
ఐపీఎల్-2025లో టీమిండియా ఫాస్ట్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిని ఆడటం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ ఔట్ చేశాడు. ఓవరాల్‌గా సిరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన వందో ఐపీఎల్ వికెట్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్‌గా సిరాజ్ మియా రికార్డులకెక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో సిరాజ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో సిరాజ్ రెండో స్ధానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్