ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం సిట్ బృందం హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. తరువాత రెవెన్యూ అధికారుల సమక్షంలో కార్యాలయానికి సీల్ వేసి సీజ్ చేసింది. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా కొందరు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.