
ప్రతీకాత్మక చిత్రం
ఏలూరు టౌన్: ఏలూరులో సామూహిక లైంగిక దాడికి గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బుధవారం పరామర్శించారు. మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయిజ్‌తో కలిసి ఘటనపై బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ అమానుష ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.
నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కాగా, మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చి అమరావతి వీధుల్లో ధర్నాలు చేయించడమే పౌరుషమా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బుధవారం ఏలూరులో ఆమె మాట్లాడుతూ రాజధాని అంశంపై చంద్రబాబు తీరును తూర్పారబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment