
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. 246 పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.
ఈ విజయంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మది కీలక పాత్ర. అభిషేక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో అభిషేక్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. అతడి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేశాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66), క్లాసెన్(14 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అద్భుతమైన సెంచరీతో మెరిసిన అభిషేక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..
👉ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(132) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రాహుల్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. తొలి స్దానంలో విండీస్ వీరుడు, ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్(175 నాటౌట్) ఉన్నాడు.
👉ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్(37 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. తర్వాతి ప్లేస్‌లో ప్రియాన్ష్ ఆర్య(38 బంతులు) ఉన్నాడు.
👉ఐపీఎల్లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్(124) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో స్టోయినిష్ను శర్మ అధిగమించాడు.
𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯
A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪
Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025