
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రీచైతన్య కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని నందిని(16) ఆత్మహత్య చేసుకుంది. క్లాస్‌రూమ్‌లోనే నందిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్‌కు సమాచారం అందించారు. వెంటనే నందిని మృతదేహాన్ని ఆసుపత్రి యాజమాన్యం మార్చురీకి తరలించింది. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
కాగా, విద్యార్థిని మృతి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.