Dr Vundavalli Sridevi
-
‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’
హైదరాబాద్/తాడికొండ: అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన ఆడియో టేపులను ఇష్టారీతిగా ప్రసారం చేస్తూ దళితులను, ఇతర వర్గాల మహిళలను కించపరిచేలా ఏబీఎన్ చానెల్ అధినేత రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్మీ’ అని చంద్రబాబు రూ.5 కోట్ల విషయంలో అడ్డంగా దొరికినప్పుడు దాన్ని ప్రసారం చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి చానెల్లో వాటా ఉండటమే దీనికి కారణమన్నారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రసారానికి ముందు తమ వివరణ అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను బూతు కిట్టూ అంటుంటే ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు బాగా అర్థమవుతోందన్నారు. మీ చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్నారని, టీడీపీ నేతలేమో దళితులు శుభ్రంగా ఉండరు.. చదువుకోరు అని కించపరిచారని గుర్తుచేశారు. బూతు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు రాధాకృష్ణకు బూతుకిట్టు అనే బిరుదు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవే ఆడియోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో వెబ్సైట్లో పెడితే మీరు బాధపడరా అని రాధాకృష్ణను ప్రశ్నించారు. ‘ఏదైనా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోండి. నాకు వైఎస్ జగన్ రాజకీయ భిక్ష పెట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతుంది’ అని శ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు. -
‘ఏబీఎన్ రాధాకృష్ణ శ్రమ వ్యర్థమే’
సాక్షి, అమరావతి : ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిజ నిజాలను తెలుసుకోకుండా ఎల్లో మీడియా ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళిత డాక్టర్ని అయిన తాను, ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ట్యాప్‌ను డైలీ సీరియల్లా ఎల్లో మీడియా ఎలా ప్రసారం చేశారని ప్రశ్నించారు. (చదవండి : మీ నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు బాబూ) చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయలేదని నిలదీశారు. ఏబీఎస్ రాధాకృష్ణ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం ఎల్లో మీడియా ఇంత దిగజారుతుందా అని అసహనం వ్యక్తం చేశారు. మునిగిపోతున్న టీడీపీ పార్టీని రాధాకృష్ణ బతికించాలని చూస్తున్నారని, కానీ అతని శ్రమ వ్యర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాకు భయపడే రోజులు పోయాయని, ఇకనైనా అసత్య ప్రచారాలను నిలివిపేయాలని సూచించారు. -
కిరణ్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, తాడికొండ: తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్ఐ దాడిచేసి కొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడు కిరణ్ కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెడపాటి అమ్మాజీతో కలిసి మంగళవారం చీరాలలో కిరణ్ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడిన అనంతరం చలించిపోయిన ఎమ్మెల్యే శ్రీదేవి తన సొంత నగదు రూ.1 లక్షను కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగిన కేసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో దళిత యువకుడికి శిరోముండనం కేసు, చీరాల ఘటనల్లో సంబంధిత వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. చీరాల ఘటనలో ఎస్ఐను అరెస్టు చేయడంతో పాటు కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. (మాస్కు వివాదం.. యువకుడి బలి) సీఎం జగన్ దళితుల పక్షపాతి అని, తప్పుచేస్తే ఎవరినీ క్షమించరన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఘటనలో ఇన్చార్జి ఎస్ఐ షేక్ ఫిరోజ్ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి ఎస్ఐపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారన్నారు. విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకలి్పంచడం ఆయనకు దళితులపై ఉన్న మక్కువకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందని ద్రాక్షగా ఉండే ఇంగ్లిషు మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతుంటే అడ్డుకోవాలని కుటిల బుద్ధితో కేసులు వేయించిన చంద్రబాబు దళిత ద్రోహి అన్నారు. మీరు దళితులు, మీకెందుకురా రాజకీయాలు అంటూ దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కనీసం మందలించకపోగా ఆదే వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సత్కరించారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు గతంలో అన్న మాటలు మరచి దళితులపై మొసలి కన్నీరు కార్చడం చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. దళితులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. (రెండు రోజుల్లో కొడుకు పెళ్లి.. కులబహిష్కరణ) -
శ్రీదేవి ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కించపరుస్తూ ఇటీవల వచ్చిన కథనాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం లేఖ రాశారు. గురువారం వాసిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. తనకు సంబంధం లేని కేసుల విషయంలో తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని డీజీపీ సవాంగ్‌ను మహిళా కమిషన్ కోరింది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులుగా ఉన్న మహిళలపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదుపై వెంటనే స్పందించి విచారణ జరపాలని డీజీపీకి రాసిన లేఖలో వాసిరెడ్డి పద్మ కోరారు. (చదవండి: ప్లాస్మా దాతలకు రూ.5వేలు: సీఎం జగన్) -
ఆ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీదేవి
-
ఆ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, గుంటూరు : తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. పేకాట శిబిరాల్లో తన అనుచరులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. తానే పేకాట ఆడిస్తున్నానని వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, వాటితో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. పేకాట శిబిరాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులను కోరారు. -
చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడికి రాజధానిపై ప్రేమ ఉంటే అక్కడ శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పై రాళ్లు ఎందుకు పడుతున్నాయని విమర్శించారు. ఏడాది అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా తనపై రాజధాని ప్రజలు పూల వర్షం కురిపించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ధైర్యంలేక అఖిలపక్ష సమావేశం తుళ్లూరులో నిర్వహించలేక విజయవాడలో పెట్టారని శ్రీదేవి ఎద్దేవా చేశారు. తాము 119 సంక్షేమ పథకాలతో ప్రజలు ముందుకు వెళ్తున్నామని, ఎల్లో మీడియాకు ఈ పథకాలు చూసి పక్షవాతం వచ్చిందని ఆమె ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయలేదని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు దళిత ద్రోహి అని.. దళితుల ఎస్సైన్డ్ భూములకు అన్యాయం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల్ని పక్కన ఏనాడు కూర్చోబెట్టుకోని చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఎక్కడ కూర్చున్నారని శ్రీదేవి ప్రశ్నించారు. చంద్రబాబు బీఆర్ అంబేడ్కర్ సిద్దాంతాలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అంబేడ్కర్ భారీ విగ్రహం నిర్మాణం చేస్తామని చెప్పి చంద్రబాబు విస్మరించారని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నమ్మరని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇన్ సైడ్ ట్రేడింగ్‌లో కొట్టేసింది బయటకు వస్తుందని, ఆయన త్వరలో జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. చంద్రబాబు పాలనలో అక్రమాల చిట్టా లిమ్కాబుక్ రికార్డులో ఎక్కుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును అమరావతి శిల్పి కాదు.. అమరావతి దొంగ అంటున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి విరుచుకుపడ్డారు. -
అందుకే చంద్రబాబుపై తిరుగబడ్డారు..
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై రాళ్లు వేయకుండా.. పూలు వేస్తారా అని వైఎస్సార్సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు మోసం చేశారు కాబట్టే ప్రజలు, రైతులు తిరుగబడ్డారని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. నిన్నటి వరకు ఇసుక అన్న చంద్రబాబు.. నేడు లాఠీ అని మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ప్రజలు తగిన బుద్ది చెప్పినా ఏ మార్పు రాలేదన్నారు. తెనాలి నుంచి అద్దెకు ఆర్టిస్టులను తెప్పించుకొని.. చంద్రబాబు మీద వేసిన చెప్పుల సంఘటనపై సిట్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. ఇక చంద్రబాబు హయాంలో సిట్ అంటే సిట్ అండ్ స్టాండ్‌లా తయారైందని శ్రీదేవి హేళన చేశారు. చంద్రబాబు మళ్లీ రాజధానికి వస్తే తరిమి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు గ్రాఫిక్స్ పేరుతో ఖర్చు చేసిన డబ్బు ప్రజలకు ఖర్చు చేసినా బాగుండేదన్నారు. అమరావతితో చంద్రబాబు రాజకీయాలు మానుకుని.. రైతులకు, రైతు కూలీలకు సాష్టాంగ నమస్కారం చేయాలని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ స్మృతి వనమని దళితులను మోసం చేసిన చంద్రబాబు.. పరిహారం విషయంలోనూ దళితుల పట్ల వివక్ష చూపారని మండిపడ్డారు. తీసుకున్న భూములకు ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాజధానిలో చంద్రబాబు బినామీలు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో మోసానికి పాల్పడిన చంద్రబాబును.. 5న జరిగే అఖిలపక్ష సమావేశం గ్రాఫిక్స్ రాజధానిలో పెట్టాలన్నారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేశారని.. రాజధాని ప్రజలను మోసం చేసిన చంద్రబాబును అమరావతి శిల్పి అంటారా లేదా దొంగ అంటారా అంటూ ప్రశ్నించారు. దండుపాళ్యం ముఠాలా చంద్రబాబు అండ్ బ్యాచ్ దోచుకుని.. లింగమనేనికి రూ. 4 వేల కోట్ల లబ్ది చేకూర్చారని ఆరోపించారు. -
ప్రభుత్వ పథకాలతో కార్మికులకు భరోసా
సాక్షి, గుంటూరు: అసంఘటిత కార్మికులకు, చిన్న వ్యాపారస్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, ( పి.ఎం.ఎస్.వై.ఎం ) ప్రధాన మంత్రి లఘు వ్యాపిర మాన్‌ధన్ ( పి.ఎం.ఎన్.పి.ఎస్.) పథకాలతో భరోసా లభిస్తుందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కార్మిక శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ రెండు పథకాల్లో చేరితే 60 ఏళ్ల తర్వాత రూ.3000 వేల వరకు పెన్షన్ అందుతుందని చెప్పారు. పెన్షన్ ప్రీమియం వయస్సును బట్టి మారుతుందన్నారు. కనీసం రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి వస్తుందని చెప్పారు. దీనిపై అవగాహన కల్పించడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్మిక శాఖ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సభకు అధ్యక్షత వహించిన తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. కార్మిక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ యు.మల్లేశ్వర కుమార్ మాట్లాడుతూ మరింత సమాచారం కోసం కార్మికులు, చిరు వ్యాపారులు తమ కార్యాలయాన్ని సందర్శించాలని సూచించారు. అనంతరం కార్మికులకు కలెక్టర్, తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకర్గ ఇన్చార్జ్ చుక్కా ఏసురత్నం, జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆదినారాయణ చెక్కులు అందజేశారు. సర్వే, డేటా ఎంట్రీని వేగవంతం చేయాలి వైఎస్సార్ నవశకం సర్వే, డేటా ఎంట్రీ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరం నుంచి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేకరించిన సమాచారాన్ని డేటా రూపంలో ఏరోజుకారోజు నమోదు చేయాలని తెలిపారు. డిసెంబర్ 7నాటికి మొత్తం సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం బాగా కనబడుతోందని, వారు పనితీరును మెరుగుపరచుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అర్బన్, రూరల్ పరిధిలో సర్వే వివరాలను అదే రోజు సాయంత్రం ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. డేటా ఎంట్రీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం ఒక కంప్యూటర్ అయినా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సర్వే, డేటా ఎంట్రీల్లో అర్బన్ పరిధిలో ఎంపీడీవో, తహసీల్దార్, కమిషనర్, రూరల్ పరిధిలో ఎంపీడీవో, తహసీల్దార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. సచివాలయాల వారీగా మ్యాపింగ్, ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం ఉద్యోగులకు లాగిన్లు అందించాలని ఆదేశించారు. వీటిపై గుంటూరు, తెనాలి, నరసరావుపేట, గురజాల ఆర్డీవో, తెనాలి సబ్ కలెక్టర్ ప్రతి రోజూ తహసీల్దార్, ఎంపీడీవో, కమిషనర్లతో సమీక్ష జరిపి వివరాలు తనకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల డేటా ఎక్కువగా ఉందని, సర్వే చేసిన సంఖ్యకు, డేటా నమోదుకు చాలా వ్యత్యాసముందని పేర్కొన్నారు. దీన్ని తక్షణం తగ్గించాలని ఆయన ఆదేశించారు. సర్వేకు, పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఇప్పటికే పెన్షన్లకు సంబంధించిన నగదును బ్యాంకుల్లో జమ చేశామని, డిసెంబర్ 1న డ్రా చేసి పంపిణీ చేయాలని చెప్పారు. ప్రభుత్వం నవశకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. సమావేశంలో జేసీ–2 శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈవో డి.చైతన్య, జీఎంసీ కమిషనర్ సీహెచ్.అనూరాధ, డీఎస్వో టి.శివరామ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు.. విచారణ చేపట్టిన జాతీయ కమిషన్
సాక్షి, అమరావతి : తెలుగు దేశం నాయకులు తాడికొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. శుక్రవారం అనంతవరంలో చేపట్టిన బహిరంగ విచారణకు ఎమ్మెల్యే శ్రీదేవి, గ్రామస్ధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు రాములు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కాగా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే శ్రీదేవి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. చదవండి : దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం -
‘చంద్రబాబు కుల ఉన్మాదాన్ని పెంచి పోషించారు’
సాక్షి, విజయవాడ : రాజధాని ప్రాతంలో చంద్రబాబు కుల ఉన్మాదాన్ని పెంచి పోషించారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వర్ రావు మండిపడ్డారు. తాడికొంత దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై తెలుగుదేశం కార్యకర్తల కుల వివక్ష దాడిని ఖండిస్తూ సమతా సైనిక్ దళ్ నాయకులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు కులం వారే ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసేవారని, బాబు పాలనలో సైతం దళితులపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. విద్యావంతులైన మహిళ ఎమ్మెల్యేను కులం పేరుతో దూషించిన వారిని చంద్రబాబు పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ పార్టీ.. దళిత వ్యతిరేక పార్టీ అని, ఇలాంటివి మళ్లీ జరిగితే దళిత సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవికి జరిగిన అవమానాన్ని సుచరిత ముఖ్యమంత్రికి వివరించారు. అదే విధంగా టీడీపీ నేతల అరాచకాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అవమానభారంతో ఆవేదన చెందుతున్న శ్రీదేవికి సీఎం జగన్ ధైర్యం చెప్పారు. ఇక హోం మంత్రి సుచరితతో పాటు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా సీఎం జగన్‌ను కలిశారు. దళిత మహిళా ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన కేసులో దోషులెవరూ తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే ఆ పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య లాంటి వాళ్ళు వాటిని ప్రోత్సహించటం సిగ్గుచేటు అని విమర్శించారు. కాగా రాజధాని ప్రాంతంలో వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన శ్రీదేవిని కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు దాడికి దిగిన విషయం విదితమే. సోమవారం వైఎస్సార్ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు. ఈ క్రమంలో వారి దౌర్జన్యాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం టీడీపీ నాయకులు నెట్టిపడేశారు. దీంతో తనను దారుణమైన పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ వట్టికూటి గౌతమి కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుల్లో కొమ్మినేని శివయ్య, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వారిని తుళ్లూరు డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు కొమ్మినేని రామకృష్ణ, బుజ్జి పరారీలో ఉన్నారు. -
‘ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వారిపై కఠిన చర్యలు..
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరును మహిళా శిశు శాఖమంత్రి తానేటి వనిత ఖండించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై వివక్ష చూపించారని, ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా టీడీపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా దళితులుగా ఎవరు పుడతారని అవమానించారని గుర్తు చేశారు. ఆయనలాగే తమ నేతలు కూడా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు డీఎన్ఏలోనే నాయకత్వ లోపం ఉంది’
సాక్షి, తాడేపల్లి : వినాయకుడి పూజకు వెళ్లిన దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నేతలు కులం పేరుతో దూషించడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ నేతలు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కుల దూషణలో చంద్రబాబే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా దళితులపై దాడులే జరిగాయన్నారు. దళితులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చుట్టాలుగా మారుతున్నారని వారిపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో దళిత మహిళలను వివస్త్రను చేసి దాడులు చేశారన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయనకు రాజ్యాంగంపై గౌరవం లేదని నాగార్జున ఆరోపించారు. (చదవండి : దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం) టీడీపీ యాంటీ దళిత పార్టీ : సుధాకర్ బాబు రాజధాని ప్రాతంలో దళిత మహిళ ఎమ్మెల్యే శ్రీదేవిపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు. దళితులను అవమానించిన చంద్రబాబును ఆపార్టీ దళిత నేతలు నిలదీయకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ యాంటీ దళిత పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డీఎన్ఏలోనే నాయకత్వ లోపం ఉందన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న పనులకు రాష్ట్రం సిగ్గుతో తలదించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిని సీఎం జగన్ బయటపెడుతుంటే తట్టుకోలేకనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. -
ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి
సాక్షి, విజయవాడ: తాడికొండ ఎమ్మెల్యే,దళిత నాయకురాలు ఉండవల్లి శ్రీదేవిని వినాయక చవితి వేడుకల సందర్భంగా ఘోరంగా అవమానించిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం దళిత సంఘాల నేతలు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళ్ళం భాగ్యరావు మాట్లాడుతూ.. ఏపీ రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేపై అగ్రవర్ణ కుల అహంకారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది కుల వివక్షకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. 40 శాతం దళితులు ఉన్న రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేకే రక్షణ కరువైందని.. ఇక అక్కడ ఉండే దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీ నేతలకు రక్షణ ఎక్కడుంది అని ఎద్దేవా చేశారు. ఒక మహిళా ఎమ్మెల్యే, దళిత నాయకులు, డాక్టరైన ఆమెను గౌరవించకుండా కులం పేరుతో దూషించడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యపై సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలని అన్నారు. దళితులపై ఎటువంటి వివక్ష చూపని ఎట్రాసిటీ ప్రో గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఈ సందర్బంగా భాగ్యరావు కోరారు. గతంలో టీడీపీ నాయకులు, సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిని అవమానించారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కులవివక్ష వ్యతిరేక ప్రచార సంఘం అధ్యక్షులు పరిశపోగు రాజేష్ మాట్లాడుతూ.. దళిత మహిళ, శాసన సభ్యురాలైన శ్రీదేవిపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. కులం పేరుతో దూషించి, ఉన్మాదం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే అన్ని దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మైనార్టీ నాయకులు ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణేది? అని ఆవేదన వ్యక్తం చేశారు. కుల అహంకారంతో పెట్రేగిపోతున్న వారి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. -
నిందించిన నోళ్లు.. భగ్గుమన్న ఊళ్లు
సాక్షి, గుంటూరు(తుళ్లూరు) : రాజధాని ప్రాంతం గత రెండు రోజులుగా వరుస ధర్నాలతో అట్టడుకిపోతోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీకి చెందిన అగ్రవర్ణ నేతలు దుర్భాషలాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోమవారం తుళ్లూరు మండలంలోని అనంతవరంలో వినాయకుని విగ్రహం వద్ద పూజ చేస్తుండగా టీడీపీ నేతలు దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైలు పడతాడంటూ దూషించాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వెలగపూడి జంక్షన్లో, మంగళవారం సాయంత్రం తుళ్లూరు జంక్షన్లో రాజధాని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఒక దళిత మహిళను అవమానించడం దారుణమన్నారు. సీఎం జగన్ దళిత మహిళకు హోం శాఖ అప్పగించి దళితుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బత్తుల కిషోర్, యువజన విభాగం అధ్యక్షుడు బెజ్జం రాంబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలపర్తి రామారావు, కొయ్యగూర వినోద్, ఆరేపల్లి జోజి, మేడికొండూరు మండల అధ్యక్షుడు కందుల సిద్ధయ్య, తుమ్మూరు రమాణారెడ్డి, పుల్లా ప్రభాకరరావు, ధర్మారావు, తమనంపల్లి శాంతయ్య, దాసరి రాజు, మరియదాసు, ఎడ్లూరి వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ కిషోర్, సుంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పేరేచర్ల, ఫిరంగిపురం కూడళ్లలో మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ నాయకులకు ఇంకా అధికార అహంకారం దిగలేదన్నారు. వినాయకుడికి పూజలు చేస్తే దేవుడు మైల పడతాడని చెప్పడం వారి వారి నీచ ప్రవర్తనకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. పేరేచర్ల కూడలిలో కందుల సిద్ధయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారాకో చేసిన అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఫిరంగిపురం కూడలిలో నాయకులు గుంటూరు కర్నూలు ప్రధాన రహదారిని దిగ్భందించి, నిరసన తెలిపి పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించడం దారుణం గుంటూరు: వినాయక చవితి వేడుకల్లో దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అవమానపరచడమే కాకుండా కులం పేరుతో దూషించిన వారిని వెంటనే ఆరెస్టు చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ ఆర్ జయలక్ష్మిని మంగళవారం కలసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ఎమ్మెల్యేకు ఇలా జరగడం చూస్తే ఆమెను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని వివరించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం గుంటూరు(నెహ్రూనగర్): ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు కొరిటెపాటి ప్రేమ్‌కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో అభి, ప్రభాకర్, కూచిపూడి గోపి, సుబ్బారావు, కవిత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు గుంటూరు(పట్నంబజారు): తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దుర్భాషలాడటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అత్తోట జోసఫ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి విజయసారథి, ఎస్సీ విభాగం నేతలు పచ్చల ఆనంద్, కే రమేష్ మండిపడ్డారు. పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ కుల అహంకారానికి పెట్టింది పేరన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. దళితులు.. మీకెందుకు రా రాజకీయాలని చింతమనేని చేసిన వ్యాఖ్యలు, మురికివాడల్లో పుట్టిన వారికి మురికి ఆలోచనలే వస్తాయని జేసీ వంటి టీడీపీ నేతలు మాట్లాడారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పలువురు పాల్గొన్నారు. -
దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాజధాని ప్రాంతంలో తాడికొండ వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించి, దాడికి దిగిన టీడీపీ నేతల ఉదంతం కలకలం రేపింది. సోమవారం వైఎస్సార్ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం నెట్టిపడేశారు. తనను దారుణమైన పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ వట్టికూటి గౌతమి కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుల్లో కొమ్మినేని శివయ్య, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వారిని తుళ్లూరు డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు కొమ్మినేని రామకృష్ణ, బుజ్జి పరారీలో ఉన్నారు. భగ్గుమన్న దళిత సంఘాలు ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తీవ్రంగా ఖండించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్‌కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) ఏపీ శాఖ అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, ఏపీ నాయీ బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ తాటికొండ నరసింహారావు, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ టీడీపీ నేతల కుల దురహంకారంపై మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ బర్రె శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. రాజధాని కుంభకోణాలను ప్రశ్నిస్తున్నాననే: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దేశంలో ఎక్కడా లేని కులవివక్ష రాష్ట్ర రాజధానిలోనే కనిపిస్తోందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానం మేరకు వెళ్లి వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నానని తెలిపారు. కొందరు టీడీపీ నేతలు తాను మండపంలోకి వెళితే వినాయకుడు మైలపడతాడంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అంతటితో ఆగకుండా పెద్ద పెద్ద అరుపులతో అసభ్యకరంగా మాట్లాడారని వాపోయారు. బూతు పదజాలంతో తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుసరించిన దళిత వ్యతిరేక వైఖరే దీనికి ప్రధాన కారణమన్నారు. గతంలోనూ చంద్రబాబుతోపాటు ఆదినారాయణరెడ్డి, చింతమనేని వంటివారు దళితులను అవమానిస్తూ మాట్లాడారన్నారు. తనను దూషించిన నలుగురితోపాటు వారికి కులపిచ్చి తలకెక్కించిన చంద్రబాబును కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను, కుంభకోణాలను ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నాననే ఈ దారుణానికి తెగించారన్నారు. వారి బెదిరింపులకు భయపడనని, కుంభకోణాలను ప్రశ్నిస్తూనే ఉంటానని, టీడీపీ నేతలకు శిక్ష పడేవరకు పోరాటం ఆగదని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలి – మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులను కోరారు. ఈ విషయంపై గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మితో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పద్మ ప్రకటన విడుదల చేశారు. మహిళా ఎమ్మెల్యేని కించపరుస్తూ దూషిస్తూ దేవుడి దగ్గరకు వస్తే మైలపడిపోతారని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవిని పరామర్శించానని, మహిళా ప్రజాప్రతినిధులకు మహిళా కమిషన్ పూర్తి స్థాయి అండదండలు అందిస్తుందని స్పష్టం చేశారు. -
అయినా టీడీపీకి బుద్ది రాలేదు: ఎమ్మెల్యే ఎలిజా
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు చేసిన దాడిని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఖండించారు. సోమవారం దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు కులం పేరుతో దూషించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఎలీజా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నాయకులు దళితులపై దాడులకు పాల్పడటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేను టీడీపీ నేతలు కించపరచడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్నుముక వంటి వారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి దళితులు గుణపాఠం చెప్పిన వారికి సిగ్గు రాలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతల్లో మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఆగ్రహానికి కోట్టకుపోతారని వ్యాఖ్యానించారు. దళితులపై తరచు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేత చింతనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోంది
-
వినకూడని మాటలతో దూషించారు
-
వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుల దాష్టీకాలకు అడ్డులేకుండా పోతోంది. గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు. వేడుకల్లో దళితులు పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల గతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం అనంతవరంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తల తీరును ఆమె మీడియా ఎదుట దుయ్యబట్టారు. ‘కుల వివక్ష అనేది రాష్ట్ర రాజధానిలో కనిపించడం దారుణం. సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారు. వినాయకుడిని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్ను దూషించారు. రాజధానిలో జరుగుతున్న అవినీతిని వెలికితీసినందుకే నన్ను మానసికంగా వేధిస్తున్నారు. చెప్పరాని మాటలంటున్నారు. గతంలో చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడారు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు ఆయన బాటలోనే టీడీపీ నాయకులు నడుస్తున్నారు. వారికి కుల రాజకీయం తలకెక్కింది. రాజధానిలో వైస్సార్సీపీ గెలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజధానిలో వైస్సార్సీపీని ఓడించాలని టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని చులకనగా మాట్లాడారు. ఇంతటి కుల వివక్ష దేశంలో ఎక్కడా చూడలేదు. నన్ను కులం పేరుతో తిట్టిన వారినే కాకుండా చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి. తనపై కుల వివక్షతకు పాల్పడిన వారిని పెంచి పోషించింది చంద్రబాబే. రాజధానిలో దళితులను చిత్రవధ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ ఒక దళిత నేతేనా. ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకుంటారా. రాజధానిలో భూములు ఇచ్చిన దళితులకు ప్యాకేజీలో వివక్ష చూపించారు. టీడీపీ నేతల దాడులను తట్టుకునే పరిస్థితిలో దళితులు లేరు. దళితులు టీడీపీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నన్ను దూషించిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా కఠినంగా శిక్షించాలి’ అన్నారు. -
టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారు
-
టీడీపీ నేతలు దాష్టీకం.. దళిత ఎమ్మెల్యే కంటతడి
-
టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి
సాక్షి, అమరావతి : తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై శ్రీదేవి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. అణగారిన వర్గాల వారంటే టీడీపీ నేతలకు చిన్నచూపని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
మాటలు రానివాడంటే లోకేశ్..
సాక్షి, ఇచ్ఛాపురం: చంద్రబాబు దోపిడీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు సిండికేట్‌లా తయారయి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని భూముల నుంచి ఇసుక వరకు ప్రతిదాంట్లోనూ దోపిడీ పర్వం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ‘అవినీతి చక్రవర్తి’ బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం ఇచ్ఛాపురం వచ్చిన ఆమె ‘సాక్షి’టీవీతో మాట్లాడారు. ఇచ్ఛాపురం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నలుమూలల జనం నుంచి తరలిరావడంతో ఇసుక వేసినా రాలనంతగా జనం కనబడుతున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిని ఆమె ఎద్దేవా చేశారు. ‘మాటలు రానివాడంటే లోకేశ్, మాటలు చెప్తే అర్థంకాకపోతే ఆయన పవన్ కళ్యాణ్. మాట తప్పితే అది చంద్రబాబు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుంటారు కనుక తామంతా జగన్ వెంట ఉన్నామ’ని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు.