
సాక్షి, హైదరాబాద్: ప్లాస్మా దానం చేసి ప్రాణాలను రక్షించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మరోసారి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది ఇప్పటివరకూ 150మందికి పైగా పోలీస్ అధికారులు ప్లాస్మా దానం చేశారని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘మనిషి మాత్రమే మరో మనిషికి దానం చేయగలడు. మీకు సహాయం చేయడానికి సిటీ పోలీసులు ఉన్నారు. ప్లాస్మా విరాళం వాట్సాప్ కోసం లేదా 9490616780కు కాల్ చేయండి’అని కోరారు. కాగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులకు మరొకసారి పునర్జన్మనిచ్చేందుకు రక్తదానం దోహదపడుతుందని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు నగర పోలీసులు తమ తరపున ప్లాస్మా అందచేస్తుందన్నారు.