
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరును మహిళా శిశు శాఖమంత్రి తానేటి వనిత ఖండించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై వివక్ష చూపించారని, ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా టీడీపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా దళితులుగా ఎవరు పుడతారని అవమానించారని గుర్తు చేశారు. ఆయనలాగే తమ నేతలు కూడా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment