
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 11 గంటలకు ఫలితాలను అధికారి కంగా విడుదల చేస్తారు. టెన్త్ పరీక్షల విభా గం డైరెక్టర్ కృష్ణారావు ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను http:// results. bse.telangana.gov.in, http://results.bsetela అనే వెబ్‌సైట్లలో చూడవచ్చని తెలిపారు.
‘సాక్షి’లో వేగంగా ఫలితాలు ఇంటర్‌మీడియెట్ ఫలితాలను అందించిన విధంగానే టెన్త్ ఫలితాలను శరవేగంగా అందించేందుకు ‘సాక్షి’ దినపత్రిక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది.www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఫలితాలను చూడవచ్చు.
