బోగస్ కంపెనీల ద్వారా డబ్బులు ఖర్చు చేసినట్లు.. దొంగ బిల్లులతో హవాలా పద్దతిలో విదేశాలకు పంపించారని ఐటీ అధికారులు పేర్కొన్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన కర్నూలులో మీడియాతో మట్లాడుతూ.. 40 చోట్ల రెండు వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయని.. ఒక ప్రముఖ నాయకుడి పర్సనల్ సెక్రటరీ అని ఐటి అధికారులు వెల్లడించారని ఆయన అన్నారు. ఒక పెద్ద కంపెనీని సబ్ కాంట్రాక్టు తీసుకున్నట్లు స్కామ్ చేశారన్నారు.