
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని తెలిపారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్ల మహిళా లోకానికే తీరని అన్యాయం జరుగుతోందని తెలిపారు. గతంలో చంద్రబాబు పాలనలో మహిళలకు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు.
చదవండి: సంక్షేమ పథకాలు ఆపేందుకు టీడీపీ కుట్ర
మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందని గుర్తుశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ ఎప్పుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. లోకేష్, టీడీపీ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండేళ్లలో 4శాతం క్రైం రేటు తగ్గిందని, మహిళా సాధికారత అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిందే సీఎం జగన్ అని పేర్కొన్నారు. దిశా చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి.. అన్ని పార్టీలు సహకరించాలని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment