దోషులను కఠినంగా శిక్షిస్తాం | Vasireddy Padma Fires On TDP | Sakshi
Sakshi News home page

దోషులను కఠినంగా శిక్షిస్తాం

Published Mon, Sep 7 2020 5:06 AM | Last Updated on Mon, Sep 7 2020 5:06 AM

Vasireddy Padma Fires On TDP - Sakshi

మోసపోయిన యువతితో మాట్లాడుతున్న వాసిరెడ్డి పద్మ, డీఎన్నార్‌

ముదినేపల్లి రూరల్‌ (కైకలూరు)/సాక్షి, అమరావతి: ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన యువకుడిని, అతడికి అండగా నిలుస్తున్నవారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ప్రేమికుడి చేతిలో మోసపోయిన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఐనంపూడికి చెందిన దళిత యువతిని ఆదివారం ఆమె ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌)తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా యువతి మోసపోయిన వైనం, ఇల్లును నిందితులు తగులబెట్టడం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే..  

► యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. 
► యువతికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆర్థిక సాయం అందించడంతోపాటు అన్ని విధాలా అండగా నిలిచింది.
► రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని టీడీపీ రాజకీయం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది. 
► దళితులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. 
► కాగా, ప్రభుత్వం తమకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడిందని బాధిత కుటుంబం సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement