vasireddy padma
-
వాసిరెడ్డి పద్మక్తి వరుదు కళ్యాణి అదిరిపోయే స్ట్రాంగ్ కౌంటర్..
-
స్వలాభం కోసమే జగన్‌పై వాసిరెడ్డి పద్మ విమర్శలు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: స్వలాభం కోసమే వైఎస్ జగన్‌పై వాసిరెడ్డి పద్మ విమర్శలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. జగనన్న కార్యకర్తలను సరిగా చూసుకోకపోతే మహిళా చైర్మన్ పదవి ఆమెకు ఎలా వచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అగ్రస్థానం కల్పించారన్నారు. వ్యక్తిగత స్వార్థంతో వాసిరెడ్డి పద్మ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.‘‘పదవులు అనుభవించి వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఇలా మాట్లాడటం పద్దతి కాదు. పదవిలో ఉన్నప్పుడే ఆమె రాజీనామా చేయవలసింది. వాసిరెడ్డి పద్మకి క్యాబినెట్ హోదాతో కూడిన మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. దాడుల్లో చనిపోయిన వారికి పది లక్షలు అందజేస్తున్నాం. పదవులు పూర్తిగా అనుభవించి నైతిక విలువలు గురించి వాసిరెడ్డి పద్మ మాట్లాడటం సరికాదు. రాజకీయం కోసం ఆత్మవంచన చేసుకోకూడదు. వైఎస్సార్సీపీపై బురద చల్లడం మానుకోవాలి’’ అంటూ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
బాబు దుష్టపన్నాగమే ఇది.. ఏపీలో ఈసీ ఉండి ఏం లాభం?: వాసిరెడ్డి పద్మ
గుంటూరు, సాక్షి: ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్నికల సంఘం తనను ఏమీ చేయదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ. నల్లజర్లలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనపై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ద్వారా పద్మ స్పందించారు. ‘‘టీడీపీ శ్రేణులు బరితెగించాయి. సాక్షాత్తూ దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడికి యత్నించాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉంది. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారు. అసలు దళితులంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ..?.ఒక రాష్ట్ర హోంమంత్రి.. అందునా మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయటం దుర్మార్గపు విషయం. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయదని చంద్రబాబు భావిస్తున్నారా?. .. మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కానీ, చంద్రబాబు మహిళల మీద వివక్ష చూపుతున్నారు. ఇప్పటికే ఇంటింటి పెన్షన్లు నిలిపివేయించి.. అవ్వాతాతల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో దళితులు, మహిళల మీద దాడులకు తెగపడ్డారు... ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా స్పందించటం లేదంటే చంద్రబాబుకు ఎంత లెక్కలేని తనం?. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఉండీ ఏం ప్రయోజనం?. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ కోరారు. -
అన్నావదినపై విషం కక్కుతారా..
-
ఒళ్ళు దగ్గర పెట్టుకో చెల్లెమ్మ.. షర్మిల, సునీతలకు స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు చేతిలో షర్మిల రిమోట్ కంట్రోల్: వాసిరెడ్డి పద్మ
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒకరి చేతిలోని రిమోట్‌లాగా జగన్ వ్యవహరిస్తారా? ఆ సంగతి మీకు తెలీదా? అంటూ దుయ్యబట్టారు.చంద్రబాబు జేబు బొమ్మలులాగా షర్మిల, సునీత మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అవినాష్‌రెడ్డికి సీటు ఇస్తే ఇంత విషం చిమ్మాలా?. వైఎస్సార్సీపీ ఓటు చీల్చటమే పనిగా షర్మిల పెట్టుకున్నారు. ఆమె టార్గెట్ వెనుక చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ షర్మిల’’ అంటూ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.‘‘ఎన్నో కోట్లమంది ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. జగన్‌కి చెల్లెళ్లు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముంది?. వారు మాట్లాడేవన్నీ ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది. వారం తర్వాత ఎల్లోమీడియా మీ ముఖాలను టీవీలో చూపించదు. ఆ సంగతి గుర్తు పెట్టుకోండి. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఎల్లోమీడియా అసలు పట్టించుకోదు.షర్మిల, సునీత చూపుతున్న ఉన్మాదం వలన వారికే నష్టం’’ అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.వైఎస్సార్‌కుటుంబం ఎటుపోయినా పర్లేదు అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. వివేకా పరువు నడిరోడ్డు మీద పెట్టారు. షర్మిలకి మెదడు పని చేస్తుందా?. కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని ఇప్పుడు షర్మిల అనటం వెనుక కారణం ఏంటి?. వైఎస్సార్ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారనే బాధతో లాయర్ సుధాకర్ రెడ్డి కేసు వేశారు. ఆ కేసులో వైఎస్సార్ పేరు ప్రస్తావన ఉందా?. అవినాష్‌కి సీటు ఇస్తే షర్మిలకు ఎందుకు అంత కోపం?. మీరు చెప్పినట్టు జగన్ వినలేదని చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా?. జగన్ చెల్లెల్లు కాకపోతే అసలు షర్మిల, సునీతలను ఎవరు పట్టించుకుంటారు?’’ అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. -
నమ్ముకున్నవాళ్ళని నట్టేట ముంచావ్ పవన్...వాసిరెడ్డి పద్మ స్ట్రాంగ్ కౌంటర్
-
టీడీపీలో ఓటమి భయం.. వాసిరెడ్డి పద్మ స్ట్రాంగ్ కౌంటర్
-
ఏపీ స్పెషల్ స్టేటస్ కి పోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కాదా..?
-
చంద్రబాబు ఉచ్చులో షర్మిల: వాసిరెడ్డి పద్మ
సాక్షి, తాడేపల్లి: వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో, కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కకున్నారని విమర్శించారు. హంతకుడు అంటూ వైఎస్ అవినాష్‌రెడ్డిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు. షర్మిల తన బుర్రలో ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు తన రాజకీయంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. షర్మిల ఎన్ని విషయాల్లో యూటర్న్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రజలకు ఆమె సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు. సీఎం జగన్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషిగా మిగిలిందని, ఏపీ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఎజెండాతో వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్నారన్న వాసిరెడ్డి పద్మ.. తమ ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చదవండి: గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?!: పోసాని షర్మిలవి సానుభూతి రాజకీయాలు ‘కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు. తీర్పు, శిక్ష ఈవిడే వేసేస్తున్నారు. ఇది తీవ్రమైన అంశం. విచారణలో ఉన్న అంశాలపై ఇంత రాజకీయం చేయడం సరికాదు. కడప ప్రజలు అమాయకులు...అజ్ఞానులు కాదు. వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు. షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా?. ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈ రోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు ఇప్పుడెందుకు యూటర్న్? ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు .రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్. రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా?. విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా?. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా?. ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు. ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది . చంద్రబాబును మించిన ఊసరవెల్లి తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు. ఎందుకు మూసేశారు?.ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు. తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు. ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు?. ఏపీ ప్రజల కోసం ఈరోజు ఎందుకు వస్తున్నారు? చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు. చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్లు తీసుకుంటున్నారు. మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి?. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి. షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం. కచ్చితంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. -
నారా, నందమూరి ఫ్యామిలీ వాళ్లే డ్రగ్స్ కేసులో నిందితులు
-
గీతాంజలి ఘటనపై వాసిరెడ్డి పద్మ ఫైర్
-
సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?
టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల టార్గెట్‌తో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో సంతోష పడిన గీతాంజలిని.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేసి వేధించారు. గీతాంజలి మృతిపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి, తాడేపల్లి: గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని అన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరిచామని తెలిపారు. కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిఘా పెట్టామని చెప్పారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని..సీఎం జగన్ వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడిందని తెలిపారు. అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. గీతాంజలి మృతికి కారణమైన ఎవరినీ వదిలేది లేదని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని చెప్పారు. మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. పచ్చపార్టీలను తరిమికొట్టాలి టీడీపీ, జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా పేర్కొన్నారు. గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఐటీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని హితవు పలికారు. మహిళలు ఘాటుగా స్పందించి పచ్చపార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల తీరును ఖండిస్తున్నా గీతాంజలి మరణం చాలా బాధాకరమని బొత్స ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ప్రతిపక్షాలు వేధించడం దుర్మార్గ చర్చ అని మండిపడ్డారు. ఆమె మరణానికి టీడీపీ, జనసేన వేధింపులే కారణమని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గీతాంజలి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. గీతాంజలి మృతి చాలా దురదృష్టకరమని అన్నారు మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ. గీతాంజలి ఘటనను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతాంజలి మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు స్పందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా అని అన్నారు. గీతాంజలి మృతికి ప్రధాన కారణమైన అజయ్ సజ్జాను విడిచిపెట్టకూడదని అన్నారు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి. అజయ్ సజ్జాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చనిపోయేలా చేశారని మండిపడ్డారు. మహిళలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. -
గీతాంజలి ఘటన జనసేన, టీడీపీ పై వాసిరెడ్డి పద్మ ఫైర్
-
తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
-
ఏపీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం (ఫొటోలు)
-
బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని లేఖ
-
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై జుగుప్సాకరంగా మాట్లాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. డీజీపీని కోరారు. మంత్రి రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఆమె డీజీపీకి లేఖ రాస్తూ బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు మాట్లాడుతున్నారని వీటిని ఎంత మాత్రం సహించరాదని కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు. మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు న్యాయవాదులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారని పద్మ తెలిపారు. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్‌గా స్పందించాలని వాసిరెడ్డి పద్మ కోరారు. మంత్రులుగా ఉన్న మహిళల పట్ల కూడా క్రూరంగా వ్యవహరిస్తున్న బండారు సత్యనారాయణ వంటి మాజీ మంత్రుల బండారాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకు వెళ్తూ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మహిళా కమిషన్ సభ్యులు కె.జయశ్రీ, గజ్జల లక్ష్మి, గెడ్డం ఉమ, బూసి వినీత, రోఖయా బేగం మంత్రి రోజాకు సంఘీభావంగా మాట్లాడారు. -
పవన్ కల్యాణ్‌కు ఓపెన్ ఛాలెంజ్: వాసిరెడ్డి పద్మ
సాక్షి, గుంటూరు: మహిళలను గౌరవించే చరిత్ర చంద్రబాబు, పవన్‌కు లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాబు, పవన్ భాగస్వామ్య ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. ‘‘పవన్ కల్యాణ్‌కు ఓపెన్ ఛాలెంజ్. మహిళల సమక్షంలో రచ్చబండకు సిద్ధమా?. చంద్రబాబు మహిళలకు చేసిన ఒక్క మేలైనా చెప్పాలి’’ అంటూ వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ‘‘మహిళా పోలీసులను పెట్టాలనే ఆలోచన బాబుకు ఎందుకు రాలేదు?. మహిళా కమిషన్‌ను భ్రష్టు పట్టించాలనే మీ ఆటలు సాగవు. మహిళా కమిషన్‌పై చిందులు వేయడం పవన్, చంద్రబాబు మానుకోవాలి. మహిళల అదృశ్యంపై పవన్ నొటికొచ్చినట్లు మాట్లాడారు. బాబు హయాంలో మహిళలకు సమాన వాటా ఎప్పుడైనా ఇచ్చారా?. పవన్‌ది రాజకీయ కోపమా? రాష్ట్ర ప్రభుత్వంపై కోపమా?. మిసైన మహిళల్లో 78 శాతం మంది తిరిగి వచ్చారని డీజీపీ వెల్లడించారు. ఎక్కడా జరగనిది ఏపీలోనే జరుగుతోందని పవన్ ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారిని మహిళా కమిషన్ ప్రశ్నిస్తుంది’’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? ‘‘రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారంటూ పవన్ హడావిడి చేస్తున్నారు. టాప్ టెన్‌లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లెక్కలు ఎందుకు అడగడం లేదు. ఏపిలోని మహిళల మిస్సింగ్ గురించి పవన్ ఎందుకు తాపత్రయపడుతున్నారు. రాష్ట్రంపై ఎందుకు విషం చిమ్ముతున్నారు. మిస్సింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది. ఏపీపై మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారు?. మొదటి పది రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. -
మహిళా కమిషన్‌ను పవన్ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయంలో శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై చర్చించారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయ మహిళా ఉద్యోగుల సూచనలను మహిళా కమిషన్ తీసుకుంది. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సెక్రెటరియేట్‌లోని మహిళా అధికారులు, ఉద్యోగిణీలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినం జరుపుకుందామని తెలిపారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, మహిళలను గౌరవించలేని సమాజం అభివృద్ధి సాధించలేదని అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి పథకాన్ని మహిళల పేరు మీదనే అమలు చేస్తున్నారన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం దిశా యాప్ తీసుకవచ్చిందని తెలిపారు. పవన్‌కు మహిళా కమిషన్‌ను గౌరవించడంలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మహిళా కమిషన్ నోటీసులను ఆయన లైట్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వాలంటీర్లపై దారుణమైన ఆరోపణలు చేశారు కనుకే ఆధారాలు చూపమన్నామని, వితంతువులు, ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే వ్యవస్థను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. తమ పైనా జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారని, మరి మీ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఇందుకు పవన్ కళ్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా అని నిలదీశారు. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం -
అసభ్యకర పోస్టులు.. సోషల్ మీడియా కట్టడి అవసరం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై అసభ్యకర పోస్టులు ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయం అన్నారు. యూకేలో ఉన్న ఓ మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. వారిని సమర్థించడం సరికాదు టీడీపీ కార్యకర్త శ్వేతా చౌదరి దారుణంగా మాట్లాడుతోందని, ఆమెకు చంద్రబాబు మద్దతు తెలపడం సరికాదని హితవుపలికారు. సీఎం ఇంట్లో మహిళలను కించపరిస్తే ప్రతిపక్షనేత ప్రోత్సహిత్సారా? అని మండిపడ్డారు. అటువంటి వారికి మద్దతుగా మాట్లాడతం చంద్రబాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఇటు వంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్ పెర్సన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టుకు పోస్టు పెట్టడమే సమాధానం కాదని, ఎంత మాత్రం సమర్థనీయం కూడా కాదని ఆమె స్పష్టం చేశారు. చదవండి: సీఎం జగన్ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ సోషల్ మీడియా కట్టడి అవసరం సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీసు వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి దారితీస్తున్నదన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యాయత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జులై 5న సెమినార్ ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 5న విజయవాడలో ఓ సెమినార్‌ను నిర్వహించనున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. సమాజంలోని మేథావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ఈ సెమినార్లో పాల్గొని సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తమ కార్యాలయానికి మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెపుతూ తమ కమిషన్‌కు వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సత్వరమే చర్యలు తీసుకోనేందుకు పోలీస్ శాఖకు, ముఖ్యంగా సైబర్ క్రైం వారికి పంపించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. -
జగన్ పాలనలోనే.. మహిళలకు మహోన్నత గౌరవం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు మహోన్నత గౌరవం దక్కుతోందని, ఇది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అరుదైన ఘనత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ది హిందూ జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత, సమానత్వం’ అంశంపై మంగళవారం చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రచయిత్రి ప్రసూన సంధానకర్తగా వ్యవహరించగా హిందూ జీఎం ఎస్డీటీ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చర్చలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ.. తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని మహిళలు అడిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. కానీ, సీఎం వైఎస్ జగన్ మాత్రం అడక్కుండానే మహిళలకు అనేక వరాలిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా అమలుచేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందేనని మంత్రి అన్నారు. ఇక చర్చా గోష్టిలో పాల్గొన్న వారు ఏమన్నారంటే.. మహిళాంధ్రప్రదేశ్‌గా ఏపీ.. రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆంధ్రప్రదేశ్‌ను మహిళాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. అడక్కుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మహిళల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ దిశ బిల్లుతో అద్భుత ఫలితాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలోనే దిశ బిల్లు రూపుదిద్దుకుంది. ఇది చాలా విప్లవాత్మక విజయాలను సాధిస్తోంది. అనేక రాష్ట్రాలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. అనేక కేసుల్లో నెలరోజుల్లోపే శిక్షలు పడుతున్నాయంటే అది దిశ బిల్లు ఘనతే. – కేజీవీ సరిత, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగుపడింది రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగుపడటం సంతోషకరం. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంతోపాటు అణగారిన వర్గాల మహిళల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – చల్లపల్లి స్వరూపరాణి, ఏఎన్‌యూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ -
పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి?
పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ‘మాకు చేసుకోవాలనిపించినప్పుడు’ అంటారు పిల్లలు. ‘మేము చేయాలనుకున్నప్పుడు’ అంటారు తల్లిదండ్రులు. ‘మేము కన్న మా పిల్లల భవిష్యత్తు మాకు తెలియదా’ అని ప్రశ్నిస్తారు కూడా. అలాగే పిల్లల నిర్ణయం ప్రకారమే అనుకుంటే అది పదిహేనేళ్లు కావచ్చు, పాతికేళ్లు కావచ్చు. అందుకే ప్రభుత్వం వివాహానికి ఒక వయసును నిర్ధారించింది. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21ని వివాహ వయసుగా నిర్ధారిస్తూ అంతకంటే ముందు పెళ్లి జరిగితే ఆ పెళ్లిని బాల్య వివాహంగా పరిగణించాలని కూడా చెప్పింది. అలా వచ్చిన చట్టమే ‘ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్– 2006’, అంటే బాల్య వివాహ నిషేధ చట్టం అన్నమాట. అమ్మాయి అక్షరాలు దిద్దుతోంది కానీ... చట్టాలు పని చేస్తూనే ఉన్నాయి. సమాజం చైతన్యవంతం అవుతూనే ఉంది. అమ్మాయిల అక్షరాస్యత శాతం పెరుగుతోంది. అయినా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అక్షరాస్యత శాతం పెరుగుతోంది కానీ పాఠశాల విద్య దాటి కాలేజ్ బాట పట్టే సంఖ్య తక్కువగానే ఉంది. ఆ చదువు కూడా ఇప్పటికీ ఇంటర్ దాటడం లేదు. మనం చెప్పుకుంటున్న కేస్‌స్టడీలు గ్రామాలు, అల్పాదాయ వర్గానికి చెందినవి కావడం గమనార్హం. బాల్య వివాహాలకు ‘తల్లిదండ్రులకు చదువు లేకపోవడంతో΄ాటు సమాజంలో ఆడపిల్లకు భద్రత కరువవడం’ కూడా కారణమేనంటారు కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ అనుబంధ విభాగం ‘బచ్పన్ బచావో ఆందోళన్’ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త చందన. బాల్యాన్ని హరించడమే! ‘‘బాల్య వివాహం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే. వివాహం, పని, ఒత్తిడితో కూడిన చదువు... ఇవన్నీ పిల్లల బాల్యాన్ని హరించేవే. పిల్లల బాల్యాన్ని హరించే హక్కు కన్నవాళ్లకు కూడా ఉండదు. బాల్యవివాహాల నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో అతి పెద్ద విఘాతం కరోనా రూపంలో వచ్చి పడింది. మునుపు 35గా ఉన్న బాల్య వివాహాల శాతం కరోనా కారణంగా 2020లో 62 శాతానికి పెరిగిపోయింది. ఆ తర్వాత ఏడాది కొంత తగ్గి 57 శాతం దగ్గర ఆగింది. ప్రభుత్వ పథకాలు కొంత వరకు బాల్య వివాహాలను తగ్గించగలుగుతున్నాయి. కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని సంతోషం పడడమే ఇప్పటికి మనం సాధించింది’’ అన్నారు చందన. 2025 నాటికి స్త్రీ–పురుష సమానత్వంతో పాటు మహిళలు, బాలికల సాధికారత సాధించాలని ఐక్యరాజ్యసమితి ఒక లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే బాలికల విద్య మీదనే దృష్టి పెట్టాలి. అల్పాదాయ వర్గాల వాళ్లు కూడా అమ్మాయి పెళ్లికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. చదివించడం లేదెందుకంటే ‘మా దగ్గర డబ్బులెక్కడున్నాయ్’ అంటారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పేదొక్కటే... ‘పెళ్లికి చేసే ఖర్చుని అమ్మాయి చదువుకి ఉపయోగించండి. మీ అమ్మాయి జీవనస్థాయి మారుతుంది. – చందన, కో ఆర్డినేటర్, బచ్పన్ బచావో ఆందోళన్, తెలంగాణ ఐదు వేల బాల్య వివాహాలను నివారించాం మనదేశంలో ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు బాల్య వివాహం చట్రంలో నలిగిపోతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాసాధికారత కోసం నిర్వహించిన ‘సబల’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. అధికారులు ఐదు వేల బాల్య వివాహాలను నివారించగలిగారు. బాల్య వివాహ వ్యవస్థ తరతరాలుగా వస్తున్న దురాచారం. దీన్ని రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, పూర్తిగా నివారించడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంది. దీనికి మూలకారణం ఆర్థిక స్థితిగతులు, చదువు. ఆడపిల్లలను చదివించడం మీద దృష్టి పెట్టిన కుటుంబం బాల్య వివాహానికి దూరంగా ఉన్నట్లే. మహిళ సాధికారత సాధిస్తే తన కూతురిని ఈ చట్రంలో ఇరుక్కోకుండా రక్షించుకోగలుగుతుంది. అందుకే బాలికల విద్య, మహిళల ఆర్థికస్వయం సమృద్ధి పూర్తి స్థాయిలో సాధించగలిగిన రోజు బాల్య వివాహాలు వాటంతటవే నిర్మూలన అవుతాయి. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి చదవండి: Meenakshi Gadge: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు.. -
టీడీపీ అండ చూసుకుని రెచ్చిపోతున్న వారిని కట్టడిచేస్తాం: వాసిరెడ్డి పద్మ
-
బాబు వ్యాఖ్యలు దారుణం
సాక్షి, అమరావతి: మహిళా పోలీసులు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్యభర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా అవమానించారని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే వ్యక్తి.. ఈ విధంగా మహిళలను కించపరచడం దారుణమని పేర్కొంది. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గురువారం మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ డి.మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ఎంవీఎన్ దుర్గా, గౌసియాబేగం, గీత తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. చదవండి: (Fact Check: ప్రాణాలు పోతున్నా టీడీపీ ప్రచార యావ.. ఈ వీడియోలే నిదర్శనం) -
బాబు పబ్లిసిటీ కోసం బెదిరించి మీటింగ్ కు తీసుకెళ్లారు
-
పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన.. వాసిరెడ్డి పద్మ ఫైర్
సాక్షి గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు.. చంద్రన్న కానుకల పంపిణీ సందర్భంగా సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, సభ నిర్వాహకులు, చంద్రబాబు నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రమాదంలో గాయపడిన మహిళలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం, వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ‘తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందడం బాధాకరం. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే ప్రచారం కోసం కానుకల సభ జరిగింది. కానుకల పేరుతో మహిళలకు ఆశ చూపించారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా కార్యక్రమం చేపట్టారు. పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన. కందుకూరు సభ తర్వాత కూడా చంద్రబాబుకు పశ్చాత్తాపం లేదు. తొక్కిసలాట ఘటనపై అధికారులను సమగ్ర నివేదిక కోరాము. ఈ ఘటనపై ఉయ్యూరు ఫౌండేషన్, చంద్రబాబు వివరణ ఇవ్వాలి’ అని అన్నారు. -
పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి : వాసిరెడ్డి పద్మ
-
పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ
-
పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల పవన్ కల్యాణ్.. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా?. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం ఆక్షేపణీయం. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. -
అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి.. ఫొటోలు, వీడియోలు తీసి..
కడప అర్బన్: బాలికపై సామూహిక అత్యాచారం చేసి వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గోపవరం మండలం రాచాయపేటకు చెందిన ఓ బాలిక మూడు నెలల క్రితం నేరేడుపళ్ల కోసం కొండ ప్రాంతానికి వెళ్లింది. అయితే అదే సమయంలో అక్కడున్న బాలురు ఆమెపై అత్యాచారం చేశారు. ఫొటోలు, వీడియో కూడా తీశారు. కాగా, మూడు రోజుల క్రితం ఈ ఫొటోలు, వీడియోలు బహిర్గతమయ్యాయి. దీంతో, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నలుగురు మైనర్లపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసును బద్వేల్ రూరల్ పోలీసులు నమోదు చేశారు. 14వ తేదీన నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కడపలోని జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఎవరైనా గుర్తిస్తే డయల్ 100 లేదా తన ఫోన్ నంబర్ 94407 96900 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సాక్షి, అమరావతి: మగపిల్లల నడవడికపై తల్లిదండ్రుల నిఘా లోపిస్తే విద్యార్థి దశలో నేరాలకు పాల్పడే ప్రమాదముందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. గోపవరం మండలం రాచాయపేటలో వెలుగుచూసిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై ఆమె శనివారం స్పందించారు. కడప జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో మైనర్లు నేరానికి పాల్పడటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం, అశ్లీల వీడియోలు బయట పెట్టడం తదితర అంశాలు తీవ్రంగా మనసును కలచివేశాయన్నారు. క్రమశిక్షణ కొరవడటం, సెల్ ఫోన్ల వినియోగంతో ఇష్టారీతిగా ప్రవర్తించడం జీవితాలపై ప్రభావం చూపుతుందని వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఇంటి వాతావరణంలో పిల్లలకు మంచి అలవాట్లు, సంస్కారాన్ని నేర్పే కౌన్సెలింగ్ అవసరమన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : మైనర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడటం విచారకరమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి అన్నారు. బాధితురాలి ఆరోగ్యంపై స్థానిక ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. బాలిక మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. -
టీడీపీ నేత వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
సాక్షి, అమరావతి/తనకల్లు: టీడీపీ నేత వేధింపులకు ఓ బాలిక బలైపోయింది. ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్.. ఫేస్బుక్లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన ఆత్యహత్యకు రాళ్లపల్లి ఇంతియాజే కారణమంటూ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో చెప్పింది. సమచారం అందుకున్ని స్థానిక ఎస్ఐ రాంభూపాల్ ఘటన స్థలానికి చేరుకుని సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కీచక టీడీపీ నేతల అరాచకాలకు చంద్రబాబే కారణం : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ లైంగిక వేధింపులకు పాల్పడి మైనర్ బాలికలను పొట్టనబెట్టుకుంటున్న కీచక టీడీపీ నేతలకు చంద్రబాబు వత్తాసుపలకడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఇంతియాజ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బాలిక ఉదంతంపై గురువారం వాసిరెడ్డి పద్మ.. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ, కదిరి డీఎస్పీతో మాట్లాడారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలకు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనంత, సత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు ప్రధాన కారణం.. వారిని చంద్రబాబు వెనుకేసుకురావడమేనన్నారు. విజయవాడలో వినోద్ జైన్ కేసు, లోకేశ్ పీఏ వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే.. ఇలాంటి ఘటనలకు తావుండేది కాదన్నారు. -
మహిళల్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు
సాక్షి, అమరావతి: మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం తగదని ప్రతిపక్ష టీడీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతిపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం డీజీపీని కలిసి లేఖను అందజేయడం తెలిసిందే. ఇదే విషయమై గురువారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి పద్మను కలిసి వినతులు అందించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన మహిళా సంఘాలు ఎవరికి వారు విడివిడిగా సంతకాలతో వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని ఆమె డీజీపీ కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి మాట్లాడిన మాటలను వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలను డీజీపీకి సమర్పించినట్టు తెలిపారు. -
వారిపై కఠిన చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు. ఆమె బుధవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. వైఎస్ భారతి గతంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ నిందాపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారు, యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పద్మ విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా వైఎస్ భారతిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశ్రామికవేత్త, సామాజిక సేవాతత్పరురాలు భారతిపై దుష్ప్రచారం చేయడాన్ని యావత్ సమాజం ఖండిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. మహిళలను అడ్డంపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే ఎవరికైనా కఠినమైన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉన్నందునే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
అక్టోబర్ 1న రాజమండ్రిలో దసరా మహిళా సాధికారత ఉత్సవం
-
మహిళల భద్రతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రైల్వేస్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఏపీ మహిళా కమిషన్‌కు దక్షిణ మధ్య రైల్వే పోలీసు శాఖ నివేదించింది. మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం ఆర్.శ్రీనివాసులు, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ కె.హరప్రసాద్ సోమవారం కలిశారు. ఇటీవల పల్నాడు, బాపట్ల జిల్లాల్లో గురజాల, రేపల్లె రైల్వేస్టేషన్లలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించిన సంగతి తెల్సిందే. రైల్వే స్టేషన్లలో మహిళా భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్వయంగా వచ్చి నివేదించాలంటూ రైల్వే పోలీసులకు ఏపీ మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు రైల్వే పోలీసు ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు. గురజాల రైల్వే హాల్టు, రేపల్లె ఘటనలపై వారు వివరణ ఇచ్చారు. లోకల్ పోలీసు, జీఆర్పీ, రైల్వే పోలీసులు సమన్వయం చేసుకుంటూ రాత్రి, పగలు గస్తీ మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పద్మ వారికి సూచించారు. నేరాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రైల్వేస్టేషన్లలో అవసరమైన సిబ్బందిని కేటాయించాలని సూచించారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
పోకిరీకి బడితపూజ చేసిన యువతి.. వీడియో వైరల్
సాక్షి, విజయవాడ: ఓ పోకిరికి యువతి తగిన బుద్ధి చెప్పింది. బైక్‌పై ఫాలో చేస్తూ ఇబ్బందికి గురిచేయడంతో ఆమె ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి.. దేహశుద్ధి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ పోకిరి బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె.. సదరు పోకిరిని కర్రతో చితకబాదింది. ఈ ఘటనపై వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ.. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. అంటూ కామెంట్స్ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా బైక్ ను అడ్డగించి వేధించిన దుండగుడిని కర్రతో చితక్కొట్టిన ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. pic.twitter.com/1HGGQ0YMWy — Vasireddy Padma (@padma_vasireddy) April 29, 2022 ఇది కూడా చదవండి: టీడీపీ కార్యకర్త అరాచకం.. మహిళపై అత్యాచారయత్నం -
చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమాకు నోటీసులు ఇచ్చామని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్‌ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. హాస్పిటల్లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు. మొదటి తప్పు: పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం రెండో తప్పు: గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం మూడో తప్పు: బాధితురాలిని భయకంపితులు చేయడం నాలుగో తప్పు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు ఐదో తప్పు: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అడ్డుకోవడం ఆరో తప్పు: తనను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం ఏడో తప్పు: తనను బెదిరించడం, విధులను అడ్డుకోవడం ఎనిమిదో తప్పు: చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను బెదిరించడం తొమ్మిదో తప్పు: బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం పదో తప్పు: కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం అయితే ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని ఆమె తెలిపారు. అంతకు ముందు మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు, వంగలపూడి అనిత ముట్టడించడానికి యత్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి టీడీపీ మహిళా నేతలు.. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చాంబర్‌కు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అయితే అక్కడితో ఆగకుండా ఆమె చాంబర్లో వాసిరెడ్డి పద్మతో టీడీపీ మహిళా నేతలు వాగ్వాదానికి దిగి నానా రచ్చ చేశారు. -
తప్పు మీద తప్పు.. ఇదేనా చంద్రబాబు ‘పెద్దరికం’?
ఎవరైనా అత్యాచారానికి గురైన ఒక యువతి వద్దకు వెళ్లి గొడవ చేస్తారా? అందులోను పురుషులు కూడా అంతమంది వెళ్లి అరాచకం సృష్టిస్తే సమాజానికి వీరు ఏమి చెబుతున్నట్లు? ఒక మహిళను పరామర్శించడానికి వెళ్లి మరో మహిళను అవమానిస్తారా? ఏ పార్టీ వారు ఇలా చేసినా తప్పే. కాని పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే ఈ రకంగా గందరగోళం సృష్టించడానికి తెలుగుదేశం నేతలు, కొందరు కార్యకర్తలు పూనుకోవడం అత్యంత శోచనీయం. చదవండి👉: జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’ విజయవాడలో బుద్దిమాద్యం ఉన్న ఒక యువతిపై ముగ్గురు నీచులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆమెకు పది లక్షల పరిహారం ఇవ్వడం, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకుంది. అయినా ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అక్కడకు వెళ్లడాన్ని ఆక్షేపించనవసరం లేదు. ఆయన ఒక్కరు మర్యాదగా వెళ్లి ఆ యువతిని పరామర్శించి వచ్చి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. అలా కాకుండా తనతోపాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను తీసుకువెళ్లడం ఏమిటి? అక్కడ వారు అద్దాలు పగులకొట్టి గొడవ చేయడం ఏమిటి? అసలే బాధలో ఉంటే, ఆ బాధిత యువతి వద్దకు అంతమంది పురుషులు వెళితే ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? అదే సమయంలో అక్కడ ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు అనుచితంగా వ్యవహరించడం ఏమిటి? నిజానికి ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే మహిళా కమిషన్ రంగంలోకి దిగి బాధితులకు జరుగుతున్న ఉపశమన చర్యలను పరిశీలించి, కమిషన్‌గా తానేమీ చేయాలో ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పద్మ వెళ్లగా టీడీపీ వారు గో బ్యాక్ అనాల్సిన అవసరం ఏముంది. అంటే టీడీపీ వారు తప్ప ఆ యువతిని మరెవరూ పరామర్శించకూడదా? ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని, మహిళా కమిషన్ ఏమి చేస్తుందని ప్రశ్నించవచ్చని వారి ఉద్దేశమా? లేక చంద్రబాబు ఇంకా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని ఫీల్ అవుతూ వారు ఈ గోల చేశారా? చదవండి👉: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటే గౌరవమే కాని... మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ఇష్టారీతిలో పద్మపై నోరు పారేసుకుంటుంటే చంద్రబాబు వారించి ఉంటే ఎంత బాగుండేది. పద్మతో పాటు ఆయన కదా ఆ బాధిత యువతిని పరామర్శించి, ఇంకా ఏ విధంగా ఆ యువతి సాయం చేయాలో ఆమెకు చెప్పి ఉంటే ఎంత హుందాగా ఉండేది. తద్వారా తన పెద్దరికం నిలబడేది కదా? అలా చేయకపోగా బొండా ఉమాను, మరో మహిళా నేతను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారట. ఈ నేపథ్యంలోనే తన అధికారిక హోదాలో చంద్రబాబుకు, బొండాకు సమన్లు జారీ చేశారు. వీటిని వారు పాటించకపోవచ్చు. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెరపైనే చూడాలి. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాచేపల్లి వద్ద అత్యాచారం ఘటన జరిగితే ఏమని సూక్తులు చెప్పారు. ఎవరికి వారు భద్రత కల్పించుకోవాలి కాని, ప్రతి ఒక్కరికి పోలీసును పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అది వాస్తవం కూడా. కాని ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌పైన నిందారోపణలు సాగించారు. ఇక్కడే ఆయనలో ఉన్న రాజకీయ కుట్ర కోణం బయటపడుతోంది. ప్రతిదానిని రాజకీయం చేయాలని, రాజకీయాలకు వాడుకోవాలన్న ఆయన దురుద్దేశం బహిర్గతం అవుతుంది. పోనీ తన హయాంలో కాని, ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు టీడీపీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కాని, ఆయన ఇదే రీతిలో స్పందించారా? అలాంటిదేమీ లేదు. మరి ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మరో రెండేళ్లలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో జగన్‌ను ఓడించాలన్న తహతహతో ఉన్న చంద్రబాబు ఏ చిన్న అవకాశం వచ్చినా, పెద్దరాయితో కొట్టాలని చూస్తున్నారు. కాని ఆ క్రమంలో ఆయన తప్పులపై తప్పులు చేస్తూ, ప్రజలలో అప్రతిష్టపాలవుతున్నారు. ఇక ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా మాత్రం అసలు వాసిరెడ్డి పద్మపై ఏ దాడి జరగలేదేమో అన్న చందంగా వార్తలు ఇచ్చాయి. ఒకవేళ ఇదే పరిస్థితి టీడీపీ మహిళా నేతకు ఎదురైతే, చంద్రబాబు, టీడీపీ మీడియా తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. బ్యానర్ కథనాలు వచ్చేవి. తప్పు టీడీపీ వైపు ఉంది కనుకే ఆ సంబంధింత కథనాన్ని కనిపడి, కనిపించకుండా ప్రచురించారనుకోవచ్చు. ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరిగినా సహించరాదు. కాని సమాజంలో ఇలాంటి ఘటనలు వివిధ కారణాల వల్ల పెరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి ఆందోళన కలిగించిందో తెలుసు. తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రేమోన్నాది మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చంద్రబాబు పాలనలో తహశీల్దార్ వనజాక్షికి ఎదురైన చేదు అనుభవం, ఆ కేసులో ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు ఎలా కాపాడే యత్నం చేశారో అంతా వినే ఉంటారు. అలా చేయడం తప్పు. ప్రభుత్వం ప్రభుత్వంగానే వ్యవహరిస్తే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశంఉంటుంది. మరి చంద్రబాబుకు అవన్ని గుర్తుకు ఉండవా. వయసురీత్యా ఆయన బాగా పెద్దవాడు కావచ్చు. కాని ఏపీలో ఆయనకు ఒక కీలకమైన బాధ్యత ఉంది. అందువల్ల ఆయన మరింత అర్థవంతంగా ఉండాలి. లేకుంటే వచ్చే ఎన్నికలలో టీడీపీకి మరోసారి కర్రుకాల్చి వాతపెడతారని హెచ్చరించక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
కాలకేయులకు నాయకుడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. అటువంటి కాలకేయులకు చంద్రబాబు నాయకుడని మండిపడ్డారు. విచారణకు రావాలని మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లపై బొండా ఉమ ఇష్టానుసారం మా ట్లాడటంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పం దించారు. కమిషన్ సభ్యులు జి.వెంకటలక్ష్మి, బూసి వినిత, షేక్ రుఖియాబేగంతో కలిసి సోమవారం విజయవాడలో ఆమె మాట్లాడారు. అత్యాచార ఘటనపై టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కమిషన్‌కు వివరణ ఇచ్చే ధైర్యం చం ద్రబాబు, ఉమకు లేదని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. ఈ నెల 27న చంద్రబాబు, ఉమ వచ్చి కమిషన్‌కు వివరణ ఇవ్వాల్సిందేనని.. లేకుంటే తమ పద్ధతులు తమకుంటాయని హెచ్చరించారు. చైర్‌పర్సన్‌గా తన పదవి పోయే వరకు పోరాడతానని చెబుతున్న చిల్లర రౌడీ ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపాడా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఇష్టానుసారం మాట్లాడితే ఉమ చెప్పు దెబ్బలు తినడం ఖాయమన్నారు. -
మహిళా కమిషన్ నీలాంటి వారికి సుప్రీమే: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: అత్యాచారానికి గురైన మతిస్థిమితంలేని బాధితురాలిని భయాందోళనలకు గురిచేసేలా.. ఘటన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అగౌరవపరిచేలా దౌర్జన్యం చేసిన మీ తీరు కు సమన్లు ఇవ్వకుండా చప్పట్లు కొట్టాలా?.. అం టూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విజయవాడ ఆర్ అండ్‌బీ భవనంలోని మీడియా పాయింట్లో ఆమె శనివారం మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాçస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆ పార్టీ నేతలు శుక్రవారం వ్యవహరిం చిన తీరు దారుణమన్నారు. ఇంకా ఏమన్నారంటే.. యుద్ధానికి వెళ్తున్నట్లు కౌరవమూక మాదిరిగా జనాన్ని వేసుకొచ్చి అలజడి సృష్టిస్తే అది పరామర్శ అవుతుందా? బాధితురాలితో ఎలా వ్యవహరించా లో చంద్రబాబుకు తెలీదని నిన్న అర్థమైంది. మన సు, శరీరం గాయమైన బాధిత యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అక్కడ బల ప్రదర్శన చేయటమేమిటి? అవును.. కమిషన్ సుప్రీమే.. మహిళా కమిషన్ ఏమైనా సుప్రీమా? అని బొండా ఉమా ప్రశ్నించడంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ‘అవును బొండా ఉమా లాంటి ఆకురౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమే. చంద్రబాబు హ యాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా, కంటితుడుపుగా నడిపి ఉండొచ్చేమో.. కా నీ, మహిళా కమిషన్‌కు ఉండే హక్కులు, కమిషన్ శక్తి ఏమిటో అర్థమైన తర్వాత వారికి దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది. నేను ఇప్పుడు కోట్లాది మం ది మహిళలకు బాధ్యురాలిని. చంద్రబాబు, ఉమా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే కమిషన్ తలవంచుకోదు. ఈ నెల 27న వారిద్దరూ కమిషన్ ఎదుట హాజరుకావాల్సిందే. చేసిన తప్పుకు క్షమాపణలు అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు’. లోకేశ్.. మీ నాన్నను అడుగు ‘బాధిత మహిళలపట్ల ఎలా వ్యవహరించారో మీ నాన్నను అడుగు లోకేశ్.. రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని.. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా లోకేశ్ తన తండ్రిని అడగాలి. బాధితులపట్ల, మహిళా కమిషన్ పట్ల రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలో తెలియజెప్పేందుకే విచారణకు రావాలని చంద్రబాబుకు, ఉమాకు సమన్లు ఇచ్చాం’.. అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. సమన్లు అందజేత మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు శనివా రం మహిళా కమిషన్ సమన్లు అందజేసింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి కమిషన్ సిబ్బంది వెళ్లి వాటిని అందజేశారు. అదేవిధంగా విజయవాడలోని బొండా ఉమా ఇంటికి వెళ్లి అందజేశారు. 22వ తేదీ శుక్రవారం ప్రభుత్వాసుపత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను బాధితురాలి తో మాట్లాడనివ్వకపోగా.. ఆమెను బెదిరించేలా వ్యవహరించడంపై ఏపీ మహిళా కమిషన్ యాక్ట్–1998లోని సెక్షన్ 15(1) ప్రకారం ఈ నోటీసులు అందచేస్తున్నామని ఆ సమన్లలో పేర్కొన్నారు. పోలీసు కమిషనర్‌తో భేటీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో వాసిరెడ్డి పద్మ ఆయన కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో బా«ధిత యువతిని పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శనివారం డిశ్చార్జి చేశారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఏఆర్ఎంఓ డాక్టర్ శిరీష ఆమెను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి పంపారు. ఆమెపై మేమూ ఫిర్యాదు చేస్తాం : బొండా ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం నా వెంట్రుక కూడా పీకలేదు’ అంటూ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యానించారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు, తనకు సమన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి నోటీసులకు తాము భయపడబోమని, వాసిరెడ్డి పద్మపై తాము కూడా జాతీయ మహిళా కమిషన్‌కు, హైకోర్టుకు, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. చదవండి: (విశాఖలో జాబ్‌మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి) -
చంద్రబాబు, బొండా ఉమకు 'మహిళా కమిషన్' సమన్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీనేత బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరుకావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు కావాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు. -
కావాలనే చంద్రబాబు దాడి చేయించారు: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన అందరూ బాధపడాల్సిన దురదృష్టకర సంఘటనని మంత్రి జోగి రమేష్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి అన్ని శాఖలను ఆదేశించారని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయడం వేగంగా జరిగిపోయాయని అన్నారు. యువతి ఆరోగ్యం మెరుగయ్యే వరకూ ప్రభుత్వం ట్రీట్మెంట్ అందిస్తుందని చెప్పారు. శవ రాజకీయాలు చేయడానికి చంద్రబాబు అక్కడికి వచ్చారని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నేతలు మహిళా కమిషన్ చైర్మన్‌పై దాడికి దిగారని విరుచుకుపడ్డారు. వేలకోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేసే సమయంలోనే కావాలని చంద్రబాబు ఇక్కడ హడావుడి చేశారని మండిపడ్డారు. ఇది బాధ్యత గల ప్రభుత్వమని, వాసిరెడ్డి పద్మపై దాడి చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసిరెడ్డి పద్మపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తామని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఘటనలో తాము ఆందోళన చేస్తే ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని విమర్శించారు. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక చిన్నారి మృతి చెందిందని తెలిపారు. -
చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: వాసిరెడ్డి పద్మ ఫైర్
సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అయితే అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే.. టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వస్తే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మహిళల పట్ల రాజకీయం చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారనని విమర్శించారు. తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత వార్త👉ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టీడీపీ కార్యకర్తల వీరంగం.. వాసిరెడ్డి పద్మపై దాడి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఆసుపత్రికి వచ్చే సరికి తెలుగు దేశం నాయకులు ఆసుపత్రి ముందు మోహరించి ఉన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వస్తున్నాడని నన్ను వెళ్లడానికి వీళ్లేదని అడ్డుకోవడమే కాదు, వాసిరెడ్డి పద్మ గో బ్యాక్ అంటూ గొడవ చేశారు. అయినా నేను ఆసుపత్రి వద్ద రాజకీయాలు చేయడం సరికాదని సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. టీడీపీ నేతలను నెట్టుకుంటూ, వారి నుంచి తప్పించుకొని లోపలికి అడుగుపెట్టాను. ఆ తరువాత కూడా టీడీపీ కార్యకర్తలు దాదాపు 50 మంది గలాటా సృష్టించారు. అయినా కూడా సంయమనం పాటించా. బాధితురాలితో మాట్లాడుతుండగా బోండా ఉమా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాతో చాలా అనుచితంగా ప్రవర్తించారు. చంద్రబాబు సైతం విచక్షణ మరిచి బెదిరించే ప్రయత్నం చేశారు. ఆయన సమక్షంలోనే టీడీపీ మహిళా నేతలు నాపై వేలు చూపిస్తూ దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు అందరినీ రెచ్చగెడుతున్నారు. మహిళా నాయకుల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడిన వాసిరెడ్డి పద్మ, బొండా ఉమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. -
బాబు అండ్ బ్యాచ్ గూండాగిరి: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై దాడి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టీడీపీ నేతలు గూండాగిరికి తెగబడ్డారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాక, బాధితురాలిని పరామర్శిస్తున్న సమయంలో ఆమెపై టీడీపీ మహిళలు వీరంగం సృష్టించారు. ఇక మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అయితే చంద్రబాబు సమక్షంలోనే ‘నో ర్ముయ్’ అంటూ పద్మపై తిట్ల పురాణం అందు కున్నారు. టీడీపీ దాష్టీకానికి అత్యాచార బాధితురాలితో పాటు, ఆస్పత్రి సిబ్బంది సైతం భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ నేతల అరుపులు, కేకలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. వివరాలివి.. రెండ్రోజుల కిందట విజయవాడ వాంబే కాలనీకి చెందిన బుద్ధిమాంద్యం యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడగా, ప్రస్తుతం ఆ యువతి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలిని పరామ ర్శించేందుకు శుక్రవారం మ.12 గంటల సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. ఆమెను ఆస్పత్రిలోకి వెళ్లనీయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నేతృత్వంలో మహిళా నాయకురాలు పంచు మర్తి అనురాధ తదితరులు అడ్డుకుని దాడికి యత్నించారు. బాధితురాలిని పరామర్శించి, ఆమెకు అండగా ఉండేందుకు వస్తే అడ్డు కోవడం ఏమిటంటూ వారిని తోసుకుంటూ అతికష్టం మీద వాసిరెడ్డి పద్మ ఆస్పత్రిలోకి వెళ్లారు. బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరా మర్శిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో భయభ్రాంతులకు గురిచేస్తూ దాడిచేశారు. ఇలా దాదాపు అర గంటపాటు పంచుమర్తి అనురాధ, బొండా అనుచర గణం దౌర్జన్యకాండ కొనసాగింది. చంద్రబాబు సమక్షంలోనే వీరంగం ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శిస్తున్న సమయంలోనే చంద్రబాబు అక్కడకు రావడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అప్పటిదాకా ఓ పక్కన నిల్చున్న టీడీపీ కార్యకర్తలను బొండా ఉమా రెచ్చగొట్టారు. బాధితురాలిని పరామర్శించడానికి వస్తే ఆమెతో మాట్లాడే అవకాశం ఇవ్వరా? అంటూ బొండా ఉమా అరిచారు. పక్కకు తొలగాల్సిందిగా ‘ఏయ్.. లే..’ అంటూ వాసిరెడ్డి పద్మను గద్దించారు. చంద్రబాబు సైతం పద్మతో ‘మీరిప్పుడు ఎందుకొచ్చారు’.. అంటూ బెదిరిస్తున్నట్లు మాట్లాడారు. దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో బాధితురాలిని పరామర్శించే బాధ్యతగా వచ్చానని, టీడీపీ నేతల్లా నీచరాజకీయాలు చేయడానికి మందిని వెంటబెట్టుకుని రాలేదని ఆమె చంద్రబాబుకు దీటుగా బదులిచ్చారు. నోరుపారేసుకున్న బాబు, బొండా మీకు ఇది పద్ధతి కాదని, రాజకీయాలు ఏమై నా ఉంటే బయట మాట్లాడుకుందామని, బా ధితురాలి దగ్గర ఇలా ప్రవర్తించవద్దని వాసి రెడ్డి పద్మ చంద్రబాబుకు, వారి నాయకులకు చెప్పారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ‘నువ్వేంటి చెప్పేది’ అంటూ పెద్ద గా అరిచారు. పక్కనే ఉన్న బొండా ఉమా సై తం నోర్ముయ్ అంటూ నోరు పారేసుకోవడం తో మళ్లీ టీడీపీ మహిళలు అరుపులు కేకలతో వీరంగం వేశారు. తన సమక్షంలోనే మహిళపై తమ నాయకులు అలా ప్రవర్తిస్తున్నా, చంద్ర బాబు కనీసం వారించకుండా, రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపట్ల అక్కడ ఉన్న వారంతా విస్మయానికి గురయ్యారు. ఇక చంద్రబాబు పరామర్శించి వెళ్లగానే ‘మేం ఇక్కడ ఉండలేం.. మా ఇంటికి పంపించేయండి’.. అంటూ బాధితురాలు భయంతో వాసిరెడ్డి పద్మను చుట్టేసుకుంది. బాధిత కుటుంబీకులే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో ప్రత్యేకంగా మాట్లాడతామని కోరడంతో చేసేది లేక టీడీపీ శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో తాను వచ్చిన ఉద్దేశం నెరవేరలేదన్న భావన తో చంద్రబాబు పోలీసులపై చిందులేశారు. అక్కడే ఉన్న పోలీసు కమిషనర్ కాంతిరాణా తో మాట్లాడి తనకు బాధితురాలితో మాట్లాడే అవకాశమిస్తే కొద్దిసేపు ఉండి వెళ్లిపోతానని చెప్పారు. మరోవైపు.. అక్కడ వాతావరణాన్ని చూపిస్తూ ఏయ్.. ఓయ్, అంటూ గుడ్లురిమి కేకలేస్తే భయపడతానా? ఇదేనా మీ రాజకీయం? బూతులు తిట్టమని మీ నేత ఉసిగొల్పుతారా? మీరు ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా? అంటూ పద్మ చంద్రబాబుపై మండిపడ్డారు. అనంతరం చంద్రబాబు బాధితురాలితో మాట్లాడి అక్కడ నుంచి నిష్క్రమించారు. టీడీపీ నేతల విధ్వంసం ఇక ప్రభుత్వాస్పత్రిలోని మాత శిశు విభాగం లోపలికి వెళ్లే దారి వద్ద అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. .జఅంతేకాక.. అక్కడున్న గ్రిల్స్‌ను సైతం పీకేసి భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీవి నీచ రాజకీయాలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలే కానీ, బాధితురాలి సమక్షంలో అరుపులు, కేకలతో రాజకీయం చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఒక గుంపుగా కొంతమంది అవారా బ్యాచ్ వచ్చి అరాచకం సృష్టించారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధితురాలికి అండగా ఉండేందుకు, పరామర్శించేందుకు వస్తున్న తనను అడ్డుకుంటే, అతి కష్టమ్మీద లోపలికి రావాల్సి వచ్చిందన్నారు. వెనకే ఒక గుంపులా వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాతైనా, వారిని వారిస్తారనుకుంటే ఆయన కూడా అలాగే ప్రవర్తించడం టీడీపీ నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. బొండా ఉమా బెదిరింపులకు ఎవరూ బెదిరేదిలేదని, ఇది మహిళల ప్రభుత్వమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యాచార ఘటన విషయం తెలియగానే సీరియస్‌గా స్పందించారన్నారు. బాబు నాడు–నేడు 04–5–2018న.. మనుషులకు భయం ఉండాలి. భయం లేకపోతే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో పోలీసును పెట్టలేం. నేను అందుకే హెచ్చరిస్తున్నా.. భవిష్యత్తులో ప్రతిఒక్క పోలీసు, సిటిజన్ గుర్తుపెట్టుకోవాల్సింది. క్రమశిక్షణ, లా అబైడింగ్ (చట్టానికి కట్టుబడి) ఉండాల. 22–4–2022న.. ఆడబిడ్డలకు రక్షణ లేకుండాపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో శాంతిలేకుండా ఉండే పరిస్థితికి వస్తోంది. దీన్ని అందరం కూడా సీరియస్‌గా తీసుకోవాలి్సన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి్సంది.. ఒక పేద బాధితురాలకు న్యాయం చేయాలి. మీకు సిన్సియారిటీ ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే ఒక స్పెషల్ కోర్టు వేయండి. నీతి, నిజాయితీ ఉంటే నిరూపించుకోండి. వెయ్యకపోతే ఏం చేయాలో దీన్ని ఇక్కడ వదిలిపెట్టం. ఎట్టిపరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. బాబు, బొండాకు మహిళా కమిషన్ సమన్లు అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడంపై కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పలువురు నేతలు వాసిరెడ్డి పద్మను ఇష్టానుసారంగా దూషించడం, అత్యాచార బాధితురాలి వద్ద రాజకీయం చేయడం తదితర పరిణామాలను తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా రావాలని వాసిరెడ్డి పద్మ ఆ సమన్లలో ఆదేశించారు. చదవండి👉 మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి -
గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: గురజాల రైల్వే హాల్ట్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు. -
గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: గురజాల రైల్వే హాల్ట్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మ రం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు. -
పచ్చ రంగు, పిచ్చి గెడ్డం.. బాబుని ఉతికారేసిన వాసిరెడ్డి పద్మ
-
ముందు ఇంటిని చక్కదిద్దాలి!
మానవ పరిణామక్రమం, అభి వృద్ధిలో పడుతూ, లేస్తూ చేసిన ప్రయాణంలో స్త్రీపురుషులిద్దరూ భాగస్వాములే! కానీ మనిషి చరిత్ర అంటే... మగవారి చరిత్రే అన్న అభి ప్రాయం చలామణి అవు తోంది. గడచిన చరిత్రలో వాటా కావాలని మహిళలేమీ ఇప్పుడు అడగడం లేదు. కానీ, వర్తమానం కూడా ఎందుకు ఊపిరి ఆడనివ్వడంలేదని అడుగుతున్నారు. ఒక్క మార్పునకు యుగాలకాలం మా విషయంలోనే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్లనాటి బాలికావిద్య, బాల్యవివాహం వంటివి... సమస్యల జాబితా నుండి ఇప్పటికీ తొలగి పోలేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్‌షిప్‌ల బ్లాక్ మెయిల్, మార్ఫింగ్‌లతో సమస్యల చిట్టా చాంతాడంత పెరిగింది. ఆకాశమే హద్దుగా ఆమెకు అవకాశాలు అంటున్నాం. ఏ స్థానంలో ఉన్నా ఆడతనమే కొలమాన మని ఆంక్షలు పెడుతున్నాం. ఆధునిక మహిళగా మారాలని అంటున్నాం. మల్టీ టాస్క్ ఉమెన్ అని బరువులు మోపుతున్నాం. ఏదయినా సాధించు... వంటిల్లు, పిల్లల విషయంలో మాత్రం సక్సెస్ సర్టిఫికేట్ ఉందా అని దబాయిస్తున్నాం. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ఊరిస్తున్నాం. కానీ, పనిచేసే చోట... కీచకులను కట్టడి చేయలేకపోతున్నాం. ఆమె ఉద్యోగం చేయాలి, జీతంపై హక్కు మాత్రం లేదంటారు. స్వేచ్ఛ ఇస్తున్నాం... కానీ, రిమోట్ కంట్రోల్ మాత్రం తమ చేతిలోనే అంటారు. సృష్టికి మూలం స్త్రీ అంటారు. ప్రాణం తీయడానికి మాత్రం వెనుకాడరు. ఎంతటి ధైర్యలక్ష్మి తల్లులైనా విరక్తితో ముగింపు వాక్యం రాసేలా లొంగదీసి, కృంగదీసి ఆడుకుంది సమాజం, కుటుంబం. తనను తాను మార్చుకుంటూ... తనలో తాను పోటీ పడుతూ... కొత్త మనిషిలా ఆమె... మహిళ విషయంలో రోజురోజుకూ పతన మవుతూ... అనాగరికంగా అతను – కుటుంబాలు ఎందుకు అలజడులతో నిండుతున్నాయో అర్థమవుతోందా? తాకితే నేరం.., కనుసైగ చేసినా నేరమే. అశ్లీల పదం వాడితే శిక్ష... గృహ హింస నుండి రక్షణ. లైంగిక వేధింపు లకు పాల్పడితే ఖేల్ ఖతం. ఇలా ఎన్నెన్నో చట్టాలు... అయినా ఇవన్నీ ఎందుకు మహిళకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి? చట్టం ఉన్నది శిక్షించడానికి! మరి, జీవించ డానికీ? సమాజం ఒక జీవనదిలా ప్రవహించాలి. కొన్నింటిని కలుపుకొంటూ... అడ్డుగా ఉన్న వాటిని పడ దోసుకుంటూ... కొన్నిసార్లు తానే ఒంపులు తిరిగి తప్పు కుంటూ బతకాలి, బతికించాలి... ప్రవహించాలి. చట్టం చేశాం కదా చప్పట్లు కొట్టండి అంటాయి చట్టసభలు. ఆ చట్టం జీవనదిలా కుటుంబాన్ని తాకక పోతే అందులో ఉన్న మహిళకు రక్షణ ఎలా సాధ్యం? ఇదే మనం ఎదుర్కొం టున్న అతి పెద్ద వైఫల్యం. మన దేశంలో మహిళలపై జరిగే నేరాల్లో దాదాపు 90 శాతం గృహ హింసకు సంబంధించినవి. క్రూరంగా, నిర్దాక్షి ణ్యంగా వ్యవహరించే కుటుంబాన్ని నేటి మహిళ నిల దీస్తోంది. తాను గెలవాలని, కుటుంబాన్ని గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. ఇల్లే ఇంత విష వలయంగా ఉంటే ప్రతి మహిళ బయట ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఊహిం చగలమా! ప్రతిరంగంలో దూసుకుపోతున్న అమ్మాయిలు చేస్తున్న అస్తిత్వ పోరాటం ఇప్పుడున్న చట్టాలకు అర్థమవు తోందా? తమను సమాన భాగస్వామిగా గుర్తించమని నిగ్గదీసి అడుగుతున్న నేటితరం అమ్మాయిలకు సూటిగా సమాధానం చెప్పే దమ్ము సమాజంలోని మిగతా సగానికి ఉందా? ఎదురవుతున్న సమస్యలపై పోరాటంలో పడుతూ... లేస్తూ... కెరటమై గెలుస్తూ సాగుతున్నారు. ఈ ప్రయా ణంలో వారికి ఒక దన్ను కావాలి. ఆ అండగా ప్రభుత్వం నిలిస్తే గుణాత్మక మార్పును కళ్లతో చూడగలం. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టం అటువంటి మార్పును మనకు చూపిస్తుంది. పాలకులుగా పెద్ద ఎత్తున మహిళలు ఇప్పుడు ఏపీలో ఉన్నారు. మహిళల అధికారాన్ని అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అందివచ్చిన ఈ అవకాశం ఆసరాగా మహిళా సాధికారతను విస్తరించాలి. ప్రభుత్వం, చట్టం, కుటుంబం... ఈ మూడింటినీ బలంగా అనుసంధానం చేయాలి. ఇందుకోసం ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏడాది పాటూ కార్యాచరణలో ఉండే ‘సబల’ కార్య క్రమాన్ని రూపొందించింది. ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సబల’ కార్యాచరణ ప్రారంభిస్తారు. వాసిరెడ్డి పద్మ వ్యాసకర్త చైర్పర్సన్, రాష్ట్ర మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ -
విజయవాడలో 15వేల మంది మహిళా నాయకులతో సభ
-
4న మహిళా పార్లమెంట్
సాక్షి, అమరావతి: మహిళల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మార్చి 4న మహిళా పార్లమెంట్ నిర్వహించబోతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, క్రీడలు, మీడియా, సినిమా, కళలు తదితర రంగాలకు చెందిన మహిళలు పాల్గొంటారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ నేతృత్వంలో జాతీయ మహిళా కమిషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు చెప్పారు. శనివారం కమిషన్ సభ్యులు, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి.. ఏర్పాట్లపై చర్చించారు. ఎన్జీవోలను కూడా భాగస్వాముల్ని చేయాలని సూచించారు. ఆర్థిక పురోగతి, రక్షణ, ఆరోగ్యం తదితర అంశాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వాలకు సమర్పిస్తామని చెప్పారు. -
కోడలికి అత్తింటి నుంచి జీవనభృతి
సాక్షి, అమరావతి: భర్తను కోల్పోయి, అత్తింటి నుంచి ఆదరణ కరువైన మహిళకు చివరకు రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యంతో న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కలకట మండలం కె.బాటవారిపల్లెకు చెందిన రెడ్డి జాహ్నవికి 2020లో వివాహమైంది. ఆమె భర్త గతేడాది కోవిడ్‌తో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె పోషణ విషయంలో అత్తింటి నుంచి పేచీలు, వేధింపులు తప్పలేదు. దిక్కుతోచని స్థితిలో జాహ్నవి చివరికి రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మికి కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. దీంతో ఇరుపక్షాలను కమిషన్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. చట్టపరమైన హక్కులతో జాహ్నవికి జరగాల్సిన న్యాయంపై అత్తింటి వారిని ఒప్పించారు. దీంతో అత్తవారింటి నుంచి తన జీవనభృతికి సంబంధించి రావాల్సిన మొత్తాన్ని చెక్కు రూపంలో జాహ్నవికి కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. -
దొంగ పాస్టర్లకు ఇక నుంచి చుక్కలే..
-
బాలలపై వేధింపుల నివారణకు చర్యలు
సాక్షి, అమరావతి: తనకు జరిగిన అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విజయవాడ విద్యార్థిని ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఉదంతంపై తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లిన కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విద్యాలయాల్లో బాలబాలికలకు ఏవిధమైన కౌన్సెలింగ్ ఇస్తున్నారనే దానిపై ఆరా తీశారు. చదువుతున్న బాలికల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారా? లేదా? అంటూ మృతురాలు చదువుకున్న విజయవాడలోని ఫిట్జీ స్కూల్ యాజమాన్యానికి సోమవారం నోటీసులు జారీ చేశారు. చిన్నారుల శరీర భాగాలను తాకడం వెనుక దురుద్దేశాలను పసిగట్టేందుకు వారికి తరగతి గదుల్లో అవగాహన కల్పించాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న చర్యలేమిటని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయాన్ని వివరణ కోరుతూ లేఖ రాశారు. బాలలపై వేధింపుల అంశంపై విద్యాలయాల్లో కచ్చితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. తద్వారా వారిలో ధైర్యం నింపి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. -
‘నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘పద్నాలుగేళ్ల పాటు ఏ లోటూ లేకుండా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నా. కేంబ్రిడ్జి చదువులు చదివించాను. ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడుతుంది. ఎంఏ పీహెచ్డీ చదివిన నేను నా విజ్ఞానాన్నంతా నా బిడ్డకు పంచాను. నేను పని చేసే స్కూల్లో బాలికలకు కౌన్సెలింగ్ చేసేదాన్ని. నా బిడ్డకు నేర్పుకోనా? చదువు తప్ప మరో ధ్యాసలేని నా బిడ్డపై కామాంధుడి కళ్లు పడటం ఏమిటి? బిడ్డ భవిష్యత్ కోసం ఎన్నో పూజలు చేశాను. అయినా దేవుడు మాకు అన్యాయం చేశాడు. నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి. మాకు న్యాయం చేయండి’ అంటూ ఆత్మహత్య చేసుకున్న దీక్షిత గౌరి తల్లి అనురాధ.. ఆదివారం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దోషిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. ఈ ఘటన దురదృష్టకరం.. అతన్ని ఉరి తీసినా తప్పు లేదు కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం టీడీపీ నేత ఘాతుకంపై ఆగ్రహ జ్వాల -
ఈ ఘటన దురదృష్టకరం.. అతన్ని ఉరి తీసినా తప్పు లేదు
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య ఘటన అత్యంత దురదృష్టకరమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ నేత వినోద్‌జైన్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి పరామర్శించారు. బాలిక తండ్రి గంగాధర్‌కుమార్, తాతయ్య మాంచాలరావులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాలిక ఎంతో మనోవేదనకు గురైందని, టీడీపీ నేత వినోద్ జైన్ తనను లైంగికంగా ఇబ్బందికి గురిచేసినట్లు సూసైడ్ నోట్లో పేర్కొందని తెలిపారు. మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంతగా మానసిక వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చన్నారు. బాలిక తాతయ్య రిటైర్డ్ తహసీల్దారు అని, పిల్లల కోసం ఏలూరు నుంచి విజయవాడ వచ్చినట్లు తెలిపారన్నారు. 50 ఏళ్లకు పైగా వయసున్న వినోద్ జైన్ దారుణంగా ప్రవర్తించాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వినోద్‌జైన్ ఎంపీ కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్ తరఫున చంద్రబాబు కూడా గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు. బాలిక తల్లిదండ్రుల బాధ చూడలేక పోతున్నామని, దోషిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ వద్ద, మెట్ల వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని, మానవత్వం లేని వ్యక్తికి సంఘంలో చోటు ఉండకూడదన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు దుర్గమ్మ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. చిత్రంలో దీక్షిత గౌరి తల్లిదండ్రులు అతన్ని ఉరి తీసినా తప్పు లేదు బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్ నోట్లో రాసిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు పురిగొల్పిన వినోద్‌జైన్‌ను ఉరితీసినా తప్పులేదన్నారు. వినోద్‌జైన్ దుర్బుద్ధి కారణంగా ప్రతిభావంతురాలైన బాలిక బలైందన్నారు. కుటుంబానికి చెప్పుకోలేని స్థితిలో ఆ బాలిక భయపడి మేడ మీద నుంచి దూకిందంటే ఏ మేరకు వేధించాడో అర్థమవుతోందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతల పేర్లు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే, ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. బాలిక లేఖ చూసే వరకూ వాస్తవం బయటకు రాలేదని, రెండు నెలలుగా శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టాడన్నారు. టీడీపీలో వినోద్‌జైన్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు అహరహం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే టీడీపీ వాళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారని ఆమె ప్రశ్నించారు. మానసిక సంఘర్షణకు నిదర్శనం! బాలిక చనిపోక ముందు తీవ్ర మానసిక వేదనకు గురైందని తెలుస్తోంది. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వినోద్ జైన్ ఇంటిని విచారణ నిమిత్తం సీజ్ చేశారు. బాలిక సూసైడ్ చేసుకునే ముందు సుమారు 20 నిమిషాల పాటు టెర్రస్‌పై అటూ ఇటూ తిరిగినట్లుగా సీసీ కెమెరాలో కనిపించింది. తద్వారా ఆ బాలిక ఎంతో సంఘర్షణకు లోనైనట్లు అర్థమవుతోంది. జైన్‌పై భవానీపురం పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ 306, 354(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, స్థానిక కార్పొరేటర్ రెహమతున్నీసా బాలిక ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. బాలిక తల్లిని ఓదార్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తాత లైంగిక వేధింపులతో దీక్షిత గౌరి (14) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బాలిక తాత, విశ్రాంత తహసీల్దార్ గోవాడ మాంచాలరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రెండో కుమార్తె అనురాధ, అల్లుడు గంగాధర కుమార్, వారి పిల్లలు దీక్షిత గౌరి (14), నందశ్రీ విఘ్నేష్ (10) ఉంటున్న అపార్ట్మెంట్లోని జీ 25 ఫ్లాట్‌కు ఎదురుగా మరో ఫ్లాట్‌లో ఈయన ఉంటున్నారు. అనురాధ వన్‌టౌన్ కొత్తపేటలోని అన్నపూర్ణ మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయినిగా, అల్లుడు గంగాధరకుమార్ ఎన్టీటీపీఎస్లో డీఈఈగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు మాంచాలరావు వాకింగ్ చేస్తుండగా ఎవరో ఒక పాప కిందకు దూకిందని అందరూ అనుకుంటుండగా ఆయనా వెళ్లి చూశారు. కిందకు దూకింది తన మనుమరాలు దీక్షిత గౌరి అని గుర్తించారు. ఆయనకు ఏం జరిగిందో అర్థంకాక కుమార్తె ఉంటున్న ఫ్లాట్‌లోకి వెళ్లి దీక్షిత గౌరి గదిలో చూడగా బెడ్‌పై నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ కనిపించింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్ నోట్‌ను వారికి అందజేశారు. -
బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులతో విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'ఈ ఘటన జరగడం దురదృష్టకరం. బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్ నోట్లో రాసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయి. ఘటనకు కారణమైన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు. చదవండి: (విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య) -
మహిళల అభివృధ్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
దివ్యాంగ వలంటీర్ కుటుంబానికి ప్రభుత్వం అండ
సాక్షి, అమరావతి: వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగ వలంటీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. వివరాలు.. దివ్యాంగురాలైన ఉమ్మనేని భువనేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో వలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. ఆర్థిక ఇబ్బందులు, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, సోదరి కూడా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యింది. గతేడాది డిసెంబర్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును వాసిరెడ్డి పద్మ మంగళవారం భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి అందించారు. -
మహిళాభివృద్ధే సీఎం జగన్ ధ్యేయం
-
ఉద్యోగినులకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి/మంగళగిరి: ప్రభుత్వ ఉద్యోగినుల సమస్యలపై కమిషన్ సత్వర స్పందనతో అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఏపీఎన్జీవో, సచివాలయ మహిళా సంఘాల ప్రతినిధులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయజ్ దీనికి అధ్యక్షత వహించారు. పద్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్ సూచనలతో పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలకు కమిషన్ కసరత్తు చేస్తుందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉద్యోగినులు ఫిర్యాదులు చేయడంలో ముందుంటున్నారని తెలిపారు. కనుసైగ సైతం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని గుర్తెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు.. గజ్జల వెంకటలక్ష్మి, ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి శాంతకుమారి, ఏపీ సచివాలయ మహిళా అసోసియేషన్ వైస్ చైర్పర్సన్ దీపాభవాని, ఏపీ ఎన్జీవో మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు వి.నిర్మలకుమారి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగినులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. కాగా, టీడీపీ నేతల బూతులు హేయమని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని బూతుల తిట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. మహిళల రక్షణ, భద్రత, సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారని కొనియాడారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. -
తండ్రి కొడుకులు ఇద్దరు చేయలేదు
-
ఆ.. పిల్లలను ఆదుకుంటాం
ఆత్మకూరు: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన మెప్మా రిసోర్స్‌పర్సన్ మొద్దు కొండమ్మ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో భర్త కిరాతకానికి బలైన కొండమ్మ కుటుంబీకులను వాసిరెడ్డి పద్మ గురువారం పరామర్శించారు. చిన్నారులైన కొండమ్మ కుమారులు ధనుష్, తరుణ్‌తో పాటు తల్లి పెంచలమ్మను, సోదరులను ఆమె ఓదార్చారు. కొండమ్మ కుమారుడు తరుణ్ గుండెజబ్బుతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్యపరీక్షలు నిర్వహించేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ రోజ్‌మాండ్‌ను ఆదేశించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో పద్మ విలేకరులతో మాట్లాడారు. భార్యను ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించడంతో పాటు ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి పలువురికి పంపడం హేయమైన చర్య అన్నారు. అదే క్రమంలో వైజాగ్‌లో దివ్యాంగురాలిపై జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మి, కమిషన్ డైరెక్టర్ కె.సూయజ్, ఆర్డీవో చైత్ర వర్షిణి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, చైర్పర్సన్ వెంకటరమణమ్మ పాల్గొన్నారు. -
అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం
సాక్షి, అమరావతి: బాలికలపై కన్నతండ్రే అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఘోరమని, ఇటువంటి దారుణాలను తీవ్రంగా పరిగణిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. పోషకాహార మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని జిల్లా జైలును సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలికలు, మహిళలకు సొంతింట్లోనూ భద్రత లేని పరిస్థితులను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో పోక్సోకు మించిన ప్రత్యేక కఠిన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మహిళా సమస్యలను కొందరు రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా భద్రత బాగుందన్నారు. -
విజయవాడలో మహిళా జైలు సందర్శించిన వాసిరెడ్డి పద్మ
-
మృగాళ్లకు ఈ సమాజంలో స్థానం లేదు
సాక్షి,అమరావతి: ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న మృగాళ్ళకు ఈ సమాజంలో స్థానం లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం ఆమె తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ రామకోటినగర్‌లో యువతిపై అమానుషంగా దాడి చేసి, కర్రలతో కొడుతూ హింసించిన ఘటన సీఎం జగన్‌ని చాలా తీవ్రంగా కలచివేసిందన్నారు. విశాఖలో ఇద్దరి బాలికలపై జరిగిన అఘాయిత్యంపై కూడా సీఎం జగన్ స్పందించారని చెప్పారు. ఈ రెండు ఘటనలపై సీఎం స్పందిస్తూ తక్షణం నిందితులను అదుపులోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ ఘటనలపై స్వయంగా బాధితుల పరిస్థితి తెలుసుకున్నానని, పోలీసు అధికారులతో మాట్లాడి, కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనాస్థలాలకు పంపించినట్లు చెప్పారు. -
వరుస దాడులపై సీఎం జగన్ ఆగ్రహం.. తక్షణమే విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి: నెల్లూరు యువతిపై అమానుష దాడి, విశాఖలో తొమ్మిదేళ్ల బాలికలపై జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనలపై వెంటనే స్పందించిన సీఎం జగన్ వెంటనే కఠిన చర్యలకు ఆదేశించారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ దారుణాలకు పాల్పడిన నిందితులను తక్షణం అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఈ రెండు ఘటనల్లో బాధితుల పరిస్థితిని చైర్పర్సన్ స్వయంగా వాకబు చేశారు. పోలీస్ అధికారులతో మాట్లాడి దర్యాప్తు వివరాలను తెలుసుకోడమే కాక కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. -
‘శవాల మీద పేలాలు ఏరుకుంటూ లోకేష్ రాజకీయాలు’
సాక్షి, అమరావతి: ఇప్పుడు లోకేష్ పర్యటన చేయాల్సిన అవసరమేముందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, శవాల మీద పేలాలు ఏరుకుంటూ లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడపిల్లల చావులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి.. ప్రతిపక్షంగా మీకు బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు. ‘‘అన్యాయం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తోంది. జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం. దిశ చట్టాన్ని మీ హయాంలో ఎందుకు తీసుకురాలేదు. దిశ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తున్నామని’’ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇవీ చదవండి: లోకేశ్ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు ! -
ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ విచారణ
సాక్షి,విజయవాడ: ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది. ఎస్ఎస్సీ బోర్డులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్నవేధింపులపై కొద్దిరోజుల క్రితం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఎస్ఎస్సీ బోర్డులో ఉద్యోగిణులు వేధింపులపై వచ్చిన ఫిర్యాదులపై ఆరోపణల వివరాలతో కూడిన విచారణ నివేదికను త్వరలో అందజేస్తామన్నారు. వెంటనే అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. వివిధ శాఖల ఉద్యోగ బాధ్యతల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కానీ మహిళలపై ఇతర వేధింపుల సంఘటనలను సీరియస్‌గా పరిగణిస్తామని తెలిపారు. -
‘సామాజిక’ అనర్థాలపై ‘ఈ నారీ’ అవగాహన
మంగళగిరి: సామాజిక మాధ్యమాల్లో పరిచయాల పట్ల యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో గురువారం ఆ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి హోంమంత్రి ఈ నారీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. అందులో భాగంగా యూనివర్సిటీలు, కళాశాలల్లోని యువతులకు సామాజిక మాధ్యమ పరిచయాలు–అనర్థాలపై రోజుకు పదివేల మందికి అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ ఈ నారీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రమ్య హత్యను కొందరు రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. జాతీయ కమిషన్ ప్రభుత్వ పనితీరుకు 200 మార్కులు ఇచ్చిందని, ప్రతిపక్షపార్టీలకు అది కనిపించలేదా అని ప్రశ్నించారు. మహిళకు ఓ పోలీసును కాపలా పెట్టాలా అని ప్రశ్నించిన చంద్రబాబుకు నేడు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఎంత ఉపయోగమో.. అంత అనర్థం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ యువకుడు 200 మంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగిన విషయాన్ని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగమో అంత అనర్థం కూడా ఉందని గ్రహించాలని కోరారు. ఇప్పటికే దిశ యాప్, దిశ చట్టంతో రాష్ట్రంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారన్నారు. ప్రతి యువతి, మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సమాజంలో సామాజిక బాధ్యత కొరవడిందని, నడిరోడ్డులో రమ్యపై దాడి జరుగుతుంటే ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రజలలో సామాజిక బాధ్యత పెరిగి మహిళలపై దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం (నేడు) నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు, యువతులపై దాడుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగేందుకు వివిధ రంగాల ప్రముఖులతో అన్ని జిల్లా కేంద్రాల్లో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ పద్మావతి, డైరెక్టర్ సియాజ్, కార్యదర్శి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
బాధితురాలికి అండగా ప్రభుత్వం
అల్లిపురం (విశాఖ దక్షిణ)/ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లా, చౌడువాడకు చెందిన రాములమ్మ, ఆమె సోదరి, సోదరి కుమారుడిని సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ పి.వి.సుధాకర్‌ను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. మెరుగైన చికిత్స అందుతోందని, ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీ పూర్తయిందన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించారని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు మహిళలు పనిచేసే ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. సోమవారం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు. -
‘మహిళా ఉద్యోగులకు వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి’
సాక్షి, విశాఖపట్నం: మహిళా ఉద్యోగుల వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి సారించిందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆమె సోమవారం మీడియాతో మట్లాడుతూ.. అంతర్గత కమిటీలపై కమిటీలు వేస్తున్నామని తెలిపారు. దిశా యాప్, స్పందన, వాలంటీర్ ద్వారా ఎన్నో ఘటనలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బాలికలు దగ్గర నుంచి పండు ముసలి వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. చదవండి: బీజేపీ విధానాలను తిప్పికొడతాం: రాఘవులు రాజకీయం రంగంలో పురుషులకు సమానంగా మహిళలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా సాధికారత కోసం మహిళా కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగినా స్పందించని చంద్రబాబు, ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. చదవండి: లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష -
నవ యుగానికి నాంది పలికిన జగన్
సాక్షి, అమరావతి: మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా నవ యుగానికి నాంది పలికిన వైతాళికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలోని మీడియా పాయింట్లో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాజకీయ, నామినేటెడ్ పదవులు, ఆర్థిక, సామాజిక రంగాల్లో అర్థ భాగం రాసిచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రతి మహిళ సోదరుడిగా ఆదరించి తమ మనసులోనే రాఖీ కట్టి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అప్పుడు ఆడబిడ్డలు గుర్తు రాలేదా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లకు ఆడబిడ్డలు గుర్తు లేరని, అధికారం పోయాక ఇప్పుడు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పద్మ దుయ్యబట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అడపాదడపా ఏదో ఒక శాంతిభద్రతల సమస్య వస్తుంటుందని.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నట్టు ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2014 –2019 మధ్య రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరిగాయి, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది మహిళలకు న్యాయం చేశారనే అంశాలపై చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2020–2021లో గతం కంటే 4 శాతం నేరాలు తగ్గాయని వివరించారు. మహిళలపై ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారని, వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి దోషులకు శిక్షలు పడేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వివరించారు. దిశ చట్టం ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఆమోదం కోసం ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి తేవాలని కోరారు. మహిళా కమిషన్ డైరెక్టర్ సూయిజ్, అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ మహిళా పక్షపాత ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ
-
వైఎస్సార్సీపీ మహిళా పక్షపాత ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని తెలిపారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్ల మహిళా లోకానికే తీరని అన్యాయం జరుగుతోందని తెలిపారు. గతంలో చంద్రబాబు పాలనలో మహిళలకు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. చదవండి: సంక్షేమ పథకాలు ఆపేందుకు టీడీపీ కుట్ర మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందని గుర్తుశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ ఎప్పుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. లోకేష్, టీడీపీ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండేళ్లలో 4శాతం క్రైం రేటు తగ్గిందని, మహిళా సాధికారత అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిందే సీఎం జగన్ అని పేర్కొన్నారు. దిశా చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి.. అన్ని పార్టీలు సహకరించాలని వాసిరెడ్డి పద్మ తెలిపారు. చదవండి: చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం -
లోకేష్ ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థం కాదు
తూర్పుగోదావరి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసును టీడీపీ రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా..అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఏంమాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థంకాదని మండిపడ్డారు. -
రమ్య హత్య ఘటన చాలా బాధాకరం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: జీజీహెచ్‌లో బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. తర్వాత మంత్రి సుచరిత.. రమ్య కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేయడం బాధాకరమని అన్నారు. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారని పేర్కొన్నారు. హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని, మహిళను హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని, రమ్య హత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారని తెలిపారు. రమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసిన వ్యక్తికి ఉరి వేయాలని అందరూ అంటున్నారని, కచ్చితంగా అలాంటి శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తాం: వాసిరెడ్డి పద్మ బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని, నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
అత్యాచార బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్
వైఎస్సార్ కడప: కడప జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలిచింది. జిల్లా ఎస్పీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాలిక తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ బాధిత బాలికను పరామర్శించారు. -
ఏపీలో పెట్టుబడులకు బ్రిటన్ ఆసక్తి: సీఐఐ వెల్లడి
సాక్షి, అమరావతి/మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్ ప్రకటించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)తో పాటు ఇతర పారిశ్రామిక ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో ఏపీలో పర్యటిస్తోన్న ఏపీ, తెలంగాణ బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బృందం సోమవారం సమావేశమైంది. ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులపై బ్రిటన్ బృందం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సీఐఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రా భోజనం అదుర్స్.. విజయవాడకు వచ్చిన ఆండ్రూ ఫ్లెమింగ్‌తో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ పనితీరు, మహిళా సాధికారిత కోసం తీసుకుంటున్న చర్యలను ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో బ్రిటిష్ కమిషన్ పొలిటికల్ అడ్వైజర్ నళిని రఘురామన్, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయిజ్ ఉన్నారు.అలాగే, గుంటూరు జిల్లా కాజ గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉన్న మురుగన్ హోటల్‌ను ఆండ్రూ ఫ్లెమింగ్ సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు హోటల్‌కు వచ్చిన ఆయన ఆంధ్ర వంటకాలను ఇష్టంగా తిన్నారు. ఆంధ్ర భోజనం చాలా బాగుందని కితాబిచ్చారు. అనంతరం ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. -
బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
-
తేజస్వినిని వెంకటేశ్ హత్య చేశాడు: డీఎస్పీ
సాక్షి, నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ''తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్‌తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్‌కు దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వెంకటేష్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ ఇదిలాఉంటే తేజశ్విని కుటుంబసభ్యులను మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం పరామర్శించారు. 'ఇలాంటి ఘటనలను సమాజం తీవ్రంగా పరిగణించాలి. ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమోన్మాది వెంకటేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలి' అని ఆమె పేర్కొన్నారు. -
మహిళ కమిషన్ చైర్పర్శన్ను కలిసిన సంచయిత గజపతిరాజు
-
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంచయిత
సాక్షి విశాఖపట్నం: సంచయితపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష అనాగరికమని అన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు బుధవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. విశాఖలో కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని సంచయిత ఆరోపించారు. సంచయిత ఫిర్యాదుపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ బైలా పునః సమీక్షించాలని అన్నారు. సంచయిత విషయంలో అశోక్ చర్చకు సిద్దమా? అని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. చదవండి: ‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’ అనంతపురం జిల్లాలో ఉద్యాన విప్లవం -
బద్వేల్ ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వేల్లో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన శిరీష ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. ఇటీవల ప్రేమోన్మాది చేతిలో శిరీష హత్యకు గురైన విషయం తెలిసిందే. చదవండి: వైఎస్సార్ కడప: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది -
సంచయితకు బాసటగా మహిళా కమిషన్
సాక్షి,అమరావతి/నెహ్రూనగర్ (గుంటూరు): మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బోర్డు నుంచి సంచయితను కోర్టు తప్పించడంపై టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆమె కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సంచయితకు మహిళా కమిషన్ బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం గడిచిన రెండేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధిని సీఎం కోరుకుంటే.. టీడీపీ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
మహిళల ఆరోగ్యానికి భరోసా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వల్ల మహిళల ఆరోగ్యానికి భరోసా లభిస్తోందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలకు ఏ విధంగా భరోసా కల్పించాలనే అంశంపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్లతో గురువారం వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు వివరించారు. జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్‌ను దేశ వ్యాప్తంగా 900 మంది గర్భిణులు సహాయం కోరగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 50 మంది ఉన్నారని, వారికి తక్షణ వైద్య సహాయం అందే విధంగా ఏపీ మహిళా కమిషన్ కృషి చేసిందని తెలిపారు. ఏపీ మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయజ్ మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వంతోపాటు మహిళా కమిషన్, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెబినార్‌లో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ మాట్లాడుతూ గర్భిణులకు వైద్యసహాయం అందించడంలో హెల్ప్‌లైన్ ద్వారా కృషి చేసిన ఏపీ మహిళా కమిషన్‌ను అభినందించారు. -
లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా జీజీహెచ్ సూపరింటెండెంట్ వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. అతడి బాధితులు నిర్భయంగా మహిళా కమిషన్‌కు వివరాలు వెల్లడించాలని చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. ఫిర్యాదులు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. సూపరింటెండెంట్ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో గురువారం బహిర్గతమైన విషయం తెలిసిందే. -
పేదవాడి భరోసా.. సీఎం జగన్: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదవాళ్లకు పెద్ద భరోసా.. సీఎం వైఎస్ జగన్ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందారని పేర్కొన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి.. అందులోని హామీలను రెండేళ్లలోనే నెరవేర్చిన ఘనత సీఎం జగన్ సొంతమన్నారు. చెప్పినవే కాకుండా.. చెప్పనివి కూడా అమలు చేసి.. సీఎం జగన్ ప్రజలకు లబ్ధి చేకూర్చారని వివరించారు. కాగా, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఇంత మంది కుట్రలు పన్నుతున్నారంటే.. ఆయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. -
చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ
-
చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె ఆదేశించారు. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ నయీం హస్మీతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. తన ఇద్దరు భార్యలు సుమతి, జయమ్మలపై భర్త కళ్యాణం వెంకన్న చేసిన పాశవిక దాడి అమానుషమన్నారు. ఇద్దరిని పెళ్లాడటం తప్పు అని.. అనుమానాలతో భార్యలపై మృగంలా ప్రవర్తించి అత్యంత క్రూరంగా చిత్రహింసలకు గురిచేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భార్యలను చిత్రహింసలు పెడుతూ మరో వ్యక్తితో సెల్లో వీడియో తీయించడం మరీ దారుణమన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చదవండి: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి! చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం? -
మహిళా ఉద్యోగుల కోసం ఫిర్యాదుల కమిటీలు
సాక్షి,అమరావతి: అన్ని ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వీలుగా అంతర్గత కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లకు శుక్రవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి మహిళా ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అందువల్ల ఫిర్యాదుల కమిటీలను తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడం కాకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ శాఖాధిపతులు చూడాలని, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు మహిళా కమిషన్‌కు పంపాలని ఆదేశించారు. -
అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
సాక్షి, గుంటూరు: డిగ్రీ విద్యార్థిని అనూష సంఘటన అందర్నీ కలచివేస్తోందని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారం ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో అనూష కుటుంబ సభ్యులను మహిళా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా స్పందించారని తెలిపారు. నిందితుడికి శిక్ష వెంటనే పడేందుకు దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని సమాజమంతా కోరుకుంటుందని, అనూష కుటుంబానికి ధైర్యం చెప్పామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. చదవండి: అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు! -
స్నేహలత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గురువారం చెప్పారు. దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచార ఘటనల్లో చట్టపరంగా రూ.8.25 లక్షల పరిహారం అందజేస్తారు. దీనికి సీఎం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అదనమని మంత్రి తెలిపారు. పక్షపాతానికి తావివ్వకుండా త్వరితగతిన కేసును దర్యాప్తు చేయాలని పోలీసుశాఖను సీఎం ఆదేశించారని చెప్పారు. స్నేహలత కుటుంబానికి చట్టప్రకారం వచ్చే రూ.8.25 లక్షల్లో తక్షణసాయంగా రూ.4,12,500 అందజేస్తున్నామన్నారు. స్నేహలత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంటి స్థలం, ఇల్లు, ఐదెకరాల పొలం ఇస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి మూడు నెలలకు సరిపడా వందకిలోల బియ్యం, పదిలీటర్ల వంటనూనె, పదికిలోల చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందించినట్లు తెలిపారు. చదవండి: (యువతి దారుణ హత్య) నిందితులకు కఠినశిక్ష పడేలా చూస్తాం స్నేహలత హత్యపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించి నిందితులకు కఠినశిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గురువారం ఆమె అనంతపురంలో స్నేహలత కుటుంబసభ్యులను పరామర్శించారు. మరో నిందితుడు కార్తీక్ అరెస్టు స్నేహలత హత్యకేసులో మరో నిందితుడు సాకే కార్తీక్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.సత్యయేసుబాబు మీడియాకు తెలిపారు. -
స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు
సాక్షి, అనంతపురం : దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మృతదేహానికి నివాళులు అర్పించిన వాసిరెడ్డి పద్మ... బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వైద్య విద్యార్థిని రిసితేశ్వరి చనిపోతే కేసు కూడా నమోదు చేయని చరిత్ర చంద్రబాబు నాయుడిది. అలాంటిది స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు చేస్తోంది. హత్య ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాం. చదవండి: స్నేహలత హత్య కేసు: కార్తీక్ అరెస్ట్ దిశ చట్టం ద్వారా వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు అవుతుంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ...స్నేహలత హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం, మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరోవైపు ఈకేసులో నిందితులు ఉన్న రాజేష్, కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. -
‘డర్టీ హరి’పై వాసిరెడ్డి పద్మ సీరియస్
సాక్షి, విజయవాడ : ‘డర్టీ హరి’ సినిమా వాల్ పోస్టర్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత, దర్శకుడు, అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలపై కేసు నమోదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గుంటూరు ఉండవల్లి సెంటర్లో, ఇతర పట్టణాలలో అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు. (చదవండి : డర్టీ హరి మూవీ రివ్యూ) -
భువనేశ్వరి మృతి అనుమానాలు రేకెత్తిస్తోంది
సాక్షి, ఒంగోలు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వాలంటీర్ ఉమ్మనేని భువనేశ్వరి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ...‘ భువనేశ్వరి మృతిపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. మృతి చెందిన తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి దారుణమైన సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించబోదు. ( 'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం' ) భువనేశ్వరి కేసు విచారణను వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షిస్తాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. కాగా, దశరాజుపల్లికి వెళ్లే దారిలో అప్పాయకుంట వద్ద శుక్రవారం రాత్రి ఏడు- ఎనిమిది గంటల ప్రాంతంలో భువనేశ్వరి ట్రై సైకిల్ పైనే సజీవ దహనమైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా కొర్రపాడులో వేధింపులకు బలైన 10 వ తరగతి విద్యార్థి సౌమ్య కుటుంబాన్ని , ఒంగోలులో అనుమానాస్పద స్ధితిలో సజీవదహనమైన భువనేశ్వరి కుటుంబాన్ని పరామర్శించి , విచారణ వేగవంతం చెయ్యాలని ఎస్పి లను కోరటం జరిగింది. pic.twitter.com/XNaX6hkGJz — Vasireddy Padma (@padma_vasireddy) December 20, 2020 -
'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం'
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన సౌమ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి శనివారం ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'వరప్రసాద్ ప్రేమ వేధింపులకు గురై సౌమ్య చనిపోవడం బాధాకరం. సౌమ్య మృతిపై ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాం.. వారి బాధ వర్ణణాతీతం. ఈ విషయం ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించిన సౌమ్య ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంది. ఈ నేపథ్యంలో వరప్రసాద్ వేధింపులు ఎక్కువవడంతో భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా డాక్టర్లు సౌమ్యను బతికించడానికి తీవ్రంగా కృషి చేశారు. వెంటిలేటర్ పై ఉన్నప్పుడు తాను పడ్డ బాధను సౌమ్య వీడియోలో చెప్పింది.(చదవండి :‘దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’) సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే పోలీసులు వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.. వారం రోజులలో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేస్తారు. గ్రామంలో ఆకతాయిలు వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మా దృష్టి కి తెచ్చారు.. వెంటనే పికెట్ ఏర్పాటు చేయమని పోలీసులను ఆదేశించాం. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయంను అందిస్తాం. మహిళల రక్షణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఒంగోల్ లో జరిగిన భువనేశ్వరి సజీవదహనం అనుమానాస్పదంగా ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒంగోలు వెళ్తున్నానంటూ ' తెలిపారు. -
వినూత్నం.. ప్రపంచంలోనే మొదటిసారి
సాక్షి, విజయవాడ: మార్చి 8న వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా వంద రోజుల కార్యాచరణ రూపొందించినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ప్రతీ జిల్లాలో మహిళలకు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం వైఎస్ జగనేనని తెలిపారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, మహిళా చైతన్యం కోసం దిశ చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. మహిళల భద్రతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. (చదవండి: ‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం) ప్రపంచంలోనే మొదటిసారి... కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ మహిళల కోసం వినూత్నంగా వంద రోజుల కార్యచరణ ప్రపంచంలోనే మొదటిసారి అని, మహిళా కమిషన్ నిర్ణయం మహిళల సాధికారతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మహిళలకు అందేలా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జాయింట్ కలెక్టర్ మాధవీలత అన్నారు. మహిళలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు చాలా జరగాలని జేసీ కోరారు. -
ప్రేమ మోజులో పడి యువత పెడదోవ పడుతోంది
-
‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం
ఒంగోలు అర్బన్/ఒంగోలు టౌన్: మహిళల భద్రతతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమాన్ని శుక్రవారం ఒంగోలులో ఆమె ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌తో కలిసి మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ మహిళా మార్చ్‌లో దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల రక్షణ, సంక్షేమంపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు. ‘రాజమండ్రి ఘటన’పై కౌన్సెలింగ్ రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ తరగతి గదిలో ఇంటర్ చదువుతున్న మైనార్టీ తీరని బాలుడు ఓ బాలికకు తాళి కట్టడం అందరికీ ఒక షాకింగ్‌లా కనపడిందని, ఈ ఘటనపై ఇరుపక్షాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఒంగోలు ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఘటనపై అధికారులతో తాను మాట్లాడినట్లు చెప్పారు. రెస్క్యూ చేసి ఆ బాలికను ఒక హోమ్‌లో ఉంచుతామన్నారు. -
మైనారిటీ తీరకముందే యువత పెడదొవపడుతుంది
సాక్షి, ప్రకాశం: మైనారిటీ తీరకముందే యువత ప్రేమ మోజులో పడి పెడవదోవ పడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న రాజమహేంద్రవరం ప్రభుత్వ కళశాల తరగతి గదిలో విద్యార్థులు పెళ్లి చేసుకున్న సంఘటన చూసి షాకయ్యానన్నారు. మైనర్ బాలిక, బాలుడు తీరు తప్పైనప్పటికి బాలికకు ప్రభుత్వం నుండి రక్షణ కల్పించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. బాలికతో పాటు ఇంటి నుంచి వెలివేసిన తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. సమాజంలో మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు.. మోసాలపై వార్డు గ్రామ, మండల.. పట్టణ స్థాయి వరకు పరిస్థితులను పరిశీలించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళలకు అండగా ఉన్న చట్టాలపై గ్రామీణ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని వాసిరెడ్డి పద్మా తెలిపారు. -
వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్ విడుదల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ‘వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్’ను విడుదల చేశారు. ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్లపై ...మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నారు. వంద రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్ నేరాలపై మహిళా కమిషన్ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్ సుయజ్ పాల్గొన్నారు. -
జ్యోత్స్న అను నేను..
నెహ్రూ నగర్ (గుంటూరు): ‘జ్యోత్స్న అను నేను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తాను. మహిళా చట్టాలపై వారికి అవగాహన కల్పిస్తాను. మహిళా కమిషన్ ద్వారా ఆడ పిల్లలకు, మహిళలకు ధైర్యం కల్పిస్తాను’ అని జాతీయ విలువిద్య క్రీడాకారిణి కె.జ్యోత్స్న అన్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లల హక్కులపై అవగాహన కల్పించేందుకు ‘పిల్లల కోసం.. పిల్లల యొక్క.. పిల్లల చేత’ అనే ఇతివృత్తంతో యునిసెఫ్, మహితా ఆర్గనైజేషన్, అలయన్స్ ఫర్ చిల్డ్రన్ రైట్స్, మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కిశోర బాలికలు శుక్రవారం ఒకరోజు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. బాలికలు కన్న కలల్ని నిజం చేయడానికి, వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించడానికి మహిళా కమిషన్ అన్నివిధాలుగా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ఆడ పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని జాగృతులను చేస్తున్నట్టు చెప్పారు. అనాథ ఆశ్రమంలో ఉంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్న బాలికలకు ఒకరోజు చైర్పర్సన్, కమిషన్ సభ్యులుగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించటం ఆనందాన్నిచ్చిందన్నారు. మహిళా కమిషన్ ఒకరోజు సభ్యులుగా నైని సుచరిత, కె.ఎస్తేరురాణి, ఎ.సిరివెన్నెల వ్యవహరించారు. -
'టేక్ ఓవర్' పేరుతో మహిళా కమిషన్ వినూత్న కార్యక్రమం
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ 'టేక్ ఓవర్' పేరుతో శుక్రవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాధ పిల్లలను మహిళా కమిషన్ చైర్మన్, మెంబర్లను సీట్లో కూర్చోబెట్టి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ 'టేక్ ఓవర్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. పిల్లలో ఏం ఊహించుకుంటున్నారో వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టి వారిలో భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం అని అన్నారు. ('బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే') నవజీవన్ బాలభవన్, కేర్ అండ్ షేర్ అనాధాశ్రమం నుంచి విద్యార్థుల్ని తీసుకువచ్చామని తెలిపారు. జ్యోత్స్న చైర్మన్‌గాను, మిగిలిన పిల్లలు నెంబర్లుగానూ వారి సీట్లలో కూర్చున్నట్లు పేర్కొన్నారు. జ్యోత్స్న 30 అవార్డులతో పాటు విలువిద్యలో రాష్ట్రపతి అవార్డు పొందిన విద్యార్థిని అని తెలిపారు. అటువంటి విద్యార్థిని మహిళా కమిషన్ చైర్మన్ కుర్చీలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వాళ్లంతా మహిళల రక్షణ కోసం నిలబడతాం పాటుపడతారని చెప్పారు. ఇది మహిళా కమిషన్ తొలి అడుగు మాత్రమే అని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ వివరించారు. ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్') -
అఖిల్‌ను వెంటపడవద్దని హెచ్చరించినా..
సాక్షి, విశాఖ : ఉన్మాది చేతితో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గాజువాక శ్రీనగర్ కాలనీలో వరలక్ష్మి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘వరలక్ష్మి హత్య అమానుషం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. దిశ చట్టం ప్రకారం నిందితులపై పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు దిశ చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడుతుంది. ఏడాది క్రితం అఖిల్‌ను తమ కుమార్తె వెంట పడవద్దని వరలక్ష్మి కుటుంబీకులు హెచ్చించినా అతడి వైఖరి మారలేదు. అయినా ఈ దారుణానికి ఒడిగట్టాడు. (చదవండి : పక్కా ప్లాన్‌తోనే వరలక్ష్మిని హత్య చేశాడు..) ఈ హత్యలో అఖిల్ తండ్రి పాత్రపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆపదలో ఉన్న యువతులు దిశ యాప్‌ను వినియోగించుకోవాలి. ప్రేమ పేరిట దాడుల నియంత్రణకు విద్యార్థులకు కౌన్సిలింగ్ అవసరం. ఇలాంటి ఘటనకు కారణమైన అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది. బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 10 లక్షల పరిహారం ప్రకటన ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే.’ అని అన్నారు. (చదవండి : వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు) ఈ ఘటనను విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం పోలీసు అధికారులు వెంటనే స్పందించిన తీరును అభినందించారు. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా సమాజంలో అన్ని వర్గాలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. మరోవైపు పోస్ట్‌మార్టం అనంతరం వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. విగతజీవిగా ఉన్న కూతురిని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న హోమంత్రి సుచరిత మోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హోంమంత్రి మేకతోటి సుచరి ఈ రోజు రాత్రి విశాఖపట్నంకు బయలుదేరారు. రేపు ఉదయం 10 గంటలకు గాజువాక చేరుకొని వరలక్ష్మి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. ఇప్పటికే దాడి చేసిన ప్రేమోన్మాది అఖిల్ సాయి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
గాజువాక: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగింది. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని తేలింది. వరలక్ష్మిపైన అనుమానంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. (మరదలితో రెండో పెళ్లి.. నిప్పంటించిన మొదటి భార్య) కాగా.. సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం హత్య చేసినట్టు వెల్లడైంది. మరో వైపు ఊహించని ఈ పరిణామంతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్‌ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సుచరిత గుంటూరు: విశాఖపట్నం ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్) శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపు ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మికి నివాళి అర్పిస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. వరలక్ష్మికి మద్దతుగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. -
దివ్య, స్వామి మంచి స్నేహితులు
సాక్షి, విజయవాడ : నగరంలో చోటు చేసుకున్న ప్రేమోన్మాదం ఘటనపై బాధితురాలి సోదరుడు స్పందించాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి తమకు చిన్నప్పటి నుంచి తెలుసునన్నాడు. దివ్య, చినస్వామి మంచి స్నేహితులని, అతడెందుకు ఉన్మాదిలా ప్రవర్తించాడో తెలియడం లేదన్నాడు. తన చెల్లెలి చావుకు కారణమైన స్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నాం: సీపీ నగర కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకి చేరుకుని బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. వారి వద్దనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘11.30 మధ్య దాడి జరిగిందని సమాచారం వచ్చింది. నిందితుడు నాగేంద్రబాబు అలియాస్ స్వామి దివ్య తేజస్విని గొంతుపై కత్తి దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆసుపత్రిలో చనిపోయింది. అతడు కూడా కత్తితో పొడుచుకోవటంతో పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఎవరూ లేరు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నా’’మని తెలిపారు. ( బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది ) దివ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ప్రేమోన్మాది దాడిలో బలైన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర వారిని కలిసి మాట్లాడి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
దోషులను కఠినంగా శిక్షిస్తాం
ముదినేపల్లి రూరల్ (కైకలూరు)/సాక్షి, అమరావతి: ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన యువకుడిని, అతడికి అండగా నిలుస్తున్నవారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ప్రేమికుడి చేతిలో మోసపోయిన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఐనంపూడికి చెందిన దళిత యువతిని ఆదివారం ఆమె ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా యువతి మోసపోయిన వైనం, ఇల్లును నిందితులు తగులబెట్టడం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే.. ► యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ► యువతికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆర్థిక సాయం అందించడంతోపాటు అన్ని విధాలా అండగా నిలిచింది. ► రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని టీడీపీ రాజకీయం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది. ► దళితులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ► కాగా, ప్రభుత్వం తమకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడిందని బాధిత కుటుంబం సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ట్వీట్ చేశారు. -
గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి
వెలుగోడు/గుంటూరు రూరల్: గిరిజన మహిళ (45)పై ముగ్గురు గిరిజన యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం నల్లమల అటవీ శివారు ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ► వెలుగోడు జమ్మినగర్ తండాకు చెందిన భార్యాభర్త గాలేరుపై నిర్మిస్తున్న వంతెన వద్ద వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ► దీని పక్కనే ఉన్న గూడెంలో కొందరు నాటుసారా కాస్తున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని నారపురెడ్డికుంట గూడేనికి చెందిన కొంతమంది జూలై 31 అర్ధరాత్రి భర్తపై దాడి చేసి భార్యపై లైంగికదాడికి ఒడిగట్టారు. ► సోమవారం వెలుగోడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసింది. ► దీంతో పోలీసులు తోట నాగన్నతోపాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇంకొకరి కోసం గాలిస్తున్నారు. ► కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. -
‘సీఎం జగన్ పాలన మహిళలకు స్వర్ణ యుగం’
సాక్షి, అమరావతి : మహిళల రక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ హోశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఆయన నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ-రక్షాబంధన్ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించామని, రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థినులకు సైబర్ నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మహిళల రక్షనకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు సైబర్ నేరాలపై ఎలా పిర్యాదు చేయాలో కూడా అవగాహన కల్పిస్తామని అన్నారు. దిశా చట్టం ద్వారా మహిళలపై అరాచకాలకు అడ్డుకట్ట వేస్తున్నామని, అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఒక అన్నగా అండగా నిలుస్తున్నారని మేకతోటి సుచరిత తెలిపారు. (‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్) రక్షా బందన్ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు మరిన్ని వరాలు ఇచ్చారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మహిళా పక్షపాత పాలన నడుస్తోందని, సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన మహిళల సంక్షేమానికి ఎన్నో చేశారని ప్రశంసించారు. ఆగస్ట్ 15న 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిగా దిశా చట్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని కొనియాడారు. వైఎస్సార్ చేయూత, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల సొంతమని, వారి రక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. దానిలో భాగంగా నేడు ఈ- రక్షాబంధన్ ప్రారంభించారన్నారు. వైఎస్ జగన్ పరిపాలన మహిళలకు స్వర్ణయుగం లాంటిదని. మద్యపాన నిషేధం దిశగా చేపడుతున్న ప్రభుత్వ చర్యలు మహిళల జీవన స్థితిని మారుస్తున్నాయని తెలిపారు. (శ్రీదేవి ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్) -
శ్రీదేవి ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కించపరుస్తూ ఇటీవల వచ్చిన కథనాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం లేఖ రాశారు. గురువారం వాసిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. తనకు సంబంధం లేని కేసుల విషయంలో తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని డీజీపీ సవాంగ్‌ను మహిళా కమిషన్ కోరింది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులుగా ఉన్న మహిళలపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదుపై వెంటనే స్పందించి విచారణ జరపాలని డీజీపీకి రాసిన లేఖలో వాసిరెడ్డి పద్మ కోరారు. (చదవండి: ప్లాస్మా దాతలకు రూ.5వేలు: సీఎం జగన్) -
‘దిశ’తో నిందితులకు శిక్ష పడేలా చేస్తాం
రాజమహేంద్రవరం క్రైం: బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడికి చెందిన బాలిక సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురై, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పద్మ ఆదివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ► ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తాం. ► మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చట్టాలు తీసుకువచ్చారు. దీనిలో దిశ చట్టం ఒకటి. ► ఈ చట్టం కింద దోషులను కఠినంగా శిక్షిస్తాం. ► ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. -
డీజీపీని కలిసిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. మహిళా కమిషన్ దృష్టికి వచ్చిన కేసుల వివరాలను డీజీపీకి తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న కేసులపై డీజీపీతో చర్చించినట్టు చెప్పారు. గుంటూరులో నగ్న వీడియోల కేసు మరవకముందే మరో కేసు నమోదు అయిందన్నారు. కేసులకు సంబంధించి పోలీసుల పాత్రపై విచారించి చర్యలు తీసుకోమని డీజీపీని కోరినట్టు వెల్లడించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. (‘నాడు – నేడు’పై మన కల నిజం కావాలి: సీఎం జగన్) ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. దిశా యాప్‌ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సైబర్ నేరాలకు పాల్పడేవారిపై మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు.(‘కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధం’) -
దీన్ని బ్లాక్ డేగా చెప్పుకోవాలి: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని పండగలా జరపాలనుకున్నామని.. ఇలాంటి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు అడ్డు పడటం దారుణమని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని ‘బ్లాక్ డే’ గా చెప్పుకోవాలని విమర్శించారు. రాజకీయ పార్టీలు తాత్కాలికంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆపవచ్చు గానీ.. ప్రభుత్వం త్వరలోనే చెప్పిన విధంగా అర్హులకు ఇళ్ల పట్టాలను అందిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు వీరోచిత చరిత్ర ఉంది.. ఏదైనా పోరాడి సాధించుకోగలరని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వానికి రాని ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చింది. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చేందుకు సిద్ధం చేసింది. మహిళలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనుకుంది. గత సంవత్సరం కాలం నుంచి మహిళల స్థితిగతులలో మార్పు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు ఈ ప్రభుత్వం 50 శాతం మహిళలకు కేటాయిస్తోంది. అన్ని పథకాలకు సంబంధించిన నగదు నేరుగా మహిళల అకౌంట్లోకే వేస్తోంది. మద్యం అమ్మకాలని గణనీయంగా తగ్గించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. సినీతారలు, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇలా అన్ని రంగాలకు చెందిన మహిళలు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ప్రకటనల్లో తప్ప నిజ జీవితంలో మహిళలను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని ఒక బ్లాక్ డే గా చెప్పుకోవాలి’’ అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజకీయ పార్టీల తీరు దారుణం
-
దివ్యాంగురాలిపై పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మహిళా ఉద్యోగి అని కూడా చూడలేదు.. దివ్యాంగురాలన్న కనీస కనికరం లేదు. ఆవేశంతో మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా అదే శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ దాడి చేశాడు. కార్యాలయ సిబ్బంది అతడ్ని నిలువరించేందుకు యత్నించినా దాడి కొనసాగించాడు. చివరికి సిబ్బంది గట్టిగా ప్రయత్నించి ఆపారు. నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే వారు కేసు నమోదు చేసి డిప్యూటీ మేనేజర్‌ను అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. మాస్క్ ధరించాలని సూచించడమే నేరం పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు కొండాయపాళెం గేట్ సమీపంలోని మిలటరీకాలనీలో చెరుకూరు ఉషారాణి, వీరగంధం హరిబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. హరిబాబు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో బెంగళూరులో ఉంటున్నారు. దివ్యాంగురాలైన ఉషారాణి ఏపీ టూరిజం శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఆమె విజయవాడ నుంచి నెల్లూరు దర్గామిట్టలోని ఏపీ టూరిజం హోటల్‌కు బదిలీ అయ్యారు. అదే హోటల్లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్ సుమారు ఏడు నెలల క్రితం ఆమె గురించి తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు భర్తకు తెలియజేశారు. దీంతో భాస్కర్‌ను హరిబాబు తీవ్రంగా మందలించారు. డిప్యూటీ మేనేజర్ భాస్కర్ గత నెల 27న మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్‌తో మాట్లాడసాగాడు. గమనించిన ఉషారాణి కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్ ఆమెతో గొడవపడ్డాడు. కుర్చీలో ఉన్న ఆమె జట్టు పట్టుకొని కిందపడేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కుర్చీ హ్యాండిల్‌తో కొట్టడంతో ఆమె గాయపడ్డారు. అతికష్టంపై తోటి ఉద్యోగులు అతని బారినుంచి విడిపించి ఆమెను బయటకు తీసుకెళ్లారు. బాధితురాలు దర్గామిట్ట పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ నిందితుడిపై దాడి, నిర్భయతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నిందితుడిని అదే రోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి మంగళవారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు.∙ఘటనపై మంత్రి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించి, నిందితుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఎండీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. న్యాయం జరిగింది: ఉషారాణి దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. వారు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నాకు న్యాయం జరిగింది. మహిళలకు అండగా ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఉషారాణితో మాట్లాడి జరిగిన దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధికారులు పాల్గొన్నారు. దాడి ఘటనపై సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తమకు ఆదేశాలు ఇచ్చారని డీజీపీ తెలిపారు. మహిళలపై దాడులు సహించేది లేదు: హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మహిళలపై దాడులను సహించేది లేదని, తప్పుచేస్తే ఎంతటివారైనా చట్టం ముందు తల వంచాల్సిందేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. -
వేధింపులు పోలీసుల దృష్టికి తేవాలి
సాక్షి, గుంటూరు/పట్నంబజారు(గుంటూరు): మహిళలు, యువతులకు సంబంధించి ఎటువంటి ఘటన జరిగినా త్వరితగతిన చర్యలు చేపట్టడంతో పాటు శిక్షలు తప్పవని, బాధితులు నిర్భయంగా వేధింపుల ఘటనలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ దృఢ లక్ష్యంతో దిశ పోలీసు స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని, వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని నగ్న వీడియోలను పోర్న్ వెబ్‌సైట్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పెట్టి వేధింపులకు గురిచేయడం ఎంతో బాధాకరమన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆమె అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డితో సమావేశమయ్యారు. ఈ కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఘటనపై ఈనెల 20న ఫిర్యాదు అందిన నేపథ్యంలో సాంకేతికపరంగా దర్యాప్తు, నిందితులను విచారణ చేసి వరుణ్, కౌశిక్‌ను 27న అరెస్ట్ చేశారన్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలి
-
‘దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు’
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల వల్ల మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేదని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం, దోషులకు శిక్ష వేయించటమే పని అని తెలిపారు. గుంటూరు ఇంజనీరింగ్ విద్యార్థి కేసులో పోలీసులు వెనువెంటనే స్పందిచారని ఆమె తెలిపారు. కానీ స్టూడెంట్స్ స్థాయిలో ఇలా జరగటం దారుణమన్నారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోక్సో చట్టంతో పాటుగా ఇతర కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయన్నారు ఏఐపీ అడ్రస్ ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుని తల్లిదండ్రులు పోలీసుశాఖకు చెందిన వారే అయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఎవరి ఒత్తిళ్లు తమపై లేవని స్పష్టం చేశారు, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు. -
'ఆయన తప్పించుకున్నా.. న్యాయం జరుగుతుంది'
సాక్షి, విజయవాడ : మహిళా కమిషన్‌కు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళల రక్షణకు సంబంధించిన అంశాలు బుధవారం ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు జరగడంపై సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ విద్యార్థులకు నిరంతర కౌన్సిలింగ్ అవసరమని ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ ప్రభుత్వం మహిళలకు భద్రత, అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపినట్లు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.(యూజీ, పీజీ పరీక్షలపై మంత్రి సురేష్ స్పష్టత ) చిన్నపిల్లలు, మైనర్ బాలికలపై అఘాయిత్యం, అత్యాచార ప్రయత్నాలపై చర్చ జరిగిందన్నారు. సచివాలయాల్లో ఈ అంశంపై కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పినట్లు తెలిపారు. మహిళా సంక్షమానికి స్వచ్చంద సంస్థల సేవలు వినియోగించుకునే రీతిలో ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. మహిళల సాధికారతకు కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయాలని సీఎం సూచించినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. (తెలుగు ప్రజలకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త) అయ్యన్నపాత్రుడు ఓ మహిళా ఉద్యోగిని దూషించిన సంఘటన అందరినీ అభద్రతకి గురి చేసిందన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పించుకున్నప్పటికీ న్యాయం మాత్రం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో నిర్భయ వంటి తీవ్రమైన చట్టం పెట్టినప్పుడు, చర్యలు ఉండవా అని మహిళా లోకం ప్రశ్నిస్తోందన్నారు. మహిళలను కించపరిచి మాట్లాడే వాళ్ళు భయపడే విధంగా చర్యలు కఠినంగా ఉండాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. (గుడ్‌న్యూస్: మరింత పెరిగిన రికవరీ రేటు) -
ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్న దొరికారు
సాక్షి, అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. నిర్భయ చట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ► విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా దొరికారు. ► అలాంటి వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు పెడితే వెనుకేసుకొస్తారా? ► మహిళా ఉద్యోగులంటే టీడీపీకి అంత చులకనా? మహిళా అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు? ► మా వాళ్లపై రాజకీయ దురుద్దేశంతో కేసులు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ వద్దకు నిస్సిగ్గుగా వెళ్లారు. ► మరమ్మతు పనులు పూర్తయ్యాక అనకాపల్లి మున్సిపల్ కార్యాలయం గోడపై అయ్యన్న పాత్రుడు తాతగారి ఫొటో యథాస్థానంలో పెడతామని కమిషనర్ చెప్పినా, అయ్యన్న బహిరంగంగా బూతులు తిట్టారు. ► మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఆయ్యన్నను అరెస్టు చేయిస్తాం. ► రాజకీయ మదంతో ఎవరైనా మాట్లాడితే ఇలానే కేసులు ఉంటాయి. ► బాధితులకు అండగా ఉంటాం. ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాం. -
‘దమ్ముంటే అయ్యన్నను తొలగించండి’
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్న పాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సవాల్ చేశారు. నిర్భయచట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘మహిళా అధికారిణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్నపాత్రుడు దొరికారు. అలాంటి వ్యక్తిపై కేసు పెడితే వెనుకేసుకొస్తారా? మహిళా ఉద్యోగులంటే టీడీపీకి చులకనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారో?మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు’అని ప్రశ్నించారు. కాగా, విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: కరోనా: ఆంధ్రప్రదేశ్‌లో 8 వేలు దాటిన కేసులు) -
అమరావతి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
సాక్షి, గుంటూరు : ప్రేమజంటను బెదిరించి నగదు డిమాండ్ చేయడంతో పాటు, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అమరావతి ఎస్ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు. (కోర్కె తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి) మరోవైపు లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. వారం రోజుల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసేవిధంగా విచారణ పూర్తి చేయాలని జిల్లా రూరర్ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె... ‘దిశ’ చట్టం స్పూర్తితో రాష్ట్రంలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సాక్షాత్తూ రక్షణగా ఉండాల్సిన పోలీసులు కీచకులుగా మారితే చాలా కఠినంగా వ్యవహరించాలని జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. -
గృహ హింస: ‘కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కారించాం’
సాక్షి, విజయవాడ: లాక్డౌన్లో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయని దాదాపు 200లకు పైగా ఫిర్యాదులు వచ్చాయని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో అర్థిక భద్రత అనేది పెరిగిందన్నారు. చాలామంది ఆడవాళ్లు అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయారని చెప్పారు. ఆర్థిక సహాయం కోసం ఇలా అనేక రకాల ఫిర్యాదుల వచ్చాయని పేర్కొన్నారు. మా పరిధి కాదనే ఆలోచన లేకుండా ఏ ఒక్క కేసును నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఫిర్యాదులను బట్టి తగిన సహాయం చేశామన్నారు. ఇక లాక్డౌన్ కారణంగా ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి తారుమారు అయ్యాయి అనేదే లేదన్నారు. గృహ హింసకు సంబంధించిన కేసులన్ని కూడా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారించామని తెలిపారు. దాదాపుగా కౌన్సెలింగ్ ద్వారా చాలా వరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే పరిష్కారం అందించామని చెప్పారు. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో) ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో చాలా వరకు గృహహింస కేసులు తక్కువ నమోదయ్యాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో మద్యపానం వల్ల జరిగే గృహహింస అనేది చాలా వరకు తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా వరకు మహిళలు సంతోషంగా ఉన్నారని, అమ్మఒడి, ఇళ్ల పట్టాలు వంటి పథకాలు అందించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలంతా రాష్ట్రంలో భరోసాతో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. వారి కుటుంబంలో ఏదైన మాట అనాలి అంటేనే భయం వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉందని చెప్పారు. గ్రామ సచివాలయంలో ఉన్నవారంతా కూడా మహిళలకు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు. దిశ చట్టం అమలులోకి వచ్చాక మూడు నెలల్లో 167 కేసులను చార్జీ షీట్ ఫైల్ చేశామన్నారు. అందులో 20 కేసులకు శిక్షణను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. సీఎం జగన్ ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఇచ్చి మహిళ సాధికారతను అందించారని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. (నేడు 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం) -
నేడు 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా నేడు (ఆదివారం) 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. శనివారం విశాఖలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో మహిళా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో ఇక్కడ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అని పద్మ వ్యాఖ్యానించారు. చిత్తూరులో హర్షిత కేసు విషయంలో మహిళా కమిషన్ చొరవ తీసుకొని నిందితుడికి పోక్సో చట్టం కింద శిక్షపడేలా చేసిందన్నారు. -
దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది
-
'విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ బీచ్ రోడ్ యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో నేచర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాలల సమాలోచన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అసెంబ్లీ లేజిస్లేటివ్ కమిటీ స్త్రీ, శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జి.హైమవతి తదితరులు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్య, బాలల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి బాలల హక్కుల పోరాట నేత కైలాష్ నాథ్ చటర్జీ జగన్‌ను కలిసి ప్రశంసించారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సుస్థిర లక్ష్యాల సాధన కోసం బాలల సమాలోచన సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం బాలల చదువు కోసమేనని, సమాజంలో పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో బాలలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని, ఆదీవాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం త్వరలోనే భాషా వలంటీర్లను నియమించనుందని కళావతి పేర్కొన్నారు. -
సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం..
సాక్షి, విజయవాడ: మహిళలను రాజకీయ క్రీడా చదరంగంలో పావులుగా వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తగదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని ఆమె వ్యాఖ్యానించారు. కమిషన్ సభ్యులకు అడుగడుగునా టీడీపీ ఆటంకాలు సృష్టించిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. పథకం ప్రకారం మహిళలపై అరాచకాలు జరుగుతున్నట్లు చెప్పేందుకు ప్రయత్నించిందన్నారు. లేనిదాన్ని ఉన్నట్లు చెప్పించడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఎక్కడో జరిగిన సంఘటనలను ఇక్కడవంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘటన చంద్రబాబుది అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. -
అమానుష ఘటనపై సర్కారు సీరియస్
ఏలూరు టౌన్: ఏలూరులో సామూహిక లైంగిక దాడికి గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బుధవారం పరామర్శించారు. మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయిజ్‌తో కలిసి ఘటనపై బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ అమానుష ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కాగా, మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చి అమరావతి వీధుల్లో ధర్నాలు చేయించడమే పౌరుషమా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బుధవారం ఏలూరులో ఆమె మాట్లాడుతూ రాజధాని అంశంపై చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. -
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం
-
నమ్మించి ఆమెపై లైంగికదాడి చేశారు..
సాక్షి, విజయవాడ: ఏలూరులో వివాహితపై లైంగికదాడి జరగడం దురదృష్టకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏలూరు రూరల్ నాగేంద్రకాలనీ శివారు ప్రాంతంలో వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంటి వద్ద దించుతామంటూ నమ్మించి బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. అదే విధంగా ఈ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణిలను ప్రభుత్వం నియమించిందని పేర్కొన్నారు. ఇటువంటి కేసులు త్వరితగతిన విచారించి న్యాయం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా నాగేంద్ర కాలనీకి చెందిన ఓ వివాహిత.. తన కుమారుడికి టాబ్లెట్లు తెచ్చేందుకు రాత్రి 10 గంటల సమయంలో సమీపంలోని మెడికల్ షాపునకు వెళ్లివస్తుండగా.. అదే కాలనీకి చెందిన యాకోబు అనే రౌడీషీటర్ వచ్చి ఆమెను ఇంటివద్ద దించుతానని చెప్పి బలవంతంగా తన బైక్ ఎక్కించుకున్నాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి మరికొందరు యువకులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇక రాజధాని ప్రాంతంలో మహిళలను పావులుగా చేసుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు రాజధాని ప్రాంతంలో పెత్తనం చేసిన మగవాళ్లు ఏమయ్యారని ప్రశ్నించారు.(భర్త ఊళ్లో లేకపోవడం.. మృగాళ్లు రౌడీ షీటర్లు కావడంతో..) -
‘రైతులను పావులుగా వాడుకుంటున్నారు’
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కోసం అమరావతి ప్రాంత రైతులను పావులుగా వాడుకుంటున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కానప్పటికీ తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వాసిరెడ్డి పద్మ టీడీపీ తీరును ఎండగట్టారు. మూడు నాలుగు బిల్డింగ్లు కట్టి టీడీపీ నాయకులు ప్రచారాలతో ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి అమరావతి ప్రాంత రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అందించిందని వాసిరెడ్డి పద్మ వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు మాదిరి కాకుండా నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం చర్చించాకే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తుది నిర్ణయంతీసుకుంటారన్నారు. అంతేకాకుండా సీఎం జగన్ అన్ని విధానాలను చట్టబద్దంగానే అమలు చేస్తారని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే రాజధాని రైతులు వైఎస్ జగన్‌కు అధికార పట్టం కట్టారన్నారు. ఆరు నెలల పాలనలో సీఎం జగన్ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, అమ్మఒడి, ఇళ్లపట్టాలు మహిళ పేరుతో ఇవ్వడం, వెయ్యి దాటిన ఆరోగ్య ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం వంటి ఎన్నో బృహత్కరమైన పథకాలను ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విధానాలను సీఎం ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరని స్పష్టం చేశారు. రాజధాని పేరుతో రాష్ట్రానికి నష్టం చేకూర్చుందిన టీడీపీ నాయకులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన పారిపోయి ఇక్కడికి వచ్చిన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించారని, అరచేతిలో వైకుంఠం అన్న చందంగా పాలన సాగించారని విమర్శించారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒకే పాలసీ ఉండాలని, టీడీపీ మాదిరి రోజుకో పాలసీ ఉండకూడదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. -
‘అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లోకి రావాలి’
సాక్షి, ఢిల్లీ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను నివారించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దిశ చట్టం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళ కమిషన్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ ఘటనలో తెలంగాణ పోలీసుల చర్యను అభినందించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల విషయంలో దేశంలో చట్టాలను కఠినంగా రూపొందించాలని కోరారు. రాజకీయ నేతలు, పార్టీల కోసం అర్ధరాత్రి కూడా తెరుచుకునే సుప్రీంకోర్టు తలుపులు, మహిళలపై జరిగిన దారుణాలపై ఎందుకు తెరుచుకోవడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా హోం మంత్రులు, డీజీపీల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మహిళల భద్రతపై ఎందుకు సమావేశాలు పెట్టరని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారాలు, హత్యలపై దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని ప్రతీ జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రస్తుతం ఉన్న చట్టాల అమలుపై జనవరిలో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను, అన్ని రాష్ట్రాల మహిళా చైర్పర్సన్లను ఆహ్వానించామని తెలిపారు. -
మహిళా కమిషన్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
-
మహిళా కమిషన్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు. -
మహిళా లోకానికి సీఎం వైఎస్ జగన్ అన్నలా అండగా నిలిచారు
-
దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు
సాక్షి, విజయవాడ: దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు రానున్నాయని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీ మహిళా కమిషన్, మహితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని హెల్ప్‌లైన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. బాల్య వివాహాలు జరగడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు.. కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా తీసుకువచ్చిన దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు వస్తాయని, దానికి దిశ చట్టమే సంకేతమంటూ హర్షం వ్యక్తం చేశారు. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దిశ ఘటనలో.. నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని అందరూ స్వాగతించారన్నారు. రాష్ట్రంలో మహిళలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుని కొత్త చట్టాన్ని తీసుకురావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. మహిళల రక్షణ, భద్రతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన దిశ చట్టం.. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులను అరికట్టి, మంచి పరిణామాలు తీసుకు రావడానికి కొంతమేర కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు మహిళలకు రక్షణ కల్పించడంలోవిఫలమవుతున్నాయని, చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. దిశ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తామని.. దిశ చట్టం ద్వారా హత్య, లైంగిక దాడి, గృహ హింస వంటి హేయమైన నేరాలు కొద్దిమేర తగ్గుతాయన్నారు. ఈ చట్టం ద్వారా నేరాలకు పాల్పడే వారికి భయం కలిగి.. నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. చిత్తూరు జిల్లా వర్షిత కేసులో సైతం ఛార్జ్ షీట్ వేసి కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని.. వారిని కించపరిచేలా పోస్టులు పెట్టి సైబర్ నేరాలకు పాల్పడే వారికి అడ్డుకునేందుకు దిశ చట్టం దోహదపడుతుందని ఆకాంక్షించారు. ప్రముఖులను సామాజిక మాధ్యమాల్లో లక్ష్యంగా చేసుకుని మానసిక వేదనకు గురిచేసే సైబర్ నిందితులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని తొలగించి, ఐపీ అడ్రస్ కనుక్కునే వరకూ తీవ్ర కాలయాపన జరిగేదని.. త్వరలో అలాంటి నేరాలకు తెరపడనుందని అన్నారు. దిశ చట్టంతో ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంతో మహిళా సంబంధింత కేసులు పెండింగ్‌లో ఉండవని ఆనందం వ్యక్తం చేశారు. 'సీఎం జగన్ మహిళలకు అండగా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి' అని మగవారు అనుకునే పరిస్థితి రాకపోదని అన్నారు. -
ఆ సంఘటన గుర్తొచ్చింది : వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి : దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. దిశకు సత్వర న్యాయం జరిగిందంటూ దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో వైఎస్సార్ హయాంలో జరిగిన సంఘటన మరొకసారి గుర్తుకు వచ్చిందని వెల్లడించారు. స్త్రీలపై జరుగుతున్న పాశవిక దాడులకు ప్రతిగా ఈ ఎన్కౌంటర్ కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. నిందితులకు పడిన శిక్ష పట్ల దేశ ప్రజలు హర్షిస్తున్నారనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాల్లో మార్పు రావాలని వివరించారు. -
దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా..
సాక్షి, విజయవాడ: దిశకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల దశను మార్చాలని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అవగాహన కార్యక్రమంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, నగర సీపీ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌తో పాటు వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళల రక్షణకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ‘పురుషులతో పాటు సమానంగా మహిళలు పోటీ పడుతున్నారు. మహిళలపై దాడులకు నివారణ చర్యలు తీసుకోవాలి. మీ కోసమే మేము ఉన్నామని అందరూ మహిళల కోసం నిలవాలి’అని సూచించారు. అదే విధంగా మహిళలు కూడా ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుతో మహిళలకు ఉపశమనం చేకూరుతోందని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. అది ఉద్యమంలా విస్తరించింది: సీపీ కొత్త నేరాల పట్ల ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. మహిళల రక్షణకై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తమ ప్రాధాన్యత అంశాలలో ముందుగా మహిళ భద్రతే ఉంటుందన్నారు. ‘గౌతమ్ సవాంగ్ సీపీగా ఉన్న సమయంలో మహిళా మిత్ర ప్రారంభించారు. అది ఉద్యమంలా విస్తరించింది. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ మిత్రకు శ్రీకారం చుట్టాము. 47 సైబర్ మిత్ర గ్రూపులు ఏర్పాటు చేశాం. ఇందులో 1520 మంది వాలంటీర్స్ను ఎంపిక చేశాం. 734 కాలేజీల నుంచి విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. వారంతా సైబర్ వారియర్స్‌గా పని చేస్తారు. బీ సేఫ్ ... అనే యాప్‌ను సైతం మహిళలు రక్షణ కోసం ఏర్పాటు చేశాం. దిశా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్
సాక్షి, పెరంబూరు(చెన్నై): మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పటికే కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో గానీ, తాజాగా తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో కే.భాగ్యరాజ్‌పై ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఒక సినీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ సూది తావివ్వకపోతే దారం అందులోకి పోలేదని అంటారన్నారు. ఆ విధంగా స్త్రీలు అవకాశం ఇవ్వడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి మహిళలు జాగరూకతతో ఉండాలన్నారు. ఈ విషయంలో మగవారిని తప్పు పట్టడం సరికాదన్నారు. మగవారు తప్పు చేస్తే కాలానుగుణంగా సమసిపోతుందన్నారు. అదే ఆడది తప్పు చేస్తే అది చాలా చేటుకు దారి తీస్తుందన్నారు. అందువల్ల మహిళలు కట్టుబాట్లు విధించుకోవాలని అన్నారు. ఇప్పుడు మోబైల్ఫోన్ల అభివృద్ధి కారణంగా మహిళలు ఎక్కడికో వెళ్లిపోతున్నారనీ, అందువల్ల తప్పులు జరుగుతున్నాయని అన్నారు. ఆ మధ్య పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటనలో మగవారిని మాత్రమే తప్పు పట్టలేమన్నారు. మహిళల బలహీనతను మగవారు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మగవారిది తప్పు అయితే అందుకు అవకాశం కల్పించిన మహిళలదీ తప్పే అవుతుందని అన్నారు. అలా మహిళలందరినీ కించపరచేలా మాట్లాడిన కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు కళైసెల్వి చెన్నై పోలీస్ కార్యాలయంలో గురువారం చేసిన పిర్యాదులో పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్ ఈ వ్యవహారంపై దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆయన ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అత్యాచారాలు హద్దు మీరుతున్న సంఘటనల్లో ఆడ, మగ ఇద్దరిదీ తప్పు ఉంటుందని, అలాంటి సమయాల్లో మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదనే రీతిలో తాను మాట్లాడానని చెప్పారు. ఉదాహరణకు ఒక సినిమాలోనో, సీరియల్లోనో సీరియస్‌గా మనసుగా ఆవేదన కలిగించే సన్నివేశం ఉంటే దాన్ని రాసిన రచయితను ఎవరూ తిట్టరని, తెరపై కనిపించే కథా పాత్రలనే తిట్టిపోస్తారని అన్నారు. మన సమాజంలో స్త్రీలను దైవంగా భావిస్తారన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్యలకు ఆస్కారం ఉండదన్న భావంతోనే తాను మాట్లాడానని చెప్పారు. తన కాలంలో మహిళలకు ఉండే కట్టుబాట్లు ఇప్పుడు లేవన్నారు. ఇప్పుడు వారికి సాంకేతికపరమైన అభివృద్ధితో అన్ని రకాలుగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు లభిస్తున్నాయని అన్నారు. పురుషాధిక్యం, స్వేచ్ఛ అంటూ మహిళలు మద్యం చేవించడం, పొగతాగడం వంటి చెడు అలవాట్లతో కట్టుబాట్లను వీరడం బాధనిపిస్తోందన్నారు. అదేవిధంగా స్త్రీలు తప్పుదారి పట్టడంతో అది వారినే కాకుండా వారి కుటుంబాలను బాధిస్తుందన్నారు. కాబట్టి తప్పు జరగడానికి మహిళలు కారణం అన్నాను కానీ, మహిళలు మాత్రమే కారణం అని అనలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వ్యతిరేకతకు కారణం అనీ, దీన్ని సరిగా అర్థం చేసుకున్న పలువురు దర్శకులు నిజాన్ని ధైర్యంగా చెప్పావంటూ తనను అభినందిస్తున్నారని కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. -
ప్రమాదంలో ఉన్నారా.. కాల్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, బాలికలపై రోజు రోజుకూ పెరుగుతున్న హింసాత్మక ఘటనలు సభ్య సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో ప్రతీరోజు ఏదో ఒకమూల చోటు చేసుకుంటున్న అమానుష ఘటనలు, హత్యాచారాలు భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. తాజగా హైదరాబాద్‌లో ప్రియాంకరెడ్డి, వరంగల్‌లో మరో యువతి హత్యాచార ఘటనలు కలకలం రేపాయి. అయితే అనుకోని ప్రమాదంలోగానీ, చిక్కుల్లోగానీ ఇరుక్కుంటే.. అధైర్యపడకండి! ధైర్యంగా ఆలోచించండి.. అప్రమత్తంగా వుంటూ వేగంగా కదలండి. వీటిన్నికంటే ముందుగా పరిస్థితులను చురుకుగా అర్థం చేసుకోవడం ప్రధానం. దీంతోపాటు ప్రమాదంలో ఉన్న బాధితుల ఆసరా, రక్షణ కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ హెల్ప్ లైన్ నెంబర్లను తమ సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం. ఈ నెంబర్లను మీ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోండి. ప్రమాదంలో ఉన్న మహిళలూ, అమ్మాయిలు ఈ హెల్ప్లైన్లను గుర్తుంచుకోండి! విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 181 నెంబర్ అందుబాటులో ఉంది. అలాగే షీ టీం ల్యాండ్ లైన్ నెంబరు 040 - 2785 2355 గానీ, వాట్సాప్ నెంబరు 94906 16555 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ పొందండి. మరోవైపు తెలంగాణాలో చోటుచేసుకున్న వరుస ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విటర్లో ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి సజీవదహనం కలచివేస్తోందనీ, మీడియా హౌస్‌లు బాధితుల కోసం హెల్ప్లైన్ల అవగాహన కల్పించడం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. (ప్రియాంకారెడ్డి చివరి ఫోన్‌కాల్) హైదరాబాదులో ప్రియాంక రెడ్డి సజీవదహనం కలచివేస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు అమ్మాయిలు టోల్ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 181, 1091 లలో ఏదో ఒకదానికి ఫోన్ చేయండి. మీడియా మిత్రులు మరొకసారి హెల్ప్ లైన్లను ఫోకస్ చేయండి. — Vasireddy Padma (@padma_vasireddy) November 28, 2019 -
‘చిన్నారులపై నేరాలు తగ్గించేదుకు ప్రత్యేక చర్యలు’
సాక్షి, అమరావతి : చిన్నారులపై లైంగిక నేరాలను తగ్గించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. బుధవారం సచివాలయంలో చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక హింస జరగడం దారుణమన్నారు. చట్టాలను వేగంగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలను నియంత్రించగలమని, ఇందుకోసం అన్ని శాఖలు, స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. చిన్న పిల్లలు, యువతులపైనే లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడేవారి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చిన్నారులపై నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. లైంగిక నేరాల నియంత్రణకు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తునే.. మరో వైపు ఇలాంటి ఘటనలపై యువతి, యువకులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. -
భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి
అమరావతి: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై తమిళనాట పెద్ద దుమారం రేగుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడైన భాగ్యరాజా మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా భాగ్యరాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. రేప్ ఘటనల్లో మహిళలను తప్పుబట్టేలా మాట్లాడటం ఎంతమాత్రం మానవత్వం కాదని, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వీరికి కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. ప్రభుత్వాలు, మహిళా సంస్థలు, పోలీసులు, న్యాయవ్యవస్థ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొందరు సెలబ్రిటీలు మాత్రం మహిళలను కించపరచడం, దారుణాలకు మద్దతు పలుకడమేమిటని ఆమె నిలదీశారు. ఈమధ్య తమిళనాడులో ప్రకంపనలు సృష్టించిన పొలాచీ రేప్ కేసు గురించి భాగ్యరాజా ఓ సినీ ఈవెంట్లో ప్రస్తావిస్తూ.. ఆ ఘటన వెనుక మగవాళ్ల తప్పులేదని, వివాహేతర సంబంధాల కోసమే ఈ రోజుల్లో మహిళలు భర్తలను, పిల్లలను చంపుతున్నారని దారుణ వ్యాఖ్యలు చేశారు. సెల్ఫోన్ల వల్లే మహిళలు చెడిపోతున్నారని, రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు కూడా సెల్ఫోన్లు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పోలాచీ కేసులో అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని భాగ్యరాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
‘టెక్నాలజీకి రెండు వైపులా పదును ఉంటుంది’
సాక్షి, విజయవాడ : ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి ఎంత జరుగుతుందో మోసాలు సైతం అదేవిధంగా పెరిగిపోతున్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. టెక్నాలజీని తమ పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఆమె సూచించారు. గురువారం విజయవాడలో మహిత ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘మహిళలపై సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన చర్యలు’పై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహిళలపై సైబర్ నేరాలు’ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టెక్నాలజీ పెరిగిపోవడంతో మోసాలు చేసే వారి బారిన పడి మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసగాళ్లు రకరకాల వీడియోలు తీసి పిల్లలను బెదిరిస్తున్నారని, బ్యాంకు అకౌంట్ల ద్వారా మాయ చేస్తున్నారన్నారు. మహిళా మిత్ర ద్వారా మహిళలకు రక్షణ ఏర్పడుతుందని, ఒక ఫోన్‌కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించేలా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని హితవు పలికారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తాం మహిళలపై జరిగే నేరాలు అదుపు చేసేందుకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళా మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ మిత్ర వల్ల ఏ మహిళ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వరకు రానవసరం లేదని స్పష్టం చేశారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తామని, స్పందన కార్యక్రమం ద్వారా 52 శాతం మంది మహిళలు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. టెక్నాలజీకి మంచి, చెడు రెండు వైపులా పదును ఉంటుందని, దురదృష్టవశాత్తు ఎక్కువ నేరపూరిరతవైపే టెక్నాలజీ వాడకం పెరిగిపోయిందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, సైబర్ క్రైం వ్యవస్థ తమ శాయశక్తుల నేరాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉందని పేర్కొన్నారు. -
పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు
సాక్షి, అమరావతి బ్యూరో/భవానీపురం(విజయవాడ పశ్చిమ) : బెజవాడలో ఆదివారం అదృశ్యమైన బాలిక పక్కింట్లోనే శవమై కనిపించింది. విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి పరిధిలోని నల్లగుంటలో ఈ దారుణం జరిగింది. ఏసుపాదం, రమణ దంపతుల కుమార్తె మొవ్వ ద్వారక(8) ఆదివారం అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు అదే రోజు రాత్రి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంటి పక్కనే ఉండే మర్లపూడి ప్రకాష్ భార్య సోమవారం ఊరి నుంచి వచ్చి ఇంటి తలుపులు తెరచి చూడగా ఒక మూటలో బాలిక శవం కనిపించింది. ఈ విషయాన్ని ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు తెలిపింది. ఆగ్రహంతో స్థానికులు ప్రకాష్‌ను చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. బాలిక తండ్రి ఓ లిక్కర్ షాపులో పనిచేస్తుండగా, తల్లి రమణ ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుంది. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడబోగా కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను వదిలేది లేదు : వాసిరెడ్డి పద్మ బాలికలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. బాలిక ద్వారక కుటుంబీకులను ఆమె సోమవారం పరామర్శించారు. -
లైంగికదాడి.. హత్య!
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. ప్రశ్నిస్తే పెళ్లి బస్సు సిబ్బంది అన్నాడు.. గురువారం రాత్రి పెళ్లికి వచ్చిన ఆ అగంతకుడు .. ఓసారి పెళ్లికొడుకు తరఫు మనిషినని.. మరోసారి పెళ్లికుమార్తె తరఫున అని పొంతన లేకుండా చెప్పాడని.. మరి కొందరితో పెళ్లి బస్సు సిబ్బంది అని చెప్పాడని పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో అతనే హంతకుడై ఉంటాడని అనుమానిస్తున్నారు. హంతకుడు కర్ణాటక వాసి? కల్యాణమండపంలో సంచరించిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు కర్ణాటక వాసిగా నిర్థారణకు వచ్చారు. దీంతో అతనికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాలోని డీసీఆర్‌బీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మానవ మృగాల ఆట కట్టిస్తాం అభం శుభం తెలియని చిన్నారులను బలిగొనే మానవ మృగాల ఆట కట్టిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. దారుణ హత్యాచారానికి గురయిన బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాళ్యంకు చెందిన వర్షిత (5) కుటుంబాన్ని శనివారం ఆమె తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షిత హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ఫైర్
-
నేరాలకు ప్రధాన కారణం అదే: వాసిరెడ్డి పద్మ
సాక్షి, గుంటూరు : మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మద్యనిషేధంపై హేళనగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తివేయడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని... మహిళలు ప్రశాంతంగా ఉంటే ఆయనకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ఆయన హయాంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అందరికీ తెలుసునన్నారు. ఎన్టీఆర్ మద్య నిషేధం చేస్తే చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేసి వేశారని గుర్తుచేశారు. గురువారమిక్కడ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ‘మద్యం వల్లే దేశంలో 40 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నేరాలకు ప్రధాన కారణం కూడా అదే. మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మద్యపాన నిషేధం అమలు చేయడం రాష్ట్రాల నైతిక బాధ్యత. చదువుకునే పిల్లలు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. బిహారులో మద్యనిషేధం తర్వాత 20 శాతం క్రైం రేటు తగ్గింది. అయితే చంద్రబాబు మాత్రం మద్యపాన నిషేధాన్ని హేళన చేస్తూ.. తూట్లు పొడవాలని చూస్తున్నారు. నిషేధాన్ని నీరుగారిస్తే మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు’ అని హెచ్చరించారు. -
ధ్యానం అనే జ్ఞానాన్ని అందరికి పంచాలి
సాక్షి, విజయవాడ: ధ్యానంపై మహిళలు శ్రద్ధ చూపాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘విద్వత్ మహిళా సమ్మేళనం-2019’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒక పక్క కుటుంబం, మరోవైపు ఉద్యోగాలు చేస్తూ మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం తోడ్పడుతుందన్నారు. ధ్యానం చేసేవారు ఓర్పుతో ఉంటారని చెప్పారు. యోగా,ధ్యానం.. మనలో ప్రకృతి కల్పించిన శక్తిని బయటకు తీసుకువస్తాయని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయని..ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. భారతీయ సంస్కృతిలో ఉన్న ధ్యానం అందరికి ఆరోగ్యదాయకం అని పేర్కొన్నారు. ధ్యానం అనే జ్ఞానాన్ని అందరికి పంచాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ అధినేత్రి రాధారాణి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ విద్యాకన్నా తదితరులు పాల్గొన్నారు. -
'కలాం పేరిట అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఫిలాన్తరోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ అవార్డ్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డులు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేన్లు కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా సామాన్య జీవితం గడిపిన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కలాం ఆశయాలను జగన్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజికి న్యాయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడే ఉన్నారని పేర్కొన్నారు.