Buggana Rajendranath Reddy
-
ఇంత దా‘రుణమా’?
సాక్షి, అమరావతి: ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్(AP Budget)లో రాష్ట్ర అప్పులను రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. ఇందులో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం(YSRCP Govt) వచ్చే నాటికి ఉన్న రాష్ట్ర అప్పు రూ.3.10 లక్షల కోట్లు. 2024లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.6.46 లక్షల కోట్లు. అందులో టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.3.10 లక్షల కోట్ల అప్పులు కూడా ఉన్నాయి.ఇవన్నీ మీరు మీ తొలి బడ్జెట్లో చూపినవే. అయినా సరే రుణాలపై మళ్లీ అసత్య ప్రచారం చేస్తారా..?’’ అంటూ సీఎం చంద్రబాబును ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) నిలదీశారు. ‘‘మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పదేపదే అసత్యాలు వల్లె వేస్తారా? బడ్జెట్ వాల్యూమ్–6 (బడ్జెట్ ఇన్ బ్రీఫ్)లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రస్తుత బడ్జెట్లో ఆ వివరాలను ఎందుకు ముద్రించలేదు? అప్పులపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే ఆ వివరాలను మీరు ముద్రించలేదన్నది వాస్తవం కాదా?’’ అని బుగ్గన నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే తక్షణమే బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..⇒ రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) కూటమి అదే పనిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. ఇష్టానుసారం మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయంటూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. శనివారం కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని నిందిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలేశారు.⇒ నిజానికి ఏనాడూ రాష్ట్ర అప్పులు ఆ స్థాయిలో లేవు. ఎవరి హయాంలో అప్పులు పెరిగాయి? అనేది ఆధారాలతో సహా మేం చాలాసార్లు మాట్లాడాం. స్పష్టంగా చూపాం. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పుల పెరుగుదల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 19.54 శాతం కాగా, 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 15.61 శాతం మాత్రమే.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినా కూడా, అప్పుల పెరుగుదల తక్కువే. అవన్నీ గణాంకాలతో సహా చెప్పాం. కానీ, చంద్రబాబు ఏనాడూ దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే, అవన్నీ వాస్తవాలు కాబట్టి. మరి అలాంటప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని అంత అన్యాయంగా ఎలా మాట్లాడారు చంద్రబాబూ?.⇒ ఇక ఈ ఏడాది బడ్జెట్లో చంద్రబాబు సర్కార్ అప్పులు చూపలేదు. బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర రుణాలపై అన్ని వివరాలు చూపడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ, సంప్రదాయం. కానీ, సీఎం చంద్రబాబు దాన్ని కాలరాసి, ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర అప్పులను చూపలేదు. వాటి వివరాలు వెల్లడించలేదు. దీన్నిబట్టి ఆయన ఉద్దేశం ఏమిటన్నది ప్రజలు అర్ధం చేసుకోవాలి.⇒ బడ్జెట్ వాల్యూమ్–6లో రాష్ట్ర రుణాల వివరాలు ప్రకటిస్తే, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారన్నది తెలుస్తుంది. చంద్రబాబు అసత్య ప్రచారం బయటపడుతుందని అర్ధమవుతుంది. ఈ ఉద్దేశంతోనే బడ్జెట్లో అప్పుల వివరాలు వెల్లడించకుండా, యథావిథిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.కానీ, కాగ్ నివేదిక ఆధారంగా ప్రజలకు ఎలాగూ రాబోయే కాలంలో నిజం తెలుస్తుంది.⇒ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకుతిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని పచ్చి అసత్యాలతో నిందించడం మీ స్థాయికి భావ్యమా చంద్రబాబూ?. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలి.⇒ మీకు నిజంగా ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఉంటే వాల్యూమ్–6లో ఆనవాయితీగా, సంప్రదాయబద్ధంగా దశాబ్దాల నుంచి వచ్చే పద్ధతిలో అన్ని వివరాలతో అప్పుల వివరాలు ప్రింట్ చేయండి చంద్రబాబూ? అప్పుడు నిజమేదో బయట పడుతుంది. -
కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ... కంటెంట్ తక్కువగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటూ ఇన్నాళ్లూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం బడ్జెట్ లెక్కల సాక్షిగా బయటపడిందన్నారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. » బడ్జెట్ అంచనా వ్యయం రూ.3,22,359 కోట్లు, రెవెన్యూ రాబడి రూ.2,17,976 కోట్లు, అప్పు రూ.1,04,382 కోట్లుగా చూపించారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం గురించి 25 సార్లు, విధ్వంసం అంటూ మరో పది సార్లు ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అవుతోంది. ఇకనైనా ప్రజలకు ఎన్నికల హామీల అమలు గురించి చెప్పాల్సిన అవసరం లేదా? » సూపర్ సిక్స్ హామీలపై ప్రతి ఇంటికి తిరిగి పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారు. 2019–24 వరకు నాటి సీఎం వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకారం మేనిఫేస్టోలో చెప్పినది ప్రతీదీ అమలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో హామీలను అమలు చేస్తుందని ఆశతోనే ప్రజలు కూటమికి పట్టం కట్టారు. గతంలో అనేకసార్లు చంద్రబాబు వల్ల మోసపోయినా కూడా తిరిగి వారు చెప్పిన ఆకర్షణీయమైన హామీలతో మోసపోయి కూటమికి అధికారం అప్పగించారు. సూపర్ సిక్స్ హామీల అమలేదీ?సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్ లో ఎలా మొండిచేయి చూపించారో అలాగే ఈ బడ్జెట్ లో కూడా చేశారు. దీపం పథకం కింద అర్థదీపం, పావుదీపం అమలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినంత అప్పు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఒక్క ఏడాదిలోపే రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. 1995 నాటి పరిస్థితిని ఉదహరిస్తూ, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఆర్థిక మంత్రి వాపోయారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మిగులు బడ్జెట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ఈ సృష్టిస్తున్న సంపదను ఎందుకు కేటాయించడం లేదు? 2014–19 లో స్థూల ఉత్పత్తి 13.5 పెరిగితే, 2019–24 లో 10.3 పెరిగిందని పోలిక చెబుతున్నారు. వైఎస్సార్సీపీ హాయంలో కోవిడ్ తో మొత్తం ఎకానమీ దెబ్బతిన్న సమయాన్ని కూడా పోలుస్తారా?అప్పులపై తప్పుడు లెక్కలు» అప్పుల గురించి మాట్లాడుతూ 2024, మార్చి 31 నాటికి అప్పు రూ.3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు రూ. 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీస్ రూ. 80,914 కోట్లు, కార్పోరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లయిస్ రూ.36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు రూ.34,267 కోట్లు, రూ.1,13,000 కోట్లు కాంట్రాక్టర్లకు, ఎంప్లాయిస్ కు రూ.21,000 కోట్లు, మొత్తం కలిపి రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎలా మాపై విషప్రచారం చేశారు?» కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు అన్ని చంద్రబాబు చెప్పారు. కానీ కాగ్ చెప్పిన దాని ప్రకారం రూ.1,54,797 కోట్లు అని స్పష్టంగా ఉంది. అంటే కాగ్ చెప్పినది సరైనదా? లేక మీరు చెబుతున్న లెక్కలు సరైనవా? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక అంశాలపై ఏది చెప్పినా ప్రతి దానికీ ఆధారాన్ని చూపించేవారు, కానీ కూటమి మాత్రం తమ లెక్కలకు ఎక్కడా ఆధారాలను చూపించడం లేదు. సివిల్ సప్లయిస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేకపోవడం వల్ల, పేమెంట్ చేయడానికి సివిల్ సప్లయిస్ అప్పులు చేసింది. అంటే ఈ రూ.36,000 కోట్లు కూడా కాగ్ చెప్పిన రూ. 1,54,797 కోట్ల అప్పుల్లో కలిసే ఉంది. కానీ దానిని కూటమి ప్రభుత్వం విడిగా చూపి ఎక్కువ అప్పులు ఉన్నట్లుగా చిత్రీకరించింది. డిస్కం అప్పుల గురించి రూ.34,267 కోట్లు ఉన్నట్లు చూపించారు. సడ్సీటీ కింద రైతులకు, ఎస్సీ, ఎస్టీ లకు గృహ వినియోగ సబ్సిడీని ప్రభుత్వం డిస్కంలకు కట్టకపోవడం వల్ల డిస్కంలు అప్పులు చేశాయి. ఇవి కూడా కాగ్ చెప్పిన మొత్తంలో కలిసే ఉన్నాయి. దానిని కూడా విడిగా చూపి ఎక్కువ అప్పులు చేశామని ప్రచారం చేశారు. » అలాగే కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన వాటిల్లో అప్ లోడ్ అయినవి 86,000 కోట్లు వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం అప్పులు చూస్తే 7,83,773 కోట్లుగా లెక్క తేలుతున్నాయి. వీటిల్లో 3,90,250 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైయస్ఆర్ సీపీ పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. మా హయాంలో జరిగిన అప్పు రూ.3,33,513 కోట్లు మాత్రమే. కానీ కూటమి పార్టీలు మాపై తప్పుడు ప్రచారం చేశాయి. శ్రీలంక, కాంబోడియా అంటూ దుష్ప్రచారం చేశాయి.సంపద సృష్టించడమంటే వృద్ధి రేటు తగ్గడమా?» సంపద సృష్టి అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. పదినెలల్లో మైనస్ 0.01 శాతం వృద్ధిలో ఉన్నారు. వైఎస్సార్సీపీకి పాలన చేతకాదు అంటూ విమర్శలు చేశారు. మరి ఈ పదినెలల్లో మీరు చేసింది ఏమిటీ? స్థూల ఉత్పత్తి బాగుంటే, రెవెన్యూ రాబడిలో వృద్ది కనిపిస్తుంది. 2024లో అంటే ఏప్రిల్ నుంచి 2025 జవనరి వరకు పదినెలలు లెక్కేస్తే రెవెన్యూ రాబడి మైనస్ లోకి వచ్చింది? 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు వైఎస్సార్సీపీ పాలనలో సాధించిన రెవెన్యూ రూ. 72,872 కోట్లు. కూటమి పాలనలో పది నెలల్లో రూ.72,864 కోట్లు వచ్చింది. అంటే మా కన్నా ఎనిమిది కోట్లు తక్కవగా రెవెన్యూ వచ్చింది. ఇదేనా మీ సంపద సృష్టి? » నీతి అయోగ్ ప్రకారం 2015–19 వరకు 12.9 శాతం రెవెన్యూ రాబడిలో సీఎజీఆర్ ఉంది. 2020–23 వరకు 14.1 శాతం పెరిగింది. దీనిని బట్టి ఎవరు సంపదను సృష్టిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంటిపన్నులు పెంచి రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారు. పన్నులు పెంచడం వల్ల రాబడి పెరగకపోగా ఒకదశలో నిలిచిపోతుంది. ఫిబ్రవరి 1, 2025 నాటికి 16,997 గ్రామాలు, 9వేల వార్డుల్లో మార్కెట్ విలువను పెంచాలని ప్రతిపాదించారు. కూటమి పాలనలో స్టాంప్స్ అండ్ రెవెన్యూ ఆదాయం పడిపోవడంతో దానిని పెంచుకోవడానికి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారుతాజా బడ్జెట్ లో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ధాన్యంకు గత ఏడాది రూ. 1740 క్వింటా రేటు ఉంటే, ఈ ఏడాది రూ.1,470 నుంచి 1,500 ఉంది. ఎంఎస్పీ రూ. 2,300 ఉంది. ప్రొక్యూర్ మెంట్ ఎక్కడ జరుగుందో తెలియడం లేదు. వ్యవసాయదారులు దళారీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మిర్చి క్వింటా గత ఏడాది 21 నుంచి 23 వేలకు అమ్మితే ఈ ఏడాది రూ.8 నుంచి 11 వేలకు అమ్ముతున్నారు. పత్తి క్వింటా గత ఏడాది మా హయాంలో రూ.10 వేలు ఉంటే, ఇప్పుడు రూ.5000కి అమ్మతున్నారు. మినుములు గత ఏడాది రూ.10 వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6 వేలు, కంది క్వింటాలు గత ఏడాది రూ.9–10వేలు అమ్మితే ఈ ఏడాది రూ.5500 లకు అమ్ముకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ కింద ఎక్కడా రైతులను ఆదుకోవడం లేదు. రూ.6300 కోట్లు అన్నదాతా సుఖీభవ కోసం బడ్జెట్ లో రాశారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలను కూడా కలుపుకునే అని మాట మార్చారు. దీని ప్రకారం చూసినా 45 లక్షల మంది రైతులకే అందుతుంది. మొత్తం 55 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇరవై వేలు రాష్ట్రప్రభుత్వమే ఇస్తే కనీసం 30 లక్షల మందికి కూడా ఈ కేటాయింపులు సరిపోవు. గత ఏడాదికే 55 లక్షల మంది రైతులు రైతుభరోసాను అందుకున్నారు. అన్నదాత సుఖీభవకు బడ్జెట్ లో కేటాయింపులు రూ.6300 కోట్లు అని చూపిస్తే, అగ్రికల్చర్ బడ్జెట్ లో వ్యవసాయ మంత్రి అన్నదాత సుఖీభవకు రూ.9400 కోట్లు చూపించారు. ఇందులో ఏది సరైనదో, ఎందుకు వ్యత్యాసం చూపించారో తెలియదు. పథకాల కేటాయింపుల్లోనూ చిత్తశుద్ధి లేదు» సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు చూస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అర్థమవుతుంది. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల భృతి అన్నారు, స్కూల్ కు వెళ్లే విద్యార్థికి రూ.15వేలు, ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఏ హామీకీ సరైన కేటాయింపులు లేవు. 2025–26లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు కేటాయిస్తున్నామని చెప్పారే తప్ప ఎంత దీనికి కేటాయిస్తున్నారో ప్రకటించలేదు. తల్లికి వందనం పైన కూడా అలాగే చెప్పారు. నిజంగా వీటిని అమలు చేసే ఉద్దేశం ఉంటే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేదు? » తల్లికి వందనంకు బడ్జెట్ బ్రీఫ్‌లో రూ.9,407 కోట్లు చూపించారు. కానీ వాస్తవంగా లెక్కలను బట్టి దాదాపు రూ.12,450 కోట్లు అవసరం. కానీ కేటాయించింది రూ.8,278 కోట్లు మాత్రమే. దీనిప్రకారం కేవలం 55 లక్షల పిల్లలకే తల్లికి వందనం అందుతుందని అర్థమవుతోంది. అంటే వారికి ఎగ్గొట్టేస్తున్నారు. అప్పు చూస్తే జనవరి నెలాఖరు నాటికి రూ.82,738 కోట్లు అని చూపించారు. కానీ బడ్జెట్ బుక్ లో మాత్రం అప్పు కేవలం రూ. 73,362 కోట్లు అని రాశారు. మూలధన వ్యయం రూ.24,072 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పి, ఖర్చు పెట్టింది ఎంతా అని చూస్తే రూ.10,850 కోట్లు మాత్రమే. అంటే ఈ రెండు నెలల్లో రూ.13000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారా? -
కూటమి పానలపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది
-
చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవిన్యూ లోటు ఉంటుంది
-
Buggana: బడ్జెట్ కోసమా..? లేక గత ప్రభుత్వం కోసం అసెంబ్లీ పెట్టారా..?
-
AP Budget 2025: చంద్రబాబు సంపద సృష్టిపై బుగ్గన సెటైర్లు
సాక్షి,తాడేపల్లి : ఏపీ బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.గతేడాది అన్నదాత సుఖీభవకు రూ.4,500కోట్లు కేటాయించారు.గతేడాది అన్నదాత సుఖీభవ ఎవరికైనా వచ్చిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21వేల కోట్లు అవసరం. అన్నదాత సుఖీభవకు కేటాయించింది రూ.6300కోట్లే. హామీల అమలుకు టైమ్ టేబులంటూ ఏమీలేదు. రాష్ట్ర బడ్జెట్ కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ ప్రసంగం నెగటివ్ మాటలతో మాట్లాడారు. అరాచకం, విధ్వంసం అంటూ మొత్తం 35 సార్లు అన్నారు.సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. ఇప్పటికీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి తన హయాంలో కేలండర్ పెట్టి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు చంద్రబాబు ఎక్కువ ఇస్తాననేసరికి జనం నమ్మారు. కానీ చంద్రబాబు మళ్ళీ జనాన్ని మోసం చేశారు. సంవత్సరం కాకముందే లక్షన్నర కోట్లు అప్పు చేశారు. ప్రజల మీద ఎక్కువ పన్నుల భారం వేయకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ చంద్రబాబు అధిక భారాలు వేస్తూ చాణక్యుడి పేరు వాడటం హాస్యాస్పదం. మా ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడారు.మధ్యలో దళారులు లేకుండా సంక్షేమం అందిస్తే బటన్ నొక్కుడు అంటూ హేళన చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల టైం వచ్చేసరికి మా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. తీరా అధకారంలోకి వచ్చాక ఏదీ అమలు చేయటం లేదు.కూటమి ప్రభుత్వంలో పెట్టే కేసులు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తులు బాగా పెరిగాయి. గ్రామాల్లో ప్రజలు అప్పుల పాలయ్యారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి తర్వాతనే ఇస్తామంటున్నారు.రూ.4,500 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు చెప్పారు. ఏ రైతుకైనా అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారా?. కార్పోరేషన్ల అప్పుల్లో కూడా తప్పడు లెక్కలు చూపెట్టారు. వస్తుందో రాదో తెలియని ఆదాయాన్ని ఇప్పుడు లెక్కల్లో చూపించి ఖర్చు పెడతామంటున్నారు.ఒక విధానం, ఒక టైంటేబుల్ అనేదే లేదు. ఎవరో రాసిచ్చిన లెక్కలు చదవటం తప్ప బడ్జెట్లో ఇంకేం లేదు. రాష్ట్ర అభివృద్ధిని దేశ అభివృద్ధితో పోల్చాలేగానీ, గత ప్రభుత్వాలతో పోల్చుతారా?. అసెంబ్లీలో ఉత్సాహం, ఊపు ఎవరిలోనూ కనపడలేదు.గత బడ్జెట్లో పెట్టి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఊసేలేదు.తల్లికివందనం కింద ఎంతమందికి ఇచ్చేదీ క్లారిటీ లేదు. 55 లక్షల మంది పిల్లలకి మాత్రమే ఇచ్చేలా బుక్‌లో రాశారు. అంటే మిగతావారి పరిస్థితి ఏంటి?.గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు.రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్ళు లేక ప్రయివేటు వారికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పత్తి, మిర్చి, కంది, మినుముల ధర మా హయాంతో పోల్చితే ఇప్పుడు సగానికి సగం తగ్గింది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది.ఈ ప్రభుత్వంలో కనీసం వారి సమస్యలు వినే పరిస్థితే లేదు. మా హయాంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు 31 లక్షల మందికి ఇచ్చాం.ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్నవి తొలగిస్తున్నారు.అమరావతి కోసం రూ.76 వేల కోట్లు అప్పు చేశారు.మేము చేస్తే అప్పు, మీరు చేస్తే నిప్పా?. స్థూల ఉత్పత్తి బాగుంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన ఆదాయం ఎందుకు కనపడటం లేదు?. సంపద సృష్టిస్తామనే వారు మా హయాంలో కంటే తక్కువ ఆదాయాన్నే రాష్ట్రానికి సమకూర్చారు. మీది P4 ఐతే మాది W4. అంటే సంక్షేమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? లేక ఇంటిలిజెన్స్ ఆర్టిఫిషియలో అర్థం కావటం లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉంటుందా? -
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే ఎందుకు పరిమితమైంది?: బుగ్గన
కర్నూలు (టౌన్): పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కాదా అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన చేతగానితనం, పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతోందన్నది నిజం కాదా అని నిలదీశారు. 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిoచాల్సి ఉంది. ఆ విధంగా నిరి్మస్తేనే పోలవరం ద్వారా 200 టీఎంసీల నీరు లభిస్తుంది. దీనివల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, విశాఖ నగరానికి, 600 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలు చేకూరాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. అయితే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు. దీనిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి తెలీకుండానే కేంద్రం పోలవరం ఎత్తును 41.15 అడుగులకు ఖరారు చేస్తుందా? నిజానికి.. 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే దానిని సరిదిద్దుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిన విషయం నిజం కాదా? ఇక రూ.12,500 కోట్లు సాధించామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించింది కాదా!? ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వచేస్తామని చెప్పాం కదా.. తర్వాత రెండేళ్లలో నీటినిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి ప్రాజెక్టు ఎత్తున 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. ఇది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉందా లేదా!? కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేస్తామని బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. బడ్జెట్ కాపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ‘నిర్మాణం’ అన్న పదానికి బదులు ప్రాజెక్టు పూర్తి (కంప్లీషన్)కి అని ఎందుకు పేర్కొన్నారు? దీని వెనకున్న మతలబు ఏంటి? ఇకపోతే.. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికీ ఎందుకు నిధులు కోరలేదు? 16 మంది టీడీపీ ఎంపీలున్నా బాబు ఎందుకు విఫలమయ్యారు? ఇక ఎన్డీఏ కూటమిలో 16 మంది టీడీపీ ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో.. నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? ఈ విషయంలో ఆయన ఏమాత్రం చొరవ చూపలేదన్నది నిజం కాదా? వాస్తవానికి.. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది కదా! అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి చంద్రబాబు ఎందుకు నిధులు సాధించలేకపోయారు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారా లేదా? ఇక గతంలో వైఎస్సార్సీపీకి 23 మంది ఎంపీలున్నారని, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పదేపదే విమర్శించారు కదా! నిజానికి.. అప్పుడు కేంద్రానికి వైఎస్సార్సీపీ మద్దతు అవసరంలేదు. కానీ, ప్రస్తుతం టీడీపీ మద్దతుపై కేంద్రం ఆధారపడి ఉంది. దీనిని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్దఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నా ఇప్పుడాయన ఎందుకు విఫలమయ్యారు? అదే కేవలం 12 మంది ఎంపీలతోనే బిహార్ రాష్ట్రం ఎక్కువ నిధులు సాధించి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఎలా దక్కించుకుంది? ఇటీవల నీతి ఆయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తలసరి ఆదాయంపై ఆయన విశ్లేషణను చూసి ఒక ఎన్ఆర్ఐ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తిచూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23లో రూ.2.20 లక్షలకు చేరింది. చంద్రబాబు హయాం కంటే జగన్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది నిజమా కాదా? సీఎంగా ఉన్న వ్యక్తే తప్పుడు లెక్కలు చెబితే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారా? వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూఇక వైఎస్ జగన్ హయాంలో అమలుచేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరిస్తోంది. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ రాబోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుచేసి బ్రాడ్‌బాండ్ సర్విస్ అందించాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. టీడీపీ, ఎల్లో మీడియా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాబోయే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది కదా.. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు కదా.. ఆనాడు మెడికల్ సీట్ల ఆవశ్యకతను మాజీ సీఎం జగన్ గుర్తించి రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి గత ఏడాది ఐదింటిని ప్రారంభించారు. దీనివల్ల 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయా లేదా? అన్ని కళాశాలలు పూర్తయితే 2,450 సీట్లు దక్కేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ సీట్ల సాధనలో ఎందుకు చొరవ చూపట్లేదు? రాష్ట్ర విద్యార్థులకు ఎందుకు ఇంతలా నష్టం చేకూరుస్తున్నారు?. -
బడ్జెట్లో అన్యాయం.. ఏపీకి చంద్రబాబు ఏం తీసుకొచ్చారు?: బుగ్గన
సాక్షి, కర్నూలు: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిల్చారని గుర్తు చేశారు. చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవం ప్రాజెక్టు ఎత్తుపైనా సీఎం రాజీపడుతున్నారని, దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన బుగ్గన ధ్వజమెత్తారు.బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:చంద్రబాబు దారుణ వైఫల్యం:ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆయన ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు. ఫలితంగా ఈ బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి దాదాపు మొండిచేయి చూపింది. నిజానికి టీడీపీ మద్దతులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది. అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి ఏ మాత్రం నిధులు దక్కించుకుందని చూస్తే తీవ్ర నిరాశే కనిపిస్తోంది.నాడు వైఎస్సార్సీపీపై నిందలు:గతంలో కేంద్ర బడ్జెట్ సందర్భాల్లో.. వైయస్సార్సీపీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పలుసార్లు పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే అప్పుడు కేంద్రానికి మా సీట్లతో, మా మద్దతుతో ఏ మాత్రం అవసరం లేని పరిస్థితి ఉంది. కానీ నేడు కేంద్రానికి ఎపీకి చెందిన ఎంపీల మద్దతు చాలా కీలకం. దీన్ని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో టీడీపీ ఉంది. కేవలం 12 మంది ఎంపీలు ఉన్న జేడీయూ బీహార్ రాష్ట్రానికి ఎన్నో సాధించగలిగితే, 16 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకెంత సాధించాలి? కానీ ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు.పోలవరం ప్రాజెక్టుకూ నష్టం:పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉంది. అలా నిర్మిస్తేనే పోలవరం ద్వారా 200 టిఎంసీల నీరు లభిస్తుంది. ఈ నీటి వల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ నగరానికి తాగునీరు, 600 గ్రామాలకు నీరు అందుతుంది.ఇన్ని ఉపయోగాలు అందాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అంగీకరిస్తోందా? కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే పోలవరం ఎత్తు 41.15 అడుగులే అని కేంద్రం ఎలా ఖరారు చేస్తుంది? నాడు 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే, దాన్ని సరిదిద్దేందుకు మా ప్రభుత్వానికి నాలుగేళ్ళు పట్టింది. ఈరోజు గొప్పగా రూ.12,500 కోట్లు కేంద్రం ద్వారా వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మా ప్రభుత్వం సాధించినదే. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేస్తాం, తరువాత రెండేళ్లలో నీటి నిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేసుకుంటూ పోయి, ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. అంటే పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది.అది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉంది. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం పూర్తి కోసం అంటూ బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్‌కు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి కూడా నిధులు కోరలేదు? ఈ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు.బీహార్‌కు అత్యధిక ప్రాధాన్యం:టీడీపీ కంటే తక్కువగా 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్న జేడీయూ, తమ రాష్ట్రం బీహార్‌కు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం దక్కించుకుంది. బీహార్‌లో మఖనా బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, పాత పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ, మిథులాంచల్కు చెందిన కోషీ కెనాల్ అభివృద్ధి, పాట్నా ఐఐటీ అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీహార్‌కు సంబంధించి గత బడ్జెట్లో పూర్వోదయ ప్రాంతంలోని గయలో అమృత్సర్–కోల్కత్తా పారిశ్రామికవాడ, పాట్నా పూర్ణియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్–బగల్పూర్ ఎక్స్‌ప్రెస్ వే, బోద్ గయా–రాజ్ ఘీర్–వైశాలీ–దర్భాంగ, బక్సర్‌లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో రెండు లైన్ల వంతెన సాధించుకున్నారు. అలాగే 2400 మెగావాట్ల పీర్ పాంటీ పవర్ ప్రాజెక్ట్స్‌కు రూ.21,400 కోట్లు సాధించుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు, ఎయిర్ పోర్ట్స్, బీహార్‌లో శాశ్వతమైన నిర్మాణ పనులకు క్యాపిటల్ వ్యయం కోసం కేంద్రం నుంచి సాయం దక్కించుకున్నారు. టీడీపీ మాదిరిగా జేడీయూ కూడా ఎన్డీఏలో భాగస్వామి. టీడీపీ కంటే ఆ పార్టీకి తక్కువ మంది ఎంపీలు. అయినా బడ్జెట్లో అధిక శాతం నిధులు దక్కించుకుంది.తలసరి ఆదాయంపైనా చంద్రబాబు తప్పుడు లెక్కలు:ఇటీవల నీతి అయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తలసరి ఆదాయంపై చెప్పిన విశ్లేషణను విన్న ఒక ఎన్ఆర్ఐ.. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తి చూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23 నాటికి రూ.2.20 లక్షలు అయ్యింది. అంటే చంద్రబాబు హయాం కంటే వైయస్ జగన్ గారి హయాంలో తలసరి ఆదాయం పెరిగింది.సీఎంగా ఉన్న వ్యక్తే ఇలా తప్పుడు లెక్కలు చెబితే, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా వస్తారా? నీతి అయోగ్ నివేదికను చూస్తే 2014–19 వరకు చంద్రబాబు ప్రభుత్వ పాలన, 2019–24 వైయస్ జగన్ పాలనను పోల్చడం అనేది హేతుబద్దంగా ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం తన పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని, జగన్ గారి పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని వాటిని పోల్చడం చూస్తుంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వారు ఇలా కూడా చేస్తారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూ..:వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరించబోతోంది. బడ్జెట్ కేటాయింపులు, విధానాలు చూస్తే అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశీ భాగస్వామ్యంతో దేశంలో 5 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అందించాం. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. దాన్ని నాడు టీడీపీతో పాటు, ఎల్లో మీడియా తీవ్రంగా తప్పు పట్టాయి, ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు చెడిపోతున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చింది. ఇప్పుడు సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అవే విధానాలు అమలు చేస్తోంది. విద్యార్ధులకు బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెస్తున్నారు. మరి దీన్ని కూటమి పార్టీలు ఎలా చూస్తున్నాయి? ఇది కూడా తప్పేనని ఇప్పుడు విమర్శించగలరా?మెడికల్ కాలేజీలు.. సీట్లు:రాబోయే 5 ఏళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర బడ్జెట్లో వెల్లడించారు. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఆవశ్యకత గుర్తించిన నాటి సీఎం శ్రీ వైయస్ జగన్, ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత విద్యా సంవత్సరంలోనే పూర్తి చేశారు. వాటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రాగా, అన్ని కాలేజీలు పూరై్త ఉంటే, మొత్తం 2450 మెడికల్ సీట్లు రాష్ట్రానికి దక్కేవి.అయితే ఆ కాలేజీల నిర్మాణం పూరై్తతే జగన్‌గారికి మంచి పేరొస్తుందని కుట్ర చేసిన చంద్రబాబు, ఇప్పుడు వాటన్నింటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. గత విద్యా సంవత్సరంలో పులివెందుల మెడికల్ కాలేజీలో అనుమతి ఇచ్చిన సీట్లు కూడా వద్దని చెప్పడంతో పాటు, కొత్త కాలేజీలకు అనుమతి కోరుతూ, ఈ ఏడాది జాతీయ వైద్య మండలికి లేఖ రాయొద్దని నిర్ణయించారు. ఆ వి«ధంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, సీట్లకు కేంద్రం ఒకవైపు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇవే కాలేజీలను పూర్తి చేసుకుంటూ పోతే కేంద్రం ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 10 వేల సీట్లలో నాలుగో భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరేవి.ఆదాయపన్నుతో మధ్య తరగతికి ఊరట:మధ్యతరగతి వారికి మేలు చేసేలా పన్ను విధానాలను తీసుకువచ్చారు. ఆదాయపన్నుకు సంబంధించి గత ఏడాది రూ.3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. ఈ ఏడాది రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.12 లక్షల ఆదాయం వరకు రిబేట్ రూపంలో ఆదాయపన్ను నుంచి ఉపశమనం లభించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వేతన జీవులకు, మధ్యతరగతి వారికి మేలు జరుగుతుంది.కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూస్తే..:దేశంలో తొలిసారి రూ.50,65,365 కోట్లు కేంద్ర బడ్జెట్ దాటింది. దీనిలో రెవెన్యూ రిసీట్స్ రూ.34,20,409 కోట్లు కాగా, క్యాపిటల్ రిసీట్స్ రూ.16,44,936 కోట్లు. రెవెన్యూ రాబడి, అప్పు రెండూ కలిపితే రూ.50 లక్షల కోట్లు దాటింది. దీనిలో క్యాపిటల్ వ్యయం రూ.11,21,090 కోట్లుగా చూపించారు. రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకుంటే రూ.15,48,282 కోట్లు. అదే గత ఏడాది రివైజ్డ్ అంచనాలను చూస్తే ఖర్చు రూ.47,16,487 కోట్లుగా ఉంది. మరోవైపు రెవెన్యూ రాబడి రూ.30,00,087 కోట్లుగా చూపించారు. అప్పు మాత్రం దాదాపు రూ.16,28,527 కోట్లు ఉంది. అంటే అప్పులు య«థాతథంగా కొనసాగిస్తున్నారు. వాస్తవాలు చూస్తే కేంద్ర బడ్జెట్లో అప్పులు పెద్దగా పెరగలేదు. ఇది మంచి పరిణామం.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాబడి, ఖర్చులు మాత్రం దాదాపు మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.10.18,000 కోట్లు అయితే, ఈ ఏడాది రూ.11,21,090 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు లక్ష కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నారు. అలాగే రాష్ట్రాలకు సహయం అందించే దాన్ని కూడా కలుపుకుంటే ఈ బడ్జెట్లో గత ఏడాదితో పోలిస్తే మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది ఆ మొత్తం రూ.15,69,527 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.15,68,000 కోట్లుగా ఉంది. అంటే ద్రవ్యలోటు, స్థూల ఉత్పత్తిని నిష్పత్తిగా చూస్తూ.. గత ఏడాది అది 4.8 ఉంటే ఈ ఏడాది 4.4 గా బడ్జెట్లో ప్రతిపాదించడం మంచి పరిణామం. కోవిడ్ నుంచి ఇది తగ్గుతూ వచ్చింది.బడ్జెట్లో నాలుగు విభాగాలకు ప్రాధాన్యత:కేంద్ర బడ్జెట్ లో నాలుగు భాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఇ, పెట్టుబడి, ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ పరంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త స్కీం ప్రారంభించబోతున్నారు. 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని అమలు చేయబోతున్నారు. స్వల్పకాలిక రుణాలను రూ.5 లక్షలకు పెంచనున్నారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి క్రెడిట్‌కార్డును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నారు.తొలిసారిగా పరిశ్రమను పెట్టే వారికి దీర్ఘకాలిక అప్పుగా టర్మ్‌లోన్‌ను రూ.2 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. గ్యారెంటీ లేకుండా ఇచ్చే అప్పును ఎంఎస్ఎంఈ లకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచారు. స్టార్టప్‌లకు కూడా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు. ఇది మంచి నిర్ణయం. ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేసే పరిమితిని కూడా పెంచబోతున్నారు. భారతీయ భాషా పుస్తక్ స్కీం కింద ఇంగ్లిష్ నుంచి వారి స్థానిక భాషల్లో అర్థం చేసుకునే విధంగా ఒక పథకం అమలు చేయబోతున్నారు.దేశంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల కోసం స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్రాలకు రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేయడం మంచిది. రాబోయే 10 ఏళ్లలో కొత్తగా 120 విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. భారత ట్రేడ్‌నెట్ కింద ఎగుమతిదార్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇంకా36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు పన్ను మినహాయింపు ఇవ్వడం సంతోషకరమని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. -
మీది విజన్.. మాది యాక్షన్.. కూటమిపై బుగ్గన కామెంట్స్
-
ఆరు నెలలు అయ్యింది.. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది
-
చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: అప్పుడు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు 1998లో కూడా విజన్-2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా?. మన మేనిఫెస్టోనే మన విజన్. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి నీకు 15వేలు, నీకు 18వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. ఆరు నెలలు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది?.పథకాల అమలేదీ..యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా.. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు.. అది కూడా ఇవ్వడం లేదు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు.. అది ఏమైంది?. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ.12,450 కోట్లు అవసరం. కానీ, కేవలం రూ.5,386కోట్లు కేటాయించారు. అంటే, తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి రూ.3,955 కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ.895 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి రూ.37,313 కోట్లు అవసరం.. కానీ, కేటాయింపులు మాత్రం సున్నా. దీంతో, అది కూడా లేనట్టే.ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ?కూటమిలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు.. కాన్నీ, ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్లిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటకు తెస్తామన్నారు. అలాగే, బెల్టు షాపులు రద్దు అన్నారు.. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా?.అప్పుల్లో బాబుదే రికార్డ్..2014-19 మధ్యలో కాపులకు ఐదేళ్లలో 5వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు. ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నాడు.. ఇచ్చాడా?. హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్ డ్యాకుమెంట్ రిలీజ్ చేస్తున్నాడు. జూన్‌లో రూ.6వేల కోట్ల అప్పు. జూలైలో రూ.10వేల కోట్లు, ఆగస్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.4వేల కోట్లు, అక్టోబర్‌లో రూ.6వేల కోట్లు, నవంబర్‌లో రూ.4వేల కోట్లు, డిసెంబర్లో రూ.9వేల కోట్లు అప్పులు చేశారు. ఒకేసారి రూ.5వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు. వైఎస్సార్సీపీ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు.. మీరు ఏకంగా 22.6 శాతం అప్పులు చేశారు’ అని చెప్పారు. -
ఆంధ్రప్రదేవ్ అప్పులపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు.. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థికమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డు అవుతుందని, నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, కాగ్ పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని బాబు ప్రభుత్వం కూడా ఇదే చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.అలాగే, పయ్యావుల చెప్పింది నిజమా? లేక సీఎం చంద్రబాబు చెప్పింది నిజమా లేదా టీడీపీ మాజీ ఆర్థికమంత్రి యనమల చెప్పింది నిజమా.. అనేది ఒకసారి ముగ్గురు ఒకచోట కూర్చుని ఒక అంకెకు వస్తే మంచిదని బుగ్గన ఎద్దేవా చేశారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లంటూ అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనని ఆయనన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా.. ఇదేమైనా గండికోట రహస్యమా.. అని ప్రశి్నంచారు. ‘స్కాములన్నీ మీరే చేశారు. తండ్రీ కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారు.. బడ్జెట్లో సూపర్–6, సూపర్–7 పథకాలకు కేటాయింపులు ఎక్కడ..’ అని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. స్కీములన్నింటికీ రికార్డులున్నాయివైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం సున్నా అని, స్కీములన్నీ స్కాములేనంటూ చంద్రబాబు బాధ్యతలేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కీములన్నీ డీబీటీ ద్వారానే అమలుచేసింది. వీటన్నింటికీ రికార్డులున్నాయి. మరి స్కాములెక్కడుంటాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం లైసెన్సులు, ఇసుక టెండర్లలో యథేచ్ఛగా దోపిడీ సాగించారు. తండ్రి కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకున్నారు. మైనింగ్ కాంట్రాక్టులు కూడా దోపిడీయే. ఏ స్కాములో చూసినా మీరే కనిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందిగత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.42,188 కోట్లు బకాయిలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటితో ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుంది? వాటినీ పరిగణనలోకి తీసుకున్నా బాబు హయాం కన్నా మేమే తక్కువ అప్పులుచేశాం. బాబు అప్పుల పెరుగుదల 22.63 శాతమైతే మాది 13.57 శాతమేఇక గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక సగటు అప్పుల పెరుగుదల 22.63 శాతం కాగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అది 13.57 శాతమే. దీన్నిబట్టి చూస్తే ఎవరెక్కువ అప్పులు చేశారో తెలుస్తుంది? అలాగే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి రూ.16,400 కోట్లు అప్పులుచేసింది. ఈ అప్పును వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం మినహాయించింది. మరోవైపు.. మూలధన వ్యయం సున్నా అని బాబు, సింగిల్ డిజిట్ అని యనమల చెప్పారు.. కానీ, మొన్నటి బడ్జెట్ డాక్యుమెంట్‌లోనే మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా చూపెట్టారు. ఇది సున్నా, సింగిల్ డిజిట్ ఎలా అవుతుందో చెప్పాలి. ‘విద్యుత్’పై ఆరోపణల్లోనూ నిజంలేదువిద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్లు నష్టంచేసినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణల్లోనూ నిజంలేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు రూ.6,625 కోట్లు ఉండగా చంద్రబాబు హయాంలో అవి రూ.28,715 కోట్లకు పెరిగాయి. అదే వైఎస్సార్సీపీ హయాంలో 2022–23 నాటికి అవి రూ.29,110 కోట్లే. రూ.395 కోట్లే పెరిగింది.ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి నేతలు... ఇప్పుడు 6 నెలల్లోనే రూ.6,072 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారు. మరో రూ.12,000 కోట్లు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. తలసరి ఆదాయం 2018–19 నాటికి రూ.1,54,031లతో దేశంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే.. 2022–23 నాటికి రూ.2,19,881లతో 15వ స్థానానికి చేరింది. యనమల ఆరోపణలు విచిత్రం.. విడ్డూరంఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల అయితే.. అప్పులపై చాలా అన్యాయంగా అవాస్తవాలు చెప్పారు. నిజానికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లే. ఇక వేస్ అండ్ మీన్స్, ఓవర్‌డ్రాఫ్ట్ అనేది అన్ని ప్రభుత్వాలు చేసేవే. వాటిని అవసరమైన రోజులు తీసుకోవడం ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తీర్చేయడం జరుగుతుంది. ఇలా తీర్చేసిన అప్పులను కూడా యనమల అప్పులుగా పేర్కొనడం.. విడ్డూరంగాను, విచిత్రంగాను ఉంది. అలాగే, ఆర్థిక విధ్వంసం, అరాచకం జరిగిందని ఆర్థికమంత్రి కేశవ్ అన్నారుగానీ, ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో చూపించలేకపోయారు? చిక్కీలపై బకాయి పెట్టామన్నారు. మరి వాళ్లు కోడిగుడ్లపై బకాయి పెట్టలేదా? రన్నింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం సహజం. ఆదాయం తగ్గలేదు, పెరిగిందిఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 1999–2004 మధ్య బాబు పెంచిన ఆదాయం 12.4 శాతమైతే.. 2004–2009 మధ్య వైఎస్సార్ 21.6 శాతం పెంచారు. తిరిగి 2014–19 మధ్య బాబు ఆరు శాతం పెంచితే 2019–2024 మధ్య జగన్ 16% పెంచారు. సూపర్ సిక్స్‌లో పావు దీపం తప్ప మిగతా ఏవీ అమలుచేయలేదు. ఎన్నికల ముందు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉండగా అవాస్తవాలు చెబుతూ తప్పులుచేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రతీసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కారు. ఈ వయస్సులో అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పడం చంద్రబాబుకు తగదు. -
ఏపీ అప్పులపై మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన క్లారిటీ
-
అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘లెక్క ఇది.. గుంజీలు ఎవరు తీయాలో ఆలోచించుకో బాబూ?’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. డీబీటీ ద్వారా అబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కాం ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై గతంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. అబద్దాన్ని నిజం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 9.56 లక్షల కోట్లు అప్పులున్నాయని.. తవ్వితే ఇంకెన్ని ఉన్నాయో అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. తవ్వడానికి ఏముంది? ప్రతి కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది ఆడిట్ జరుగుతాయి కదా?. గుంజీలు ఎవరు తీయాలో మీరే ఆలోచించుకోండి’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.‘‘2014-15లో ఓపెన్ మార్కెట్లో ఎక్కువ వడ్డీ పెట్టీ అప్పు తెచ్చుకున్నారు చంద్రబాబు. మాపై అప్పులు ఎక్కువ అయ్యాయని, ఎక్కువ వడ్డీ తో అప్పులు తీసుకున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మాజీ, ప్రస్తుత ఆర్ధిక మంత్రికి లెక్కలు అర్థం కావా?’’ అంటూ బుగ్గన ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!‘‘2014-19లో ట్రూ అప్ చార్జీలు రూ.6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగింది. మా ప్రభుత్వ హయాంలో 2,300 కోట్ల మాత్రమే వినియోగదారులపై భారం వేశాం. తాజాగా 5 నెలల్లోనే రూ.6,770 కోట్లు వినియోగదారులపై భారం మోపారు. ఇంకా రూ.12 వేల కోట్ల ట్రూ అప్ చార్జీల భారం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.’’ అని బుగ్గన నిప్పులు చెరిగారు. -
వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్
-
Buggana: అప్పులతో అమరావతి సాధ్యమా?
-
AP: ఈ బడ్జెట్ అగమ్యగోచరం: బుగ్గన
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా, రూ.41 వేల కోట్లు పెంచుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రనౌట్ అయ్యిందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. తాము 2019 మే 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలన్నరలోనే జూలై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కోవిడ్ వంటి ఇబ్బందులున్నప్పటికీ వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చామన్నారు. కానీ.. అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఐదు నెలల సమయం తీసుకున్నారంటూ దెప్పి పొడిచారు.బడ్జెట్ ప్రసంగంలో 21 సార్లు గత ప్రభుత్వమంటూ ప్రస్తావించారని ఎత్తిచూపారు. తీరా బడ్జెట్ చూస్తే అగమ్యగోచరం అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపాలు, లొసుగులను ఎత్తిచూపారు. ‘ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రచారం చేశారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ ప్రచారం చేసి ప్రజలకు ఆశ కల్పించారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాటి ఊసే లేదు’ అని కడిగి పారేశారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? ⇒ 2024–25 వార్షిక బడ్జెట్ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన అంచనాల మేరకు బడ్జెట్ రూ.2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్ మినహా, సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15 వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకం. ⇒ పన్ను రాబడి రూ.24 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. వాస్తవానికి ఆదాయం తగ్గింది. కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్నుల ఆదాయంలో దాదాపు 11 శాతం పెరుగుదల నమోదు కాగా, మేలో –2.8 శాతం, జూన్ లో –8.9 శాతం, జూలైలో –5.3 శాతం, ఆగస్టులో –1.9 శాతం, సెప్టెంబర్ లో –4.5 శాతం.. అలా మొత్తం మీద మైనస్ 2 శాతం ఆదాయం నమోదైంది. ఈ నేపథ్యంలో పన్ను రాబడి ఏకంగా రూ.24 వేల కోట్లు ఎలా పెరుగుతుంది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ⇒ జీఎస్టీ ఆదాయంలో రూ.16 వేల కోట్ల నుంచి రూ.21,500 కోట్ల పెరుగుదల ఎలా సా««ధ్యం? స్టాంప్స్–రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.4 వేల కోట్ల నుంచి రూ.9,500 కోట్లు, సేల్స్ ట్యాక్స్ పన్ను రూ.8,500 కోట్ల నుంచి రూ.16 వేల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.8 వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు, ఇతర పన్నులు రూ.2400 కోట్ల నుంచి రూ.5700 కోట్లు వస్తాయని ఎలా అంచనా వేస్తున్నారు? ⇒ తొలి ఆరు నెలల్లో రాబడి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78 వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? నెట్ పబ్లిక్ అకౌంట్.. అంటే ప్రభుత్వం వద్ద ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బును రూ.16 వేల కోట్ల నుంచి రూ.1,800 కోట్లకు తగ్గిస్తాం అంటున్నారు. ఆ ప్రకారం ఉద్యోగులకు పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి అన్నీ కట్టేయాలి. మరి ఈ ఐదు నెలల్లో ఆ పని చేశారా? సూపర్ సిక్స్ పేరుతో మోసం ⇒ యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ⇒తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో స్పష్టంగా కేటాయింపులు లేవు. బీసీ సంక్షేమంలో రూ.2,400 కోట్లు, ఎకనమిక్ వీకర్ సెక్షన్లో రూ.1160 కోట్లు.. ఇలా అన్ని కలిపి చూపినా తల్లికి వందనం పథకానికి రూ.5,300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుంది? ⇒ అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి చెప్పిన ప్రకారం ఆ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. మిగతా రూ.3500 కోట్లు పీఎం కిసాన్ నుంచి వచ్చేది. నిజానికి ఈ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,706 కోట్లు కావాలి. ⇒ దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుంది. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన మిగతా వారందరికీ ఇవ్వరా? వాస్తవాలు ఇలా ఉంటే.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి అన్ని పథకాలు అమలు చేసినట్లు ఎలా చెబుతారు? ⇒ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 2,07,30,000 మందికి ఇవ్వాలి. దీని ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. ⇒ 2014 ఎన్నికల్లో కూడా వ్యవసాయ రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులు, చేనేతలకు సాయం, నిరుద్యోగ భృతి.. ఇలా అన్ని హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. బాబు తీరు మొదటి నుంచీ ఇంతే. (బాబు తీరుపై వైఎస్సార్, రోశయ్యలు మాట్లాడిన వీడియో ప్రదర్శించి చూపారు).మంచి చేస్తే అభాండాలా? ⇒ విద్యుత్ రంగానికి మా హయాంలో 2019–20లో రూ.11,600 కోట్లు, 2020–21లో కోవిడ్ ఇబ్బందుల్లో కూడా రూ.6,110 కోట్లు, 2021–22లో రూ.11,500 కోట్లు, 2022–23లో రూ.18,250 కోట్లు, 2023–24లో ఇంచుమించు రూ.15,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.8,100 కోట్లు మాత్రమే ఇచ్చింది. ⇒ 2014–15 నుంచి 2018–19 వరకు ప్రభుత్వం డిస్కంలకు రూ.31,800 కోట్లకు గాను కేవలం రూ.20,165 కోట్లే కట్టింది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.68 వేల కోట్లకుగాను రూ.62 వేల కోట్లు కట్టింది. ఈ లెక్కన ఎవరికి చిత్తశుద్ధి లేదు? ⇒ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు. పథకాల అమలుపై క్యాలెండర్ ప్రకటించి, పక్కాగా అమలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క జగనన్న అమ్మ ఒడికి రూ.26,067 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.34,378 కోట్లు, చేయూతకు రూ.19,189 కోట్లు, వైఎస్సార్ ఆసరాకు రూ.25,570 కోట్లు అందించాం. ఇలా ప్రతిదీ పక్కాగా అమలు చేశాం.బడ్జెట్ సాక్షిగా అప్పులపై దు్రష్పచారం బట్టబయలు ⇒ 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రాష్ట్ర అప్పులపై అదే పనిగా తీవ్ర దుష్ప్రచారం చేశాయి. రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లని, రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధాలు అచ్చేస్తే.. వాటిని పట్టుకుని శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమోనని చంద్రబాబు దు్రష్ఫచారం చేశారు. అప్పులు అడుక్కోవడానికేనా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు అని 2023 అక్టోబర్ 25న చెప్పిన పురంధేశ్వరి.. 2024 ఏప్రిల్ 7న రాష్ట్ర అప్పులు రూ.12,50,000 కోట్లని ప్రకటించారు. అంటే 5 నెలల్లోనే లక్షన్నర కోట్లు పెంచుతారా? ⇒ అయితే వాస్తవం ఏమిటన్నది బడ్జెట్లో బయట పడింది. రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. 2024 మార్చి 31 నాటికి రూ.4.91 లక్షల కోట్లు, గ్యారంటీ కింద తెచ్చిన అప్పు రూ.1,54,797 కోట్లు.. రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. మరి ఆనాడు ప్రచారం చేసినట్లు రూ.14 లక్షల కోట్ల అప్పు ఏది? అంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడతారా? కార్పొరేషన్ల అప్పులతో ప్రభుత్వానికి ఏం సంబంధం? డిస్కంల అప్పులతో ప్రభుత్వానికి ఎలా సంబంధం? పౌర సరఫరాలు, విద్యుత్ రంగం.. రూ.34 వేల కోట్లు డబుల్ ఎంట్రీ చేశారు. ఔట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్స్, స్కీమ్స్.. ఎవరికో కట్టవలసినవి రూ.1,13,000 కోట్లు. మరి ఇవన్నీ బడ్జెట్లో ఎందుకు చూపలేదు? అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సబబు? చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ⇒ 2023–24 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.4,83,000 కోట్లుగా మేం చూపాం. ఇప్పడు కూటమి ప్రభుత్వ బడ్జెట్లో ఆ అప్పును రూ.4,91,000 కోట్లుగా చూపారు. మరి అలాంటప్పుడు ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు అని ఎలా దు్రష్పచారం చేశారు? వారం కింద కూడా బడ్జెట్ ప్రిపేర్ అవుతుందని తెలిసీ.. చంద్రబాబు ఏపీ అప్పుల గురించి దారుణంగా అబద్ధాలు చెప్పారు. ఇందుకు చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ⇒ 2019–2024 వరకు మేము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో లేకపోయినా, కష్టపడి తిరిగి ఎన్నో సాధించాం. చంద్రబాబు కేంద్రంలో భాగస్వాములై ఏం సాధించారు? అసలు అప్పులు పెంచింది 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. 2014లో రూ.1,32,000 కోట్లుగా ఉన్న అప్పు.. 2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయేటప్పటికి రూ.3,31,000 కోట్లు అయింది. అంటే ఐదేళ్లలో ఏటా సగటున 20 శాతం పెరిగింది. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు రూ.3,31,000 కోట్లు కాగా, మేము 2024లో దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు 14.9 శాతమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలోనే తక్కువ అప్పులు చేశాం. -
చంద్రబాబు, పచ్చ మీడియా ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
-
AP Budget: కూటమి ప్రభుత్వ బడ్జెట్లో అంతా మోసమే
-
Buggana: బడ్జెట్ పెట్టడానికి ఐదు నెలలు ఎందుకు పట్టింది?
-
బడ్జెట్లో పథకాలకు నిధులు సున్నా: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి,తాడేపల్లి: పథకాలకు కేటాయింపులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్‌ను రూ.41వేల కోట్లు పెంచిందని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌పై సోమవారం(నవంబర్ 11)తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటో అప్పో చెప్పలేదు. మైనస్‌లో ఉన్న మీరు ఆరు నెలల్లో రూ.24 వేల కోట్ల ఆదాయం ఎలా పెంచుతారు. అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి ఇస్తారో చెప్పలేదు. దీనికి బడ్జెట్లో పెట్టింది. కేవలం రూ.1000కోట్లు. ఈ పథకం అమలు చేయాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఊసే లేదు. పథకాలకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గించారు’అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రెస్మీట్లో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదు నెలలపాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు బడ్జెట్ పెట్టలేదు?ఐదు నెలలపాటు బడ్జెట్ పెట్టకపోవడం గండికోట రహస్యంగా మారింది.గత ప్రభుత్వం" అనే మాటని 21 సార్లు ఉపయోగించారు.మేనిఫెస్టో అమలు చేస్తారని భావించిన వారికి నిరాశ కలిగేలా బడ్జెట్ ఉంది.గత ప్రభుత్వం కంటే రూ.41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఎలాంటి పథకాలు అమలు చేయకుండానే ఇంత ఖర్చు ఎందుకో అర్థం కావడం లేదు.అమరావతి కోసం పెట్టే రూ.15 వేల కోట్ల ఖర్చు అప్పా? గ్రాంటా? ఆ లెక్కలకు క్లారిటీ ఇవ్వలేదు.మా హయాంలో ఆదాయం పెరిగితే చంద్రబాబు హయాంలో మైనస్ వచ్చింది.తల్లికివందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు.ఎవరికీ ఈ పథకాన్ని అమలు చేయకుండానే చేసినట్టు మాట్లాడారు.ఇంతకంటే అన్యాయం ఉంటుందా?రూ.10,706 వేల కోట్లకుపైగా అన్నదాత సుఖీభవకు ఇవ్వాల్సి ఉండగా వెయ్యి కోట్లు మాత్రమే ఇవ్వడమేంటి?మహిళలకు ఉచితబస్సు గురించి ప్రస్తావనే లేదు.కరెంటు సంస్థలకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొడితే మా ప్రభుత్వం చెల్లించింది.కానీ మా ప్రభుత్వం వల్ల కరెంటు సంస్థలకు నష్టాలు వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.గతంలో కూడా రూ. 87వేల కోట్లు రైతురుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.15 వేల కోట్లు చేశారు.డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీలు 21వేల కోట్లు చెల్లించకుండా మోసం చేశారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గొట్టారు.మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి గెలిచారు.2009,2014,2019,2024 లో వరుసగా అవే హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తూ వచ్చారు.అమరావతి ఏ రకంగా గొప్ప నగరమో తెలియదు.ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకుని కడతామంటున్నారు.మా హయాంలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తామో వివరంగా జనానికి తెలిపాం.ఎన్నికల సమయంలో ఆసరా డబ్బు ఇవ్వనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఎల్లోమీడియాలో తెగ వార్తలు రాశారు.మరి ఇప్పటి అప్పులు కనపడటం లేదా?రూ.14లక్షల కోట్ల అప్పులు చేసినట్టు గతంలో మాపైఆరోపణలు చేశారు.కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే రూ. 4 లక్షల కోట్లుగా అప్పు చేసినట్టు లెక్కలు చూపెట్టారు.మాపై తప్పుడు సమాచారం ప్రచురించిన మీడియా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.2014-19 మధ్య చంద్రబాబు చేసిన అప్పులకంటే మా హయాంలో చాలా తక్కువగా అప్పులు చేశాం.ప్రజలంతా పరిస్థితులను గమనించాలి.మోసపూరిత మాటలు ఎవరు చెప్తున్నారో? ప్రజలకోసం ఎవరు చేస్తున్నారో చూడాలిఇదీ చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు -
మీ డబ్జా మీరు కొట్టుకోవడం కాదు: Buggana
-
కోవిడ్ టైంలో కూడా పోలవరం ఆగలేదు..
-
పోలవరంపై ఇంకెన్ని అబద్దాలు చెప్తావ్ బాబూ..
-
పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం పోలవరం బాధ్యతలు తీసుకుంది. పోలవరం పూర్తైతే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది. పోలవరం ఆపేసి చంద్రబాబు పట్టిసీమ ఎందుకు కట్టారు?. ..ఆనాడు కేంద్రంతో టీడీపీ చేసుకున్న ఒప్పందంతో ఎన్నో ఇబ్బందులున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. మా ప్రభుత్వ హయాంలో పోలవరం ముఖ్యమైన పనులు పూర్తిచేశాం. వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కాలంలోనూ పోలవలం పనులు చేశాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ..పోలవరం ఎత్తు తగ్గింపు మా హయాంలోనే జరిగిందని టీడీపీ తప్పడు ప్రచారం చేస్తోంది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు తప్పడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. కోవిడ్ సంక్షోభం లేకుంటే మిగిలిన పనలు పూర్తి చేసేవాళ్లం. స్పిల్ వే కట్టిన తర్వాత అప్పర్ కాఫర్, లోయర్ కాఫర్ డ్యాం కట్టాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రంవాల్ కట్టాలి. ప్రతీ సోమవారం పోలవరం అని చంద్రబాబు భ్రష్టుపట్టించారు’’ అని అన్నారు.హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన రియాక్షన్..‘‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?. పవన్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా?. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంకా ప్రశ్నించడమేనా? మీరు ఉపముఖ్య మంత్రి కూడా. మీరు కూటమికి కారణం కూడా. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈరోజు మళ్లీ హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు మిమ్మల్ని మీరే ప్రశ్నిచుకుంటున్నారా?. మీ ప్రభుత్వం వచ్చాక క్రైం జరుగుతున్నా.. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్ధం కావట్లేదు. మీరు అధికారంలో ఉండికూడా ప్రశ్నిచడం ఏమిటి?. సమాధానం చెప్పాల్సిన మీరు హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు పాలనాపైన ఓరియెంటేషన్ అవసరం ఉంది. అదృశ్యమైన 30 వేల మంది ఆడపిల్లల జాడేదీ?. ’’అని అన్నారు. -
బుగ్గన వస్తున్నారని తెలిసి... ఇదేం చిల్లర రాజకీయం
-
పార్క్ కు తాళం వేసిన మున్సిపల్ కమిషనర్.. ఎందుకంటే !
-
డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్‌కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేశారు. వాకింగ్ పార్క్‌లో బుగ్గనను సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు.మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్ పార్కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. -
మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప.. ప్రభుత్వం చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: వంద రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దీనస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, సూపర్ సిక్స్ అమలు గురించి మహిళలు, వృద్ధులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో పారీ్టల పేరుతో దాడులు చేయడానికే సమయాన్ని వృథా చేసిందన్నారు. పచ్చ మీడియా పక్షపాతం ఏపీ అప్పుల విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పక్షపాత కథనాలు ఇస్తున్నాయని బుగ్గన ధ్వజమెత్తారు. వంద రోజుల్లో చేసిన అప్పులను ఎందుకు రాయడం లేదని ప్రశి్నంచారు. పోలవరానికి రూ.12,500 కోట్ల అదనపు నిధులు రావడానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేక విధాల కృషి చేసిందని, ఈ ఫలితాలను కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా చెప్పుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును 2016 వరకూ నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. 2014 నాటి ధరలకు ఒప్పుకున్నారని, కొత్త భూసేకరణ చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాసం గురించే ఆలోచించలేదని, కేవలం సాగు, తాగునీటి కోసం లెక్కలు వేసి, కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం వల్లే పోలవరం నిర్మాణానికి ఇబ్బందులు వచ్చాయని బుగ్గన తెలిపారు. రూ.55 వేల కోట్ల అవసరం ఉంటే.. రూ.20 వేల కోట్లకే పోలవరం చేపడతామని కేంద్రంతో అప్పటి చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుందన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ హయాంలో జరిగిన కృషిని బుగ్గన ఈ దిగువ విధంగా వివరించారు.వైఎస్ జగన్ పోలవరానికి చేసింది ఇదీ⇒ పోలవరం ప్రాజెక్టుకు ముందు రాష్ట్రం డబ్బులు పెడితే, కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఈ లెక్కలు పోలవరం అధారిటీకి వెళ్లేవి. అథారిటీ పరిశీలించి, జలశక్తికి పంపాలి. అక్కడి నుంచి ఆరి్థక శాఖకు, ఆర్బీఐకి వెళ్లి.. తిరిగి రాష్ట్రానికి నిధులు రావడానికి కొన్ని నెలలు పట్టేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్ ద్వారా నేరుగా నిధులు రావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. ⇒ పోలవరానికి సాగు, తాగునీరు రెండు కాంపొనెంట్లు ఇవ్వాలని 12–6–2021, 16–7–2021, 20–7–2021 తేదీల్లో కేంద్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఈ కారణంగానే రూ.7 వేల కోట్లు కేంద్రం ఇవ్వబోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒత్తిడివల్లే పోలవరం అనుమతులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వ గొప్పతనమేమీ కాదు. ⇒ 11.5.2022లోనే సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయి. 10–4–2023 జలశక్తిలోనే పోలవరం అదనపు ఖర్చు గురించి వివరాలు ఇవ్వమని కోరింది. 36 గ్రామాల పునరావాస వివరాలను 4–5–2023న జగన్ సర్కారు పంపింది. వరద వల్ల జరిగిన నష్టంతోపాటు అదనంగా కావల్సిన రూ.12,911 కోట్లకు కేబినెట్ నోట్ పంపమని కేంద్రం 5–6–2023లోనే జగన్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల వల్ల ఆగిపోయిన కేబినెట్ నోట్ ఇప్పుడు అమలులోకి వస్తే ఈ ఘనత తమదేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం. -
గత ప్రభుత్వంపై కూటమి సర్కార్ విషం చల్లుతోంది: బుగ్గన
-
వంద రోజులు దాటినా.. ఇంకా విషం చల్లడమేనా?: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి దానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతోందని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిపోయింది. ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ప్రతిదానికీ గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. ప్రజలు సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎదురుచూస్తున్నారు. మహిళలకు,వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. నెగెటివ్ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లో పార్టీల పేరుతో దాడులు చేశారు. పోలవరం ఇపుడే నిర్మాణం జరుగుతుందనే భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు...నాలుగు నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఎక్కడ రాయలేదు. ప్రజాశక్తి పత్రికలో గత ప్రభుత్వ హయంలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని రాసింది. కూటమి ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్లను గత ప్రభుత్వం అప్పు తెచ్చామని ప్రచారం చేస్తున్నారు. 2005లో మొదలుపెట్టిన పోలవరం పనులు ప్రారంభం కాగా.. ఇప్పుడు చంద్రబాబుతోనే ప్రారంభించినట్లు ప్రచారం చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. 2016సెప్టెంబర్ 8 వరకు పోలవరం పనులు చేయలేదు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలవరానికి 55 వేల కోట్లు అవసరం ఉండగా.. 20 వేల కోట్లకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పుకొని రావడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగలేదు...పోలవరం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులను మేమే చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ చేసిన పొరపాట్లను 2019లో అధికారంలో వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. పోలవరానికి 31 వేల 600 కోట్ల రూపాయలకు పెంచడానికి వైఎస్సార్సీపీ కృషి చేసింది. ఈ రోజు 12 వేల 500 కోట్ల రూపాయలు మంజూరు కావడం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనత. ఆ రోజు ప్రధాని, ఆర్థిక మంత్రి సహకారం, వైఎస్ జగన్ కృషి కారణంగానే పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగు నెలల్లో టీడీపీ ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదు’’ అని అన్నారు. చదవండి: బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే: విజయసాయిరెడ్డి -
ఆర్డినెన్స్ పేరుతో నాటకం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడంతో పాటు రాష్ట్ర అప్పుపై చేసిన దు్రష్ఫచారం బండారం బట్టబయలవుతుందనే భయంతోనే 2024–25 సంవత్సరం పూర్తి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని ఆ ర్థి క శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసి నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019–20కి సంబంధించి రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండ్రోజుల ముందు అంటే జూన్ 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని.. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చి చెబుతూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎత్తిచూపారు. కోవిడ్ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా, నిధుల విషయంలో అస్పష్టత లేకపోయినప్పటికీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు జూన్ 21.. రెండో సమావేశాలు జూలై 22–27 వరకు నిర్వహించారని, ఆ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా.. ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచి్చందో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.అబద్ధాలు బయట పడకూడదనే.. » పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నిధులు లేవనే సాకు చూపి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సమరి్థంచుకోవడం. మరొకటి రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లంటూ ఎన్నికల్లో చెప్పిన అబద్ధాల బండారం బయట పడకుండా చూసుకోవడం. » పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకపోవడం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తామని ఇచి్చన హామీకి మంగళం పాడినట్టేనా? » దీపం పథకం కింద ఒక్కో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయనట్లేనా? » మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచి్చన హామీని అటకెక్కించినట్లేనా? » తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా మోసం చేయడం కాదా? » 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పెన్షన్ ఇస్తామని ఇచి్చన హామీని అమ లు చేయకుండా తప్పించుకోవడానికేనా? » రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సహాయం అందిస్తామని ఇచి్చన హామీని అమలుచేయకుండా మోసం చేస్తారా? » 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా వారికి ద్రోహం చేస్తారా? » రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లుందని ఎన్నికల్లో దు్రష్ఫచారం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,74,556 కోట్లని తప్పుడు లెక్కలు చెప్పారు. వాస్తవానికి అన్ని రకాల అప్పులు కలిపి రాష్ట్రానికి ఉన్నది రూ.7 లక్షల కోట్లే. -
సూపర్ సిక్స్ మొదట్లోనే డకౌట్: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, సిటీ బ్యూరో: చంద్రబాబు ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలు ఆరంభానికి ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కుంటి సాకులతో అన్నీ అసత్యాలు వల్లించారని, ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు లెక్కలు చూపించారని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు అసలు శ్వేతపత్రానికే అర్థం మార్చాడని, రాష్ట్రాభివృద్ధి కోసం తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. కేవలం గత ప్రభుత్వంపై నిందలు, అన్నింటికీ బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే వల్లించే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకొని, ఇప్పుడు తమ సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధం చెప్పించారని విమర్శించారు. రాష్ట్ర పరిపాలన కోసం రూ.2 లక్షల 50 వేల కోట్లు అవసరం ఉంటే ఆదాయం రూ.2 లక్షల 40 వేల కోట్లని.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని, ఏం చేయాలని ప్రజలను ప్రశి్నస్తే ఏలా అని నిలదీశారు. అలాంటప్పుడు ఏటా దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను ఎలా ప్రకటించారని దుయ్యబట్టారు.వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి.. శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే.. సంపద సృష్టి ఒట్టి మాటే ⇒ చంద్రబాబు సంపద సృష్టి అంతా ఒట్టి మాటే. 2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.1,14,671 కోట్లు. ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగింది. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయం ఏటా 16.7 శాతం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చాక 2019 జూలైలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరెందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు? అలా చేస్తే మీ బండారం బయట పడుతుందనే కదా! ⇒ నిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయి. ఇతరత్రా అన్నీ కలుపుకున్నా కూడా మొత్తం అప్పులు రూ.7 లక్షల కోట్లు మాత్రమే. మా ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, మేము ఏకంగా రూ.47,800 కోట్లు ఇచ్చాం. మేము తీసుకొచి్చన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్)ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వైఎస్సార్సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా?⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసింది. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారు. 2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, మా హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే. ఇది ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? వైఎస్సార్సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా? ⇒ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయి. అంటే టీడీపీ హయాంలో 21.63 శాతం పెరిగాయి. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5.18 లక్షల కోట్లు. అంటే 12.9 శాతం పెరుగుదల మాత్రమే. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పారీ్టలకు అనుబంధంగా ఉన్న ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి పత్రికలు ఎన్నడూ ఇలా వన్ సైడ్ తప్పుడు కథనాలు ప్రచురించలేదు. ఆ రెండు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) పత్రికలు మాత్రం ఏకపక్షంగా తప్పుడు రాతలు రాస్తున్నాయి.‘‘పేదల పథకాలకు సంబంధించి ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం కష్టమని మేము తొలి ఏడాది ఓ సమావేశం (అంతర్గత)లో చెబితే..‘ఇది నేను ఇచి్చన మాట. మేనిఫెస్టోలో పెట్టాం. ఇది పేద వారికి సంబంధించిన వాగ్దానం. మాట తప్పేందుకు కుదరదు. ఒకవేళ తప్పాల్సి వస్తే నేనే దిగిపోతాను’ అన్నారు. మేమంతా షాక్ అయ్యాం. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము, మా అధికారులందరం కోవిడ్‌ను సైతం లెక్కచేయకుండా తిరిగాం. అలా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కమిట్మెంట్తో హామీలు అమలు చేశారు’’ అని బుగ్గన వివరించారు.అన్నీ తప్పుడు లెక్కలు⇒ టీడీపీ హయాంలో 2014–19 మ«ధ్య స్థూల ఉత్పత్తి బ్రహా్మండంగా పెంచామని చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకోవడం సరికాదు. కోవిడ్ పీరియడ్.. కోవిడ్ లేని కాలంతో పోలికా? టీడీపీ పాలన కంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో వృద్ధి సాధించాం. 2014 నుంచి 2019 వరకు దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82గా నమోదైంది. పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014– 2019 మధ్య 2.98 శాతం కాగా, 2019–2024 మధ్య 4 శాతం. అయినా పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేయడం విడ్డూరం. ⇒ వైఎస్ జగన్ పాలనలో స్థూల ఉత్పత్తితో పాటు తలసరి ఆదాయం కూడా మెరుగు పడింది. టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం. వైఎస్సార్సీపీ పాలనలో చివరి ఏడాది 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతానికి పెరిగింది. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరింది. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం నంబర్ వన్‌గా నిలిచింది. మా పాలనలో మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. -
జగన్ గురించి సంచలన నిజం బయటపెట్టిన బుగ్గన..!
-
చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంపై బుగ్గన కౌంటర్
-
సూపర్ సిక్స్ కాస్త డకౌట్ అయ్యింది: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్ధం మార్చిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తూ.. వైట్పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు.ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలుకు ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.అది హాస్యాస్పదంరాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకున్నారన్న బుగ్గన.. అదే చంద్రబాబు ఇప్పుడు తమ సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు.ఎలా ప్రకటించారు?రాష్ట్ర ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు కాగా.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు, ఇతర పరిపాలన అవసరాల కోసమే రూ.2.50 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న ఆయన.. ఆ అవసరల కోసమే ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. మరి అలాంటప్పుడు ఏటా, దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను చంద్రబాబు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. వాటిని అమలు చేయలేరన్న విషయం తెలుసు కాబట్టే.. ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.వీటి కోసం ఎదురుచూస్తున్నారుతల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో తల్లికి వందనం అమలు కావాల్సి ఉందని గుర్తు చేశారు.తప్పుడు లెక్కలుతమ హయాంలో 2014–19 మ«ధ్య, స్ధూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు వైట్‌పేపర్‌లో చెప్పుకోవడాన్ని తప్పు పట్టిన బుగ్గన, కోవిడ్ పీరియడ్.. అది లేని కాలంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే.. టీడీపీ పాలన కంటే, తమ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో కాస్త వృద్ధి సాధించామన్న ఆయన.. 2014 నుంచి 2019 వరకు దేశ స్ధూల ఉత్పత్తిలో రాష్ట్ర స్ధూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82 గా నమోదైందని చెప్పారు. అది 0.4 శాతం ఎక్కువని వివరించారు.అసత్య ప్రచారాలుఅదే విధంగా పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి, దేశ జీడీజీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014 నుంచి 2019 వరకు 2.98 శాతం కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4 శాతమని గుర్తు చేసిన ఆయన, తమ హయాంలో 1.1 శాతం పెరిగిందని.. అయినా తమ పాలనలో ఇక్కడికి పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేశారని ఆక్షేపించారు.తలసరి ఆదాయంరాష్ట్రంలో టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం అని చెప్పారు. అదే తమ ప్రభుత్వ పాలనలో చివరి ఏడాది.. 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతం పెరుగుదల అని వెల్లడించారు. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరిందని చెప్పారు. అంతేకాక, సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం వరసగా నెంబర్ వన్‌గా నిల్చిందన్న బుగ్గన, ఇది అభివృద్ధి కాక, మరేమిటని ప్రశ్నించారు.మద్యాన్ని నియంత్రించాంటీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మద్యం విక్రయాలు ప్రైవేటు వారి చేతిలో ఉండేవని, దాంతో వారంతా సిండికేట్‌గా ఏర్పడి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మారని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. అంతే కాకుండా, ప్రతి షాప్‌కు ఒక పర్మిట్‌రూమ్, ఊరూరా బెల్టు షాప్‌లు.. మొత్తం 43 వేల బెల్టు షాప్‌లు ఉండేవని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే, వైన్ షాప్‌లను 33 శాతం తగ్గించడంతో పాటు, అన్ని పర్మిట్‌రూమ్‌లు, బెల్టు షాప్‌లను రద్దు చేశామని తెలిపారు. షాప్‌లను పూర్తిగా ప్రభుత్వమే నడపడం, మద్యం విక్రయ వేళలు తగ్గించడం, మరోవైపు ధరలు పెంచడం వల్ల, మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు.అలా ఎలా ఆపాదిస్తారు?అన్నింటి కంటే ఎక్కువగా జీత భత్యాలకే రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్న ఆయన, జీత భత్యాల వ్యయం ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ వల్ల వ్యయం పెరిగిందని చెప్పారు. మరోవైపు సామాజిక పెన్షన్ల వ్యయం రూ.33 వేల కోట్లు కాగా.. దాన్ని కూడా ఇతరులకు ఎలా ఆపాదిస్తారని నిలదీశారు.ఇది పట్టదా?నాడు, రాష్ట్రావసరాల కోసం అప్పు చేస్తే.. అప్పులతోనే నెట్టుకొస్తున్నామంటూ నిత్యం దుయ్యబట్టిన ఎల్లో మీడియా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే పని చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.ఇవీ ఈ ప్రభుత్వ అప్పులుటీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయదని ప్రశ్నించిన ఆయన.. ‘మరి మేం చేస్తే అప్పు, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తే నిప్పా’ అని కడిగి పారేశారు. అంతకు ముందు హయాంలో ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసినా, ఎల్లో మీడియా రాయలేదని ఆక్షేపించారు.గతంలోనూ వారివే ఎక్కువ2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, తమ హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే అని మాజీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన తరవాత, ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి, అంటే టీడీపీ ప్రభుత్వం గద్దె దిగేనాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయని.. అంటే టీడీపీ హయాంలో అప్పులు 21.63 శాతం పెరిగాయని చెప్పారు. అదే తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.5.18 లక్షల కోట్లు కాగా, అది 2019–24 మధ్య కేవలం 12.9 శాతం పెరుగుదల మాత్రమే అని తెలిపారు. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.సంపద సృష్టి ఒట్టి మాటే..సంపద సృష్టిలో తాము స్పెషలిస్టులమని చంద్రబాబు చెప్పుకుంటారని.. కానీ అది పూర్తిగా అవాస్తవమని బుగ్గన వెల్లడించారు.2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు కాగా, 2019లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ మొత్తం కేవలం రూ.1,14,671 కోట్లు మాత్రమే అన్న ఆయన, ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగిందన్నారు. అదే తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం 16.7 శాతం పెరిగిందన్న ఆయన, ఆ గణాంకాలు చెబుతూ.. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరిందని వివరించారు.ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన తరవాత, 2019 జూలైలో అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆయన, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్‌కు పోవడాన్ని ప్రశ్నించారు.వాస్తవాలు బయటపడతాయనే..పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. పథకాలకు కేటాయింపులు, రాష్ట్ర అప్పులతో సహా, అన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంటుందని.. టీడీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో గొప్పగా ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని.. అందుకే ఓట్ ఆన్ ఎక్కౌంట్‌కు వెళ్తున్నారని ఆక్షేపించారు.అంతే కాకుండా, మా హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశామని, అదేపనిగా దుష్ప్రచారం చేశారని.. ఇష్టానుసారం అంకె చెప్పి, తాము 14 లక్షల కోట్ల అప్పులు చేశామని కూడా ఆరోపించారని గుర్తు చేశారు.నిజానికి తాము అంత అప్పు చేయలేదని, రాష్ట్ర అప్పు ఎంత అన్నది.. ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మరోవైపు సీఏజీ, ఆర్బీఐ రిపోర్టుల్లో ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ బయట పడతాయన్న భయంతోనే, ఈ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌కు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.ఇవీ వాస్తవ అప్పులునిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు అన్న బుగ్గన, పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయని తెలిపారు. కార్పొరేషన్ రుణాలు రూ.2.18 లక్షల కోట్లు కాగా, అవి రూ.2.48 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.90 వేల కోట్లు, ఇంకా అప్లోడ్ చేయలేదన్న ఆయన, వాటిని రుణాలుగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. ఇంకా ఉద్యోగుల బకాయిలు కూడా కలుపుకున్నా, మొత్తం అప్పులు దాదాపు రూ.7 లక్షల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.ప్రాధాన్య రంగాలకు ఎక్కువ తమ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశామని మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, కీలక మౌలిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, తాము అంతకు మూడు రెట్లకు పైగా ఎక్కువ రూ.47,800 కోట్లు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రి ఉదహరించారు.ఇంకా, తాము తీసుకొచ్చిన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్) ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. -
వేట కొడవళ్లతో దాడి చేస్తారా?.. ప్రభుత్వం ఏం చేస్తోంది: మాజీ మంత్రి బుగ్గన
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. పచ్చ నేతల దాడులను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ క్రమంలో కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మాజీ మంత్రి బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్యాపిలి మండలం పోదొడ్డిలో నడుస్తున్న కంకర క్వారీ నాది కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్వీపై స్థానిక టీడీపీ గూండాలు దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న వేట కొడవళ్లలో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారు. ఈ ఘటనలతో ఆ గ్రామంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది.గ్రామంలో ఉన్న మరో వర్గం ఈ అరాచకాలను ప్రశ్నించింది. అంతేకాకుండా నాపై తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ క్వారీ సక్రమమా? లేక అక్రమమా? అనేది తేల్చాసింది ప్రభుత్వం.. అంతేకానీ స్థానికంగా ఉండే టీడీపీ నేతలు కాదు. వారి పార్టీకి చెందిన గూండాలు కూడా కాదు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
-
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
సాక్షి, నంద్యాల: టీడీపీ అధినేత చంద్రబాబు తన హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులు తానే కడతారా అని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎన్నికల నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, బుగ్గన నంద్యాలలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?. 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్‌కి సమర్పించాం. అప్లికేషన్లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. ఇదే సమయంలో కోట్లకు చురకలంటించారు. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? అని ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
-
సామజిక సాధికారత చూసి అన్ని వర్గాలవారు పార్టీలో చేరుతున్నారు
-
సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి బుగ్గన
-
కౌలు రైతులకు మరింత చేయూతనివ్వండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాల్లో రైతులకు కూడా తగిన రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డెయిరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడ్ గవర్నెన్స్‌లో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన ఈ–క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడ్ గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ 2023–24 వార్షిక రుణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ నాటికే రూ.4,77,234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. దీనిలో ప్రాధాన్యత రంగం కింద రూ.3.23 లక్షల కోట్లు అందించాల్సి ఉండగా రూ.2.88 లక్షల కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే రూ.2.31 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం కాగా రూ.2.08 లక్షల కోట్లు అందించామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.69 వేల కోట్లకు గాను రూ.71,113 కోట్లు అందజేశామని వెల్లడించారు. అలాగే ప్రాధాన్యేతర రంగంలో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.1,88,557 కోట్లు ఇచ్చామన్నారు. అలాగే బ్యాంకు లింకేజ్ కింద 35 వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31,699 సంఘాలకు సాయం అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్టాండ్ అప్ ఇండియా కింద 13,078 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిసెంబరు నెలాఖరు నాటికి 12,768 మందికి సాయమందించామని తెలిపారు. పీఎం ముద్రా యోజన కింద రూ.13 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.14,860 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతేడాది డిసెంబర్ వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం రవీంద్రబాబు వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాల్లో మంచి ప్రగతి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాలు అందించడంలో మంచి ప్రగతిని సాధించారన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏపీ ఇన్చార్జి రాజేష్ కె.మహానా, యూబీఏ జీఎం గుణనాధ్ గమి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్ బాబు, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు. -
యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్య
సాక్షి, విశాఖపట్నం: అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ అవకాశాలు సృష్టిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 పేరుతో నేషనల్ స్కిల్ కాంక్లేవ్–2024 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో పర్యటించామన్నారు. గత 30–40 ఏళ్లలో నైపుణ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యువతలో ఏయే విభాగాల్లో నైపుణ్య కొరత ఉందో.. ఎందులో ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని దానికనుగుణంగా కార్యాచరణ చేపట్టామని వివరించారు. స్థానిక పరిశ్రమల అవసరాలను బట్టి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. సన్‌షైన్ ఏపీ కోసం 26 నైపుణ్య అకాడమీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు కూడా ఉన్నాయన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వీరిలో 50 శాతం మందిని స్థానిక పరిశ్రమల అవసరాల కోసం ఉపయోగించుకోవాలని అన్ని సంస్థలకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. రాష్ట్ర యువత.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా.. నైపుణ్య శిక్షణ అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీ పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పలు సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు.. సదస్సులో భాగంగా.. ఏపీఎస్ఎస్డీసీతో వివిధ సంస్థలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నైపుణ్య శిక్షణకు సంబంధించి 100 మిలియన్ లెర్నర్స్ (అరిజోనా స్టేట్ యూనివర్సిటీ), ట్రస్టెడ్ జాబ్స్, తాత్విక్ బ్యూటీ–వెల్నెస్, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ), ఎక్సెల్ఐఆర్, జీయూవీఐ, హెచ్ఈఆర్ఈ టెక్నాలజీస్, రబ్బర్, కెమికల్, పెట్రో కెమికల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొదలైన సంస్థలతో 6 ఎంవోయూలను ఏపీఎస్ఎస్డీసీ కుదుర్చుకుంది. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం గత ఐదేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన వీడియో ప్రదర్శనకు దేశ, విదేశాల ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీ ‘న్యూస్కిల్’ న్యూస్ లెటర్‌ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. ఏపీఎస్ఎస్డీసీకి సహకారం అందిస్తూ ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగయ్యేలా చేస్తున్న బెస్ట్ ప్లేస్మెంట్, సీఎస్ఆర్ పార్టనర్లగా కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్, లలితా జ్యుయెలర్స్ తదితర 13 సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్లీ, సెంట్రల్ ఎంఎస్ఎంఈ బోర్డు సీఈవో సేతు మాధవన్, సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేశ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ నవ్య, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాల కల్పనలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, హబ్‌లు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తోంది. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్‌వన్‌కి చేరుకునే అవకాశాలున్నాయి. – డా. వినోద్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఏపీ విధానాలు భేష్ నైపుణ్య శిక్షణ కోసం ఏపీలోనూ అవలంబిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఐదు ప్రధాన విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2.7 లక్షల మందికి ఏడాది కాలంలో ఉద్యోగాలు ఇవ్వగలిగాం. – డా. అపూర్వ పాల్కర్, మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ వీసీ చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుగ్గన చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. టీడీపీకి ఒక అజెండా, విధానం అంటూ ఏమీ లేవని విమర్శించారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వీటితో ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ తోక పార్టీ జనసేన సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాలు, పేదల సంక్షేమమే వైఎస్సార్సీపీ అజెండా అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని వెల్లడించారు. బీజేపీ, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వైఎస్సార్సీపీ నెరవేరుస్తోందన్నారు. -
రాష్ట్రంలో యువతకు నాణ్యమైన శిక్షణ: బుగ్గన
-
ఏపీ అప్పులపై అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఛాలెంజ్
-
అప్పులు తగ్గించి సంపద పెంచాం
సాక్షి, అమరావతి: తమకు మీడియా బలం ఉందనే అహంకారంతో విపక్షాలు పదేపదే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గత సర్కారు కంటే తక్కువ అప్పులు చేసినా అనునిత్యం బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ 2014లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా ఇప్పుడు కొత్తవి ప్రకటిస్తుంటే బీజేపీ, వామపక్షాలు లాంటి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన గురువారం గణాంకాలతో సమాధానమిచ్చారు. ఐదేళ్లుగా బడ్జెట్ సమర్పించే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ 2024–25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించాల్సిందిగా సభ్యులను కోరారు. టీడీపీ కంటే అప్పుల వృద్ధి తక్కువే వాస్తవ లెక్కలకు, బడ్జెట్‌కు వ్యతాసం ఉందని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించటాన్ని బుగ్గన ఖండించారు. 2019–20లో టీడీపీ రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా వాస్తవంగా ఖర్చు చేసింది రూ.1.64 లక్షల కోట్లు మాత్రమేనని, బడ్జెట్ లెక్కల కంటే రూ.27,000 కోట్లు తక్కువ వ్యయం చేసిందని గుర్తు చేశారు. 2023–24 బడ్జెట్లో రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే సవరించిన అంచనాల ప్రకారం వ్యయం రూ.2.75 లక్షల కోట్లుగా ఉందని, తుది లెక్కలు కూడా ఇంచుమించి ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధిరేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మీడియా బలం ఉందన్న అహంకారంతో పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ కేంద్ర అప్పులు 2014–19లో 59.75 శాతం పెరగగా 2019–24లో 86 శాతం పెరిగాయి. కేంద్ర అప్పులు 2014–19లో 9.82 శాతం, 2019–24లో 13.25 శాతం చొప్పున పెరిగాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 126 శాతం పెరిగితే 2019–24 మధ్య అప్పుల్లో వృద్ధి 95 శాతంగా ఉంది. అంటే సగటున టీడీపీ హయాంలో 18 శాతం అప్పులు పెరిగితే మా ప్రభుత్వం వచ్చాక 14 శాతం మేర మాత్రమే పెరిగాయి. కేంద్రం, టీడీపీ సర్కారు రెట్టింపు స్థాయిలో అప్పులు చేస్తే మాట్లాడని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మాపై బురద జల్లడం వెనుక మీడీయా ఉందన్న అహకారం స్పష్టంగా కనిపిస్తోంది. ♦ 2014లో పలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత మేనిఫెస్టోను మాయం చేసింది. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటివి ఎగ్గొట్టింది. మా ప్రభుత్వం మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ తు.చ. తప్పకుండా అమలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. వామపక్ష పార్టీలు ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా మేనిఫెస్టోను మా ప్రభుత్వం అమలు చేసిందని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ♦ గత సర్కారు పెట్టిన బకాయిలను తీర్చడంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలకు సంబంధించిన అకౌంట్స్‌ను మా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం చేసిన అప్పులు బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో జమ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయాయో వెల్లడించాలి. ♦ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఖజానాలో ఏమీ లేదని, హామీలు నెరవేర్చలేరంటూ టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు వల్ల కాని హామీలను ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు విస్తుపోతున్నారు. తమ నాయకుడు ఎన్నికల ముందు హామీలను గుప్పించి ఆ తర్వాత గాలికి వదిలేస్తారని రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కలిసినప్పుడు అసలు విషయం చెబుతున్నారు. సంపద సృష్టించి హామీలను అమలు చేస్తానంటున్న చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే వాస్తవాలు బోధపడతాయి. ♦ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రెవెన్యూ వృద్ధి రేటు 6 శాతం ఉంటే ఇప్పుడు 16 శాతానికి పెరిగింది. దీనిబట్టి ఎవరి హయాంలో సంపద పెరిగిందో తెలుసుకోవచ్చు. 2018–19లో 11% స్థూల ఉత్పత్తి రేటుతో ఏపీ 14వ స్థానంలో ఉండగా 2023 నాటికి 16.2 శాతానికి పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో 4వ స్థానానికి పురోగమించింది. 2018–19లో మన వ్యవసాయ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా ఈ రోజు 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి ఎగబాకింది. 2023–24కి సంబంధించి కేంద్ర జీడీపీలో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేయగా అది మన రాష్ట్రంలో 7.35 శాతంగా ఉంటుంది. ఇది ప్రజా బడ్జెట్ ఇది సప్త రంగాలకు పెద్దపీట వేసిన ప్రజా బడ్జెట్ ఇది. గత ప్రభుత్వం మాదిరిగా గాలిలో మేడలు కట్టలేదు. గ్రాఫిక్స్ బొమ్మలు చూపించలేదు. మా నాయకుడు సుదీర్ఘ పాదయాత్రలో పేదల గుండెలు తడిమి ప్రతి ఒక్కరి బతుకులు మార్చేలా తీసుకొచ్చిన బడ్జెట్ ఇది. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి.. ఆ దిశగా మానవ జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ రూపొందించారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా, విద్య మిథ్యగా మారిపోయింది. ఇప్పుడు ఎందరో పేదలకు ఉచిత వైద్యంతో ఊపిరిపోస్తూ.. ఎందరో పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి చదువులు అందిస్తోంది మా ప్రభుత్వం. సీఎం జగన్ గొప్ప సంకల్పమే జీపీపీతోపాటు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే మార్గదర్శకంగా నిలబెట్టింది. ఉత్తరాంధ్రలో సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారులకు జగనన్న వచ్చిన తర్వాతే కదా జీవిత భరోసా దక్కింది. వేట నిషేధ సమయంలో రూ.10వేలు అందుకుని కడుపు నింపుకుంటున్నారు. టీడీపీ హయాంలో కేవలం 4లక్షల ఇళ్లు ఇస్తే.. మా ప్రభుత్వం 32లక్షలకు పైగా ఇళ్ల స్థలాలతో కొత్త ఊర్లను నిర్మిస్తోంది. కొత్త పారిశ్రామిక పాలసీ ఏపీ ముఖచిత్రాన్ని మార్చేసింది. మా ప్రభుత్వం డీబీటీ, నాన్–డీబీటీ కింద ఇచ్చినవే చెబుతోంది. అవి కాకుండా గ్రామాల్లో చేసిన అభివృద్ధిని కూడా కలిపితే ఏకంగా ఐదేళ్లలో రూ.5.30లక్షల కోట్లకుపైగా సంక్షేమాభివృద్ధిని చేసి చూపించాం. దీనితోపాటు ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ అభివృద్ధికి మరింత నిధులు కేటాయించాలి. – కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే విద్య, వైద్యానికి పెద్దపీట సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టి మన పిల్లల భవితకు బంగారు బాటలు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు గోరుముద్ద పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వం నాలుగు రెట్లు అధికంగా బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది. సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసింది. ఏకంగా 4 లక్షల ఉద్యోగాలను కలి్పంచింది. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో సాయం అందించింది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ప్రస్తుతం రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. – హఫీజ్ ఖాన్, కర్నూల్ ఎమ్మెల్యే రేపటి తరాల అభివృద్ధికి పునాదులు రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీల అభ్యున్నతికి సీఎం జగన్ కంకణబద్దుడై ఉన్నారు. ఈ క్రమంలో ముస్లింలకు మేలు చేస్తూ ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేశారు. నిరుపేదలకు లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రేపటి తరాల అభివృద్ధికి పునాదులు వేశారు. విద్యా, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పులు తెచ్చారు. నవరత్నాల పథకాల అమలు ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారు. సర్పంచ్ల దగ్గర నుంచి నాలాంటి సామాన్యూలు ఎందరికో సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. – ముస్తఫా, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే -
బడ్జెట్ పై ప్రతిపక్షం, విపక్షాల కామెంట్స్ పై బుగ్గన చురకలు
-
హామీలు నెరవేర్చని బాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ
-
మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం : బుగ్గన
-
ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్ మెంట్ బిల్లుకు ఆమోదం
-
మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ ల్యాండ్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు. రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల అనుసంధానం భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్ట్ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వైద్య విద్య బలోపేతం ♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. అత్యున్నత విద్యాలయాలు ♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో సెంట్రల్ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్ కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ కర్నూలులో క్లస్టర్ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. పోలవరం పురోగమనం ♦ 2019మే నాటికి 42 శాతం హెడ్ వర్క్‌లు 70 శాతానికి చేరిక ♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్ గేట్ల ఏర్పాటు. ♦ గతేడాది నవంబర్ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్ ప్రారంభం. ♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్ త్వరలో పూర్తి. ♦ గతేడాది సెపె్టంబర్ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రారంభం. ♦ 2022 సెపె్టంబర్ 6వ తేదీన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం. ♦ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతి. పారిశ్రామిక పరుగులు ♦ 2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు ♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు ♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్íÙప్ల ఏర్పాటు ♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం -
ఇదిగో.. సామర్థ్య ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం. –సాక్షి, అమరావతి ‘విద్య’యీ భవ పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్ సరి్టఫికేషన్ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తోంది. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు, బ్యాగ్‌లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. రెడీ టు వర్క్ విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్‌లు, క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్‌లను అభివృద్ధి చేసింది. ఉన్నతంగా విద్య జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది. ఇంటర్న్‌షిప్ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది. ప్రొసీజర్స్‌ను పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది. కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం. గోరుముద్దతో ఆరోగ్యం.. ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. సామర్ధ్యాంధ్ర కేటాయింపులు రూ. 53,508.04 కోట్లు సాధారణ విద్య రూ.33,898.04 కోట్లు వైద్య రంగంరూ.17,916.67 కోట్లు సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు -
చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది. – సాక్షి, అమరావతి మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మహిళా సాధికారత కోసం.. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్ – చైల్డ్ బేస్డ్ బడ్జెట్లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది. సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్ యాప్, దిశ పెట్రోల్ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
భూ హక్కులకు భద్రత
సాక్షి, అమరావతి: భద్రమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఐదేళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డుల్లో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాలవల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కారు సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడుల్ని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ♦ నూతన పింఛను పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయ పింఛను పథకంగా ఇది ఉంది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించింది. ♦ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన (రీసర్వే) చేయడం కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్ స్టేషన్ల (సీఓఆర్ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీ సర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది. ♦ ఇప్పటివరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ♦ 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్పడ్డాయి. 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమిలేని దళితుల భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధిపొందారు. భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. ♦మా ప్రభుత్వం ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్డీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటుచేశాం. ♦ 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం. ♦ ఆశ్కా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాల్టీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్‌కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, మెప్మాకు చెందిన రీసోర్స్ పర్సన్లు, హోమ్‌గార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది. -
ఏపీ బడ్జెట్ ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సు
‘రోటి, కపడా, ఔర్ మకాన్’ ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత. ఇవి అందుబాటులో ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపక్రమిస్తుంది. వీటిని విస్మరించి, గ్రాఫిక్స్‌తో ఎన్ని మేడలు కట్టినా అవి నీటి మూటలేనని చరిత్ర చెబుతోంది. ప్రజల ఆనందాన్ని, వారి బాగోగులను చూసి ఆనందించే వాడే అసలైన పాలకుడని కూడా చరిత్ర వెల్లడిస్తోంది. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినప్పుడే ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో చేయూత అందిస్తే చాలు, ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తారని విశ్వ వ్యాప్తంగా విఖ్యాత ఆర్థిక నిపుణులు నొక్కి వక్కాణిస్తుండటం తరచూ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభ్యున్నతికే ఎన్నో దేశాలు, రాష్ట్రాలు సతమతం అవుతున్న వేళ.. ఇంతకు మించిన సంక్షేమాభివృద్ధిని సాకారం చేస్తూ మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. నవరత్నాల పథకాలు, సప్త స్వరాల్లాంటి థీమ్‌ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించాలనే తపన, తాపత్రయం.. బడ్జెట్లో కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024 – 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు ప్రయత్నం చేసిన ఆర్థిక మంత్రి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు ద్వారా గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సంక్షేమాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగలిగిందన్నారు. ఎన్నికల నేపధ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. భారీ అంచనాలకు వెళ్లకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలకే పరిమితమయ్యారు. ఎప్పటిలాగానే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ► 2024–25 ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్‌ను రూ.2,86,389.27 కోట్లు గా బుగ్గన ప్రతిపాదించారు. మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు ఉంటుందని, ద్రవ్య లోటు రూ.55.817.50 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యలోటు జీఎస్డీపీలో దాదాపు 3.51% ఉంటుందని, రెవెన్యూ లోటు జీఎస్డీపీలో దాదాపు 1.56 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2023–24 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 2.19 శాతం, ద్రవ్య లోటు జీఎస్డీపీలో 4.18 శాతం ఉంటుందని తెలిపారు. ► సాధారణ విద్యకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద పీట వేశారు. సాధారణ విద్యా రంగానికి రూ.33,898 కోట్లు కేటాయించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలకు తగినన్ని నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,816 కోట్లు, పట్టణాభివృద్దికి రూ.9546 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.17,916 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.14,236 కోట్లు, సాగునీటి రంగానికి రూ.12,038 కోట్లు, మొత్తం సంక్షేమ రంగానికి రూ.44,668 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.6,595 కోట్లు, రవాణా రంగానికి రూ.10,334 కోట్లు కేటాయింపులు చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రూ.3,940 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో ‘సుపరిపాలిత ఆంధ్ర’గా.. 2019.. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయింది. విభజన గాయాలు మానేందుకు, సాంత్వన చర్యలు తీసుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా.. పరిస్థితిని పెనం మీంచి పొయ్యలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పునరి్నర్మించుకోవడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ సమస్యలను అధిగమించాలంటే మూస పద్ధతిలో కాకుండా సరికొత్త విధానంలో మాత్రమే అభివృద్ధి సాధించగలమని ఆయన తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా బలంగా విశ్వసించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ముఖ్యంగా సుపరిపాలనలో భాగంగా పాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు సీఎం జగన్ తీసుకెళ్లారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరిచారు. విస్తృతస్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించి సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారత అందించి రాష్ట్రాన్ని ‘సుపరిపాలిత ఆంధ్ర’గా తీర్చిదిద్దారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం ‘సుపరిపాలిత ఆంధ్ర’గా ఎలా రూపాంతరం చెందిందో స్పష్టంగా వివరించారు. పాలనా వికేంద్రీకరణ.. ప్రజలు సాధికారిత, వికేంద్రీకరణ, సుపరిపాలన అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం, సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతనందించింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. అలాగే.. ► దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. వీటిల్లో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. తద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలకు తోడు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందిస్తోంది. ► అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచి పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా చేసింది. ► నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి. ► ఇక పౌరుల రక్షణ, భద్రతను పెంపొందించడానికి అవసరమైన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీసు సబ్–డివిజన్లు ఏర్పాటుచేసింది. ► ప్రతి జిల్లాలో దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడమే కాక రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీసుస్టేషన్లు ప్రారంభమయ్యాయి. ► భద్రతా మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజాభద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం.. ► ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో భాగంగా 58,288 పనులను రూ.2,356 కోట్ల అంచనాతో మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.729 కోట్లతో 17,239 పనులు పూర్తయ్యాయి. ► రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది. వివక్షకు దూరంగా.. గత ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమని వదిలేయకుండా కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించడంతోపాటు పౌరుల రక్షణ, భద్రత కోసం కొత్త పోలీసు సబ్ డివిజన్, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందనేందుకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. సంక్షేమ ఫలాలను వివరిస్తూ కొందరు లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాన్ని బుగ్గన వీడియో ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయన్నారు. ► తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వడ్డే రాజేశ్వరి పొదుపు సంఘాల రుణాల మాఫీ, పింఛన్, ఆసరా కింద లభించిన సాయంతో గొర్రెలను కొనుగోలు చేశారు. తనను కష్టాల నుంచి ఈ ప్రభుత్వం గట్టెక్కించిందని ఆమె సంతోషంగా చెబుతోంది. ► విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంకు చెందిన పల్లా కృష్ణవేణి చేయూత కింద అందిన మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మ ఒడి సాయం కూడా అందుతోంది. కుట్టు మిషన్ ఉంది. రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తున్నానని, కిరాణా దుకాణంతో తమ బతుకులు మారాయని సగర్వంగా చెబుతోంది. ► విశాఖపట్నం ఆరో వార్డు మధురవాడకు చెందిన వాండ్రాసి అన్నపూర్ణ తాము టీడీపీ మద్దతుదారులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇతర పథకాలనూ అందిస్తోందని ధన్యవాదాలు తెలియచేస్తోంది. ► నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన వృద్ధురాలు కవుజు బేబీ అనే మహిళకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్, ఇతర పథకాలను ఇంటి వద్దే అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం తనను ఎంతో ఆదుకుంటోందని కృతజ్ఞతలు తెలిపింది. ► విశాఖకు చెందిన రోబంకి చిరంజీవులు అనే వృద్ధ దంపతులకు వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా కాలికి ఆపరేషన్ నిర్వహించడంతోపాటు ఆసరా, పెన్షన్ అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం కన్న కొడుకులా ఆదుకుంటోందంటూ సంతోషంగా చెబుతున్నారు. ► ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపడంతో ఒంటరిగా ఉన్న తాను దేవాలయాల వద్ద యాచిస్తూ జీవనం సాగించానని, ఈ ప్రభుత్వం వచ్చాక రూ.3,000 పెన్షన్ ప్రతీ నెలా ఇస్తుండటంతో భిక్షాటన మానుకుని గౌరవంగా బతుకుతున్నానంటూ విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన బత్తిన అప్పమ్మ చెబుతోంది. -
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడుతున్న దృశ్యాలు
-
మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంలా భావించారు
-
ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది: బుగ్గన
-
53 లక్షల 53 వేల రైతులకు 33 వేల 300 కోట్లు..
-
53 లక్షల 53 వేల రైతులకు 33 వేల 300 కోట్లు..
-
3250 వ్యాధులకు చికిత్స..ఆరోగ్య శ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం
-
43 లక్షల 61 వేల మహిళలకు 26, 067 కోట్లు..
-
మేము టీడీపీ..అయినా సాయం చేశారు..జగన్ ఫిదా..
-
Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
5 సంవత్సరాల తర్వాత ఏం సాధించాం ?..అసెంబ్లీలో వివరించిన ఆర్థిక మంత్రి
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్..మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
-
ఏపీ బడ్జెట్ 2024-25 పై మంత్రి బుగ్గన "కీ" కామెంట్స్..
-
AP Budget: ఏపీ బడ్జెట్ ప్రసంగం ఇదే..
Updates.. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.. ►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. ►శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ►శాసన మండలి రేపటికి వాయిదా. ►అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు. మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు. రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత గ్రంధంగా భావించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసింది. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర సుపరిపాలన.. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు. 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు ప్రతీ జిల్లాలో దిశ పీఎస్‌లను ఏర్పాటు చేశాం. భద్రత, మౌళిక సదుపాయాలను పెంచాం. 13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం, వినూత్న పద్దతుల ద్వారా విద్యాబోధన సులభతరం. రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక 47లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు అందించాం. జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్టు ఇది ఎక్కువ సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్బిణులకు మేలు. ఉచితంగా విద్యార్థులకు 9.52,925 ట్యాబ్స్ 34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం. రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింపు. విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ధి. ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు. నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు. ఆరోగ్యశ్రీ వ్యాధులను 3257కు పెంచాం. 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి. కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియామకం,. ఏపీలో 192 స్కిల్ హబ్‌లు, 27 స్కిల్ కాలేజీలు నైపుణ్య శిక్షణ ద్వారా 95 శాతం మందికి ఉద్యోగాలు. విద్యార్థుల శిక్షణ కోసం వర్చువల్ ల్యాబ్‌లు 201 పాఠశాలల్లో వర్చువల్ ల్యాబ్స్ అమ్మఒడి ద్వారా 43.61లక్షల మహిళలను మహరాణులను చేశాం. అమ్మఒడి కింద రూ.26,067కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు ఖర్చు. వ్యవసాయం రంగం.. జగనన్న పాలవెల్లువ కింద రూ.2697కోట్లు. 29 దిశా పోలీసు స్టేష్లను ఏర్పాటు. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద 53.53 లక్షలు రైతులకు సాయం. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ రూ.33,300 కోట్లు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13500 సాయం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు. ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు. సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు. రైతులకే నేరుగా సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37374 కోట్ల సబ్సిడీ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1277 కోట్లు అందించాం. వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు యంత్ర సేవల పథకం కింద రైతులకు యంత్రాలు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4363 కోట్లు అందించాం. 2356 మంది ఉద్యానవన సహాయకులు నియామకం. 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు. ఆక్వా రంగం.. వైఎస్సార్ మత్య్సకార భరోసా 2లక్షల 43వేల కుటుంబాలకు మేలు. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4వేల నుంచి 10వేలకు పెంపు. అంతర్జాతీయ ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్లు. ఆక్వాకల్చర్ కింద 12వేల హెక్టార్ల విస్తీర్ణం. 16లక్షల 5వేల మందికి జీవనోపాధి. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం ఐదేళ్లలో 30.65లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఐదేళ్లలో 2.53లక్షల కోట్ల నగదు బదిలీ. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం. వైఎస్సార్ పెన్షన్‌ను మూడు వేలకు పెంచాం. 66.35లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లకు ఐదేళ్లలో 84731 కోట్లు ఖర్చు చేశాం. 9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిస్తున్నాం. వైఎస్సార్ బీమా కింద రూ.650 కోట్లు ఖర్చు. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ. ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు పంపిణీ కాపునేస్తం కింద రూ.39,247 కోట్లు పంపిణీ. నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు. జగనన్న తోడు కింద రూ.3374 కోట్లు జగనన్న చేదోడు కింద రూ.1268 కోట్లు. వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5కోట్లు. బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చు. పోర్టులు, పరిశ్రమలు... ఏపీ పారిశ్రామిక విధానం 2019-27ను తీసుకొచ్చాం. ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం. పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి. రూ.3800 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఫైబర్ గ్రిడ్‌తో ప్రతీ గ్రామం అనుసంధానం. 55వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం. అవుకు రెండో టన్నెల్ పూర్తి. 1079కోట్లతో మూడో టన్నెల్. 77చెరువులతో అనుసంధాన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం వర్షాలపై ఆధారపడిన రైతులకు ఎంతో మేలు. ప్రాధన్య ప్రాజెక్ట్‌ల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.10137 కోట్లతో తొమ్మిది త్రాగునీటి పథకాలు మంజూరు. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం. రాష్ట్ర స్థాల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం. జాతీయ ఆహార భద్రతలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరకు బంగారు బహుమతి. చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి మూడో స్థానం. 311కుపైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు. మెగా పరిశ్రమల ద్వారా 1.30లక్షల మందికి ఉపాధి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా రూ.5995 కోట్ల పెట్టుబడి. పెట్టుబడులు.. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం. వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి ఆరో స్థానానికి. రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన ప్రభుత్వం మనదే. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి. 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 14 ఎలక్ట్రానిక్ కంపెనీల స్థాపన ద్వారా 34,750 మందికి ఉపాధి. 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు. 12042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రూ.19,345 కోట్ల మేర ఒప్పందాలు. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు. తిరుపతిలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాం. పురోగతిలో 13 న్యాయ భవన నిర్మాణాలు. 10893 గ్రామ పంచాయతీ భవనాలు. 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు. 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. ఆడుదాం ఆంధ్ర.. ఐదు అంచెల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. విజేతలకు 12కోట్ల 21లక్షల విలువైన బహుమతులు. 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతిలో 65 క్రీడా వికాస కేంద్రాలు జగనన్న పచ్చతోరణం కింద ఐదుకోట్ల 11లక్షల మొక్కలు నాటాం. నగరతోరణం కింద పట్టణ, శివార్లలో పచ్చదనం. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలను ప్రారంభించాం. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం. 17లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు. నాలుగు లక్షల 80వేల మ్యుటేషన్లలకు పరిష్కారం. ఉద్యోగాలు.. ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 213662 శాశ్వత నియామకాలు. 10వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. పోలీసు వ్యవస్థలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు. గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజలకు బదిలీ. డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం. నాన్ డీబీజీ ద్వారా రూ.1.68 కోట్లు అందించాం. కేబినెట్ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.. ►2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి. ►నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం. ►డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల. ►నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ►ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల. ►ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి. ►అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్. ► టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. ►మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►ప్రజాసమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు: బుగ్గన సభను అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు వచ్చారు. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ►అసెంబ్లీలో మళ్లీ గందరగోళం ►తీరుమార్చుకోని టీడీపీ సభ్యులు ►ఈరోజు కూడా స్పీకర్ తమ్మినేని వెల్‌లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు. ►సభా మర్యాదలు పాటించని టీడీపీ సభ్యులు. ►రెడ్‌లైన్ దాటి స్పీకర్ వెల్‌లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు. ►ఈరోజు కూడా పేపర్లు చింపి స్పీకర్‌పై వేసిన టీడీపీ సభ్యులు. ►సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యుల తీరు. ►స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులు ►స్పీకర్‌ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం ►బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ►తొలిమూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ►సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం ►సెక్రటేరియట్‌కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కేబినెట్ సమావేశానికి హాజరు బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశాం ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత గత ఐదేళ్ల బడ్జెట్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం. ►మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు ►సెక్రటేరియట్‌కు చేరుకున్న మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు. ►సెక్రటేరియట్‌కు బయల్దేరిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు ►మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధికశాఖ అధికారులు ►మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్‌కు బయల్దేరనున్న మంత్రి బుగ్గన, అధికారులు ►అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు ►ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్ధిక శాఖ అధికారులు ►ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. ►రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ►ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ►అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. ►అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది -
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. ఉదయం 8గం. సమయంలో సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అనంతరం.. ఉదయం 9గం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 11గం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు బుగ్గన రాజేంద్రనాథ్. -
చెప్పింది చేయకపోవడం బాబు నైజం
డోన్: ఇచ్చిన మాట తూ.చ తప్పకుండా పాటించడం సీఎం జగన్ నైజమైతే, చెప్పిందేదీ చేయకపోవడమే చంద్రబాబు నైజమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆదివారం సుమారు రూ. 102 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెద్ద అబద్దాల పుట్ట అని విమర్శించారు. సంపద సృష్టించడమంటే తాత్కాలిక, గ్రాఫిక్స్ కట్టడాలు కాదని, ఉన్నచోటనే పారిశ్రామిక, వ్యవసాయ, ఉపాధి రంగాలలో అభివృద్ధి సాధించడమని మంత్రి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారన్నారు. ఉద్యోగులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు, జర్నలిస్టులకు ఆర్టీసీ చార్జీలో రాయితీలు ఇవ్వడం ద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని నాడు మనుసులో మాట అనే పుస్తకంలో రాసిన చంద్రబాబు.. నేడు సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీలంటూ చేతులెత్తేసిన మాయగాడు, నేడు అదే రైతులకు రెట్టింపు మొత్తం ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు మాయమాటలకు ప్రజలు మోసపోరని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి స్పష్టంచేశారు. జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాను న్యాయ రాజధాని చేయడం, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాల్లో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీఎంకు చేదోడుగా ఉన్నారన్నారు. సభలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజే‹Ù, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నకేశవయ్యగౌడ్ తదితరులు ప్రసంగించారు. -
చంద్రబాబుపై మంత్రి బుగ్గన అదిరిపోయే సెటైర్లు
-
డోన్ చరిత్రలో చెరగని ముద్రవేశాము: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
ప్యాపిలి: డోన్ నియోజకవర్గంలో దాదాపు రూ. 2,700 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ చరిత్రలో చెరగని ముద్ర వేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని హుసేనాపురం గ్రామంలో రూ. 18.77 కోట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, బాలుర, బాలికల వసతి గృహాలు, గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం తదితర భవనాలను ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులతో కలసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లలో డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికై న నాయకులు చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. ఐదేళ్లకోసారి ఎన్నికల ముందు కంబగిరి స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లే నాయకులు కనీసం ఆ దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయారని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డోన్ నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్యాపిలి మండలంలో మారుమూల గ్రామమైన వంకమెట్టుపల్లికి సైతం ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే తన ధ్యేయం అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని భావించి హుసేనాపురంలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు. పశుసంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాకపోవడానికి కారణం వెటర్నరీ విభాగంలో ఉన్నత చదువులు స్థానికంగా అందుబాటులో లేవని తాను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణం చేతనే హుసేనాపురంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశానని తెలిపారు. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వెంటనే సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో గొర్రెల పెంపకం ద్వారా సంపద సృష్టించుకున్న గొర్రెల పెంపకందార్లు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని మంత్రి తెలిపారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో షెప్పర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గొర్రెల పెంపకందార్లకు ఈ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. హామీలతో మభ్య పెడతారు జాగ్రత్త.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చి ఉచిత హామీలు గుప్పిస్తారని ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్ విమర్శించారు. మహిళలకు కిలో బంగారం, ఇంటికో కారు కూడా ఇస్తామని హామీ ఇస్తారని..అటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న దూరదృష్టి గల వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం డోన్ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. డోన్ అందరికీ ఆదర్శం డోన్ నియోజకవర్గ అభివృద్ధి అందరికీ ఆదర్శమని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు డోన్ నియోజకవర్గాన్ని చూసి అభివృద్ధి విషయంలో మంత్రిని ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు. తాను కొద్ది రోజులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంట పర్యటిస్తూ అభివృద్ధి కార్యాక్రమాలు చూస్తేంటే మంత్రి చొరవ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్, శ్రీవేంకటేశ్వర వెటర్నరి యూనివర్సిటి డీన్ వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ రవి, డైరీ డీన్ సురేశ్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమేంద్రకుమార్, ఏడీ సింహాచలం, నోడల్ ఆఫీసర్ లావణ్యలక్ష్మి, జేడీ రామచంద్రయ్య, డీఏహెచ్ఓ గోవిందనాయక్, డీడీలు శాంతయ్య, రామమూర్తి, ప్రిన్సిపాల్ మాధవి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లికార్జునరెడ్డి, హుసేనాపురం, కొమ్మేమర్రి సర్పంచులు మహేశ్వర్ రెడ్డి, దస్తగిరమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్యాంరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబే’
సాక్షి, అమరావతి: అప్పులపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. పార్లమెంట్లో పలు సార్లు కేంద్ర ఆర్దిక మంత్రి,తో పాటు ఆర్బీఐ, కాగ్ అప్పులపై గణాంకాలను వెల్లడించినా సరే ఆ గణాంకాలను కాదని లేని అప్పులున్నట్లు ఏ ప్రాతిపదికన, ఏ ఆధారాలతో చంద్రబాబు, ఎల్లో మీడియా చెపుతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎల్లో మీడియా వాస్తవాల గురించి వివరణలు తీసుకోకుండా అన్యాయంగా తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర అప్పులతో పాటు అన్ని అనర్దాలకు చంద్రబాబే కారణమని ఆయన స్పష్టం చేశారు. మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగులకు, సబ్సిడీలకు వ్యతిరేకంగా రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఇస్తానంటూ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘మోసం నేర్చెన్’.... అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదనే పాటలా బాబు వ్యవహారం ఉందని ఆర్దిక మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. అప్పులపైన గణాంకాలతో పాటు, చంద్రబాబు గత నిర్వాకాలను ఆధారాలతో సహా గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్దిక మంత్రి బుగ్గన వివరించారు. ఆయన మాటల్లోనే.. అప్పులపై నిరాధార ఆరోపణలు: రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల అప్పు చేసిందని ఒకరు.. రూ. 8 లక్షల అప్పు చేసిందని మరొకరు ఇష్టానుసారం ఆరోపిస్తున్నారు. నిజానికి మీరంతా (టీడీపీ నేతలు) గతంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ఇలా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు? ‘రుణకంఠుడు’ అంటూ.. సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెచ్చిన అప్పులు రూ. 7.34 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ ఆధారాలతో చంద్రబాబు, మా ప్రభుత్వం రూ. 13 లక్షల అప్పు చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదే మాట మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంటున్నారు. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగాల్సిన స్థాయిలో పెరగలేదని గతంలో నేను స్పష్టంగా చెప్పాను. అందు కోసం కేంద్రం ఇచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు కూడా చూపాను. పార్లమెంటులో కొందరు సభ్యులు వేసిన ప్రశ్నలకు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా, స్పష్టంగా సమాధానం చెప్పింది. అయినా ఇక్కడ మీడియా దారుణంగా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కడా వాస్తవాలు రాయడం లేదు. ఇది చాలా అన్యాయం. రాజకీయంగా ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే.. అందులో వాస్తవాలను మీడియా బేరీజు వేసుకోవాలి కదా? అప్పటి కంటే ఇప్పుడు బెటర్ చంద్రబాబు పాలన కంటే మా ప్రభుత్వం ఎన్నో విధాలుగా బెటర్. ఎందుకంటే అప్పటి కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. అప్పు శాతం కూడా వారి కంటే తక్కువే చేశాం. అయితే రావాల్సినంత ఆదాయం కోవిడ్ వల్ల రాలేదు. అలాగే ఖర్చు కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. వాస్తవాలు మర్చి నిందలు: ప్రభుత్వం ఏకంగా రూ. 10 లక్షల అప్పు చేసిందని ఆరోపించారు. రుణకంఠుడు సీఎం అంటూ రాసిన స్టోరీలో ఆ ఫిగర్ వేశారు. కానీ ఆ స్టోరీలో రాసిన మొత్తం అప్పు చూస్తే.. అ మొత్తం కేవలం రూ. 7,68,641 కోట్లు మాత్రమే. మరి రూ. 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇంకా పెండింగ్ బిల్లులు రూ. 1.70 లక్షల కోట్లు ఉన్నాయని రాశారు. ఆ లెక్కలు మీకు ఎవరు చెప్పారు? ఏ ఆధారాలతో మీరు అది రాశారు? ఇంకా డిపాజిట్లు, ఇతర మొత్తాలు కలిపి రూ. 28,286 కోట్లు అని రాశారు. అది ఎవరు చెప్పారు? ఇలా అన్నీ చూపుతూ.. తప్పుడు ఫిగర్ చెబుతున్నారు. ఆ అప్పుల్లో మీరు చేసినవే ఎక్కువ: మీ ప్రకారం లెక్క వేసుకున్నా.. మీరన్నట్లు రూ. 3.76 లక్షల కోట్లు బహిరంగ రుణాలు ఉంటే.. అందులో పాత రుణం రూ. 2,64,451 కోట్లు ఉన్నాయి కదా? 2019, మే నాటికే ఆ అప్పు ఉంది కదా? అదే విధంగా ఉదయ్ బాండ్స్. రూ. 8,256 కోట్లు అన్నారు. అది తీసుకుంది 2016లో కదా? ఇంకా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 33,118 కోట్ల రుణం. పాత ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుల కింద అందులో రుణం తీసుకుంది కదా? నాన్ గ్యారెంటీ లోన్ çపవర్ సెక్టర్లో రూ. 95 వేల కోట్ల రుణం అన్నారు. అందులో రూ. 69,596 కోట్ల రుణం.. పాత ప్రభుత్వం తీసుకున్నదే కదా? అ రుణం 2019, మే నాటికే ఉంది. సీఆర్డీఏ బాండ్స్ రూ. 1500 కోట్లు. ఆ అప్పు చేసింది మీరు కాదా? పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ. 50 వేల కోట్ల అప్పు అంటున్నారు. కానీ నిజానికి అందులో రూ. 22 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణమే. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 50 వేల కోట్ల రుణం తీసుకున్నారని రాశారు. కానీ నిజానికి ఆ రుణ మొత్తం రూ. 36 వేల కోట్లు మాత్రమే. ఇతర కార్పొరేషన్ల ద్వారా రూ. 1.45 లక్షల కోట్ల అప్పు అని రాశారు. ఆ మొత్తంలో పవర్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ. 95 వేల కోట్లు కూడా ఉంది. మరోవైపు ఆ రుణాన్ని కూడా వేరుగా చూపారు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 95 వేల కోట్లలో కూడా దాదాపు రూ. 70 వేల కోట్ల అప్పు గత ప్రభుత్వ హయాంలో చేసిందే. నిజానికి రాష్ట్రానికి ఉన్న అప్పు రూ. 7 లక్షలకు అటు ఇటుగా ఉంటే.. దాన్ని దారుణంగా పెంచి రూ. 10 లక్షల కోట్లు అని రాయడం అంత కంటే తప్పు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో కూడా దాదాపు రూ. 4 లక్షల కోట్లు గత ప్రభుత్వ హయాంలో చేసినవే. అయినా అన్నీ కప్పి పుచ్చి, మొత్తం అప్పును ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. రుణకంఠుడు సీఎం అంటూ రాయడం చాలా దారుణం. కనీసం జర్నలిజం విలువలు పాటించాలి కదా? ఎంత అన్యాయం? రాష్ట్ర అప్పు అప్పటికి రూ.4.28 లక్షల కోట్లు: గతంలో చాలాసార్లు చెప్పాం. మళ్లీ చెబుతున్నాం. ‘ఎ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్’ అని చెప్పి 15 ఏళ్ల డేటాతో ఆర్బీఐ ఒక్కోసారి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ)తో పాటు, వివిధ కేంద్ర రంగ సంస్థల నుంచి తీసుకున్న వివరాల (డేటా) ఆధారంగా ఆర్బీఐ ఆ డాక్యుమెంట్ (బుక్) రిలీజ్ చేస్తుంది. ఆ బుక్‌లో 15 ఏళ్ల డేటా ఉంటుంది. ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 2023 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పు రూ. 4,28,715 కోట్లు. ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం 2019, మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,64,512 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం ఏర్పడే నాటికి.. అంటే మార్చి 2019 తర్వాత రెండు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 7,346 కోట్లు. అంటే గత ప్రభుత్వం దిగి పోయే నాటికి.. అంటే 2019, మే చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 2,71,797 కోట్లు. మరి 2023, మార్చి 31 నాటికి ఉన్న ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 4,28,715 కోట్లలో.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ. 2,71,797 కోట్లు తీసేయాలి కదా? బాబు హయాంలోనే ఎక్కువ అప్పులు వాస్తవాలు ఇలా ఉంటే.. మొత్తం అప్పులను ఈ ప్రభుత్వానికి ఆపాదించి రాయడం అత్యంత దారుణం. ఇక గత ప్రభుత్వ హయాంలో.. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ అప్పు ఎలా పెరిగింది? ఆ తర్వాత 2019 నుంచి నాలుగేళ్లలో ఎంతెంత పెరిగిందని చూస్తే.. -2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న ప్రభుత్వ అప్పు రూ. 1,53,346 కోట్లు కాగా.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 మే చివరి నాటికి ఆ రుణం రూ. 4,12,288 కోట్లకు చేరింది. అదే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో ప్రభుత్వ అప్పు రూ. 6,38,217 కోట్లు అంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ప్రభుత్వ వార్షిక అప్పు 21.8 శాతం పెరగ్గా.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా పెరిగిన అప్పు కేవలం 12 శాతమే. అది కూడా కోవిడ్ వంటి మహమ్మారి ఉన్నా కూడా.. చేసిన అప్పు తక్కువే. ప్రతి దానికి లెక్క. అన్నీ డాక్యుమెంట్లలో..: మా ప్రభుత్వంలో కార్పొరేషన్ల పేరుతో చెప్పకుండా రుణాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది. ప్రతి దానికి అక్కౌంట్స్, చెకింగ్స్ ఉంటాయి. బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రభుత్వ అప్పులను ఫారమ్ డీ-4లో చూపుతాం. అది పబ్లిక్ డాక్యుమెంట్. మరోవైపు 5వ వాల్యూమ్‌లో అప్పుల గురించి పూర్తి వివరాలు చెబుతాము. ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో ఒక భాగం. ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అప్పు తీసుకునేది ఆర్థిక సంస్థల నుంచే కదా? అది ఆటోమేటిక్‌గా బ్యాంక్ బుక్స్‌లో కూడా ఉంటుంది. పీఏసీ బుక్స్‌లో కూడా ఉంటాయి. ఇంకా డిబెంచర్ల రూపంలో రుణాలు సేకరించాలంటే.. బహిరంగంగానే చేయాలి. ఇందులో ఎక్కడా గోప్యత ఉండదు. ఏదీ రహస్యం కాదు. అప్పులో గోప్యత అసాధ్యం నిజానికి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగితే.. కేంద్ర ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అయినా దాన్ని రాయరు. చెప్పరు. ఆర్బీఐకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, సీఏజీకి తెలియకుండా, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా ఎక్కడైనా అప్పు చేయడం సా«ధ్యమేనా? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు కోసం ప్రత్యేకంగా చట్టం కూడా చేశాం. ఆ అప్పును ఎలా వినియోగిస్తామో కూడా అందులో స్పష్టంగా చెప్పాం. మహిళలు, రైతులకు సంబంధించిన నాలుగు పథకాల కోసం అని చెప్పడం జరిగింది. జీడీపీతో పోల్చినా.. అప్పుడే ఎక్కువ అప్పులు -ఇక మన స్థూల ఉత్పత్తి (రాష్ట్ర జీడీపీ)తో పోల్చి గత ప్రభుత్వ హయాంలో చేసిన, పెరిగిన అప్పు చూస్తే..గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఆ 5 ఏళ్లలో చేసిన అప్పు రూ. 2.59 లక్షల కోట్లు. అది రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే 7.45 శాతం . అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు దాదాపు రూ. 2.26 లక్షల కోట్లు. దాన్ని రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే అది కేవలం 5.2 శాతం మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే.. దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ బాండ్లు చాలా గొప్పవని చెబుతారు. అవి ఒకటిన్నర శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయంటారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బెవరేజెస్ బాండ్స్ 4.5 శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినా.. దాని గురించి రాయరు. చెప్పరు. అనుమతి లేకుండానే నిధుల వినియోగం టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా రూ. 1,10,599 కోట్లు ఖర్చు చేసిందా అని ఆయన అడిగితే.. కేంద్రం ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాసనసభ అనుమతి లేకుండా రూ. 1.62 లక్షల కోట్లు ఖర్చు చేశారని సమాధానం చెప్పారు. అయినా దాని గురించి రాయరు. నోటికి ఏది వస్తే..అదే మాట్లాడతారా? మరో ఎంపీ రాష్ట్ర అప్పుల గురించి సభలో అడిగితే కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం.. 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం.. ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లు అని చెప్పారు. అదే 2022 రివైజ్డ్ ఎస్టిమేషన్నే తీసుకుంటే, అప్పు రూ. 3,93,718 కోట్లు మాత్రమే. ఆ మేరకు 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినా, ప్రభుత్వ అప్పు కేవలం రూ. 4.42 లక్షల కోట్లు మాత్రమే అయినా.. ప్రభుత్వ అప్పు రూ. 10 లక్షల కోట్లు అని, రూ. 13 లక్షల కోట్లు అని.. నోటికి ఎంత వస్తే అంత మొత్తం చెబుతున్నారు. ఎంత దారుణం ఇది? -చంద్రబాబు తన పరిపాలన బ్రహ్మాండం అంటారు. ఆయన పరిపాలన హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు రూ. 6.95 లక్షల కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలో సగటు స్థూల ఉత్పత్తి రూ. 10.84 లక్షల కోట్లు. రెండింటి మధ్య తేడా చూడండి. స్థూల ఉత్పత్తి పెరిగితే రెవెన్యూ కూడా పెరగాలి అంటారు కదా?. దానికి సమాధానం. రెవెన్యూ రాబడి-వాస్తవాలు చంద్రబాబు గతంలో మంత్రిగా, సీఎంగా పని చేశారు. 1999 నుంచి 2004 వరకు చూస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూ రాబడి 12.4 శాతం పెరిగింది. అదే 2004 నుంచి 2009 వరకు వైయస్సార్‌గారి హయాంలో 21.6 శాతం.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14.4 శాతం పెరగ్గా.. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే మన ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది. ఇవన్నీ లెక్కల్లో స్పష్టంగా ఉంటాయి కదా? ప్రభుత్వానికి ఎలా ఏ రూపంలో ఆదాయం వచ్చిందనేది ఉంటుంది కదా? చంద్రబాబు పాలన బాగుంటే, రెవెన్యూ రాబడి ఎందుకు పెరగలేదు? ఇప్పుడు ఉద్యోగులు పెరిగారు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు.ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే.. 2018-19లో 44.86 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటే.. 2022-23 నాటికి ఆ సంఖ్య ఏకంగా 60.75 లక్షలకు పెరిగింది. అంటే ఉద్యోగుల సంఖ్య పెరిగితేనే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు పెరుగుతాయి కదా? చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు దాదాపు 20 లక్షల ఉద్యోగులు పెరిగినట్లే కదా? రాష్ట్రంలో నిరుద్యోగులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో 2018-19లో నిరుద్యోగ శాతం 5.3 ఉంటే.. అది 2022-23 నాటికి అది 4.1 శాతానికి తగ్గిందని. అంటే చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. ఇవన్నీ పార్లమెంటులో భూపేందర్‌సింగ్ హుడా, కపిల్ సిబల్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు. బాబు మాటలు-నీటి మూటలు 2014లో సీఎం అయిన చంద్రబాబు, ప్రజలను మభ్య పెట్టేందుకు కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు.. స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఔకులో పారిశ్రామిక వాడ, బెంగళూరు పారిశ్రామిక వాడ, టెక్నాలజీ క్లస్టర్, కోయిలకుంట్లలో సిమెంట్ పరిశ్రమ, న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్, సోలార్ అండ్ విండ్ పవర్ స్టేషన్లు.. విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల పరిశ్రమ.. వీటిలో ఒక్కటైనా ఏర్పాటు చేశారా? ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ తప్ప. ఎందుకంటే వ్యవసాయానికి తగిన భూములు లేవు కాబట్టి. అది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పంప్డ్ స్టోరేజీ కింద అంత కంటే బాగా చేశాం. విమానాశ్రయాన్ని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవుకులో రామ్‌కో సిమెంట్ కంపెనీ ఇటీవలే ఏర్పాటైంది కదా? ఇప్పుడు మేము కదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. అంటే, ఆనాడు మీరు ఏమీ చేయకపోగా.. ఇంకా ఏం చెప్పారు. ఆలూరులో జింకల పార్కు. శ్రీశైలంలో పులుల పార్క్.అవి కూడా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు తన విధానాలు, ఆయన అనైతిక రాజకీయాల వల్ల ఇష్టానుసారం అప్పులు చేశారు. అందుకోసం ఏమేమో చేస్తామని చెప్పారు. బాబు దిగజారుడు మాటలు: ఇప్పుడు ఏవేవో పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యేలకు ఒక్కో పేరు పెడుతున్నారు. మరి మేము కూడా ఆ పని చేయలేమా? నీకు, నీ కుమారుడికి కూడా పేరు పెట్టలేమా? కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే మేము నీలా దిగజారి మాట్లాడం. నీతి లేని నాయకుడు చంద్రబాబు చంద్రబాబు రాజకీయ జీవితం చూస్తే.. ఎక్కడైనా విలువలకు కట్టుబడి ఉన్నాడా? ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు దగ్గరయ్యాడు కదా? 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్‌పేయి వేవ్‌లో గెల్చాడు. 2001లో మోదీని గుజరాత్ సీఎంగా దింపాలన్నాడు. 2004 వచ్చే సరికి మళ్లీ యూటర్న్. బీజేపీతో కలిసి ఎన్నికల్లో నిలబడి, ఓడిపోయిన తర్వాత ఓడిపోవడంతో.. తనది హిస్టారికల్ మిస్టేక్ అన్నాడు. మళ్లీ 2009 వచ్చే సరికి మరోసారి యూటర్న్. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో మహాకూటమి. ఎన్నికల్లో పోటీ. అప్పుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై నిశిత విమర్శలు చేశాడు. దానిపై ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. 2014 వచ్చే సరికి మళ్లా బ్యాక్. బీజేపీ, జనసేన. కాంగ్రెస్‌పై నిశిత విమర్శలు. మన్మోహన్సింగ్ను ఏకంగా సోనియాగాంధీ పెంపుడు కుక్క అన్నాడు. 2016 వచ్చే సరికి డీమోనిటైజేషన్. తానే మోదీకి సలహా ఇచ్చానని అన్నాడు. అది బూమరాంగ్ కావడంతో.. అది చరిత్రాత్మక తప్పిదం అన్నాడు. 2018 వచ్చే సరికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టాడు. 2019 ఎన్నికలు వచ్చే సరికి మోదీకో హఠావో.. దేశ్‌కో బచావో అన్నాడు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో.. మోదీ వంటి నేత దేశానికి అవసరం అన్నాడు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం ఒక్క వైయస్సార్ కాంగ్రెస్‌తో తప్ప.. అన్ని పార్టీలతో రాయబారాలు జరుపుతున్నాడు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌తో కూడా మాట్లాడుతున్నాడు. బాబు ఊసరవెల్లి రాజకీయాలపై పాట చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై రూపొందించిన ఒక పాట వీడియో ప్రదర్శించి చూపారు.‘మోసం నేర్చెను.. అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదు’.. అన్న పాట. బాబు మనసులో మాట ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక బుక్ రాశాడు. ‘అది మనసులో మాట’. ఆ బుక్‌లో పేజీ నెం.117లో ఏముందంటే.. మనం అవసరానికి మించి ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. 119వ పేజీ. ఎన్టీఆర్ కిలో బియ్యం రూ. 2 చేశారు. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్లీ రూ. 3.50 చేశాను. సబ్సిడీ ఇవ్వడం అంటే పులి మీద స్వారీ మాదిరిగానే. సబ్సిడీ ఇచ్చినా ఎన్టీ రామారావు, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఓడిపోయింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న అకాళీదల్ ఎన్నికల్లో ఓడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉద్యోగుల యొక్క, ఉద్యోగుల చేత, ఉద్యోగుల కోసం అన్నట్లుగా మారాయి. పేజీ నెం.124. విద్యుత్ మాత్రమే కాక, ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో ఎక్కువ భాగం తింటున్నాయి. పేదలకు సబ్సిడీ ఇళ్లు. ఖరీదైన పథకం. కొన్ని వర్గాలకు ఉచిత ప్రయాణం సరికాదు. మరి అదే ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అంటున్నాడు. ఇలా ప్రతిదీ ఫ్లిప్‌ఫ్లాప్. పేజీ నెం.62. ఉద్యోగుల్లో అవినీతి పెరిగింది. వివిధ శాఖల్లో అవినీతి పరులైన ఉద్యోగులు చాలా మంది పెరిగారు ఉద్యోగులు, వారి జీతభత్యాలు. పెన్షన్లు పెరుగుతున్నాయి. దాని కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక విష వలయం. స్వార్థ రాజకీయాలు: చంద్రబాబు రాజకీయ పొత్తులు చూస్తుంటే.. హాలీవుడ్ యాక్టర్ ఎలిజబెత్ టేలర్ గుర్తుకు వస్తుంది. ఆమె ఏడుసార్లు పెళ్లి చేసుకుంది. అందులో ఒకరిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. చంద్రబాబు రాజకీయ పొత్తులు కూడా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్. ఆ తర్వాత బీజేపీ. మళ్లీ కాంగ్రెస్. మళ్లీ బీజేపీ. జనసేన. ఇంకా వామపక్షాలు. నిజానికి ఆ పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వేరు. కానీ చంద్రబాబు మాత్రం అందరితో చర్చలు. విభజనలోనూ చంద్రబాబు అనైతిక రాజకీయాలు: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ. దీనికి చంద్రబాబు కూడా కారణం కాదా? 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశాడు. ఆ తర్వాత 2011లో శ్రీకృష్ణ కమిటి నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. 2012లో మరో లేఖ రాసి, తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాడు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పాడు. రాష్ట్రం విడిపోతే, తమ పార్టీ జాతీయ పార్టీ అవుతుందని అన్నాడు. అటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాడు. ఇటు తెలంగాణ ఏర్పాటు చేయాలని కూడా కోరాడు. ఇన్నిసార్లు ఐడియాలజీ మార్చుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఏనాడైనా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాడా? రాష్ట్ర అప్పులకు ఆయన కాదా కారణం. ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతానన్నా, తామే కడతామని తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానన్నాడు. కంప్యూటర్ కనిపెట్టానని చెప్పాడు. రాష్ట్ర విభజన సమయంలో ఉచిత సలహాలు కూడా ఇచ్చారు కదా? విభజన తర్వాత మనకు అన్యాయం జరిగింది. స్థూల ఉత్పత్తిలో సేవా రంగం (సర్వీస్ సెక్టర్) 45 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగం 33 నుంచి 38 శాతానికి పెరిగింది. హైదరాబాద్ మనకు లేకుండా పోవడం వల్ల మనకు దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల ఆదాయం పోయింది. అవన్నీ మీకు తెలియదా? మీరు నిపుణులు కాదా? అప్పులనేమో జనాభా ప్రాతిపదికన చేశారు. కానీ ఆస్తులను లొకేషన్ ప్రకారం విభజించారు. దాని వల్ల హైదరాబాద్ పోయింది. ఇక్కడ జనాభా ఎక్కువ కావడం వల్ల అప్పులు పెరిగాయి. విద్యుత్ రంగానికి వచ్చే సరికి, వినియోగం ఆధారంగా విభజించారు. దాని వల్ల తెలంగాణకు 54 శాతం, ఆ«ంధ్రప్రదేశ్కు 46 శాతం ఇచ్చారు. అంత అన్యాయంగా విభజన చేశారు. మీరు, కాంగ్రెస్ కలిసి చేశారు. రాష్ట్రానికి నష్టం, అన్యాయం చేశారు. మీ లక్ష్యం ఒక్కటే. జగన్‌గారిని ఇబ్బంది పెట్టాలి. విభజన తర్వాతా బాబు అన్యాయమే..: విభజన తర్వాత కూడా మీరు రాష్ట్రానికి అన్యాయం చేశారు. హోదా వద్దన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చుకోలేకపోయారు. వెనకబడిన ప్రాంతాల నిధి కూడా జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున సాధించలేకపోయారు. 2014-17 మధ్య రెండేళ్లు ఆ నిధి తెచ్చుకోలేకపోయారు. ఆ నిధిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించుకుంది. పోలవరం ప్రాజెక్టును 2014-15 నాటి ధరలకు అనుగుణంగా ఎలా పూర్తి చేస్తామని తెచ్చుకున్నారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తోంది. మీరు ప్రాజెక్టును ప్రొటోకాల్ ప్రకారం చేయలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం స్పిల్‌వే పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్‌లు కట్టారు. మధ్యలో గ్యాప్ ఇచ్చారు. దాని వల్ల పనులన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. రెవెన్యూ లోటు. దాన్ని కూడా మీరు సాధించలేదు. కానీ మేము రూ. 12 వేల కోట్లు తెచ్చుకున్నాం. మేము వచ్చాకనే రామాయపట్నం, కడప స్టీల్ ప్లాంట్ కడుతున్నాం కదా? పౌరసరఫరాల శాఖ అప్పుల్లో తెలంగాణ తన వాటా రూ.600 కోట్లు కట్టకపోతే.. ఎస్బీఐ కొంపల్లి శాఖలో ఖాతా ఫ్రీజ్ అయితే, మేము వచ్చాక ఆ డబ్బులు కట్టించి, మన వాటా తెచ్చుకున్నాం. ఇది వాస్తవమా? కాదా? ఇప్పుడు వచ్చి ఏదేదో చేస్తామంటున్నారు. మేము కేంద్రంతో మాట్లాడి అన్నీ సాధిస్తే.. కుమ్మక్కు అయ్యామంటారు. మీరు చేయలేదు. మేము చేస్తే.. విమర్శలు. ఇన్ని అనర్థాలకు కారణం బాబే..: ఈరోజు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అంటే.. ప్రధాన కారకుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబు.. ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఆయన చర్యలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు. అన్నీ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించేవే. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. ఉద్యోగుల భవిష్యత్తు కోసమే..: ఉద్యోగులకు సంబంధించి రాబోయే 30 ఏళ్లలో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిర్ణయాలు తీసుకున్నాం. ఓపీఎస్ గురించి నిర్ణయం తీసుకుంటే.. భవిష్యత్తులో అది మరింత భారమై, ఉద్యోగులకే నష్టం చేస్తుంది. ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే జీపీఎస్ అమలు చేస్తున్నాం. దాన్ని కేంద్రం కూడా ఆమోదిస్తోంది. మేము వచ్చాకే కొత్త ఉద్యోగాలు: మా ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య ఆరోగ్య శాఖలో ఎందరిని భర్తీ చేశాం. సచివాలయాల ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియడం లేదా? చంద్రబాబు మనసులో మాట పుస్తకం ద్వారా ఉద్యోగులపై తన మాట చెప్పాడు. ఇప్పుడు ఆయనే మళ్లీ ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు. అందుకే చంద్రబాబు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతారు. మీ లీడర్ చెబితే చేయాలంటారు,..మా లీడర్ చెప్పడమే తప్ప చేయడం ఉండదని టీడీపీ నేతలే అన్నారు. -
చంద్రబాబు మనసులో మాట.. ఉద్యోగులు కచ్చతంగా చూడాల్సిన వీడియో
-
ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి?
-
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి బుగ్గన
-
అన్ని తప్పుడు లెక్కలు.. మంత్రి బుగ్గన ఫైర్
-
చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి? అని ప్రశ్నించారు. అప్పులపై ఎల్లో మీడియా రాసేవన్నీ తప్పేనని స్పష్టం చేశారు. కాగా, మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22 శాతం పెరిగింది. టీడీపీ హాయంలో రూ,2,71,797 కోట్ల అప్పులు చేశారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే అప్పులు జరిగాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు?. చంద్రబాబు హయాంలో రెవెన్యూ ఆరు శాతం కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 16.7 శాతం రెవెన్యూ రాబడి వచ్చింది. కర్నూలుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు ప్రతీ ఊరికి వెళ్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?. రాష్ట్రంలో అన్ని పార్టీలతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో బాబు దోస్తీ. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనేక సార్లు మాట మార్చారు. రాష్ట్ర అప్పులకు చంద్రబాబు కారణం కాదా?. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా?. ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీకి చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర విభజన చేశాయి. ప్రత్యేక హోదా వదిలేశారు, ప్యాకేజీ రాబట్టలేకపోయారు. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుండి మన వాటా నిధులు మేము సాధిస్తున్నాం. రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరింత సులభంగా జీఎస్టీ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సులభతరం చేస్తూ ప్రభుత్వం జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సరళీకృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 సేవా కేంద్రాలను ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ టాక్స్ విజన్, మిషన్ వాల్యూస్, ’జీఎస్టీ మిత్ర’ లోగోను ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 195 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులకు అనుకూల వాతావరణాన్ని కలి్పంచేలా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సేవా కేంద్రాల ద్వారా వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఉత్తమ సేవలు అందుతాయని, జీఎస్టీ ఎగవేతలను అరికట్టవచ్చని చెప్పారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతకు పాల్పడటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని తెలిపారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టు ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. పన్ను చెల్లించే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో టాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్సైట్ ను తీర్చిదిద్దారని తెలిపారు. పన్ను చెల్లింపుల వ్యవహారంలో ఇతర దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ రాబడిలో మొదటి స్థానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో వాణిజ్య పన్నుల శాఖలో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించేలా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా పన్నులు కట్టే వారిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. నవంబర్ నెలలో జీఎస్టీ పన్నుల వసూళ్లలో 31 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు (20%), కేరళ (20%), తెలంగాణ (18%), కర్ణాటక (17%), ఒడిశా (3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌నాటికి రూ.21,180.57 కోట్ల జీఎస్టీ వసూలు ద్వారా 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 17.14 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. -
రాష్ట్రంలో పన్నుల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియ మరింత సులభం చేస్తూ పన్ను చెల్లింపు దారులకు, వ్యాపారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నూతన ఆవిష్కరణలు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్ విజన్, మిషన్ వ్యాల్యూస్, 'జీఎస్టీ మిత్ర' లోగోను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. జీఎస్టీ నెట్ వర్క్, మొబైల్ నంబర్ నమోదుతో పన్నుదారులకు ఓటీపీ ఆధారంగా మరింత సులువుగా సేవలు అందించడంతో పాటు పన్ను చెల్లింపులు, ఆర్థిక సంవత్సరాల నివేదికలు సహా ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయని పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి వాణిజ్య శాఖలో వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. నిజాయితీగా పన్నులు కట్టే వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాలకు సంబంధించిన భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము అవలంభిస్తున్న విధానాలతో గతేడాది నెలతో పోలిస్తే 31 శాతం గణనీయమైన వృద్ధితో పురోగతి సాధించామన్నారు. వృద్ధి రేటులో తమిళనాడు(20%), కేరళ(20%), తెలంగాణ(18%), కర్ణాటక(17%), ఒడిశా(3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందని మంత్రి వివరించారు. అంతేగాక నవంబర్, 2023 వరకు రూ.21,180.57 కోట్ల జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు చేసి 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. జీఎస్టీ వసూళ్లలో గతేడాది కన్నా 17.14 శాతం గణనీయమైన వృద్ధి సాధించామన్నారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టడంతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 12 జీఎస్టీ సేవాకేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకించి విజయవాడ నంబర్ 1 డివిజన్ లో మొదటి జీఎస్టీ సేవా కేంద్రం ప్రారంభించడం మైలురాయిగా భావిస్తున్నామన్నారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతలకు దొడ్డిదారులను ఎంచుకుంటున్నారని తద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని మంత్రి అన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని మంత్రి అన్నారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. భారత దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాలలో మాత్రమే ఉందని తెలిపారు. ట్యాక్స్ కట్టే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో ట్యాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ట్యాక్స్ కట్టే వారి వల్లే దేశం నడుస్తుందని అన్నారు. గతంలో మాదిరి పన్నులు ఎగ్గొట్టే వారిని పట్టుకోవడం కన్నా.. పన్ను వసూళ్లను సరళతరం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజన్ స్టేట్ మెంట్ ఉండటం ప్రతి వ్యవస్థకు అవసరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఆర్థిక శాఖకు సంబంధించి స్టేట్ ట్యాక్సెస్ కు ఒక విజన్ ఇచ్చిన రోజును తన జీవితంలో మరిచిపోలేనని మంత్రి చెప్పారు. పలువురు ఉన్నతాధికారులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలు అంశాలను అధ్యయనం చేశామన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీలు, పదుల సంఖ్యలో సమీక్షలు చేయడం ద్వారా ఇబ్బందులను పరిష్కరించి, సవాళ్లను అధిగమించామని చెప్పారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులకు 'శిక్షణ' ఆవశ్యకతను గుర్తించానన్నారు. గత కొన్నేళ్లలో నిర్వర్తించిన బాధ్యతలు సంతృప్తికరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్ సైట్ ను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. ఇతర దేశాల్లో మాదిరి పన్ను చెల్లింపుల వ్యవహారంలో మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. పన్ను చెల్లింపుదారులే లేకపోతే వాణిజ్య పన్నుల శాఖ లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తెలిపారు. వాణిజ్య పన్నులు, వసూళ్ల సరళతరం కోసం ఎన్నో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. పన్నుల వసూళ్లలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో పాత విధానాలకు స్వస్తి పలికి..సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికామన్నారు. పన్ను చెల్లించే వారికి ఏ ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండు మూడేళ్లలో మరిన్ని కీలక మార్పులతో ముందుకు వెళ్తామన్నారు. వాణిజ్య పన్నులు, జీఎస్టీలో సాంకేతిక పరిజ్ఞానం అమలులో ఏపీ ముందడుగు వేసిందని జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి అన్నారు. గొప్ప ఆవిష్కరణలు, సంస్కరణలకు వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. అర్ధశాస్త్రంలో పన్ను వసూలు గురించి కౌటిల్యుడు చెప్పిన 5 ప్రధాన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నామని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్ పేర్కొన్నారు. జీఎస్టీలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్ల వరకూ ఎదిగామని తెలిపారు. బోగస్ రిజిస్ట్రేషన్లు అరికట్టేలా వాణిజ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని అవి సత్ఫలితాలిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో పారదర్శక విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంస్కరణల వల్ల జీఎస్టీలో ఏపీ మెరుగైన ప్రతిభను కనబరుస్తుందన్నారు. రాష్ట్ర పన్నుల శాఖ స్థితిని, గతిని, దశను, దిశను ఉన్నత స్థాయికి పెంచి దేశస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను పలువురు అధికారులు కొనియాడారు. రాష్ట్ర పన్నుల శాఖలో సంస్కరణలు తేవాలని, ఈ శాఖను సేవా విభాగంగా చేయాలని, పారదర్శకతను పెంచాలని, టెక్నాలజీని అందిపుచ్చుకొని మెరుగైన సేవలను అందిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించాలని చెప్పి ఆచరణలో చూపించిన వ్యక్తి, అరుదైన ఆర్థిక నిపుణులు బుగ్గన రాజేంద్రనాథ్ అని పలువురు అధికారులు అభివర్ణించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, వాణిజ్యవేత్తలు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, ఆడిటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రుణానికి పూర్తి బాధ్యత మేఘాదే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడటం అంటే గజదొంగే దొంగా.. దొంగా అని అరిచినట్లుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణను ఆయన ఖండించారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని బుగ్గన గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం కొత్తగా వచ్చిన ఓ నాయకుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ.2,000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారని, అసలు గ్యారెంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేదన్నారు. ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ అనేది ముమ్మాటికీ అబద్ధమన్నారు. ఇది ప్రభుత్వమిచ్చిన గ్యారెంటీ కాదని, ప్రభుత్వం కేవలం ప్రైవేట్ సంస్థకు బకాయిలెన్ని ఉన్నాయి అని వివరాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదికూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినదని, పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్యాంకుకు కట్టవలసిన వడ్డీ ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని తెలిపారు. వడ్డీ, అసలు కట్టే విషయంలో ఎలాంటి ఆలస్యమైనా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. బ్యాంకులు ఆ ప్రైవేట్ సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్లు ఇస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం విషయంలో చేసిన తప్పులే ప్రస్తుత పరిస్థితులకు కారణమని బుగ్గన విమర్శించారు. మీరు పెట్టిన బకాయిలను మేం చెల్లించాం ఆరోగ్యశ్రీ బిల్లులకు గ్యారెంటీ ఇవ్వరా అని అడుగుతున్నారని, టీడీపీ పాలనలో రూ. 800 కోట్లు పైచిలుకు చివరి 8 నెలల కాలంలో పెండింగ్‌లో పెట్టినప్పుడు చంద్రబాబు గ్యారెంటీ ఇచ్చారా? అని బుగ్గన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలు చెల్లించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సామర్థ్యం పెంచి పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ. 5,177 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఈ నాలుగున్నరేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 9,514.84 కోట్లు వెచ్చించిందని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత టీడీపీకి ఎక్కడదని బుగ్గన అన్నారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉన్న రూ. 40,000 కోట్లు పెండింగ్ బిల్లులకు గ్యారెంటీ అడిగారా అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఇక ట్యాంకర్లతో అందించిన నీటికి బిల్లుల విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ. 80 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం రాగానే చెల్లించిందని చెప్పారు. -
మేఘాకు గ్యారెంటీ పచ్చి అబద్ధం: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: టీడీపీ.. దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమన్నారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే. ప్రభుత్వానికి సంబంధం లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తున్నారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారు. దోచుకోవడానికే ఇలా చేశారని వితండవాదం చేశారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదు’’ అంటూ మంత్రి బుగ్గన మండిపడ్డారు. ‘‘ఈ విషయం తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎందుకు మాట్లాడడం లేదు.?. ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో రూ.241 కోట్లు దోచుకుందెవరు?. రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు?. ఇన్నర్ రింగ్‌రోడ్డును మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు?. సామాన్య ప్రజలలో మా ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారు. అందుకే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లుతున్నారని ప్రజలకు అర్థం అయింది’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘జగనన్న గోరుముద్ద’కు జాతీయ పురస్కారం -
ఆదాయంతోపాటు అభివృద్ధి
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత సర్కారు హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలోనే ఆదాయం పెరగడంతోపాటు అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. టీడీపీ హయాం కంటే ఇప్పుడే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా నమోదైందని, గత ప్రభుత్వంతో పోల్చితే అప్పులు కూడా ఇప్పుడే తక్కువని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమానికి గత సర్కారు కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేసిందని గణాంకాలతో సహా బహిర్గతం చేశారు. మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పులు, ఆదాయం, వృద్ధిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖలు ద్వారా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఒకసారి రూ.పది లక్షల కోట్లు మరోసారి రూ.11 లక్షల కోట్లు, ఇంకోసారి రూ.నాలుగున్నర లక్షల కోట్లు అంటూ యనమల తన లేఖల్లోనే పరస్పర విరుద్ధ గణాంకాలను పేర్కొనటాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి లాంటి వారు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేయడంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐకి కూడా ఇదే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆమె కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర ఆర్ధిక శాఖ, కాగ్, ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలే వాస్తవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు ఇదే విషయాన్ని పార్లమెంట్లో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అప్పులు, రాష్ట్ర ఆదాయం, స్థూల ఉత్పత్తిపై తాను చెబుతున్న లెక్కల్లో తప్పులుంటే చెప్పాలని యనమలకు సవాల్ విసిరారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి రూ.250 కోట్లకు లెక్కలు కనిపించడం లేదని బుగ్గన వెల్లడించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రూ.370 కోట్లకు నామినేషన్‌పై డిజైన్ టెక్కు ఇచ్చారని, ఈ స్కామ్ 2017లోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీ విచారణలో వెలుగులోకి వచ్చిందన్నారు. సెబీ, ఈడీ కూడా దీనిపై విచారణ చేశాయన్నారు. ఎవరి హయాంలో అప్పులు ఎలా? 2018–19 నాటికి (టీడీపీ హయాంలో) రూ.2,57,210 లక్షల కోట్లు 2021–22 నాటికి (వైఎస్సార్సీపీ హయాంలో) రూ.3,93,718 లక్షల కోట్లు మూడేళ్లలో వైఎస్సార్సీపీ హయాంలో పెరిగిన అప్పులు రూ.1,36,500 కోట్లు సగటున ఏడాదికి రూ.45,500 కోట్లు అప్పులు ♦ టీడీపీ హయాంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.33,032 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీల సంక్షేమానికి రూ.74,249 కోట్లు వ్యయం. ♦ టీడీపీ హయాంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.11,400 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్ సీపీ పాలనలో ఎస్టీల సంక్షేమానికి రూ.25,323 కోట్లు వ్యయం ♦ టీడీపీ హయాంలో బీసీ సంక్షేమానికి రూ.30,970 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో బీసీ సంక్షేమానికి చేసిన వ్యయం రూ.1,12,960 కోట్లు ♦ మైనారిటీలకు టీడీపీ హయాంలో వ్యయం సున్నా ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం రూ.11,157 కోట్లు ♦ చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు డిస్కమ్‌లకు చెల్లింపు రూ.20,165 కోట్లు ♦ వైఎస్సార్సీపీ పాలనలో నాలుగేళ్లలో రూ.57,417 కోట్లు చెల్లింపు టీడీపీ హయాంలో గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి గ్యారెంటీ అప్పులు రూ,13,247 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.57,687 కోట్లు ♦ 2014 నాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.22,000 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.66,664 కోట్లు వైఎస్సార్సీపీ వచ్చాక నాలుగేళ్లలోగ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ♦ వైఎస్సార్ సీపీ హయాంలో గ్యారెంటీ అప్పులు రూ.1,18,000 కోట్లు ♦ నాన్ గ్యారెంటీ అప్పులు రూ.83,000 కోట్లు బాబు హయాంలో ఓవర్ డ్రాప్ట్ 2018–19లో 74.3 శాతం వినియోగం ♦ వైఎస్సార్సీపీ పాలనలో అనుమతించిన రోజుల్లో 2019–20లో 39.5 శాతం వినియోగం ♦ 2020–21లో అనుమతించిన రోజుల్లో 51.5 శాతమే ఓవర్ డ్రాప్ట్ వినియోగం ♦ 2014–15లో ద్రవ్యలోటు మూడు శాతానికి అనుమతిస్తే 3.95 శాతానికి చేరింది ♦ 2018–19లో మూడు శాతానికే అనుమతి ఉంటే 4.06 శాతానికి చేరింది. ♦ ఇప్పుడు 2021–22లో 4.5 శాతానికి అనుమతి ఉంటే ద్రవ్యలోటు కేవలం 2.01 శాతమే ఉంది. ♦ టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రూ.1,62,828 కోట్లను అసెంబ్లీ అనుమతి లేకుండా అధికంగా వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి అప్పు రూ.1,34,600 లక్షల కోట్లు ♦ 2019 మే నాటికి మొత్తం అప్పు రూ,3,28,700 లక్షల కోట్లు.. అంటే అప్పుల పెరుగుదల 19.55 శాతం వైఎస్సార్సీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2022–23 నాటికి మొత్తం అప్పు రూ.4,99,895 లక్షల కోట్లు. అంటే అప్పు పెరుగుదల శాతం 15.46 శాతమే ♦ టీడీపీ హయాంలో ఐదేళ్లలో మూలధన వ్యయం రూ.76,139 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.15,227 కోట్లే ♦ వైఎస్సార్సీపీ హయాంలో మూడేళ్లలో మూల ధన వ్యయం రూ.55,086 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.18,362 కోట్లు ♦ టీడీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ34,73,477 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.6,95,695 లక్షల కోట్లు ♦ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ.43,34,192 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.10,83,548 లక్షల కోట్లు. -
యనమల ఆరోపణలను ఖండించిన మంత్రి బుగ్గన
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఒకసారి 4 లక్షల కోట్ల మరోసారి 10 లక్షల కోట్ల అప్పు అంటున్నారని దుయ్యబట్టారు. కోవిడ్ ఇబ్బందులతోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని తెలిపారు. ‘స్కిల్ స్కామ్ జీఎస్టీ వల్ల బయట పడింది. 2018లోనే ఏపీ రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు. జీఎస్టీ, సెబీ, ఈడీ విచారణ చేసిన స్కామ్ ఇది. 2017 నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. అలాంటి కేసులో సీఐడీ విచారణ చెయ్యకూడదా..? సిమెన్స్ సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? 5 రోజుల్లో ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..? డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..? మా హయాంలో 3 నెలల, 5 నెలలు, 4 నెలలు పాటు ట్రైనింగ్ ఇస్తున్నాం. రూ. 370 కోట్లకి డిజైన్ టెక్ ఈరోజుకి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు. సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది. అనంతపురం జేఎన్టీయూ సెంటర్లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి. ఎంత చూసిన ఈ స్కామ్‌లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు. పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి. కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..? విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు’ అని పేర్కొన్నారు. -
ఒక్కొక్కరు ఒక్కో మాట.. ఎవ్వరికీ లెక్కలు తెలియదు..
-
యనమల ఆరోపణలను ఖండించిన బుగ్గన
-
రాష్ట్రానికి సంబంధించిన అప్పులపై ఎటువంటి దాపరికం లేదు: మంత్రి బుగ్గన
-
టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థముందా?
-
ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-
ఆర్థిక భరోసా ‘గ్యారెంటీ’
మనుషుల జీవిత కాలం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకుపైగా జీవించే వారు 2022లో 10 శాతం ఉండగా 2025 నాటికి 16 శాతానికి పెరుగుతారు. ఓపీఎస్ అనేది ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్నేళ్లూ ఇవ్వాలి. అమెరికా లాంటి దేశం కూడా పెన్షన్లపై పరిశోధన చేసి చివరకు సాధ్యం కాక ఓపీఎస్‌ను తగ్గించేసింది. సమయం, వయసు నిబంధనలను సవరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్, సీపీఎస్లపై చిత్తశుద్ధితో ఆలోచించింది. ఓపీఎస్‌తో సుదీర్ఘ భవిష్యత్తులో జీతాల చెల్లింపులకు సైతం ఇబ్బందులొస్తాయి. ఇక సీపీఎస్‌ను అమలు చేస్తే వడ్డీ రేట్లు తగ్గిపోయి షేర్ మార్కె ట్లో పెట్టుబడులు సరైన రాబడి ఇవ్వ నప్పుడు ఉద్యోగులకు నష్టం వస్తుంది. అందుకే దీనిపై బాగా ఆలోచించి మధ్యేమార్గంగా జీపీఎస్‌ను తెచ్చాం. – అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ సర్వెంట్స్ తమ అభిమతం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యమిస్తారన్నారు. అలాంటి ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం వారి ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తోందన్నారు. ప్రధానంగా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. తమ ప్రభుత్వం 11వ పే రివిజన్ కమిషన్ సిఫారసులను అమలు చేసిందని, అంతకంటే ముందు ఉద్యోగులు నష్టపోకుండా మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బుధవారం శానససభలో ఏపీ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ బిల్లు–2023, ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్) బిల్లు–2023ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ ద్వారా ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.311 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. జీపీఎస్ అమలుతో 2040 నాటికి రూ.2,500 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుందని అంచనా. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను (ఓపీఎస్) అమలు చేస్తే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్‌ను(జీపీఎస్) తెచ్చిందన్నారు. ఒక సర్వే ప్రకారం ఓపీఎస్ కొనసాగితే రాష్ట్రంలో ఉద్యోగుల పెన్షన్ల ఖర్చు ప్రస్తుతం ఉన్నదాని కంటే నాలుగున్నర రెట్లు పెరుగుతుందన్నారు. ఓపీఎస్ ప్రకారం పెన్షన్ 1991–92లో సున్నా నుంచి ప్రారంభమై 2022–23 నాటికి దేశవ్యాప్తంగా రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగి పెన్షన్లే కాకుండా జీతాలకూ ఇబ్బందులొస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్/సీపీఎస్) ప్రకారం దేశవ్యాప్తంగా 2023 నుంచి 2050కి నాటికి పెన్షన్ల చెల్లింపులు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటే అదే ఓపీఎస్ ప్రకారం అయితే రూ.18 లక్షల కోట్లవుతుందన్నారు. ‘దీనివల్ల అసలు ఓపీఎస్‌ను ఎవరైనా చేయగలరా? తాత్కాలికంగా ఒక వ్యక్తిని తృప్తి పరిచేందుకు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది సాధ్యమైనా? పాలన చేసేటప్పుడు ఈరోజు పరిస్థితిని, భావి తరాల పరిస్థితిని కూడా చూసుకోవాలి. కొంతమంది మాదిరిగా ఏదో ఒకటి చేసుకోండని చెప్పి అమల్లోకి వెళ్తే ఐదేళ్లకో, పదేళ్లకో కుప్పకూలిపోతుంది. అందుకే మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నాం’ అన్నారు. ఇంకా బుగ్గన ఏమన్నారంటే.. రాబడి కంటే ఎక్కువ ఏపీ ఓన్ రెవెన్యూ 2014–15లో రూ.38,038 కోట్లుగా ఉంది. ఇది 2015–16 నాటికి రూ.44,842 కోట్లు, 2016–17లో రూ.44,374 కోట్లు, 2017–18కి రూ.53 వేల కోట్లు, 2020–21 నాటికి రూ.60,823 కోట్లకు చేరింది. ఇందులో మానవ వనరులపై ఖర్చు 2014–15లో రూ.25,094 కోట్లు కాగా ప్రస్తుతం రూ.83,604 కోట్లకు పెరిగింది. రాష్ట్రం మొత్తం రాబడిలో హెచ్ఆర్ ఖర్చులే 66 శాతంగా ఉన్నాయి. జీతాలు, పెన్షన్లకు 2014–15లో 70 శాతం ఉంటే.. 2019–20లో వంద శాతం, 2020–21 నాటికి 110 శాతం అయ్యింది. అంటే 2020–21 నాటికి మన రాష్ట్రానికి వచ్చే రాబడి కంటే ఎక్కువగా పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ సొంత రాబడిలో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2020–21లో ఏపీలోనే పెన్షన్ల ఖర్చు ఎక్కువ. 2015–16లో ఏపీలో 91 శాతం ఖర్చు అవుతుంటే తెలంగాణలో 53 శాతమే ఉంది. 2020–21లో ఏపీలో 110 శాతంగా ఉంటే తెలంగాణ లో 53 శాతమే ఉంది. తెలంగాణ కంటే ఏపీలో రెట్టింపు వ్యయం అవుతోంది. కర్నాటక, తమిళనాడులోనూ మనకంటే తక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓపీఎస్‌ను అమలు చేయడం సాధ్యంకాదు. 2014–15లో హెచ్ఆర్ ఖర్చు రూ.25,094 కోట్లు అయితే పెన్షన్లకు రూ.6,147 కోట్లు అయ్యింది. 2022–23లో హెచ్ఆర్ వ్యయం రూ.83,406 కోట్లుండగా పెన్షన్లు రూ.22,602 కోట్లకు చేరాయి. ఇది మరింత పెరగడం ఖాయం. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓపీఎస్‌లోకి వెళ్లమని కొందరు సలహా ఇస్తున్నారు. కానీ రాష్ట్ర భవితకోసం ఆలోచిస్తున్నాం. ఓపీఎస్‌తో ఆర్థిక పరిస్థితి చేయిదాటి పోతుంది సీపీఎస్‌లో ప్రస్తుతం ప్రభుత్వం రూ.1,510 కోట్లు ఏటా చెల్లిస్తోంది. అదే ఓపీఎస్‌లోకి వెళ్తే ఇప్పటికిప్పుడు కట్టాల్సింది రూ.23 కోట్లే. అయినప్పటికీ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మధ్యేమార్గంగా జీపీఎస్‌పై ఆలోచనలు చేశాం. ఓపీఎస్‌కు వెళ్తే పెన్షన్లకు 2023లో రూ.20 వేల కోట్లకు పైగా, 2025 వచ్చేసరికి రూ.22,037 కోట్లు, 2030–35 నాటికి రూ.33,546 కోట్లు, ఆ తరువాత నుంచి ఇక చేయిదాటి పోతుంది. 2004లో నియమితులైన ఉద్యోగులు 2045 నాటికి రిటైరవుతారు. అప్పుడు ఒకేసారి పెన్షన్ల భారం పెరుగుతుంది. దీన్ని ఆలోచించి జీపీఎస్‌పై కసరత్తు చేశాం. ప్రఖ్యాత కేఏ పండిట్ æసంస్థతో సంప్రదించి ఈ విధానాన్ని తెచ్చాం. పెన్షన్‌కు ప్రభుత్వానిదే బాధ్యత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 5.70 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఓపీఎస్ ఉద్యోగులు 2.02 లక్షల మంది, సీపీఎస్ ఉద్యోగులు 3.04 లక్షలు, పెన్షనర్లు ఓపీఎస్‌లో 3,73,770, రెగ్యులర్ పెన్షనర్లు 24,663, ఫ్యామిలీ పెన్షనర్లు 1,69,107 మంది ఉన్నారు. సీపీఎస్‌లో ఉద్యోగులకు 20 శాతం కంటే పెన్షన్ రాదు. దానికీ గ్యారెంటీ లేదు. రిటైరయ్యాక చివరి మూలవేతనంలో సగం మొత్తం పెన్షన్‌గా ఉండేలా జీపీఎస్‌ను రూపొందించాం. సీపీఎస్‌లో వడ్డీ రేట్లు తగ్గినా, షేర్మార్కెట్లో రాబడి లేకున్నా వారికి పెన్షన్ భద్రత ఉండదు. అదే జీపీఎస్‌లో ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50% పెన్షన్‌కు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. జీవిత భాగస్వామికి 60 శాతం పెన్షన్ ఉంటుంది. దాంతోపాటు డీఆర్, ఈహెచ్ఎస్ స్కీమ్‌ను అమలు చేస్తాం. ఉదాహరణకు ఆఫీసు సబార్డినేట్ చివరి జీతంలో మూల వేతనం రూ.45,966 అయితే సీపీఎస్‌లో 20 శాతం అంటే రూ.9579 మాత్రమే పెన్షన్ వస్తుంది. దానికి గ్యారెంటీ లేదు. కానీ జీపీఎస్‌లో 50 శాతం కింద రూ.23,923 వస్తుంది. పోలీసు కానిస్టేబుల్‌కు రూ.60,485 చివరి జీతం మూల వేతనం ఉంటే సీపీఎస్ లో రూ.12,079 పెన్షన్, జీపీఎస్‌లో రూ.30,243 వస్తుంది. ఎస్జీటీ టీచర్లు చివరి జీతంలో మూల వేతనం రూ.78,352 అయితే వారికి సీపీఎస్‌లో రూ.15,647 పెన్షన్, అదే జీపీఎస్‌లో రూ.39,175 ఇస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు చివరి జీతంలో మూల వేతనం రూ.1,48,597 ఉంటే సీపీఎస్ కింద రూ.29,675, అదే జీపీఎస్ కింద రూ.74,299 వస్తుంది. దీనితో పాటు వారి ఫ్యామిలీ పెన్షన్ కింద 60 శాతం, హెల్త్ స్కీం సైతం వర్తిస్తుంది. ఏ లెక్కన చూసినా జీపీఎస్‌లో ఉద్యోగికి మేలు జరుగుతుంది. ఉద్యోగుల భద్రత కోసం ఆలోచించి భవిష్యత్తులో ఏ ఒక్కరికీ నష్టం రాకూడని తీసుకున్న నిర్ణయమిది. భారీగా ఉద్యోగాల భర్తీ 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగా భద్రత కల్పిస్తున్నాం. వైద్య విధాన పరిషత్‌ను సైతం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్పు చేసి 15 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాం. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 1.35 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాలను తెచ్చి ఉద్యోగాలిచ్చాం. మరో 2.50 లక్షల మందిపైగా వలంటీర్లుగా పని చేస్తున్నారు. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 53,126 ఉద్యోగాలను భర్తీ చేశాం. రెగ్యులర్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖలో మరో 10,143 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాం. గ్రూప్1, 2లతో పాటు ఎస్ఐ, ఆర్ఎస్ఐ నియామకాలు, 6,100 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేశాం. ఉద్యోగులపై చంద్రబాబు విషం గతంలోనే ఉద్యోగులపై విషాన్ని తన మనసులో మాట పుస్తకం ద్వారా చంద్రబాబు బయటపెట్టారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో రాష్ట్రం అప్పుల వలలో చిక్కుకుపోతోందని విద్వేషాలను ప్రచురించారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో సర్ప్లస్ రెవెన్యూ ఉన్నప్పుడు రాసిన మాట. సీఎం జగన్ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఆపకుండా ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉద్యోగులకు చేయాల్సినంత మేలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ఆలోచించుకోవాలి. ఊహించని రీతిలో జీతాల పెంపు చిన్న స్థాయి ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం. ఆశా వర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచడంతో 43 వేల మందికి లబ్ధి చేకూరింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం రూ.155 కోట్లు నుంచి రూ.517 కోట్లకు చేరుకుంది. గిరిజన, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ వర్కర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచడంతో ప్రభుత్వంపై రూ.415 కోట్ల భారం కాస్తా రూ.622 కోట్లకు వెళ్లింది. మెప్మా రిసోర్స్ పర్సన్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, సెర్ప్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్‌కు రూ.2 వేల నుంచి రూ.10 వేలకు పెంచి వారి ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేశాం. 16 వేల మంది హోంగార్డులకు రూ.18 వేల నుంచి రూ.21,300కి జీతం పెంచడం ద్వారా భారం రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెరిగింది. 88 వేల మంది మిడ్ డే మీల్స్ సహాయకులకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు చేయడంతో రూ.200 కోట్లు అదనపు భారం పడింది. 48,770 మంది అంగన్వాడీలకు రూ.7 వేల నుంచి రూ.11,500కి, ఇందులో 55,607 మంది అంగన్వాడీ హెల్పర్స్‌కు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెంచాం. సెర్ప్‌లో పని చేసే హెచ్ఆర్ ఉద్యోగులకు 23 శాతం జీతాల పెంపుతో 4,569 మందికి లబ్ధి చేకూరింది. సూక్ష్మస్థాయిలో ఆలోచించి 108 డ్రైవర్లకు రూ.13 వేలు ఉండే జీతాన్ని రూ.28 వేలు చేశాం. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్‌కు రూ.15,500 నుంచి రూ.20 వేలు, 104 డ్రైవర్లుకు రూ.26 వేలకు, ఆస్పత్రుల్లోని శానిటేషన్ వర్కర్లకు రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచాం. దాదాపు 3 లక్షల మందికి పైగా ఉద్యోగులకు జీతాల పెంపు ద్వారా ఆర్థిక భారం రూ.2 వేల కోట్లు నుంచి రూ.3500 కోట్లుకు చేరింది. రూ.1,500 కోట్లు అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తోంది. వీటికి తోడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వీక్లీ ఆఫ్‌లు తీసుకొచ్చాం. ఏజెన్సీల చేతుల్లో శ్రమ దోపిడీకి గురైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్‌లోకి తీసుకొచ్చి చట్టం చేసి ఒకటో తేదీన జీతంతో పాటు ఈపీఎస్, ఈఎస్ఐను కూడా కల్పిస్తున్నాం. ఉద్యోగులకు ప్రత్యేక లీవ్ బెనిఫిట్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ తీసుకొచ్చాం. 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించారు. రాష్ట్రం విడిపోయిన నాటికి పర్మినెంట్ శాంక్షన్డ్ పోస్టులో ఫుల్ టైం కాంట్రాక్టు విభాగంలో నియమితులైన వారిని క్రమబద్ధీకరిస్తాం. శాంక్షన్డ్ పోస్టుకు ఆర్థిక శాఖ అనుమతి ఉండి నోటిఫై అయిన ఖాళీలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ పారదర్శకంగా భర్తీ చేసి ఉండాలి. -
చంద్రబాబు అక్రమాలను కేంద్ర సంస్థలే గుర్తించాయి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అడ్డంగా రూ.కోట్లు కొట్టేసిన చంద్రబాబును గోదావరి, కృష్ణా నది తీరాల్లో సన్మానించాలన్నట్లు టీడీపీ నేతల తీరు ఉందని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దుయ్యబట్టారు. రూ.వందల కోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయకుండా సన్మానించాలా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. నైపుణ్యాభివృద్ధి పేరిట చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై శాసన మండలిలో బుధవారం చర్చ జరిగింది. పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడిన అనంతరం స్కిల్ స్కామ్‌లో తీసుకున్న చర్యలపై మంత్రి బుగ్గన సమాధానమిస్తూ.. చంద్రబాబు హయాంలో పథకం ప్రకారం ప్రజాధనాన్ని వేగంగా కొట్టేయాలనుకునే స్కీమే తప్ప.. అది స్కిల్ స్కీమ్ కాదన్నారు. పథకం ప్రకారమే ‘స్కిల్ స్కామ్’ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ‘ప్రజాధనాన్ని ప్రభుత్వ పెద్దలుగా కాపాడాలి. ఆ డబ్బును సక్రమంగా వినియోగించాలి. రాష్ట్ర భవిష్యత్‌ను నిరి్మంచే గౌరవ స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా మెలగాలి. చంద్రబాబు అండ్ కో పథకం ప్రకారమే కుంభకోణానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి అందులో రూ.250 కోట్లను షెల్ కంపెనీల ద్వారా సునాయాసంగా దోచేశారు’ అన్నారు. ‘ఒప్పందాల నుంచి ప్రభుత్వ నిధుల విడుదల వరకు అన్నీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. గుజరాత్లో జరిగిన ఎంవోయూలో సంతకం చేసిన సీమెన్స్ ఎండీ సౌమేంద్ర బోస్, ఏపీకి వచ్చేసరికి సుమన్ బోస్ ఎలా అయ్యారు. అవగాహన ఒప్పందంలో తేదీ వివరాలు, లెటర్ నంబర్, ఏ రోజు, ఏ నెల అనే వివరాలు ఎందుకు లేవు. అలా ఎంవోయూ చేయడం సాధ్యమా. నిద్రపోయిన వారిని తట్టి లేపవచ్చు కానీ.. నిద్ర నటించే ప్రతిపక్షాలను ఏం చేయగలం’ అన్నారు. ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తారా? ‘దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే క్లస్టర్లను నెలకొల్పాలని 2015లో చంద్రబాబు ప్రభుత్వం తీర్మానించింది. ఇందులో ఒక్కో సెంటర్‌కు అయ్యే రూ.546.84 కోట్ల ఖర్చులో 90శాతం సీమెన్స్, డిజైన్ టెక్, మరో పది శాతం నిధులను ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కొక్క సెంటర్‌ను సీమెన్స్, డిజైన్ టెక్ రూ.491,84,18,908 గ్రాంటు ఇన్ ఎయిడ్‌గా, రూ.55 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాతో ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో హుటాహుటిన రూ.185 కోట్లు చెల్లించింది. 2016లో రూ.85 కోట్లు, ఆ తరువాత రూ.67 కోట్లు, రూ.34.25 కోట్లు విడతల వారీగా ప్రభుత్వం నిధులు ఇచ్చేసింది. వాస్తవానికి ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లు అయినప్పటికీ 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ వాటా ఇవ్వకుండానే ప్రభుత్వం రూ.371.25 కోట్లు విడుదల చేసినప్పటికీ ఓచర్ వివరాలు లేకుండా డిజైన్ టెక్ యూసీ మాత్రమే ఇచ్చింది. ఆ డబ్బులు డొల్ల కంపెనీల ద్వారా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేర్చారు’ అని చెప్పారు. స్కిల్ స్కామ్ ఎలా బయటపడిందో కూలంకషంగా వివరించారు. స్కిల్ స్కామ్‌లో ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు మనుషులు ఎందుకు పారిపోతున్నారని బుగ్గన ప్రశ్నించారు. -
ఉద్యోగులకు మేలు చేసే జీపీఎస్
-
పెన్షన్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన
-
ఎన్పీఎస్ ప్రయోజనాలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన
-
ఎన్పీఎస్ నిర్ణయం.. హడావుడిగా తీసుకోలేదు: మంత్రి బుగ్గన
-
హామీ ఇచ్చిన మేరకు ప్రతీ విభాగానికీ మేలు చేకూర్చాం: మంత్రి బుగ్గన
-
పెన్షన్లపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అసెంబ్లీలో బిల్ పాస్..
-
కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
-
డొల్ల కంపెనీలు.. దొంగ అగ్రిమెంట్లు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దొంగ అగ్రిమెంట్లు, డొల్ల కంపెనీలతో దోచుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెబీ, జీఎస్టీ, ఈడీల విచారణలో ఈ కుంభకోణం వెలుగులోకి రాగా, తరువాత ఐటీ శాఖ దాడుల్లో కూడా చంద్రబాబు అక్రమాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. వీటి ఆధారంగా సీఐడీ విచారించడంతో చంద్రబాబు పాత్రతో సహా మరిన్ని అంశాలు తేలాయన్నారు. నాలుగైదేళ్లు విచారణ అనంతరం పలువురు సాక్షులను ప్రశ్నించి పత్రాలను పరిశీలించాక ఆధారాలు లభించడంతోనే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు చేసిన చంద్రబాబును అరెస్టు చేయకుండా సన్మానం చేయమంటారా? అని నిలదీశారు. స్కిల్ స్కామ్‌పై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిస్తూ అన్ని అంశాలను కూలంకషంగా సభకు వివరించారు. హడావుడిగా కార్పొరేషన్.. డొల్ల కంపెనీలకు డబ్బులు చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే వీలైనంత వేగంగా ప్రజాధనాన్ని దోచేసేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే 2015 ఫిబ్రవరి 25న స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్టుమెంట్‌ను ఏర్పాటు చేశారు. స్కిల్ శిక్షణ ఉన్నత విద్యలో భాగంగా ఉండగా దాన్ని వేరుచేసి స్కిల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్‌గా విభజించారు. తరువాత జర్మనీకి చెందిన సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో నైపుణ్య శిక్షణ అంటూ జీవో నెం 4 ఇచ్చారు. దానికి భిన్నంగా డిజైన్‌టెక్ అనే షెల్ కంపెనీని తెచ్చి ఒప్పందం చేసుకున్నారు. దొంగ సంతకాలు, తేదీలు వేయకుండా జరిగిన ఈ ఎంఓయూ పూర్తిగా అక్రమమే. ఆరు క్లస్టర్లుగా ఒక్కోదాని పరిధిలోని 5 ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో క్లస్టర్‌కు అయ్యే ఖర్చు రూ.546 కోట్లుగా చూపించి అందులో 90 శాతం సీమెన్స్ సంస్థ భరిస్తుందని, 10 శాతం నిధులను ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తుందని జీవోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆ జీవో, ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఒకవేళ ఎవరైనా ఎంఓయూ చేసుకుని ఉంటే తమకు సంబంధం లేదని సీమెన్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆరు క్లస్టర్లకు రూ.3,281 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ ప్రాజెక్టు నివేదిక కూడా పూర్తిగా బోగస్. తమకు తెలియకుండా ఇండియాలో తమ ఎండీ నాటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం పేరుతో అవినీతికి పాల్పడ్డారని సీమెన్స్ కంపెనీ అంతర్గత విచారణలో తేలింది. దీంతో ఆ ఎండీని తొలగించినట్లు సీమెన్స్ కంపెనీ లిఖితపూర్వకంగా వెల్లడించింది. అదే విషయాన్ని సీమెన్స్ లీగల్ హెడ్ న్యాయస్థానంలో 164 సెక్షన్ కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇంత జరిగినా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. ఇంకా కళ్లు మూసుకుని ఉండాలా? పలు అరెస్టులు జరిగిన ఈ అంశంలో విచారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదా? ఈడీ విచారించిన నిందితులే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లోనూ ఉన్నారు. సీమెన్స్ ఇండియా తరఫున గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని సౌమ్యాద్రి శేఖర్ బోస్‌గా సంతకం చేసిన వ్యక్తి ఏపీకి వచ్చేసరికి ఎంఓయూలో సుమన్ బోస్‌గా సంతకం చేశారు. అతడితోపాటు డిజైన్‌టెక్ తరఫున సంతకం చేసిన కన్విల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ తరఫున ఒప్పందం చేసుకున్న చంద్ర అగర్వాల్, పేమెంటు తీసుకున్న సురేష్ గోయెల్‌ను ఈడీ గతంలో అరెస్టు చేసింది. ఇంతమందిని ఈడీ అరెస్టు చేసినా మనం కళ్లు మూసుకొని ఉండాలా? అక్రమాలను గుర్తించిన జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం సుమన్బోస్ను ఆ పదవి నుంచి తొలగించింది. ఈ కుంభకోణంపై సీఐడీ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించింది. అనేక అక్రమాలు జరిగినట్లు అందులో తేలింది. ఇన్ని వాస్తవాలు కళ్లముందు కనిపిస్తుండడంతో టీడీపీ వాళ్లు కక్ష సాధిస్తున్నారంటున్నారు. తప్పు జరగలేదని చెప్పట్లేదు. కార్పొరేషన్ ఏర్పాటే ఒక దుష్ట పన్నాగం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఎంతో హడావుడిగా విధి విధానాలు లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతి కావాలని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజేయ కల్లం స్పష్టంగా రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమకు నచ్చిన వ్యక్తులను తెచ్చి ఇంత ముఖ్యమైన సంస్థలో కీలక పోస్టుల్లో నియమించారు. గంటా సుబ్బారావును ఎండీ, సీఈఓగా నియమించారు. తరువాత అదే వ్యక్తిని ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు సీఎం, హయ్యర్ ఎడ్యుకేషన్‌గా నియమించారు. సెక్రటరీ టు స్కిల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ బాధ్యతలూ అప్పగించారు. అన్ని హోదాల్లో ఒకే వ్యక్తిని నియమించుకున్నారు. నైపుణ్య శిక్షణ పేరిట రూ.371 కోట్లను త్వరగా కొట్టేయాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు. 90 శాతం గ్రాంటు వస్తుందని జీఓలో చెప్పి ఎంఓయూలో దాని ఊసే లేకుండా చేశారు. ప్రభుత్వం నుంచి హడావుడిగా నిధులు విడుదల చేశారు. టెండర్లకు వెళ్లకుండా డబ్బులు కాజేసేందుకు పథకం ప్రకారం వ్యవహరించారు. డిజిటల్ ఫైల్స్ లేకుండా.. ఈ శిక్షణ వ్యవహారంలో గత ప్రభుత్వం ఏ ఒక్క ప్రొసీజర్‌ను కూడా అనుసరించలేదు. డిజిటల్ ఫైల్సు లేకుండా ఫిజికల్ ఫైల్స్‌తోనే తతంగం నడిపించారు. కొత్త ప్రాజెక్టు కనుక ఒకేసారి కాకుండా పైలట్‌గా చేపట్టాలని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత సూచించినా పట్టించుకోలేదు. ముందుగానే రూ.371 కోట్లు ఎలా విడుదల చేస్తారని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి సీఎస్ కృష్ణారావు, ఇతర అధికారులు కూడా నిధుల విడుదలపై కొన్ని అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసేశారు. ఇవన్నీ నాటి సీఎం పాత్ర లేకుండా జరుగుతాయా? శ్రీనివాస్, పార్థసానిలను విచారిస్తే ఈ డబ్బులు ఎవరిదగ్గరకు చేరాయో తేలుతుంది. జీఎస్టీ డీజీ విచారణతో వెలుగులోకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారంతో 2017 ఆగస్టులో మొదటిసారిగా జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (పుణే) డొల్ల కంపెనీలను విచారిస్తున్న సమయంలో కొన్ని బోగస్‌వి దొరికాయి. ఆ డొల్ల కంపెనీలకు డబ్బులు చేరవేసి అక్కడినుంచి వేరే సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి మళ్లించినట్లు జీఎస్టీ విచారణలో తేలింది. దీంతో అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏషియా లిమిటెడ్, స్కిల్లర్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ (పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్), డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు జీఎస్టీ డీజీ నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఈ సంస్థలతోనే ఎంఓయూ కుదుర్చుకున్నారు. జీఎస్టీ డీజీ విచారణలో అక్రమాలు బయటపడిన తరువాత, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా విచారణ జరిపారు. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై జీఎస్టీ అధికారులు నాటి టీడీపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టాల్సిన గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోగా అవినీతికి కీలకమైన ఫైళ్ల నుంచి నోట్ ఫైళ్లను మాయం చేసింది. ఆ తరువాత ఓ విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గత సర్కారు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సీఐడీ విచారణతో మొత్తం అక్రమాలు బయటకు వస్తున్నాయి. పలు డొల్ల కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని తరలించినట్లు తేటతెల్లమైంది. ప్రాథమిక విచారణ చేశాక 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత కొంతమందిని విచారించి అరెస్టు కూడా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీ నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, సురేష్ గోయెల్ (ఢిల్లీ చార్టెడ్ అకౌంటెంట్), మనోజ్‌కుమార్ జైన్ (ఢిల్లీ చార్టెడ్ అకౌంటెంట్), యోగేష్ గుప్తా (షేర్స్ ట్రేడింగ్ బిజినెస్) శ్రావణ్‌కుమార్ తులరాంజాజు (షేర్ ట్రేడింగ్ బిజినెస్)లను అరెస్టు చేశారు. 2017 నుంచి 2023 వరకు సెబీ, జీఎస్టీ ఇంటెలిజెన్సు, ఐటీ, ఈడీలు విచారించాయి. ఈడీ కూడా సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ వినయ్ కన్విల్కర్, ముకుల్‌చంద్ అగర్వాల్, సిరీస్ చంద్రకాంత్ఝా, బిపన్కుమార్శర్మ, నీలన్శర్మ, గంటి వెంకటసత్య భాస్కర్ ప్రసాద్, వీరందరినీ విచారించి అరెస్టు చేసింది. ఒప్పందం తరువాత షెల్ కంపెనీల ఏర్పాటు ఇక డబ్బుల చెల్లింపులు చూస్తే గత ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని దోచేయడానికి ఎంత ఆరాటపడ్డారో అర్థమవుతుంది. ఒప్పందం కుదిరిన కొద్దిరోజులకే 2015 డిసెంబర్ 5న అప్పటికప్పుడు రూ.185 కోట్లు విడుదల చేశారు. 2016 జనవరి 29న మళ్లీ అర్జెంటుగా రూ.85 కోట్లు, 2016 మార్చి 11న రూ.67 కోట్లు, మార్చి 31న రూ.34 కోట్లు.. ఇలా మొత్తం నిధులను విడుదల చేశారు. విచిత్రమేమంటే క్లస్టర్లేవీ ఏర్పాటు కాకుండానే నిధులను ఇచ్చేశారు. స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కొన్ని కంపెనీలను ఎంఓయూ కుదిరిన నెలరోజుల తరువాత ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులను తరలించేశారు. స్కిల్లర్ కంపెనీ అనేది డొల్ల కంపెనీ అని, కేవలం డబ్బులు కాజేయటానికే దాన్ని ఏర్పాటు చేశారని సీఐడీ తేల్చింది. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నేరుగా డిజైన్ టెక్కు రూ.273.21 కోట్లను తరలించి అక్కడి నుంచి డొల్ల కంపెనీల ద్వారా వేర్వేరు మార్గాల్లో నిధులను దోపిడీ చేశారు. పీవీఎస్పీ, స్కిల్లర్ ఇండియా, ఏసీఐ, క్యాడన్స్, పొలారస్, నాలెడ్జి పోడియం, ఈటీఐ, పాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్ సహా వివిధ ఫారెన్ కంపెనీల ద్వారా ఈ నిధులను కొల్లగొట్టారు. యోగేష్‌గుప్తా డొల్ల కంపెనీలలో భాగస్వామిగా తేలాడు. అతడు చంద్రబాబుకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ స్కామ్‌లో నిందితుడు. ఈ స్కామ్‌లో మనోజ్ వాసుదేవ్ పార్థసానిని విచారిస్తే మంగేష్, అతుల్సోని వినయ్ అనే వ్యక్తులు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబుకు అందించారని ఐటీ శాఖ తేల్చింది. ఇదంతా చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా నడిచింది. విక్కీజైన్ అనే వ్యక్తిని శ్రీనివాస్ తమకు అటాచ్ చేయడంతో డబ్బులు పంపినట్లు వారు ఐటీ శాఖకు వెల్లడించారు. ఈ స్కామ్‌లో రామోజీరావు వియ్యంకుడు ఆర్వీఆర్ రఘు కూడా ఉన్నాడు. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలను విచారించడానికి సీఐడీ 2023 సెప్టెంబర్ 5న నోటీసులు ఇవ్వగా వారిద్దరు ఆ మర్నాడే విదేశాలకు పరారయ్యారు. చిత్ర విచిత్రాలు సీఐడీ పరిశోధనల్లో అనేక అవకతవకలు బయట పడ్డాయి. సౌమ్యాద్రి బోస్ అనే వ్యక్తి సీమెన్సు ఇండియా సాఫ్ట్‌వేర్‌కు ఎండీగా ఉన్నాడు. గుజరాత్‌తో చేసుకున్న ఎంఓయూలో సౌమ్యాద్రి బోస్ అని సంతకం చేసి మన దగ్గరకు వచ్చేసరికి సుమన్ బోస్‌గా పేరు మార్చేసి సంతకం చేశాడు. కంపెనీలో ఎండీగా ఉంటూ వేర్వేరు పేర్లతో సంతకాలు పెట్టడమన్నది ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. అగ్రిమెంట్ జూన్ 2015 అని పేర్కొని ఎక్కడా తేదీ వేయలేదు. తేదీ లేకుండా అగ్రిమెంట్ ఎక్కడైనా చూశామా? పేజీ చివర్లో సీమెన్స్ ఇండియా లిమిటెడ్, డిజైన్ టెక్ ఇండియా లిమిటెడ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం చేసుకున్నట్లు ఉన్నా తేదీలు వేయలేదు. ‘డాష్..’ అంటూ ఖాళీలు ఉంచారు. సాక్షి సంతకాల వద్ద కూడా ఖాళీ ఉంచారు. ఎంఓయూలో డిజైన్‌టెక్ ద్వారా అమలు చేస్తునట్లు చూపించి తరువాత మూడో పార్టీగా పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రైవేటు లిమిటెడ్, స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలను తెరపైకి తెచ్చారు. జీఓలో సీమెన్సు అమలు చేయాలని పేర్కొని ఒప్పందంలో డిజైన్‌టెక్‌కు పరిమితం చేసి చివరకు స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగిస్తున్నట్లు చూపించారు. అసలు డిజైన్టెక్కే ఓ డొల్ల కంపెనీ. అది మరో డొల్ల కంపెనీకి ఇచ్చేసింది. ఉపసంహరించుకోవడానికి మనమెవరం? ప్రతిపక్ష సభ్యులు ఈ శాసనసభలో చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపసంహరించుకోవడానికి మనమెవరం? కోర్టు, చట్టం తమ పని తాము చేస్తున్నాయి. విపక్ష సభ్యులకు వారికి కేటాయించిన సమయం కన్నా ఎక్కువ ఇస్తామని, ప్రభుత్వం సమాధానమిస్తుందని చెబుతున్నా వినకుండా వెళ్లిపోయారు. విజిల్ వేసిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మిగతా వారు కూడా వెళ్లిపోయారంటే చర్చించాలని వారికి ఏ కోశానా లేదు. చంద్రబాబు లాంటి మహా మేధావి ఎక్కడా దొరకడని వారి అభిప్రాయం. -
చంద్రబాబు హయాంలో బెల్లం స్కామ్ కూడా జరిగింది : బుగ్గన రాజేంద్రనాథ్
-
చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు సిద్ధం...మా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?
-
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష
అమరావతి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై 'విప్'లతో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై చర్చించారు. చీఫ్ విప్‌లు ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. సమావేశాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఫలవంతం చేయాలని, అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు స్థానం కాదని విపక్ష నేతలకు సూచించారు. ఇదీ చదవండి: నేడు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్ -
స్కిల్ యూనివర్స్ పేరుతో డాష్ బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా డ్యాష్‌బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు. వాటర్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్‌కుమార్, ఈడీ దినేష్‌కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో జ్యుడీషియల్ సిటీ
కర్నూలు(సెంట్రల్): కర్నూలులోని జగన్నాథగట్టులో 250 ఎకరాలలో ప్రభుత్వం జ్యుడీషియల్ సిటీ నిర్మించనుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. కర్నూలులో రూ.17 కోట్లతో నిర్మించిన హరిత భవన్‌ను మంత్రి బుగ్గన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యుడీషియల్ సిటీలో హైకోర్టుతో పాటు నేషనల్ లా యూనివర్సిటీ, జ్యుడీషియల్ అకాడమీ, వివిధ ట్రిబ్యునళ్లకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు కీలకమని.. వాటి ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత సమయంలోగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో వరుసగా ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి అవసరమైన కార్యాలయాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. తిరుపతి, గుంటూరు, విజయవాడతో పాటు ఇప్పుడు కర్నూలులో నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. త్వరలోనే నెల్లూరు, అనంతపురంలో కూడా నూతన భవనాలు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ శ్రీధర్, ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహా్మనందరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సృజన, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎంవీ రావు, బీవై మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి
సాక్షి, అమరావతి: కోవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్సార్ సీపీ పాలనలో సంపద పెరగడంతోపాటు అప్పులు తగ్గాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గణాంకాలతో సహా మీడియాకు గురువారం వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రి, కాగ్ చెప్పినవి వాస్తవాలని తెలిపారు. కొందరు స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అంటూ చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదన్నారు. ఎల్లో మీడియా, విపక్షాల మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులపై పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కలు, అసెంబ్లీలో సీఎం వెల్లడించిన గణాంకాలు మాత్రమే వాస్తవాలన్నారు. రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఇంత తక్కువ ఎలా చెబుతారంటూ ఎల్లో మీడియాతో పాటు విపక్ష నేతలు బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. కేరళను అప్పులకు అనుమతించకుండా ఏపీకి మాత్రం ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు ప్రచురించడం విచిత్రంగా ఉందన్నారు. ♦ గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎల్లో మీడియా ఏనాడైనా కథనాలు ప్రచురించిందా? ఇప్పుడు రూ.వెయ్యి కోట్ల అప్పులపై ఐదుసార్లు వార్తలు రాసి రూ.ఐదు వేల కోట్ల అప్పుల తరహాలో చిత్రీకరిస్తోంది. బడ్జెట్ బయట చూసినా లోపల చూసినా అప్పులు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఆయన హయాంలో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పులు చేయడంతో ఇప్పుడు ఆ మేరకు కోత పడింది. అనుమతి ఉన్నా సరే మేం రూ.28,466 కోట్లు తక్కువ అప్పులు చేశాం. ♦ చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం కాగా ఇప్పుడు 12.4 శాతం మాత్రమే ఉంది. మేం అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు ఎటు వెళ్లినట్లు? టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగలేదు కానీ అప్పులు మాత్రం పెరిగాయి. తాను సంపద పెంచే నిపుణుడినంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. కర్నాటక, తమిళనాడుతో పాటు వైఎస్సార్సీపీ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టోలను ప్రకటించుకున్నారు. ♦ గత ఎన్నికల ముందు ఏప్రిల్‌లో పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు రూ.5,500 కోట్లు అప్పు చేయలేదా? వచ్చే ప్రభుత్వం పాలన చేయలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. ఇక అప్పులు పుట్టకుండా చేశామంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించలేదా? అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా నిర్విఘ్నంగా అమలు చేస్తోంది. పరిమితికి లోబడే అప్పులు చేస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు పార్లమెంట్‌లోనూ ప్రశి్నంచారు. కేంద్రం వాస్తవాలను వెల్లడించడంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలకు దిక్కు తోచట్లేదు. ♦ దేశంలో రాష్ట్రానికో నిబంధన ఉండదు. పరిమితికి లోబడి కేంద్రం అప్పులను అనుమతిస్తోంది. ♦ రాష్ట్ర అప్పులపై మాట్లాడుతున్న వారు, కథనాలను ప్రచురిస్తున్న వారు అసలు మన రాష్ట్రంలోనే ఉండరు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ అప్పుల గురించి దు్రష్పచారం చేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు అప్పులు చేస్తే ఇప్పుడు రూ.10 వేల కోట్లు మాత్రమే అప్పు చేశాం. విద్యుత్ సంస్థలకు భారీగా పెట్టిన బకాయిలను సైతం తీరుస్తున్నాం. రెవెన్యూ రాబడులు, వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధిని గమనిస్తే సంపద ఎవరి హయాంలో ఎంత పెరిగిందో స్పష్టమవుతుంది. ♦ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వయసులో తాను కొదమ సింహం అంటూ జంతువులతో పోల్చుకోవడం ఎందుకు? సింహం అంటే సింగిల్‌గా వస్తుంది. మరి ఆయన ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేశారా? చంద్రబాబు పొత్తులు పెట్టుకోని పార్టీ లేదు. ఒకే పారీ్టతో రెండేసి సార్లు పొత్తులు పెట్టుకున్న ఘనత ఆయనదే. ♦ కొత్తగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించినవారు ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు అంటే ఏమిటో అధ్యయనం చేశాక మాట్లాడాలి. నాబార్డు నుంచి రూ.7,992 కోట్లు అప్పులు చేయలేదు. తీసుకున్నది రూ.3,281 కోట్లు మాత్రమే. కంటిన్జెన్సీ ఫండ్ గవర్నర్ వద్ద అత్యవసరాల కోసం ఉంటుంది. కొత్తగా వచి్చన వారు దాన్ని కూడా అప్పు కింద లెక్కించారు. పబ్లిక్ అకౌంట్ పద్దు నుంచి గత ప్రభుత్వం రూ.36,241 కోట్లు వాడుకోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3,475 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్సార్ హయాంతోపాటు విభజన అనంతరం మరోసారి టీడీపీ పాలనలో, వైఎస్సార్సీపీ వచ్చాక బడ్జెట్ బయట, లోపల చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వడ్డీల శాతం గణాంకాలను బుగ్గన వెల్లడించారు. ఆ వివరాలివీ... ♦ 2014–15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,22,605 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 23.35 శాతం) ♦ 2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 30.27 శాతం) ♦ 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.5 శాతం) ♦ చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికిపైగా పెరగగా ఇప్పుడు నాలుగేళ్లల్లో మూడు శాతం మాత్రమే పెరిగాయి. ♦ 2014 – 2019 అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం ♦ 2019 నుంచి 2022–23 వరకు అప్పుల వార్షిక వృద్ధి రేటు 12.4 శాతం ♦ చంద్రబాబు హయాం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధి రెండు శాతం తక్కువగానే ఉంది ♦ 1999 – 2004 రెవెన్యూ రాబడులు వృద్ధి 12.4 శాతం (ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాం) ♦ 2004 – 2009 రెవెన్యూ రాబడులు వృద్ధి 21.6 శాతం (వైఎస్సార్ హయాం) ♦ 2014 – 2019 రెవెన్యూ రాబడులు వృద్ధి 6 శాతం ♦ 2019 – 2023 రెవెన్యూ రాబడులు వృద్ధి 16.7 శాతం ♦ వైఎస్సార్ హయాంతో పోలిస్తే చంద్రబాబు జమానాలో రెవెన్యూ రాబడులు 15.6 శాతం క్షీణించగా ఇప్పుడు 10.7 శాతం పెరిగాయి ♦ 2014 – 2019 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,95,000 కోట్లు ♦ 2019 – 2023 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11,00,000 కోట్లు ♦ రాష్ట్ర విభజన నాటికి గ్యారెంటీలు, గ్యారెంటీలు ఇవ్వని అప్పులు రూ.35,000 కోట్లు ♦ 2019 మే నాటికి ఆ అప్పులను చంద్రబాబు రూ.1,40,500 కోట్లకు పెంచారు. అంటే 21.8 శాతం పెంచారు. ♦ వైఎస్సార్సీపీ వచ్చాక రూ.2,09,000 కోట్లకు పెరిగాయి. అంటే 12.6 శాతమే పెరిగాయి. -
ఏపీ అప్పులు.. గంటా శ్రీనివాసరావు, యనమలపై మంత్రి బుగ్గన సెటైర్లు..!
-
గతంలో వీరెవ్వరూ ఎందుకు మాట్లాడలేదు?
-
అప్పులపై కేంద్రం క్లారిటీ సరిపోలేదా? ఎందుకీ బురద మాటలు: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు బురద చల్లుతున్నారంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ అప్పులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ అప్పులు చేసింది. గతంలో వీరెవ్వరూ ఎందుకు మాట్లాడలేదు?’’ అని బుగ్గన ప్రశ్నించారు. ‘‘ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించకూడదనేదే వీరి కుట్ర. ఏపీకి మంచి జరగకూడదన్నదే వీరి ఆలోచన. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఏపీ అప్పులపై మాట్లాడేవారు ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ఉండటం లేదు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఆర్థికశాఖ చెప్పిన సమాధానాన్ని కూడా వీరు నమ్మరు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులపై వాస్తవాలు బయటపడ్డాయి. ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వీరందరూ బాధపడిపోతున్నారు’’ అని మంత్రి ధ్వజమెత్తారు. చదవండి: కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..! ‘‘వెయ్యి కోట్ల అప్పు అంటూ ఐదు సార్లు రాస్తే 5 వేల కోట్లు అవుతుందా?. ఏపీ అప్పులపై కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు ప్రచురించరు?. రాష్ట్ర అప్పులపై కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులపై ఎప్పుడైనా మాట్లాడారా?. నేను సింహాన్ని అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఎందుకు మీరు జంతువులతో పోల్చుకుంటున్నారు?’’ అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. -
ఉపాధి, శిక్షణపై విస్తృత అధ్యయనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి వియత్నాం పర్యటన ముగిసింది. ఏపీ యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, వృత్తి విద్య, శిక్షణపై అధ్యయనమే లక్ష్యంగా దక్షిణ కొరియా, వియత్నాం దేశాలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పది రోజుల పర్యటించారు. ఈ పర్యటనలో చివరి రోజైన మంగళవారం హోచిమిన్ సిటీలోని సైగాన్ హైటెక్ ఇండ్రస్టియల్ పార్క్‌లో ఉన్న అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ ట్రైనింగ్ సెంటర్‌ను అధికారుల బృందంతో కలసి సందర్శించారు. పార్కును తీర్చిదిద్దిన తీరు, టెక్నాలజీ అంశాలపై సైగాన్ హైటెక్ పార్కు అధ్యక్షుడు న్గుయెన్ అన్హ్ థీని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలపై ప్రతినిధులతో చర్చించారు. పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, వృత్తి శిక్షణలో సహకారం, అవకాశాలపై మన అధికారుల బృందం అధ్యయనం చేసింది. వియత్నాంలోని అతిపెద్ద సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ‘మోవి’ని మంత్రి బుగ్గన సందర్శించారు. సాల్మన్ ఫిష్ (మాఘ చేప), ట్యూనా ఫిష్ (తూర చేప)లను శుద్ధి చేసే యూనిట్‌లోని టెక్నాలజీని అడిగి తెలుసుకున్నారు. డాంగ్ నై ప్రావిన్స్ వైస్ చైర్మన్‌తో ఆర్ధిక మంత్రి బుగ్గన సమావేశమై. ఏపీలో పర్యటించాలని వైస్ చైర్మన్‌ను ఆహ్వానించారు. -
వియత్నాం పర్యటనలో ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వియత్నాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వియత్నాం ప్రభుత్వ ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమయ్యారు. ఇందులో వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన తోడ్పాటుపై ప్రధానంగా చర్చతో పాటు వియత్నాం నుంచి మరింత సహకారం దిశగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు కోసం చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రాన్ కోక్ ఫుంగ్ను మంత్రి కలిశారు. వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ 'గార్కో 10'ను సందర్శించారు. టెక్స్ టైల్ కంపెనీ, 'గార్కో 10' సహకారంతో వృత్తివిద్య కళాశాలల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు. వీటితో పాటు హానోయ్ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్శిటీని విజిట్ చేశారు. టెక్స్ టైల్ రంగంలోని సాంకేతికత, ఫ్యాషన్ శిక్షణలో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం చేశారు. ఇందులో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. హనోయిలోని ఇండియా హౌస్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భారత రాయబారి సందీప్ ఆర్యాను కలిశారు. చదవండి నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై క్లారిటీ.. ఆక్సిజన్ కొరతపై దుష్ప్రచారాన్ని ఖండించిన వైద్యులు -
యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా బుగ్గన దక్షిణ కొరియా పర్యటన
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దక్షిణా కొరియాలో పర్యటిస్తున్నారు. వివిధ వాణిజ్యవేత్తలు, నిపుణులతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయగల అవకాశాలపై చర్చిస్తున్నారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఏపీలో అనుసరించే కీలకాంశాలపై అధ్యయనం చేస్తున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తొలుత భారత రాయబారీ హెచ్.ఈ. అమిత్ కుమార్‌తో రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. ఏపీ ఆర్థికాభివృద్ధికి అవసరమైన అంశాలలో కొరియా భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా కొరియాతో కలిసి పని చేసే అవకాశాలపైనా పరస్పరం చర్చించుకున్నారు. దక్షిణ కొరియా వ్యాపార విస్తరణకు అవసరమైన ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు ఏపీ సంసిద్ధతతో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు సహా సీ ఫుడ్ పై మరింత అవగాహన పెంచే బ్రాండింగ్ అంశంలో కలిసి ముందుకు సాగనున్నట్లు భారత్‌కు చెందిన సౌత్ కొరియా రాయబారి అమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయాబర కార్యాలయ ప్రతినిధి కె.స్వప్నిల్ తొరాట్ పాల్గొన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ సీఎఫ్ఓ సహా సంబంధిత ప్రముఖులతో ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మరింతగా కలిసి పని చేసే అవకాశాలపైనా ప్రధానంగా మంత్రి చర్చించారు. అందుకు ఐసీసీకే కూడా సానుకూలంగా స్పందించింది. పెట్టుబడులకు అవకాశమున్న ఏ అవకాశాన్నీ ఏపీ వదులుకోదన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.అందుకు అవసరమైన పరస్పర సహకారం ఎప్పుడూ ఉంటుందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొరియా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ సీఎఫ్ఓ పంకజ్ శ్రీ వాత్సవ, బీకేఎల్ పార్ట్ నర్ జాంగ్ బీక్ పార్క్, టాగివ్ వ్యవస్థాపకులు, సీఈవో పంకజ్ అగర్వాల్, సేజ్ స్ట్రాటజీస్ సీఈవో ఇంబం చోయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక, నైపుణ్యాబివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ప్రతినిధులను కలిశారు.ఏపీకి పెట్టుబడులను తీసుకురావడంలో 'కొట్రా' భాగస్వామ్యమవుతుందని మంత్రి వెల్లడించారు. కొట్రాకు బెంగుళూరులో నెట్ వర్క్ కార్యాలయం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆ ఏజెన్సీ మంత్రి బుగ్గనకి తెలిపింది. పర్యటన అనంతరం కొట్రా ప్రతినిధులు ఏపీకి వచ్చి అవసరమైన సహకారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని డైరెక్టర్ జనరల్ హియో జిన్వోన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చో ఈనం, డిప్యూటి డైరెక్టర్ జో యాండ్, రీసెర్చ్ టీమ్ డైరెక్టర్ హాంగ్ చంగ్సేక్, అసిస్టెంట్ మేనేజర్ పార్క్ మనిజోంగ్ పాల్గొన్నారు. దక్షిణా కొరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయమైన సామ్యూక్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ లో కొరియన్ లాంగ్వేజ్ ల్యాబ్ ల ఏర్పాటుపై సామ్యూక్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ హ్యున్ హీ కిమ్ తో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు. కొరియన్ భాష నేర్చుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాలు, కొరియాలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. వొకేషనల్ విద్యకు సంబంధించి సామ్యూక్ విశ్వవిద్యాలయం ఏపీకి అవసరమైన సహకారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొరియన్ భాష నేర్చుకోవడం వలన ప్లేస్ మెంట్లను మరింతగా పెంచవచ్చన్నారు. విద్యార్థుల మార్పిడితో యువతకు మరిన్ని అవకాశాలను కల్పించే మార్గాలను అన్వేషించే బాధ్యతను సామ్యూక్ విశ్వవిద్యాలయం 'ఎస్పీఓసీ'కి కేటాయించింది. ఈ కార్యక్రమంలో సామ్యూక్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ హ్యున్ హీ కిమ్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డీన్ జియెన్ షిన్, లైఫ్ సైన్సెస్ లో పోస్ట్ -డాక్టోరల్ పరిశోధకులు ఎస్. ఉమావతి, ఫార్మాలో పోస్ట్ -డాక్టోరల్ పరిశోధకులు ఏ.వి. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని పెట్టుబడుల కోసం విదేశాలకు..
సాక్షి, అమరావతి: మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో కూడిన బృందం ఈనెల 15 నుంచి 25 వరకు దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో పర్యటించనుంది. అక్కడ ప్రముఖ సంస్థలను సందర్శించి.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. మంత్రి బుగ్గన ఈ నెల 10న ఢిల్లీలో దక్షిణ కొరియా, వియత్నాం రాయబారులతో సమావేశమై పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ బృందం కొరియాలోని కియా పరిశ్రమను సందర్శించి ఏపీలోని యూనిట్‌ను మ రింతగా విస్తరించడానికి గల అవకాశాలను వివరిస్తా రు. శామ్సంగ్, దేసాంగ్ కార్పొరేషన్లతో పాటు కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ అండ్ ఫిష రీస్ టెక్నాలజీలను ఈ బృందం సందర్శించనుంది. విశాఖలో జరిగిన జీఐఎస్‌లో వియత్నాం ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా తాజా పర్యటనలో ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమవ్వనున్నారు. వియత్నాంలోని సౌత్ ఎకనామిక్ జోన్‌ను సందర్శించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడుతూ..పరిశ్రమలు, టెక్స్టై ల్స్, ఆక్వా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అక్కడ పాటిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
నాలుగేళ్లలో సంపద సృష్టి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో గత నాలుగేళ్లలో కొత్త వనరులతో పాటు సంపద సృష్టి జరిగిందని, జీఎస్టీ గణాంకాలే ఇందుకు నిదర్శనమని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. 2021–22లో రూ.23,386 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు (పరిహారం లేకుండా) 2022–23లో 25 శాతం వృద్ధితో రూ.28,103 కోట్లకు చేరాయన్నారు. కేంద్ర జీఎస్టీ కంటే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నాలుగు శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా ఉండే కర్ణాటక, మహారాష్ట్రల్లో సైతం ఇది కేవలం ఒక్క శాతానికి మాత్రమై పరిమితమైందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఆదాయం, సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. శుక్రవారం విజయవాడలో జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని (ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ) ప్రారంభించిన అనంతరం మంత్రి బుగ్గన విలేకరులతో మాట్లాడారు. 2014–19 మధ్య టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెండేళ్లు కరోనా ఇబ్బందులు ఎదురైనా అధిక సంపద, వనరులను సృష్టించామని చెప్పారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి యనమలతో బహిరంగ చర్చకు సిద్ధమని బుగ్గన ప్రకటించారు. ఆదాయం తగ్గిందని యనమల విమర్శిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పెరిగిందంటూ పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే గత నాలుగేళ్లలో పన్ను వసూళ్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. డీలర్ ఫ్రెండ్లీ విధానం వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు తెచ్చినట్లు బుగ్గన పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమది డీలర్ల ఫ్రెండ్లీ విధానమని వివరించారు. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, కమిషనర్ రవిశంకర్, అడిషనల్ కమిషనర్ ఎస్ఈ కృష్ణమోహన్‌రెడ్డి, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
స్కిల్ కాలేజీలతో పరిశ్రమల అనుసంధానం
సాక్షి, అమరావతి: స్కిల్ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నైపుణ్యశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15కల్లా పరిశ్రమలతో అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. స్కిల్‌హబ్‌లలో శిక్షణ కోసం ఇప్పటివరకు 15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 3,636 మందికి ఉపాధి అవకాశాలు అందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్‌కుమార్ చెప్పారు. స్కిల్ కాలేజీలు, స్కిల్హబ్లకు సంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్ చేయాలని మంత్రి బుగ్గన సూచించారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
సంస్కరణలతో ఆదాయం వృద్ధి
సాక్షి, అమరావతి: వాణిజ్యపన్నుల శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఆ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. 2022–23లో జీఎస్టీ ఆదాయం 20.13% వృద్ధితో ఏకంగా రూ.28,092.87 కోట్లు నమోదవడం విశేషం. గతంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అంటే వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎప్పుడు తనిఖీలు చేస్తారో.. ఎలాంటి జరిమానాలు విధిస్తారో.. అన్న భయం ఉండేది. కానీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు వాణిజ్యపన్నుల శాఖను పూర్తిగా స్నేహపూర్వక శాఖగా మార్చారు. గత ఏడాది కాలంగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అవకతవకలకు పాల్పడకుండా పన్నులు చెల్లించే వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ.. అదే సమయంలో పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో తనిఖీల భయం లేకుండా నిజమైన వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ సంస్కరణలతో రాష్ట్రంలో పన్ను ఎగవేతలకు అడ్డుకట్టపడింది. గతేడాది (2022–23)లో ఈ సంస్కరణల ద్వారా అదనంగా రూ.1,745 కోట్ల ఆదాయం సమకూరినట్లు రాష్ట్ర పన్నుల ప్రధాన అధికారి గిరిజాశంకర్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే సంవత్సరం 10కిపైగా కీలక సంస్కరణలతో పూర్తిస్థాయి ప్రక్షాళన చేశామన్నారు. పన్ను చెల్లించని వ్యాపారులను గుర్తించి వారితో పన్ను కట్టించడం ద్వారా రూ.263.9 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆటోమేటిక్ రిటర్న్ స్క్రూట్నీ ద్వారా రూ.132.91 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ఆడిటింగ్ ద్వారా రూ.38.79 కోట్లు, తనిఖీల ద్వారా రూ.64.29 కోట్లు, వ్యాట్ బకాయిలను వసూలు చేయడం ద్వారా రూ.235.13 కోట్లు వచ్చాయన్నారు. 2021–22తో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం (పరిహారం లేకుండా) 2022–23లో 20.13% వృద్ధితో రూ. 28,092.87 కోట్లుగా నమోదైందని తెలిపారు. పరిహారంతో కలిపి చూస్తే మొత్తం జీఎస్టీ ఆదాయం రూ.33,511.33 కోట్లని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలివే.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అధికారుల ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాహనాలను తనిఖీచేసే ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానంలో ఏ అధికారి వాహనాలను చెకింగ్ చేస్తారన్న విషయాన్ని 24 గంటలు ముందుగానే ఎస్ఎంఎస్ విధానంలో తెలియజేస్తారు. రిటర్నుల స్క్రూట్నీలో కూడా అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్క్రూట్నీ ఆటోమేటెడ్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. జీఎస్టీ పోర్టల్‌లోని డేటా, ఎనలిటికల్ నివేదికల ఆధారంగా స్క్రూట్నీ కోసం రిటర్నులను ఎంపిక చేస్తారు. అలాగే ఎనలిటిక్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలిపేలా డ్యాష్‌బోర్డు, కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేలా లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్, ఈ–జర్నల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రీకృత డేటా ఎనలిటికల్ సెంటర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. తద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి నేరుగా వారివద్దే తనిఖీలు చేస్తున్నారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. -
బాణా సంచాతో బుగ్గనకు స్వాగతం పలికిన వైయస్ అభిమానులు
-
అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు. రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి , శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
ఐటీ టూల్స్ దేశానికే ఆదర్శం
సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు (మెట్రో): పన్నుల విధింపులో అధికారుల తప్పిదాలు, ప్రభావం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చేసిన టూల్స్ దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. స్థానిక ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ ద్వారా వ్యాపారులకు అనువైన సంస్కరణలు, వెసులుబాట్లు తెచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన గుర్తు చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడారు. పన్నులకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల పరిష్కారంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. డిపార్ట్మెంట్కు, డీలర్‌కు మధ్య మంచి సంబంధాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణం రాష్ట్రంలో వివిధ శాఖల భవనాలను నిర్మించేందుకు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ ప్రమాణాలను పాటిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఏలూరులో రూ.10 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత ఆర్మింక భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో నూతన భవనాల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేశామన్నారు. -
టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులిచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వెలువడుతున్న ‘చైతన్య రథం’ పత్రిక ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ నోటీసులిచ్చారు. ‘చైతన్య రథం’ పత్రికలో గత ఏడాది నవంబరు 23వ తేదీ ఎడిషన్‌లో ‘అపరిచితుడు’, ‘బుగ్గనగారి బాగోతం’ శీర్షికలతో అవాస్తవ కథనాలు ప్రచురించి తనపై దుష్ప్రచారం చేశారని మంత్రి బుగ్గన... సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తాను సమర్పిం చిన నామినేషన్ పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అందులో పేర్కొన్న ఆస్తుల వివరాలను ఫోర్జరీ చేశారని బుగ్గన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విధంగా తన భూముల విస్తీర్ణం, వాటి విలువను అమాంతంగా పెంచేసి దుష్ప్రచారం చేశారన్నారు. సీఐడీ అధికారులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారించి ఈ నోటీసులిచ్చారు. సెక్షన్ 92 సీఆర్పీసీ కింద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట నోటీసులు ఇచ్చారు. 2022, నవంబరు 23 నాటి చైతన్య రథం పత్రిక కాపీ, ఆ పత్రిక ఎడిటర్, ఆ వార్తలు రాసిన విలేకరి వివరాలు తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. -
రాష్ట్ర వృద్ధి, అప్పులపై విషప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధి, అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో రాస్తున్న కథనాలన్నీ పచ్చి అబద్ధాలేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొట్టిపారేశారు. టీడీపీ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సరైన అవగాహనలేక నోటికొచ్చినట్లు అసత్యాలు వల్లించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దు్రష్పచారాలతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కన్నా టీడీపీ హయాంలోనే అప్పులు రెండింతలు పెరిగాయని బుగ్గన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. టీడీపీ హయాంలోనే అప్పులు ఎక్కువ నిజానికి.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31, 2023 నాటికి రాష్ట్రం అప్పు రూ.4,36,522 కోట్లు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,64,725 కోట్లు మాత్రమే. అలాగే, అప్పు పెరుగుదలని పోల్చిచూస్తే, గత ప్రభుత్వ హయాం 2014–19లో కేంద్ర ప్రభుత్వ అప్పు సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 9.89 శాతం పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు 19.02 శాతం పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసింది. అదే వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం అప్పు సగటు వార్షిక వృద్ధిరేటు 14.37శాతం పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం సగటు వార్షిక వృద్ధి 13.55 శాతమే పెరిగింది. పైగా రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు కొనసాగించడానికే చేసింది. తలసరి అప్పులపై యనమల తప్పుడు లెక్కలు ఇక తలసరి అప్పు రూ.5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి రూ.లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని యనమల చెప్పేవి తప్పుడు లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై వడ్డీ 2022–23 నాటికి రూ.25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్థిక మంత్రి ఇలా మాట్లాడడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో భయాందోళన రేకెత్తించి తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ దుష్టపన్నాగం కాక మరేమిటి? తలసరిలో వెనుకబాటు బాబు నిర్వాకమే.. చంద్రబాబు 2022–23లో ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోలిస్తే చాల వెనుకబడి ఉందంటున్నారు. మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ.2,09,848లు ఉంటే ఏపీ తలసరి ఆదాయం రూ.1,54,031లే ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నిర్వాకమే. ఓటుకు కోట్లు కేసు, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు, వడ్డీలతో ఆర్థిక విధ్వంసం.. ఇవే ఏపీ వెనకబాటుకు కారణం. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,19,518లు (2022–23). దేశ తలసరి ఆదాయం రూ.1,72,000లు (2022–23). అంటే 2022–23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6శాతం ఎక్కువ. తలసరి ఆదాయంలో ఏపీ 4వ స్థానంలో ఉంది. పేదలకు రూ.2,05,109 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. అవినీతిలేకుండా ప్రతి పైసా ప్రజలకు వారి ఖాతాల్లో జమ అయింది. ఇలా 26 సంక్షేమ పథకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ.2,05,109 కోట్లను డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ప్రతిపక్షాలు కడుపుమంటతో అర్థంలేని విమర్శలు చేయడం శోచనీయం. యనమల, చంద్రబాబు ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం అబద్ధమే. ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాల్జేయడమే వీరి లక్ష్యం. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు పచ్చి అబద్ధాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 మార్చి 31 నాటికి తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,64,725 కోట్లే అని వెల్లడించారు. టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ నిజం కాదా? అని ప్రశ్నించారు. “ఖజానా ఖాళీ!, రూ.100కోట్ల నిధి మాత్రమే మిగిలింది. ఎక్కడెక్కడ అప్పులొస్తాయో అన్నీ తెచ్చేశాం. ఒక్క రూపాయి కూడా ఇక అప్పు పుట్టదు. వైసీపీ ప్రభుత్వం మొదటి 6 నెలల్లోనే అప్పుదొరకక ఆదాయం లేక ఇంటికి వెళుతుంది” అంటూ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమలగారు వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలివి! ఇప్పుడేమో రాష్త్రం అప్పు రూ. 12.5 లక్షల కోట్లు దాటనుందని జోస్యం చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా రాష్ట్రం అప్పు రూ. 10.31 లక్షల కోట్లు చేరిందని ఆయనే నిర్ధారించి సభల్లో ఇష్టమొచ్చినట్లు ప్రకటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా, నైజీరియాగా, జింబాబ్వేగా మారబోతోందని ప్రతిపక్ష నేతలు ఇలాగే గగ్గోలు పెట్టారు. టీడీపీ నాయకులలో రాష్ట్ర ఆర్ధిక స్థితిపై సరైన అవగాహన లేక నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఈ దుష్ప్రచారాలతో రాష్ట్ర ప్రజలలో ఒక రకమైన గందగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని విఫల యత్నంచేస్తున్నారు. వాస్తవానికి , మే నెల, 2019 లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31 , 2023 నాటికీ రాష్ట్రం అప్పు రూ. 4,36,522 కోట్లు. ఈ లెక్కల ప్రకారం, ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాలా రూ.1,64,725 కోట్లు మాత్రమే. అప్పు పెరుగుదలని పోల్చి చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ అప్పు Compound Annual Growth Rate (CAGR) 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు CAGR 19.02 % పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసిందన్నడానికి అధికారిక గణాంకాలే నిదర్శనం. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో (జూన్ 2019 నుంచి మార్చి 2023) కేంద్ర ప్రభుత్వ అప్పు CAGR 14.37% పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం CAGR 13.55 శాతమే పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది (SLOWER PACE) తప్ప మీరు చెప్పినట్టు కాదు. మీరు చేసినంత అప్పు అసలే లేదు. పైగా మా ప్రభుత్వం ఆ మాత్రం చేసింది కూడా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే..ప్రజలను కాపాడుకోవడానికే. తలసరి అప్పు రూ. 5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని సొంత లెక్కలు చెబుతూ యనమల గారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి ముమ్మాటికి ప్రజలను తప్పు దోవ పట్టించే తప్పుడు లెక్కలు, పచ్చి అసత్యాలన్నది వాస్తవం. సెన్సస్-2011 ఆంధ్రప్రదేశ్ జనాభా 4.96 కోట్లు. ఈ జనాభా ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై వడ్డీ చూస్తే 2022 - 23కి రూ. 25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి కూడా కనీస బాధ్యత లేకుండా రూ.లక్ష కోట్లు వడ్డీ కడుతుందని చెప్పడమంటే ముమ్మాటికి ఇది రాజకీయ ప్రయోజనాలు మినహా నిజాలు లేవని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, యువత భవిష్యత్తు నాశనమైనా మాకేం పోదు, పేదవారు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మాకు సంబంధం లేదు, మాకు కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అసత్యాలతో, అనుకూల మీడియాతో భయాందోళనలోకి ప్రజలను నెట్టి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ పన్నిన దుష్ట పన్నాగం కాక మరేమిటి? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ని, ఓవర్ డ్రాఫ్ట్ (O.D) ని అప్పులలో కలిపి యనమల గారు కుతంత్రాలను జొప్పించి అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని చేస్తున్న కుయుక్తే. భారతీయ రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు రోజు వారీ నగదు నిర్వహణకు గాను, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వసతిని కల్పించింది. దీనిని వాడుకోవడమనేది ఏ ప్రభుత్వానికైనా సర్వసాధారణమైన విషయం. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ అనేవి తాత్కాలిక అప్పు మాత్రమే. ‘వేస్ అండ్ మీన్స్’ మరియు ‘ఓవర్ డ్రాఫ్ట్’ కింద మన రాష్ట్ర అప్పు సున్నా. టీడీపీ ప్రభుత్వం కూడా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ గా పొందడం వాస్తవం కాదా? అందులో రూ. 139 కోట్లు తిరిగి చెల్లించకుండా వెళ్లి పోయిన మాట వాస్తవం కాదా? అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 2020–21 సంవత్సరానికి గాను రూ 69,454 కోట్లు వేస్ అండ్ మీన్స్ను ఉపయోగించుకుంది. ఇదేదో ఇపుడే వైసీపీ ప్రభుత్వమే తొలిసారి చేస్తున్నట్లుగా వాస్తవాలను మరుగున పరచి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. ఉదాహరణకు కోవిడ్ పరిస్థితుల్లో పేద వాడిని కష్టాల నుండి కాపాడుకోవడం కోసం నియమిత గడువులోపల ఒక సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉండకపోవచ్చు. అప్పుడు ఆర్బీఐ వద్దకు వేస్ అండ్ మీన్స్కు వెళ్లడం పరిపాటి. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి అధికంగా వచ్చినప్పుడు అది మిగులు బ్యాలెన్స్‌గా కూడా మారొచ్చు. ఇది తెలిసి కూడా అదేదో పెద్ద విషయమైనట్లు టీడీపీ నేతలు చిత్రీకరించే ప్రయత్నం చూడడానికి విడ్డూరంగా ఉంది. స్థిరమైన అభివృద్ధి లక్షాలలో (SDG) 13వ స్థానంలో ఉందని, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందనే ప్రతిపక్షాల ప్రచారం కూడా నిజం కాదు. ఎక్కడ నుండి ఈ తప్పుడు సమాచారాన్ని కనిపెడతారో, కావాలనే ఈ కాకి లెక్కలు ఎలా సృష్టిస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాను. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం, ఈ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ 72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడేళ్లలో తన స్కోర్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సత్తా చాటుతోంది. 2018-19లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కోర్ 64 నుండి 2020-21నాటికి ఆ స్కోరు 72కి మెరుగుపడడం ఏపీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబమన్న అసలు నిజం ప్రజలకు తెలియాలి. పైగా ప్రతిసారి ఈ స్కోరులో భారతదేశ సగటు స్కోరు కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని నీతిఆయోగ్ గణాంకాలే తేల్చాయి. చంద్రబాబు నాయుడు గారు 2022-23 లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే చాల వెనుకపడి ఉందంటున్నారు. మరి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ. 2,09,848/- ఉంటే మరీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం రూ. 1,54,031/- ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నాయుడు పాతకకృత్యాలే. ఓటుకు నోటు కేసు , ఇబ్బడిముబ్బడిగా అప్పులు,వడ్డీలతో ఆర్ధిక విధ్వంసం. ఇవే ఏపీ వెనకబాటుతనానికి కారణం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి పోయి హైదరాబాద్ ని రాత్రి రాత్రికి తరలి వచ్చి విజయవాడలో చేరడం, టీడీపీ వాళ్ళు అవినీతి ఊబిలో కూరుకుపోయి చేసిన ఆర్థిక అనర్థాలేనని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బాగా తెలుసు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518/- (2022-23 AE). భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,72,000/- (2022-23 AE). అంటే 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో మెరుగ్గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రతి పైసా ప్రజలకు అవినీతి లేకుండా వారి ఖాతాలకు జమ అయింది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నవరత్నాలలో భాగముగా 26 సంక్షేమ పథకాలకు ఎస్సి, ఎస్టి, బీసి, పేద ,మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ 2,05,109 కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయం. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు, రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉన్న అనుకూల వర్గాల వారినే లబ్ధిదారులుగా ఎంచుకున్నారు. వారి లక్ష్యం స్వార్థపూరితం.. కావడం వల్ల అర్హత ఉన్నా కూడా ఫలాలు అందని పేద ప్రజలెందరో నాటి ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి కుల,మత, ప్రాంత,వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎవరి సిఫారసులు అక్కర లేదు.. కేవలం అర్హతే ప్రామాణికం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు, వడ్డీ, తలసరి ఆదాయం, ఎస్.డీ.జీ , డీ.బీ.టీ ఇలా అన్నింటిలో వాస్తవాలు వేరు. యనమలగారు , చంద్ర బాబు నాయుడు గారి దుష్ప్రచారంలో చెప్పే లెక్కలు వేరు. పత్రికా ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం ఓ అబద్ధం. అప్పులు, వడ్డీలు, తలసరి ఆదాయం, SDG, DBT లెక్కలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా లెక్కలన్నీ పూర్తిగా కల్పితం. ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికలు స్వార్థంతో చేసిన కపట నాటకాలనడానికి.. పైన పేర్కొన్న వాస్తవ గణాంకాలే ఉదాహరణ. అని మంత్రి బుగ్గన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే -
సామాజిక సేవలపై.. పెరిగిన మూలధన, రెవెన్యూ వ్యయం
సాక్షి, అమరావతి : 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవలపై మూల ధన వ్యయంతో పాటు రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. 2021–22కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. సామాజిక సేవలపై 2021–22లో 42.45 శాతం వ్యయం చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధానంగా విద్య, ఆరోగ్య.. కుటుంబ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పోషణ, క్రీడలు, కళలకు రూ.66,371 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. సామాజిక సేవలపై సాధారణ రాష్ట్రాల సగటు వ్యయం కన్నా ఏపీలో ఎక్కువగా ఉంది.ఇక సామాజిక సేవలపై రాష్ట్రాల సగటు వ్యయం 38.31 శాతం ఉండగా ఏపీలో 42.45 శాతం ఉంది. -
రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు
సాక్షి, అమరావతి : గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2021–22లో ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 18.47 శాతం మేర వృద్ధి సాధించినట్లు కాగ్ వెల్లడించింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా తెలిపింది. 2020–21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు తగ్గడానికి కోవిడ్ మహమ్మారివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే, దేశ జీడీపీతో పోలిస్తే ఆ ఏడాది రాష్ట్రంలో జీఎస్డీపీ 5 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది. అలాగే, ఆ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 1.36 శాతం క్షీణించిందని కాగ్ తెలిపింది. ఈ రంగాల్లో అత్యధిక వృద్ధి.. ఇక 2021–22 విషయానికొస్తే.. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగంలో అత్యధిక వృద్ధి నమోదైనట్లు కాగ్ పేర్కొంది. ♦ అంతకుముందు ఏడాదితో పోలిస్తే అత్యధికంగా పారిశ్రామిక రంగంలో 25.58 శాతం వృద్ధిని సాధించినట్లు కాగ్ తెలిపింది. అలాగే.. ♦ కోవిడ్ తర్వాత నిర్మాణ రంగం, తయారీ రంగం కోలుకున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగం 27%, తయారీ రంగం 25 శాతం పెరిగింది. ♦ వ్యవసాయ రంగంలో ప్రధానంగా చేపలు, ఆక్వాకల్చర్, పంటలు, పశు సంపద కార్యకలాపాలు పెరగడంతో వ్యవసాయ రంగం వృద్ధి సాధించింది. ♦ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ 26%, పంటలు, పశుసంపదలో 11 శాతం పెరుగుదల ఉంది. ♦ ప్రధానంగా వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 23 శాతం, రవాణా, నిల్వల, ప్రసార, సమాచార సేవలు 21 శాతం, స్థిరాస్తి రంగం 15 శాతం పెరగడంతో సేవలం రంగంలో భారీ వృద్ధి నమోదైంది. -
ద్రవ్యలోటు తగ్గింది
సాక్షి, అమరావతి: గత ఆర్థికసంవత్సరం (2021–22)లో.. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం 1.46 శాతం తగ్గిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31తో ముగిసిస సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. రాష్ట్ర బడ్జెట్ లోపల అప్పులు, బడ్జెట్ బయట అప్పుల వివరాలను కాగ్ నివేదికలో విశ్లేషించింది. 2021–22 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికన్నా ద్రవ్యలోటు గణనీయంగా తగ్గిందని, దీంతో తీసుకున్న రుణాలు కూడా తగ్గినట్లు పేర్కొంది. 2021–22 నాటికి రాష్ట్ర మొత్తం రుణబకాయిలు జీఎస్డీపీ లక్ష్యంలోపలే ఉన్నాయని తెలిపింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు 2021–22 నాటికి రాష్ట్ర రుణబకాయిలు జీఎస్డీపీలో 35.60 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువగా 31 శాతమే ఉన్నాయని పేర్కొంది. అప్పటికి రాష్ట్ర రుణాలు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయి. ఇక 2020–21లో జీఎస్డీపీలో రుణాలు 34.35 శాతం ఉండగా 2021–22లో రుణాలు జీఎస్డీపీలో 31 శాతానికి తగ్గినట్లు కాగ్ తెలిపింది. 2021–22లో బడ్టెట్ ప్రతిపాదించిన అంచనాలకన్నా వాస్తవ పరిస్థితులు వచ్చేనాటికి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గినట్లు కాగ్ పేర్కొంది. ద్రవ్యలోటు రూ.38,224 కోట్లు ఉంటుందని అంచనా వేయగా దానిని రూ.25,013 కోట్ల్లకే పరిమితం చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇలా ద్రవ్యలోటు 2.08 శాతానికే పరిమితమైంది. బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ.19,546 కోట్లు ఉంటుందని ప్రతిపాదించగా వాస్తవంగా రెవెన్యూ లోటు రూ 8,611 కోట్లకు పరిమితం చేశారు. ఇక 2021–22లో రెవెన్యూ రాబడులు 28.53 శాతం పెరిగాయని, దీని ఫలితంగా 2021–22లో రెవెన్యూ, ద్రవ్యలోటు గణనీయంగా మెరుగుపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని కాగ్ వివరించింది. మరోవైపు.. 2021–22 నాటికి బడ్జె్జటేతర రుణాలు రూ.1,18,393.81 కోట్లు ఉన్నాయి. ఈ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర మొత్తం రుణాలు జీఎస్డీపీలో 40.85 శాతంగా ఉంటుందని పేర్కొంది. అశాస్త్రీయ రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక లోటును ఎదుర్కొంటోందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు కాగ్ తెలిపింది. భౌగోళిక ప్రాతిపదికన ఏపీ తెలంగాణకు ఆస్తులను కోల్పోయిందని, కానీ.. జనాభా ప్రాతిపదికన చెల్లింపుల బాధ్యతను పొందిందని, బకాయిలు తీర్చడానికి ఏపీకి వనరులు కూడా లేవని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరి హోదా, 2014–15 రెవెన్యూ లోటుగ్రాంట్ వంటి విభజన హామీల అమలుకు కేంద్రంతో నిరంతరాయంగా ప్రయత్నిస్తోందని.. కోవిడ్ మహమ్మారి ఆర్థికపరమైన ఒత్తిడిని మరింత పెంచిందని తెలిపింది. ఈ కారణంగా రుణంగా తీసుకున్న నిధులలో కొంతభాగాన్ని లోటు ఫైనాన్సింగ్ కోసం, బాకీలను తీర్చేందుకు ఉపయోగించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కాగ్ వెల్లడించింది. -
సంక్షేమం వద్దని ప్రతిపక్షం చెప్పగలదా!?
సాక్షి, అమరావతి : పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరంలేదని ప్రజల ముందుకొచ్చి చెప్పగలరా అంటూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. శాసన మండలిలో 2023–24 బడ్జెట్ మీద జరిగిన చర్చకు ఆయన గురువారం సమాధానమిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం అన్నది మా ప్రభుత్వ విధానమని.. పేద ప్రజలకు అన్ని విధాలా సాయం అందించాలన్నదే తమ నినాదమనిస్పష్టంచేశారు. నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలకే ఈ ప్రభుత్వం ఖర్చుచేస్తోందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలవల్ల రాష్ట్రాభివృద్ధి వెనుకబడిందని నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఏదైనా సంక్షోభ సమయంలో వ్యవస్థలోకి నగదు పంపిణీ చేయడం ద్వారా ఆర్థి క వ్యవస్థను కాపాడటం అనేది ప్రపంచ దేశాలు చేస్తుంటాయని, వృద్ధిరేటు సాధించడంలో సంక్షేమం కూడా కీలకపాత్ర పోషిస్తుందని బుగ్గన తెలిపారు. 2019–20లో 5.7 శాతం వృద్ధితో రూ.9.25 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ.. 2022–23లో 16.22 శాతం వృద్ధితో రూ.13.17 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అవినీతికి అవకాశంలేకుండా పూర్తి పారదర్శక పాలనతో ఉత్పత్తిని పెంచుతూ వృద్ధిరేటును నమోదు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. నాడు–నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి, మిడ్ డే మీల్, స్కాలర్షిప్లు, విద్యాదీవెన, వసతి దీవెన వంటి వాటిని సంక్షేమ పథకాలుగా పరిగణించకూడదన్నారు. ఇక ఆరోగ్యరంగానికి పెద్దపీట వేస్తూ 13వేల గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్‌్టను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బుగ్గన తెలిపారు. టీడీపీ హయాంలో అప్పులు భారీగాచేసి అభివృద్ధి చేయలేదని.. కానీ, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ అప్పులు చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గణాంకాలతో ఆయన వివరించారు. అలాగే, గత ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను తమ ప్రభుత్వం సరిచేస్తోందన్నారు. -
‘స్కిల్’ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, ఆయన ఆదేశాల మేరకే డీపీఆర్, టెండర్లు లేకుండా నిధుల దోపిడీ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. గుజరాత్ మోడల్ అంటూ అబద్ధాలు వల్లించి కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులను శిక్షించి తీరుతామన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంశంపై బుగ్గన మాట్లాడారు. “ఏపీఎస్ఎస్డీసీకి ప్రైవేట్ వ్యక్తి గంటా సుబ్బారావు ఎండీగా నియమించడంతోపాటు సీమెన్స్ కంపెనీ పేరిట వాటా నిధులు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు విడుదల చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఇంత పెద్ద ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి తరువాత నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రతిపాదించినా పట్టించుకోలేదు. ఎంఓయూ, లైసెన్స్ ఒప్పంద పత్రంలో సీమెన్స్ కంపెనీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌బోస్‌గా పేర్కొన్నారు. సంతకాలు చేసేటప్పుడు మాత్రం ఎండీ పేరును సుమన్‌బోస్‌గా చూపారు. ఈ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్లతో మోసాలకు పాల్పడ్డారని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి కూడా నివేదించింది. ఈ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. జీఎస్టీ విభాగంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ కూడా కుంభకోణంపై దృష్టి సారించాయి’ అని బుగ్గన పేర్కొన్నారు. గత సర్కారు నైపుణ్యాభివృద్ధి ముసుగులో స్కామ్‌లకు పాల్పడగా తమ ప్రభుత్వం యువత భవిష్యత్ కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని బుగ్గన తెలిపారు. “రాష్ట్రవ్యాప్తంగా 192 స్కిల్ హబ్‌లను నెలకొల్పాం. ఉపాధి కల్పన కోసం పరిశ్రమలతో అనుసంధానం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, వైఫై, సీసీటీవీలు, బయోమెట్రిక్ హాజరు సదుపాయాలతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. ఇప్పటికే 21 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటు చేపట్టాం. సంవత్సరానికి 50 వేల మందికి పైగా యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అని బుగ్గన వెల్లడించారు. 90 శాతం గ్రాంట్ ఎందుకిస్తుంది?: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి చంద్రబాబు ఏ విధంగా రాష్ట్రాన్ని, ఖజానాను కొల్లగొట్టారో తెలుసుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ స్కాంను పరిశీలిస్తే చాలు. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే స్కిల్ డెవలప్మెంట్ ప్రతిపాదన తెచ్చారు. టేబుల్ అజెండాగా కేబినెట్లో ప్రవేశపెట్టి రూ.3,356 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. సిమెన్స్ కంపెనీ కాకుండా ఇతరులు డీపీఆర్ ఇచ్చారు. ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు? ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు పెడుతుందా? అసలు 90 శాతం గ్రాంట్‌ను ఓ ప్రైవేటు కంపెనీ ఎందుకిస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో రూ.వందల కోట్ల దుర్వినియోగంపై నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ నిలదీసినా ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయలేదు. రెండు టోకెన్లు హైదరాబాద్ వెళ్లాయనే కోడ్ భాషను చేధించాలని కోరుతున్నా. ముందే హెచ్చరించినా బేఖాతర్: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్‌లే. యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామంటూ ప్రజాధనం దోచేశారు. నిరుద్యోగ భృతి రూ.వెయ్యి ఇస్తామని యువతను మోసగించారు. గంటా సుబ్బారావుకు నాలుగు పోస్టులిచ్చారు. బాత్రూమ్ సైజు కార్యాలయంలో 34 షెల్ కంపెనీల ద్వారా రూ.371.25 కోట్లు కాజేశారు. డబ్బులు ఎలా విడుదల చేయాలి? ఎలా ఖర్చు చేయాలనే వివరాలు ఎంవోయూలో లేవు. ఆర్ధిక శాఖ కొర్రీలను కూడా పట్టించుకోలేదు. ఏసీబీ, సీమెన్స్ అంతర్గత సర్వే, జీఎస్టీ అధికారులు నాలుగుసార్లు హెచ్చరించినా చంద్రబాబు లెక్క చేయలేదు. దేశంలో చంద్రబాబు తెచ్చుకున్నన్ని స్టేలు ఇంకెవరూ పొందలేదు. చిత్తశుద్ధి ఉంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో నిందితులు స్టే తెచ్చుకోకుండా విచారణకు సిద్ధపడాలి. -
టీడీపీ స్కిల్ స్కాంపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ స్కామ్‌పై చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ప్రతిపాదన తెచ్చారు. ప్రతిపాదన రాగానే కేబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. రూ. 3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ స్కాంలో నిందితులు ఎవరో తేల్చి త్వరగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జీవో, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లు ఇచ్చే ముందు సరైన వివరాలు పేర్కొనలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయంలో కేవలం స్కిల్ స్కాం ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ జరిగింది. ఫేక్ ఇన్వాయిస్లతో నగదు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు అని ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే.. జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు. ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల. డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం. వాటిని కొట్టేసి తానే స్వయంగా నిధులు విడుదల చేయించిన చంద్రబాబు. తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు. ఒక్క పైసా కూడా తమకు ముట్టలేదన్న సీమెన్స్ గ్లోబల్ టీం. మరిన్ని ఆధారాలను ఇచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. కొంత డబ్బు హైదరాబాద్, పుణే వెళ్లిందని ఆధారాలిచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే వెలుగు చూశాయి. అయినా వాటన్నింటినీ దాచేసిన చంద్రబాబు సర్కారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని ఏసీబీని తొక్కిపెట్టిన చంద్రబాబు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, సీఐడీ. కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ. రాష్ట్రంలో మొదలై.. విదేశాలకు పాకిన కుంభకోణం. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు. గంటా సుబ్బారావు అనే అనధికార ప్రైవేట్ వ్యక్తిని ఏపీఎస్ఎస్డీసీకి సీఈవోగా నియమించారు. సీఎఫ్ఎంఎస్ కార్పొరేషన్‌కి, సీఈవోగా కూడా ప్రైవేట్ వ్యక్తినే పెట్టుకున్నారు. రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు. రూ.370 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్‌కు ఎంవోయూ చేసుకున్నారు. డిజ్ టెక్ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్టులో ఏ భాగస్వామ్యం లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఏమీ చేయకుండా డిజ్ టెక్ కంపెనీకి రూ.370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎంవోయూపై గంటా సుబ్బారావు, సుమన్ బోస్, సంతోష్ సారాల సంతకాలున్నాయి. జీవోకి, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లను ఇచ్చే ముందు సరైన వివరాలు నమోదు చేయలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారానే రూ.371 కోట్లు కాజేశారు. ఫేక్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారు. రూ.3,300 కోట్ల పెట్టుబడి అని మోసం చేశారు. సీమెన్స్ 90శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారు. 10శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి రూ.371 కోట్లు విడుదల. గంటా సుబ్బారావు, సుమన్ బోస్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. సుమన్ బోస్కి, సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సీమెన్స్ పేరుతో రూ.371 కోట్లు దోచుకున్నారు. నిధులు విడుదలకు అభ్యంతరం తెలిపిన ఆర్థికశాఖ అధికారులు. చంద్రబాబు చెప్పినందువల్లే అధికారులు డబ్బు రిలీజ్ చేశారు. -
ఉద్యోగులకు బకాయిలు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల రెగ్యులర్ జీతభత్యాలు, బకాయిలు, ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్, ఆరోగ్య బీమా, ఏపీజీఎల్ఐ రుణాలు, కంప్యూటర్, హౌస్ బిల్డింగ్, కారు, బైక్, విద్య, పండుగ అడ్వాన్సులు, ప్రయాణ భత్యం, తదితరాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రకటించారు. తాను ఈ ప్రకటన చేస్తున్న సమయానికి పింఛనుదారులకు సైతం పెన్షన్ బకాయిలు, ఏపీజీఎల్ఐ తుది చెల్లింపులు, జీఐఎస్, వైద్య ఖర్చుల చెల్లింపులు, ఆర్జిత సెలవులు నగదుగా మార్చుకోవడం, పారితో ష కాలు, పింఛన్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి బకాయిలు పెండింగ్‌లో లేవని వెల్లడించారు. అయితే ఉద్యోగులకు సాధారణ భవిష్య నిధి, డీఏ, సరెండర్ లీవు బకాయిలు కొంత మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే పింఛనుదారుల కరువు భత్యం బకాయిలు కొంత మేర చెల్లించాల్సి ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం సొంత ఆదాయం రూ.98,900 కోట్లు ఉందన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛనుదారుల చెల్లింపులకే దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చవుతోందని వివరించారు. రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని.. ఇందులోనే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కూడా కలిసి ఉందన్నారు. 33.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మార్చి 15 నాటికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 33,68,398.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు గాను 6,03,490 మంది రైతులకు రూ.6,834.87 కోట్లు చెల్లించామని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు వేగవంతం గుంటూరు జిల్లా అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులు నిధులు లేక జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం విజయవాడ స్వరాజ్ మైదానంలో రూ.268.46 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనికి సంబంధించి కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయని చెప్పారు. కాగా, ఎస్సీ సబ్ ప్లాన్ కింద 2022–23లో రూ.18,518.29 కేటాయించగా, ఫిబ్రవరి నాటికి రూ.13,112.36 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వంలో యాడ్స్ ఖర్చు రూ.449 కోట్లు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పత్రికల్లో ప్రకటనల కోసం రూ.449 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.128.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కొన్ని ఏజెన్సీల ద్వారా ప్రకటనలు ఇచ్చేవారని.. 15 శాతం కమీషన్లు ఇస్తేనే ఏజెన్సీలు పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవన్నారు. తమ ప్రభుత్వం ఆ వృథాను అరికట్టి నేరుగా మంత్రిత్వ శాఖ ద్వారానే ప్రకటనలు ఇస్తోందని తెలిపారు. 31,594 ఎకరాల వక్ఫ్ భూముల ఆక్రమణ రాష్ట్రంలో 65,783.83 ఎకరాల మేర వక్ఫ్ భూములు ఉన్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. అందులో 31,594.20 ఎకరాలు గతంలో వివిధ ప్రభుత్వాల సమయంలో ఆక్రమణల పాలయ్యాయనని చెప్పారు. ఇలా కబ్జాలో ఉన్న వక్ఫ్ భూముల స్వా«దీనానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 580.32 ఎకరాలను ఇప్పటివరకు స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.3,824.75 కోట్లు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.3,824.75 కోట్లు వ్యయం చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. రెండో దశ కింద రూ.1,816.50 కోట్లు కేటాయించామన్నారు. కాగా, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో జరిగిన కుంభకోణంపై 2021లో సీఐడీ కేసు నమోదు చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ కూడా చేసిందని సభ్యుల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడును స్వాగతించిన మండలి రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడాన్ని శాసనమండలి స్వాగతించింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జరిగిన చర్చ సందర్భంగా పీడీఎఫ్ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2023–24లో విద్యకు రూ.30 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 60.6శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారన్నారు. నాడు–నేడు కింద 56,572 పాఠశాలలను సుమారు రూ.16వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 25,552 అదనపు గదులను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగటున ఏటా 72 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. 2018–19లో ప్రభుత్వ పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. అది నాడు–నేడు తర్వాత 43 లక్షలు దాటిందని గుర్తు చేశారు. -
AP Assembly: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్
సాక్షి, అమరావతి: సభలో టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరంగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి బాధ్యతారాహిత్యం, తనది బాధ్యత అని పేర్కొన్నారు. సభా నాయకుడు తనకు గొప్ప బాధ్యత అప్పగించారని, ఆ బాధ్యతల మేరకే సహనంగా ఉంటున్నట్లు చెప్పారు. చరిత్రలో కళంకితుడిగా ఉండాలనుకోవట్లేదని తెలిపారు. కాగా, సభా కార్యకలాపాలను టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుకోవడంతో అసెంబ్లీలో గందగోళం నెలకొంది. దీంతో టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. పోలవరంపై టీడీపీని ఏకిపారేసిన బుగ్గన.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ప్రయోజనాలపై చర్చించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తెలిపారు. విభజన వల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులపై ప్రధాని మోదీతో సీఎం చర్చించారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా? గతంలో టీడీపీ పెట్టిన బకాయిలపై చర్చిద్దామా? అని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో చంద్రబాబు 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా? అని అడిగారు. సభను పక్కదారి పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: నాగ్‌పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
నాలుగేళ్లుగా.. నిలకడగా!
సాక్షి, అమరావతి: గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ ఆర్భాటాలకు తావు లేకుండా అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి నమోదుతో ముందుకు సాగుతున్నట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సుస్థిరాభివృద్ధి కోసం వ్యవసాయం, విద్య, వైద్యం, సామాజిక భద్రత రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకాలతో కొండలా పేరుకుపోయిన బిల్లులను చెల్లిస్తూనే కోవిడ్ సంక్షోభంలో కూడా ఆర్థిక వ్యవస్థను వేగంగా గాడిలో పెట్టామన్నారు. శుక్రవారం శాసనసభలో 2023 – 24 వార్షిక బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానమిస్తూ మాట్లాడారు. ♦ 2019 – 20లో 5.7 శాతం వృద్ధితో రూ.9.25 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ 2022 – 23లో 16.22 శాతం వృద్ధితో రూ.13.17 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ లాంటి సంక్షోభం ఎదురైనా ప్రభుత్వం తీసుకున్న సమర్థ నిర్ణయాలతో వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం వేగంగా కోలుకున్నాయి. ♦ ఆర్థికంగా బలమైన దేశాలు కూడా సంక్షోభ సమయంలో వ్యవస్థలోకి నగదును పంపిణీ చేస్తాయి. అదే తరహాలో 2022 – 23లో అదనంగా రూ.1.83 లక్షల కోట్ల సంపదను సృష్టించగలిగాం. అప్పుల కోసం కాకుండా గత సర్కారు తప్పులను సరిదిద్దడానికే 30 దఫాలకుపైగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ♦ రాష్ట్ర జీవనాడి పోలవరం ఆలస్యం కావడానికి ముమ్మాటికీ టీడీపీనే కారణం. పోలవరం పునరావాస సాయంపై సరైన స్పష్టత లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. అలాంటి తప్పులను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది. ♦ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతులకు అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలవడంతో రాష్ట్రంలో సాగు వ్యయం 21 శాతం తగ్గడమే కాకుండా రాబడి 23 శాతం పెరిగింది. విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక మార్పులు రానున్న కాలంలో మంచి ఫలితాలను అందిస్తాయి. ♦ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పులు తక్కువగానే చేసినా విపక్షం, వాటి అనుబంధ మీడియా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి. రాష్ట్ర విభజన నాటికి రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 19 శాతం వృద్ధితో రూ.2.72 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇప్పుడు నాలుగేళ్ల కాలంలో అప్పులు రూ.2.72 లక్షల కోట్ల నుంచి 13.5 శాతం వృద్ధితో రూ.4.5 లక్షల కోట్లకు చేరాయి. టీడీపీ సర్కారు కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో అప్పులు చేసింది. ♦ ఉచిత సేవలకు కాలం చెల్లిందని, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని తాను స్వయంగా రాసుకున్న మనసులో మాట పుస్తకంలో పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరం. 60 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిపరులని, కాంట్రాక్టు విధానంలోనే ఉద్యోగాలివ్వాలని, ప్రాజెక్టులు అనవసరమని, పేదలకు ఇళ్లు ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, స్థానిక సంస్థలకు నిధులివ్వాల్సిన అవసరం లేదని పుస్తకంలో రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. -
AP: 2021-22లో భారీగా తగ్గిన అప్పులు.. కాగ్ నివేదిక చెప్పింది ఇదే..
సాక్షి, అమరావతి: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఏడాది ద్రవ్య లోటు అదుపులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన అకౌంట్స్ ప్రకారం.. 2021–22 ఆర్థిక ఏడాదిలో ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్ సమర్పణ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 2.08 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. అంతేకాక.. ఇది ఎఫ్ఆర్బీఎం నిబంధనల కన్నా తక్కువన్నారు. వాస్తవానికి.. ఆ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.37,029 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే, 2021–22 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.8,610 కోట్లుగా కాగ్ ఖరారు చేసిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.72 శాతంగా ఉందని మంత్రి వివరించారు. మరోవైపు.. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు 2023–24 ఆర్థిక ఏడాది బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,83,008.96 కోట్లకు చేరుతాయని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.32 శాతంగా ఉంటుందని బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,26,233.92 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. చదవండి: అక్కచెల్లెమ్మలకు అగ్రపీఠం -
సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానం
సాక్షి, అమరావతి: సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానమని, ఇందుకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. జీవనోపాధి, సాధికారత, సామాజిక భద్రత, పారిశ్రామికాభివృద్ధే ప్రధానం అని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 2023–24 సంవత్సరానికి రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను గురువారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనంగా మేనిఫెస్టోను రూపొందించామని, అధికారం చేపట్టిన తొలి సంవత్సరమే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేశామని తెలిపారు. కోవిడ్ వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ నాలుగేళ్లల్లో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. ఈ నాలుగేళ్లలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, 2.65 లక్షల మంది వలంటీర్ల నియామకం, 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో పాటు 15,715 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచామని చెప్పారు. 3,707 వైఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 461 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. దాదాపు 21 పథకాల ద్వారా లబ్ధిదారులకు నాలుగేళ్లల్లో డీబీటీ ద్వారా రూ.1.97 లక్షల కోట్లు జమ చేశామన్నారు. 2023–24లో డీబీటీ విధానంలో రూ.54,228 కోట్లు పంపిణీ చేసే విధంగా కేటాయింపులు చేశామని చెప్పారు. 2018–2019 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం మన జీఎస్డీపీ వృద్ధి రేటులో మన రాష్ట్రం దేశంలోనే 22వ స్థానంలో ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి విధానాల కారణంగా 2021–2022 లో 11.43 శాతం వృద్ధితో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. వచ్చే ఏడాది జీఎస్డీపీ 10% వృద్ధితో రూ.14,49,501 కోట్లకు చేరుతుందని అంచనాగా ఉందన్నారు. రైతులకు చేదోడుగా ఉంటూ గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు రూ.27,063 కోట్లు రైతుల ఖాతాల్లో వేయడమే కాకుండా వచ్చే ఏడాది కోసం రూ.4,020 కోట్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఇప్పటి వరకు రూ.6,872 కోట్లు ఇవ్వగా, వచ్చే ఏడాది కోసం రూ.1,600 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంత్రి బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే.. పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్ద పీట ► రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేస్తోంది. విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన అద్భుతమైన స్పందనే ఇందుకు నిదర్శనం. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ప్లై్లబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ► ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులతో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం కలిగింది. 378 అవగాహన ఒప్పందాలు కుదరడం ఎంతో గర్వించదగ్గ విషయం. ► విశాఖ–చెన్నై కారిడార్‌లో పారిశ్రామిక క్లస్టర్స్‌తో పాటు ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించేలా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నాం. ► 2023–24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు, వాణిజ్యం కోసం రూ.2,602 కోట్లు కేటాయిస్తున్నాం. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు ► రాష్ట్రంలో దాదాపు 32,725 కిలోమీటర్ల మేర ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కిలోమీటర్ల పొడవున ఉన్న బి.టి.రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాం. ► రూ.400 కోట్లతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ.రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేశాం. రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ.పొడవుగల రోడ్లకు సంబంధించి రూ.391 కోట్లతో 46 పనులు మంజూరయ్యాయి. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023–24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు కేటాయిస్తున్నాం. పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. దీనికి అనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో 2023–24 బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం ప్రవేశ పెడుతున్నాం. ఏటా 50,000 మందికి నైపుణ్య శిక్షణ ► స్థానిక యువతకు ఉపాధి లభించేలా నైపుణ్య శిక్షణకు పెద్ద పీట వేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కనీసం ఒక స్కిల్ హబ్ చొప్పున మొత్తం 192 నైపుణ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజీ, రాష్ట్ర స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 50,000 మందికి శిక్షణ ఇప్పించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం 154 కార్పొరేట్స్‌తో 18 రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం. ► వచ్చే ఏడాది నైపుణ్య శిక్షణ కోసం రూ.1,166 కోట్లు కేటాయిస్తున్నాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. రూ.22,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం 2023–24 సంవత్సరానికి రూ.5,600 కోట్లు కేటాయిస్తున్నాం. -
ఐదవసారీ అభివృద్ధి దారే
మరోసారి సంక్షేమ,అభివృద్ధి బడ్జెట్ మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ–అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్ ద్వారా మరో అడుగు ముందుకేశాం. – సీఎం వైఎస్ జగన్ కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తున్నా దాన్ని కనీసం ఆలోచనల్లోనైనా అందుకోలేనంత దూరంలో ఎక్కువ మంది ఉండిపోతే.. ఆ అభివృద్ధికి అర్థం ఉందా? అందుకే... నాలుగేళ్ల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ సామాన్యులతోనే ప్రయాణిస్తున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్ని సవాళ్లెదురైనా మనసా వాచా మ్యానిఫెస్టోనే అనుసరిస్తున్నారు. చదువు రూపంలో ఆస్తిని అందించటం... ఆరోగ్య పరిరక్షణతో అప్పులపాలు కాకుండా చూడటం... రైతన్నలను, మహిళల్ని, అవ్వాతాతలను ఆదుకుని ఆర్థిక, సామాజిక చక్రాన్ని ముందుకు నడిపించటమే తొలి ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. సామాజికంగా... ఆర్థికంగా వెనకబడిన వారిని ముందుకు తెస్తేనే అభివృద్ధికి అర్థం ఉంటుందన్నది ఆయన ఎకనమిక్స్.ఈ 5వ బడ్జెట్లో కూడా స్పష్టంగా కనిపించింది అదే!!. సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా అన్ని వర్గాల అభ్యున్నతికి అండగా నిలిచే అభివృద్ధి, సంక్షేమ సమతుల్యతతో కూడిన బడ్జెట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. జెండర్ బేస్డ్ బడ్జెట్ ద్వారా సమాజంలో సగం ఉన్న మహిళలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. పిల్లలకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేయడం విశేషం. అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనగా వరుసగా ఐదోసారి రూ.2,79,279.27 కోట్లతో 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540.71 కోట్లుగా, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు బుగ్గన పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.23,316.70 కోట్లు రెవెన్యూ లోటు, రూ.54,587.52 కోట్లు ద్రవ్య లోటు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్యలోటు 1.54 శాతం ఉంటుందని, రెవెన్యూ ఆదాయం రూ.2,06,224.01 కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇందులో కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.41,338.02 కోట్లు వస్తాయని, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.46,834.64 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు తెలిపారు. రెవెన్యూ లోటుతో పాటు ద్రవ్య లోటును అదుపులో పెట్టే చర్యలు తీసుకున్నట్లు బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకు ముందు సీఎం అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమై 2023–24 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. నవరత్నాలకు పెద్దపీట ఎప్పటిలాగే మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాల కొనసాగింపునకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలతో పాటు మైనార్టీ యాక్షన్ ప్రణాళిక పేరుతో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తం మీద రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. మరో పక్క వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సాగునీటి రంగాల్లో మౌలిక రంగాలకు పెద్ద పీట వేశారు. బడ్జెట్లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకత ప్రదర్శించారు. ఏయే రంగాల్లో ఏయే పథకాలకు ఎన్ని నిధులు కేటాయించింది స్పష్టంగా వివరించారు. అవ్వా తాతల సామాజిక పెన్షన్లను వచ్చే ఏడాది జనవరిలో నెలకు 3 వేల రూపాయలు చేస్తామని ప్రకటించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ పెన్షన్ కానుకకు ఏకంగా రూ.21,434 కోట్లు కేటాయించారు. నవరత్న పథకాల్లోని అన్ని వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తామని స్పష్టం చేసింది. సచివాలయాలకు కేటాయింపులు చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, కాపులు, లాయర్లకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లు.. గ్రామ, పట్టణ సచివాలయాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. నేరుగా నగదు బదిలీ చేసే 22 నవరత్నాల పథకాలకు బడ్జెట్లో రూ.54,228 కోట్లు కేటాయించారు. మహిళల పథకాలకు ప్రత్యేకంగా రూ.77,914.43 కోట్లు, పిల్లల పథకాలకు ప్రత్యేకంగా రూ.20,593.38 కోట్లు కేటాయించారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.38,605 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.20,005 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.6,929 కోట్లు, మైనార్టీ కాంపొనెంట్‌కు రూ.4,203 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి రూ.51,345 కోట్లు, సాధారణ విద్యా రంగానికి రూ.32,198 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.15,882 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.14,043 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.17,531 కోట్లు కేటాయించారు. రైతుల సంక్షేమంపై శ్రద్ధ రైతుల సంక్షేమంపై శ్రద్ధ చూపుతూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. రైతులకు సంబంధించిన అన్ని పథకాలకు కేటాయింపులు కొనసాగించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా జల వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమానికి రూ.3500 కోట్లు.. వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమానికి రూ.2214.21 కోట్లు కేటాయించారు. పేదల గృహ నిర్మాణాలకు రూ.6291.70 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.4,887 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తంకు రూ.610 కోట్లు కేటాయించారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.6,546 కోట్లు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి రూ.2,400 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వానికి రూ.532 కోట్లు కేటాయించారు. 2022–23 సవరించిన అంచనాలు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,40,509.34 కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ.2,05,555.95 కోట్లు కాగా, మూల ధన వ్యయం రూ.16,846.69 కోట్లు అని తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు రూ.29,107 కోట్లు కాగా, ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.47,716 కోట్లు అని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 2.21 శాతం కాగా, ద్రవ్య లోటు 3.62 శాతంగా ఉందని పేర్కొన్నారు. -
Ap Budget 2023-24: పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్,న ఆర్వే, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. చదవండి: AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్ఎస్ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైఎస్సార్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది. -
సభలో సరదాగా..
-
CM Jagan Photos: జన రంజక ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 (ఫొటోలు)
-
ఐదోసారీ జనరంజకమే
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జెండర్ బేస్డ్ బడ్జెట్ సిద్ధం చేసింది. రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్ రూపొందించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.41,388 కోట్లు రానున్నాయి. మొత్తం మీద 2023 – 24 వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా. నేటి ఉదయం మంత్రిమండలి ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు. నవరత్నభరితంగా బడ్జెట్.. నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు. -
అసెంబ్లీ సాక్షిగా బుక్కైన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా.. ఇప్పుడేమంటారో?
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ బండారం బయటపడింది. ఎల్లో మీడియా ఫేక్ ప్రచారానికి అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన చెక్ పెట్టారు. దీంతో ఎల్లో బ్యాచ్.. ఒక్కసారి షాకై నోరు మూసుకున్నారు. చెరపకురా చెడేవు.. అన్న సామెత పచ్చ బ్యాచ్ పక్కాగా సూట్ అవుతుంది. లేనది ఉన్నట్టు చూపించి నమ్మించాలనే వారి ఐడియాలు ఎప్పుడూ తుస్సుమంటూనే ఉన్నాయి. దీంతో, ఖంగుతినడం పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ ఫేక్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. అయితే, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలకలేదని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. దీనికి టీడీపీ సభ్యులు వంత పాడారు. దీంతో, ఎల్లో మీడియా ఫేక్ ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో టీడీపీ తప్పుడు ప్రచారాలకు వీడియోలతో సహా చెక్ పెట్టారు. అసలు వాస్తవాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బయటపెట్టారు. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోరారు. కాగా, గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న వీడియోను మంత్రి బుగ్గన.. అసెంబ్లీలో ప్లే చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని వీడియోతో సహా చూపించారు. టీడీపీవీ అన్ని తప్పుడు ఆరోపణలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదన్నారు. గవర్నర్‌కు ఏవిధంగా సీఎం జగన్ స్వాగతం పలికారో వీడియోలో చూపించారు. దీంతో, టీడీపీ నేతల బండారం బయటపడింది. అనంతరం, స్పీకర్ తమ్మినేని కూడా ప్రోటోకాల్ ప్రకారమే.. గవర్నర్ నజీర్‌ను సీఎం జగన్ స్వాగతం పలికారని చెప్పారు. దీనికి ఆయనే ప్రత్యక్ష సాక్షినని స్పష్టం చేశారు. మరోవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై బురద చల్లేలా టీడీపీ సభ్యులు, ఈనాడు వ్యవహరిస్తున్నాయని ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రికి స్పీకర్ సూచించారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పుడు ప్రచారాలపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. -
అసెంబ్లీ సాక్షిగా వీడియోలతో వాస్తవాలను బయటపెట్టిన మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పయ్యావుల బండారాన్ని మంత్రి బుగ్గన బయటపెట్టారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు. టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని మంత్రి బుగ్గన వివరించారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ‘‘అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లో మీడియా కూడా బాధ్యతరహితంగా వార్తలు రాసింది. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీకర్‌ను కోరారు. చదవండి: జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్నాథ్ -
ఇండియా ఇండస్ట్రియల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతుంది..!
-
‘నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇక, ఈ సందర్బంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది. -
చంద్రబాబుపై బుగ్గన సీరియస్ కామెంట్స్
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడమే చంద్రబాబు పని అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మంత్రి బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా దాడులు లేవు, అక్రమ కేసులు నమోదు కాలేదు. 2019 నుంచి రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గింది. తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పని. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాము. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుంది అని కామెంట్స్ చేశారు. -
ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుదీర్ఘ తీరప్రాంతం, పుష్కలమైన వనరులు, సుశిక్షితులైన మానవ వనరుల లభ్యత, వ్యాపారాలకు ప్రభుత్వ తోడ్పాటు తదితర సానుకూల అంశాలతో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యామ్నాయం మరేదీ లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సత్వరం అనుమతులు మంజూరు చేస్తూ వ్యాపారాలు, పరిశ్రమలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని చెప్పారు. విశాఖ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్) 2023కు సంబంధించి హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో వారు మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. సుస్థిర అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలకు అవసరదమైన సకల మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి బుగ్గన వివరించారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు నైపుణ్యాల్లో శిక్షణకు కూడా పెద్ద పీట వేస్తోందన్నారు. ఐటీ, బల్క్ డ్రగ్ పార్క్, పీసీపీఐఆర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెరైన్, వ్యవసాయం, పునరుత్పాదకశక్తి వంటి రంగాలలో పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్నారు. అనుమతుల సమయాన్ని కుదించాం రాష్ట్రంలో పరిశ్రమల కోసం 48వేల ఎకరాలకు పైగా స్థలం సిద్ధంగా ఉందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు స్థలం కాకుండా సగటున 12 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయని తెలిపారు. కొత్తగా తేబోయే పాలసీలో 21 రోజుల్లో స్థలాన్ని కూడా కేటాయించాలని భావిస్తున్నట్లు వివరించారు. 974 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతం, 534 ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, 6 సెజ్‌లు, 3 ఐటీ సెజ్‌లు, 3 పారిశ్రామిక కారిడార్లు, రెండంకెల వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు పూర్తి అనుకూలమని పేర్కొన్నారు. వైజాగ్ ఐటీ గమ్యస్థానంగా మారుతోందని తెలిపారు. పరిశ్రమలకు నీటి సరఫరాకు గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వేలకొద్దీ చిన్న, మధ్య తరహా సంస్థలు ఏర్పాటవుతున్నాయని ఏపీటీపీసీ చైర్మన్ కె.రవిచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బాక్సైట్, మాంగనీస్ తదితర 48 రకాల ఖనిజాల లభ్యత పుష్కలంగా ఉందన్నారు. ఏపీలో అవకాశాలను తెలియజేసేందుకు, పారిశ్రామిక భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు జీఐఎస్ తోడ్పడుతుందని తెలంగాణ సీఐఐ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తల హర్షం ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పారిశ్రామికవర్గాలు ప్రభుత్వ సహకారంపై సంతృప్తి వ్యక్తం చేశాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తోందని డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఎండీ డీవీఎస్ నారాయణ రాజు తెలిపారు. ఏపీలోని తమ ప్లాంటులో నీరు, విద్యుత్ కొరత లేదని చెప్పారు. విద్యుత్, ఇంధనం కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చౌకగా లభిస్తున్నాయన్నారు. స్విచ్‌గేర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ డైరెక్టర్ ఒ.జగన్నాథ్ మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికే చిత్తూరు ఇండస్ట్రియల్ పార్క్‌లో కార్యకలాపాలు సాగిస్తోందని, మరో రూ.150 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పలు సబ్సిడీలు అందిస్తోందని, పరిశ్రమల నిర్వహణ సులభతరం చేసిందని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, నైపుణ్యాల శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీ మారిటైం బోర్డు సీఈవో షన్ మోహన్, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
పెనాల్టీల తగ్గింపును స్వాగతించిన బుగ్గన
సాక్షి, అమరావతి: చిన్న వ్యాపార సంస్థలకు విధించే పెనాల్టీలను తగ్గించడం, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటులో రాష్ట్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీ విజ్ఞానభవన్‌లో జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధికారులతో కలిసి బుగ్గన పాల్గొన్నారు. రాష్ట్రం సూచించిన విధంగానే రూ.20 కోట్ల వ్యాపార పరిమాణం ఉన్న సంస్థలు రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినప్పుడు విధించే పెనాల్టీల సవరణకు కౌన్సిల్ అంగీకరించినట్లు తెలిపారు. అప్పిలెట్ ట్రిబ్యునల్స్‌లో తీసుకోవాల్సిన సవరణల కోసం మంత్రుల కమిటీ సూచనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని, ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చోటు కల్పించడంతో పాటు, త్వరగా ఏర్పాటు చేయాలన్న సూచనలకు కౌన్సిల్ అంగీకరించిందని వెల్లడించారు. జూన్, 2022 వరకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ.16,982 కోట్ల పరిహార బకాయిల చెల్లింపునకు కౌన్సిల్ అంగీకరించిందని, ఇందులో రాష్ట్రానికి సుమారు రూ.689 కోట్లు రావాల్సి ఉందన్నారు.సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి(వాణిజ్య పన్నులు) ఎన్.గుల్జార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.