
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన 246 పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ పంజాబీ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, చాహల్ తలా వికెట్ సాధించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో రెండువ అత్యధిక స్కోర్ ఛేజ్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది.
అయ్యర్ విధ్వంసం..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కూడా భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(42), ఆర్య(36), స్టోయినిష్(11 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..