
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు చేసిన దాడిని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఖండించారు. సోమవారం దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులు కులం పేరుతో దూషించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఎలీజా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నాయకులు దళితులపై దాడులకు పాల్పడటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు.
సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేను టీడీపీ నేతలు కించపరచడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్నుముక వంటి వారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి దళితులు గుణపాఠం చెప్పిన వారికి సిగ్గు రాలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతల్లో మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఆగ్రహానికి కోట్టకుపోతారని వ్యాఖ్యానించారు. దళితులపై తరచు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేత చింతనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment