
సాక్షి, విజయవాడ : రాజధాని ప్రాతంలో చంద్రబాబు కుల ఉన్మాదాన్ని పెంచి పోషించారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వర్ రావు మండిపడ్డారు. తాడికొంత దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై తెలుగుదేశం కార్యకర్తల కుల వివక్ష దాడిని ఖండిస్తూ సమతా సైనిక్ దళ్ నాయకులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు కులం వారే ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసేవారని, బాబు పాలనలో సైతం దళితులపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.
విద్యావంతులైన మహిళ ఎమ్మెల్యేను కులం పేరుతో దూషించిన వారిని చంద్రబాబు పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ పార్టీ.. దళిత వ్యతిరేక పార్టీ అని, ఇలాంటివి మళ్లీ జరిగితే దళిత సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment