
సాక్షి, అమరావతి : తెలుగు దేశం నాయకులు తాడికొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. శుక్రవారం అనంతవరంలో చేపట్టిన బహిరంగ విచారణకు ఎమ్మెల్యే శ్రీదేవి, గ్రామస్ధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు రాములు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కాగా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే శ్రీదేవి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.
చదవండి : దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం