Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu And Yellow Media1
బాబు కోసం సరే.. రేవంత్‌ సంగతేంటీ.. పచ్చ పైత్యంతో పిచ్చి రాతలు!

‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్‌ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్‌ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

White House responds Over China rare earth limits2
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్‌ ప్లాన్‌తో టెన్షన్‌లో ట్రంప్‌!

వాషింగ్టన్‌: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదంటూ చైనా, అమెరికా మధ్య ట్రేడ్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చైనా గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిర్ణయంపై వైట్‌హౌస్‌ స్పందించారు.తాజాగా ట్రంప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్‌ హసెట్‌ మాట్లాడుతూ..‘చైనా అరుదైన ఖనిజాల నిలిపివేత ఆందోళనకరం. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని’ అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ తన టారిఫ్ ప్రణాళికలతో ప్రపంచ వాణిజ్యానికి ఆర్థిక మాంద్యం తెచ్చే పరిస్థితులు వందకు వంద శాతం లేవని క్లారిటీ ఇచ్చారు.The chart shows how much the US relies on imports for rare earth metals, what they are used for, and how much of the imports come from China. A good one from JPM-AM. pic.twitter.com/xQalD5ZyH7— Ayesha Tariq, CFA (@AyeshaTariq) April 14, 2025మరోవైపు.. ఇదే అంశంపై యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా.. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదన్నారు. అలాగే, చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా ఈ ఖనిజాలను 90 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్‌ నిలిపివేసింది. దీంతో, ట్రంప్‌ సర్కార్‌కు ఊహించని షాక్‌ తగిలింది.BREAKING: Trump Administration’s Kevin Hassett says he’s “100 percent not expecting a recession.”He claims that job numbers are through the roof as the reason why.Does he not realize that Job numbers are from the month of March and Tariffs started in the beginning of April?… pic.twitter.com/DjXuC1vfT9— Ed Krassenstein (@EdKrassen) April 14, 2025ఇక.. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం సుంకం విధించగా.. చైనా కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక, ఈ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

IPL 2025: MS Dhoni Completes 200 Dismissals In IPL With Terrific Glovework Vs LSG3
ఐపీఎల్‌లో తొలి ‘డబుల్‌ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని

ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 200 డిస్మిసల్స్‌ను (క్యాచ్‌లు లేదా స్టంపింగ్స్‌) పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా (ఫీల్డర్‌ లేదా వికెట్‌ కీపర్‌) చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్‌ 14) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్‌ బదోనిని స్టంపౌట్‌ (రవీంద్ర జడేజా బౌలింగ్‌లో) చేయడంతో ఈ ఘనత సాధించాడు. 𝙀𝙖𝙨𝙞𝙡𝙮 𝘿𝙤𝙣𝙚 😎Dismissal No.2⃣0⃣0⃣ for MS Dhoni Wicket No.2⃣ for Ravindra Jadeja tonight 🎥 @ChennaiIPL fans have plenty to celebrate here 💛Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK | @msdhoni | @imjadeja pic.twitter.com/UHwLwpJ4XK— IndianPremierLeague (@IPL) April 14, 2025ఈ మ్యాచ్‌లో ధోని మరో ఇద్దరిని ఔట్‌ చేయడంలో కూడా భాగమయ్యాడు. పతిరణ బౌలింగ్‌లో వైడ్‌బాల్‌ను కలెక్ట్‌ చేసుకుని అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో (నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌) అబ్దుల్‌ సమద్‌ను రనౌట్‌ చేసి.. ఆ మరుసటి బంతికే లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. పంత్‌ క్యాచ్‌తో ఐపీఎల్‌లో ధోని డిస్మిసల్స్‌ సంఖ్య 201కి చేరింది. ధోని తన 270వ ఇన్నింగ్స్‌లో డిస్మిసల్స్‌ డబుల్‌ సెంచరీని పూర్తి చేశాడు.Thala doing it all tonight, in his own style😎What a precise underhand throw that was by Dhoni 🔥#LSGvsCSK #LSGvCSK #CSKvLSG pic.twitter.com/kIuPayt8t4— Aditya Singh Rawat (@Catslayer_999) April 14, 2025ఐపీఎల్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన ఆటగాళ్లు (ఫీల్డర్‌ లేదా వికెట్‌ కీపర్‌)201* - ఎంఎస్‌ ధోని (155 క్యాచ్‌లు, 46 స్టంపింగ్‌లు)182 - దినేష్ కార్తీక్126 - ఏబీ డివిలియర్స్124 - రాబిన్ ఉతప్ప118 - వృద్ధిమాన్ సాహా116 - విరాట్ కోహ్లీలక్నో మ్యాచ్‌లో తొలుత అద్భుతమైన వికెట్‌కీపింగ్‌తో అదరగొట్టిన ధోని ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 26 పరుగులు చేసి సీఎస్‌కే గెలుపులో ‍ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్‌ అహ్మద్‌ (4-0-13-0), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-38-1), అన్షుల్‌ కంబోజ్‌ (3-0-20-1) రాణించడంతో నామమాత్రపు స్కోర్‌కే (166/7) పరిమితమైంది.లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్‌ మార్ష్‌ (30), ఆయుశ్‌ బదోని (22), అబ్దుల్‌ సమద్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్‌ (8), మార్క్రమ్‌ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కే.. తొలి 15 ఓవర్ల వరకు (115/5) పరాజయం దిశగా సాగింది. ధోని రాకతో సీఎస్‌కేలో గెలుపు జోష్‌ వచ్చింది. ధోని వచ్చీ రాగానే ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన శివమ్‌ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధోని అండతో గేర్‌ మార్చాడు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి 3 బంతులు మిగిలుండగానే సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చారు.సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు షేక్‌ రషీద్‌ (27), రచిన్‌ రవీంద్ర (37) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రాహుల్‌ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7), విజయ్‌ శంకర్‌ (9) నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్‌ (3-0-18-2), మార్క్రమ్‌ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

Congress Leaders Counter On Kotha Prabhakar Reddy Comments4
‘కొత్త’ వ్యాఖ్యలతో పొలిటికల్‌ వార్‌.. కాంగ్రెస్‌ రియాక్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసుగుచెందరని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.అధికార దాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు.. మంత్రి పొంగులేటికాంగ్రెస్‌ పాలన వచ్చినప్పటి నుంచి కూలుస్తామంటున్నారు.. అధికారదాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూ భారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భూ భారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్‌ ఆత్మ కొత్త ప్రభాకర్‌రెడ్డి. కేసీఆర్‌ సూచన మేరకే ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అధికారంలోకి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. భూ భారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.కేసు బుక్‌ చేయాలి.. ఆది శ్రీనివాస్‌కొత్త ప్రభాకర్‌రెడ్డి వాఖ్యలు సీరియస్‌గా పరిగణించాలంటూ ప్రభుత్వ విప్‌, వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తా. సంక్షేమం ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ED Office Summoned Notices To Robert Vadra5
ఈడీ విచారణకు రాబర్ట్‌ వాద్రా.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో టెన్షన్‌

ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు బిగ్‌ షాక్‌ తగిలింది. హర్యానాలోని శిఖోపూర్‌ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు వాద్రాకు మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీ నోటీసులపై..‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు ​​పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Businessman Robert Vadra marches from his residence to the ED office after being summoned in connection with a Gurugram land case, alleges 'political vendetta'.He says, "Whenever I will speak up for people and make them heard, they will try to suppress me... I… pic.twitter.com/mRrRZedq6l— ANI (@ANI) April 15, 2025ఇదిలా ఉండగా.. రాబర్ట్‌ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ.. రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీంతో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబర్ట్‌ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీంతో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.

Movie Director Laxman Utekar Life Story6
రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్‌

చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) జీవితం నేటి యువతరానికి రోల్‌ మోడల్‌ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన సమర్పూర్‌లో జన్మించిన ఆయన సినిమా మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్‌గా స్టార్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఆశిస్తున్నారు.'ఛావా'(Chhaava) సినిమాతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ముందు ఆయన కష్టాలు చాలానే ఉన్నాయి. సినిమా మీద ఆసక్తితో తన గ్రామం నుంచి ముంబైకి వచ్చిన లక్ష్మణ్‌కు మొదట ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఏలాగైనా విజయం సాధించిన తర్వాతే తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన ఖర్చుల కోసం వడాపావ్‌ అమ్మె షాపులో పనిచేశాడు. ఆపై కొద్దిరోజుల్లోనే ఒక సినిమా స్టూడియోలో ఫ్లోర్స్‌ క్లీన్‌ చేసే పనికి కుదిరాడు. అక్కడ సినిమా మేకింగ్‌ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న ఆయనకు 2007లో ఖన్నా & అయ్యర్‌ సినిమాతో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా ఛాన్స్‌ వచ్చింది. అలా ఇండస్ట్రీలో తన కెరీర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేయడంతో పాటు కొన్ని యాడ్స్‌ కోసం కూడా వర్క్‌చేశాడు. ఆ తర్వాత మరాఠీ భాషలో కొన్ని సినిమాలు తెరకెక్కించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 2019లో హిందీ సినిమా 'లూకా చుప్పి'తో భారీ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత మిమి( కృతి సనన్), జరా హట్కే జరా బచ్కే(విక్కీ కౌశల్) చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్‌లో మరింత పాపులర్‌ అయ్యాడు. అయితే, రీసెంట్‌గా ఛావా సినిమాతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 805 కోట్లతో రాబట్టి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి లక్ష్మణ్ ఉటేకర్‌ చాటాడు. అలా వడాపావ్‌ బండి నుంచి బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమంది యువకులకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్లు పైమాటే అని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'మిమి' చిత్రం రెండు జాతీయ అవార్డులను(National Film Awards) దక్కించుకుంది. ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) అవార్డ్స్‌ అందుకున్నారు. ఆపై ఈ చిత్రం 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

US Freezes 2 2 Billion Funding for Harvard after University Defies7
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్‌ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్‌

వాషింగ్టన్‌ డీసీ: ట్రంప్‌ సర్కారు హార్వాడ్‌ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్‌ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్‌ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్‌ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్‌ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్‌ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్‌ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

BRS MLA Kotha Prabhakar Reddy Sensational Comments8
రేవంత్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?

సాక్షి, దుబ్బాక: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Nita Ambani 60 Million US Dollar Emerald Necklace's Replica At Rs 1789
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్‌..178కే : హర్ష్‌ గోయెంకా ఫన్నీ ట్వీట్‌

అసలు కంటే నకిలీ ముద్దు ఇదీ ఇవాల్టీ ట్రెండ్‌. మార్కెట్లో ‘రెప్లికా’ ట్రెండ్‌ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు ఇబ్బడిముబ్బడిగా నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. డిజైనర్‌ సారీ అయినా, కోట్ల విలువ చేసే డిజైనర్‌ డైమండ్‌ నెక్లెస్‌ అయినా ఒరిజినల్‌ని మరిపించేలా రెప్లికాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కథనం చదివితే.. ఔరా రెప్లికా అనిపించక మానదు. ఇక కోట్ల విలువ చేసే డైమండ్‌ నగలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అంబానీ కుటుంబానికి చెందిన ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ పేరే. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ సందర్బంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ పచ్చలు పొదిగిన ఓ డైమండ్ నక్లెస్ ధరించారు. దాని ఖరీదు రూ.500 కోట్లు . దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట మళ్లీ సందడి చేస్తోంది.విశేషమేమిటంటే ఈ నెక్లెస్ కి రెప్లికా మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.500కోట్ల విలువచేసే నెక్లెస్, రెప్లికా అంటే కనీసం ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉంటుంది అనుకుంటున్నారా? కానే కాదు, కేవలం రూ.178 కి జైపూర్‌లో అన్‌లైన్‌ అమ్ముతుండటం విశేషం. దీనిని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.జైపూర్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారి 'నీతా అంబానీజీ నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది’’ అంటూ మార్కెటింగ్‌ చేయడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోను ముఖ వ్యాపారవేత్త, RPG ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ హర్ష్ వర్ధన్ గోయెంకా (2024లో) ట్వీట్‌ చేశారు. "అబ్ క్యా బోలూం! #మార్కెటింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో నెటిజన్లను ఇది బాగా ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేశారు. తక్కువ ధరలకు లగ్జరీ వస్తువులను రూపొందించడంలో భారతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ 'కాపీ చేయడంలో ఇండియా అత్యుత్తమం' అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, 'ఇందులో తప్పేముంది భయ్యా.. అందరై తమకిష్టమైన ఫ్యాషన్‌ను ధరించడానికి అర్హులు. అందుకు డబ్బు అడ్డు రాకూడదు కదా ' అని, కమెంట్‌ చేశారు. 'ధన్యవాదాలు, నేను నా భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతిని ఇస్తాను' అని కామెంట్ చేయడం విశేషం. అంతేకాదు నీతా అంబానీ లాగా ఆభరణాలు ధరించాలనే చాలా మంది మహిళల కలలను నెరవేర్చినందుకు ఆ ఆభరణాల వ్యాపారిని ప్రశంసించారు.

KL Rahul ventured into business alongside cricket career10
హై-ఎండ్‌ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్‌ రాహుల్‌ ఆస్తుల వివరాలు

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్‌ మార్కెట్‌ అధికంగా ఉంటుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్‌ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్‌లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తులో భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ టీమ్‌ లక్నో సుపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్‌ చేస్తున్న బ్రాండ్‌ల సంగతుల గురించి తెలుసుకుందాం.భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్‌లను రాహుల్ ప్రమోషన్‌ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.ముంబైలోని కార్టర్ రోడ్‌లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌.. ఎందుకంటే..మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్‌ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.అర్బన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్‌ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.రాహుల్‌ నిలకడైన గేమింగ్‌ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement