
జిల్లాలో ఇలా..
ఒత్తిళ్లు చేసి రాజీనామా చేయించి..
ఉపాధి కల్పనే ధ్యేయమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కొత్త ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న చిరుద్యోగులపై ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే వివిధ రంగాలపై కన్నేసి తమ పంతం నెగ్గించుకున్న తమ్ముళ్ల కళ్లు తాజాగా వీఓఏలపై పడ్డాయి. తమకు అనుకూలంగా ఉండే వారిని నియమించాలనే లక్ష్యంతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీఓఏలను రోడ్డున పడేస్తున్నారు. ఒత్తిళ్లు తాళలేక.. ఏమి చేయాలో పాలుపోక వీఓఏలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
● రోడ్డున పడేసిన కూటమి నేతలు
● చిరుద్యోగుల పొట్టకొట్టి..
● అనుకూల
వ్యక్తుల నియామకం
● టీడీపీ నేతల కనుసన్నల్లో
గ్రామ సమాఖ్యలు
నెల్లూరు (పొగతోట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరుద్యోగులపై ఆ పార్టీ నేతల దాష్టీకం పరాకాష్టకు చేరుతోంది. తమ పార్టీలకు మద్దతుగా ఉండే వారిని నియమించాలనే లక్ష్యంతో.. అప్పటికే విధుల్లో ఉన్న వారిని అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ వికటాట్టహాసం చేస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో కొందరు రాజీనామాలూ చేశారు.
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ..
వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 36 వేల పొదుపు గ్రూపులున్నాయి. ఇందులో సుమారు 4.2 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 1214 గ్రామ సంఘాలకు గానూ ఒక్కో వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) చొప్పున నియమించారు. ఒక్కో గ్రామంలో వందకుపైగా గ్రూపులుంటే ఇద్దరు వీఓఏలు ఉంటారు. వీరు నిత్యం మహిళలతో సమావేశాలను నిర్వహిస్తూ వారి ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వందలాది మంది వీఓఏలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. గ్రామ సంఘబంధ తీర్మానంతో కోర్టును ఆశ్రయించగా, తొలగించొద్దని ఉత్తర్వులు జారీ చేసినా వాటిని అధికారులు ఏ మాత్రం అమలు చేయడంలేదు.
నిబంధనల ప్రకారం అయితే..
నిజానికి స్థానికంగా ఆయా గ్రామాల్లో ఉండే పొదుపు గ్రూపులు తీర్మానం చేసి ఒకర్ని వీఓఏగా నియమించుకుంటారు. ఈ ప్రక్రియలో అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం ఉండదు. తీర్మానానంతరం సదరు కాపీని మండల ఏపీఎంకు పంపుతారు. తదుపరి ఈ పేరును ఆన్‌లైన్లో నమోదయ్యేలా చర్యలు చేపడతారు. గతంలో వీరికి తక్కువ వేతనం లభించినా, ప్రస్తుతం రూ.ఎనిమిది వేల జీతమొస్తోంది. దీంతో కూటమి నేతలు తమ కార్యకర్తల కుటుంబసభ్యులు, టీడీపీకి అనుకూలంగా ఉండే మహిళలను నియమించుకుంటూ నిబంధనలను అపహాస్యం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో డీఆర్డీఏలో పనిచేస్తున్న ఓ కీలకాధికారి అంతా తానై చూసుకుంటున్నారని సమాచారం. ఆదుకోవాల్సిన అధికారులే తమ మెడపై కత్తిపెట్టి రాజీనామాలు చేయాలని వేధిస్తుండటంతో గోడును ఎవరికి తెలియజేయాలో పాలుపోక మదనపడుతున్నారు.
కూటమి నేతలు
వీఓఏలు
కోవూరు మండలం గంగవరం వీఓఏగా శేషమ్మ వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈమైపె కూటమి నేతలు కక్షగట్టారు. రాజీనామా చేయాలని నిరంతరం వేధింపులకు గురిచేయడంతో ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సంగానికి చెందిన రమణమ్మ వీఓఏగా 20 ఏళ్లుగా వ్యవహరిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వందలాది మంది మహిళలను గ్రూపుల్లో చేర్పించి వారి ఆర్థిక ప్రగతికి బాటలేశారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ ఆమైపె పచ్చ నేతలు బెదిరింపులకు దిగారు. కేసులు బనాయించి జైలుకు పంపుతామంటూ వేధింపుల పర్వానికి తెరలేపారు. దీంతో ఉద్యోగాన్ని వదులుకొని, మానసిక క్షోభకు గురవుతున్నారు.
పొదుపు
సంఘాలు
36,000
సభ్యులు
4.2
లక్షలు
గ్రామ
సంఘాలు 1214
వీఓఏలు
1214

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఇలా..