
ఆలస్యంగా వచ్చి.. బాధతో వెనుదిరిగి..
నెల్లూరు(టౌన్): ‘ప్లీజ్ సర్.. మమ్మల్ని పరీక్ష కేంద్రంలోకి అనుమతించండి’ అంటూ విద్యార్థులు బతిమిలాడుకున్నారు. సమయం మించిపోయిందని సిబ్బంది చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. బుధవారం నెల్లూరులోని పొట్టేపాళెంలో ఉన్న ఆయాన్ డిజిటల్ సెంటర్ జేఈఈ మెయిన్స్ పరీక్ష జరిగింది. ఇవిఈనెల 9వ తేదీ వరకు జరుగుతాయి. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,800 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో పరీక్ష జరిగింది. ఉదయం 7.30 గంటలకే విద్యార్థులను డిజిటల్ సెంటర్‌లోకి అనుమతించారు. ఆ సమయంలో మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు చేశారు. 8.30 గంటల తర్వాత ఏడుగురు విద్యార్థులు వచ్చారు. తమను పరీక్షకు అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బంది, అధికారులను బతిమలాడారు. కుదరదని చెప్పడంతో బాధపడుతూ వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి జరిగిన రెండో విడతలో కూడా గంటన్నర ముందుగానే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు.
నెల్లూరులో జేఈఈ మెయిన్స్ పరీక్ష
ఆలస్యంగా రావడంతో
ఏడుగురికి అనుమతి నిరాకరణ

ఆలస్యంగా వచ్చి.. బాధతో వెనుదిరిగి..

ఆలస్యంగా వచ్చి.. బాధతో వెనుదిరిగి..