IPL 2025: అభిషేక్ నీకు ఏమైంది..? రూ. 14 కోట్లు దండ‌గ! | 4th Straight Failure For Abhishek Sharma In IPL 2025, Netizens Slams For His Poor Form | Sakshi
Sakshi News home page

IPL 2025: అభిషేక్ నీకు ఏమైంది..? రూ. 14 కోట్లు దండ‌గ!

Published Thu, Apr 3 2025 10:28 PM | Last Updated on Fri, Apr 4 2025 11:18 AM

Abhishek sharma another Failure in IPL 2025

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న త‌న పేల‌వ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అభిషేక్ వ‌రుస‌గా నాలుగో మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 6 బంతులు ఆడి కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో స్లిప్‌లో అభిషేక్ దొరికిపోయాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు ఆడిన శ‌ర్మ‌.. కేవ‌లం 33 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. తొలి మ్యాచ్‌లో 24 ప‌రుగులు చేసిన అభిషేక్‌, ఆ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. దీంతో అత‌డిపై ఎస్ఆర్‌హెచ్ అభిమానులు మండిపడుతున్నారు.

ఏమైంది అభిషేక్ నీకు అని పోస్టులు పెడుతున్నారు.  కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు రూ.14 కోట్ల భారీ ధ‌ర వెచ్చించి మ‌రి ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇక  ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు హెడ్‌(4), ఇషాన్ కిష‌న్(2) కూడా నిరాశ‌ప‌రిచారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. కోత్‌క‌తా బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 60) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌ఘువంశీ(50), రింకూ సింగ్‌(32), ర‌హానే(38) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్‌, ష‌మీ, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, క‌మిందు మెండిస్ త‌లా వికెట్ సాధించారు.
చ‌ద‌వండి: డీఎస్సీ సిరాజ్‌కు సెల్యూట్‌.. ఆర్సీబీ ఓడను ముంచేశాడు: హర్భజన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement