
ఇప్పుడు లోకేష్ పర్యటన చేయాల్సిన అవసరమేముందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: ఇప్పుడు లోకేష్ పర్యటన చేయాల్సిన అవసరమేముందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, శవాల మీద పేలాలు ఏరుకుంటూ లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడపిల్లల చావులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి.. ప్రతిపక్షంగా మీకు బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు. ‘‘అన్యాయం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తోంది. జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం. దిశ చట్టాన్ని మీ హయాంలో ఎందుకు తీసుకురాలేదు. దిశ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తున్నామని’’ వాసిరెడ్డి పద్మ అన్నారు.
ఇవీ చదవండి:
లోకేశ్ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస
బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు !