సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు (మెట్రో): పన్నుల విధింపులో అధికారుల తప్పిదాలు, ప్రభావం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చేసిన టూల్స్ దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. స్థానిక ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ ద్వారా వ్యాపారులకు అనువైన సంస్కరణలు, వెసులుబాట్లు తెచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన గుర్తు చేశారు.
రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడారు. పన్నులకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల పరిష్కారంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. డిపార్ట్‌మెంట్‌కు, డీలర్‌కు మధ్య మంచి సంబంధాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణం
రాష్ట్రంలో వివిధ శాఖల భవనాలను నిర్మించేందుకు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ ప్రమాణాలను పాటిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఏలూరులో రూ.10 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత ఆర్మింక భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో నూతన భవనాల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment