చిత్తురు జిల్లా చంద్రగిరిలో నియోజకవర్గ పరిధిలో మరో రెండు చోట్ల రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని జిల్లా ఎన్నికల సంఘం అధికారి ప్రద్యుమ్న తెలిపారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన 5 పోలింగ్ కేంద్రాలతో(ఎన్‌ఆర్ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం) పాటు కొత్తగా ప్రకటించిన కాలురు, కుప్పం బాదురుల కేంద్రాలలో ఆదివారం రీపోలింగ్ జరగనుంది.