Thullur mandal
-
తుళ్లూరు ఎమ్మార్వో కేసులో ఊహించని పరిణామం
సాక్షి, అమరావతి: అనేక మలుపులు తిరుగుతున్న అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి దాఖలైన కేసులో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఆకస్మాత్తుగా ఈ పిటిషన్‌ను రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) ►రాజధానికి భూములిస్తే పరిహారం రాదంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను అప్పటి అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడంలో అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబు, మరికొందరు సహకరించారంటూ సీఐడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ►ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సుధీర్‌బాబు మార్చి 23న హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, ఆ మరుసటి రోజే సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటిపై స్టే విధించింది. ►హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని, దర్యాప్తును కొనసాగనివ్వాలని అభిప్రాయపడింది. ►వారంలో విచారణ జరిపి తేల్చాలని ఈ నెల 1న సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ వ్యాజ్యం రోస్టర్ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు విచారణకు రాగా, ఈ నెల 12న ఇరుపక్షాల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేశారు. ►అయితే గురువారం ఈ పిటిషన్ జస్టిస్ రాయ్ ముందున్న కేసుల విచారణ జాబితాలో ‘ఫర్ బీయింగ్ మెన్షన్డ్’ శీర్షిక కింద లిస్ట్ అయింది. ఈ పిటిషన్‌ను తాను రిలీజ్ చేస్తున్నానని, దీనిని మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై పాలనా పరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్ చేసిన కేసును రిలీజ్ చేయడానికి గల కారణాలు నిర్దిష్టంగా తెలియరాలేదు. -
టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోంది
-
వినకూడని మాటలతో దూషించారు
-
వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుల దాష్టీకాలకు అడ్డులేకుండా పోతోంది. గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు. వేడుకల్లో దళితులు పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల గతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం అనంతవరంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తల తీరును ఆమె మీడియా ఎదుట దుయ్యబట్టారు. ‘కుల వివక్ష అనేది రాష్ట్ర రాజధానిలో కనిపించడం దారుణం. సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారు. వినాయకుడిని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్ను దూషించారు. రాజధానిలో జరుగుతున్న అవినీతిని వెలికితీసినందుకే నన్ను మానసికంగా వేధిస్తున్నారు. చెప్పరాని మాటలంటున్నారు. గతంలో చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడారు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు ఆయన బాటలోనే టీడీపీ నాయకులు నడుస్తున్నారు. వారికి కుల రాజకీయం తలకెక్కింది. రాజధానిలో వైస్సార్సీపీ గెలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజధానిలో వైస్సార్సీపీని ఓడించాలని టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని చులకనగా మాట్లాడారు. ఇంతటి కుల వివక్ష దేశంలో ఎక్కడా చూడలేదు. నన్ను కులం పేరుతో తిట్టిన వారినే కాకుండా చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి. తనపై కుల వివక్షతకు పాల్పడిన వారిని పెంచి పోషించింది చంద్రబాబే. రాజధానిలో దళితులను చిత్రవధ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ ఒక దళిత నేతేనా. ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకుంటారా. రాజధానిలో భూములు ఇచ్చిన దళితులకు ప్యాకేజీలో వివక్ష చూపించారు. టీడీపీ నేతల దాడులను తట్టుకునే పరిస్థితిలో దళితులు లేరు. దళితులు టీడీపీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నన్ను దూషించిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా కఠినంగా శిక్షించాలి’ అన్నారు. -
టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారు
-
టీడీపీ నేతలు దాష్టీకం.. దళిత ఎమ్మెల్యే కంటతడి
-
టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి
సాక్షి, అమరావతి : తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై శ్రీదేవి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. అణగారిన వర్గాల వారంటే టీడీపీ నేతలకు చిన్నచూపని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
భూమంతర్
జరీబు మెట్ట.. మెట్ట జరీబు రాజధానిలో టీడీపీ నేతల దందా పెద్దఎత్తున ప్లాట్లు దండుకునే యత్నం అధికారులను నిలదీసిన రైతులు రాజధానిలో తెలుగుదేశం పార్టీ నేతల భూదందాకు అంతూపొంతూ లేకుండా పోయింది. ఎక్కడ చక్కని భూమి కనిపిస్తుందా నొక్కేద్దామని కాచుకుని కూర్చున్నారు. తుళ్లూరు మండల పరిధిలోని బోరుపాలెం, అబ్బురాజుపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం గ్రామాల్లోని మెట్ట భూములను జరీబుగా.. జరీబు భూములను మెట్టగా మారుస్తూ తిమ్మిని బమ్మి చేస్తున్నారు. శాఖమూరులో అయితే తాను చెప్పింది వింటే సగం భూమన్నా వస్తుందని.. లేకుంటే సర్వం గోవిందా అంటూ టీడీపీకే చెందిన మరో నేత దందా చేస్తున్నాడు. అమరావతి : మెట్ట భూములను జరీబుగా, జరీబు భూములను మెట్టగా మార్చి తద్వారా ప్రతి ఎకరాకు పరిహారం కింద వచ్చే 250 గజాల స్థలాన్ని సైతం కొట్టేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆ మేరకు ఇప్పటికే సుమారు 72 ఎకరాల మెట్ట భూములను జరీబుగా, 54 ఎకరాల జరీబు భూములను మెట్టగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. విషయం తెలియడంతో బుధవారం బోరుపాలెం గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు ప్రభుత్వం పరిహారం కింద ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు నేలపాడు, శాఖమూరు, పిచ్చుకలపాలెం, దొండపాడు గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయించారు. మిగిలిన గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంది. ఎకరం మెట్ట భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాల నివాస స్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాటు ఇస్తారు. జరీబు భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య ప్లాటు ఇవ్వాలని నిర్ణయించారు. ప్లాట్లు దండుకునే యత్నంలో తమ్ముళ్లు తుళ్లూరు మండల పరిధిలోని బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం గ్రామాల పరిధిలో ఉన్న 72 ఎకరాల మెట్ట భూములను జరీబుగా మార్చేందుకు రికార్డులు సిద్ధం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా ఇటీవల 40 ఎకరాల్లో పవర్‌బోర్లు వేశారు. రాయపూడికి వెళ్లే మార్గంలో మరో ఐదు ఎకరాల మెట్ట భూమిని జరీబుగా మార్చినట్లు విశ్వసనీయ సమాచారం. జరీబు భూములను మెట్టగా మార్చినట్లు స్థానిక రైతులు కొందరు రెవెన్యూ అధికారులను నిలదీశారు. నిమ్మతోటలు ఉన్న భూములను మెట్టగా మార్చారని తెలుసుకున్న సంబంధిత రైతులు మంగళవారం పొద్దుపోయాక సాక్షి ప్రతినిధులను కలిశారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి చేస్తున్న మోసాన్ని వివరిస్తుండగా ఇద్దరు టీడీపీ నాయకులు వచ్చి బలవంతంగా ఆ రైతులను తీసుకెళ్లారు. సీఆర్డీఏ అధికారులను కలిశారు. భూములను మార్చే విషయం బయటపడి పత్రికల్లో వస్తే ఇబ్బంది అవుతుందని భావించిన అధికారులు బుధవారం బోరుపాలెం గ్రామంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కొందరు జరీబుని మెట్ట భూములుగా ఎలా మారుస్తారని నిలదీశారు. తమకొచ్చిన సమాచారం నిజమని తేలితే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. అనుకున్నట్లు అంతా సవ్యంగా జరిగితే అదనంగా వచ్చే 250 గజాల వాణిజ్య ప్లాట్లను టీడీపీ నాయకులు, అధికారులు కొందరు పంచుకునేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. జరీబు భూములంటే.. జరీబు భూముల గుర్తింపునకు కొన్ని నిబంధనలు విధించారు. నదికి దగరగా ఉండాలి. 50 అడుగుల లోపు నీరు, లూజ్ సాయిల్, ఉద్యానవన పంటలు సాగు చేసేవిగా ఉండే భూములను జరీబుగా నిర్ణయిస్తారు. మిగిలినవి మెట్ట భూములుగా గుర్తించి ఆమేరకు ప్లాట్లు పంపిణీ చేస్తారు. -
స్పష్టత లేకుండా భూములివ్వం
-
స్పష్టత లేకుండా భూములివ్వం
* లింగాయపాలెంలో టీడీపీ నేతల్ని నిలదీసిన రైతులు * రాజధాని ఎక్కడ? ఎలా? ఏం నిర్మిస్తారు? * ఎంత భూమి? ఎలాంటి ది కావాలి? * తుళ్లూరు మండలంలోనే ఎందుకు? * మెట్ట భూముల్ని వదిలి ఏడాదికి 3 పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటున్నారు? * కౌలు రైతులు, రైతు కూలీలకు ప్యాకేజీలేవీ? * ల్యాండ్ పూలింగ్ ఎలా నమ్మాలి? * చట్టబద్ధమైన జీవోలతో రావాలని డిమాండ్ తుళ్లూరు: ప్రభుత్వానికే స్పష్టత లేకుంటే రైతులనుంచి రాజధానికోసం భూములు ఎలా తీసుకుంటారని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీశారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ నేతృత్వంలోని మంత్రివర్గ ప్రతినిధి కమిటీ గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా లింగాయపాలెంలో రైతులు తమ అభిప్రాయాలను కమిటీ ముందు ఉంచారు. రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ... రాజధాని ఎక్కడ నిర్మిస్తారు? ఎలా నిర్మిస్తారు? ఏమేం నిర్మిస్తారు? వాటికి ఎంత భూమి కావాలి? ఎలాంటి భూమి కావాలి? తుళ్ళూరు మండలంలోనే ఎందుకు రాజధాని నిర్మించే ప్రతిపాదనలు చేస్తున్నారు? ఆనే ప్రశ్నల వర్షం గుప్పించారు. ఓవైపు అధికారులను, రైతులను, ల్యాండ్ పూలింగ్‌కు సన్నద్ధం చేస్తూ మరోవైపు రాజధాని నిర్మాణం కోసం నమూనాలు పరిశీలించేందుకు సీఎం సింగపూర్, మలేసియా పర్యటనలు చేస్తున్నారంటే ఇంతవరకు ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదనే విషయం అర్థమవుతోందన్నారు. చట్టబద్ధతలేని ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వ్యవసాయకూలీలకు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్యాకేజీలు కానీ, ప్రతిపాదనలు గానీ చేయలేదని ఆక్షేపించారు. చట్టబద్ధమైన జీవోలతో రైతుల వద్దకు రావాలని డిమాండ్ చేశారు. మరో రైతు మాదల భువనేశ్వరరావు మాట్లాడుతూ మెట్టప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వుంటే ఏడాది మూడు పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. కౌలు రైతు మోతుకూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సభకు వచ్చిన 500 మందిలో 50 మందికి మాత్రమే భూములు వున్నాయని మిగిలినవారంతా వ్యవసాయ కూలీలని చెప్పారు. ఈ భూములు లేకుంటే వారు ఏమైపోవాలని ప్రశ్నించారు. అనంతరం ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రైతుల అభిప్రాయాలు సీఎంకు వివరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 18, 19 తేదీలలో రైతులతో సమావేశ పరుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అనంతరం వెలగపూడిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా సూరాయపాలెం, గొల్లపూడి మధ్య నుంచి తుళ్లూరు మండలంలోని వెంకటపాలెం వరకూ వేగంగా వంతెన నిర్మిస్తామని తెలిపారు. రూ.20 వేల కోట్లతో బందరు పోర్టును అభివృద్ధి చేయడంతో పాటు కంటైనర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని వివరించారు. -
సిరికి ఉరి
తుళ్లూరు..తాజాగా అధికారులు, అధికార పార్టీ నేతల నోళ్లల్లో నానుతున్న మండలం ఇది.. నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించి గుర్తించిన మండలం కూడా ఇదే..అందుకే జిల్లాలోని అందరి దృష్టి ఇక్కడే..... రైతుల భూములను సేకరించాలని ఓ వైపు అధికారులపై ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి...మరో వైపు భూములు ఇవ్వబోమంటున్న రైతులు...రెండు పరస్పర విరుద్ధాల మధ్య తుళ్లూరు మండలం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూములు ఇచ్చేందుకు రైతులు ఎందుకు ఒప్పుకోవడం లేదు?, భూములు ఇస్తే ఎదురయ్యే పరిణామాలు ఏమిటీ ?, ఈ కోణంలో ఆలోచించగలిగితే రైతుల దూర దృష్టి అర్థమవుతోంది. ఎందుకు ఇవ్వనంటున్నారో బోధపడుతోంది. ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలు అవగతమవుతాయి.. వ్యవసాయ ప్రాంతమైన తుళ్లూరు మండలానికి రాష్ట్రంలోనే ఏ జిల్లాకు లేని ప్రత్యేకత ఉంది. ఎక్కడా లేని విధంగా మూడు ఎత్తిపోతల పథకాలు ఇక్కడే ఉన్నాయి. అంతేనా సారవంతమైన భూములతో సిరిసంపదలకు నిలయం.. నిత్యకల్యాణం పచ్చ తోరణంలా రైతులు బంగరు పంటలు పండిస్తుంటారు. మరి అలాంటి భూములను ప్రభుత్వం తీసుకుంటే ఇప్పటి వరకు పండే పంటల పరిస్థితి ఏమిటి ?, వ్యవసాయ ఉత్పత్తుల మాటేమిటి?, ఆదాయ వనరుల మా టేమిటి? అందుకే సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్న తుళ్లూరు రైతులు పంటలు పండే సారవంతమైన భూములు ఇవ్వబోమంటున్నారు. ప్రభుత్వం అనుకున్నదే జరిగితే సిరికి ఉరేనంటున్నారు. తుళ్లూరు: తుళ్ళూరు మండలంలోని 19 గ్రాామ పంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు, మొత్తం 33వేల 247 ఎకరాల సాగు భూమి వుంది. ఈ వేలాది ఎకరాల్లో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు సాగవుతుంటాయి. దాదాపు 15 వేల మంది రైతులు సేద్యాన్ని, 50 వేల మంది కూలీలు శ్రమను నమ్ముకుని బతుకుతున్నారు. ఇంకా పరిశీలిస్తే పండే పంటలు ఇలా కనిపిస్తాయి. పత్తి 6,500 ఎకరాలు, మిరప 997, మినుము 1200, పెసర 1000, శనగ 1500, పసుపు 86, అరటి 2898, దొండ99, కంద 560, బీర 71, దోస 30, బెండ 38, ఫ్లవర్స్ 25, నిమ్మ 580, క్యాలీఫ్లవర్ 150, కరివేపాకు 44, జామ 79, సపోటా 5, యూకలిప్టస్ 5 ఎకరాల్లో, ఇంకా చెరకు, క్యాబేజీ, క్యారెట్ ఇతర పంటలు సాగవుతున్నాయి. పచ్చని పంటలతో కళకళలాడే మండలం చెంత కృష్ణానది పాయ మరింత అందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తోంది. బ్యారేజీ బ్యాక్‌వాటర్ ప్రభావంతో మండలంలోని 12 గ్రామాలలో భూగర్భ జలసంపద తొణికిసలాడుతుంటుంది. ఏడాదికి మూడు పర్యాయాలు , మూడు రకాల పంటలు సాగు చేసే రైతులు జిల్లాకు ఆహార ఉత్పత్తుల అందజేతలో కీలక పాత్ర పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడేం జరుగుతోంది... రాజధాని నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలంలో భూసేకరణ అంశం ఇటు రైతులు, అటు ప్రజల్లో కలకలం రేపుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు రైతులు తల్లడిల్లుతున్నారు. పంటలు పండని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వున్నా ఈ మండలం పైనే సీఎం ఎందుకు దృష్టి సారించారని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం పంపిన అధికారులు బలవంతంగా రైతులను ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఇదిలావుంటే, తొలుత ఇక్కడే రాజధాని రాబోతుందనే ప్రచారం ఊపందుకోగానే తుళ్లూరు మండ లంలో ఎకరం పొలం రూ. కోటి కి పైగానే కొనేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారులు ముందుకు వచ్చారు. అక్కడక్కడా కొనుగోలు చేశారు. ఇంతలోనే ప్రభుత్వం భూసేకరణ జరుపుతుందని తెలియగానే రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు దిగజారాయి. రైతుల బలహీనతలను వాడుకుంటూ రియల్టర్లు భూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.