ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. మంగళవారం మంత్రివర్గం నిర్వహణకు సీఈసీ షరతులతో కూడిన అనుమతిచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. కాగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో మంత్రి వర్గ ఎజెండాకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను పరిశీలించిన సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది