
హైదరాబాద్: బోరబండ పీఎస్‌ను హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం బోరబండ పోలీస్ స్టేషన్‌కు ఆకస్మికంగా వచ్చిన సీపీ.. సీఐ రవికుమార్‌ను రౌడీ షీటర్ల లెక్క అడిగారు.
దీనికి సీఐ రవికుమార్ తటపటాయించారు. అసలు రౌడీ షీటర్లు ఎవరో గుర్తించు అంటూ సీఐని సీపీ వెంట తీసుకెళ్లారు. రౌడీ షీటర్ల ఇళ్లను సీఐ రవికుమార్ గుర్తించలేకపోయారు. దాంతో సీఐను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సందీప్ శాండిల్య.