ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే ఈసీకి వ్యతిరేకంగా జీవో ఇచ్చి చంద్రబాబు సాధించిందేమిటని ఆమె ప్రశ్నించారు. ‘ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్, ఇద్దరు ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది.