టీడీపీ నేతలు ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. అణగారిన వర్గాల వారంటే టీడీపీ నేతలకు చిన్నచూపని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.