
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో నిలకడకు మారు పేరుగా మారిన సుదర్శన్.. మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి గుజరాత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని సుదర్శన్ అందించాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్.. 7 ఫోర్లు 1 సిక్స్‌తో 56 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో సుదర్శన్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
74, 63, 49, 5, 82, 56 వరుసగా సుదర్శన్ సాధించిన స్కోర్లు ఇవి. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 54.83 సగటుతో 329 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సుదర్శన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ సుదర్శన్ అంటూ కొనియాడుతున్నారు.
4th fifty plus score for Mr.Consistent Sai Sudharsan#LSGvsGT pic.twitter.com/2qhdkvCRbv
— Ganesh 🇮🇳 (@GaneshVerse) April 12, 2025
కాగా సాయి సుదర్శన్ ఇప్పటికే టీమిండియా తరపున వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. ఆడిన 3 వన్డేల్లో 63.50 సగటుతో సుదర్శన్ 127 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత అతడికి అనూహ్యంగా జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో నిలకడగా సత్తాచాటి మళ్లీ టీమిండియాలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నాడు.
Mr. Reliable for Gujarat Titans! 🥶
Well played, Sai Sudharsan 👏👏#SaiSudharsan #LSGvGT #GTvsLSG #IPL2025 #TATAIPL2025 pic.twitter.com/HHx5e4tDzF— Saabir Zafar (@Saabir_Saabu01) April 12, 2025