయ్యర్ దూకుడు... వెరసి పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో తగ్గేదేలే అన్నట్లు బాదిన గుజరాత్ చివరకు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 11 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోగా... ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ సిక్సర్లతో రెచ్చిపోగా... శశాంక్, ప్రియాంశ్ ఆర్య బౌండరీల మోత మోగించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయికిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఇన్నింగ్స్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 28 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో ప్రియాంశ్ దూకుడు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన ప్రియాంశ్... సిరాజ్ వేసిన మూడో ఓవర్లో 6, 4 బాదాడు. అయ్యర్ వచ్చిరాగానే 4, 6తో చాంపియన్స్ ట్రోఫీ ఫామ్ కొనసాగించగా... ఐదో ఓవర్లో ప్రియాంశ్ 4, 4, 6, 4 కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 73/1తో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు కాస్త ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక మందగించగా... సాయికిషోర్ వరుస బంతుల్లో అజ్మతుల్లా (16), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. ఎదుర్కొన్న తొలి బంతికే మ్యాక్స్‌వెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రివ్యూలో బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. 2 రివ్యూలు ఉన్నా పంజాబ్ సరైన సమయంలో వినియోగించుకోలేక స్టార్ బ్యాటర్ వికెట్ కోల్పోయింది. అవన్నీ మరిపించేలా అయ్యర్, శశాంక్ ఆఖర్లో బౌండరీలతో రెచ్చిపోయారు. సాయికిషోర్ ఓవర్లో 2 సిక్సర్లు బాదిన శ్రేయస్... రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు కొట్టాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టొయినిస్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా సాయికిషోర్‌కు వికెట్ సమర్పించుకోగా... ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో శ్రేయస్ 6, 4, 6, 6 కొట్టి 90 పరుగుల మీదకు చేరాడు. మరో 3 ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో ఐపీఎల్లో అయ్యర్ తొలి సెంచరీ ఖాయమే అనుకుంటే... ఆఖర్లో అతడికి ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 18వ ఓవర్లో 6, 4, 6 కొట్టిన శశాంక్ సింగ్.. చివరి ఓవర్లో 5 ఫోర్లు బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివర్లో చిత్తు... భారీ లక్ష్యం కళ్లెదురుగా ఉన్నా... గుజరాత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నాలుగో ఓవర్లో గిల్ 6, 6, 4తో మోత ప్రారంభించగా... సుదర్శన్ దాన్ని కొనసాగించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా బంతి తన పరిధిలో ఉంటే దానిపై విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో గిల్ వెనుదిరగగా... బట్లర్ చక్కటి షాట్లతో అలరించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 104/1తో నిలిచింది. ఈ క్రమంలో సుదర్శన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్లో బట్లర్ 2 సిక్స్‌లు కొట్టగా... తదుపరి ఓవర్లో సుదర్శన్ 4, 6, 4 బాదాడు. సుదర్శన్ ఔటయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ కూడా అలరించాడు. చివర్లో వైశాఖ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... లక్ష్యంవైపు సజావుగా సాగుతున్న గుజరాత్ ఒక్కసారిగా వెనుకబడింది. చివరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 15 పరుగులే చేసింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ 47; ప్రభ్‌సిమ్రన్ (సి) అర్షద్ (బి) రబడ 5; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 97; అజ్మతుల్లా (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 16; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) సాయికిషోర్ 0; స్టొయినిస్ (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 20; శశాంక్ సింగ్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 243. వికెట్ల పతనం: 1–28, 2–79, 3–105, 4–105, 5–162. బౌలింగ్: సిరాజ్ 4–0– 54–0; రబడ 4–0–41–1; అర్షద్ 1–0–21 –0; రషీద్ 4–0–48–1; ప్రసిధ్ కృష్ణ 3–0–41–0; సాయికిషోర్ 4–0–30–3.గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 74; గిల్ (సి) ప్రియాంశ్ (బి) మ్యాక్స్‌వెల్ 33; బట్లర్ (బి) యాన్సెన్ 54; రూథర్‌ఫర్డ్ (బి) అర్ష్ దీప్ 46; తెవాటియా (రనౌట్) 6; షారుక్ (నాటౌట్) 6; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 232. వికెట్ల పతనం: 1–61, 2–145, 3–199, 4–217, 5–225, బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–36–2; అజ్మతుల్లా 2–0–29–0; యాన్సెన్ 4–0–44–1; మ్యాక్స్‌వెల్ 2–0–26–1; స్టొయినిస్ 2–0–31–0; చహల్ 3–0–34–0; వైశాఖ్ 3–0–28–0. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X కోల్‌కతావేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
PBKS Vs GT: పంజాబ్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(54) రూథర్ ఫర్డ్(46) పోరాడినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(33) తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు, జానెసన్, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు.శ్రేయస్ అయ్యర్ విధ్వంసం..అంతకుముందు బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్‌తో పాటు శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), ప్రియాన్ష్ ఆర్య(47) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, రబాడ తలా వికెట్ సాధించారు. శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం
ఢిల్లీ బ్యాటింగ్ సంచలనం ప్రియాన్ష్ ఆర్య తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆర్య అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రియాన్ష్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆర్య.. ఆ తర్వాత మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. గుజరాత్ స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లను ప్రియాంష్ ఊతికారేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఆర్య.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి దూకుడుకు గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అడ్డుకట్టవేశాడు. ఇక అరంగేట్రంలోనే దుమ్ములేపిన ప్రియాన్ష్ ఆర్య గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య, రాధా బాల ఇద్దరూ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్‌లో పెరిగిన ప్రియాంష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ. ప్రియాన్ష్‌కు అతడి తల్లిదండ్రలు ఎంతో మద్దతుగా నిలిచారు. ఇటు క్రికెట్, అటు విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్య ముందుకు సాగాడు.ఆర్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్వామి శ్రద్ధానంద్ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు. ఇక ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి అతడు ఆడాడు. అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్‌కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. -
హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో గుజరాత్‌పై పంజాబ్ గెలుపు
GT vs PBKS Live Updates And highlights: గుజరాత్‌పై పంజాబ్ విజయంఐపీఎల్-2025ను గుజరాత్ విజయంతో ఆరంభించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(54) రూథర్ ఫర్డ్(46) పోరాడినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(33) తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు, జానెసన్, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 187/217 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(47), రూథర్ ఫర్డ్(23) పరుగులతో ఉన్నారు.15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 174/215 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(40), రూథర్ ఫర్డ్(20) పరుగులతో ఉన్నారు.సుదర్శన్ ఆన్ ఫైర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(25) ఉన్నారు. గుజరాత్ విజయానికి 46 బంతుల్లో 106 పరుగులు కావాలి.తొలి వికెట్ డౌన్..శుబ్‌మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన గిల్.. మాక్స్వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 75/1దూకుడుగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లు..245 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(27), సాయిసుదర్శన్(23) ఉన్నారు.శ్రేయస్, శశాంక్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ ఐదో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్మార్కస్ స్టోయినిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన స్టోయినిష్.. సాయికిషోర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 165/5. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(66) పరుగులతో ఉన్నాడు.కిషోర్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుపంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్ వేసిన సాయికిషోర్ బౌలింగ్‌లో మూడో బంతికి ఒమర్జాయ్(16), నాలుగో బంతికి గ్లెన్ మాక్స్వెల్(0) ఔటయ్యాడు. 12 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 108/4పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రియాంష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లో 42 పరుగులు చేసిన ప్రియాంష్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఒమర్జాయ్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాంష్ ఆర్య(17), శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ తరపున అరంగేట్రం చేశాడు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టైటాన్స్ వైఫల్యాలకు అతడు ఏమాత్రం కారణం కాదని పేర్కొన్నాడు. కెప్టెన్ ఒక్కడి ప్రదర్శన మీద జట్టు జయాపజయాలు ఆధారపడి ఉండవని.. ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తేనే గెలుపు వరిస్తుందని ఫిలిప్స్ అన్నాడు.అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గాకాగా 2022లో గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. తమ అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి ఏడాది ఫైనల్ చేరింది. అయితే, 2024లో పాండ్యా టైటాన్స్‌ను వీడి తన సొంతజట్టు ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఫలితంగా టైటాన్స్ పగ్గాలను యాజమాన్యం భారత యువ తార గిల్‌కు అప్పగించింది.పేలవ ప్రదర్శన అయితే, గతేడాది తొలిసారిగా గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి.. పది పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. పాండ్యా జట్టును వీడటంతో పాటు మహ్మద్ షమీ (అప్పుడు టైటాన్స్ జట్టులో) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరం కావడం టైటాన్స్ ప్రదర్శనపై ప్రభావం చూపింది.అయితే, ఈసారి తాము ఆ ప్రతికూలతలు అధిగమించి అనుకున్న ఫలితాలు రాబడతామని గిల్ స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట.గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యంఒక్క ఆటగాడు లేదా కెప్టెన్ జట్టు మొత్తాన్ని గెలిపించలేదు. కాబట్టి శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ వల్లే గతేడాది గుజరాత్ ప్రదర్శన బాలేదని చెప్పడం సరికాదు. టీ20 క్రికెట్ స్వరూపమే వేరు. మ్యాచ్ రోజు ఎవరు ఫామ్‌లో ఉంటారో వారిదే పైచేయి అవుతుంది. గతేడాది సన్‌రైజర్స్, కేకేఆర్ సీజన్ ఆసాంతం ఒకే లయను కొనసాగించి ఫైనల్ వరకు చేరాయి.ఏదేమైనా తమ తొలి రెండు సీజన్లలో గుజరాత్ అద్భుతంగా ఆడింది. మంచి ఫామ్ కనబరిచింది. ఈ ఏడాది అదే ఫలితాన్ని పునరావృతం చేయగలమని నమ్ముతున్నా. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ విషయంలో ఒత్తిడికి గురవుతాడని నేను అస్సలు అనుకోను. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్. జాతీయ జట్టుకు ఆడటం కంటే లీగ్ క్రికెట్లో ఆడటం తేలికే’’ అని గిల్‌కు ఫిలిప్స్ మద్దతు ప్రకటించాడు.రూ. 2 కోట్లకు కొనుగోలుకాగా 2021లో గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుక్కోగా.. ఆ మరుసటి ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కానీ తుదిజట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు రైజర్స్ అతడిని విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు అతడిని వేలంపాటలో కొనుక్కుంది.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఫిలిప్స్ 65 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ తొలి మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని -
IPL 2025: నేటి గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో గెలుపెవరిది..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మార్చి 25) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్, పంజాబ్ ఐదు సందర్భాల్లో ఎదురుపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, పంజాబ్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. గత సీజన్లో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ గుజరాత్‌ను వారి సొంత మైదానంలోనే ఓడించింది.ఈ సీజన్లో గుజరాత్ సాధారణ జట్టుతో బరిలోకి దిగనుండగా.. పంజాబ్ విధ్వంసకర ఆల్‌రౌండర్లతో తమ తొలి టైటిల్ వేటను ప్రారంభించనుంది. గుజరాత్ సైతం జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి మెరుపు వీరులను కొత్తగా జట్టులో చేర్చుకున్నా.. పంజాబ్ హిట్టర్లు స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ ముందు వారు దిగదుడుపే అనిపిస్తుంది. ఈ సీజన్లో పంజాబ్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా చేసుకోగా.. గుజరాత్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఈ సీజన్లో గుజరాత్‌తో పోలిస్తే.. పంజాబ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. పంజాబ్‌లో విధ్వంసకర బ్యాటర్లు (శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్, శశాంక్ సింగ్), ఆల్‌రౌండర్లతో (స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, జన్సెన్) పాటు లోకీ ఫెర్గూసన్, అర్షదీప్ సింగ్, చహల్ లాంటి స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నారు.గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టులో కూడా గిల్, బట్లర్, ఫిలిప్స్, తెవాటియా, షారుక్ ఖాన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా నాణ్యమైన ఆల్‌రౌండర్లు కొరవడ్డారు. వాషింగ్టన్ సుందర్ ఉన్నా అతను అంత ప్రభావితం చేయగలడో లేదో చూడాలి. రషీద్ ఖాన్ వారి బౌలింగ్ తరుపుముక్క అనడంలో సందేహం లేదు. ఈ సీజన్లో గుజరాత్ కొత్తగా రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ లాంటి పేసర్లను పంచన చేర్చుకుంది.అరంగేట్రం నాటి నుంచి గుజరాత్ ఇలాగే సాధారణ జట్టులా కనిపించినా అద్భుత విజయాలు సాధించిన విషయాన్ని గమనించాలి. ఆ జట్టుకు ఐపీఎల్లో ఏ జట్టుకూ లేని విజయాల శాతం ఉంది. గుజరాత్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఆడిన 45 మ్యాచ్‌ల్లో 28 గెలిచి 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ జట్టు హార్దిక్ నేతృత్వంలో ఓ సారి టైటిల్ సాధించి, ఓ సారి రన్నరప్‌గా నిలిచింది. గుజరాత్‌కు (24 మ్యాచ్‌ల్లో 17 విజయాలు) ఛేదనలోనూ మంచి రికార్డు ఉంది. గతాన్ని పక్కన పెడితే నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.నేటి మ్యాచ్‌లో తుది జట్ల అంచనా..గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్,పూర్తి జట్లు..పంజాబ్ కింగ్స్: జోష్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, నేహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైశాక్, ప్రవీణ్ దూబే, లోకీ ఫెర్గూసన్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, యశ్ ఠాకూర్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్గుజరాత్ టైటాన్స్: జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, మహిపాల్ లోమ్రార్, కరీమ్ జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్, గెరాల్డ్ కోయెట్జీ, షెర్ఫన్ రూథర్‌ఫోర్డ్, మానవ్ సుతార్, కుమార్ కుషాగ్రా, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, నిశాంత్ సింధు -
సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై బిగ్‌బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశాడు. జర్నలిస్ట్‌లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సోషల్‌మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్‌ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్‌తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడలేదు.ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్‌లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.ఇంతకీ ఈ మహిర ఎవరు..?రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్‌తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. -
సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్ ఈసారి విజృంభిస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు బదిలీ అయ్యాడు.ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్‌హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా తీసుకున్నారు.వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్‌లతో పాటు రషీద్ ఖాన్‌ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లను జట్టులోకి తీసుకువచ్చారుగుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుశుబ్మన్ గిల్ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.గత సీజన్‌ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్‌ల్లో 151.78 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.జోస్ బట్లర్జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్లో లేని ఫైర్‌పవర్‌ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.రషీద్ ఖాన్గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్‌కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.కగిసో రబాడపంజాబ్ కింగ్స్ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.మహ్మద్ సిరాజ్ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.గుజరాత్ టైటాన్స్ జట్టురషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా. చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా? -
‘ఎంపిక నా చేతుల్లో లేదు’
బెంగళూరు: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు టీమిండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే ఈ హైదరాబాదీ పేసర్ జాతీయ జట్టులోకి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం అంతగా ఆందోళన చెందడం లేదని, ఐపీఎల్లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నట్లు అతను చెప్పాడు.ఐపీఎల్లో సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ‘భారత జట్టు ఎంపిక నా చేతుల్లో ఉండదనేది వాస్తవం. నా చేతుల్లో బంతి మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయగలను అనేదే ముఖ్యం. టీమ్ సెలక్షన్ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. అలా చేస్తే నా ఆటపై ప్రభావం పడుతుంది. మున్ముందు ఇంగ్లండ్ పర్యటన, ఆసియా కప్లాంటివి ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. టీమిండియా తరఫున ఆడని సమయంలో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను. సాధారణంగా విశ్రాంతి తక్కువగా దొరుకుతుంది. కానీ ఈసారి మంచి విరామం లభించింది. అందుకే బౌలింగ్, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టా. కొత్త బంతులు, పాత బంతులతో బౌలింగ్ చేశాం. స్లో బంతులు, యార్కర్ల విషయంలో ప్రత్యేక సాధన చేశాను. కొత్తగా నేర్చుకున్న అంశాలను ఐపీఎల్లో ప్రదర్శిస్తా’ అని అతను చెప్పాడు. శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘బెంగళూరు జట్టుకు దూరం కావడం కొంత బాధకు గురి చేసిందనేది వాస్తవం. కోహ్లి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అయితే ఇక్కడా గిల్ సారథ్యంలో చాలా మంచి జట్టుంది. గిల్ కెపె్టన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఎప్పుడూ వారించడు. మేమిద్దరం ఒకే టెస్టుతో అరంగేట్రం చేశాం. వ్యక్తిగతంగా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది’ అని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీమ్‌లో రబాడ, రషీద్, ఇషాంత్, కొయెట్జీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండటం సానుకూల విషయమని, ఇది అందరిపై ఒత్తిడి తగ్గిస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. గత సీజన్ వరకు ఇదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ షమీతో తనను పోల్చడంపై స్పందిస్తూ... ‘టైటాన్స్ టీమ్ తరఫున షమీ భాయ్ చాలా బాగా ఆడాడు. కీలక సమయాల్లో స్వింగ్‌తో వికెట్లు తీశాడు. నేను కూడా ఆయనలాగే పెద్ద సంఖ్యలో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడితే చాలు. మొతెరా మైదానంలో కొత్త బంతితో షమీ వికెట్లు తీయడం నేను చూశాను. అదే తరహాలో పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే నా పని’ అని సిరాజ్ చెప్పాడు. టైటాన్స్ కోచ్‌గా ఉన్న మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాతో కలిసి పని చేసేందుకు, ఆయన వద్ద కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు. -
‘ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వినోదం పంచేందుకు సిద్ధమైంది. రెండు నెలలకు పైగా నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులకు పొట్టి క్రికెట్ మజా అందించనుంది. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది.గతేడాది.. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.పది జట్లలో భారీ మార్పులువీటిలో కోల్‌కతా- హైదరాబాద్ ఫైనల్లో తలపడగా.. రైజర్స్పై నైట్ రైడర్స్ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఇక ఏడాది ఈ పది జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా వేలం-2025 నేపథ్యంలో ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతాకు అజింక్య రహానే సారథులుగా నియమితులయ్యారు.అత్యధికంగా పదికి 9 పాయింట్లుఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఐపీఎల్-2025లో పది జట్లకు తనదైన శైలిలో రేటింగ్ ఇచ్చాడు. అదే విధంగా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేతపై తన అంచనా తెలియజేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు అత్యధికంగా పదికి 9 పాయింట్లు ఇచ్చిన మైకేల్ వాన్.. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు 5 పాయింట్లు వేశాడు.అయితే, గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ఏడేసి పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇక 2024లో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 7.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. అన్ని జట్ల కంటే ఈసారి గుజరాత్ టైటాన్స్ గొప్పగా ఉందన్న మైకేల్ వాన్.. ఆ జట్టును తొమ్మిది పాయింట్లతో టాప్‌లో నిలిపాడు.ఇక గతేడాది ఫైనలిస్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 6.5 పాయింట్లే ఇచ్చిన వాన్.. ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్.. పంజాబ్, లక్నోలతో పోటీ పడుతుందని అంచనా వేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలవడం ఖాయమని వాన్ జోస్యం చెప్పాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025 జట్లకు మైకేల్ వాన్ ఇచ్చిన రేటింగ్(పది పాయింట్లకు)👉గుజరాత్ టైటాన్స్- 9👉కోల్‌కతా నైట్ రైడర్స్- 8👉లక్నో సూపర్ జెయింట్స్- 7👉పంజాబ్ కింగ్స్- 7👉సన్‌రైజర్స్ హైదరాబాద్- 6.5👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 6.5👉రాజస్తాన్ రాయల్స్- 6.5👉చెన్నై సూపర్ కింగ్స్- 6👉ఢిల్లీ క్యాపిటల్స్- 5.మైకేల్ వాన్ ఎంచుకున్న టాప్-4 జట్లు(ప్లే ఆఫ్స్)గుజరాత్, కోల్‌కతా, ముంబై ఇండియన్స్ టాప్-3లో ఉండగా.. నాలుగో స్థానం కోసం లక్నో, పంజాబ్, సన్‌రైజర్స్ పోటీ.విజేతపై మైకేల్ వాన్ అంచనాఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్యాన్ని, బ్యాటింగ్‌ను విడివిడిగా చూడగలిగితేనే విజయవంతమవుతామని అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘కెప్టెన్సీని, బ్యాటింగ్‌ను వేర్వేరుగా ఉంచాలి. అప్పుడే విజయవంతం కాగలం. క్రీజులో అడుగుపెట్టినప్పుడు కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెడతా. నా అనుభవంలో ఇదే నేర్చుకున్నా. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మాత్రం కెప్టెన్‌గా మరింత బాధ్యతగా వ్యవహరిస్తా’ అని అన్నాడు.2023 సీజన్లో టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన గిల్ 890 పరుగులతో సత్తా చాటాడు. ఇక గత ఏడాది సారథిగా బాధ్యతలు తీసుకున్న గిల్ 426 పరుగులు చేశాడు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే అతడి స్ట్రయిక్‌రేట్ 10 శాతం తగ్గింది. ‘సారథిగా ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటా. అదే ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా నన్ను మరింత మెరుగు పరుస్తుందని నమ్ముతున్నా. కోచ్ ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి సూచనలతో ముందుకు సాగుతున్నా. ఇంటా బయట అనే తేడా ఏమీ లేదు. మంచి లయలో ఉంటే వేదికతో సంబంధం ఉండదు. గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే లీగ్‌లో అత్యధిక విజయాల శాతం మా జట్టుదే. దాన్నే కొనసాగిస్తే ఈ సీజన్‌ను కూడా చిరస్మరణీయం చేసుకోగలం’ అని వివరించాడు. మ్యాచ్‌లు గెలవాలంటే భారీ స్కోర్లు చేయడం మాత్రమే కాదని... పిచ్, పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో (మార్చి 25) పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్.. ఈ సీజన్లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్: శుబ్‌మన్ గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరింత వినోదాత్మకంగాఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు అదనపు ప్రయోజనం కలుగుతుందని శుబ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్ కారణంగా అదనపు బ్యాటర్ లేదంటే బౌలర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని.. ఈసారి స్కోర్లు 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు. ఈ నిబంధన ఐపీఎల్‌ను మరింత వినోదాత్మకంగా మార్చిందని గిల్ జియోహాట్‌స్టార్ షోలో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఐపీఎల్‌తో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గిల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘పంచకులలోని తౌ దేవి లాల్ స్టేడియానికి మా నాన్నతో కలిసి మూడు, నాలుగు మ్యాచ్‌లకు వెళ్లాను. నాకు తెలిసి అప్పటికి ఐపీఎల్ మొదలై మూడేళ్లు గడిచి ఉంటాయి.నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చింది. నాకప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా.. సచిన్ సర్‌తో గ్లెన్ మాక్స్‌వెల్‌తో నేను ఫొటో తీసుకున్నా.వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నపుడు బాల్స్ త్రో చేసేవాడిని. ఐపీఎల్‌తో నాకున్న తొలి జ్ఞాపకం అదే. సచిన్ సర్ గురించి నాకు ముందు నుంచే తెలుసు. ఆయనను చూసే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.మా నాన్న ఆయనకు వీరాభిమానిఇక మా నాన్న అయితే.. సచిన్ సర్కి వీరాభిమాని. మా గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించేవి’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు. ఇక కెప్టెన్సీ అనేది ఓ నిరంతర ప్రయాణమన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. నాయకుడిగా భిన్న అనుభవాలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు.జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడి నైపుణ్యాలపై అవగాహన పెంచుకుని.. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకున్న వారే నాయకులుగా రాణిస్తారని గిల్ అన్నాడు. ప్రతి మ్యాచ్ సరికొత్తగా ఉంటుందని.. ఆటగాళ్ల బలాలు, బలహీనతలు అర్థం చేసుకుంటే.. వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా అనుభవం గడించినపుడే..ఇక సారథిగా చేసే ప్రయాణంలో అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత రాటుదేలతామని.. అయితే, ఒక్కోసారి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటపుడు సంయమనంతో ముందుకు సాగితే ప్రతికూల ప్రభావం పడదని గిల్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ పగ్గాలు చేపట్టిన కొత్తల్లో తాను సహచర ఆటగాళ్లతో ఎక్కువగా మమేకం కాలేకపోయానన్న.. అయితే, నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తనకు తెలియకుండానే ఎంతో మారిపోయానని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం.. వారి మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నానని గిల్ తెలిపాడు.చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
మాథ్యూస్, స్కివర్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ముంబై బ్యాటర్లలో హీలీ మాథ్యూస్(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), నాట్ స్కివర్ బ్రాంట్(41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ద్వయంతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.గుజరాత్ బౌలర్లలో గిబ్సన్ రెండు, గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు సునాయస క్యాచ్‌లను జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌కు గుజరాత్ స్టార్ ప్లేయర్ డాటిన్ దూరమైంది. డాటిన్ లేని లోటు గుజరాత్ టీమ్‌లో స్పష్టంగా కన్పించింది. తుది జట్లుముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్గుజరాత్: బెత్ మూనీ (వికెట్ కీపర్), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డేనియల్ గిబ్సన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం
ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు యాజమాన్యం మాజీ ఆటగాడు, మాజీ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. వేడ్ 2022, 2024 సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. We love this Saturday Surprise, Wadey! 😁Welcome back as our 𝐀𝐬𝐬𝐢𝐬𝐭𝐚𝐧𝐭 𝐂𝐨𝐚𝐜𝐡. Matthew Wade | #AavaDe | #TATAIPL2025 pic.twitter.com/kIbV73qxL9— Gujarat Titans (@gujarat_titans) March 8, 2025వేడ్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనలేదు. వేడ్ ఆటగాడిగా కాకుండా కోచింగ్ రోల్లో గుజరాత్‌తో జతకట్టడం విశేషం. వేడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించిన విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఐపీఎల్లో వేడ్ మొత్తంగా 15 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 12 గుజరాత్ తరఫున ఆడాడు. 2022 సీజన్లో గుజరాత్ టైటిల్ గెలిచిన జట్టులో వేడ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. వేడ్ తదుపరి ఐపీఎల్ సీజన్లో హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్, అసిస్టెంట్ కోచ్‌లు ఆశిష్ కపూర్, నరేందర్ నేగిలతో కలిసి పని చేస్తాడు. 37 ఏళ్ల వేడ్ ఇటీవలే హోబర్ట్ హరికేన్స్ తరఫున బిగ్‌బాష్ లీగ్ గెలిచాడు. ఆటగాడిగా ఉంటూనే వేడ్ కోచింగ్ అవకాశాల కోసం వెతుకుతున్నాడు. విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ కూడా ఇలాగే (ఆటగాడిగా కొనసాగుతూనే) కోచింగ్ డిపార్ట్మెంట్లో సెట్ అయ్యాడు. పోలార్డ్ కూడా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన ఫ్రాంచైజీలోనే (ముంబై ఇండియన్స్) కోచ్‌గా స్థిరపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ 2025 సీజన్ నుంచి కొత్త యాజమాన్యం అండర్లో మ్యాచ్‌లు ఆడనుంది. 2025 సీజన్‌ను గుజరాత్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. ఈ సీజన్లోనూ గుజరాత్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గుజరాత్ గత సీజన్‌ను ఎనిమిదో స్థానంతో ముగించింది. 2024 సీజన్లో గుజరాత్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయాలు సాధించింది.2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మహిపాల్ లోమ్రార్, షారుక్ ఖాన్, నిషాంత్ సింధు, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయికిషోర్, కుమార్ కుషాగ్రా, జోస్ బట్లర్, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిస రబాడ, ప్రసిద్ద్ కృష్ణ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్ -
గుజరాత్ టైటాన్స్ సహ యజమానిగా టోరెంట్ కంపెనీ.. ప్రాంచైజీలో 67 శాతం వాటా కొనుగోలు
అహ్మదాబాద్: ఐపీఎల్ (IPL) టీమ్ గుజరాత్ టైటాన్స్‌లో (Gujarat Titans) ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరెంట్ గ్రూప్ (Torrent Group) 67 శాతం వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందం గతంలోనే ఖాయమైనా... బుధవారం ఫ్రాంచైజీ యాజమాన్యం దీనిని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత యజమాని సీవీసీ క్యాపిటల్స్ ఇక ముందు మిగిలిన 33 శాతం వాటాతో సహ యజమానిగా కొనసాగుతోంది. ఐపీఎల్ జట్టులో భాగమయ్యేందుకు సీవీసీ క్యాపిటల్స్‌కు టోరెంట్ సుమారు రూ.5,025 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 2021లో టైటాన్స్‌ను సీవీసీ రూ.5,625 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఈ టీమ్ ప్రస్తుత విలువను రూ.7,500 కోట్లుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో సీవీసీ గ్రూప్ తాము పెట్టిన పెట్టుబడిలో సుమారు 89 శాతాన్ని తిరిగి తెచ్చుకోవడంతో పాటు 33 శాతం వాటాను ఇంకా తమ వద్దే ఉంచుకోవడం విశేషం. కొత్త ఒప్పందం కారణంగా ఐపీఎల్లో భాగం కావ డం పట్ల సంతోషంగా ఉన్నామని... లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు టోరెంట్ గ్రూప్ డైరెక్టర్ జినాల్ మెహతా వ్యాఖ్యానించారు. టోరెంట్ దేశవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, గ్యాస్ రంగాల్లో పెద్ద ఎత్తున తమ వ్యాపారాలను సాగిస్తోంది. కంపెనీ విలువ దాదాపు రూ.41 వేల కోట్లుగా ఉంది. 2022 ఐపీఎల్ సీజన్లో టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ 2023తో రన్నరప్‌గా నిలిచింది. -
IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్‌కు చెందిన టొరంట్ గ్రూపు(Torrent Group) ఈ ఫ్రాంఛైజీలో అరవై ఏడు శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కాగా అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) 2021లో ఐపీఎల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.నాడు రూ. 5,625 కోట్లతోభారీ స్థాయిలో ఏకంగా రూ. 5,625 కోట్లతో గుజరాత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. అయితే, తమ వాటలో మెజారిటీ మొత్తాన్ని అమ్మేందుకు సీవీసీ క్యాపిటల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి సంస్థ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.‘‘టొరంట్ గ్రూపుతో చర్చలు కొలిక్కివచ్చినట్లే. మూడింట రెండు వంతుల వాటాను అమ్మేందుకు నిర్ణయం జరిగింది. యజమానులుగా సీవీసీ గ్రూప్ లాక్- ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. కాబట్టి అప్పుడు వారు తమ వాటాలను అమ్ముకునేందుకు స్వేచ్ఛ లభిస్తుంది.బీసీసీఐ అనుమతి తప్పనిసరిటొరంట్ గ్రూపు భారత ఫార్మాసుటికల్ రంగంలో కీలకమైనది. బీసీసీఐ 2021లో రెండు కొత్త ఫ్రాంఛైజీల నిర్వహణకు బిడ్లను ఆహ్వానించినపుడు ఈ గ్రూపు ఆసక్తి కనబరిచింది. ఈసారి తన ఆకాంక్షను నెరవేర్చుకోనుంది. అయితే, ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్య మార్పు జరగాలంటే బీసీసీఐ నుంచి అనుమతి తప్పనిసరి. త్వరలోనే ఇది జరుగుతుంది’’ అని పేర్కొన్నాయి.కాగా ఐపీఎల్ పాలక మండలి నుంచి అనుమతి లభించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేతులు మారనున్నాయి. ఐపీఎల్-2025 సీజన్ నుంచే యాజమాన్యంలో మార్పులు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక 2021లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. తమ అరంగేట్ర ఎడిషన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది.హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో చాంపియన్గాటీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. ఆ మరుసటి ఏడాది పాండ్యా సారథ్యంలోనే ఫైనల్‌కు చేరింది. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి.. తన సొంతగూటికి చేరాడు. అతడు ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు చేపట్టగా.. మరో టీమిండియా స్టార్, భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టైటాన్స్ పగ్గాలు చేపట్టాడు. గిల్ సారథ్యంలో ఇలాఅయితే, గిల్ సారథ్యంలో గతేడాది టైటాన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. టొరంట్ గ్రూపు విలువ దాదాపుగా 41 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక టొరంట్ స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2021లో అహ్మదాబాద్ కోసం రూ. 4653 కోట్లు, లక్నో ఫ్రాంఛైజీ కోసం రూ. 4356 కోట్లతో బిడ్ వేసింది. ఆ తర్వాత వుమెన్స్ ప్రీమియర్ లీగ్ బరిలోకి వచ్చిన టొరంట్ గ్రూప్ ఫ్రాంఛైజీ కొనుగోలు విషయంలో సఫలం కాలేకపోయింది. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా మార్కులు కొట్టేసిన టైటాన్స్‌కు యజమానిగా మారనుంది.కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ పేరిట మొత్తం పదిజట్లు ఉన్నాయి.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్‌స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్‌రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్‌రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్‌పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్‌మన్ గిల్- సారా అలీఖాన్‌ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
వాషింగ్టన్ సుందర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్‌లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.మూడు జట్లకుక్యాష్ రిచ్ లీగ్‌లో 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్ఆర్హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సన్‌రైజర్స్‌కు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు. -
సిరాజ్‌కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఆఖరికి ఆ జట్టు సొంతం.. ధర మాత్రం..
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్‌కు షాకివ్వగా.. టైటాన్స్ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ సన్‌రైజర్స్ తరఫున 2017లో క్యాచ్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.ఏడేళ్లు అక్కడేఅయితే, ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్‌లోకి వచ్చాడు.చెన్నై కూడా రేసులోఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్‌తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.మాకు వద్దు.. సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీఈ దశలో రాజస్తాన్ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్ విషయంలో రైటు మ్యాచ్ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్ 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సిరాజ్‌కు గుజరాత్ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.ఇక ఐపీఎల్-2022 ద్వారాక్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్.. -
మంజ్రేకర్‌పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్‌మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్‌స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్‌లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్ నూతన అసిస్టెంట్ మరియు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని టైటాన్స్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. భారత్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా పార్థివ్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం తమ జట్టుకు మేలు చేస్తుందని జీటీ మేనేజ్మెంట్ అభిప్రాయపడింది. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు. వీరందరితో కలిసి పార్థివ్ పని చేస్తాడు.కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్‌ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్‌ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు. -
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్ గిల్‌పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్‌ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్‌గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్‌ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2025 ఎడిషన్ కోసం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో గుజరాత్‌కే ప్రాతినిథ్యం వహించిన పార్థివ్ తన సొంత జట్టుతో మరోసారి జత కట్టనున్నాడని సమాచారం. పార్థివ్.. గ్యారీ కిర్‌స్టన్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు.కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్‌ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్‌ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకునేందుకు రెడీ: వార్నర్ -
డబుల్ సెంచరీ బాదిన సాయి సుదర్శన్.. సెంచరీకి చేరువలో సుందర్
రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూప్-డి పోటీల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఓపెనర్ సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీతో (202) విరుచుకుపడగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్ సెంచరీకి (96 నాటౌట్) చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. ఎన్ జగదీశన్ 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నవ్‌దీప్ సైనీకి జగదశన్ వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. సాయి 2023 నుంచి పాకిస్తాన్-ఏపై, ఇంగ్లండ్-ఏపై, ఐపీఎల్లో, తమిళనాడు ప్రీమియర్ లీగ్ నాకౌట్స్‌లో, కౌంటీ క్రికెట్లో, దులీప్ ట్రోఫీలో, రంజీ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు చేశాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో 28 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు బాదాడు. -
సిక్సర్లతో శివాలెత్తిపోయిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్
మహారాజా టీ20 టోర్నీలో షిమోగా లయన్స్ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ 10 మ్యాచ్‌ల్లో 6 అర్ద సెంచరీల సాయంతో 84.50 సగటున 507 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ ఏకంగా 52 సిక్సర్లు బాదాడు.నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ అభినవ్ మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభినవ్ 24 బంతుల్లో 7 సిక్సర్లు, బౌండరీ సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో అభినవ్‌తో పాటు మోహిత్ (56), రోహన్ నవీన్ (45) కూడా విజృంభించారు. బ్లాస్టర్స్ బౌలర్లలో ఆతిథ్య గోయల్ 2 వికెట్లు పడగొట్టగా.. సంతోక్ సింగ్, ప్రతీక్ జైన్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బ్లాస్టర్స్.. సూరజ్ అహూజా (82 నాటౌట్), శుభంగ్ హేగ్డే (85 నాటౌట్) వీర బాదుడు బాదడంతో మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్లాస్టర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. షిమోగా బౌలర్లలో శరత్ 2, రాజ్వీర్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అభినవ్ చెలరేగినా అతని జట్టు షిమోగా లయన్స్ ఓడిపోవడం విచారకరం. -
ఉత్తమ స్పిన్నర్లలో ఒకడిని.. జట్టులో చోటివ్వండి: భారత బౌలర్
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్‌రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.మెడకు తీవ్ర గాయంఅయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్‌ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.భయపడ్డాను‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.ఒక్క ఛాన్స్ ఇవ్వండిఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్‌లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు!
ఐపీఎల్-2025కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుజరాట్ టైటాన్స్ ఫ్రాంచైజీ సైతం తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.తమ జట్టు హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా, క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని తప్పించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు సంవత్సరాల ఆశిష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఈ ఏడాది చివరలో జరగనున్న మెగా వేలానికి ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా గుజరాత్ హెడ్‌కోచ్‌గా నెహ్రా విజయవంతమయ్యాడనే చెప్పుకోవాలి. తమ అరంగేట్ర సీజన్లో గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన నెహ్రా.. తర్వాతి సీజన్లో జీటీ రన్నరప్ నిలిచింది.అయితే ఐపీఎల్ 2024లో మాత్రం గుజరాత్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో గుజరాత్ విఫలమైంది. అందుకు కెప్టెన్సీ మార్పు కూడా ఓ కారణం కావచ్చు. ఈ ఏడాది సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో గుజరాత్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. కానీ జట్టును నడిపించడంలో శుబ్‌మన్ ఎంపికయ్యాడు.ఇక గత మూడు సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించిన గ్యారీ కిరెస్టన్ ఇప్పటికే తన పదవి నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా గ్యారీ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు గుజరాత్ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ నుంచి కొంత వాటాను భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్‌పై అధికారికంగా ప్రకటన విడుదల కానుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. -
‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్‌లా కాదు’
శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్‌గా అనుభవం లేని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రిటర్మెంట్ తర్వాత భారత్ తొలిసారి టీ20 సిరీస్‌లో పాల్గొననుంది.ఇక ఈ జట్టుకు నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయికి కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.ఆశ్చర్యం కలిగించలేదు‘‘హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.అయినా క్రికెట్లో ఇవన్నీ సహజం. హార్దిక్‌పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్, కెప్టెన్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.నేను గంభీర్‌లా కాదు‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు.టైటాన్స్‌తో అనుబంధంఐపీఎల్-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాంపియన్‌గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్ చేరింది. అయితే, ఐపీఎల్-2024లో పాండ్యా టైటాన్స్‌తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.చదవండి: ‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్ -
IPL 2025: గుజరాత్ హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే.. మరికొన్ని కోచింగ్ స్టాఫ్, మెంటార్లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా గుజరాత్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్ తమ తొలి రెండు సీజన్లలో ఫైనల్స్‌కు చేరింది. 2022లో ఛాంపియన్‌గా, 2023లో రన్నరప్‌గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్‌ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో (2024) వైఫల్యాల కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వచ్చందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తుండవచ్చు. గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఈ టాపిక్ నడుస్తుండగానే మరో వార్త సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. నెహ్రా గుజరాత్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటే టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. యువరాజ్‌తో గుజరాత్ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతన్ని గుజరాత్ టైటాన్స్ పంచన చేర్చుకుంటే ఇదే అతనికి తొలి కోచింగ్ పదవి అవుతుంది. గుజరాత్ ఆఫర్‌పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, గుజరాత్ గత సీజన్లో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్ ఎగ్జిట్‌తో శుభ్‌మన్ గిల్ గుజరాత్ నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ నేతృత్వంలో గుజరాత్ గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో ఐదింట మాత్రమే విజయాలు సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది. -
అదానీ చేతికి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ..?
ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లో మెజారిటీ వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. సదరు వాటాను విక్రయించేందుకు అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లతో చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలిసింది.సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ 2021లో గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీని రూ.5,625 కోట్లకు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం తన వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. దాంతో అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లకు మేజర్ వాటాను విక్రయించడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 2025తో ఫ్రాంచైజీ వాటాలను విక్రయించడానికి లాక్-ఇన్ పీరియడ్ ముగుస్తుంది. ఆలోపే ఈ తంతు పూర్తి చేయాలని సీవీసీ క్యాపిటల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ విలువ 1-1.5 బిలియన్ డాలర్ల(రూ.8,500 కోట్లు) మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టొరెంట్ సంస్థ క్రికెట్ వ్యాపారంలోకి ఇంకా ప్రవేశించలేదు. కానీ, అదానీ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో పెట్టుబడులను కలిగి ఉంది. డబ్ల్యూపీఎల్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ 2023లో రూ.1,289 కోట్ల బిడ్‌తో సొంతం చేసుకుంది. ఈ గ్రూప్ 2021లోనే గుజరాత్ టైటాన్స్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదురలేదు.ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఇదిలాఉండగా, సీవీసీకి ఇప్పటికే లాలిగా, ప్రీమియర్‌షిప్ రగ్బీ, వాలీబాల్ వరల్డ్, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ తన తొలి సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. -
ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
ఐపీఎల్- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.కొత్త కెప్టెన్ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్ కాంబినేషన్ కుదిరింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. వెరసి లీగ్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్ ఆర్మీ గురించే ఇదంతా! సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2020లో టాప్-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీకి తోడు హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్‌కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.. కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.సమిష్టి కృషితో టాప్-4 వరకుఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్-4 వరకు చేరింది సన్‌రైజర్స్.గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో రైజర్స్ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.పట్టరాని సంతోషంలో కావ్యా మారన్దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.కేన్ మామను హత్తుకున్న సన్‌రైజర్స్ ఓనర్ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అతడు మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్. అదేనండీ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్ మామగా పిలుచుకునే న్యూజిలాండ్ కెప్టెన్. 2021, 2022లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్. పాత ఓనర్‌ను కలుసుకునిఅయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేయగా.. 2023 వేలంలో గుజరాత్ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్‌ను విలియమ్సన్ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ 🧡 pic.twitter.com/QVyGH6KdNP— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
IPL 2024- SRH: ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్‌పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్‌గాంధీ స్టేడియంలో కూడా అవుట్‌ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పేశారు. అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా... నిర్ణీత రాత్రి 7:30 గంటల సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరు చినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 గంటలకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీమ్‌కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్‌రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచి... అదే రోజు రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ చివరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓడితే సన్‌రైజర్స్‌కు రెండో స్థానం ఖాయమవుతుంది. 2020లో చివరిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2021, 2022, 2023 సీజన్లలో వరుసగా 8వ, 8వ, 10వ స్థానాల్లో నిలిచింది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
SRH vs GT: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీలక ప్రకటన
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు.అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండడంతో సెంట్రల్ పిచ్‌ను మాత్రం కవర్స్‌తో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వహణపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నారని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్‌లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
IPL 2024: గుజరాత్ అవుట్
అహ్మదాబాద్: సొంతగడ్డపైనే గుజరాత్ టైటాన్స్ పుట్టి మునిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉన్న నిరుటి రన్నరప్ టైటాన్స్ ఆశల్ని భారీ వర్షం ముంచేసింది. తెరిపినివ్వని వానతో నరేంద్ర మోదీ స్టేడియం తడిసిముద్దయ్యింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్గానైనా నిర్వహించేందుకు గ్రౌండ్ సిబ్బంది చాలా కష్టపడింది. కానీ ఆగినట్లే ఆగిన వాన మళ్లీ చినుకు చినుకుగా పడటంతో నిర్వాహకులు చేసేదేమీలేక తుది నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది. నిజానికి రాత్రి 10 గంటలైనా అసలు టాస్ వేసేందుకే అవకాశం లేకపోయింది. చివరిసారిగా రాత్రి 10.36 గంటలకు మైదానాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు నవ్‌దీప్ సింగ్, నిఖిల్ పట్వర్దన్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించగా, ఆటగాళ్లు పరస్పర కరచాలనంతో మైదానంలోని ప్రేక్షకుల్ని పలుకరిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌వైపు నడిచారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వర్షంవల్ల రద్దయిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. పటిష్టస్థితిలో కోల్‌కతా ఫలితం తేలని మ్యాచ్‌తో టాప్–2 స్థానాలు మాత్రం తేలిపోయాయి. మ్యాచ్ రద్దుతో వచి్చన ఒక పాయింట్‌తో కోల్‌కతా 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ మిగిలున్న ఆఖరి మ్యాచ్‌లో ఓడినా... తొలి రెండు స్థానాల్లో ఉండటం ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ తమ రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఒకవేళ గెలిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి ఎగబాకుతుంది. అప్పుడు నైట్‌రైడర్స్ రెండో స్థానానికి పడిపోయినా ఎలిమినేటర్ ఆడే పరిస్థితి అయితే రాదు. ఐపీఎల్‌లోకి ప్రవేశించిన గత రెండేళ్ల నుంచి ఫైనల్ చేరిన గుజరాత్ ఈసారి ఇంకో మ్యాచ్ మిగిలున్నా... లీగ్ దశలోనే ని్రష్కమించనుంది. 2022లో టైటిల్ గెలిచిన టైటాన్స్ గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. ఒకవేళ ఆఖరిపోరు గెలిచినా... 13 పాయింట్లవద్దే ఆగిపోతుంది. అయితే పట్టికలో ఇప్పటికే కోల్‌కతా (19), రాజస్తాన్ (16), చెన్నై (14), హైదరాబాద్ (14) ముందు వరుసలో ఉండటంతో గుజరాత్ ఖేల్ లీగ్‌తోనే ముగిసింది. -
వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షర్ఫాణమైంది. ఎడతరిపి లేని వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం నుంచే అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తోంది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్లకూ చేరో పాయింట్ లభించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఐదింట విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే . ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ తొమ్మిదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
సీఎస్కేకు షాకిచ్చిన గుజరాత్.. ఘన విజయం
-
GTvsCSK: టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్‌కు ఏకంగా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శతక వీరుడు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు.కాగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(103), శుబ్‌మన్ గిల్(104) సునామీ శతకాలతో చెలరేగగా.. 231 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నైని 196 పరుగులకే కట్టడి చేసి.. ఈ సీజన్లో ఐదో విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో నిలవగలిగింది. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు జరిమానా రూపంలో భారీ షాక్ తగిలింది.నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు రూ.24 లక్షలు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం మేర బీసీసీఐ కోత విధించింది. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఈ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు కెప్టెన్‌కు రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత(ఏది తక్కువగా ఉంటే అది) ఫైన్ వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.గుజరాత్ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: అహ్మదాబాద్.. నరేంద్ర మోదీ స్టేడియం👉టాస్: చెన్నై.. బౌలింగ్👉గుజరాత్ స్కోరు: 231/3 (20)👉చెన్నై స్కోరు: 196/8 (20)👉ఫలితం: 35 పరుగుల తేడాతో చెన్నైపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్A record-breaking opening partnership followed by an effective bowling display to earn 2️⃣ points 🙌Recap the #GTvCSK clash 🎥 #TATAIPL pic.twitter.com/f9RI6iP8eL— IndianPremierLeague (@IPL) May 11, 2024 -
MS Dhoni: తలా ధోనిపై అభిమానంతో మ్యాచ్ మధ్యలో వీరాభిమాని పాదాభివందనం (ఫొటోలు)
-
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూల్ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్ టైటాన్స్- సీఎస్కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్(103), శుబ్‌మన్ గిల్(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్ వికెట్స్ మిస్ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్‌గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్‌గా డీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలా క్రేజ్, ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024 -
గిల్, సాయి శతకాల మోత
అహ్మదాబాద్: గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూపర్‌కింగ్స్ ఊహించని ఉపద్రవంతో చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. గిల్ (55 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), సుదర్శన్ (51 బంతుల్లో 103; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగారు.తుషార్ దేశ్‌పాండేకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓడింది. డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (36 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. జోరు కాదు... ఓపెనర్ల హోరు... పవర్ ప్లేలో 58/0 స్కోరు చేసిన టైటాన్స్ ఓపెనర్లు ఆ తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ముందుగా సాయి సుదర్శన్ 32 బంతుల్లో, గిల్ 25 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేశారు. పేస్, స్పిన్, స్లో మీడియం ఇలా ఆరుగురు చెన్నై బౌలర్లు 17 ఓవర్ల వరకు వైవిధ్యం చూపినా... వాళ్లిద్దరు మాత్రం అడ్డు అదుపు లేకుండా శరవేగంగా పరుగుల్ని రాబట్టారు. సెంచరీ మాత్రం ముందుగా శుబ్‌మన్ 50 బంతుల్లో పూర్తిచేయగా, తర్వాత సుదర్శన్ కూడా 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ పరుగుల తుఫాన్‌ను ఎట్టకేలకు డెత్ ఓవర్లకు గానీ విడగొట్టలేకపోయారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన సాయి సుదర్శన్... శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి నిష్క్ర మించాడు.దీంతో ఓపెనింగ్ వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో చెన్నై శిబిరంలో తొలిసారి ఆనందం కనబడింది. అదే ఓవర్లో కెపె్టన్ గిల్ కూడా అవుట్ కావడంతో సూపర్‌కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. అన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు... ఇద్దరివే! 17.2 ఓవర్లు ఓపెనర్లే ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగందుకుంది. మెరుపులతో జోరందుకుంది. ఓపెనింగ్‌కు ఇరువైపుల వేగం, వేగం కనిపించడంతో మోదీ స్టేడియం గుజరాత్ అభిమానుల కేరింతలతో మార్మోగింది. సుదర్శన్, గిల్ ఇద్దరు అదేపనిగా దంచేయడంతో ఫోర్లతో సిక్సర్లు కూడా పోటీపడ్డాయి. 14 ఫోర్లు, 13 సిక్స్‌లు బాదేయడంతో 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో 134 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆరో ఓవర్లో 50కి చేరిన గుజరాత్ స్కోరు... 100 పరుగుల్ని పదో ఓవర్లో దాటింది. 150 పరుగుల్ని మరింత వేగంగా 13వ ఓవర్లోనే అధిగమించింది. 17వ ఓవర్లో 200 మైలురాయికి చేరింది. ఆరంభంలోనే దెబ్బ తొలి ఓవర్లో రచిన్ రవీంద్ర (1), రెండో ఓవర్లో రహానే (1), మూడో ఓవర్లో కెపె్టన్ రుతురాజ్ (0) వరుస కట్టడంతో కొండంత లక్ష్యఛేదన చెన్నైకి అసాధ్యంగా మారింది. మిచెల్, మొయిన్ అలీ అర్ధసెంచరీలతో చేసిన పోరాటం సూపర్‌కింగ్స్ ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడింది తప్ప... లక్ష్యంవైపు నడిపించలేకపోయింది. హిట్టర్ శివమ్ దూబే (21; 2 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (18; 2 ఫోర్లు, 1 సిక్స్) టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలొగ్గారు. ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖర్లో సిక్సర్లతో అలరించాడు. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇది రెండోసారి. 2019లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్ తొలుత ఈ ఘనత సాధించారు.100 శుబ్‌మన్ గిల్ శతకం ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ ప్రారంభమైన ఏడాది 2008 ఏప్రిల్ 18న జరిగిన తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ మొదటి సెంచరీ చేశాడు. మొత్తం 17 ఐపీఎల్ సీజన్లలో ఇప్పటి వరకు 1084 మ్యాచ్‌లు జరిగాయి. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో తొలి వికెట్‌కు 200 అంతకంటే ఎక్కువ పరుగుల భాగ స్వామ్యం నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (68 నాటౌట్), డికాక్ (140 నాటౌట్) తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) దూబే (బి) తుషార్ 103; శుబ్‌మన్ గిల్ (సి) జడేజా (బి) తుషార్ 104; మిల్లర్ (నాటౌట్) 16; షారుఖ్ ఖాన్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–210, 2–213, 3–231. బౌలింగ్: సాన్‌ట్నర్ 2–0–31–0, తుషార్ 4–0–33–2, శార్దుల్ 4–0–25–0, సిమర్జీత్ 4–0–60–0, జడేజా 2–0–29–0, మిచెల్ 4–0–52–0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) తెవాటియా (బి) సందీప్ వారియర్ 1; రచిన్ (రనౌట్) 1; రుతురాజ్ (సి) రషీద్ ఖాన్ (బి) ఉమేశ్ 0; మిచెల్ (సి) షారుఖ్ (బి) మోహిత్ 63; అలీ (సి) నూర్ అహ్మద్ (బి) మోహిత్ 56; దూబే (సి) నూర్ (బి) మోహిత్ 21; జడేజా (సి) మిల్లర్ (బి) రషీద్ 18; ధోని (నాటౌట్) 26; సాన్‌ట్నర్ (బి) రషీద్ 0; శార్దుల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–10, 4–119, 5–135, 6–165, 7–169, 8–169. బౌలింగ్: ఉమేశ్ 3–0–20–1, సందీప్ వారియర్ 3–0–28–1, త్యాగి 4–0–51–0, నూర్ అహ్మద్ 2–0–25–0, రషీద్ ఖాన్ 4–0–38–2, మోహిత్ 4–0–31–3. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ముంబై వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గుజరాత్ విజయ భేరి మ్రోగించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మొయిన్ అలీ(56) పరుగులతో రాణించినప్పటికి మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో సీఎస్కే ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, సందీప్ వారియర్, ఉమేశ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.సాయి, గిల్ విధ్వంసం..అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్‌పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. -
CSK Vs GT: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
గుజరాత్ టైటన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సాయిసుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సుదర్శన్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించాడు. గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(104) కూడా సెంచరీ చేశాడు.సచిన్ రికార్డు బద్దలు..ఇక మ్యాచ్‌లో సుదర్శన్ సెంచరీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు.సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది.సచిన్, గైక్వాడ్ ఇద్దరూ 1000 పరుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో వీరిద్దరి ఆల్‌టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్‌స్టోన్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు. -
CSK Vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సాయి.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్‌లో గిల్, సాయి సుదర్శన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. సీఎస్కే బౌలర్లను వీరిద్దరూ ఓ ఆట ఆడుకున్నారు.51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్‌పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సాయిసుదర్శన్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. Shubman Gill is one of the most aesthetic batsman in the world right now, what a hundred by Gujarat Titans captain ⭐❤️pic.twitter.com/iJZRy0VPDC— Shubman Gang (@ShubmanGang) May 10, 2024 -
సీఎస్కేతో గుజరాత్ కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కీలక పోరుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ గ్లీసన్ స్ధానంలో కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర వచ్చాడు. మరోవైపు గుజరాత్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. లిటిల్, వృద్దిమాన్ సాహా స్ధానంలో మాథ్యూ వేడ్, కార్తీక్ త్యాగీ వచ్చారు. కాగా గుజరాత్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. పాయింట్ల పట్టికలో సీఎస్కే నాలుగో స్ధానంలో ఉండగా.. గుజరాత్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయిసుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగిచెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్ -
MS Dhoni: ధోనిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది. చదవండి: Mohammed Shami Slams LSG Owner: కాస్తైనా సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా? -
సీఎస్కేతో పోరు.. గుజరాత్ గెలిచేనా?
-
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
-
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్‌కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్‌ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్‌ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్‌శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్‌కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్‌వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్‌కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్‌కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన పరిచాడు.కళ్లు చెదిరే త్రోతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను రనౌట్ చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన విజయ్ కుమార్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడాడు.అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న షారూఖ్ ఖాన్ క్విక్ సింగిల్ కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ స్ట్రైక్‌లో ఉన్న తెవాటియా మాత్రం నో అంటూ వెనుక్కి వెళ్లమని కాల్ ఇచ్చాడు. అయితే షారూఖ్ ఖాన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్ బౌలర్ ఎండ్‌లో స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ రిఫర్ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్‌గా తేలింది. కోహ్లి సంచలన త్రో చూసిన అందరూ బిత్తరపోయారు. కామెరాన్ గ్రీన్ అయితే కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
ఐపీఎల్-2024లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(2), వృద్దిమాన్ సహా(1) తీవ్ర నిరాశపరిచారు. వీరిద్దరితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయిసుదర్శన్(6) పరుగులు చేశాడు. 19 పరుగులకే 3 విట్లుల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రమంలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), గుజరాత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరితో పాటు రాహుల్ తెవాటియా(35) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. -
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టులోకి మానవ్ సుత్తార్, జౌషువా లిటిల్ వచ్చారు. కాగా కాగా మానవ్ సత్తార్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ ఆర్సీబీ చాలా ముఖ్యం. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో పదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ -
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
-
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్‌కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్‌ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్‌నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్‌వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ఢిల్లీ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో కోహ్లికి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే తన స్ట్రైక్ రేటుపై విమర్శల చేస్తున్న వారికి కోహ్లి గట్టి కౌంటిరిచ్చాడు."నా స్ట్రైక్ రేట్, ఆట గురించి మాట్లాడే వ్యక్తుల గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే జట్టు కోసం, మ్యాచ్ గెలవడానికి ఏమో చేయాలో నాకు తెలుసు. జట్టులో నా పాత్రపై నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఆడే జట్టును గెలిపించడానికి 100 శాతం ఎఫెక్ట్ పెడతాను గత 15 ఏళ్లగా అదే చేస్తున్నాను. ఎక్కడో కూర్చోని మాట్లాడేవారు ఏదైనా మాట్లాడతారు. కాబట్టి వ్యక్తిల స్వంత ఆలోచనలు, వారి ఊహలతో నాకు సంబంధం లేదు. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడమే నా లక్ష్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కోహ్లి పేర్కొన్నాడు. -
విల్ జాక్స్ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్ సునామీ ఇన్నింగ్స్ ముందు విరాట్ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్ (12 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్ వేసిన 15వ ఓవర్లో 29 పరుగులు, రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్ దెబ్బకు గుజరాత్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్ వికెట్ సాయికిషోర్‌కు దక్కింది.అంతకుముందు టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
గ్రీన్ సూపర్ క్యాచ్.. గిల్‌ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024: గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్.. విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లకు ముందు ఫామ్ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్‌ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్‌పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్‌ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్‌రైజర్స్ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
T20 WC: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటివ్వకపోతే..: శుబ్‌మన్ గిల్
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియాలో తన స్థానం గురించి యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ మీదనే ఉందని.. గుజరాత్ టైటాన్స్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పాడు.ఒకవేళ ఐసీసీ టోర్నీ ఆడే భారత జట్టులో తనకు చోటు దక్కకున్నా.. సహచర ఆటగాళ్లను చీర్ చేస్తూ వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తానని గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే.. టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా జట్టును వీడాడు.టైటాన్స్ కెప్టెన్‌గా కొత్త బాధ్యతలుముంబై ఇండియన్స్ గూటికి చేరి కెప్టెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం శుబ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అతడి సారథ్యంలో టైటాన్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక వ్యక్తిగతంగానూ శుబ్‌మన్ గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. గత సీజన్లో 17 ఇన్నింగ్స్ ఆడి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఈసారి 9 ఇన్నింగ్స్‌లో కలిపి 304 పరుగులు చేశాడు.రోహిత్‌కు జోడీగా విరాట్ కోహ్లిఇదిలా ఉంటే.. మే 26న ఐపీఎల్-2024కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మే 1 నాటికి జట్లను ఖరారు చేయాలని ఐసీసీ ఈ ఈవెంట్లో పాల్గొనే 20 దేశాల బోర్డులను ఆదేశించింది.ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడుతూ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.గత సీజన్లో దాదాపు 900 రన్స్ చేసినా.. చోటివ్వకపోతే‘‘టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక అవుతానా లేదా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఐపీఎల్లో నా ఫ్రాంఛైజీ నన్ను నమ్మి కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు నా మొదటి ప్రాధాన్యం గుజరాత్ టైటాన్స్.. ఈ జట్టుతో ముడిపడిన ఆటగాళ్లు మాత్రమే. అదే విధంగా నా జట్టు కోసం ఓ బ్యాటర్‌గా వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని భావిస్తున్నా. ఇక ఆటగాడిగా నేను సొంతగడ్డపై టీమిండియా ఆడిన వన్డే వరల్డ్‌కప్ నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం ఎంతటి అదృష్టమో తెలుసుకోగలిగాను.ఫామ్‌లో ఉన్న కోహ్లిఅయితే, గత ఐపీఎల్ సీజన్లో దాదాపుగా 900 పరుగులు చేసిన నాకు జట్టులో చోటు దక్కకపోతే నేనేమీ చేయలేను. సహచర ఆటగాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తప్ప’’ అని శుబ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు. కాగా విరాట్ కోహ్లి ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.చదవండి: Virat Kohli: చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్! వీడియో వైరల్ -
DC Vs GT: ఓడినా సంతృప్తిగానే ఉంది.. కానీ: శుబ్‌మన్ గిల్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడినా ఆఖరి వరకు తాము పట్టుదలగా పోరాడిన తీరు సంతృప్తినిచ్చిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అన్నాడు. చివరి వరకు తాము గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నామని అయితే.. దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాలేదని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ బుధవారం ఢిల్లీతో తలపడింది. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఢిల్లీ కెప్టెన్ పంత్ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో ఏకంగా 88 పరుగులతో అజేయంగా నిలిచాడు.No Rishabh Pant fan will scroll without liking this tweet. ❤️ pic.twitter.com/AwcmRcnD1u— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐌𝐀𝐗𝐖𝐄𝐋𝐋 (@ProfKohli18) April 24, 2024వన్‌డౌన్ బ్యాటర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(43 బంతుల్లో 66) సైతం బ్యాట్ ఝులిపించాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26*) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(39), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(39 బంతుల్లో 65) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. డేవిడ్ మిల్లర్(23 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టి టైటాన్స్ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో దిగిన రషీద్ ఖాన్(11 బంతుల్లో 21*) పట్టుదలగా నిలబడ్డాడు. ఆఖరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4,4,(0), (0), 6 రాబట్టాడు.ఈ క్రమంలో ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. రషీద్ పరుగు తీయలేకపోయాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ గుజరాత్‌పై జయభేరి మోగించింది.So which side do you relate to after that fascinating finish- 😁 or 😕?What a game THAT in Delhi! 👏👏Scorecard ▶️ https://t.co/48M4ajbLuk#TATAIPL | #DCvGT pic.twitter.com/SuO21S3DWF— IndianPremierLeague (@IPL) April 24, 2024ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మేము చాలా బాగా ఆడాం. అయితే, ఓడిపోవడం మాత్రం బాధగానే ఉంది. అయినా.. పట్టుదలగా ఆఖరి వరకు పోరాడినందుకు సంతృప్తిగా ఉంది.అసలు మాకు ఓటమి ఎదురవుతుందని ఏ దశలోనూ అనుకోలేదు. 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే వెళ్లి హిట్టింగ్ ఆడటం ఒక్కటే మార్గం. అంతకు మించి ప్రణాళికలు ఏముంటాయి?కారణం అదేనిజానికి వాళ్లను 200- 210 పరుగులకే కట్టడి చేస్తామనుకున్నాం. అయితే, 2-3 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం ప్రభావం చూపింది. ఇది చిన్న గ్రౌండ్. ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది. బెస్ట్ ఫినిషర్ క్రీజులో ఉన్నపుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నాడు.చదవండి: #SRHvRCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్! మామ మనోడే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
DC Vs GT: ఇదేమి అంపైరింగ్.. పృథ్వీ షాది ఔటా? నాటౌటా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. ప్రస్తుతం పృథ్వీ షా ఔట్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.అసలేం జరిగిందంటే?ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన సందీప్ వారియర్ ఐదో బంతిని పృథ్వీ షాకు షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని పృథ్వీ షా పుల్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి నూర్ అహ్మద్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.దీంతో గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ ఫీల్డ్ అంపైర్లు క్లీన్ క్యాచ్ అవునా కాదా అనే సందేహంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి బంతి కింద చేతి వేళ్లు ఉన్నయాని తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే రిప్లేలో బంతి గ్రౌండ్‌కు టచ్ అయినట్లు కన్పించినప్పటికి అంపైర్ మాత్రం క్లీన్ క్యాచ్‌గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.కామెంటెటర్లు ఆకాష్ చోప్రా, పార్థివ్ పటేల్ సైతం క్యాచ్‌ను అందుకునే సమయంలో బంతి నేలను తాకిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చెత్త అంపైరింగ్.. అది క్లియర్‌గా నాటౌట్ అని కామెంట్లు చేస్తున్నారు. Woah 🔥🔥Noor Ahmad holds on to a sharp catch in the deep as #DC lose both their openers!Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT pic.twitter.com/8zmIDwCdf2— IndianPremierLeague (@IPL) April 24, 2024 -
DC Vs GT: మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక స్పెల్(నాలుగు ఓవర్లు)లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మోహిత్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు.తద్వారా మోహిత్ శర్మ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత బౌలర్ బసిల్ థంపి పేరిట ఉండేది. ఐపీఎల్-2018 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన బసిల్ థంపి.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన 4 ఓవర్ల కోటాలో 70 పరుగులిచ్చాడు. తాజా మ్యాచ్‌తో థంపిని మోహిత్ అధిగమించాడు.కాగా ఈ మ్యాచ్‌లో 20 ఓవర్ వేసిన మోహిత్ బౌలింగ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్(88)తో పాటు అక్షర్ పటేల్(66), స్టబ్స్(26) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. -
DC Vs GT: రిషబ్ పంత్ విధ్వంసం.. ఏకంగా 8 సిక్స్‌లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టించాడు. ఆఖరి ఓవర్ వేసిన మొహిత్ శర్మకు అయితే పంత్ చుక్కలు చూపించాడు.ఢిల్లీ ఇన్నింగ్స్ 20 ఓవర్లో పంత్ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు వరల్డ్కప్న్కు పంత్ రెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్‌తో పాటు అక్షర్ పటేల్(66), స్టబ్స్(26) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. No Rishabh Pant fan will scroll without liking this tweet. ❤️ pic.twitter.com/AwcmRcnD1u— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐌𝐀𝐗𝐖𝐄𝐋𝐋 (@ProfKohli18) April 24, 2024 -
DC Vs GT: ఐపీఎల్లో ఇవాల్టి (APR 24) సమరం.. గుజరాత్‌తో తలపడనున్న ఢిల్లీ
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 24) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఢిల్లీ తమ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌ను ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్‌లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంది. గుజరాత్‌కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా పర్లేదు కానీ, ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్‌లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోనే కావడం విశేషం.బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఢిల్లీతో పోలిస్తే గుజరాత్ ఒకింత మెరుగ్గా కనిపిస్తుంది. తెవాతియా, రషీద్ ఖాన్ కీలక సమయాల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సాయి కిషోర్ బంతితో పర్వాలేదనిపిస్తున్నారు. గిల్, మిల్లర్ సామర్థ్యం మేరకు రాణించాల్సి ఉంది.ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తుంది. రియాల్టీలోకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా తేలిపోతుంది. వార్నర్ లాంటి సీనియర్ ఫామ్‌లో లేకపోవడం ఢిల్లీకి పెద్ద మైనస్‌గా మారింది. పృథ్వీ షాకు మంచి ఆరంభాలు లభిస్తున్నా అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకుంటున్నాడు. కొత్త ఆటగాడు జేక్ ఫ్రేసర్, రిషబ్ పంత్ బ్యాటింగ్ మెరుపులు ఢిల్లీకి ఊరట కలిగిస్తున్నాయి.ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే వీరిద్దరి కాంట్రిబ్యూషన్ చాలా కీలకం. బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్, అక్షర్ మినహా ఎవరూ రాణించలేకపోతున్నారు. నోర్జే అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ ఢిల్లీ ఓటముల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ పర్వాలేదనిపిస్తున్నా వీరి నుంచి పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. మొత్తంగా చూస్తే.. ఢిల్లీపై గుజరాత్‌కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ -
IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టనున్న శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 24) జరుగబోయే మ్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయిని తాకనున్నాడు. ఈ మ్యాచ్ గిల్‌కు ఐపీఎల్లో 100వ మ్యాచ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 64 మంది 100 మ్యాచ్‌లు ఆడగా.. గిల్ 65వ ఆటగాడు కానున్నాడు.2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న గిల్.. 2021 వరకు కేకేఆర్ తరఫున, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. గిల్ తన 99 మ్యాచ్‌ల కెరీర్లో 135.2 స్ట్రయిక్‌రేట్‌తో 38.1 సగటున 3088 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2022 సీజన్ టైటిల్ విన్నింగ్ జట్టులో (గుజరాత్) భాగమైన గిల్.. 2023 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన నాకౌట్లో గిల్ మెరుపు సెంచరీతో మెరిశాడు.కాగా, నేటి మ్యాచ్‌లో గుజరాత్ ఢిల్లీని వారి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్‌లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. గుజరాత్‌కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరి రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్‌లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోనే కావడం విశేషం. -
IPL 2024 DC Vs GT: ప్రచండ పంత్...
ఐపీఎల్లో మరో మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని కూడా గుజరాత్ టైటాన్స్ ఛేదించేలా కనిపించింది. అయితే చివరకు క్యాపిటల్స్‌దే పైచేయి కాగా... టోర్నీలో మ్యాచ్ మ్యాచ్‌కూ పదునెక్కుతున్న బ్యాటింగ్‌తో రిషభ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం ఈ పోరులో హైలైట్‌గా నిలిచింది. న్యూఢిల్లీ: చివరి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకొని ఊపిరి పీల్చుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిషభ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో 113 పరుగులు జోడించడం విశేషం. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసి ఓడిపోయింది. సాయి సుదర్శన్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... జేక్ ఫ్రేజర్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి దూకుడైన ఆటతో ఢిల్లీకి శుభారంభం అందించాడు. అయితే 9 పరుగుల వ్యవధిలో ఫ్రేజర్‌తో పాటు పృథ్వీ షా (11), షై హోప్ (5) వెనుదిరిగారు. మూడో స్థానానికి ప్రమోట్ అయిన అక్షర్ దూకుడైన షాట్లతో ఆకట్టుకోగా, ఆ తర్వాత పంత్ తన జోరు ప్రదర్శించాడు. 37 బంతుల్లో అక్షర్ అర్ధసెంచరీ పూర్తయింది.నూర్ అహ్మద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అక్షర్ తర్వాతి బంతిని అదే తరహాలో ఆడే ప్రయత్నంలో వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం మోహిత్ శర్మ బౌలింగ్‌లో సిక్స్‌తో 34 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. సాయికిశోర్ వేసిన 19వ ఓవర్లో స్టబ్స్ వరుసగా 4, 6, 4, 6 బాదడంతో చెలరేగడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. సుదర్శన్ అర్ధసెంచరీ... భారీ ఛేదనలో ఆరంభంలోనే గుజరాత్ కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (6) వెనుదిరిగినా... సాహా, సాయి సుదర్శన్ కలిసి దూకుడుగా ఆడారు. వీరిద్దరు 49 బంతుల్లోనే 82 పరుగులు జత చేశారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ విడదీసిన తర్వాత టైటాన్స్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిల్లర్ కొన్ని మెరుపు షాట్లు ఆడటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.నోర్జే ఓవర్లో అతను 3 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు. అయితే అతను వెనుదిరిగాక గుజరాత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరంకాగా... ముకేశ్ వేసిన ఈ ఓవర్లో రషీద్ ఖాన్ 16 పరుగులే సాధించడంతో టైటాన్స్ ఓటమి ఖరారైంది. ఒకే ఓవర్లో 31 పరుగులు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసేసరికే దూకుడు పెంచిన పంత్ చివరి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. మోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి 2 పరుగులు రాగా, తర్వాతి బంతి వైడ్ అయింది.అయితే ఆ తర్వాత పంత్ వరుసగా 6, 4, 6, 6, 6తో తన సత్తా చూపాడు. దాంతో ఈ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బకు మోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు (4 ఓవర్లలో 73) ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో బాసిల్ థంపి (70) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. మోహిత్ 7 సిక్స్‌లు ఇవ్వగా అన్నీ పంత్ కొట్టినవే! స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) నూర్ (బి) సందీప్ 11; జేక్ ఫ్రేజర్ (సి) నూర్ (బి) సందీప్ 23; అక్షర్ (సి) సాయికిశోర్ (బి) నూర్ 66; హోప్ (సి) రషీద్ (బి) సందీప్ 5; పంత్ (నాటౌట్) 88; స్టబ్స్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–35, 2–36, 3–44, 4–157. బౌలింగ్: అజ్మతుల్లా 4–0–33–0, సందీప్ వారియర్ 3–0–15–3, రషీద్ ఖాన్ 4–0–35–0, నూర్ అహ్మద్ 3–0–36–1, మోహిత్ శర్మ 4–0–73–0, షారుఖ్ ఖాన్ 1–0–8–0, సాయికిశోర్ 1–0–22–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) అక్షర్ (బి) కుల్దీప్ 39; గిల్ (సి) అక్షర్ (బి) నోర్జే 6; సుదర్శన్ (సి) అక్షర్ (బి) సలామ్ 65; అజ్మతుల్లా (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 1; మిల్లర్ (సి) సలామ్ (బి) ముకేశ్ 55; షారుఖ్ (సి) పంత్ (బి) సలామ్ 8; తెవాటియా (సి) పంత్ (బి) కుల్దీప్ 4; రషీద్ (నాటౌట్) 21; సాయికిశోర్ (బి) సలామ్ 13; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–13, 2–95, 3–98, 4–121, 5–139, 6–152, 7–181, 8–206. బౌలింగ్: ఖలీల్ 2–0–26–0, నోర్జే 3–0–48–1, సలామ్ 4–0–44–3, ముకేశ్ 4–0–41–1, అక్షర్ 3–0–28–1, కుల్దీప్ 4–0–29–2. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X బెంగళూరు వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్‌కు బీసీసీఐ మందలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ రసీఖ్ సలాం దర్‌ను బీసీసీఐ మందలించింది. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతి చేసినందుకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం చేయకూడదని హెచ్చరించింది.కాగా ఢిల్లీ వేదికగా టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రసీఖ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్ పేసర్ 44 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. సాయి సుదర్శన్(39 బంతుల్లో 65), షారుఖ్ ఖాన్(8), రవిశ్రీనివాసన్ సాయి కిషోర్(13)లను అవుట్ చేశాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ప్రమాదకారిగా మారుతున్న సాయి సుదర్శన్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా రసీఖ్ మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. అలా ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు 24 ఏళ్ల ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్.అయితే, వికెట్ తీసిన ప్రతిసారీ రసీఖ్ కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో బీసీసీఐ అతడిని మందలించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈమేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గుజరాత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఎనిమిది వికెట్లు నష్టపోయి 220 పరుగుల వద్ద నిలిచి ఓటమి పాలైంది. -
IPL 2024 DC vs GT: ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓటమి..
IPL 2024 DC vs GT Live Updates:ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓటమి..అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోరి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. రషీద్ ఖాన్ 14 పరుగులు మాత్రమే రాబట్టాడు. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(65) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(55), వృద్దిమాన్ సాహా(39) తమ వంతు ప్రయత్నం చేశారు. ఢిల్లీ బౌలర్లలో రాసిఖ్ ధార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, నోర్జే తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. పంత్‌తో పాటు అక్షర్ పటేల్(66) పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్..డేవిడ్ మిల్లర్ రూపంలో గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిల్లర్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 37 పరుగులు కావాలి.17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 176/617 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్(51), రషీద్ ఖాన్(0) ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..షారూఖ్ ఖాన్ రూపంలో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన షారూఖ్..రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్ ఖాన్ వచ్చాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 147/5నాలుగో వికెట్ డౌన్..121 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్ ఖాన్ వచ్చాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 139/4మూడో వికెట్ డౌన్..ఒమర్జాయ్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఒమర్జాయ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(59), మిల్లర్(2) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..95 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు వృద్దిమాన్ సహా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఒమర్జాయ్ వచ్చాడు.3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 41/13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో వృద్దిమాన్ సహా(26), సాయిసుదర్శన్(8) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. నోర్జే బౌలింగ్‌లో ఔటయ్యాడు.రిషబ్ పంత్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ 225 పరుగులుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. పంత్‌తో పాటు అక్షర్ పటేల్(66) పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు.19 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 193/419 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(58), స్టబ్స్(26) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్..157 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 157/4. క్రీజులో రిషబ్ పంత్(48), స్టబ్స్ పరుగులతో ఉన్నారు.అక్షర్ పటేల్ ఫిప్టీ..15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. అక్షర్ కేవలం 37 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్రీజులో అక్షర్ పటేల్(50), రిషబ్ పంత్(34) పరుగులతో ఉన్నారు.ఢిల్లీ మూడో వికెట్ డౌన్.. హోప్ ఔట్హోప్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హోప్.. సందీప్ వారియన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఢిల్లీ మూడు వికెట్లు నష్టపోయి 68 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(19), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్పృథ్వీ షా రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన పృథ్వీషా.. సందీప్ వారియర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఢిల్లీ రెండు వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. మెక్ గర్క్ ఔట్34 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఫ్రేజర్ మెక్‌గర్క్.. సందీప్ వారియర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ -
IPL 2024: ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత విన్యాసం.. ఇదే ఢిల్లీని గెలిపించింది..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 24) జరిగిన రసవత్తర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి రిషబ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు, 2 క్యాచ్‌లు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3 క్యాచ్‌లు, 3-0-28-1) ప్రత్యక్షంగా దోహదపడితే.. ట్రిస్టన్ స్టబ్స్ పరోక్షంగా ఢిల్లీ గెలుపుకు కారణమయ్యాడు. This blinder from Tristan Stubbs saved 5 runs for Delhi Capitals🔥They won the match in 4 runs!Stubbs hero for capitals..David Miller & Rashid khan, you can love to watch them any day❤️Rishabh Pant#GTvsDC #IPL2024 pic.twitter.com/UwJKCIS0Wn— Rakesh_sundarRay (@RSundarRay) April 24, 2024 ఛేదనలో గుజరాత్ లక్ష్యం దిశగా పయనిస్తుండగా (11 బంతుల్లో 32 పరుగులు).. స్టబ్స్ అద్భుత విన్యాసం చేసి సిక్సర్ వెళ్లాల్సిన బంతిని (18.2వ ఓవర్: రసిక్ సలాం బౌలింగ్‌లో రషీద్ ఖాన్ కొట్టిన షాట్) ఆపాడు. ఫలితంగా ఢిల్లీకి ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. ఇంచుమించు ఇదే తేడాతో (4 పరుగులు) ఢిల్లీ గుజరాత్‌పై విజయం సాధించింది. స్టబ్స్ తన అద్భుత ప్రయత్నంతో ఢిల్లీని గెలిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.స్టబ్స్ సూపర్ మ్యాన్ ఎఫర్ట్‌ను అంతా మెచ్చుకుంటున్నారు. భారీ స్కోర్లు చేసినా చేయకపోయినా ఇలాంటి ప్రయత్నాలే మ్యాచ్‌లు గెలిపిస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఈ మ్యాచ్‌లో స్టబ్స్ బ్యాట్‌తోనూ రాణించాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి (7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు నాటౌట్) రిషబ్ పంత్‌తో కలిసి వీరబాదుడు బాదాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ (3-0-15-3) ఒక్కడే రాణించాడు. మోహిత్ శర్మ (4-0-73-0) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడింది. సాహా (39), సాయి సుదర్శన్ (65), మిల్లర్ (55), రషీద్ ఖాన్ (21 నాటౌట్), సాయికిషోర్ (13 నాటౌట్) గుజరాత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో స్టబ్స్ అద్భుత ప్రయత్నం గుజరాత్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది. రషీద్ కొట్టిన ఆ షాట్ సిక్సర్ అయ్యుంటే గుజరాత్ ఈ మ్యాచ్ తప్పక గెలిచుండేది.అంతిమంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలాం (4-0-44-3), కుల్దీప్ యాదవ్ (4-0-29-2), అక్షర్ పటేల్ (3-0-28-1), నోర్జే (3-0-48-1), ముకేశ్ కుమార్ (4-0-41-1) వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ ఆరో స్థానానికి జంప్ కొట్టింది. గుజరాత్ ఏడో ప్లేస్‌లో నిలిచింది. -
PBKS vs GT: గెలుపు ఎవరిది?
-
అహ్మదాబాద్‌లో టైటాన్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ
-
ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్‌గానూ..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆ జట్టు అసిస్టెంట్ జేమ్స్ హోప్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్ అంటూ కొనియాడాడు. కెప్టెన్‌గానూ రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడని సంతోషం వ్యక్తం చేశాడు. కారు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతున్న పంత్ ఫిట్‌నెస్‌పై ఆదిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ వికెట్ కీపర్‌గా.. బ్యాటర్‌గా అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు పంత్. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకున్న పంత్.. ఢిల్లీకి అద్బుత విజయం అందించాడు. అహ్మదాబాద్‌లో టాస్ గెలిచిన పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఢిల్లీ బౌలర్లు సంచలన ప్రదర్శనతో చెలరేగారు. సమిష్టి కృషితో గుజరాత్‌ను కేవలం 89 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు. ఇక 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో విజయం అందుకుంది. ఈ గెలుపులో కెప్టెన్‌గా.. వికెట్ కీపర్‌గా.. బ్యాటర్‌గా రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. Ek haath hi kaafi hai 🧤 From one-handed sixes to one-handed catches, Rishabh Pant can do it all 🤩#GTvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/1JZEuLiL5T — JioCinema (@JioCinema) April 17, 2024 అద్బుత రీతిలో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంపింగ్‌లతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా.. 11 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో జేమ్స్ హోప్స్ మాట్లాడుతూ.. ‘‘పంత్ కీపింగ్ చేస్తున్నాడు. అది కూడా అద్బుతంగా! గతేడాది అతడు లేని లోటు మాకు బాగా తెలిసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్.. వరల్డ్‌క్లాస్ ప్లేయర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయగలం. అయితే, ఇప్పుడు అతడు తిరిగి వచ్చాడు. కీపింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్సీ పరంగానూ రాటుదేలుతున్నాడు. బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా పంత్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి 210 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే టైటాన్స్‌పై విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడింట గెలిచి ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉంది. తదుపరి ఏప్రిల్ 20న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీలో తలపడనుంది. Pant doing what he does the best 💥🚀#GTvDC #TATAIPL #IPLonJioCinema #IPLinHaryanvi pic.twitter.com/JdB3AndtPB — JioCinema (@JioCinema) April 17, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్కరైనా డబుల్ హ్యాట్రిక్ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే!
IPL 2024 GT vs DC: రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో చెత్త ప్రదర్శన కనబరిచింది. ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయి.. క్యాష్ రిచ్ లీగ్‌లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఇక 90 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 8.5 ఓవర్లలోనే పని పూర్తి చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. మా ఓటమికి కారణం అదే ‘‘పిచ్ బాగానే ఉంది. కానీ మా బ్యాటింగే అత్యంత సాధారణంగా ఉంది. షాట్ సెలక్షన్ లోపాల వల్లే వరుసగా వికెట్లు కోల్పోయాం. ప్రత్యర్థి జట్టు 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మాలో ఎవరో ఒక బౌలర్ డబుల్ హ్యాట్రిక్ తీస్తేనే గానీ ఫలితం ఉండదు. లేదంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టునే విజయం వరిస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది’’ అని పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు గిల్. ఈ ఘోర పరాభవం నుంచి వీలైనంత తొందరగా కోలుకుని తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతామని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘ఇప్పటి వరకు సగం మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. ఇంకో ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికి మూడు గెలిచాం. గత రెండేళ్లుగా గెలిచినట్లే సెకండాఫ్‌లో 5-6 మ్యాచ్‌లు గెలవగలమనే అనుకుంటున్నా’’ అని శుబ్‌మన్ గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు: ►వేదిక: అహ్మదాబాద్... గుజరాత్ ►టాస్: ఢిల్లీ- బౌలింగ్ ►గుజరాత్ స్కోరు: 89 (17.3) ►ఢిల్లీ స్కోరు: 92/4 (8.5) ►ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషభ్ పంత్(రెండు క్యాచ్‌లు.. రెండు స్టంపింగ్స్.. 11 బంతుల్లో 16 రన్స్- నాటౌట్). Ensuring a quick finish, ft Rishabh Pant & Sumit Kumar 🙌 A comprehensive all-round performance from Delhi Capitals helps them register their 3️⃣rd win of the season 😎 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvDC pic.twitter.com/c2pyHArwE7 — IndianPremierLeague (@IPL) April 17, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 GT vs DC: ఢిల్లీ అదరహో...
వరుస మ్యాచ్‌లలో పరుగుల వరదతో ముంచెత్తుతున్న ఐపీఎల్లో ఎట్టకేలకు ఒక స్వల్ప స్కోర్ల పోరు... బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ బ్యాటర్ల పని పట్టిన సమయం... మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 100 పరుగులు కూడా చేయలేక కుప్పకూలిన చోట... కేవలం 53 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆనందం... రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు వేగంగా ఆడే ప్రయత్నంలో నాలుగు వికెట్లు కోల్పోయినా... చివరకు ఢిల్లీ సునాయాసంగా గెలుపు గీత దాటింది. అహ్మదాబాద్: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ టోర్నీలో టైటాన్స్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. రషీద్ ఖాన్ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇచ్చిన శుభారంభంతో గెలుపునకు పునాది పడింది. చక్కటి కెపె్టన్సీతో పాటు 2 క్యాచ్‌లు, 2 స్టంపింగ్‌లు చేసిన రిషభ్ పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రాణించిన ఇషాంత్... ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రషీద్ కొద్దిసేపు పోరాడటం మినహా గుజరాత్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. ఆసాంతం పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన జట్టు... వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ తన తొలి ఓవర్లోనే కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (8)ను వెనక్కి పంపి శుభారంభం అందించగా, ఒకే స్కోరు వద్ద సాహా (2), సాయి సుదర్శన్ (12) వెనుదిరిగారు. ఇషాంత్ బౌలింగ్‌లోనే పంత్ చక్కటి క్యాచ్‌తో డేవిడ్ మిల్లర్ (2) అవుట్ కావడంతో పవర్‌ప్లేను టైటాన్స్ 30/4 వద్ద ముగించింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్ స్టబ్స్ కూడా తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీయడంతో గుజరాత్ పరిస్థితి మరింత దిగజారింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రషీద్ కొన్ని పరుగులు జోడించడంలో సఫలమయ్యాడు. ఆశలు పెట్టుకున్న రాహుల్ తెవాటియా (10)ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా మిగతా బ్యాటర్ల ఆట లాంఛనమే అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కొంత తడబడినా చివరకు ఢిల్లీ ఎలాంటి ప్రమాదం లేకుండా మ్యాచ్‌ను ముగించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) ముకేశ్ 2; గిల్ (సి) షా (బి) ఇషాంత్ 8; సుదర్శన్ (రనౌట్) 12; మిల్లర్ (సి) పంత్ (బి) ఇషాంత్ 2; మనోహర్ (స్టంప్డ్) పంత్ (బి) స్టబ్స్ 8; తెవాటియా (ఎల్బీ) (బి) అక్షర్ 10; షారుఖ్ (స్టంప్డ్) పంత్ (బి) స్టబ్స్ 0; రషీద్ (సి) పంత్ (బి) ముకేశ్ 31; మోహిత్ (సి) సుమీత్ (బి) ఖలీల్ 2; నూర్ (బి) ముకేశ్ 1; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 89. వికెట్ల పతనం: 1–11, 2–28, 3–28, 4–30, 5–47, 6–48, 7–66, 8–78, 9–88, 10–89. బౌలింగ్: ఖలీల్ 4–1– 18–1, ఇషాంత్ 2–0–8–2, ముకేశ్ కుమార్ 2.3–0–14–3, కుల్దీప్ 4–0–16–0, స్టబ్స్ 1–0– 11–2, అక్షర్ పటేల్ 4–0–17–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) జాన్సన్ (బి) సందీప్ 7; జేక్ ఫ్రేజర్ (సి) మనోహర్ (బి) జాన్సన్ 20; పొరేల్ (బి) సందీప్ 15; హోప్ (సి) మోహిత్ (బి) రషీద్ 19; పంత్ (నాటౌట్) 16; సుమీత్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (8.5 ఓవర్లలో 4 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–65, 4–67. బౌలింగ్: సందీప్ వారియర్ 3–0–40–2; స్పెన్సర్ జాన్సన్ 2–0–22–1, రషీద్ ఖాన్ 2–0–12–1, నూర్ అహ్మద్ 1.5–0–14–0. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ముంబై వేదిక: ముల్లాన్‌పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: నిప్పులు చెరిగిన ఢిల్లీ బౌలర్లు.. గుజరాత్‌కు ఘోర పరాభవం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1), కుల్దీప్ యాదవ్ (4-0-16-0) ధాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. జేక్ ఫ్రేసర్ 20, పృథ్వీ షా 7, అభిషేక్ పోరెల్ 15, షాయ హోప్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. రిషబ్ పంత్ (16), సుమిత్ కుమార్ (9) ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. Rishabh Pant's SIX against Rashid Khan. - THE VINTAGE, PANT. 🔥 pic.twitter.com/27dPB38fi9 — CricketMAN2 (@ImTanujSingh) April 17, 2024 రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లతో పాటు 16 పరుగులు చేసిన పంత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బంతుల పరంగా ఢిల్లీకి ఇది అతి భారీ విజయం. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మరో 67 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. Rishabh Pant won the player of the match award. - CAPTAIN PANT LEADS BY EXAMPLE. pic.twitter.com/Wz5Bc5wDeY — CricketMAN2 (@ImTanujSingh) April 17, 2024 గుజరాత్ చెత్త రికార్డులు.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ 100లోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 2024 సీజన్లో ఓ జట్టు 100లోపు ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేసిన 89 పరుగుల స్కోర్.. ఇపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ ఇదే అత్యల్ప టీమ్ స్కోర్ -
ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. ఐపీఎల్లో అత్యల్ప స్కోర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగి, ఆ జట్టును కకావిలకలం చేసింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1), కుల్దీప్ యాదవ్ (4-0-16-0) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. గుజరాత్ చెత్త రికార్డు.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ 100లోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 2024 సీజన్లో ఓ జట్టు 100లోపు ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేసిన 89 పరుగుల స్కోర్.. ఇపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ ఇదే అత్యల్ప టీమ్ స్కోర్ Delhi Capitals bowling unit wrapping up GT for just 89. 💥 - Captain Rishabh Pant and his army are dominating in Ahmedabad. pic.twitter.com/jS31TQyI1b — Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2024 -
IPL 2024: గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ
గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 89 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 65 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. సందీప్ వారియర్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఢిల్లీ 90 బంతుల్లో 25 పరుగులు చేస్తే గెలుస్తుంది రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 6 బంతుల్లో 7 పరుగులు చేసి పృథ్వీ షా ఔటయ్యాడు. సందీప్ వారియర్ బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి షా పెవిలియన్ బాట పట్టాడు. టార్గెట్ 90.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 10 బంతుల్లో 20 పరుగులు చేసి ఫ్రేసర్ ఔటయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి ఫ్రేసర్ పెవిలియన్‌కు చేరాడు. టార్గెట్ 90.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 90 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ ఫ్రేసర్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 2 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. 1.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 25/0గా ఉంది. ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్ 66 పరుగుల వద్ద గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ 48 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 9వ ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్‌లను (0) రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 61/6గా ఉంది. రషీద్ ఖాన్ (12), రాహుల్ తెవాటియా (8) క్రీజ్‌లో ఉన్నారు. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ గుజరాత్ టైటాన్స్ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ 4.1వ ఓవర్: మూడు బంతుల వ్యవధిలో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ ఐదో బంతికి ముకేశ్ కుమార్ సాహాను (2) క్లీన్ బౌల్డ్ చేయగా.. ఐదో ఓవర్ తొలి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు. 4.5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 30/3గా ఉంది. డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 1.5వ ఓవర్: 11 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (8) ఔటయ్యాడు. సాహా, సాయి సుదర్శన్ క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. తుది జట్లు.. గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, స్పెన్సర్ జాన్సన్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ -
ఐపీఎల్లో ఇప్పటివరకు ఎన్ని సూపర్ ఓవర్లు జరిగాయో తెలుసా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మ్యాచ్‌లు తుది బంతి వరకు వచ్చినప్పటికీ సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఈ సీజన్లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తున్నా ఒక్కటంటే ఒక్క సూపర్ ఓవర్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన సూపర్ ఓవర్లపై ఓ లుక్కేద్దాం. క్యాష్ రిచ్ లీగ్‌లో నేటి వరకు (ఏప్రిల్ 17) మొత్తం 15 సూపర్ ఓవర్లు జరిగాయి. 2020 సీజన్లో అత్యధికంగా 5 సూపర్ ఓవర్లు జరుగగా.. అదే సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు (ఒక దాంట్లో ఫలితం రాకపోయగా మరొకటి జరిగింది) జరిగాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఐపీఎల్ తొలి సీజన్లోనూ (2008) ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. 2009లో ఒకటి, 2010లో ఒకటి, 2013లో రెండు, 2014లో ఒకటి, 2015లో ఒకటి, 2017లో ఒకటి, 2019లో రెండు, 2020లో ఐదు, 2021 సీజన్లో ఓ సూపర్ ఓవర్ మ్యాచ్ జరుగగా... 2008, 2011, 2012, 2016, 2018, 2022, 2023 సీజన్లలో ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళితే అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజా అందుతుంది. అందుకే ఫ్యాన్స్ సూపర్ ఓవర్లో ఫలితం తేలడాన్ని ఇష్టపడతారు. ఫలితం ఒక్క సూపర్ ఓవర్ వరకు వెళితేనే అభిమానులు నరాలు బిగబట్టుకుని మ్యాచ్‌లు చూస్తారు. అదే రెండో సూపర్ దాకా వెళితే ఫ్యాన్స్‌తో ఆటగాళ్లు పడే ఉత్కంఠ అంతాఇంత కాదు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. -
ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 17) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతున్నాయి. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌ను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో తలపడగా.. గుజరాత్ 2, ఢిల్లీ ఓ మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య చివరి సారిగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీని విజయం వరించింది. బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్లో రెండు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఢిల్లీతో పోలిస్తే గుజరాత్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఇరు జట్లలో ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత గత కొన్ని మ్యాచ్‌లు దూరంగా ఉన్నారు. గుజరాత్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా.. ఢిల్లీ ప్లేయర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత అందుబాటులో లేరు. నేటి మ్యాచ్‌కు కూడా వీరిద్దరూ అందుబాటులో ఉండే విషయంపై క్లారిటీ లేదు. తుది జట్లు (అంచనా).. గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ -
IPL 2024 GT vs DC: ఢిల్లీ రాత మారేనా?
-
సచిన్ షాట్‌ను కాపీ కొట్టిన శుబ్‌మన్ గిల్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అయితే గిల్ తన ఇన్నింగ్స్‌లో కొట్టిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచాడు. గిల్ తన షాట్‌తో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను గుర్తు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని శుబ్‌మన్ అద్భుతమైన ఆన్-డ్రైవ్ షాట్ ఆడి సిక్స్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్ వాట్‌ఏ షాట్ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ తరహా షాట్లతో అభిమానులతో అలరించాడు. అనాటి మ్యాచ్‌లో సచిన్ విధ్వంసం సృష్టించాడు. సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఏకంగా 143 పరుగులు చేశాడు. pic.twitter.com/a5MwVJaChL — Sitaraman (@Sitaraman112971) April 10, 2024 -
టీ20కా 'డాన్' రషీద్ ఖాన్.. రోహిత్, రుతురాజ్, గిల్ కంటే ఎక్కువగా..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ పొట్టి క్రికెట్‌ను శాసిస్తున్నాడని అనడం కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్లో టోర్నీలు ఎక్కడ జరిగినా వాలిపోయే రషీద్.. ప్రతి మ్యాచ్‌లో తనదైన మార్కు వేస్తుంటాడు. ఐపీఎల్లో అయితే రషీద్ ఆటతీరు వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ రషీద్ సత్తా చాటుతుంటాడు. బంతితో కాకపోతే బ్యాట్‌తో అయినా చెలరేగుతుంటాడు. ప్రతి మ్యాచ్‌లో తన జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటాడు. The winning celebration from Rashid Khan. 🥶pic.twitter.com/TqtvV2R1d6 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 రషీద్ ఆటతీరుకు అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు సైతం ముగ్దులవుతుంటారు. ఇండియాలో రషీద్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులు టీమిండియా స్టార్లతో సమానంగా రషీద్‌ను అభిమానిస్తారు. క్రికెట్ అభిమానులు రషీద్‌ను ముద్దుగా టీ20కా 'డాన్' అని పిలుచుకుంటారు. Most Player of the Match awards in IPL at the age of 25: Rashid Khan - 12*. Shubman Gill - 9. Ruturaj Gaikwad - 8. Rohit Sharma - 7. pic.twitter.com/UFE6tn4tJ5 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో రషీద్ తాను టీ20 డాన్‌ను అని మరోసారి రుజువు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో రషీద్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన రషీద్.. తన జట్టు కష్ట సమయంలో (చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన దశలో) ఉన్నప్పుడు బ్యాట్ పట్టి మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఆడాడు. The winning celebrations from the captain and the vice captain. 💥 pic.twitter.com/HKYINLqTdF — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 ఫలితంగా తన జట్టు గుజరాత్.. రాజస్థాన్‌కు వారి సొంతగడ్డపై ఊహించని షాకిచ్చింది. బంతితో పాటు బ్యాట్‌తో చెలరేగి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించినందుకు గాను రషీద్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఐపీఎల్లో రషీద్‌కు ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. 25 ఏళ్ల వయసులో ఇన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఐపీఎల్ చరిత్రలో ఎవరూ గెలవలేదు. టీమిండియా స్టార్లు శుభ్‌మన్ గిల్ 9, రుతురాజ్ 8, రోహిత్ శర్మ 7 అవార్డులు మాత్రమే గెలిచారు. RASHID KHAN, THE GOAT OF T20 CRICKET. 🐐 - Gill led Gujarat beats Rajasthan for the first time in IPL 2024. An IPL epic in Jaipur! 👏pic.twitter.com/OWVZCyvtmB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ చివరి బంతికి బౌండరీ బాది గుజరాత్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సంజూ శాంసన్ (68 నాటౌట్), రియాన్ పరాగ్ (76) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ (72), రషీద్, తెవాతియా (22) రాణించడంతో గుజరాత్ చివరి బంతికి విజయతీరాలకు చేరింది. RASHID KARAMATI KHAN, YOU ARE WORLD CLASS 🔥🔥🔥He traps the dangerous Jos Buttler, what a bowler ❤️#IPL2024 #tapmad #HojaoADFree pic.twitter.com/56J7XcOnkR— Farid Khan (@_FaridKhan) April 10, 2024 -
సంజూ శాంసన్‌కు భారీ షాక్
IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్‌లో రాజస్తాన్ బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్ టైటాన్స్ స్టార్ రషీద్ ఖాన్ ఫోర్ బాది తమ జట్టును గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్ విజయపరంపరకు బ్రేక్ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఓవర్ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగిన గుజరాత్ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 ఇక స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు పనిష్మెంట్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్-2024లో జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్ వేసింది. ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: రాజస్తాన్‌కు తొలి ఓటమిని రుచి చూపిన గుజరాత్
-
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్‌లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్‌కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్‌ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్‌మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పటికప్పుడు ఫలితం తారుమారు.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. తమ విషయంలో ఎందుకిలా జరిగిందంటూ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్- గుజరాత్ జట్లు బుధవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8)లను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(68- నాటౌట్), రియాన్ పరాగ్(76)తో కలిసి రాజస్తాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. గుజరాత్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 నిర్ణయం మార్చుకున్న థర్డ్ అంపైర్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ పదిహేడో ఓవర్ వేశాడు. ఐదో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించగా సంజూ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. ఈ క్రమంలో అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గుజరాత్ సారథి శుబ్‌మన్ గిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, తొలుత అది ఫెయిర్ డెలివరీ అని చెప్పిన థర్డ్ అంపైర్.. తర్వాత వైడ్‌గా ప్రకటించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో అదనపు పరుగు చేరింది. అప్పటికే బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆగ్రహంగా ఉన్న గిల్.. ఈ వైడ్ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్ వినోద్ శేషన్‌తో గొడవకు దిగాడు. వైడ్ గురించి చాలా సేపు అతడితో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. Shubman Gill has grown well as leader ⭐ Loving this version 🩷pic.twitter.com/kaDnJTGX8N — Cricspace (@cricspace69) April 10, 2024 గుజరాత్‌దే పైచేయి.. రాజస్తాన్ జైత్రయాత్రకు బ్రేక్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(72), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్(11 బంతుల్లో 24 నాటౌట్) కారణంగా గుజరాత్.. రాజస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాదడంతో.. మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపు నమోదు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: #Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! RASHID KHAN PUTS A HALT ON RR'S WINNING STREAK 🔥🔥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EdbdG9dG8o — JioCinema (@JioCinema) April 10, 2024 -
#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్‌కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. రాయల్స్‌ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్ పడటంపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు. మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా చేజారింది. మ్యాచ్ ఓడిన కెప్టెన్‌గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత. ఇది మా బౌలర్ల తప్పే మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం. కచ్చితంగా అది విన్నింగ్ స్కోరే. పిచ్‌పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్‌లో 197.. తేమ లేని వికెట్‌పై డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. రాణించిన సంజూ, రియాన్ పరాగ్ కాగా జైపూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 అంతా రషీద్ ఖాన్ వల్లే ఆఖర్లో హెట్మెయిర్ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్) మెరిపించగా.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. శుబ్‌మన్ గిల్(72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్(11 బంతుల్లో 24- నాటౌట్) రాజస్తాన్‌ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్ బాది గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 రాజస్తాన్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. గుజరాత్ సంచలన విజయం -
రాయల్స్‌కు టైటాన్స్ షాక్
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయి ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. జైపూర్: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్‌కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్‌పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), సామ్సన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శతక భాగస్వామ్యం... గత మూడు మ్యాచ్‌లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన బట్లర్ (8) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో రాజస్తాన్ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్ భారీ భాగస్వామ్యం రాయల్స్‌ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. పరాగ్ 34 బంతుల్లో, సామ్సన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్‌ను అవుట్ చేసి మోహిత్ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్‌మైర్ (13 నాటౌట్) చెరో సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. గిల్ కెప్టెన్ఇన్నింగ్స్... భారీ ఛేదనలో టైటాన్స్‌కు సుదర్శన్, శుబ్‌మన్ గిల్ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్ బౌలింగ్‌లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్ స్కోరు పవర్‌ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ సేన్ ఒక్కసారిగా గుజరాత్‌ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్‌లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్ (4), మనోహర్ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్ గిల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయ్ శంకర్ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్ వెనుదిరగడంతో టైటాన్స్ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) ఉమేశ్ 24; బట్లర్ (సి) తెవాటియా (బి) రషీద్ 8; సామ్సన్ (నాటౌట్) 68; పరాగ్ (సి) శంకర్ (బి) మోహిత్ 76; హెట్‌మైర్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్: ఉమేశ్ 4–0–47–1, జాన్సన్ 4–0–37–0, రషీద్ 4–0–18–1, నూర్ 4–0–43–0, మోహిత్ 4–0–51–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 35; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 72; వేడ్ (బి) కుల్దీప్ 4; మనోహర్ (బి) కుల్దీప్ 1; విజయ్ శంకర్ (బి) చహల్ 16; తెవాటియా (రనౌట్) 22; షారుఖ్ (ఎల్బీ) (బి) అవేశ్ 14; రషీద్ ఖాన్ (నాటౌట్) 24; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్: బౌల్ట్ 2–0–8–0, అవేశ్ 4–0–48–1, మహరాజ్ 2–0–16–0, అశి్వన్ 4–0–40–0, చహల్ 4–0–43–2, కుల్దీప్ సేన్ 4–0–41–3. ఐపీఎల్లో నేడు ముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. రాజస్థాన్‌పై గుజరాత్ సంచలన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్ సేన్ 19వ ఓవర్లో 20 పరుగులిచ్చి గుజరాత్‌ను గెలుపు లైన్లో నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ఇదే కుల్దీప్ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్ రేటే రాజస్థాన్ పాలిట శాపంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్‌కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్‌మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 4, అభినవ్ మనోహర్ 1, విజయ్ శంకర్ 16, షారుక్ ఖాన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. -
కుల్దీప్ సేన్ విజృంభణ.. గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ చెలరేగిపోయాడు. 10 బంతుల వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న గుజరాత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 9వ ఓవర్ రెండో బంతికి సాయి సుదర్శన్‌ను (35) ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపిన సేన్.. ఆతర్వాత 11వ ఓవర్ తొలి బంతికి, నాలుగో బంతికి మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్‌ను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు. 147.3kmph.145kmph.Kuldeep Sen has rattled the Gujarat Titans top order. 🔥 pic.twitter.com/DdtR6KxALO— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 సేన్ ధాటికి గుజరాత్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సేన్ అనంతరం చహల్ గుజరాత్ బ్యాటర్లను పరేషాన్ చేశాడు. చహల్ 14వ ఓవర్లో విజయ్ శంకర్ (16), 16వ ఓవర్లో శుభ్‌మన్ గిల్‌ను (72) చాకచక్యంగా బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా చహల్ గిల్‌ను ఔట్ చేసే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. Kuldeep Sen with 145kmph beauty. 🤯🔥 pic.twitter.com/TLxbWMwjjU— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 గిల్ క్రీజ్ దాటి వస్తాడని ముందుగానే పసిగట్టిన చహల్.. తెలివిగా వైడ్ వేయగా.. ఇది తెలియని గిల్ ముందుకు వచ్చి ఆడే క్రమంలో స్టంప్ ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 138/5గా ఉంది. తెవాతియా, షారుక్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. -
IPL 2024 RR VS GT: శుభ్‌మన్ గిల్ ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఐపీఎల్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఐపీఎల్లో 3000 పరుగుల మార్కును తాకగా.. దీనికి ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 26 ఏళ్ల 186 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ జాబితాలో గిల్, విరాట్ తర్వాత సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ ఉన్నారు. సంజూ 26 ఏళ్ల 320 రోజుల వయసులో, రైనా 27 ఏళ్ల 161 రోజుల వయసులో, రోహిత్ 27 ఏళ్ల 343 రోజుల వయసులో ఐపీఎల్లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. The class of Shubman Gill. 💥pic.twitter.com/e1tVCEzuds— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 ఐపీఎల్లో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ (టాప్ 5) గిల్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో నిలిచాడు. గిల్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 94 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. క్రిస్ గేల్ కేవలం 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి ఈ విభాగంలో టాప్‌లో నిలిచాడు. గేల్ తర్వాత కేఎల్ రాహుల్ (80 ఇన్నింగ్స్‌లు), జోస్ బట్లర్ (85) ఉన్నారు. గిల్‌తో పాటు డేవిడ్ వార్నర్, డుప్లెసిస్ కూడా 94 ఇన్నింగ్స్‌ల్లోనే 3000 పరుగుల మార్కును తాకారు. కాగా, గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ను కుల్దీప్ సేన్ (2-0-11-3) ఇరకాటంలో పడేశాడు. సేన్ ధాటికి గుజరాత్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్ (35), మాథ్యూ వేడ్ (4), అభినవ్ మనోహర్ (1) ఔట్ కాగా.. శుభ్‌మన్ గిల్ (37), విజయ్ శంకర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. -
IPL 2024 RR VS GT: శివాలెత్తిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ శివాలెత్తిపోయి మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. ప్రస్తుత సీజన్లో మూడో అర్దశతకాన్ని నమోదు చేశాడు. తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69.. తాజాగా గుజరాత్‌పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో భీకరఫామ్‌లో ఉన్న సంజూ.. 5 మ్యాచ్‌ల్లో 157.69 స్టయిక్‌రేట్‌తో 82 సగటున 246 పరుగులు చేసి, విరాట్ (316), రియాన్‌ల (261) తర్వాత సీజన్ మూడో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో సంజూతో పాటు రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్‌మన్ గిల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. -
రాజస్థాన్‌పై గుజరాత్ సంచలన విజయం
రాజస్థాన్‌పై గుజరాత్ సంచలన విజయం రాజస్థాన్‌పై గుజరాత్ సంచలన విజయం సాధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమిపాలైంది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (వర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్‌కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్‌మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. చహల్ ఉచ్చులో ఇరుక్కున్న గిల్ చహల్ తెలివిగా వైడ్ వేసిన బంతిని ముందుకు వచ్చి ఆడే క్రమంలో శుభ్‌మన్ గిల్ (720 స్టంప్ ఔటయ్యాడు. చహల్ తెలివిగా ప్లాన్ వేసి గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. 15.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 133/5గా ఉంది. తెవాతియా, షారుక్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ 111 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ (16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 111/4గా ఉంది. గిల్ (52), తెవాతియా క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్‌లో కుల్దీప్ సేన్ నిప్పులు చెరుగుతున్నాడు. 9వ ఓవర్లో తొలి వికెట్ తీసన సేన్.. 11వ ఓవర్లో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. 11వ ఓవర్లో తొలుత వేడ్‌ను బౌల్డ్ చేసిన సేన్.. నాలుగో బంతికి అభినవ్ మనోహర్‌కు కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 10.1 ఓవర్: వర్షం ఆగిపోయాక తొలి బంతికే మాథ్యూ వేడ్ (4) ఔటయ్యాడు. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో వేడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వర్షం అంతరాయం 10 ఓవర్ల అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను పాక్షికంగా నిలిపివేశారు. ఈ సమయంలో జట్టు స్కోర్ 77/1గా ఉంది. మాథ్యూ వేడ్ (4), గిల్ (36) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 60 బంతుల్లో 120 పరుగులు చేయాల్సి ఉంది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 8.2 ఓవర్: 64 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ (35) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మాథ్యూ వేడ్ గిల్‌తో (28) జత కట్టాడు. గేర్ మార్చిన గిల్ 5 ఓవర్ల వరకు ఆచితూచి ఆడిన గిల్.. ఆతర్వాత గేర్ మార్చి ఆడుతున్నాడు. 8 ఓవర్ల అనంతరం గుజరాత్ స్కోర్ 63/0గా ఉంది. గిల్ 35, సాయి సుదర్శన్ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్‌మన్ గిల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. రియాన్, సంజూ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోర్ రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. రియాన్ పరాగ్ ఔట్ 18.4 ఓవర్: 172 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి రియాన పరాగ్ (76) ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ సంజూ శాంసన్ 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 162/2గా ఉంది. రియాన్ (68), శాంసన్ (58) క్రీజ్‌లో ఉన్నారు. రియాన్ పరాగ్ విధ్వంసం.. మరో మెరుపు హాఫ్ సెంచరీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ పరాగ్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో రియాన్ మరో మెరుపు అర్దశతకం బాదాడు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్దశతకాన్ని పూర్తి చేశాడు. రియాన హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. 15 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 134/2. రియాన్ పరాగ్ (36 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శాంసన్ (25 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. బట్లర్‌ను బోల్తా కొట్టించిన రషీద్ ఖాన్ 5.5 ఓవర్: 42 పరుగుల వద్ద రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (8) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..యశస్వి ఔట్ 4.2 ఓవర్: 32 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (24) ఔటయ్యాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ దాదాపు అర్ద గంట తర్వాత టాస్ పడింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ రెండు మార్పులు, రాజస్థాన్ ఓ మార్పు చేసింది. కేన్ విలియమ్సన్, బీఆర్ శరత్ స్థానాల్లో మథ్యూ వేడ్, అభినవ్ మనోహర్ గుజరాత్ తుది జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ జట్టులో నండ్రే బర్గర్ స్థానంలో నవ్‌దీప్ సైనీ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నవ్‌దీప్ సైనీ గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్ (వికెట్‌కీపర్), అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ ► టాస్ 7:25.. మ్యాచ్ 7:40కి ప్రారంభమయ్యే అవకాశం Toss at 7.25 pm IST and start of the play at 7.40 pm IST. pic.twitter.com/e7Syu4jUKS — Johns. (@CricCrazyJohns) April 10, 2024 ► వర్షం కారణంగా టాస్ ఆలస్యం Toss has been delayed due to rain at Jaipur. pic.twitter.com/AWssSQxxHX — Johns. (@CricCrazyJohns) April 10, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్ రాయల్స్‌ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాయల్స్ సొంత మైదానమైన సువాయ్ మాన్సింగ్ స్టేడయంలో (జైపూర్) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్లో రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతుంది. -
IPL 2024: రాయల్స్ రాజసం ముందు గుజరాత్ నిలబడేనా..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజస్థాన్ రాయల్స్‌ను అరకొర విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాయల్స్ సొంత మైదానమైన సువాయ్ మాన్సింగ్ స్టేడయంలో (జైపూర్) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్లో రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులు.. ఐపీఎల్లో రాజస్థాన్, గుజరాత్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ అత్యధికంగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాయల్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. తుది జట్లు (అంచనా).. నేటి మ్యాచ్ కోసం రాజస్థాన్ మార్పులేమీ చేయకపోవచ్చు. ఆర్సీబీతో గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు సైతం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నండ్రే బర్గర్ గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, బీఆర్ శరత్ (వికెట్‌కీపర్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ బలాబలాలు.. ప్రస్తుత సీజన్లో గుజరాత్‌తో పోలిస్తే రాజస్థాన్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా రాయల్స్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్దులకు వణుకు పుట్టించేలా ఉంది. యశస్వి ఒక్కడు ఫామ్‌లోకి వస్తే నేటి మ్యాచ్‌లో రాయల్స్‌ను ఆపడం కష్టం. గత మ్యాచ్‌లోనే బట్లర్ మెరుపు శతకం బాది పూర్వపు టచ్‌ను అందుకున్నాడు. సంజూ, రియాన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. హెట్‌మైర్, ద్రువ్ జురెల్ నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ బాకీ ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రాయల్స్ తిరుగులేని శాక్తిగా ఉంది. బౌల్ట్, బర్గర్, ఆవేశ్ ఖాన్, అశ్విన్, చహల్, రియాన పరాగ్‌లతో ఆ జట్టు పేస్, స్పిన్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు బౌలింగ్ విభాగం ఓ మోస్తరుగా ఉన్నా, బ్యాటింగ్‌లో మాత్రం చాలా వీక్‌గా కనిపిస్తుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడారు. మిల్లర్ గాయపడటంతో గుజరాత్ కష్టాలు ఎక్కువయ్యాయి. అతని స్థానంలో తుది జట్టులో వచ్చిన కేన్ మామ గత మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు. ఆఖర్లో తెవాటియా పర్వాలేదనిపిస్తుండగా.. విజయ్ శంకర్, బీఆర్ శరత్, దర్శన్ నల్కండే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నల్కండేలతో గుజరాత్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటర్లు చెలరేగితే నేటి మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించగలుగుతుంది. రాయల్స్ రాజసం కొనసాగుతుందో.. గుజరాత్ గర్జిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి ఉండాల్సిందే. -
హార్దిక్, రాహుల్, బుమ్రా కాదు.. భారత ఫ్యూచర్ కెప్టెన్ అతడే
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా నుంచి గుజరాత్ జట్టు పగ్గాలు చేపట్టిన గిల్.. తన వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గుజరాత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం తన కెప్టెన్సీతో అందరని అకట్టుకున్నాడు. అతడు బౌలర్లను మార్చే విధానం గానీ ఫీల్డ్ సెట్ కానీ అద్బుతంగా ఉన్నాయి. ఆటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా గిల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన గిల్ 45.75 సగటుతో 183 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని వాన్ కొనియాడాడు. కాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికి గిల్ మాత్రం కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. తొలుత బౌలింగ్‌లో తన కెప్టెన్సీ మార్క్‌తో లక్నోను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవకావడంతో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీకి వాన్ ఫిదా అయిపోయాడు. "శుబ్‌మన్ గిల్ సారథిగా రోజుకు రోజుకు మరింత పరిణితి చెందుతున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదని" గుజరాత్-లక్నో మ్యాచ్ అనంతరం వాన్ ట్విట్ చేశాడు. హార్దిక్ పాండ్యా,రాహుల్, బుమ్రా వంటి వారు రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికి వాన్ మాత్రం గిల్‌ను ఫ్యూచర్ కెప్టెన్‌గా ఎంచుకోవడం గమనార్హం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా బౌలర్లు అద్భుతం.. ఓటమికి వాళ్లే కారణం: మండిపడ్డ గిల్
ఐపీఎల్-2024ను ఘనంగా ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ అదే జోరును కొనసాగించలేకపోతోంది. వరుస పరాజయాలతో చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటోంది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైన టైటాన్స్.. మూడో పరాజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కూడా తాము పరుగులు రాబట్టలేకపోయామన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైందంటూ విచారం వ్యక్తం చేశాడు. కాగా లక్నో వేదికగా సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్(31), శుబ్‌మన్ గిల్(19) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(1) సహా వికెట్ కీపర్ శరత్ బీఆర్(2), విజయ్ శంకర్(17) చేతులెత్తేశారు. ఏడో నంబర్ బ్యాటర్ రాహుల్ తెవాటియా(30) కాసేపు పోరాడినా... మిగతా వారి నుంచి సహకారం అందకపోవడంతో 130 పరుగులకే గుజరాత్ టైటాన్స్ ఆలౌట్ అయింది. అలా 18.5 ఓవర్లలోనే కథ ముగిసిపోయింది. ఫలితంగా లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయం అందుకుంది. 2️⃣nd win at home 👌 3️⃣rd win on the trot 👌 A superb performance from Lucknow Super Giants takes them to No. 3 in the points table 👏👏 Scorecard ▶ https://t.co/P0VeELamEt#TATAIPL | #LSGvGT pic.twitter.com/w2nCs5XrwT — IndianPremierLeague (@IPL) April 7, 2024 ఈ నేపథ్యంలో టైటాన్స్ సారథి శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. కానీ మా బ్యాటర్ల ప్రదర్శన అస్సలు బాగాలేదు. మెరుగ్గానే ఆరంభించినా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. నిజానికి మా బౌలర్లు అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థిని 160 పరుగులకు పరిమితం చేశౠరు. కానీ బ్యాటర్లే ఓటమికి కారణమయ్యారు. డేవిడ్ మిల్లర్‌ను మిస్సయ్యాం. తను ఉండి ఉంటే ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతోనే నేను దూకుడుగా ఆడాను. ఆ క్రమంలోనే అవుటయ్యాను’’ అని పేర్కొన్నాడు. తమ ఓటమికి బ్యాటర్లే ప్రధాన కారణమని గిల్ ఈ సందర్బంగా వెల్లడించాడు. కాగా గుజరాత్ టైటాన్స్ తదుపరి ఏప్రిల్ 10న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. కాగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచిన గుజరాత్.. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. చదవండి: లక్షల కోట్లు ఉంటేనేం!.. 2 పాయింట్లు.. చిన్నపిల్లల్లా అంబానీల సంబరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 LSG VS GT: రాహుల్ సూపర్ కెప్టెన్సీ.. తిరుగులేని ట్రాక్ రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జట్టు తరఫున స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. రాహుల్ ఎల్ఎస్జీ కెప్టెన్‌గా స్కోర్లను డిఫెండ్ చేసుకుంటూ గత 17 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకసారి ఓటమి చవిచూశాడు. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్ దిట్ట. ఈ సీజన్లో లక్నో గెలిచిన మ్యాచ్‌లే ఇందుకు ఉదాహరణ. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 199 పరుగులకు విజయవంతంగా కాపాడుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్దిని 178 పరుగులకే పరిమితం చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 181 పరుగులను డిఫెండ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ సూపర్ కెప్టెన్సీ స్కిల్స్ ప్రదర్శించి ఆర్సీబీని 153 పరుగులకే పరిమితం చేశాడు. Lucknow Super Giants while defending total in last 17 games: Won, Won, Won, Won, Won, Won, Won, Won, Lost, Won, Won, Won, NR, Won, Won, Won, Won. - Captain KL Rahul for you. ⭐ pic.twitter.com/ZfgnlECWeE — Johns. (@CricCrazyJohns) April 7, 2024 తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఇంకాస్త పరిణితి చెంది 163 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ తన సారధ్య నైపుణ్యాలను రంగరించి గుజరాత్‌ను 130 పరుగులకే పరిమితం చేశాడు. కెప్టెన్‌గా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లను డిఫెండ్ చేసుకోవడంతో రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భావి భారత కెప్టెన్ ఇతడే అంటూ అభిమానులు రాహుల్‌ను ఆకాశానికెత్తుతున్నారు. KL Rahul has been one of the best captains in the IPL while defending the total. 🫡pic.twitter.com/9WhKztX4A9 — Johns. (@CricCrazyJohns) April 7, 2024 ధోని తర్వాత ధోని అంతటి వాడంటూ కితాబునిస్తున్నారు. ధోనిలాగే రాహుల్ కూడా వికెట్ల వెనుక ఊహలకందని వ్యూహరచన చేస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. యువ బౌలింగ్ లైనప్‌ను రాహుల్ అద్భుతంగా వినియోగించుకుంటున్నాడంటూ ప్రశంసిస్తున్నారు. మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్ లాంటి అన్క్యాప్డ్ బౌలర్లు మ్యాచ్ విన్నర్లుగా మారడానికి రాహుల్ కెప్టెన్సీనే కారణమంటూ ఆకాశానికెత్తుతున్నారు. పంజాబ్, ఆర్సీబీపై మయాంక్.. తాజాగా గుజరాత్‌పై యశ్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. - Defended 199 runs vs PBKS. - Defended 181 runs vs RCB. - Defended 163 runs vs GT. Captain KL Rahul & his boys have been phenomenal - Lucknow Defending Giants. 🫡 pic.twitter.com/7LDcgflcBM — Johns. (@CricCrazyJohns) April 7, 2024 కాగా, గుజరాత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే చాపచుట్టేసింది. రాహుల్ సారథ్య నైపుణ్యం, యశ్ ఠాకూర్ సంచలన ప్రదర్శన (3.5-1-30-5) కారణంగా ఈ మ్యాచ్‌లో లక్నో తిరుగులేని విజయాన్ని అందుకుంది. -
IPL 2024 LSG Vs GT: లక్నో ‘హ్యాట్రిక్’ విక్టరీ
లక్నో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 17వ సీజన్లో ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్టు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), స్టొయినిస్ (43 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఖర్లో నికోలస్ పూరన్ (22 బంతుల్లో 32; 3 సిక్స్‌లు), ఆయూశ్ బదోని (11 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం సులువైన లక్ష్యమే ఎదురైనా... గుజరాత్ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును ముంచింది. చివరకు గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. మీడియం పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ ఠాకూర్ (5/30), స్పిన్నర్ కృనాల్ పాండ్యా (3/11) గుజరాత్‌ను దెబ్బ తీశారు. 54 పరుగుల వరకు వికెట్ కోల్పోని గుజరాత్ అనూహ్యంగా మరో 76 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (19; 2 ఫోర్లు)ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేయగా, రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌తో కేన్ విలియమ్సన్ (1) ని్రష్కమించాడు. కృనాల్ పాండ్యా కూడా స్పిన్‌తో తిప్పేయడంతో గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) నూర్ (బి) ఉమేశ్ 6; కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) దర్శన్ 33; పడిక్కల్ (సి) శంకర్ (బి) ఉమేశ్ 7; స్టొయినిస్ (సి) శరత్ (బి) దర్శన్ 58; పూరన్ (నాటౌట్) 32; బదోని (సి) ఉమేశ్ (బి) రషీద్ ఖాన్ 20; కృనాల్ పాండ్యా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–91, 4–112, 5–143. బౌలింగ్: ఉమేశ్ 3–0–22–2, జాన్సన్ 4–0–32–0, రషీద్ 4–0–28–1, మోహిత్ 3–0 –34–0, నూర్ 4–0–22–0, దర్శన్ 2–0–21–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రవి బిష్ణోయ్ (బి) కృనాల్ 31; గిల్ (బి) యశ్ ఠాకూర్ 19; విలియమ్సన్ (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 1; శరత్ (సి) బదోని (బి) కృనాల్ 2; విజయ్ శంకర్ (సి) రాహుల్ (బి) యశ్ 17; దర్శన్ (సి) యశ్ ఠాకూర్ (బి) కృనాల్ 12; తెవాటియా (సి) పూరన్ (బి) యశ్ 30; రషీద్ ఖాన్ (సి) సబ్–హుడా (బి) యశ్ ఠాకూర్ 0; ఉమేశ్ (సి) డికాక్ (బి) నవీనుల్ 2; జాన్సన్ (నాటౌట్) 0; నూర్ అహ్మద్ (సి) డికాక్ (బి) యశ్ ఠాకూర్ 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 130. వికెట్ల పతనం: 1–54, 2–56, 3–58, 4–61, 5–80, 6–93, 7–93, 8–102, 9–126, 10–130. బౌలింగ్: సిద్ధార్థ్ 4–0–29–0, నవీనుల్ 4–0–37–1, మయాంక్ 1–0–13–0, యశ్ ఠాకూర్ 3.5–1– 30–5, కృనాల్ 4–0–11–3, రవి బిష్ణోయ్ 2–0–8–1. -
LSG Vs GT: వావ్ వాట్ ఏ క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! మైండ్‌బ్లోయింగ్
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపుల సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ స్టైట్‌గా సింగిల్ కోసం చిప్ చేశాడు. అయితే బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బిష్ణోయ్ తన కుడివైపున్కి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్ మామతో పాటు గ్రౌండ్లో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీంతో కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన విలియమ్సన్.. నిరాశతో మైదానాన్ని వీడాడు. బిష్ణోయ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటంటూ కామెంట్లు చేస్తున్నారు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲 Flying Bishoni ✈️ Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/Le5qvauKbf — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
LSG Vs GT: కేఎల్ రాహుల్ టెస్టు ఇన్నింగ్స్.. ఎంత బాగా ఆడాడో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పరంగా తడబడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాహుల్ నిరాశపరిచాడు. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ టెస్టు మ్యాచ్ కంటే దారుణంగా ఆడాడు. ఓ వైపు స్టోయినిష్ బౌండరీలు బాదుతుంటే.. రాహుల్ మాత్రం తన జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులకు విసుగుతెప్పించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతులు ఎదుర్కొన్న 106.45 స్ట్రైక్ రేటుతో 33 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఆఖరికి దర్శన్ నల్కండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాహుల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. టెస్టు ఇన్నింగ్స్ బాగా ఆడావు.. ఓడినా నీదే ప్లేయర్ మ్యాచ్ అవార్డు అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. What a day for academy.. Hardik Pandya- 39 off 33 KL Rahul- 33 off 31 Prince Gill- 19 off 21😳🔥🔥 pic.twitter.com/CW44o7hZHt — TukTuk Academy (@TukTuk_Academy) April 7, 2024 pic.twitter.com/yX2arIKeiX — Cricket Videos (@cricketvid123) April 7, 2024 -
5 వికెట్లతో చెలరేగిన యష్.. గుజరాత్‌పై లక్నో ఘన విజయం
IPL 2024 GT vs LSG Live Updates: గుజరాత్‌పై లక్నో ఘన విజయం ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే కుప్పకూలింది. లక్నో పేసర్ యష్ ఠాకూర్ 5 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 93/7 15 ఓవర్లు ముగిసే సరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 15 ఓవర్ వేసిన యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో గజరాత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ వరుస క్రమంలో ఔటయ్యారు. ఐదో వికెట్ డౌన్ 81 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన దర్శన్ నల్కండే.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో విజయ్ శంకర్(9), రాహుల్ తెవాటియా(1) పరుగులతో ఉన్నారు. 61 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో గుజరాత్ 9వ ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో గుజరాత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత సాయిసుదర్శన్ ఔట్ కాగా.. అనంతరం శరత్ ఔటయ్యాడు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 61/4 గుజరాత్ రెండో వికెట్ డౌన్.. కేన్ విలియమ్సన్ ఔట్ 58 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కేన్ విలియమ్సన్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 58/2 తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. గిల్ ఔట్ 54 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 54/1 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 22/0 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(12), శుబ్‌మన్ గిల్(8) పరుగులతో ఉన్నారు. రాణించిన లక్నో బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ 164 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(32 నాటౌట్), కేఎల్ రాహుల్(33) పరుగులతో పర్వాలేదన్పించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలా రెండు వికెట్లు సాధించగా.. రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. లక్నో నాలుగో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్ మార్కస్ స్టోయినిష్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన స్టోయినిష్.. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు లక్నో స్కోర్: 114/4 లక్నో మూడో వికెట్.. కేఎల్ రాహుల్ ఔట్ 91 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పూరన్ వచ్చాడు. 13 ఓవర్లకు లక్నో స్కోర్: 93/3 10 ఓవర్లకు లక్నో స్కోర్: 74/2 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినిష్(29), కేఎల్ రాహుల్(28) పరుగులతో ఉన్నారు 6 ఓవర్లకు లక్నో స్కోర్: 47/2 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో స్టోయినిష్(16), కేఎల్ రాహుల్(13) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. పడిక్కల్ ఔట్ 18 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్: 18/2 తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన డికాక్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐపీఎల్-2024లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టుకు వృద్దిమాన్ సహా, ఒమర్జాయ్ దూరం కాగా.. శరత్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్ గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), శరత్ బిఆర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ -
ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ .. స్టార్ క్రికెటర్ దూరం?
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ అనుహ్యంగా ఓటమి పాలైంది. సునయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెతిలేత్తిశారు. అయితే ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, ఫినిషర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు కూడా మిల్లర్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో తుది జట్టులోకి న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ వచ్చాడు. జట్టులోకి వచ్చిన విలియమ్సన్.. మిల్లర్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ సేవలు కోల్పోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. డేవిడ్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడని" విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా రెండు వారాల అంటే దాదాపు గుజరాత్ ఆడే నాలుగు మ్యాచ్‌లకు మిల్లర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా మిల్లర్ ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఫినిషర్‌గా కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: #Shashank Singh: పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్? -
IPL 2024: శశాంక్ సింగ్ గతంలోనూ గుజరాత్ బౌలర్లను వదల్లేదు.. చీల్చిచెండాడు..!
గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చ జోరుగా సాగుతుంది. క్రికెట్ అభిమానులు శశాంక్ గురించి ఆరా తీసే క్రమంలో అతని పాత వీడియో ఒకటి బయటపడింది. ఇందులో శశాంక్ విధ్వంసం వీర లెవెల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 2022 ఐపీఎల్ సీజన్‌కు సంబందించిన ఆ వీడియోలో శశాంక్ సన్‌రైజర్స్‌కు ఆడుతూ గుజరాత్ బౌలర్లు చీల్చిచెండాడాడు. నిన్నటి మ్యాచ్‌తో పోలిస్తే ఆ విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. శశాంక్ ఊచకోతకు గతంలోనూ గుజరాత్ బౌలర్లు బలయ్యారు. When Shashank Singh used to play for SRH, he smashed Lockie Ferguson like a club bowler 😨#GTvPBKS #ShashankSingh #GTvPBKS #PBKSvsGT pic.twitter.com/MxN4jH5k9f — Richard Kettleborough (@RichKettle07) April 5, 2024 నాడు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ ఏడో స్థానంలో బరిలోకి దిగి 6 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో శశాంక్ స్ట్రయిక్‌రేట్ 416.67గా ఉంది. అదే సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శశాంక్ ఫెర్గూసన్ లాంటి బౌలర్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు శశాంక్‌కు గుజరాత్ అంటే కసిలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, శాశంక్ సింగ్, అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ గుజరాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
మోదీ స్టేడియం అంటే చాలు శుభ్‌మన్‌కు పూనకం వస్తుంది.. ఇరగదీస్తాడు..!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తమ సొంత మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) అంటే చాలు చెలరేగిపోతాడు. ఈ గ్రౌండ్లో శుభ్‌మన్‌కు ఎవరికీ లేని అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గిల్ ఇక్కడ మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఇరగదీస్తాడు. ఇక్కడ అతనికి పట్టపగ్గాలు ఉండవు. తాజాగా మరోసారి ఇది నిరూపితమైంది. నిన్న (ఏప్రిల్ 4) పంజాబ్ కింగ్స్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గిల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మోదీ స్టేడియంలో గిల్ ఆడిన క్లాసీ ఇన్నింగ్స్‌ల్లో ఇదీ ఒకటి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ.. గిల్ ఇన్నింగ్స్ ఆందరినీ ఆకట్టుకుంది. Shubman Gill at Narendra Modi stadium in IPL: 9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48). 15 innings, 825 runs, 68.75 average, 159.26 strike Rate - This is Incridible from Gill. ⭐ pic.twitter.com/mbUmoe9GJb — CricketMAN2 (@ImTanujSingh) April 4, 2024 నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లపై లుక్కేస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఇక్కడ అతను 15 ఇన్నింగ్స్‌ల్లో 159.26 స్ట్రయిక్‌రేట్‌తో 68.75 సగటున 825 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్దసెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో బహుశా ఏ క్రికెటర్ తన హోం గ్రౌండ్లో ఈ స్థాయి చెలరేగి ఉండడు. మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లు.. 9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48) కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024 GT VS PBKS: శుభ్‌మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్.. సీజన్ టాప్ స్కోర్
పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ అయ్యాక తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో గిల్ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. SHUBMAN GILL HAS THE HIGHEST INDIVIDUAL SCORE IN IPL 2024. ⭐🔥 pic.twitter.com/Rl8Yv0gHlo — Johns. (@CricCrazyJohns) April 4, 2024 ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సునీల్ నరైన్ చేసిన 85 పరుగులు గిల్ ఇన్నింగ్స్‌కు ముందు సీజన్ టాప్ స్కోర్‌గా ఉండింది. గంటల వ్యవధిలోనే గిల్..నరైన్ స్కోర్‌ను అధిగమించి సీజన్ టాప్ స్కోరర్‌గా అవతరించాడు. MAGIC HANDS OF CAPTAIN GILL. 👌🔥pic.twitter.com/ZvJrDpRhVR — Johns. (@CricCrazyJohns) April 4, 2024 పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ గిల్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ చూడచక్కటి షాట్లు ఆడాడు. గిల్ కొట్టిన సిక్సర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గిల్ సునాయాసంగా బంతులను బౌండరీ లైన్ పైకి తరలించాడు. ఐపీఎల్లో గిల్ బ్యాట్ నుంచి జాలువారిన క్లాసీ ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి. A Shubman Gill fan doing his trademark move at the yesterday's match.👌 pic.twitter.com/3iFcZ2uA0r— CricketMAN2 (@ImTanujSingh) April 5, 2024 కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగినప్పటికీ.. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అంతకంటే మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది.