పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ నేతలు భారీగా నగదు, మద్యం పంపిణీకి తెరలేపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పలు చోట్ల టీడీపీ నాయకులకు చెందిన డబ్బులను, మద్యాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా రేణిగుంటలో టీడీపీ నాయకునికి చెందిన ఓ భవనంలో రూ. 20 కోట్ల రూపాయలు దాచి ఉంచినట్టు వార్తలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.