టీడీపీ నేతలు దాష్టీకం.. దళిత ఎమ్మెల్యే కంటతడి | TDP Leaders Using Unparliamentary Language On YSRCP MLA Sridevi | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు దాష్టీకం.. దళిత ఎమ్మెల్యే కంటతడి

Published Mon, Sep 2 2019 5:24 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement