న్యాయవ్యవస్థలో సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఓ న్యాయాధికారి ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో అరెస్టు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనా ర్హం.