ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కీలక పోరుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక మార్పుతో బరిలోకి దిగింది.
పేసర్ గ్లీసన్ స్ధానంలో కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర వచ్చాడు. మరోవైపు గుజరాత్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. లిటిల్, వృద్దిమాన్ సాహా స్ధానంలో మాథ్యూ వేడ్, కార్తీక్ త్యాగీ వచ్చారు.
కాగా గుజరాత్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. పాయింట్ల పట్టికలో సీఎస్‌కే నాలుగో స్ధానంలో ఉండగా.. గుజరాత్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయిసుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment