
సాక్షి, గుంటూరు : తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. పేకాట శిబిరాల్లో తన అనుచరులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. తానే పేకాట ఆడిస్తున్నానని వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, వాటితో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. పేకాట శిబిరాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment