![Buggana Rajendranath Serious Comments On TDP Leaders](/styles/webp/s3/article_images/2024/07/13/Buggana-Rajendranath2.jpg.webp?itok=Mlj0Jc8S)
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. పచ్చ నేతల దాడులను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ క్రమంలో కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మాజీ మంత్రి బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్యాపిలి మండలం పోదొడ్డిలో నడుస్తున్న కంకర క్వారీ నాది కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్వీపై స్థానిక టీడీపీ గూండాలు దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న వేట కొడవళ్లలో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారు. ఈ ఘటనలతో ఆ గ్రామంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది.
గ్రామంలో ఉన్న మరో వర్గం ఈ అరాచకాలను ప్రశ్నించింది. అంతేకాకుండా నాపై తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ క్వారీ సక్రమమా? లేక అక్రమమా? అనేది తేల్చాసింది ప్రభుత్వం.. అంతేకానీ స్థానికంగా ఉండే టీడీపీ నేతలు కాదు. వారి పార్టీకి చెందిన గూండాలు కూడా కాదు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment