ఒక్కరైనా డబుల్‌ హ్యాట్రిక్‌ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే! | Shubman's Clear Blame After GT's Terrible Loss To DC Following Lowest Score | Sakshi
Sakshi News home page

Shubman Gill: ఒక్కరైనా డబుల్‌ హ్యాట్రిక్‌ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే!

Published Thu, Apr 18 2024 8:47 AM | Last Updated on Thu, Apr 18 2024 9:07 AM

Shubman Clear Blame After GT Terrible Loss To DC Following Lowest Score - Sakshi

IPL 2024 GT vs DC: రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ కనీవినీ ఎరుగని రీతిలో చెత్త ప్రదర్శన కనబరిచింది. ఐపీఎల్‌-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేవలం 89 పరుగులకే ఆలౌట్‌ అయి.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

ఇక 90 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 8.5 ఓవర్లలోనే పని పూర్తి చేయడంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తమ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని అంగీకరించాడు.

మా ఓటమికి కారణం అదే
‘‘పిచ్‌ బాగానే ఉంది. కానీ మా ‍బ్యాటింగే అత్యంత సాధారణంగా ఉంది. షాట్‌ సెలక్షన్‌ లోపాల వల్లే వరుసగా వికెట్లు కోల్పోయాం. ప్రత్యర్థి జట్టు 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మాలో ఎవరో ఒక బౌలర్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ తీస్తేనే గానీ ఫలితం ఉండదు.

లేదంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టునే విజయం వరిస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది’’ అని పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు గిల్‌. ఈ ఘోర పరాభవం నుంచి వీలైనంత తొందరగా కోలుకుని తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతామని పేర్కొన్నాడు.

అదే విధంగా.. ‘‘ఇప్పటి వరకు సగం మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. ఇంకో ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికి మూడు గెలిచాం. గత రెండేళ్లుగా గెలిచినట్లే సెకండాఫ్‌లో 5-6 మ్యాచ్‌లు గెలవగలమనే అనుకుంటున్నా’’ అని శుబ్‌మన్‌ గిల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ స్కోర్లు:
►వేదిక: అహ్మదాబాద్‌... గుజరాత్‌
►టాస్‌: ఢిల్లీ- బౌలింగ్‌

►గుజరాత్‌ స్కోరు: 89 (17.3)
►ఢిల్లీ స్కోరు: 92/4 (8.5)

►ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం 
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రిషభ్‌ పంత్‌(రెండు క్యాచ్‌లు.. రెండు స్టంపింగ్స్‌.. 11 బంతుల్లో 16 రన్స్‌- నాటౌట్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement