సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు బురద చల్లుతున్నారంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ అప్పులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ అప్పులు చేసింది. గతంలో వీరెవ్వరూ ఎందుకు మాట్లాడలేదు?’’ అని బుగ్గన ప్రశ్నించారు.
‘‘ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించకూడదనేదే వీరి కుట్ర. ఏపీకి మంచి జరగకూడదన్నదే వీరి ఆలోచన. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఏపీ అప్పులపై మాట్లాడేవారు ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ఉండటం లేదు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఆర్థికశాఖ చెప్పిన సమాధానాన్ని కూడా వీరు నమ్మరు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులపై వాస్తవాలు బయటపడ్డాయి. ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వీరందరూ బాధపడిపోతున్నారు’’ అని మంత్రి ధ్వజమెత్తారు.
చదవండి: కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..!
‘‘వెయ్యి కోట్ల అప్పు అంటూ ఐదు సార్లు రాస్తే 5 వేల కోట్లు అవుతుందా?. ఏపీ అప్పులపై కేంద్రం ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎందుకు ప్రచురించరు?. రాష్ట్ర అప్పులపై కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులపై ఎప్పుడైనా మాట్లాడారా?. నేను సింహాన్ని అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఎందుకు మీరు జంతువులతో పోల్చుకుంటున్నారు?’’ అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment