సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కించపరుస్తూ ఇటీవల వచ్చిన కథనాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం లేఖ రాశారు. గురువారం వాసిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. తనకు సంబంధం లేని కేసుల విషయంలో తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని డీజీపీ సవాంగ్‌ను మహిళా కమిషన్ కోరింది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులుగా ఉన్న మహిళలపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదుపై వెంటనే స్పందించి విచారణ జరపాలని డీజీపీకి రాసిన లేఖలో వాసిరెడ్డి పద్మ కోరారు.
(చదవండి: ప్లాస్మా దాతలకు రూ.5వేలు: సీఎం జగన్)
శ్రీదేవి ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్
Published Fri, Jul 31 2020 5:02 PM | Last Updated on Fri, Jul 31 2020 6:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment