IT Grids Scam
-
‘ఐటీగ్రిడ్ మాదిరిగా కేసు నమోదు చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర వేదిక’పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించే సమగ్ర నివేదిక ఉద్దేశాలను వెల్లడించాలని అన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రజల ఫుట్‌ప్రింట్ కూడా లభిస్తుందన్న జయేశ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఐటీగ్రిడ్ మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం చోరీ చేసిందని ఐటీగ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని అన్నారు. మరి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కేసు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాల్ని క్రోడీకరించి దుర్వినియోగానికి తెర తీసిందని మండిపడ్డారు. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని క్రోడీకరించడం చట్ట విరుద్ధమన్నారు. వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్‌ను అన్ని పథకాలకు ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టే ఆదేశించిందని, పౌరుల ఫుట్‌ప్రింట్ కూడా తమవద్ద ఉంటుందని ఐటీ కార్యదర్శి అనడం ఆందోళన కలిగిస్తోందని శ్రవణ్ చెప్పారు. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్న గ్యారెంటీ ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. -
‘ఐటీ గ్రిడ్స్’ నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల డేటా, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారనే ఆరోపణలున్న కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డి.అశోక్, ఆ సంస్థ డైరెక్టరైన ఆయన భార్య శ్రీలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారిద్దరూ దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల విలువైన పూచీకత్తులను ఇద్దరూ సమర్పించాలని, సంబంధిత పోలీస్స్టేషన్లలో రోజూ హాజరుకావాలని, ఏదైనా కోర్టులో పాస్‌పోర్టులు సరెండర్ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది. ఐటీ గ్రిడ్స్‌తో టీడీపీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను ఆ కంపెనీకి అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో గత నెల 25న రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ దరఖాస్తులను తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : అశోక్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్‌ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రంగారెడ్డి కోరక్టు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో అశోక్, అతని భార్య శ్రీ లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కేసుల రద్దు కోసం ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం , ముంబై , బెంగళూరులో అతని కోసం గాలిస్తున్నారు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
ఐటీ గ్రిడ్స్ నిందితుల బెయిల్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాకవరం అశోక్, ఆ సంస్థ డైరెక్టర్, ఆయన భార్య శ్రీలక్ష్మి హైకోర్టులో వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డామని పోలీసులు తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, తమను అరెస్ట్ చేసే అవకాశమున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు రిట్ పిటిషన్లలో కోర్టును కోరారు. ముందస్తు బెయిల్ కోసం వారు చేసుకున్న దరఖాస్తులను రంగారెడ్డి జిల్లాకోర్టు ఈ నెల 25న తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్స్‌తో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని భావించిన వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తునకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్, శ్రీలక్ష్మి స్పందించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
నిందితులకు షెల్టర్‌జోన్‌గా అమరావతి
సాక్షి, అమరావతి: సంచలనం రేకెత్తించిన కీలక కేసుల్లో నిందితులకు అమరావతి షెల్టర్ జోన్‌గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయి, కేసుల్లో చిక్కుకున్న నిందితులు ఆంధ్రప్రదేశ్‌లో దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఓటుకు నోటు కేసు, డేటా స్కామ్, టీవీ 9కు సంబంధించిన చీటింగ్ కేసు వంటి వాటిలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయిన వారికి చంద్రబాబు అభయం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసుల నుంచి, తన ప్రయోజనం కోసం పనిచేసే వారి కేసుల వరకు నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించేలా పరిణమిస్తున్నాయి. అనేక కేసుల్లో నింది తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినట్టుగానే తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడైన సినీ నటుడు శివాజీలకు ఏపీలో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు శివాజీలు టీడీపీ పెద్దల సంరక్షణలో విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన వీరిని ప్రకాశం జిల్లాలోని ఒక రిసార్ట్స్‌లోను, మరో ఫామ్‌హౌస్‌లోను రెండు రోజుల క్రితం వరకు సకల సౌకర్యాలతో సాకినట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సంరక్షణలోనే రవిప్రకాశ్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. శివాజీకి కూడా విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలంటూ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించడం గమనార్హం. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై సంతృప్తి చెందని తెలంగాణ పోలీసులు వారు ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగడం గమనార్హం. ఇప్పటికే రెండు పర్యాయాలు రవిప్రకాశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన్ను కాపాడేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండటం విమర్శలకు తావిస్తోంది. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు నేరుగా రామోజీరావును కలవడం కలకలం రేపుతోంది. తన రాజగురువు రామోజీరావు ద్వారా టీవీ 9 యాజమాన్యానికి చెందిన రామేశ్వర్‌కు నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ దొరకని అశోక్ ఆచూకీ.. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అడ్డగోలుగా డేటా స్కామ్‌కు పాల్పడిన వ్యవ హారంలో ప్రధాన పాత్రధారి ఐటీ గ్రిడ్స్ ఎండీ దాకవరపు అశోక్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దల బండారం బయట పడుతుందనే భయంతో అతన్ని చంద్రబాబు సర్కారే కాపాడుతోందనే అనుమానాలున్నాయి. ఆధార్ డేటాబేస్కు ఏపీ, తెలంగాణకు ప్రజల 7,82,21,397 రికార్డులు లింక్ అయ్యాయని, ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి, ఇప్పటికే ప్రా«థమిక రిపోర్టు ఇచ్చింది. అశోక్‌ను కాపాడేందుకు ఏపీఎస్పీ 6 బెటా లియన్తోపాటు ఇతర రహస్య ప్రాంతాలకు తరలిస్తూ షెల్టర్ ఇస్తున్నట్టు సమాచారం. అశోక్ తెలంగాణ పోలీసులకు దొరక్కుండా ఏపీ సర్కార్ షెల్టర్ ఇవ్వడంతోపాటు ఇంటె లిజెన్స్‌కు చెందిన ఇద్దరు గన్మెన్లను కూడా ఇచ్చి వీఐపీ భద్రత కల్పించినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు షెల్టర్ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన చంద్రబాబు..ఆ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీకి చెందిన జెరుసలేం మత్తయ్యకు అప్పట్లో విజయవాడలో షెల్టర్ ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసును రాజకీయం చేసి దాని నుంచి తప్పించుకునేలా ఏపీలోనూ చంద్రబాబు కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసి అది కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. గరుడ పురాణం శివాజీకి దన్ను ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీలపై అనేక కట్టుకధలు అల్లిన గరుడ పురాణం సృష్టికర్త శివాజీ కొంతకాలం పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయి ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబుకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్న సినీనటుడు శివాజీ గరుడ పురాణం స్క్రిప్ట్ అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఒక మంత్రి సహకారంతో సిద్ధం చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితిని కల్పించేలా, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వంపైన అభూతకల్పనలతో ఆయన చెప్పిన గరుడ పురాణం గుట్టు విప్పేలా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలన్న డిమాండ్ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన అదృశ్యమయ్యారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగబోతోందని ముందే చెప్పిన శివాజీ ఆ విషయం ఎలా గుర్తించారు? ఆయనకు టీడీపీ పెద్దలు ముందే లీకులు ఇచ్చి చెప్పించి నెపం వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారా? అనే అనేక ప్రశ్నలకు ఆయన్ను విచారిస్తేనే జవాబులు తెలుస్తాయనే బలమైన వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కొంతకాలం, అమెరికాలో మరికొద్ది రోజులు ఆయన తలదాచుకోవడం వెనుక టీడీపీ పెద్దల దన్ను ఉందనేది బహిరంగ రహస్యం. -
ఐటిగ్రిడ్ అశోక్‌కు లోకేష్‌కు సంబంధం ఏమిటి?
-
‘ఆడపిల్లల సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉంది’
సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉందని మండిపడ్డారు. మహిళల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్లు తదితర వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఠా దగ్గర ఉన్నాయని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్స్‌కు ప్రజల డేటా చేరిందన్నారు. చంద్రబాబు బినామీలకే పలు ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పజెప్పారని విమర్శించారు. అభయ యాప్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారని సూటిగా ప్రశ్నించారు.దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ఉపయోగించిన టెక్నాలజీకి పేరు మార్చి సీఎం డ్యాష్ బోర్డు అంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘2016లో జే సత్యనారాయణ యూఐడీఏ చైర్మన్ అయిన తర్వాత ఆధార్ డేటాను ఈ ప్రగతికి లింక్ చేశారు. సంక్షేమ పథకాల కోసం డేటాను ఈ ప్రగతికి లింక్ చేసినట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రగతి నుంచి ఆధార్ డేటాను టీడీపీ సేవామిత్ర యాప్‌కు మళ్లించారు. సేవామిత్ర యాప్‌ను ఐటీ గ్రిడ్స్ సంస్థ రూపొందించింది. డేటా చోరీ జరిగినట్టు ఫిర్యాదు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్‌పై కేసు నమోదు చేశారు. ప్రజల ఫోన్లలో ఉండే సమాచారాన్ని సేవామిత్ర యాప్‌తో ట్రాక్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన బినామీ అశోక్‌తో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రజల ఫోన్ స్టోరేజీ డేటా కూడా వారి వద్దకు వెళ్లిపోయింది. చంద్రబాబు, అశోక్ ద్వారా దేశానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు అభద్రతా భావం కల్పించారు. సేవామిత్ర యాప్‌తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. అశోక్ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?. టీడీపీ ప్రభుత్వం బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే తాము ఏం చేశామో చెప్పాల్సిన బాధ్యత సిట్‌పై ఉంది. టీడీపీ ప్రభుత్వ దొంగతనాన్ని దాచడానికే సిట్ వేశారా?. ఈ ప్రగతి, సీఎం డ్యాష్ బోర్డుల పేరిట టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాంకేతికతను ఉపయోగించుకోకుండా చంద్రబాబు తన బినామీలకు టెక్నాలజీ అప్డేట్ పేరిట కాంట్రాక్టులు అప్పజెప్పారు. బాలసుబ్రహ్మణ్యం సతీమణి నిర్వహిస్తున్న గ్రీన్ ఆర్గ్, ఓటీఎస్ఐ కంపెనీలకు ఆర్టీఏ వెబ్సైట్ సాంకేతిక బాధ్యతలను అప్పగించారు. రూ. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్ పైలెట్ ప్రాజెక్టును తీసుకువచ్చారు. అయితే అభయ యాప్ ద్వారా ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారు?. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్‌గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఏవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. తమకు అనుకూలంగా లేని ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ ఆ పార్టీ వెబ్సైట్లోనే నాయకులను ఆదేశించింది. అశోక్ ఎక్కడున్నారో చంద్రబాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావులను అడగాలి. ఇటీవల అశోక్ పలువురు హ్యాకర్లతో ఢిల్లీలో సమావేశమై.. కౌంటింగ్ రోజు ఎలా హ్యాక్ చేస్తే టీడీపీ అనుకూలంగా ఫలితాలు రాబట్టవచ్చనే అంశం మాట్లాడినట్టు తెలిసింది. ఇంతా జరుగుతున్నా ఏపీ, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కౌంటింగ్ రోజున భద్రతా చర్యల గురించి ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. టీడీపీ నాయకులు శాంతి భద్రతల సమస్య సృష్టించే అవకాశం ఉందని తెలిపాం. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు అరెస్ట్ అయినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి ఎదైయినా జరిగిందంటే దాని వెనుక టీడీపీ హస్తం ఉండే అవకాశం ఉంద’ని తెలిపారు. -
ఆపరేషన్ అశోక్ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో కీలక నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్ కోసం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తమ డేటా కూడా చోరీ చేశారని ఆధార్ సంస్థ కూడా తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ‘సేవా మిత్ర’యాప్ కోసం దాన్ని నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆధార్ సర్వర్ నుంచే సమాచారాన్ని తస్కరించి ఉంటుందన్న అనుమానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆధార్ సమాచారం కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందని సిట్ బృందం గుర్తించింది. అశోక్ కోసం ప్రత్యేక బృందాలు.. గత ఫిబ్రవరి 27 తరువాత అశోక్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అప్పుడే ఏపీకి పారిపోయిన అతను అక్కడ ఏపీ పెద్దల సంరక్షణలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేయడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సిట్ కొన్ని ప్రత్యేక బృందాలను ఏపీకి, కర్ణాటకకు పంపింది. ఐటీ గ్రిడ్స్ సంస్థలపై దాడులు చేసినప్పుడు పోలీసులు దాదాపు 60 హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటిలో సమాచారం డిలీట్ చేసి ఉంది. దాదాపు 40 హార్డ్ డిస్క్‌ల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సమాచారాన్ని రీట్రైవ్ చేయగలిగింది. తెలంగాణ, ఏపీ ప్రజల ఆధార్ వివరాలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తేల్చడంతో మిగిలిన డిస్క్‌ల్లో ఏముందోనన్న ఉత్కంఠ నెలకొంది. వాటిలో కీలక అంశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
డేటా దొంగలకు ఢిల్లీ లింక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు దీర్ఘకాలిక పన్నాగాన్ని పక్కాగా అమలు చేసినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని అంత పక్కాగా తస్కరించగలిగారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2015 నుంచే పన్నాగం... 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం టీడీపీ గుప్పిట్లోకి వచ్చేలా 2015లోనే చంద్రబాబు పథక రచన చేశారు. ముందస్తు వ్యూహంతోనే ఆధార్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వ ఈ–గవర్నెన్స్, ఐటీ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఇలా జోడు పదవుల్లో ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. టీడీపీ కార్యాలయానికి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. దాన్ని రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ద్వారా టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరవేసింది. సాధికారిక సర్వేలో సేకరించిన సమాచారాన్ని మించి ప్రజల వ్యక్తిగత వివరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహం రచించింది. తెలంగాణ ప్రజల సమాచారం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్న విధంగానే ఢిల్లీలోని ఆధార్ అథారిటీ నుంచి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం లభించినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీకి చేరవేశారు. పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా మొత్తం వ్యక్తిగత సమాచారం అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి చేరిపోయింది. సైబర్ నేరాలకు ఊతం తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు చేరడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో శాస్త్రవేత్తలు, రక్షణ పరిశోధనా సంస్థలు, త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది వివరాలు కూడా ఉండటంతో ఈ వ్యవహారం అత్యంత సున్నితంగా మారింది. ఇది సైబర్ నేరాలకు ఊతమివ్వడంతోపాటు దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శత్రు దేశాలకు ఈ సమాచారం చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి లోకేష్‌తో అశోక్ (ఫైల్) ఇంటి దొంగల హస్తం! ప్రజల వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కడం అంటే పార్లమెంటులో చేసిన ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆధార్ సమాచారం బయటకు పొక్కడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అథారిటీ రంగంలోకి దిగి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అథారిటీ డేటా చోరీపై ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం.. డేటా చోరీపై తెలంగాణా పోలీసుల దర్యాప్తుతోపాటు ఆధార్ అథారిటీ అంతర్గత విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆధార్ అథారిటీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. డేటా తస్కరించిన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఈఏఎస్ శర్మ,, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరడం వెనుక ఆధార్ అథారిటీ పెద్దల పాత్ర కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఆధార్ అథారిటీ అధికారుల పాత్ర లేకుండా కీలక సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి చేరడం అసంభవమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఓ లేఖ రాశారు. ఆధార్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను గతంలోనే కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ నియామకాన్ని పునఃసమీక్షించకపోవడాన్ని తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్స్‌తోపాటు ఆధార్ అథారిటీ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన రాజకీయ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్ అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సర్వర్లు భద్రం: యూఐడీఏఐ తమ సర్వర్లు పూర్తి భద్రంగానే ఉన్నాయని ఆధార్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ బుధవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ (సీఐడీఆర్), ఇతర సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చౌర్యానికి గురి కాలేదని అందులో పేర్కొంది. ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు టీడీపీ సర్కార్ షెల్టర్ డేటా చోరీ కేసులో టీడీపీ సేవామిత్ర యాప్‌ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డేటా చోరీ కేసులో దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ డి.అశోక్ కుమార్‌తోపాటు తెరవెనుక సూత్రధారులపై తెలంగాణ సిట్ దృష్టి సారించింది. ఆధార్‌తోపాటు మరో 17 రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కొద్ది రోజుల క్రితం ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలతో అశోక్ కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్ లొంగిపోకపోవడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. అశోక్‌తోపాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏబీ పర్యవేక్షణలోనే ఆశ్రయం! మరోవైపు అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆయన్ను టీడీపీ సర్కారే కాపాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం సేవామిత్ర యాప్ కోసం తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దోషులుగా నిలబడే పరిస్థితి రావడంతో అశోక్‌ను రహస్య ప్రదేశంలో దాచినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే అశోక్‌కు ప్రభుత్వం షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వ్యక్తి మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలో తొలుత అశోక్‌ను ఉంచినట్టు ప్రచారం జరిగింది. అనంతరం విజయవాడ గొల్లపూడిలోని ఇంటెలిజెన్స్ అతిధిగృహంలో అశోక్‌ను పోలీసుల రక్షణ నడుమ కొద్ది రోజులు దాచినట్టు తెలిసింది. తరువాత ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో అశోక్‌కు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత నిఘా చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా చంద్రబాబు కోసం అశోక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షెల్టర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్‌కు ముందు రోజు సేవామిత్రతో సూచనలు డేటా స్కామ్ బయట పడిన మరుక్షణమే మూసివేసిన టీడీపీ సేవామిత్ర యాప్‌ను పోలింగ్‌కు ఒక రోజు ముందు మళ్లీ పని చేయించడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు ఓటింగ్‌పై సూచనలు ఇచ్చేందుకు సేవామిత్ర యాప్‌ను వినియోగంలోకి తెచ్చారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్ డైరెక్షన్లోనే మళ్లీ సేవామిత్ర యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలంగాణ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అశోక్‌ను ఎక్కడకు తరలించారనే అంశంపై తెలంగాణ పోలీసు ప్రత్యేక బృందాలు దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదనే చర్చ ఏపీ పోలీసు వర్గాల్లోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల డేటా సైతం చోరీ సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికలో ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఆధార్ వివరాలు కూడా ఉన్నట్లు తెలంగాణ సిట్ బృందం గుర్తించింది. దీంతో ఇన్నాళ్లూ భావించినట్లుగా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా కూడా ఉండటంతో కేసు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరస్థుల గాలింపు కోసం పలు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆధార్ వివరాలు కోరినా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అంగీకరించలేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) కూడా దాదాపుగా ఇలాంటి విజ్ఞప్తే చేసినా నిరాకరించింది. ఆధార్ సెక్షన్ 29 ప్రకారం పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అత్యంత అరుదైన కేసుల్లో సెక్షన్ 33 ప్రకారం మాత్రమే పరిమిత సమాచారం ఇస్తామని పేర్కొంది. -
డేటా చోర్‌పై నిఘా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత డేటా చోరీలో కీలక సూత్రధారిగా ఉన్న డాకవరం అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూసిన రెండు నెలల నుంచి అతను అజ్ఞాతంలోనే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సిట్ బృందం అశోక్ జాడను గుర్తించడం కోసం రంగంలోకి టీమ్‌లు దింపిన క్రమంలో అతని స్వస్థలం అల్లూరులో మళ్లీ అలజడి రేగింది. అశోక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అతని మూలాలపై జిల్లాలో చర్చ సాగుతోంది. అనతి కాలంలలో బడా వ్యక్తిగా ఎదగడం వెనుక రాజకీయంగా జిల్లాలో ఎవరి సహకారం ఉంది. స్థానికంగా సహకరిస్తున్నది ఎవరనే దానిపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రజల ఆధార్ కార్డులతో పాటు వ్యక్తిగత డేటా చోరీ చేసిన డాకవరం అశోక్ కావలి నియోజకవర్గం అల్లూరుకు చెందిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబం నుంచి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ముఖ్యంగా అశోక్ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత జిల్లాలో పొలాలు భారీగా కొనుగోలు చేశాడు. అశోక్ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, బీద సోదరులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని ఓటర్ల ఆధార్ డేటాతో పాటు వ్యక్తిగత వివరాల డేటాను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా లిమిటెడ్ తస్కరించిదనితెలంగాణ సిట్ బృందం నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల క్రితం కేసు నమోదైంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడ, ఎన్నికల ప్రక్రియ జరగటంతో పోలీసులు కేసును పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికలు ముగిసిపోవడంతో ఆధార్ డేటా వ్యవహారం తెరపైకి రావడంతో అశోక్ కోసం అన్వేషణ మొదలైంది. ముఖ్యంగా అశోక్ గడిచిన నాలుగు నెలల కాలంలో జిల్లాకు వచ్చారా? అనే దానిపై పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించినట్లు సమాచారం. వాస్తవంగా గతంలో అశోక్ ఏటా మూడు నాలుగు సార్లు అల్లూరుకు వచ్చి వెళ్తుండేవాడు. గడిచిన నాలుగు నెలలుగా జిల్లాకు రాలేదని ప్రాథకంగా నిర్ధారించారు. అల్లూరులో అశోక్ బంధువులు, సన్నిహితులు ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీద టూ నారా లోకేష్ అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన బీద సోదరుల సహకారంతో సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు అశోక్ సన్నిహితుడుగా మారాడు. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను అశోక్ సంస్థే రూపొందించింది. అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచిన బుజ్జయ్య మండలంలో ఉప్పు సాగు చేసే సాధారణ రైతు. ఆర్థికంగా నష్టపోయాడు. ఈక్రమంలో బుజ్జయ్య కుమారుడు అశోక్ కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బుజ్జయ్య కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. అశోక్ అల్లూరులో ఇంటర్మీడియట్, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కొత్త టెక్నాలజీ పేరుతో బీద రవిచంద్ర ద్వారా సీఎం చంద్రబాబునాయుడ్ని, ఆయన కుమారుడు లోకేష్‌ను కలిశారు. తద్వారా కొద్ది నెలలకే వారికి సొంత మనిషిగా మారిపోయాడు. దీనికి టీడీపీ నేతలుగా ఉన్న బీద సోదరులు వారధిగా నిలిచారు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ప్రారంభించాడు. లోకేష్ మంత్రిత్వ శాఖలోని విభాగాలకు సంబంధించి సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ డెవలప్ చేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ యాప్, పంచాయతీరాజ్ విభాగం, డ్రిప్ ఇరిగేషన్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం తదితర ప్రభుత్వ వైబ్‌సైట్లతో పాటు వాటికి సంబంధించి సాంకేతిక సహకారం వీరే అందిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను తయారు చేసి, ఈ యాప్‌ను టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో పని చేసే విధంగా సాంకేతికతను తయారు చేశారు. -
డేటా ఇచ్చిందెవరు?
-
‘ఐటీ గ్రిడ్స్’కు డేటా ఇచ్చిందెవరు?
సాక్షి, హైదరాబాద్: ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వద్ద భద్రంగా ఉం డాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది. ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం ఉండొ చ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. తొలుత వేటు పడేది అధికారులపైనే.. ఈ కేసులో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40కిపైగా హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం జరిగిందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవ్వడంతో సిట్ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్‌లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది. -
దొంగలపాలైన ‘ఆధార్’
చీకటి పనులకు అలవాటు పడకుండా ఉండాలేగానీ...ఆ ఊబిలోకి దిగబడ్డాక ఇక పైకి రావడమంటూ ఉండదు. స్వల్ప శాతం ఓట్ల తేడాతో 2014లో అధికారంలోకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లూ ఇష్టానుసారం పాలించారు. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు వీటిపై ఎప్పటికప్పుడు నిలదీసినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఇది దేనికి దారితీసిందో తెలంగాణ పోలీసులకు అందిన తాజా ఫిర్యాదు తేటతెల్లం చేసింది. సాక్షాత్తూ ఆధార్ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ టి. భవానీ ప్రసాద్ ఈ ఫిర్యాదు చేశారు. ఆధార్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు 7 కోట్ల 83 లక్షలమంది ప్రజానీకానికి సంబంధించిన డేటా చోరీకి గురయిందని, ఇది దేశభద్రతకే ముప్పు కలిగిస్తుందని ఆ ఫిర్యాదు సారాంశం. ఇందులో అత్యంత ప్రమాదకరమైనదేమంటే...ఈ డేటాను నిందితులు అమెజాన్ క్లౌడ్ సర్వీస్‌లో నిక్షిప్తం చేశారు. ఆ సర్వీస్‌ను ప్రపంచంలో ఏమూలనున్న నేరగాళ్లయినా హ్యాక్ చేశారంటే కోట్లాదిమంది పౌరుల సమాచారం వారి చేతుల్లో పడుతుంది. దాన్ని ఉపయోగించుకుని వారు ఏంచేయడానికైనా ఆస్కారం ఉంది. గత నెల మొదట్లో తొలిసారి ఈ డేటా చోరీ వ్యవహారం వెలుగులోకొచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన సహచరులు చేసిన హడావుడి, దీన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు చేసిన యత్నం వెనకున్న వ్యూహమేమిటో ఇప్పుడు అందరికీ అర్ధమవుతుంది. (చదవండి : ఇది దేశ భద్రతకే సవాల్) జరిగిన నేరం ఎంత తీవ్రమైనదో, దాని పర్యవసానాలేమిటో చంద్రబాబుకు తెలుసు. అందువల్లే డేటా చోరీ వ్యవహారం బయటకు పొక్కగానే ఏపీ పోలీసులు క్షణాల్లో హైదరాబాద్‌కొచ్చి వాలారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని అపహరించుకుపోవడానికి ప్రయత్నించారు. తెలంగాణ పోలీసులు అడ్డుకోనట్టయితే ఆయన్ను ఏపీకి తరలించేవారే. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్‌కు పోటీగా చంద్రబాబు రెండు సిట్లు వేసి పక్కదోవ పట్టించాలని చూశారు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణపై ఎదురుదాడికి దిగారు. లోకేశ్వర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడున్నర కోట్లమంది ఓటర్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించి దాన్ని తెలుగుదేశం కార్యకర్తల ఫోన్లలో ‘సేవామిత్ర’ యాప్ కింద లభ్యమయ్యే ఏర్పాటు చేశారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితా, ఇటు ఆధార్ డేటా అనుసంధానించి దీన్ని రూపొందించారని అప్పుడు బయటికొచ్చింది. కానీ తాజాగా భవానీ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మరింత తీవ్రమైనది. ఒక్క ఏపీ ప్రజల డేటా మాత్రమే కాదు...తెలంగాణ ప్రజల డేటా సైతం ఈ దొంగల చేతుల్లో పడిందని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాల ప్రజానీకం తాలూకు 18 రకాల వ్యక్తిగత సమాచారం సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల సెల్ఫోన్లకు అందుబాటులో ఉందంటే వీరు ఎంతకు తెగించారో తేటతెల్లమవుతుంది. దీన్ని రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ ఇంతవరకూ ఆచూకీ లేకుండా పోయాడు. అతగాడు ఎవరి రక్షణలో సేదతీరుతున్నాడో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. ఆధార్ డేటాకు కట్టుదిట్టమైన భద్రత ఉన్నదని, అది బయటికి పోయే ప్రసక్తే లేదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) చాన్నాళ్లనుంచి బల్లగుద్ది చెబుతోంది. సుప్రీంకోర్టులోనూ ఈ వాదనే వినిపించింది. సంస్థ సీఈఓ అజయ్ భూషణ్ పాండే డేటా చౌర్యం ఎందుకు అసాధ్యమో ధర్మాసనానికి సాంకేతికంగా వివరించి చెప్పారు. ఆయనిచ్చిన వివరణతో అది సంతృప్తిపడినట్టే కనిపించింది. అందుకే కావొచ్చు...పౌరుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలుగుతుందన్న పిటిషనర్ల వాదన సరికాదని నిరుడు సెప్టెంబర్‌లో వెలువరించిన తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. కానీ ఇప్పుడేమైంది? స్వయానా యూఐడీఏఐ సంస్థే తమ డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. ఎంత ఘోరం? ఆ సంస్థకు చెందిన నిపుణులు ఇన్నాళ్లనుంచీ ఘనంగా చెప్పుకుంటున్న భద్రత ఐటీ గ్రిడ్స్ పుణ్యమా అని గాలికి కొట్టుకుపోయింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వ ప్రాపకంతో, ఆయన పార్టీ ప్రయోజనం కోసం చడీచప్పుడూ లేకుండా సాగిపోయింది. తాను, తన పార్టీ ప్రయోజనాలే తప్ప ఎవరేమైపోయినా ఫర్వాలేదనుకునే మనస్తత్వం ఉన్న నాయకులుంటే ఎంతటి కీలక సమాచారమైనా బజారున పడుతుందని ఈ డేటా చోరీ వ్యవహారం వెల్లడించింది. వాస్తవానికి సైబర్ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ అనుపమ్ శరాఫ్ ఆధార్ డేటాను ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం వల్ల మున్ముందు సమస్యలు తలెత్తే అవకాశమున్నదని... ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో నింపి, నిజమైన ఓటర్ల పేర్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను, ఫలితాలను తారుమారు చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. దాన్ని అటు ఆధార్ ప్రాధికార సంస్థ, ఇటు ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలా లేదు. అనుపమ్ మాటల్లో ఎంత నిజమున్నదో ఇప్పుడు చంద్రబాబు అండ్ కో నిరూపించారు. తాజా ఎఫ్ఐఆర్నుబట్టి చూస్తే సేవామిత్ర యాప్‌లో రెండు రాష్ట్రాలకూ చెందిన ఆధార్ డేటా, ఓటర్ల జాబితాలు ఉన్నాయి. తమకు ఓటేయరని అనుమానం వచ్చిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ యాప్ ద్వారా అవకాశమున్నదని ఎఫ్ఐఆర్ చెబుతోంది. డేటా దొంగలు ఈ మొత్తం డేటాను దేన్నుంచి కైంకర్యం చేశారో తేలాల్సి ఉంది. అలాగే దుండగులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో సరిపెట్టారా లేక ఇతర రాష్ట్రాల డేటాను సైతం తస్కరించారా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. దీంతోపాటు టీడీపీ సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించి ఆ యాప్‌తో ఏమేం చేశారో రాబట్టవలసి ఉంది. ఈ డేటా చౌర్యం లోతు, విస్తృతి ఎంతో... ఎవరెవరు ఇందులో భాగస్వాములో సాధ్యమైనంత త్వరగా కూపీ లాగి, నిందితులను అరెస్టు చేయాలి. -
ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఐటీ గ్రిడ్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసుపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ డేటా చోరీపై ఇప్పటికే ఆధార్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఆధార్ అధికారులు కూడా మాదాపూర్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల కి చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అందులో ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టేందుకు సిట్ అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే దాదాపు 40 హార్డ్ డిస్క్‌లను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు నోటిసులు ఇచ్చామన్నారు. అశోక్‌తో పాటు మరికొంత మందిని అరెస్ట్చేసేందుకు రంగం సిద్దం చేసింది. -
డేటా దొంగ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్ వివరాల చౌర్యం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగియడం, ఈ కేసులో అదనంగా ఆధార్ కేసు కూడా తోడవడంతో నేరం తీవ్రత మరింత పెరిగింది. అశోక్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్న సిట్... న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పౌరుల డేటా చోరీ చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించడం తెలిసిందే. అరెస్టుకు సరిపడా ఆధారాలు.. ఈ కేసులో సిట్ అధికారులు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌సంస్థ అధినేత దాకవరం అశోక్ అరెస్టుకు సరిపడా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా.. అశోక్ అజ్ఞాతం వీడటం లేదు. పైగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పాత్ర స్పష్టంగా కనిపిస్తుండటం, సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే నిందితుడిని వెనకేసుకు రావడంతో ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అప్పట్లో అశోక్‌ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. విజయవాడ, నెల్లూరులో అశోక్ ఉన్నట్లు సమాచారం కూడా అందింది. నిందితులెవరైనా వదిలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యానించడంతో అశోక్ అరెçస్టు తప్పదన్న వాదనలు బలపడ్డాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇంతకాలం ఈ కేసు కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ఆధార్ ఫిర్యాదుతో మళ్లీ సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. రాజకీయ కారణాలతోనే ఆగుతున్నారా? ఈ కేసులో నిందితుడికి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆశ్రయమిస్తున్నారంటూ ప్రచారం జరగడం సమస్యగా మారింది. అశోక్ ఆచూకీ తెలిసినా అతన్ని అరెస్టు చేయడానికి తెలంగాణ సిట్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకొన్ని రోజులు వేచి చూసి న్యాయస్థానం ద్వారానే అశోక్‌ను పట్టుకోవాలన్నది సిట్ యోచనగా తెలుస్తోంది. వారి జాప్యానికి రాజకీయ పరిణామాలు కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఓటుకు కోట్లు కేసులోనూ నిందితులను వెనకేసుకొచ్చిన సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేశ్‌లు ఈ కేసులోనూ అదే తరహాలో వ్యవహరిస్తుండటం గమనార్హం. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు..! మొదటి నుంచి ఏపీ మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ అశోక్... ఆ సాన్నిహిత్యంతోనే పార్టీ కార్యక్రమాల నిర్వహణ దక్కించుకున్నాడని సమాచారం. సేవామిత్ర యాప్‌లో సర్వే కోసం ఉపయోగించిన ప్రతి అంశం ఎలాగైనా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా ఉందన్న ఆరోపణలు ముమ్మరమయ్యాయి. చంద్రబాబు, లోకేశ్‌లతో ఉన్న పరిచయాల కారణంగానే ప్రభుత్వం... సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, ఆధార్ సమాచారం, ఓటరు లిస్టు తదితరాలు అశోక్‌కు యాక్సెస్ చేసుకునే వీలు కల్పించిందన్న విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్కే పరిమితమా..? ఈ కేసులో అత్యంత గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత సమాచారం వివరాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఆధార్ సెక్షన్ల ప్రకారం నేరం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర పౌరుల ఆధార్ డేటా కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉండటంతో ఇది జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. గోప్యతను భద్రంగా ఉంచాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వ్యక్తిగత సమాచారానికి రక్షణ ఎక్కడని పలువురు వాపోతున్నారు. ఒకవేళ ఈ డేటా శత్రు దేశాల చేతిలో పడితే అది దేశ భద్రతకే ముప్పు అని యూఐడీఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ గ్రిడ్స్ దాదాపు రెండు రాష్ట్రాలకు చెందిన 7 కోట్ల మందికిపైగా సమాచారం సేకరించి ఆమెజాన్ క్లౌడ్ స్టోరేజీలో దాచింది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యానికి పాల్పడిన విషయం వాస్తవమేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) కూడా ధ్రువీకరించింది. ఇప్పుడు ఈ డేటా ఐటీ గ్రిడ్స్ కంపెనీ నుంచి ఇంకెక్కడికైనా లీక్ అయిందా? ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా? అన్న విషయాలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు చెందిన క్లౌడ్ కంపెనీలో స్టోర్ చేయడం చట్ట విరుద్ధం. ఇది జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో అధికారులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. -
ఐటీగ్రిడ్స్ ప్రకంపనలు : ఐటీ కార్యదర్శికి ఈఏఎస్ శర్మ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ డేటా, ఓటర్ ఐడీ సహా వ్యక్తిగత వివరాలు టీడీపీ యాప్‌ను డెవలప్ చేసిన ఐటీగ్రిడ్స్ వద్ద ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించడంపై భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. డేటా చోరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ వద్ద 7.82 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ఉండటం ఆందోళనకరమని ఐటీ కార్యదర్శి సాహ్నీకి రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. ఐటీగ్రిడ్స్ అభియోగాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఏఐ, ఈసీ తీవ్రంగా పరిగణించాలని కోరారు. యూఐడీఏఐ, ఈసీఐల పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను ఐటీగ్రిడ్స్ దెబ్బతీసిందని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కధనాన్ని ఉటంకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మటికీ పౌరుల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనేనని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ డేటా చోరీతో ఏ రాజకీయ పార్టీ దాన్ని దుర్వినియోగం చేసిందనే వ్యవహారంతో సంబంధం లేకుండా యూఐడీఏఐ, ఈసీలు తెలుగు ప్రజలకు సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్ నిర్వాకంపై యూఐడీఏఐ, ఈసీలు తమ బాధ్యత నుంచి తప్పించుకోజాలవన్నారు. యూఐడీఏఐ చైర్మన్ జే సత్యనారాయణ, ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఈ గవర్నెన్స్, ఐటీకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తుండటంపై గతంలో తాను రాసిన లేఖను సమాచార సాంకేతిక శాఖ విస్మరించిందని శర్మ గుర్తుచేశారు. తెలుగు రాష్ర్టాల ప్రజల వ్యక్తిగత వివరాలను నిక్షిప్తం చేసిన ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో స్ధానిక యూఐడీఏఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో సరిపోదని పేర్కొన్నారు. యూఐడీఏఐ అధికారుల ప్రమేయం లేకుండా ఐటీగ్రిడ్స్ 7.82 కోట్ల మంది ఆధార్ వివరాలు, ఓటర్ ఐడీ వంటి డిజిటల్ రికార్డులను సమీకరించడం సాధ్యం కాదని అన్నారు. ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కై ఈ తతంగంలో పాలుపంచుకున్న యూఐడీఏఐ అధికారులందరిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని తేలితే ఆయా బాధ్యులపైనా కేసు నమోదు చేయాలన్నారు. ఐటీగ్రిడ్స్ వ్యవహారంలో సరైన చర్యలు చేపట్టడంలో ఐటీ మంత్రిత్వ శాఖ విఫలమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
డేటా చోరి కేసులో సంచలన నిజాలు
-
ఇది దేశ భద్రతకే సవాల్
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్పడిన డేటా స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్ చోరీ నిజమేనంటూ ఆధార్ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ టి.భవానీ ప్రసాద్ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్ జిల్లాలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 278/ 2019లో సెక్షన్ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు. 18 రకాల వ్యక్తిగత సమాచారం చోరీ ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్ డేటా బేస్‌కు లింక్ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌నకు లింక్ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆధార్ డేటాను నిందితుడు అక్రమంగా అమెజాన్‌లో స్టోర్ చేశాడని, ఈ సున్నితమైన డేటా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ముప్పని పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆధార్ అథారిటీ డీడీ భవానీప్రసాద్ పేర్కొన్న భాగం ఫిర్యాదుదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డితో పాటు ముద్దనలాలిగారి జయరామిరెడ్డి, అక్కల మద్దిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్ వెంకటప్రతాప్లను నమూనాలుగా తీసుకుని డేటా స్కామ్ తీగ లాగారు. దీంతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ గుట్టురట్టు అయ్యింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. వాటిలో ఆధార్ (యూఐడీ) నంబర్‌తోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్(ఈఐడీ) నంబర్, కలర్ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్ నంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేరాఫ్ పేరు, పుట్టిన రోజు, గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడీ, పిన్‌కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం.. ఆధార్ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) భవానీ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. ‘యూనిక్ ఐడీ(ఆధార్) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం లింక్ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్‌తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్‌కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్‌పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ప్రధాన నిందితుడికి ప్రభుత్వ పెద్దల షెల్టర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినదంతా తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్ మేరకు ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ(సీఐడీఆర్), రాష్ట్రానికి చెందిన స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వంటి వాటి వద్ద భద్రంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతుల్లోకి వెళ్లడం తీవ్ర నేరం. సీఐడీఆర్, ఎస్ఆర్డీహెచ్లకు చెందిన ప్రతినిధులు విధుల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు చెందిన సమాచారాన్ని బయటకు లీక్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆధార్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 సెక్షన్ 28(5) ప్రకారం నేరం. ప్రభుత్వ పథకాలు, సర్వేల కోసం కాంట్రాక్టులో భాగంగా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 29(3) ప్రకారం నేరం. ఇతర ప్రయోజనాల కోసం, సర్వేలు, ఫలితాలు, ఓటర్ల జాబితాలో తొలగింపులు వంటి తదితర అక్రమాలకు ప్రజల వ్యక్తిగత డేటాను మళ్లించడం సెక్షన్ 38(జి) ప్రకారం నేరం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దాన్ని తమ అవసరానికి అనుగుణంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు చేయడం, విలువైన డేటాకు భంగం కలిగించి వేరే ప్రయోజనాలకు వాడుకోవడం సెక్షన్ 38(హెచ్) ప్రకారం నేరం. ఇందుకు సెక్షన్ 40 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది లక్షలు జరిమానా ఉంటుంది. ఆధార్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు దాన్ని ఇంటర్నెట్లో వాడుకోవడం, ఇతర వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ డేటాను ట్రాన్స్‌మీట్ చేయడం, రహస్యంగా దాచడం తీవ్రమైన నేరం. ప్రభుత్వ పెద్దల దన్నుతో డేటా స్కామ్‌కు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆ డేటాను అమెజాన్ (అమెరికా) వెబ్ సర్వీసులోని క్లౌడ్ సర్వర్‌లో పెట్టడం తీవ్ర నేరం. సెక్షన్ 44 ప్రకారం దీనిని దేశం బయట జరిగే నేరం (అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తున్నారు. ఈ డేటా మన శత్రుదేశమైన పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చిక్కినా, ఆంతర్జాతీయ నేరస్తులకు చిక్కినా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సాధికార (పల్స్) సర్వే పేరుతో సేకరించిన సున్నితమైన సమాచారంతో అనుసంధానమై ఉండటం ఐటీ యాక్ట్ – 2008 సెక్షన్ 72(ఎ), సెక్షన్ 65, సెక్షన్ 66(బి) కింద పూర్తిగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం. ఆధార్ డీడీ రిపోర్టుకు కారణం ఇదే.. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డేటా స్కామ్‌కు పాల్పడుతున్న వైనంపై ఈ ఏడాది మార్చి 2న ఫిర్యాదు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర మార్చి 15న కేంద్రం పరిధిలోని ఆధార్ అథారిటీ (యూఐడీఏఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) టీవీ భవానీ ప్రసాద్ ఈ నెల 12న మాదాపూర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. -
ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసుపై మరోకేసు నమోదైంది. ఆదార్ సంస్థ పలు సెక్షన్ల కింద ఐటీ గ్రిడ్స్‌పై కేసులు వేసింది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఆధార్ సమాచారంపై యూఐడీఏఐ కేంద్ర అధికారులను సిట్ వివరణ కోరింది. ఈ మేరకు ఆధార్ యాక్ట్‌లోని 37,38,40,42,44 సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు. -
బాధితులు ఏడు కోట్ల మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల డేటా చోరీ కేసులో బాధితులు ఎన్నికలు సంఘం, ఆధార్ సంస్థ కాదని, 7 కోట్ల మంది ఓటర్లని, వారి వ్యక్తిగత సమాచారాన్నే ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చోరీ చేసిందని సీని యర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. కీలక సమాచారం తమ వద్ద ఉందన్న విషయంతో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ విభేదించడం లేదన్నారు. ఇక్కడ ప్రధాన ప్రశ్నలు, ఎవరు చెబితే ఈ సమాచారాన్ని చోరీ చేశారు.. ఎవరి కోసం చోరీ చేశారు.. ఏం ఆశించి ఇలా చేశారన్నదే ముఖ్యమన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే కుట్ర మొత్తం బహిర్గతమవుతుందని ఆయన తెలిపారు. అందువల్ల నిబంధనల ప్రకారం బాధితుల వాదన వినాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, ఈ వ్యాజ్యంలో కొత్తగా ప్రతివాదులుగా చేర్చబడిన ఎన్నికల సంఘం, ఆధార్, ఏపీ ఆధార్ నమోదు ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామంది. ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణార్హత, కేసు పూర్వాపరాలపై ఏప్రిల్ 22న విచారిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల డేటా చోరీకి సంబంధించి ఎస్ఆర్ నగర్, మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం విచారణ జరిపారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు పిటిషనర్ ఈ వ్యాజ్యాల్లో ఎన్నికల సంఘం, ఆధార్ సంస్థ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ సందర్భంగా డేటా చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, డేటా చోరీ వెనుక భారీ కుట్ర ఉందన్నారు. పిటిషనర్ న్యాయవాది ఈ వ్యవహారంలో ఆధార్, ఎన్నికల సంఘాన్ని బాధితులుగా చెబుతున్నారని, వారు కేవలం ప్రజల సమాచారాని కి సంరక్షకులు మాత్రమేనని తెలిపారు. తమ సమాచారాన్ని కోల్పోయిన ఓటర్లే ఇక్కడ బాధితులన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఆధార్, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ, ముందు ఈ వ్యాజ్యాల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తరువాత అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, రాజకీయ దురుద్దేశాలతో పిటిషనర్‌పై కేసులు నమోదు చేశారన్నారు. ఎన్నికల సంఘం, ఆధార్ వద్ద ఉండాల్సిన సమాచారం బహిర్గతమైందని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, ఇక్కడ ఆ రెండు సంస్థలే బాధితులని తెలిపారు. బాధితులైన ఆ సంస్థలు ఫిర్యాదు చేయలేదన్నారు. సమాచారం చోరీకి గురైందో లేదో ఈ సంస్థలే చెప్పాలని, అందువల్లే వారిని ప్రతివాదులు గా చేర్చామన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈసీని, ఆధార్ సంస్థను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేశారు. -
ఐటీగ్రిడ్స్ కేసు: నలుగురికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా ఇంప్లీడ్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయవద్దని పిటిషనర్ లోకేశ్వరరెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రధాన అధికారికి, ఆధార్ అథారిటీ అధికారులుకి, ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు, డేటా ఎన్‌రోలింగ్ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పీపీ, లోకేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. (చదవండి: ఐటీగ్రిడ్స్‌పై వాడీవేడి వాదనలు) -
ఐటీగ్రిడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు
-
7 కోట్ల మంది డేటాచోరీ
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ డేటా వివాదంలో వెలుగులోకి వస్తున్న అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాతోపాటు ఏపీలోని పలు జిల్లాలకు చెందిన దాదాపు 7కోట్ల మంది ఓటర్ల సమాచారం ఐటీగ్రిడ్స్ కంపెనీలో జరిపిన సోదాల్లో దొరికిందని తెలంగాణ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేష్ జెఠ్మలాని బుధవారం వెల్లడించారు. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన, బయట ఎక్కడా ఉండకూడని అత్యంతక కీలకమైన రహస్య సమాచారం ఐటీగ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద లభించిందని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు చేసినప్పుడు అనేక ఆశ్చర్యకర వివరాలు తెలిశాయన్నారు. ఈ జాబితాను సదరు సంస్థకు ఎలా అందిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో అనే సమాచారం కూడా సోదాల్లో దొరికిందన్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన 7 కోట్ల మంది సమాచారం వీరి వద్ద ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సేవా మిత్ర’యాప్ ద్వారా ఓటర్లను ఎవరికి ఓటు వేస్తారంటూ ఆరా తీసి, అధికార పార్టీకి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని కోర్టుకు నివేదించారు. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్‌గా అశోక్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని, దర్యాప్తు నిమిత్తం హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీచేసినా స్పందనలేదన్నారు. దర్యాప్తునకు సహకరించడం లేదని, చట్టం, దర్యాప్తు సంస్థలంటే గౌరవం లేని ఇటువంటి వ్యక్తుల పట్ల కోర్టులు సానుకూల వైఖరిని ప్రదర్శించరాదన్నారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి షమీమ్ అక్తర్ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. ఓటర్ల డేటాచోరీ కేసులో తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారం మొత్తం ఏపీ ఓటర్లకు సంబంధించిందని, అందువల్ల ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలని ఆయన కోర్టును కోరారు. -
ఐటీగ్రిడ్స్‌పై వాడీవేడి వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసులో ఇరువర్గాల వాదనలు ఇన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డేటాచోరీ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ సంస్థ యజమాని ఆశోక్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూత్రా కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ డేటాపై తెలంగాణకు ఏం సంబంధమని, కేసుపై విచారించే హక్కు ఇక్కడి పోలీసులకు లేదని ఆయన అన్నారు. ఒకే కేసుపై రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారని, దీనిలో రాజకీయ దురుద్దేశ్యము తప్ప మరొకటి లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. కేసులో సిట్ తరఫున తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్‌గా కోర్టులో వాదనలు వినిపించారు. ఐటీగ్రిడ్స్ కంపెనీ ద్వారా డేటాచోరీ జరిగినట్లు తమవద్ద ఖచ్చిమైన ఆధారాలు ఉన్నయని కోర్టుకు తెలిపారు. సంబంధిత కంపెనీ ఇదే రాష్ట్రంలో ఉన్నందున విచారించే హక్కు తెలంగాణ పోలీసులకు ఉందన్నారు. కేవలం ఏపీ డేటానే కాకుండా తెలంగాణ డేటా కూడా చోరీకి గురైందని ఆయన కోర్టుకు నివేధించారు. -
ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు పబ్లిక్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచార తస్కరణ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆఖరి నోటీసులు జారీ చేసింది. మార్చి 2, 11, 16వ తేదీల్లో మూడుసార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ అశోక్ నోటీసులకు స్పందించలేదు. దీంతో పబ్లిక్ నోటీసులకు సిట్ సిద్ధమైంది. గతంలో జారీ చేసిన నోటీసులను అశోక్ నేరుగా తీసుకోలేదు. తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయాక అతని ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో ప్రచార సాధనాల (కొన్ని ఆంగ్ల పత్రికలు) ద్వారా పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. అశోక్ ఎక్కడున్నా ప్రకటన వెలువడిన మూడు రోజుల్లోగా గోషామహల్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. సిట్‌కి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేరు మీద ఈ ప్రకటన వెలువడింది. దీనిపై అశోక్ స్పందనను బట్టి సిట్ తదుపరి చర్యలకు సమాయత్తం కానుంది. -
అశోక్‌కు మూడోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగు తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. 41 సీఆర్పీసీ ప్రకారం.. నోటీసుల జారీకి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్చి 2న మాదాపూర్ పోలీసులు, మార్చి 11న సిట్ పోలీసులు అశోక్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. మార్చి 11న కేపీహెచ్‌బీలోని అత ని ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసులను గోడకు అంటించి వచ్చారు. మార్చి 13న విచారణ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ అశోక్ రాలేదు. ఈ కేసు సమగ్ర వివరాలను అధికారులు ఈ నెల 20న కోర్టుకు సమర్పించనున్నారు. నిబంధనల ప్రకారం మూడోసారి కూడా పోలీసుల నోటీసులకు స్పందించకపోతే అరెస్టు దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. -
ఐటీగ్రిడ్స్ స్కాం : అశోక్‌కు మరోసారి నోటీసులు!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరి కేసును సిట్ ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ చైర్మన్ అశోక్‌కు మరోసారి నోటీసులు అందించేందుకు సిద్దమయ్యారు. ఈనెల 11న నోటీసులు జారీ చేసినప్పటికి విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అశోక్ విచారణకు హాజరుకాకపోవడం పట్ల సిట్ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. 41సీఆర్సీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణను కోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో అందించనున్నారు. ఈ నెల 20న హైకోర్టుకు ఈ కేసుపై నివేదిక ఇవ్వనున్నామని అధకారులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అశోక్‌కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్ స్పందించలేదు. విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. సంబంధిత కథనాలు సిట్ విచారణకు అశోక్ మళ్లీ డుమ్మా! డేటా చోరీ కేసు.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు ఐటీగ్రిడ్స్ కేసు.. అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురు -
20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట..
సాక్షి, అమరావతి : చోరీ అయిన ప్రభుత్వ డేటా ఇప్పుడు రాష్ట్రంలోని లబ్దిదారులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రభుత్వం వద్ద మాత్రమే గోప్యంగా ఉండాల్సిన సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారం ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల వద్దకు చేరింది. దీంతో వారు తమ ప్రాంతంలో లబ్ధిదారులను కలిసి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికలయ్యేవరకూ చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయడానికి.. పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులతో పాటు ‘పసుపు–కుంకుమ’ ఇచ్చినందున గ్రామాలు, పట్టణ వార్డుల వారీగా డ్వాక్రా మహిళలు లబ్దిదారులతో గ్రూపులుగా ఏర్పడాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల అధికార పార్టీ నేతల నుంచి ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఏడాది క్రితం రియల్ టైం గవర్నెనెన్స్ సిస్టం (ఆర్టీజీఎస్) శాఖలో సాధికార మిత్రల వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలతో ఓ మొబైల్ యాప్ తయారైంది. ఇప్పుడా యాప్‌లోని సమాచారం మొత్తం టీడీపీ బూత్ కార్యకర్తల సేవామిత్ర యాప్ డేటాను పోలి ఉంది. ఇప్పుడీ డేటా మొత్తం టీడీపీ అభ్యర్థుల చేతికి చేరడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 20 తర్వాత ప్రచారంలో పాల్గొనాలంట.. మార్చి 20 నుంచి గ్రామాల వారీగా తాము చెప్పినప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి గ్రూపులు సిద్ధంగా ఉండాలని జిల్లాల్లో టీడీపీ నేతలు హుకుం జారీచేసి వెళ్తున్నారని పలుచోట్ల లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛనుదారులు, డ్వాక్రా మహిళలను ఈ ప్రచారంలో భాగస్వామ్యం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ సిబ్బంది సైతం అధికార పార్టీ నేతలతో కలిసి లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్నతాధికారులు అయితే తమ విభాగాల్లో మండల స్థాయిలో పనిచేసే వారిని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ మౌఖికంగా ఆదేశాలు జారీచేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. వణికిపోతున్న లబ్ధిదారులు ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వస్తున్న ఒత్తిళ్లతో పింఛనుదారులు, డ్వాక్రా మహిళలు వణికిపోతున్నారు. ‘నిరుపేదలం.. మాకెందుకు ఈ రాజకీయాలన్నా అధికార పార్టీ నేతలు ఒప్పుకోవడంలేదు.. సెర్ప్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నా’రని వారంటున్నారు. ‘రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్లు మంజూరు అవ్వబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తోంది. మాకెందుకయ్యా ఈ రాజకీయాలు అన్నా వదలడం లేదయ్యా’ అంటూ శ్రీకాకుళం జిల్లాలో ఒక పింఛనుదారుడు వాపోయాడు. ‘ప్రచారం చేయకపోతే పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు, భయం వేస్తోంది’ అని అతను కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ప్రచారం చేయకపోతే పింఛను ఇప్పుడే తీసేస్తారని భయంగా ఉందంటూ కృష్ణాజిల్లాలో ఒక లబ్దిదారుడు వాపోయాడు. (చదవండి: సైబర్ నేరగాళ్లకు ‘డేటా’..!) -
సిట్ విచారణకు అశోక్ మళ్లీ డుమ్మా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల డేటా చోరీకి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ విచారణకు హాజరుకాలేదు. విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అశోక్‌కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్ స్పందించలేదు. బుధవారం విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. ఫిర్యాదుదారుల వాంగ్మూలం రికార్డు.. ఏపీలో 3.6 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటాను సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ తస్కరిస్తోందని మార్చి 2న విజిల్ బ్లోయర్ లోకేశ్వర్‌రెడ్డి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ మర్నాడే దశరథరామిరెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాంటి ఫిర్యాదుతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో కేసులు నమోదయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం లోకేశ్వర్‌రెడ్డి, దశరథరామిరెడ్డిలను పోలీసులు సిట్ కార్యాలయానికి పిలిపించారు. వారిని ప్రశ్నించిన పోలీసులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. వీరితో పాటు ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఉద్యోగులైన ఫణి, భాస్కర్, విక్రమ్, చంద్రశేఖర్‌లను కూడా మరోసారి ప్రశ్నించారు. కాగా, గూగుల్, అమెజాన్‌ల నుంచి సమాచారం ఇంకా రాలేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని రీట్రైవ్ చేయడానికి నిపుణులు శ్రమిస్తున్నారు. త్వరలోనే వీటి నుంచి సమాచారాన్ని సంగ్రహిస్తామని పోలీసులు చెబుతున్నారు. మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తన అశోక్ వస్తారన్న సమాచారంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు వెళ్లిన మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోపలికి అనుమతించేది లేదని మీడియాతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడే బైఠాయించారు. అటుగా వస్తున్న డీఎస్పీ రోహిణి ప్రియదర్శిని వాహనాన్ని అడ్డగించారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు దీనిపై ఫిర్యాదు చేశారు. -
‘తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య బాబు చిచ్చు’’
హైదరాబాద్: తెలంగాణాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనిల్ కుమార్ విమర్శించారు. ఏపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజల ఓటు హక్కును ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారని ఆరోపించారు. డేటా చోరీలో కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌ను తప్పించడానికి చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. తెలంగాణాలో ఉన్న సెటిలర్లును బాబు ఇబ్బందులు పెడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉన్నా అధికారంతో తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. సుజానా చౌదరీ జీఎస్టీ పన్ను ఎగవేసినా చంద్రబాబు స్పందించరని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. కేటీఆర్, వైఎస్ జగన్‌ను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, కేటీఆర్, జగన్‌ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమే వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలిసి ఉండవచ్చు కదా అని అన్నారు. ఏపీ ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయడానికే వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. -
సిట్ ముందుకు ఐటీగ్రిడ్స్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసంస్థ యజమాని అశోక్ ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. ఇటీవల ఆయనకు సిట్ అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. విచారణకు రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీచేసే అవకాశం ఉందని పోలీసులు తేల్చిచెప్పడంతో సిట్ ముందుకు రానున్నారు. ఆయన వ్యక్తిగత న్యాయవాదులతో కలిసి వచ్చే అవకాశం ఉంది. సిట్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ముందు డేటాచోరీ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణకు అశోక్ హాజరుకావల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. చదవండి: డేటా చోరీ బాధ్యత ఆ ఇద్దరిదే! హైకోర్టులో అశోక్‌కు చుక్కెదురు -
‘డేటా ట్రాన్స్ఫర్ చేయడం తప్పే’
సాక్షి, తూర్పుగోదావరి : డేటా చోరీ కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియా సమావేశంలో మంగళవారం మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు సంస్థలకు ఎలా లభ్యమైందని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అఫిషియల్‌గా ఐటీగ్రిడ్స్ వంటి సంస్థలకు డేటా ట్రాన్స్ఫర్ చేసినా అది తప్పేనని అన్నారు. అయినా, పోలీసుల ముందుకు రాకుండా అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని విస్మయం వ్యక్తం చేశారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో అవకతవకలను బయటపెట్టామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇదే ఆఖరు ప్రెస్ మీట్ అని వెల్లడించారు. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇక మీడియా ముందుకురానని చెప్పారు. డేటా చోరీపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై స్పందించే విధానం ఇదేనా అని టీడీపీని ప్రశ్నించారు. ఎన్నికల స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. టీడీపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి గాని అనవసర కామెంట్లు చేయడం తగదన్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి డేటా వివరాలు టీడీపీ సేవామిత్రలో ఉన్నాయని అన్నారు. సాధికార మిత్ర పేరుతో సర్వేలు చేసి ఆధార్ నెంబర్ సేకరించి.. ఓటర్ గుర్తింపు కార్డులతో జతచేయడం అక్రమమన్నారు. గడిచిన 40 ఏళ్లలో దేశంలో నిరుద్యోగిత 6.1 శాతం పెరిగిందని చెప్పారు. రాఫెల్ ధర ఎంతో ఇప్పటివరకు కేంద్రం చెప్పకపోవడం దారుణమన్నారు. -
ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం దిగజారుస్తోంది
-
చోరీ డేటా అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!
-
సైబర్ నేరగాళ్లకు ‘డేటా’..!
సాక్షి, అమరావతి: ‘‘హలో.. మీరు నాగరాజు గారేనా.. మేం బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మీ ఆధార్ నెంబరు ఇదేనా.. అకౌంట్ నెంబర్ ఇదేనా.. ఆర్బీఐ ఆదేశాల మేరకు కేవైసీ పరిశీలనలో భాగంగా ఆథార్తో సహా అన్ని వివరాలను చూస్తున్నాం.. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. అది మాకు చెబితే ఈ–కేవైసీ వెరిఫికేషన్ అయిపోతుం దంటూ అవతల వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. మనకు సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా చెప్పారు కదా.. బ్యాంకు అధికారులే అయి ఉంటారనుకుని ఓటీపీ చెప్పడం.. ఆ వెంటనే మన బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు మాయమైపోవడం క్షణాల్లో జరిగిపోతుంది. ఆ తర్వాత సదరు నెంబర్‌కు ఫోన్‌చేసినా కాల్ కలవదు. డబ్బులు పోయినవాళ్లు లబోదిబోమంటూ బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరగడం మామూలైపోయింది’’. .. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే వింటూనే ఉన్నాం. రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈ తరహా సైబర్ నేరాలకు.. ఫొటోల మార్ఫింగ్ ద్వారా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇటీవల వెలుగుచూసిన డేటా స్కాంకు పెద్ద లింకే ఉన్నట్లు తెలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. అదెలాగంటే.. రెండు తెలుగు రాష్ట్రాలను గత కొద్దిరోజు లుగా ఓ కుదుపు కుదుపుతున్న డేటా స్కాం బాగోతం ఇప్పుడు పలు చీకటి కోణాలనూ ఆవిష్కరిస్తోంది. ఈ వ్యవహారం ఓట్ల మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితం కాకుండా అనేకానేక సైబర్ నేరాలకు కేంద్రంగా నిలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం ఒక్క ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల వద్దే పరిమితం కాకుండా వీరి నుంచి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు రాష్ట్రంలో గత రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న నేరాల తీరుబట్టి స్పష్టమవుతోంది. సర్వే పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేయడం, ట్రేడింగ్ సలహాలంటూ బయట రాష్ట్రాలతోపాటు విదేశీ కాల్స్, కుప్పలుతెప్పలుగా స్పామ్ మెయిల్స్ ఇటీవల దాదాపు అందరికీ రావడం బాగా పెరిగిపోయాయి. ప్రజలకు సంబంధించిన.. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన అంత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడంవల్లే ఈ కాల్స్, స్పామ్ మెయిల్స్ ద్వారా చేసే మోసాలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సిన ఆధార్, ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ చిరునామా, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, బయోమెట్రిక్ వంటి సమస్త వ్యక్తిగత సమాచారం రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ ద్వారా ఆర్థిక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది సైబర్ నేరాల పెరుగుదల ద్వారా స్పష్టమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం తన పార్టీ అవసరాలను పర్యవేక్షించే ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ వద్ద రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందన్న విషయం బహిర్గతం కావడం.. సరిగ్గా రెండేళ్ల నుంచే రాష్ట్రంలో రకరకాలుగా ఆర్థిక నేరాలు పెరగడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో పోలీసు శాఖ విడుదల చేసిన సైబర్ నేరాల సంఖ్య సైతం ఇదే స్పష్టం చేస్తోంది. నేరాలు ఇలా పెరిగాయి.. – తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ఐదేళ్లలో సైబర్ నేరాల్లో 573 శాతం పైగా వృద్ధి పెరిగింది. – 2013లో 148గా ఉన్న సైబర్ నేరాల సంఖ్య గడచిన ఐదేళ్లలో 2018 నాటికి 1,314కి చేరిందంటే ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. – 2017లో సైబర్ నేరాల్లో 45 శాతం, 2018లో 25 శాతం చొప్పున పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. – నమోదవుతున్న నేరాల్లో అత్యధికంగా వన్‌టైమ్ పాస్వర్డ్కి సంబంధించిన కేసులే ఉంటున్నాయని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. – అంతేకాదు.. లాటరీలు వచ్చాయని, ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్స్ అంటూ ఈ మెయిల్స్ రావడం.. వివరాలు ఇవ్వగానే అకౌంట్లోంచి డబ్బులు మాయమవుతున్న సంఘటనలూ భారీగానే పెరుగుతున్నాయి. – గడిచిన రెండేళ్ల నుంచి ఇలా స్పామ్ మెయిల్స్ రావడం బాగా పెరిగిందని, దీనికి వ్యక్తిగత డేటా చోరీ కావడమే కారణం కావచ్చని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ.. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న సంఘటనలు కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు మా వద్ద ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఫిర్యాదులు అధికమవుతున్నాయి. పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయనే భయంతో చాలామంది మహిళలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక వారిలో వారు కుమిలిపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు డేటా చోరీ ఓ ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్ వద్ద ఓటర్ల కలర్ ఫొటోల మాస్టర్ డేటా ఉండడం ఇందుకు బలం చేకూరుస్తోంది. భూరికార్డులపైనా ఆందోళన ఆధార్‌లాగే రాష్ట్రంలోని భూములకు భూధార్ పేరుతో ఒక నెంబర్‌ను కేటాయించడమే కాకుండా భూ రికార్డులన్నీ ఆన్లైన్లో చేర్చడం, ఇప్పుడు ఈ సమాచారం అంతా కూడా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిందన్న వార్తలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ వంటి పథకాల పేరుతో భూముల వివరాలు, బ్యాంకు ఖాతాల నెంబర్లతో పాటు ఆదాయ వ్యయాలన్నీ సేకరించి ఆర్టీజీఎస్కు పంపించారని, అక్కడ నుంచి ఈ సమాచారం ఐటీ గ్రిడ్స్‌కు చేరడం ఈ భయాందోళనలకు ప్రధాన కారణం. ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలతో సైబర్ నేరగాళ్లు ఖాతాల నుంచి డబ్బులు లాగేస్తున్నారని, అలాగే ఫాం–7 పేరుతో తమకు తెలియకుండానే ఓట్లు తొలగించేస్తున్నారని.. అదే విధంగా ఇప్పుడు భూ రికార్డులను కూడా తారుమారు చేస్తే మా పరిస్థితి ఏంటని విజయవాడకు చెందిన రామలింగేశ్వరరావు అనే రైతు ఆందోళన వ్యక్తంచేశాడు. ముందు ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను అరెస్టుచేసి ఆ తర్వాత ఈ సమాచారం ఎవరెవరి చేతుల్లోకి వెళ్లిందో అన్నదానిపై సమగ్ర విచారణ జరిపించి వ్యక్తిగత సమాచార భద్రతపై భరోసా కల్పించాలన్న డిమాండ్ రాష్ట్రంలో ఇప్పుడు ఊపందుకుంటోంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో సైబర్ నేరాలు పెరిగిన తీరు.. –––––––––––––––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం సైబర్ నేరాల సంఖ్య –––––––––––––––––––––––––––––––––––––––––––––––– 2013 148 2014 195 2015 266 2016 718 2017 1,051 2018 1,314 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
డేటా చోరీ బాధ్యత ఆ ఇద్దరిదే!
సాక్షి, అమరావతి: ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, నిజాయితీ చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన అన్ని విషయాలను, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ, వ్యక్తులకు తెలియపరచనని, లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’.. ఇది చంద్రబాబునాయుడు సీఎం పదవీ స్వీకారోత్సవంలో చేసిన ప్రమాణం. ..డేటా స్కాం బాగోతం వెలుగుచూడడంతో ఈ ప్రమాణాలన్నీ అటకెక్కించేసినట్లేనని స్పష్టమైంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, సున్నితమైన రహస్యాలను కాపాడాల్సిన సర్కారు పెద్దలే బాధ్యత మరిచి పార్టీ సేవల కోసం, రాజకీయ స్వార్థం కోసం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అందిస్తే దానిని తీవ్ర నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహించే ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీలోని మూడున్నర కోట్లకు పైగా ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీకి పాల్పడటం తీవ్ర నేరమేనని న్యాయవాదులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ మంత్రి లోకేశ్‌లు బాధ్యత వహించాల్సిందేననే వాదన వారి నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ పథకాలకే పరిమితం కావాల్సిన ప్రజాసాధికార సర్వేను అడ్డుపెట్టుకుని ప్రజల కీలక సమాచారాన్ని ప్రైవేటు యాప్‌లకు అనుసంధానం చేయడం తీవ్ర నేరమేనని అంటున్నారు. వీటన్నింటితోపాటు ఏకంగా ఓటర్ల మాస్టర్ జాబితాను టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధానం చేసి ఓట్ల తొలగింపులు, చేర్పులు చేసేలా అనధికారికంగా పెద్ద నెట్‌వర్క్‌ను నడపడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల్లో గెలుపు కోసమే ఇదంతా.. కాగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అందుకు అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లూఫ్రాగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారితోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి కలర్ ఫొటోలతో సహా భద్రపరుస్తోంది. ఈ వివరాలన్నింటినీ ఐటీ గ్రిడ్స్‌కు బ్లూ ఫ్రాగ్ సంస్థే అందజేసింది. టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్‌నకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతా, తదితర వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ వివరాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉంచాలి. కానీ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం భారీ డేటా స్కామ్‌కు పాల్పడడం నిబంధనలకు విరుద్ధమని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. డేటా చోరీ విషయం బయటపడటంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఎదురుదాడికి దిగడాన్ని కూడా న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. ‘సుప్రీం’ తీర్పునకు విరుద్దం.. రాజ్యాంగం ద్వారా సక్రమించిన వ్యక్తిగత సమాచార గోప్యత హక్కును పరిరక్షించాలని 2012లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పౌరుడికి తెలియకుండా ఆయన వ్యక్తిగత వివరాలును ఇతరులకు తెలియజేయకూడదని అందులో స్పష్టంగా పేర్కొంది. అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని నిర్ధారణ అయ్యింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు తూట్లు పొడిచే ఇటువంటి నేరాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలైనా శిక్షార్హులే. - పాకా వెంకట సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కూ తూట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటుపరం చేసి పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్‌కు తూట్లు పొడిచారు. ఇలా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం సరికాదు. ప్రభుత్వం వద్ద సురక్షితంగా ఉండాల్సిన సమాచారం ప్రైవేటు వ్యక్తుల వద్దకు చేరవేసి ప్రజలను మోసగించారు. ఇది ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ, ఐపీసీ–420, దొంగతనం నేరాల పరిధిలోకి వస్తుంది. ఇందుకు బాధ్యులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. నైతిక బాధ్యత వహించి వారు తమ పదవులకు రాజీనామా చేయాలి. – పిళ్లా రవి, బెజవాడ బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు -
జాతకాలు తవ్వుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పీడ్ పెంచింది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో మార్చి 2, 9 తేదీల్లో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లను సోమవారం పరిశీలించింది. కంప్యూటర్లలో ఏముందన్న విషయాన్ని రాబట్టే పనిని సైబర్ నిపుణులకు అప్పగించారు. ప్రస్తుతం వారు అందులో ఉన్న, డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అశోక్ అరెస్టుకు వ్యూహం ఎలా? టీడీపీ సేవామిత్ర యాప్ సాయంతో 3.60 కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ అరెస్టు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సిట్ సోమవారం చర్చించింది. ఈ విషయంపై సిట్ బాస్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర తన బృంద సభ్యులతో సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం అశోక్ ఏపీలో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో తలెత్తే పరిణామాలపై పోలీసులు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వం కూడా రెండు వేర్వేరు సిట్ బృందాలను వేసిన నేపథ్యంలో అశోక్ ఏపీ సిట్ పోలీసుల ముందు ప్రత్యక్షమవుతాడా? అన్న విషయం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అశోక్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. గత అరు నెలల్లో అశోక్ ఎవరెవరితో మాట్లాడారు? అందులో ఉన్న ప్రముఖులు ఎవరు? ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ప్రాథమిక విచారణకు వెళ్లిన రోజు అశోక్ ఏపీలోని పలువురు ప్రముఖులకు పెద్ద మనుషులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో కొత్త ఉత్సాహం తనను అన్యాయంగా డేటా చౌర్యం కేసులో ఇరికించారంటూ తెలంగాణ హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. తెలంగాణ పోలీసులకు సమాధానం చెప్పాలని స్పష్టం చేసిన నేపథ్యంలో సిట్ బృందానికి కొత్త ఉత్సాహం వచ్చింది. అశోక్ తరఫున వాదించేందుకు దేశంలో పేరుమోసిన లాయర్లు రావడం, ఏపీ ప్రభుత్వం అతన్ని వెనకేసుకురావడం, త్వరలోనే బయటికి వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ సీఎం ప్రకటించడంతో అసలు అశోక్ చిరునామా దొరుకుతుందా? అనే సందిగ్ధంలో పడిన పోలీసులు కోర్టు ఆదేశాలతో మరింత వేగంగా పనిచేయనున్నారు. అతని కదలికలపై ఇప్పటికే సమాచారం ఉన్నప్పటికీ తెలంగాణ సిట్ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అతన్ని చట్టపరంగానే కోర్టు ముందు నిలబెట్టాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో అశోక్ ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తాడనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
హైకోర్టులో అశోక్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాలని అశోక్‌కు స్పష్టం చేసింది. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు అశోక్‌ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకూ హైకోర్టు నిరాకరించింది. తనపై డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టేయాలని కోరుతూ అశోక్ గత వారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోందన్నారు. అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోటీసులకు స్పందించకుండా ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో అశోక్ తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తే తమకు అభ్యంతరకరమన్నారు. వారికి లేని పరిధిని ఉపయోగించి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా లేదా? అన్నది మాత్రమే చూడాలని కోరారు. ఇది తేలితే ఈ కేసు తేలిపోతుందన్నారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు దశరథరామిరెడ్డి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసులో సీనియర్ న్యాయవాది హాజరవుతున్నారని, అందువల్ల విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా న్యాయమూర్తి ఆయనను వారిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ముందు పిటిషనర్‌ను పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించాలని సూచించాలంటూ లూథ్రాకు స్పష్టం చేశారు. అప్పటివరకు పిటిషనర్‌ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. పిటిషనర్ ఎందుకు ఆందోళన చెందుతున్నారని, ముందు నోటీసులకు స్పందించమనండి అని పునరుద్ఘాటించారు. మిగిలిన విషయాలపై తదుపరి విచారణ సమయంలో వాదనలు వింటానని స్పష్టం చేశారు. అశోక్‌కు మరోసారి నోటీసులు డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌డైరెక్టర్ దాకవరపు అశోక్‌కు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న గోషామహల్‌లోని తమ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి సోమవారం వెళ్లిన తెలంగాణ పోలీసులు... అశోక్ పరారీలో ఉండటంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఏపీ, తెలంగాణ ప్రజల డేటాను సేవామిత్ర యాప్ సాయంతో తస్కరించారంటూ విజిల్ బ్లోయర్ లోకేశ్వర్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, దీనిపై ఐపీసీ సెక్షన్లు 120–బీ, 379, 420, 188తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66 బీ, 72 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిట్ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు పంపినా విచారణకు హాజరు కానందున మరోసారి నోటీసులు పంపుతున్నామని తెలిపింది. ప్రస్తుతం అశోక్ ఏపీ ప్రభుత్వ పెద్దల సాయంతో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. -
‘చోరీ డేటా’ అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘సేవామిత్ర’యాప్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూసిన డేటా స్కాం మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ యాప్, దాన్ని తయారు చేసిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూనే తిరుగుతోంది. ఈ యాప్ తయారీలో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరపు అశోక్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అందులో ప్రధానమైంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం. తాము చేస్తున్న భారీ స్కాం భవిష్యత్తులో వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లభించకుండా ఉండేందుకే అశోక్ ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించి ఉపయోగించే పరిజ్ఞానమే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ విధానం. వాట్సాప్ ద్వారా ఓ కాంటాక్ట్‌కు తొలిసారి ఎవరైనా సందేశం పంపినప్పుడు ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’అంటూ ప్రత్యేక సూచన వస్తుంది. అంటే ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్‌కు వెళ్లే వరకు అది ఎన్‌క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్ చేస్తే అది ఎన్‌క్రిప్ట్ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. ఉదాహరణకు ‘టీడీపీ’అనే పదాన్ని ‘ఎండీ5 ఆన్లైన్’అనే ఎన్‌క్రిప్టర్ వెబ్సైట్లో టైప్ చేస్తే (5ec7c4ede4cb6 c64289a5ed105285945) అనే ‘కీ’గా మారిపోయింది. దీంతో ఇది ఎన్‌క్రిప్ట్ అయినట్లు లెక్క. ఈ సందేశం రీసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్లోకి వచ్చిన తర్వాత డిక్రిప్షన్ ప్రక్రియ పూర్తై మళ్లీ ‘టీడీపీ’అనే పదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల డేటాను దుర్వినియోగం చేయడానికి ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇదే విధానాన్నే వినియోగించింది. ట్యాబ్‌లలో వాడిన సాఫ్ట్వేర్ అదే... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సేవామిత్ర సర్వేయర్లకు ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా జారీ చేసిన ట్యాబ్స్‌ను ఆ సంస్థకు సంబంధించిన సర్వర్‌తో అనుసంధానించారు. ఈ ట్యాబ్స్‌లో ఉండే ‘సేవామిత్ర’యాప్‌లో ఎన్‌క్రిప్షన్‌తోపాటు డిక్రిప్షన్ సాఫ్ట్వేర్ సైతం అంతర్భాగంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్ నుంచి ట్యాబ్ వరకు డేటా మార్పిడి మొత్తం ఎన్క్రిప్షన్ విధానంలోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న డేటాను డిక్రిప్షన్లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ‘కీ’లలోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ ‘కీ’తో కూడిన ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని సర్వర్ నుంచి తీసినా సాధారణ పదాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఈ డేటాను ప్రైవేట్ ‘కీ’తో ఎన్‌క్రిప్ట్ చేసింది. దీంతో ఎవరైనా సర్వర్‌ను స్వాధీనం చేసుకున్నా... అమెజాన్ వంటి సంస్థల నుంచి డేటా పొందినా డిక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్’డేటాను రాసే ‘అల్గోరిథమ్’ను బట్టి మారిపోతుంది. ఓ సంస్థ రూపొందించిన ‘అల్గోరిథమ్’మరొకరి దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలదు. తమ వ్యవహారం గుట్టురట్టైనా ఆధారాలు చిక్కకూడదనే ఐటీ గ్రిడ్స్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండేలా చేస్తే భవిష్యత్తులో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలు ఐటీ గ్రిడ్స్‌తోపాటు అమెజాన్ నుంచి సమాచారం తీసుకున్నా అది ఆధారంగా పనికి రాకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రూపంలో ఉన్న డేటాతో కేవలం ‘కీ’తెలుసుకోవడం తప్ప అందులోని పదాలను గుర్తించలేదు. డేటాకు సంబంధించిన ప్రైవేట్ ‘కీ’అందుబాటులో ఉంటే తప్ప ఆ ‘కీ’లను పదాలుగా మార్చి అందులోని అంశాలను తెలుసుకోలేరు. ఈ విషయం గుర్తించిన తెలంగాణ సిట్ అధికారులు... సైబర్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ప్రాథమికంగా డేటా మొత్తం క్రోడీకరిస్తే ఆపై డిక్రిప్ట్ చేయవచ్చని యోచిస్తున్నారు. -
డేటా చోరీ కేసు.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న అశోక్ కదలికలను పసిగట్టినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. డేటా చోరీ వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడవైపు వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని సిట్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అశోక్ సెల్‌ఫోన్ టవర్ గుంటూరు లోకేషన్‌ని చూపించినట్లు అధికారులు పేర్కొన్నారు. అశోక్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా పలువురు రాజకీయనాయకులతో, ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అంతేకాక అశోక్ గత ఆరు నెలలుగా ఇదే నంబర్‌తో విస్తృతంగా మాట్లాడినట్లు దర్యాప్తులో తెలిందన్నారు. ఈ సంభాషణలను బట్టి ప్రముఖులేవరికైనా ఈ కేసుతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా డేటా చోరీ కేసులో హై కోర్టు అశోక్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అశోక్‌ను ఆదేశించింది. -
ఐటీగ్రిడ్స్ కేసు.. అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై తెలంగాణ పోలీసులు అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని అశోక్ హైదరాబాద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షాక్ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇక అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లోత్ర వాదనలు వాదనలు వినిపించారు. కేసు తెలంగాణ పరిధిలోకి రాదని, ఏపీకి బదిలీ చేయాలని కోరారు. అయితే సిద్దార్థ్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీ భవించలేదు. మరోవైపు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేమని అశోక్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వెంటనే అశోక్‌ను పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ ఏపీ సిట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు అచ్చం ఓటుకు కోట్లు కేసునే ఫాలో అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య ఏపీకి పరారవడం, తరువాత విజయవాడకు వెళ్లి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పుడు మత్తయ్యను ఏపీ పోలీసులు వెనకేసుకురాగా ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరుగుతోంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్ ఉన్నట్లు సమాచారం. అశోక్ కూడా అచ్చం మత్తయ్య తరహాలోనే ఈ కేసులో తన పేరును అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. -
పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్
-
ఏపీ సిట్ ముందుకు అశోక్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ ఏపీ సిట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు అచ్చం ఓటుకు కోట్లు కేసునే ఫాలో అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య ఏపీకి పరారవడం, తరువాత విజయవాడకు వెళ్లి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పుడు మత్తయ్యను ఏపీ పోలీసులు వెనకేసుకురాగా ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరుగుతోంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్ ఉన్నట్లు సమాచారం. అశోక్ కూడా అచ్చం మత్తయ్య తరహాలోనే ఈ కేసులో తన పేరును అన్యాయంగా ఇరికించారంటూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే అశోక్ బయటకు రాగానే తన డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారంటూ ఏపీ ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఫిర్యాదు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. సిట్‌కు కీలక ఆధారాలు లభ్యం... డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న అశోక్ కదలికలను పసిగట్టింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖలకు ఈ నంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు, వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
మంత్రి, ఐఏఎస్‌లతో అశోక్ సంభాషణ!
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దాకవరం అశోక్ కదలికలను సిట్ పసిగట్టింది. ఆర్నెలలుగా అశోక్ కీలక వ్యక్తులతో తరచూ సంభాషించడం.. పరారీ తర్వాత ఆయన సెల్‌ఫోన్ సిగ్నళ్లు పలు ప్రాంతాలను సూచించడం ఈ కేసులో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సిగ్నళ్ల ఆధారంగా అతన్ని దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఇక నిందితుడు మంతనాలు జరిపిన ఫోన్ నెంబర్లలో ప్రముఖులవి కూడా ఉండడంతో సిట్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇదే క్రమంలో అశోక్ మరో రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా ప్రకటించడంతో తెలంగాణ సిట్‌ను మరెన్నో సందేహాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ.. గుంటూరుకు? డేటా చౌర్యం వెలుగుచూసిన తర్వాత అశోక్ ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి మాయమయ్యాడు. అందరికీ తెలిసిన అశోక్ నెంబరు తొలుత రెండు మూడు రోజుల వరకూ హైదరాబాద్ పరిసరాల సెల్ టవర్ల పరిధిలోనే ఉన్నట్టు గమనించారు. కానీ, అశోక్ ఆచూకీ మాత్రం పోలీసులకు లభించలేదు. సెల్‌ఫోన్ ద్వారా కదలికలను గుర్తిస్తారనే అశోక్ తన ఫోన్‌ను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చునని పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అనంతరం అతను మరో ఫోన్ వాడుతున్నట్టు ఇతర మార్గాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ రహస్య ఫోన్ నెంబర్ ద్వారా అశోక్ కదలికలను అధికారులు గుర్తించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖులకు ఈ నెంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నెంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గుంటూరు, మంగళగిరిలో మకాం? అశోక్ వాడుతున్న సెల్‌ఫోన్.. డేటా చౌర్యానికి ముందు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఏపీకి చెందిన ఓ మంత్రి ఫోన్ నెంబర్ కూడా మాదాపూర్ టవర్ లొకేషన్లో ఉండటం, ఆయనతో తరచూ మాట్లాడుతుండటం ఈ ఎపిసోడ్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రితో మాట్లాడిన తర్వాత అశోక్ ఫోన్ నెంబర్ నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారులకూ ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. అశోక్‌తో అసలా అధికారులకు సంబంధమేంటి? మంత్రితో మాట్లాడిన వెంటనే అశోక్ అధికారులతో ఏం మాట్లాడాడు? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. అలాగే, డేటా చౌర్యం తర్వాత అశోక్ వాడినట్లుగా భావిస్తున్న రహస్య నెంబర్‌గల ఫోన్ మరికొన్ని సందేహాలను కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి పారిపోయిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ మంగళగిరి, గుంటూరు టవర్ లొకేషన్స్‌ను సూచిస్తున్నాయి. తరచూ ఇవే సిగ్నల్స్‌ను గుర్తించిన పోలీసులు అశోక్ డేటా చౌర్యం కేసు తెరమీదకొచ్చాక గుంటూరు, మంగళగిరిలో మకాం వేశాడా? హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అశోక్‌తో ఫోన్ సంప్రదింపులు జరిపిన అధికారుల ఫోన్లు కూడా ఇదే టవర్ లొకేషన్లను చూపిస్తున్నట్టు తెలిసింది. దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా? ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం అశోక్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తోంది. అతను ఓ గంటపాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను మళ్లీ విజయవాడ మీదుగా మంగళగిరి, గుంటూరు చేరుకున్నట్లు సమాచారం. వాస్తవానికి అశోక్‌ను దేశం దాటించి ఉంటారని పోలీసులు ముందుగా అనుమానించారు. అతను వాడిన ఫోన్‌ను ఇక్కడే ఎవరికో ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి అక్కడి నుంచి గుంటూరు వెళ్లినట్టు అనుమానించారు. అయితే, శాస్త్రీయ కోణంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్మీట్లో అశోక్ మరో రెండు రోజుల్లో బయటకొస్తారని చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది. ఎయిర్‌పోర్టుకొచ్చిన అశోక్ తిరిగి గుంటూరు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. దేశం దాటించేందుకే ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటికీ, దీనివల్ల ఎక్కడో ఒకచోట అతను దొరికిపోతాడని భావించి చివరి నిమిషంలో ఆ ప్రయత్నం మానుకున్నారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు. -
ఏపీ డేటా చోరీ చేస్తే మీకెంటి నష్టం?
-
బాబు సెల్ఫ్‌గోల్
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి అధికారికంగా కొన్నింటిని, అనధికారికంగా మరికొన్ని సంస్థలను వదిలేశానని, పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి అమరావతికి వెళ్లిపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటా చోరీ వ్యవహారంలో సాక్ష్యాధారాలు బయటపె డతానంటూ శనివారం మీడియా సమావేశం నిర్వహించి సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. ప్రజల ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన దాకవరపు అశోక్ తమ వద్దే ఉన్నాడని ముఖ్యమంత్రి పరోక్షంగా అంగీకరించడం రాష్ట్ర ప్రజలను నివ్వెరపరిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్నే చదువుతూ అదే సాక్ష్యమన్నట్లుగా చూపించడం చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, బీజేపీల కుట్ర ఉందని, కేసీఆర్ ఆంధ్రులను అవమానించారంటూ చంద్రబాబు కొత్తగా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంపైనా జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంపై బురదజల్లబోయి తానే ఇరుక్కుపోయారని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు పత్రం పట్టుకొని హల్చల్ డేటా చౌర్యం కేసులో సాక్ష్యాధారాలు అంటూ శనివారం ఉదయం నుంచి లీకులు ఇచ్చి ‘పచ్చ’మీడియాలో ఊదరగొట్టారు. విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుపత్రాన్ని మీడియా సమావేశంలో చూపించి, అదే ఆధారమని చెప్పడం హాస్యాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిన వ్యవహారంపై జిల్లాల్లో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆధార్సంస్థకు ఇలా పలు విభాగాలకు విజయసాయిరెడ్డి ఫిర్యాదులు ఇచ్చారు. ఆ ఫిర్యాదులోనే డేటా చౌర్యం ఎలా జరిగి ఉంటుంది? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఏయే సంస్థలున్నాయి? తదితర అంశాలపై తమకున్న అనుమానాలను, సమాచారాన్ని కూడా వివరిస్తూ దానిపై కూలంకషమైన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు వీటిని పట్టుకొని ఒక్కొక్కటిగా చదువుతూ తాను శోధించి సాధించిన సాక్ష్యాలని చెప్పి నవ్వుల పాలయ్యారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు, ఓటరు జాబితా వివరాలు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా చేరాయన్న ప్రజల సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం సాధికార మిత్రల ద్వారా ప్రజా సాధికార సర్వేలో సేకరించిన సమాచారం ఐటీ గ్రిడ్స్‌కు, అక్కడి నుంచి సేవామిత్ర యాప్‌లోకి ఎలా చేరింది? అన్న దానిపైనా బాబు నోరు విప్పలేదు. పైగా మీడియా సమావేశంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఫిబ్రవరి 19న దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసు రికార్డు చేశారని ఒకవైపు చెబుతూనే మరోవైపు కేసు లేకుండానే 23వ తేదీన ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించడం గమనార్హం. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమదేనని ప్రకటించిన చంద్రబాబు తరువాత అది తమ పార్టీ వ్యవహారాలు చూసే ఔట్సోర్సింగ్ సంస్థ అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ డేటా చోరి అయిందని ఒకసారి, తమ పార్టీ డేటా పోయిందని మరోసారి చెప్పారు. ప్రభుత్వ డేటా పోయిందని, దానిపై ఫిర్యాదు వస్తే ఏపీకి చెప్పాలే తప్ప ఆ సంస్థపై మీరెలా దాడులు చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు ప్రశ్నించడం విశేషం. అన్నింటి కంటే వింత ఏమిటంటే ప్రభుత్వ డేటా పోయిందని చెబుతూనే ఆ డేటా చోరీకి కారణమైన దాకవరపు అశోక్‌ను వెనుకేసుకురావడం. అతడు ఇప్పుడు ఎక్కడున్నాడని విలేకరులు ప్రశ్నించగా.. ఒకటి రెండు రోజుల్లోనే బయటకు వస్తాడని చంద్రబాబు బదులివ్వడం కొసమెరుపు. 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ పోలీసులు నోటీసులు జారీచేసిన అశోక్ తమ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడని సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్పడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకే తంటాలు తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి అధికారికంగా కొన్నింటిని, అనధికారికంగా మరికొన్ని సంస్థలను వదిలేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి అమరావతికి వెళ్లిపోయానని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై పదేళ్ల పాటు హక్కు ఉన్నా అర్ధాంతరంగా తమను కట్టుబట్టలతో అమరావతికి తరలించి నానా కష్టాలకు గురిచేసిన బాబు వైఖరిపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి తమ భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారని, తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేటా చోరీ వ్యవహారంలో కీలకమైన అంశాలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు నీళ్లు నమిలారు. డేటా చౌర్యం నేపథ్యంలో ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు సెంటిమెంట్‌ను రాజేయడానికి ప్రయత్నించారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ఇది ఏపీ, తెలంగాణ మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు బాబు తంటాలు పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయినా బాబు మాటలను ప్రజలు విశ్వసించబోరని పేర్కొంటున్నారు. 14 ఏళ్ల ఉద్యమ కాలంలో కేసీఆర్ అడపాదడపా చేసిన వ్యాఖ్యలను ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం బాబు చేసినా అది పనిచేయదు. ఎందుకంటే గతంలో పలు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. టీఆర్ఎస్తో పొత్తు కోసం ఆరాటపడింది బాబు కాదా? 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు కేసీఆర్‌ను కలుపుకొని మహాకూటమిని ఏర్పాటు చేసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవిభజన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణలో నిర్వహించిన యాగానికి చంద్రబాబు స్వయంగా హారయ్యారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానించారు. పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేశారు. ప్రత్యేకంగా విందు భోజనం వడ్డించారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం బాబు పాకులాడారు. తన బావమరిది హరికృష్ణ శవం పక్కనే పెట్టుకొని కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో పొత్తు మంతనాలు జరిపారు. కేటీఆర్ ఈ విషయం స్వయంగా ప్రకటించగా చంద్రబాబు కూడా అదే నిజమేనని అంగీకరించారు. ఈ ఎన్నిల కోసం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని, వైఎస్ జగన్‌కు మద్దతు పలుకుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలు కూడా నిస్పృహలో చేస్తున్నవేనని ప్రజలు కొట్టిపారేస్తున్నారు. కేసీఆర్‌ను ఏనాడూ కలవని జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ మధ్య ఎప్పుడూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి భేటీలు, చర్చలు జరగలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ విజయం సాధించినప్పుడు అభినందలు తెలపడమే తప్ప జగన్మోహన్రెడ్డి ఆయనతో ఇప్పటివరకు మాట్లాడింది లేదు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే ఇటీవల కేసీఆర్ తనయుడు కేటీఆర్ వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌పైనే చర్చించామని వారిద్దరూ ఆరోజే స్పష్టం చేశారు. చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ సీఎం చంద్రబాబులోని అసహనం మీడియా సమావేశంలో స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి గురైతే దానిపై స్పందించకుండా, ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు చేస్తూ డ్రామాను రక్తికట్టించేందుకు ప్రయాస పడ్డారు. అసలు ఈ వ్యవహారంలో ఐటీ శాఖది కీలకపాత్ర. సంబంధిత శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు బయటకు రావడం లేదన్న ప్రశ్నకు బాబు వద్ద సమాధానం లేదు. దాకవరపు అశోక్‌ను దాచిపెట్టనట్లుగానే లోకేశ్ కూడా బయటకు రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతున్నట్లుగా ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ బయటకు వస్తే తమ బండారం మొత్తం బట్టబయలవుతుందన్న భయంతోనే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రజల డేటా చోరీ గురించి చెప్పకుండా రేపు ఉదయం మీ పిల్లలు కిడ్నాప్ అవుతారు, మీ ఆస్తులను ఎత్తుకుపోతారంటూ సంబంధం లేని అంశాలు ఏవేవో మాట్లాడారు. అదేసమయంలో అధికారంలో ఉన్న తానేనన్న సంగతి మర్చిపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఏమిటని జనం విస్తుపోతున్నారు. -
మరికొన్ని ‘ఐటీ గ్రిడ్స్’ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీ చేసిన టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో శనివారం కూడా సిట్ బాస్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో మరోసారి సోదాలు నిర్వహించారు. సిట్ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణీరెడ్డిల సమక్షంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో సాంకేతిక ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీంను కూడా రంగంలోకి దించారు. ఈ సందర్భంగా మరికొన్ని హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందన్నారు. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసమే ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంస్థ డైరెక్టర్ అశోక్ గూగుల్, అమెజాన్‌లో దాచిన క్లౌడ్ డేటాను సేకరించేందుకు ఆ రెండు కంపెనీలకు లేఖ రాశామని, వాటి నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఆ కంపెనీల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లను కోర్టులో ప్రవేశపెట్టి తరువాత ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామన్నారు. అశోక్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనా రవీంద్ర స్పందిస్తూ ఈ అంశంపై తాము కూడా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎస్సార్ నగర్లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని, అవి రాగానే దానిపైనా దర్యాప్తు మొదలుపెడతామన్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’ చంద్రబాబుదే
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిం చారని తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రజల సమాచారాన్ని దొంగిలించిన చంద్రబాబు ఇప్పుడు దొరికి పోతాననే అసహనంతో ఉన్నారన్నారు. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చంద్రబాబుదేనని ఆయన మాటల్లోనే బయటపడిందని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో తలసాని విలేకరు లతో మాట్లాడుతూ బాబు ఆరోపిస్తున్నట్లుగా హైదరాబాద్‌లోని ఏ ఒక్క ఐటీ కంపెనీవాళ్లు భయపడటం లేదని చెప్పారు. ‘డేటా దొంగిలించి తప్పు చేసింది చంద్రబాబు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇన్ని రోజులూ ప్రైవేటు కంపెనీ అన్నారు. ఇప్పుడు తనదేనని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అద్భుతమైన డాక్యుమెంట్లు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాతే మీడియాకి ఇచ్చింది. దొరికిపోతామని ఫ్రస్టేషన్లో చంద్రబాబు ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏ ఐటీ కంపెనీ భయపడటం లేదు. టీడీపీ నేతల ఆస్తులు అన్నీ ఇక్కడే(తెలంగాణలో) ఉన్నాయి. మేము ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపారని అనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. ఎన్నికల్లో డబ్బులు పంచె అలవాటు చంద్రబాబుతోనే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి తరపున చంద్రబాబు రూ.500 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ నేతలు ఎన్నికలలో డబ్బులు పంచితే వారిని చెప్పుతో కొట్టాలని ఏపీ ప్రజలను కోరుతున్నా. ఏపీలో జీరో శాతం అవినీతి ఉంటే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఏ ప్రాజెక్టులో అయినా లోకేష్ 10 శాతం వాటా తీసుకుంటారు. చంద్రబాబు ఆరు కంటెనయిర్స్తో ఇటలీ టెక్నాలజీతో హైదరాబాద్‌లో ఇల్లు కట్టారు. చంద్రబాబు తల్లిదండ్రులు దర్గాలో ఐదు ఎకరాలు, పంజాగుట్టలో పెద్ద బిల్డింగ్ కొన్నారా? ఆ ఆస్తులు మనవడికి గిఫ్ట్ ఇచ్చారా? గవర్నమెంట్లో దోచిన సొమ్మును హెరిటేజ్‌లో పెడుతున్నారు. విజయ డెయిరీకి రాని లాభాలు హెరిటేజ్‌కి ఎలా వస్తాయి. నల్ల చొక్కాలు వేసుకొని చంద్రబాబు అసెంబ్లీలో దొంగ డ్రామా ఆడారు. ఐదేళ్లుగా పసుపు కుంకుమ, రైతు నేస్తం ఎందుకు ఇవ్వలేదు. ఎన్నికల్లో కేసీఆర్‌కు చంద్రబాబు ఏమాత్రం పోటీ కాదు’అని తలసాని పేర్కొన్నారు. -
ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో ముగిసిన సోదాలు
హైదరాబాద్: మాదాపూర్‌లోని ఐటీగ్రిడ్ కార్యాలయంలో తెలంగాణ సిట్ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. సుమారు 10 గంటల పాటు సిట్ బృందం ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఈ బృందంలో సిట్ అధికారులతో పాటు క్లూస్‌టీం, టెక్నికల్ అనలిస్టులు, సైబర్ నిపుణులు కూడా పాల్గొన్నారరు. వీరందరి సమక్షలో డేటా విశ్లేషణ కొనసాగింది. సీజ్ చేసిన కంప్యూటర్లు, సర్వర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బాక్సులను గోషామహల్‌లోని సిట్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. రేపటి నుంచి గోషామహల్ స్టేడియంలో సిట్ విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. -
చంద్రబాబు, లోకేష్ జైలుకు పోవడం ఖాయం : పెద్దిరెడ్డి
-
40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత ప్రారంభించింది చంద్రబాబేనని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.500 కోట్లకు పైగా చంద్రబాబు నాయుడు డబ్బులు ఖర్చుచేశారని, ఈ విషాయాన్ని కాంగ్రెస్ అభ్యర్థులే తెలిపారని తలసాని అన్నారు. కేవలం పేపర్ల ప్రకటనల కొరకే వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిన 420 దొంగ చంద్రబాబు అని అన్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికలు కేసీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య జరుతాయని ఆయన అనటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు తలసాని స్పందించారు. ఆయన స్వార్థ రాజకీయం కోసం అమాయక ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ డేటాచోరీ కేసులో చంద్రబాబు, ఆయన కుమారుడు ట్విటర్ పిట్ట లోకేష్ బాబు రోజుకో మాటమాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ డేటాను చోరీచేశారని ఒకసారి, పార్టీ డేటాచోరీ చేశామరి మరోసారి అంటున్నారని గుర్తుచేశారు. రోజూ నీతిమాలిన మాటలు మాట్లాడుతూ.. సత్యహరిచంద్రుడిలా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కన్న తల్లినే మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని తలసాని అన్నారు. ఆయనే దొంగతనం చేసి పక్కవాళ్లను దొంగాదొంగా అన్నట్లు చంద్రబాబు తీరుందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ అని ప్రశ్నించారు. నాలుగేళ్లు ఉన్న ఆయన మనవడి పేరు మీద వేల కోట్ల రూపాయలు చూపించిన చరిత్ర ఆయనకు ఒక్కడికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రతీ మహానాడులో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలిన చంద్రబాబు డిమాండ్ చేస్తారని, కేంద్రంలో చక్రం తిప్పినా అని చెప్పుకున్న చంద్రబాబు అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. -
రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు...
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ దాకవరం తమ దగ్గరే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా అంగీకరించారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అశోక్ ఎక్కుడున్నాడన్న మీడియా ప్రశ్నకు స్పష్టత ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు వస్తాడని చంద్రబాబు తెలిపారు. నేరం చేయని వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎంత అవమానమని, వారిని ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తుందని అన్నారు. దీంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో ఏపీ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడన్న విషయాన్ని చంద్రబాబు నిర్థారించినట్లు అయింది. మరోవైపు మీడియా సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న అశోక్‌పై ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా అశోక్ తమ దగ్గరే ఉన్నట్లు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇంఛార్జ్ మల్యాద్రి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అశోక్‌కు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 161 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అయితే అశోక్ తమ దగ్గరే ఉన్నారని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మల్యాద్రి వెల్లడించారు. అశోక్‌తో తాము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నామని... అంతేకాకుండా తెలంగాణ పోలీసులకు అశోక్‌ను అప్పగించబోమని అన్నారు. మరోవైపు తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని అశోక్ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
‘కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు మాటల్లో సెల్ఫ్‌గోల్ తప్ప మరేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. శనివారం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ సమాధానమిచ్చారు. ఐటీగ్రిడ్స్ స్కాంలో టీడీపీ ప్రభుత్వ హస్తం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు అమరావతి పారిపోయాడని అన్నారు. ఏపీలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజల సమస్యలు చంద్రబాబుకు పట్టలేదని విమర్శించారు. సిట్ ఏర్పాటులో సర్కారు ఫీట్లు డేటా స్కాంలోనూ బాబు యూటర్న్! వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. ‘‘ ఏపీలో కిడ్నాపులు, ఆస్తులు దొంగతనాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అంటే ఆయన పాలనలో శాంతిభద్రతలు లోపించాయని ఒప్పుకుంటున్నారు. టీడీపీ గజదొంగల పార్టీ. ప్రజల ఓటర్ ఐడీలు, ఆధార్ వివరాలు బయటకు ఎలా వచ్చాయంటే ప్రభుత్వం దగ్గర సమధానంలేదు. 50 లక్షల మంది డేటా ఉందా? లేక 3 కోట్ల 50 లక్షల మంది డేటా ఉందా?. సేవామిత్ర యాప్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు తొలగించారు. ప్రభుత్వం పథకాలు అందిన ప్రజల వివరాలు టీడీపీ యాప్‌లోకి ఎలా వచ్చాయి. దొంగతనం వేరేవాళ్లు చేసి ఉంటే ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ ఎందుకు పారిపోయాడు. ఓట్ల తొలగింపుపై విజయసాయిరెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేయడం తప్ప?. చంద్రబాబు మాటల్లోనే ఐటీగ్రిడ్స్ సంస్థ మోసం చేసినట్టు కనబడుతోంది. ప్రజా సాధికారిక సర్వే వివరాలు ప్రైవేటు సంస్థకు ఎలా వచ్చాయి. వేమూరి హరికృష్ణ మీ సాంకేతిక సలహాదారుడు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఆయన అరెస్ట్‌యిన విషయం వాస్తవం కాదా. అలాంటి వ్యక్తిని మీరు సలహాదారుడిగా ఎలా నియమించుకుంటారు’’ అని పేర్కొన్నారు. -
‘ఐటీ గ్రిడ్స్ అశోక్ అమరావతిలోనే ఉన్నారు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార కాంక్షతోనే తన కుమారుడు లోకేష్‌ను అందలం ఎక్కించాలని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్ ఆరోపించారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంలో కోసూరి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ దాకవరం అశోక్‌తో, సేవా మిత్ర యాప్ తయారు చేయించి ప్రజల డేటాను చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దొంగిలించారని ఆరోపించారు. అశోక్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లోకేష్ బాబు సంరక్షణలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసే అక్రమాలకు టీడీపీ భూస్థాపితం అవ్వటం ఖాయమన్నారు. చంద్రబాబు మూట ముళ్లు సద్దుకుని కట్ట పక్క నుంచి హైదరాబాద్‌కి వెళ్లేపోయే సమయం దగ్గర పడిందని విమర్శించారు. చంద్రబాబు ఓట్ల తొలగింపు ఆగడాలపై ఎంపీ జీవీఎల్ నర్సింహరావు, కన్నా లక్ష్మీనారాయణలు ఎన్నికల సంఘానికి ఇదివరకే ఫిర్యాదు చేశారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేసి లోకేష్‌ని, చంద్రబాబు నాయుడు, అశోక్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
అసలు రహస్యం బయటపెట్టిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తాను రాజీ పడ్డానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఇంతకాలం రాష్ట్ర ప్రజల కోసం కట్టుబట్టలతో, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేశానంటూ బిల్డప్‌లు ఇచ్చిన ఆయన... అనుకోకుండా అసలు రహస్యం బయటపెట్టేశారు. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్లు పాటు కేంద్రం అనుమతి ఇచ్చినా, తన రాజకీయ అవసరాల కోసమే రాజీ పేరిట ఉమ్మడి రాజధానిని వదిలేశానంటూ లోగుట్టును తానే బయట పెట్టుకున్నారు. దీంతో నాలుగున్నరేళ్ల తర్వాత అసలు విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించినట్లు అయింది. చదవండి... (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!) సాక్ష్యాలంటూ తుస్సుమనిపించారు... మరోవైపు చంద్రబాబు వెల్లడించిన అంశాలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సాక్ష్యాలు బయటపెడతానంటూ భారీగా ముందు నుంచి లీకులు ఇచ్చి... తీరా తుస్సుమనిపించారు. సీఎం ప్రెస్‌మీట్‌పై ఉదయం నుంచి ఎల్లో మీడియా ఊదరగొట్టగా, మరోవైపు టీడీపీ భూమి బద్దలయ్యేలా ఏదో జరగబోతోందంటూ హడావుడి చేసింది. డేటా చోరీ వ్యవహారంలో కుట్ర అంటూ.. దానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ప్రజలకు ఇస్తారంటూ ప్రచారం చేశారు. తీరా ప్రెస్మీట్లో చంద్రబాబు పాత పాటనే తిప్పి తిప్పి పాడినట్లు అయింది. డొంక తిరుగుడు మాటలతో బాబుగారు సుమారు గంటసేపు ప్రెస్‌మీట్ నిర్వహించారు. చివరకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును చూపించారు. చదవండి....(స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) నోరు మెదపని చంద్రబాబు.. ప్రజల డేటా ఎలా చోరీ అయిందన్న విషయంపై మాత్రం చంద్రబాబు నోరు మెదపలేదు. కాగా ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి... అదే సమయంలో దొంగ ఓటర్లను చేర్పిస్తున్నట్లు జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఫిర్యాదు చేశారు. అయినా దొంగ ఓట్లపై చర్య తీసుకోకపోవడంతో ఎన్నికల కమిషన్‌కు విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ చర్యలకు దిగకముందే చంద్రబాబులో వణుకు ప్రారంభమైంది. ఐటీ గ్రిడ్స్ సంస్థకు ప్రభుత్వ డేటా ఎలా వచ్చింది?. టీడీపీ సేవా మిత్ర యాప్‌కు ప్రజల రహస్య సమాచారం ఎలా వచ్చింది?. బ్లూ ఫ్రాగ్ సంస్థకు ఏపీ ప్రభుత్వానికి ఉన్న రహస్య సంబంధం ఏంటి?. ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ దాకవరం ఎక్కడున్నాడు?. అతడిని ఎక్కడ దాచారు?? తప్పు చేయకపోతే దర్యాప్తుకు అశోక్ ఎందుకు రావడం లేదు?. విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయడమే చంద్రబాబు దృష్టితో తప్పా?. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి... (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!) -
చంద్రబాబు ఫామ్ 7 పై రాద్దాంతం చేస్తున్నారు
-
‘శివాజీని గొరిజవోలు గ్రామస్తులు బహిష్కరించారు’
సాక్షి, విజయవాడ : మరో 40 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం యూటర్న్ తీసుకుని డ్రామాలాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ ధ్వజమెత్తారు. సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని విమర్శించారు. వైఎస్ జగన్ కోసం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్న శివాజీ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తులని చంద్రబాబు కీ ఇచ్చి ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) నేరం చేయనప్పుడు ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఎందుకు హైకోర్టులో పిటిషన్ వేశాడని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ పనీ పాట లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అందుకే గుంటూరు జిల్లాలోని గొరిజవోలులో శివాజీని బహిష్కరించారని చెప్పారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు శివాజీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత డేటాను బజార్లో పెట్టిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) -
చిన్న కేసుకే సిట్ వేస్తారా..!
సాక్షి, తిరుపతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం నేరమని అన్నారు. అయినా, డేటా చోరీ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న టీడీపీ నేతలు భుజాలెందుకు తడుముకొంటున్నారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలో నమోదైన చిన్న కేసు విషయమై ఏపీలో సిట్ ఎందుకు వేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. డేటా చోరీ కేసుతో టీడీపీ నాయకులంతా గాబరా పడుతున్నారని, ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బ్లాక్‌మెయిల్‌కు దిగుతోందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని గొంతు చించుకుంటున్న టీడీపీ పరువు నష్టం దావా ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) 2017 నుంచి టీడీపీ చేస్తుందదే..! తెలంగాణలో ఉన్న ఓట్లను ఏపీలో చేర్చే ప్రక్రియకు 2017 నుంచే టీడీపీ పూనుకుందని కన్నా ఆరోపించారు. ఏ గడ్డి తిని అయినా అధికారంలోకి రావాలని బాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫామ్-7 దాఖలు చేస్తే టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం తీరు చూస్తే డేటా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో మాదిరిగానే చంద్రబాబు తీరు ఉందని అన్నారు. ఓటర్ల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. డేటా చోరీపై నియమించిన మూడు సిట్ల నివేదిలక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపిందని స్పష్టం చేశారు. ఈ నెల 13న బీజేపీ-బస్సుయాత్ర విజయనగరంలో ప్రారంభమై 21న కడపలో ముగుస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. (చదవండి : స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) -
చంద్రబాబు ఎందుకు వణికి పోతున్నారు?
సాక్షి, హైదరాబాద్ : డేటా స్కాం వ్యవహారంలో తమ తప్పేం లేదని ప్రగల్భాలు పలుకుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్‌లు ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్‌ను ఎందుకు దాచాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా తండ్రి, కొడుకులపై ధ్వజమెత్తారు. మూలాలపై దెబ్బ కొడతా, తోకలు కత్తిరిస్తానని బెదిరించేది చంద్రబాబేనని, మళ్లీ తనను భయపెడుతున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని శోకాలు పెట్టేది కూడా ఆయనేన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే.. రెండు నాల్కలు ఉన్న వ్యక్తి ఒక్కో దానితో ఒక్కో మాట పలికినట్టుందని, అయినా రెండు సిట్లు వేశారుగా ఎందుకు వణికి పోతున్నారని ప్రశ్నించారు. ఐటి గ్రిడ్స్‌పై దర్యాప్తు మొదలైనప్పటి నుంచి పప్పు నాయుడు (నారాలోకేష్) తలుపు వెనక దాక్కుని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై ట్వీట్లు చేయిస్తున్నాడని, డేటా దొంగ అశోక్‌ను ఎందుకు దాచాల్సి వచ్చిందో మాత్రం చెప్పడం లేదన్నారు. అదేదో బయటకొచ్చి చెబ్తే వినాలని ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక డేటా స్కాం మీద ప్రెస్ మీట్ పెట్టటం కూడా చేతగాని దద్దమ్మను ఐటీ మినిస్టరుగా పెట్టుకుని, కులగజ్జి సన్నాసితో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొరిగించే స్థితికి టీడీపీ దిగజారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేబినెట్ అంతా కలిసి ఎందులో అయినా దూకితే మేలని మండిపడ్డారు. టీడీపీ కాల్ సెంటర్లలో 3,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు బోగస్ ఓట్లు ఎక్కించడం ప్రతిపక్షాల అనుకూల ఓట్లు తొలగించడం మీద పనిచేస్తున్నారని ఆరోపించారు. మరి జయభేరి, నారాయణ కాలేజీల్లో ఉన్నవారు అదనమని, వీళ్ల పనేమిటని ప్రశ్నించారు. సేకరించిన సమాచారాన్ని ఏం మానిప్యులేట్ చేస్తున్నారని నిలదీశారు. -
అశోక్ కదలికలపై నిఘా..
-
నిగ్గదీసి అడుగు
తూర్పుగోదావరి : గత వారం రోజులుగా రాష్ట్రంలో ‘డేటా’ చోరీ వ్యవహారం మలుపులు తిరుగుతున్న తీరును మీరంతా గమనిస్తున్నారు కదా...ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం తెలుగు దేశం పార్టీకి సేవామిత్ర యాప్ రూపొందించిన ‘ఐటీ గ్రిడ్స్’ వద్దకు చేరడాన్ని మీరేమనుకుంటున్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో దొరికిపోయినప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఇదే మాదిరిగా ఎదురుదాడికి దిగి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు...దీన్ని మీరు సమర్థిస్తారా..? సీబీఐ అధికారులు పలువురు పారిశ్రామికవేత్తలపై తనిఖీలు చేసిన సమయంలోనూ ఇదే వైఖరి.. ఈ ఘటనలపై మీరూ స్పందించండి..ఇంకెందుకు ఆలస్యం ... ఈ కింది వాట్స్ యాప్ నంబరుకు మీ ఫొటోతో నాలుగు లైన్లు మించని మీ మనోభావాలను మాతో పంచుకోండి...9963030899 -
సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!
సాక్షి, గోకవరం, (జగ్గంపేట): రాష్ట్ర ప్రభుత్వమే ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని, 1100 కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి సమస్య చెప్పిన ప్రతి ఒక్కరి డేటా సంగ్రహించి సేవామిత్రకు ఇచ్చారని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరానికి చెందిన నేషనల్, ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎం.శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరిస్తే 72 గంటల్లో దీనిని నిరూపిస్తానని శుక్రవారం జగ్గంపేటలో ఆయన ‘సాక్షి’కి చెప్పారు. తమ ఇండస్ట్రీకి చెందిన ఒక సమస్యపై తాను 1100కు ఫోన్‌చేస్తే ఆధార్ నంబర్ అడిగారని.. నంబర్ చెప్పిన వెంటనే ఆధార్‌లో ఉన్న చిరునామా వారు చెప్పి, ప్రస్తుతం ఉన్న అడ్రస్‌లు అడిగి తెలుసుకున్నారని, అప్పుడే తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ విధంగా 1100కు ఫోన్ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును వారు గుర్తించి డేటాను సేవామిత్రకు అప్పగించారన్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగినట్లు భావిస్తున్నానన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ద్వారా ఇది జరిగిందని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. సేవామిత్రకు డేటా వెళ్లిందన్న విషయాన్ని రుజువు చెయ్యొచ్చని, ఈ విధంగా చాలా ఓట్లు తీసేశారని నిరూపించవచ్చన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు బయటపెడతానని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడైన ఓ వ్యక్తి సవాల్ విసరడంతో తాను ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేశానని శ్రీధర్ చెప్పారు. ఇవి చదవండి : అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్! టీడీపీ వైపు లాగండి.. లేకుంటే ఓట్లు ఎత్తేయండి! -
సిట్ ఏర్పాటులో సర్కారు ఫీట్లు
సాక్షి, అమరావతి: ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంతో తీవ్రంగా కలవరపడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. తెలంగాణ సర్కారు సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎదురుదాడికి దిగి తాను సైతం సిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సిట్ ఏర్పాటు వ్యవహారంలోనూ సర్కారు ఫీట్లు చేస్తోంది. ఏకంగా రెండు సిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం లీకులిచ్చింది. అయితే ఒక సిట్‌ను మాత్రమే గురువారం అధికారికంగా ప్రకటించిన సర్కారు రెండవ సిట్ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు శుక్రవారం రెండవ సిట్‌ను ప్రకటించింది. టీడీపీ సభ్యత్వ సమాచారం దొంగిలించారంటూ ఏపీ రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రమణ్యం నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారం–7 దుర్వినియోగమైందంటూ దానిపై విచారణకు రెండవ సిట్‌ను లీగల్ ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం రాత్రి లీకులిచ్చారు. అయితే ఫారం–7 విషయంలో ప్రభుత్వం ఎలా సిట్ ఏర్పాటు చేస్తుందనే విమర్శలు రావడంతో.. అనేక మల్లగుల్లాలు పడిన అనంతరం అగ్నిమాపక శాఖ ఏడీజీ కె.సత్యనారాయణ నేతృత్వంలో రెండవ సిట్‌ను శుక్రవారం ఏర్పాటు చేసింది. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) డీజీపీతో సిట్ బృందాల భేటీ.. ఇదిలా ఉండగా, రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలకు చెందిన అధికారులు శుక్రవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్.బాలసుబ్రమణ్యం, కె.సత్యనారాయణల నేతృత్వంలోని సిట్ అధికారులు ఆయా కేసుల వివరాలు తీసుకుని డీజీపీతో చర్చించారు. రెండు కేసులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ఆయా ప్రత్యేక బృందాల్లోని వారు విడివిడిగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఫారం–7పై సిట్.. అగ్నిమాపక శాఖ ఏడీజీ కె.సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా, వైజాగ్, ఏలూరు, కర్నూలు, అనంతపురం రేంజ్‌ల డీఐజీలు జి.పాల్రాజు, సీఎం త్రివిక్రమ్ వర్మ, డి.నాగేంద్రకుమార్, కాంతిరాణా టాటా, గుంతకల్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, డీఎస్పీ ఎ.రాజేంద్రలు సభ్యులుగా ఉన్నారు. డేటా చోరీపై సిట్ బృందమిదీ.. ట్రాన్సుపోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో ఐజీ, ఎక్సైజ్ డైరెక్టర్ పి.హరికుమార్, ఎస్ఐబీ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, సీఐడీ ఎస్పీ డి.మేరి ప్రశాంతి, ఎఫ్ఎస్ఎల్ ఏఎస్పీ యు.రామ్మోహన్రావు, విశాఖపట్నం డీటీసీ డీఎస్పీ పి.అనిల్‌కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.నాగమల్ల్శే్వరరావు, సైబర్ క్రైమ్ ఎస్సై ఎస్కే రహీముల్లాహ్ సభ్యులుగా ఉన్నారు. ఇవి చదవండి : ‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం నాపై కేసులు కొట్టేయండి -
అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!
సాక్షి, అమరావతి : తీవ్ర సంచలనం సృష్టించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డేటా స్కాం బాగోతంలో సీఎం చంద్రబాబునాయుడు.. నాడు ఓటుకు కోట్లు కేసులో వ్యవహరించినట్లుగానే నేడు కూడా అచ్చు అలాగే అడుగులేస్తున్నారు. అప్పట్లో పోలీసులతో పోటీ రాజకీయం నడపినట్లుగా ఇప్పుడు కూడా డేటా స్కాంలోనూ అలాగే చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ.. కోట్లాది మంది పౌరుల రహస్య సమాచారాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) తప్పించుకునేందుకే ‘సిట్’ ఏర్పాటు ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఓటుకు కోట్లు కేసు తరహాలోనే మళ్లీ దీనిపై కూడా ‘సిట్’ ఏర్పాటుచేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 2015లో వెలుగుచూసిన ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పన్నిన ఎత్తుగడనే ప్రస్తుత డేటా స్కాం విషయంలోనూ అవలంబిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కితే ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. ఏపీలో అతనికి షెల్టర్ ఇచ్చినట్లు విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు కేసులు పెట్టించి ‘సిట్’ ఏర్పాటుచేశారు. అదే సమయంలో చంద్రబాబు తన మకాన్ని హుటాహుటిన విజయవాడకు మార్చారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ‘బ్రీఫ్డ్ మీ..’ వాయిస్ ఆయనదిగానే నిర్ధారణ అయింది. (‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం) మత్తయ్య తరహాలోనే అశోక్‌కు ఆశ్రయం? ఇదిలా ఉంటే.. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కాంకు పాల్పడిందని బట్టబయలు కావడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఈ బాగోతంలోనూ ఆయన పోలీసులను ప్రయోగించి విమర్శలపాలయ్యారు. డేటా స్కాం బయటపడిన రాత్రికిరాత్రి ఏపీ పోలీసులను హైదరాబాద్ పంపి హడావుడి చేయించడం చేతులు కాల్చుకున్నట్లయ్యింది. మరోవైపు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన ఐటీ గ్రిడ్స్ అధినేత దాకారపు అశోక్‌కు కూడా గతంలో మత్తయ్యకు మాదిరిగానే ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే రాజకీయంగా చంద్రబాబు, లోకేశ్‌లు ఇబ్బందులు తప్పవనే భయంతో అతన్ని ఏపీ పోలీసుల కస్టడీలో రహస్య ప్రాంతంలో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. అశోక్ వద్ద కీలకమైన మూడు హార్డ్ డిస్క్‌లు, ఐఫోన్ దొరికితే డేటా స్కాం కేసులో గుట్టురట్టవుతుందని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పోలీసుల దర్యాప్తును అడ్డుకునే అవకాశంలేక ఏపీ పోలీసులను రంగంలోకి దించి ఇది రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓట్లు తొలగింపులపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పోలీసులకు ఫిర్యాదులు చేయించారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో కూడా తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేయించడం గమనార్హం. రెండు సిట్లు ఏర్పాటు.. కాగా, ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంతో ఇప్పటికే కలవరపడుతున్న ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటుచేయడంతో ఇక్కడ కూడా హడావుడిగా గురువారం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్) ఏర్పాటుచేసింది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ రాజధానిలో పెట్టిన కేసును విచారించేందుకు ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏడీజీ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఒక సిట్‌ను, ఫారం–7 ద్వారా ఓట్ల తొలగింపు ప్రయత్నాలపై దర్యాప్తునకు లీగల్ ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో రెండో సిట్‌ను నియమించారు. -
డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!
సాక్షి, అమరావతి: గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లోకి వెళ్లి యూ టర్న్ అంకుల్ అని టైప్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోలు దర్శనమిస్తాయి. యూటర్న్ విషయంలో అంతర్జాతీయంగా ఆయన అంత క్రేజ్ సంపాదించుకున్నారు. దీనికి మరింత సార్థకత తీసుకువచ్చేలా డేటా చోరీ విషయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ వద్ద ఉందంటూ లోకేష్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి సహా, ప్రభుత్వ ఉన్నతాధికారులంతా రాష్ట్రానికి చెందిన ఎటువంటి సమాచారం పోలేదని, అంతా భద్రంగా ఉందంటూ మీడియాకు చెప్పారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) అసలు సమాచారం దొంగతనమే జరగనప్పుడు కేసులేంటి, దర్యాప్తేంటి అంటూ ఎదురుదాడి కూడా చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ కంపెనీలో పనిచేస్తున్న తమ బంధువులు కనపడడం లేదంటూ ఇక్కడ పెదకాకాని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడం, విచారణ కోసం ఏసీపీ స్థాయి అధికారులు ఫిర్యాదు అందిన రెండు మూడు గంటల్లోనే హైదరాబాద్‌లో దర్యాప్తు చేయడం.. హైకోర్టులో పిటిషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. కానీ, తెలంగాణ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని తేలడంతో సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. తమ సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) ఆ వెంటనే ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. అసలు సమాచారం పోలేదన్న వాళ్లే ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేయడంతో ‘బాబు మరోసారి యూటర్న్’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలను ఎలాగోలా అయోమయానికి గురిచేసి దీన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. -
స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?
సాక్షి, అమరావతి/కావలి : ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంలో కీలక నిందితుడు దాకవరం అశోక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎవరు? ఎవరికి బినామీ? ఎవరు కాపాడుతున్నారు? అనే అనుమానాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్‌తో తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్‌గా వార్తల్లోకి ఎక్కిన అశోక్.. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖా మంత్రి లోకేశ్ ఆశీస్సులే కారణమని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!) అశోక్ అనతికాలంలోనే రూ.65 కోట్ల విలువైన ఐటీ గ్రిడ్స్ సంస్థకు అధిపతి ఎలా కాగలిగాడు? దాదాపు 40 ఎకరాలను ఎలా కొనగలిగాడు? తూర్పుగోగులపల్లిలో 100 సీజేఎఫ్ఎస్ రొయ్యల గుంటల సాగు ఎలా చేస్తున్నాడు?.. హైదరాబాద్‌లోని మాదాపూర్ సెంటర్లో సామాన్య వ్యక్తిగా.. సాదాసీదా బైక్‌పై తిరిగిన అతను ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన కూర్చునే స్థాయికి ఎదిగేలా చేసిందెవరు? ..ఇలా అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు, నెల్లూరు జిల్లా కావలిలో మొదలైన అతని ప్రస్థానం అమరావతి వరకు సాగిన క్రమం ఇదిగో ఇలా ఉంది.. కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామానికి చెందిన అశోక్ తండ్రి బుజ్జయ్య చిన్నపాటి ఉప్పు రైతు. కుటుంబ పోషణ, ఉప్పు సాగుతో అప్పులపాలైన బుజ్జయ్య వాటిని తీర్చలేక చేతులెత్తేసాడు. ఆ తర్వాత ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ తరఫున బుజ్జయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయితే, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అశోక్.. టీడీపీ నేతలు బీదా బ్రదర్స్‌కు దగ్గరయ్యాడు. మాజీ ఎమ్మెల్యే, అమరావతి రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రలతో సన్నిహిత సంబంధాలు పెరగడంతో అశోక్ తండ్రి బుజ్జయ్యను టీడీపీలోకి తీసుకొచ్చాడు. అలా టీడీపీతో వారి బంధం మొదలైంది. (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!) లోకేశ్‌కు బినామీగా ఇలా.. రాజకీయ నాయకుల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని సర్వేలు, సమీకరణాలు అంటూ అశోక్ పదేళ్ల క్రితమే డబ్బు సంపాదనే మార్గంగా రంగంలోకి దిగాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పార్టీ అనలిస్ట్ డాట్ కామ్‌ను స్థాపించాడు. అప్పట్లో ఇక్కడకు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, విద్యావేత్త చుక్కా రామయ్య వంటి ప్రముఖులను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ‘పార్టీ అనలిస్ట్’ అనే వెబ్సైట్ ద్వారా ప్రజల్లో రాజకీయ పార్టీల బలాబలాలను అధ్యయనం చేస్తామని చెప్పాడు. ఆ సంస్థను ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చాడు. ఈ క్రమంలోనే లోకేశ్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. మూడేళ్ల క్రితం బీదా బ్రదర్స్ ద్వారా లోకేశ్‌తో అశోక్‌కు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో వేమూరి హరిప్రసాద్ ద్వారా లోకేశ్‌కు మరింత దగ్గరయ్యాడు. సీఎం చంద్రబాబును, ఐటీ మంత్రి లోకేశ్‌ను పలుమార్లు కలిసి ఐటీలో తన ఆలోచనా విధానాన్ని వివరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే టీడీపీ సేవామిత్ర యాప్‌కు రూపకల్పన చేశారు. సీఎం చంద్రబాబును ఒప్పించి మరీ లోకేశ్ తొలివిడతగా అప్పట్లో రూ.8 కోట్లు డబ్బులు పెట్టుబడిగా పెట్టి లోకేశ్‌కు బినామీగా అవతారం ఎత్తినట్లు ప్రచారం జరుగుతోంది. యాప్ నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఈ నేపథ్యంలో.. రాజకీయ ప్రయోజనం కోసమే అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అంతర్గత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌కు అందేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, లోకేశ్ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ రూపొందించింది. టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను కూడా తయారుచేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలుగుచూసిన డేటా స్కాంకు ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యుడని సీనియర్ ఐఏఎస్‌లు చర్చించుకుంటున్నారు. పోలీసుల వద్దే అశోక్? ఇదిలా ఉంటే.. అశోక్ ఇప్పుడు ఎక్కడున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డేటా చోరీపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో పోలీసులకు చిక్కకుండా అతను పరారయ్యాడు. అతను పట్టుబడితే మొత్తం గుట్టురట్టవుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలే పోలీసుల రక్షణ కవచంలో రాజధాని పరిసరాల్లో కాపాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలోని ఒక క్లబ్లో దాచిన అశోక్‌ను శుక్రవారం రాత్రి మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌కు తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో అశోక్ ఉన్నట్టు చెబుతున్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం సిట్ బృందం హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. తరువాత రెవెన్యూ అధికారుల సమక్షంలో కార్యాలయానికి సీల్ వేసి సీజ్ చేసింది. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా కొందరు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏపీ పోలీసులు రాకుండా... ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’ఏర్పాటు చేయగానే అందుకు పోటీగా ఏపీ సర్కారు సైతం రెండు సిట్ లను వేసిన సంగతి తెలిసిందే. పైగా ఐటీ గ్రిడ్స్‌పై దాడుల సందర్భంగా ఏపీ పోలీసులు ఈ కేసులోని ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని తమకు అప్పగించాలంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సిట్ బృందాలు హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణ పోలీసులు కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. దీనివల్ల ఎవరైనా ఇక ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలోకి ప్రవేశించాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. అశోక్ కదలికలపై నిఘా.. ప్రజల వ్యక్తిగత వివరాల చోరీకి సంబంధించిన అంశం కావ డంతో ఈ కేసును తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. ముఖ్యంగా కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే ఓ బృందాన్ని విజయవాడకు పంపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ కదలికలపై సిట్ బృందానికి సమాచారం అందిందని తెలిసింది. తాము అశోక్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని సిట్ బృందం ధీమాగా ఉంది. ఏపీకి చెందిన ఓ మంత్రి సంరక్షణలో అశోక్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. సిట్ కార్యాలయం మార్పు.. ఐటీ గ్రిడ్స్ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం కార్యాలయాన్ని మార్చారు. తొలుత డీజీపీ కార్యాలయం నుంచే సిట్ పనిచేస్తుందని ప్రకటించారు. కానీ శనివారం నుంచి ఈ కార్యాలయం గోషామహల్లో నుంచి విధులను నిర్వహించనుంది. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లోని సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‌డబ్లూ)లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇవి చదవండి : సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..! అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్! -
నాపై కేసులు కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ డేటా చోరీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డి.అశోక్ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. తనపై డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి.దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని అశోక్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించిన డేటాను సేవామిత్ర యాప్‌ల ద్వారా చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన తరువాత ఈ విషయంపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతనికి ఇక్కడి పోలీసులు చెప్పకుండా తమకు లేని పరిధిని ఉపయోగించి తెలంగాణ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదుదారుల ఆరోపణలకు, నాపై పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై ఐపీసీ సెక్షన్లు 420, 419, 467, 468, 471, 120(బీ) వర్తించవని వివరించారు. ఫిర్యాదుదారు హైదరాబాద్ వాసి కాబట్టి అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసులు నమోదు చేయడం చెల్లదని తెలిపారు. డేటా చోరీ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిందని, యుద్ధ ప్రాతిపదికన సిట్ దర్యాప్తు చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అశోక్ కోర్టును కోరారు. -
బాబు బ్రాండ్ రాజకీయం
-
ఐటీగ్రిడ్స్ సంస్థను సీజ్ చేసిన సిట్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దానిలో భాగంగానే హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో ఉన్న ఐటీగ్రిడ్స్ సంస్థను సిట్ అధికారులు సీజ్ చేశారు. విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్ ప్రకటించింది. ఏపీ ప్రజలు డేటాచోరీ కేసులో గత రెండు రోజులు ఐటీగ్రిడ్స్ సంస్థలో సిట్ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిలోని మరింత సమాచారాన్ని వారు సేకరించారు. మరోసారి విచారణకు తమముందుకు హాజరుకావాలని సంస్థ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీచేసింది. మరోవైపు పరారీలో ఉన్న ఐటీగ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని డీజీపీ ఆఫీసు నుంచి గోషామహల్‌కు మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. (అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు?) -
అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు?
సాక్షి, హైదరాబాద్ : ఫారమ్ 7 అప్లై చేయడం నేరం కాదని ఈసీ అధికారులే చెబుతున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకింత కంగారు పడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. డేటా చోరీపై చంద్రబాబు నాయుడు ఇంతవరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదని, హడావుడిగా రెండు జీవోలు మాత్రం జారీ చేశారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఏపీ ప్రభుత్వం సేవామిత్ర యాప్, ఫారమ్ 7కు సంబంధించి రెండు సిట్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ ఓట్లు ఉన్న విషయాన్ని తమ పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లిందని పునరుద్ఘాటించారు. నకిలీ ఓట్లను తొలగించమనే ఫారమ్ 7 అప్లోడ్ చేశారు.. అందులో టీడీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు. సేవామిత్ర యాప్‌తో టీడీపీ నిండా మునిగిపోయిందని.. ఆ కేసును డైవర్ట్ చేసేందుకు ఫారమ్ 7పై 300లకు పైగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యతను కూడా టీడీపీ తీసుకుంటుందా ఏంటి అని ఎద్దేవా చేశారు. లోకేష్ ట్వీట్లు మాని బయటకు రావాలి.. సేవామిత్రలో 30 లక్షల మంది సమాచారం టీడీపీ వారిది అనుకుంటే 3 కోట్ల మంది ప్రజల సమాచారం ఎవరు ఇచ్చారని బుగ్గన ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అసలు అశోక్‌ను ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదన్న బుగ్గన... లోకేష్ ట్వీట్లు చేయడం మానేసి.. బయటికి రావాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తోందని చాటుగా 100 జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ సభ్యత్వ నమోదు వీడియోను బయటపెట్టారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు, లోకేశ్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, అనంతపురం: ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ దొంగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి నారా లోకేశ్ అని తెలిపారు. శుక్రవారం అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, లోకేశ్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విలువైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితా దొంగిలించిన నేరం కింద.. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీపై అనర్హత వేటు వేయాలని కోరారు. -
ఏపీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి కేసు వ్యవహారంలో విచారణ జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన వ్యాఖ్యలతో చంద్రబాబు.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని టీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదుచేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తక్షణమే ఏపీ డీజీపీని మార్చాలి
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు శుక్రవారం సీఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆధార్, ఓటర్ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ ప్రజల ఓటార్ ఐడీ కార్డు వివరాలు, ఆధార్ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. (దేశం దాటిన డేటా చోరీ!) ఏపీ డీజీపీని మార్చాలి.. ఏపీలోని అధికార యంత్రాంగం టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. ఓట్ల తొగింపుపై సరైన విచారణ జరగకుండా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్ చేశారు.కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ....ఓట్ల తొలగింపుపై థర్డ్ పార్టీ విచారణ జరపాలని ఈసీని కోరాం. నమోదు అయిన నకిలీ ఓట్లను ఈసీ తొలగించాలి. ఏపీ డీజీపీని తక్షణం మార్చాలి. రాష్ట్రంలో అధికార యంత్రాంగం టీడీపీ తొత్తులుగా మారిపోయారు. ఓట్ల తొలగింపుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఓట్ల అక్రమాల జాబితా వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఫారం-7 ఎవరైనా దాఖలు చేయొచ్చని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఆధార్ డేటా, ఎన్నికల సంఘం మాస్టర్ డేటాను చోరీ చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకుంటోంది. సీనియర్ అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. డేటా చోరీపై ఎన్నికల సంఘం విచారణ జరపాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దాలి. ఏపీ డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. -
చిట్టి నాయుడికి డోస్ పెంచండి చంద్రం సార్!
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి కేసులో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటని అర్థం కాక బుర్ర గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్.. అంటూ ఎద్దేవా చేశారు. అలాగే శంకుపుష్పి కూడా తినిపించాలని, లేకపోతే 8th ‘స్టాండర్డు లో ఫెయిలవుతాడన్నారు. ఇలా అయితే కొన్నాళ్లకు తమరి మనవడి క్లాస్ మేట్ అవుతాడని కామెంట్ చేశారు. అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని చంద్రబాబుకు అర్థమైందని, పవర్ లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారన్నారు. ఇటువంటి రుగ్మతను సైకాలజీలో Fear of Rejectionగా పిలుస్తారని, చంద్రబాబు ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడని తెలిపారు. -
బాబోయ్ ఓట్ల దొంగలున్నారు.. జాగ్రత్త !
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓట్ల చోరీ చాపకింద నీరులా సాగుతోంది. గోప్యంగా ఉంచాల్సిన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఘోరమైన సైబర్ నేరానికి పాల్పడింది. తాజాగా గురువారం నెల్లూరులో సర్వే చేస్తున్న ఓ బృందాన్ని స్థానికులు అడ్డుకుంటే.. సర్వే బృందానికి ఇంటెలిజెన్స్ అధికారులు అండగా నిలవడం కలకలం రేపుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిందితులకు అండగా నిలవడం పలు విమర్శలకు తావిస్తోంది. తప్పు చేస్తున్న వారిని వదిలేసి దానిని అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి స్వామి భక్తిని చాటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 33, 34 డివిజన్లలో అధికార పార్టీ నేతలఆదేశాలతో ఓ టీం ఇంటింటా సర్వే చేపట్టింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన సభ్యులు ప్రత్యేక సాప్ట్వేర్ ఉన్న ట్యాబ్‌లతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు ఏ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారో అనే విషయాన్ని గ్రహిస్తూ ట్యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే టీం వద్ద ఓటర్ల జాబితా వివరాలు కూడా ట్యాప్‌లో ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు వైఎస్సార్సీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వారిని ప్రశ్తిస్తున్న సమయంలోనే ఇంటెలిజెన్స్ డీఎస్సీ ఫోన్ ద్వారా నేతలను బెదిరించారు. దీంతో పోలీసుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు బహిర్గతమైంది. సర్వే చేస్తున్న యువకులను వైఎస్సార్సీపీ నేతలు పట్టుకున్నారన్న సమాచారం తెలుసుకున్న వేదాయపాళెం పోలీసులు క్షణాల్లో వచ్చి వాలిపోయారు. సర్వే చేస్తున్న వారికి అండగా నిలిచి సర్వే విషయాన్ని ప్రశ్నిస్తున్న నేతలను మందలించడం, వారిపై కేసులు నమోదు చేయడం చూస్తుంటే పోలీసుల సాయంతో టీడీపీ నేతలు భారీ కుట్రకు తెర తీస్తున్నారన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. గతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, బ్రహ్మదేవం గ్రామాల్లో కొందరు టీడీపీకి చెందిన కార్యకర్తలు సర్వేల పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు వారు ఏ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారన్న సమాచారం సేకరణ చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా సర్వేలు చేస్తున్న వారిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించినా కూడా వారు వదిలి వేయడంపై పలు విమర్శలకు తావిచ్చింది. ఫారం–7 పై అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఓటర్లను తొలగింపులో భాగంగా టీడీపీ నేతలు ఆన్లైన్లో ఫారం–7 సమర్పణలో కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఓటర్లనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు తమ విధులను విస్మరించి పూర్తిగా పచ్చచొక్కా తొడిగిన నేతలుగా వ్యవహరించడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా 31,199 ఫారం–7 దరఖాస్తులు నమోదయ్యాయి. అందులో 13,025 దరఖాస్తులను పరిశీలించారు. ఇంకా 18,174 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. -
పోలీసుల వెన్నులో వణుకు
సాక్షి, అమరావతి ప్రతినిధి: డేటా స్కాం వ్యవహారంపై తెలంగాణ పోలీసులు సిట్ దర్యాప్తునకు ఆదేశించడంతో రాష్ట్రంలో ఇన్నాళ్లూ అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా బూత్ లెవల్లో ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏడు నెలలపాటు సేకరించిన ఆ శాఖ కీలక అధికారి ఒకరు వాటిని బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌కు పంపినట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారని ప్రచారం జరుగుతుండటంతో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలీక వారు హడలిపోతున్నారు. కంప్యూటర్ ఐపీ నెంబర్ల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తే ఏపీలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ వ్యవహారంలో ఇరుక్కునే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. (దేశం దాటిన డేటా చోరీ!) అధికార పార్టీ పెద్దలతో ఎంతో సన్నిహితంగా తిరిగే సదరు అధికారి తమతో చేయకూడని పనులు చేయించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని నిబంధనలకు విరుద్ధంగా సేకరింపజేసి ఐటీ గ్రిడ్స్ కంపెనీకి చేరవేశారని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా పార్టీ వ్యవహారాలకు వాడుకున్న విషయం ఈ వ్యవహారంతో బయటకు వస్తుందని వారంటున్నారు. మరోవైపు.. ఎస్బీ, లా అండ్ ఆర్డర్‌లోని కొందరు పోలీసు అధికారులను సైతం ఇష్టానుసారంగా ఈ వ్యవహారాలకు వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అండ ఉందని ధీమాగా ఉన్న కొందరు పోలీసు అధికారులు సైతం తెలంగాణ సిట్ తమ బండారాన్ని ఎక్కడ బయట పెడుతుందోనని ఇప్పుడు వణికిపోతున్నారు. (ఫారం–7 ఇవ్వడం తప్పుకాదు ) కాగా, డేటా స్కాం బాగోతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, తెలంగాణ పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబును బుధవారం రాత్రి కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాలోని తుళ్లూరు పోలీసుస్టేషన్లో 120బీ, 418, 420, 380, 409, 166, 177, 188, రెడ్‌విత్ 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఎమ్మెల్యే కుటుంబానికి 1+1, 1+2 ఆఫర్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బోగస్ ఓట్లు తొలగించాని కోరితే తప్పట! ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉండడంపై ఫిర్యాదు చేస్తే నేరమట! ఓట్ల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేయాలని ఫారం–7పై దరఖాస్తు చేస్తే అదేదో అడ్డగోలుతనమట! ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల ముసుగులో ప్రజల డేటాను చోరీ చేసి, తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడిలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలివి. అబద్ధాలను పదేపదే చెప్పి నిజాలుగా నమ్మించడంలో సిద్ధహస్తుడైన ఆయనకు ఫారం–7 ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశమని తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. తానేది చెబితే అదే నిజం.. తాను చెప్పిందే వాస్తవం అన్నట్టుగా ప్రజల డేటా చోరీ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో చంద్రబాబు వితండవాదం చేస్తున్నారు. ఇంత అడ్డంగా బుకాయిస్తున్న ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై, ముఖ్యంగా తన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబంలోనివారికి రెండేసి మూడేసి ఓట్లు ఉండడంపై ఏమంటారో చూడాలి. ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న తపనతో కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం ఇవేవీ వర్తించవా అనిపిస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబం మొత్తం దొంగ ఓట్లకు చిరునామాగా మారిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ రూరల్‌తో పాటు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ఓట్లు నమోదై ఉన్నాయి. అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు నుంచి మూడు ఓట్లు ఉండడం విచిత్రం. ఆమె కుటుంబానికి వివిధచోట్ల ఉన్న ఓట్ల వివరాలివీ.. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి (రెండు ఓట్లు) : పెద్దాపురం నియోజకవర్గంలోని ఈమె స్వగ్రామమైన మాధవపట్నం బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 2456226 పేరిట ఎమ్మెల్యే అనంతలక్ష్మికి ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్ పరిధిలోని బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజెడ్ 2075331పై మరో ఓటు ఉంది. ఎమ్మెల్యే భర్త సత్యనారాయణమూర్తి (మూడు ఓట్లు) : ఈయనకు కాకినాడ రూరల్ బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎన్జెడ్ 2078319లో ఒక ఓటు ఉంది. అలాగే, కాకినాడ రూరల్‌లోని బూత్ నంబర్ 106లో ఓటర్ నంబర్ ఐఎన్జెడ్ 1724087పై మరో ఓటు ఉంది. అలాగే, పెద్దాపురం నియోజకవర్గంలోని మాధవపట్నంలో బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ ఏపీఓ 70430519155పై ఇంకో ఓటు ఉంది. పిల్లి కృష్ణప్రసాద్ (ఎమ్మెల్యే మొదటి కుమారుడు) (రెండు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలోని బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ ఏపీఓ 70430519410పై ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2068310పై మరో ఓటు ఉంది. పిల్లి కృష్ణకళ్యాణ్ (ఎమ్మెల్యే రెండో కుమారుడు) (మూడు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్ నంబరు 188లోని ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 1182708పై ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2068211పై మరొకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బూత్ నంబర్ 46, ఓటర్ నంబర్ ఐఎంజడ్ 1493402లో మూడో ఓటు ఉన్నాయి. పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడో కుమారుడు) (3 ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్ నంబరు 188లో ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 1182757పై ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2067205పై మరొకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 46లో ఓటర్ నంబర్ ఐఎంజెడ్ 1493550పై మరొకటి ఓట్లు ఉన్నాయి. ఈ ఒక్క ఎమ్మెల్యే కుటుంబంలోని సభ్యులకే రెండేసి మూడేసి ఓట్లు ఉన్నాయంటే మిగతాచోట్ల, మిగతావారికి ఇంకెన్ని ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఓట్లను తొలగించాలని ఫారం–7పై అభ్యర్థన చేస్తే నేరమని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఇలాంటివి తొలగించడం కోసమే ఫారం–7 అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగి, ఫారం–7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, తీసుకుంటామని బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సమంజసమో మరి! -
అధికారులను బలి చేయాలని చూస్తోంది
సాక్షి, హైదరాబాద్: డేటా బదిలీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను బలి చేయాలని చూ స్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ వ్యవహారంలో డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించింది కాదని అది ఏపీ ప్రజ ల డేటా అని లోకమంతా తెలుసన్నారు. గురువా రం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ‘కొందరు తెలిసీతెలియక ‘ఐటీ గ్రిడ్స్’వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరిస్తున్నారు. ఏపీ మంత్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యా దు చేయడం దౌర్భాగ్యం. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్నాయి. టీఆర్ఎస్ 24 లక్షల ఓట్లను తొలగించి గెలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు తమ డేటా చోరీ అయిందని కొన్నిసార్లు, కాలేదని మరికొన్ని సార్లు పూటకో వైఖరితో ముందుకు సాగుతున్నారు. జర్నలిస్టు సంఘా లు ఒక కమిటీ వేసుకుని ఐటీ గ్రిడ్స్‌పై నిష్పాక్షికంగా విచారణ చేసి ప్రజలకు వాస్తవాలు చెబితే మంచిది. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగలరు. ఆయన ట్రాప్‌లో పడి కొన్ని మీడియా సంస్థలు కూడా అలాగే చేయాలనుకుంటున్నాయి. ఏపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, వ్యవస్థల ను చంద్రబాబు ముంచేస్తారు’అని పేర్కొన్నారు. -
డేటా చోరీ కేసులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు..
మూడుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ వివరాలతో పాటు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వారి సమగ్ర డేటా చోరీకి గురైన కేసులో లోతుకెళ్లే కొద్దీ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను.. విదేశాల నుంచి కంట్రోల్ చేస్తున్నట్లుగా బయటపడింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటంతోనే ఈ కంపెనీలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహించటం.. చివరకు విదేశాల్లోని కంపెనీయే మెజారిటీ వాటాను సొంతం చేసుకోవటం.. అలాంటి కంపెనీ చేతికి ఏపీ, తెలంగాణ ప్రజల డేటా మొత్తం చిక్కటం చూస్తుంటే ఇదెంత పెద్ద కుట్రో తేలిగ్గానే అర్థమవుతుంది. ఆ వివరాలు చూస్తే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ 2010లో ఆరంభమయింది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు వెదుకుతున్న దాకవరం అశోక్.. ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఐటీ సేవలు, కన్సల్టింగ్ సంస్థగా చెప్పుకొనే ఐటీ గ్రిడ్స్‌కు 2014 వరకు పెద్దగా వ్యాపారమేమీ లేదు. 2014లో మాత్రం అనూహ్యంగా ఈ కంపెనీలోకి రూ.12,78,524.. అది కూడా డాలర్ల రూపంలో అమెరికా నుంచి పెట్టుబడిగా వచ్చాయి. అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్ర చిరునామాతో ఉన్న సాఫ్ట్‌ల్యాబ్స్ అనే సంస్థ ఈ పెట్టుబడి పెట్టి, కంపెనీలో 52% వాటాను సొంతం చేసుకుంది. అప్పటిదాకా ఈ కంపెనీలో అశోక్‌కు 98% వాటా ఉండగా.. అది 46కు తగ్గిపోయింది. ఐటీ గ్రిడ్స్–యూకే పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు మిగిలిన 2% వాటా ఇచ్చారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్స్‌ను 2014 మే నుంచి అమెరికా చిరునామాతో ఉన్న సాఫ్ట్ ల్యాబ్స్ సంస్థే నియంత్రిస్తోంది. వ్యాపారం కూడా విదేశీనే! విశేషమేంటంటే ఈ ఐటీ గ్రిడ్స్ సంస్థ.. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, సేవల ద్వారా రూ.1.41 కోట్లు ఆర్జించినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కు వెల్లడించింది. ఆ రూ.1.41 కోట్లు కూడా విదేశీ వ్యాపారం నుంచే వచ్చినట్లు తెలియజేసింది. అంటే ఈ లెక్కన 2017 మార్చి వరకూ ఈ కంపెనీకి దేశంలో ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. అలాంటి కంపెనీ చేతికి తెలుగు ప్రజల డేటా మొత్తం చిక్కిందంటే ఏమనుకోవాలి? 2018 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.1.45 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని, అందులో రూ.60 లక్షలే విదేశాల నుంచి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అంటే విదేశీ ఆదాయం ఒక్క సంవత్సరంలోనే రూ.1.44 కోట్ల నుంచి రూ.60 లక్షలకు పడిపోయింది. నిజానికి మామూలు కంపెనీల విషయంలో ఇలాంటివి జరగటం అసాధ్యం. కానీ చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభు త్వం కనుసన్నల్లో సాగుతున్న కంపెనీ కనుక ఏదైనా సాధ్యమే అనుకోవాలేమో!! సరోజనీదేవి.. ఎవరి బినామీ? ఇన్నాళ్లుగా మెజారిటీ వాటాను తన చేతిలో ఉంచుకుని వస్తున్న సాఫ్ట్ ల్యాబ్స్ సంస్థ.. 2018 మధ్యలో తమ వాటాను కె.సరోజనీ దేవి అనే వ్యక్తికి బదలాయించింది. మామూలుగా ఎవరైనా వాటా కొనుగోలు చేసినపుడు ఆ వివరాలు ఆర్వోసీకి సమర్పిస్తూ.. తన భర్త/తండ్రి పేరు వంటి వివరాలతో పాటు చిరునామా కూడా సమర్పించాలి. కానీ ఈ సరోజనీ దేవి వివరాలు ఏ ఒక్క వివరాన్నీ ఆర్వోసీకి సమర్పించలేదు. అసలు ఈ వాటా మొత్తాన్ని ఆమె ఎంత ధరకు కొన్నారు? ఎంత చెల్లించారు? వంటి వివరాలు సైతం అందజేయలేదు. సరికదా.. మెజారిటీ వాటా ఇప్పటికీ విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల నియంత్రణలోనే ఉన్నట్లు చూపించారు. ఎన్నికలకు ముందు ఇలాంటి కీలకమైన సమయంలో ఈ కంపెనీ వాటా చేతులు మారటాన్ని చూసిన వారు.. ఈ సరోజినీదేవి ప్రభుత్వంలోని ముఖ్యనేతలకు బినామీ కావచ్చన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే దాకవరం అశోక్‌ను పోలీసులకు దొరక్కుండా ఏపీ ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారని, ఆయన పోలీసుల ముందు హాజరైతే తప్ప.. సరోజనీ దేవికి సంబంధించిన వివరాలు బయటకు రాకపోవచ్చని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా చూసినపుడు తెలుగు ప్రజల కీలక డేటా మొత్తం విదేశీ నియంత్రణలోని సంస్థ చేతుల్లో ఉన్నట్లుగా భావించక తప్పదు. ఆ ఇద్దరూ రాజీనామా చేశారెందుకో? వాటాదారులను పక్కనబెడితే ప్రస్తుతం ఐటీ గ్రిడ్స్‌లో దాకవరం అశోక్, ఆయన భార్య దాకవరం శ్రీలక్ష్మీ కుమారి, తోట నరేందర్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే గతేడాది ప్రారంభం వరకు ఈ సంస్థలో డైరెక్టర్లుగా కొనసాగిన షేక్ మునీర్ బాషా, కాపా బాలాజీలు ఆ తర్వాత రాజీనామా చేశారు. వీరు రాజీనామాలు చేశాకే సాఫ్ట్‌ల్యాబ్స్ వాటా చేతులు మారటం ఇక్కడ గమనార్హం. మునీర్ బాషా, బాలాజీ ఇద్దరూ కలిసి ముబాకీ సాఫ్ట్వేర్ యాక్సియోమాటిక్ అనే కంపెనీలో డైరెక్టర్లుగా కొనసాగుతుండగా.. ‘తెలుగు గంగ నేచర్ ప్రొడక్ట్స్’పేరిట మరో కంపెనీని కూడా మునీర్ బాషా నడిపిస్తున్నాడు. వ్యవహారం హద్దులు దాటిపోతోందని, డేటా వ్యవహారం కొంపముంచొచ్చని భావించే ఈ ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసి ఉంటారన్న అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. (మంథా రమణమూర్తి) -
తెలంగాణ డేటా కూడా చోరీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై జరుగుతున్న సిట్ దర్యాప్తులో తొలి రోజే సంచలన విషయం బయటపడింది. తెలుగుదేశం పార్టీకి సేవామిత్ర యాప్ రూపొందించిన ‘ఐటీ గ్రిడ్స్’వద్ద ఏపీ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత డేటా కూడా ఉందని ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్)కి నేతృత్వం వహిస్తున్న వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డేటా తస్కరణ ఎన్నికల ముందు జరిగిందా? సేవామిత్ర యాప్‌కు ఈ వివరాలు ఎవరిచ్చారు? అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచార తస్కరణకు సంబంధించిన ఈ కేసు సున్నితమైన అంశమని, పైగా సైబర్ లింకులతో ముడిపడి ఉండటంతో ఇది చాలా సంక్లిష్టమైనదన్నారు. అందుకే కేసు దర్యాప్తులో సైబర్ రంగంలో నిష్ణాతులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ఐటీ గ్రిడ్స్ ప్రజల వ్యక్తిగత డేటా తస్కరించిందన్న ఫిర్యాదులపై మాదాపూర్ (సైబరాబాద్), ఎస్సార్ నగర్ (హైదరాబాద్) పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి కాబట్టి సమగ్రమైన, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపేందుకే సిట్ ఏర్పాటైందన్నారు. సున్నిత అంశాలతో ముడిపడిన అంశం కాబట్టి మీడియా, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయాలనుకునే వారెవరైనా సిట్‌ను ఆశ్రయించవచ్చని సూచించారు. కేసును శాస్త్రీయంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరుపుతామన్నారు. సేవామిత్ర యాప్‌లో ప్రజలకు సంబంధించిన ఓటరు ఐడీ, ఆధార్, కులం తదితర వివరాలను సేవామిత్ర యాప్‌ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్‌కు ఎవరిచ్చారు? ఎప్పటి నుంచి ఈ డేటాను వారు యాక్సెస్ చేస్తున్నారు? బ్లూఫ్రాగ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు దీని వెనుక ఇతర అదృశ్య శక్తులెవరైనా ఉన్నారా? అనే వివరాలను త్వరలోనే తెలుసుకుంటామన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని, వారిని ప్రజల ముందుకు తీసుకొస్తామని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఆ ఫొటోల లీకేజీపైనా విచారణ.. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు చోరీ చేశారంటూ ఏపీ ప్రభుత్వం, అక్కడి నాయకులు చేస్తున్న ఆరోపణలపై స్పందించబోమని స్టీఫెన్ పేర్కొన్నారు. ఈ అంశం తమ పరిధిలోది కాదన్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తెలంగాణ పోలీసుల విచారణను తప్పుబడుతూ అందుకు సంబంధించిన ఫొటోలను టీడీపీ అధినేత కుమారుడు, ఏపీ మంత్రి లోకేశ్ ట్విట్టర్లో పోస్టు చేయడంపై స్టీఫెన్ స్పందించారు. తాము ఆ రోజు కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేశామని, ఒకవేళ తామేమైనా తీసుకెళ్లి ఉంటే ఆ ఫుటేజీలో ఉండేది కదా? అని ప్రశ్నించారు. అసలు ఆ సీసీ ఫుటేజ్ బయటకు ఎలా వెళ్లిందనే విషయంపైనా తాము దృష్టి పెట్టామన్నారు. వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. లోకేశ్‌పైనా చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు చట్టం ముందు అంతా సమానమేనని స్టీఫెన్ స్పష్టం చేశారు. అమరావతిలో ఉన్నా.. అమెరికాలో ఉన్నా పట్టుకుంటాం... ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డైరెక్టర్ అశోక్ ఏపీ పోలీసుల రక్షణలో ఉన్నాడా అని విలేకరులు ప్రశ్నించగా ‘‘ఈ కేసులో మేం చట్ట ప్రకారమే వ్యవహరిస్తాం. నిందితుడు ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. ఆయన అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకురావడం తథ్యం’అని స్టీఫెన్ స్పష్టం చేశారు. అందుకు కోర్టు, ఈసీ సూచనలు, అనుమతులు తీసుకుంటామని, అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. డేటా చోరీ జరిగిందని ప్రాథమికంగా గుర్తించాం.. మార్చి 2న ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసులకు లభించిన సమాచారంలో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని గుర్తించామని స్టీఫెన్ వెల్లడించారు. ‘ఫిబ్రవరి 27న సేవామిత్ర యాప్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగాయి. పలు ఫీచర్లు, మాడ్యూల్స్‌లో కొన్ని మార్పులు జరిగినట్లు గుర్తించాం. అలాగే అశోక్ పారిపోయే ముందు కొంత సమాచారాన్ని పట్టుకెళ్లాడన్న సమాచారమూ తమ వద్ద ఉందన్నారు. -
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. మళ్లీ ఓపెన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల డేటా చోరీతో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుందోననే భయంతో బుధవారం రాత్రి నుంచి పార్టీ వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో గురువారం రాత్రికి మళ్లీ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించింది. బుధవారం రాత్రి నుంచి టీడీపీ వెబ్సైట్ www. telugudesam. org తెరిస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇప్పటికే డేటా చోరీ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో వెబ్‌సైట్‌లోని సమాచారం ద్వారా లేనిపోని ఇబ్బందులు వస్తాయనే కారణంతో దాన్ని నిలిపేసినట్లు తెలిసింది. నిలిపివేత వల్ల ప్రభుత్వం తప్పుచేసినట్లు ఒప్పుకున్నట్లేనని ప్రచారం జరగడంతో వెంటనే గురువారం రాత్రి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. -
మా దగ్గర సమాచారం ఉంటే మీకేంటి?
సాక్షి, అమరావతి: ఓటర్ల సమాచారం తమ పార్టీ కార్యకర్తల వద్ద ఉంటే తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల దగ్గర ఓటర్ల జాబితాలుంటాయని, వారిలో ఎవరున్నారు, ఎవరికి ఓటేస్తారనే వివరాలు సేకరిస్తారని.. అది తప్పెలా అవుతుందని అన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో గురువారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం డేటా చోరీ అంశంపై మాట్లాడారు. 20 సంవత్సరాల నుంచి తమ కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్ చేసుకున్నామని, ఆ సమాచారాన్ని దొంగిలించి ప్రతిపక్ష పార్టీకి ఇచ్చారని ఆరోపించారు. ఎవరో వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తే వారికి అభ్యంతరమేంటని తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమాచారం ఏ ఫార్మాట్లో ఉంటే వారికి నష్టమేంటన్నారు. అయినా ఒక ప్రైవేటు కంపెనీపై ఏ చట్టం ప్రకారం దాడులు చేస్తారని ప్రశ్నించారు. తమ డేటా తీసుకుపోవడానికి వాళ్లెవరని, తమ సమాచారం కొట్టేసి తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. దీనిపై ఎన్నికల సంఘం వద్ద పోరాటం చేస్తామని, కోర్టుకు వెళతామని చెప్పారు. సమాచారం పోయిందనడానికి వారెవరు? తమ సమాచారం పోలేదని చెబుతుంటే.. పోయిందని చెప్పడానికి వారెవరని తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. తమకు సర్వీసు అందిస్తున్న ఒక ప్రైవేటు కంపెనీకి వెళ్లి అక్కడి ఉద్యోగుల్ని భయపెట్టడం ఏమిటన్నారు. దీనివల్ల నాలుగైదు రోజులనుంచి తమ పార్టీ కార్యకలాపాలు ఆగిపోయాయన్నారు. హైదరాబాద్‌లో ఉన్న తమవారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారని, పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం, టీఆర్ఎస్ ప్రభుత్వం కలసి తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని, టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సాంకేతిక సమస్యల్ని చూపించి భయపెడుతున్నారని, తన వద్దకు ఒక నాయకుడొచ్చి సీబీఐని చూస్తుంటే భయమేస్తోందని, పోటీ చేయలేనని చెప్పాడన్నారు. ఫారం–7 ఇస్తే నేరం.. ఫారం–7లు పెట్టి ఓట్లు తీసేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఫారం–7లు పెట్టడం నేరమని, వైఎస్సార్సీపీ ఈ ఫారంలు పెట్టి ఎనిమిది లక్షల ఓట్లు తీసేసిందని ఆరోపణ చేశారు. ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదులు పెట్టి ఓట్లు తొలగించడం నేరమన్నారు. ఎవరైనా ఫారం–7 ఇస్తే నేరమని చెప్పారు. జగన్‌కి తెలంగాణ ప్రభుత్వం రక్షణగా ఉందని, తాను ఓడిపోతే జగన్‌ను సామంతరాజుగా చేసి కప్పం కట్టించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బిహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తమ రాష్ట్రంతో వారికేం సంబంధమని టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పంద పత్రాల్ని దొంగిలించారని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పడమేంటన్నారు. గతంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్నారు. హిందూ పత్రిక రామ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కాగా, పసుపు కుంకుమ పథకం రెండవ విడత కింద రూ.3,500ను శుక్రవారం మహిళల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. ఉండవల్లిలో గురువారం రాత్రి జరిగిన విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో ఈ విషయం చెప్పారు. ఈ 50 రోజులు భోజనానికి, నిద్రకు మాత్రమే ఇంటికెళ్లాలని, మిగతా సమయమంతా పార్టీకోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సాక్షిపై మరోసారి అక్కసు.. సాక్షి పత్రికపై చంద్రబాబు మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఓటర్ల తొలగింపుపై సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చిందులు తొక్కారు. తాను ‘సాక్షి’కి సమాధానం చెప్పనని, అది పార్టీ పత్రిక అని, జగన్మోహన్రెడ్డి పంపితే మీరు వచ్చారని సాక్షి ప్రతినిధిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇప్పటివరకూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ప్రశ్న అడగడమే తప్పంటే ఎలాగని సాక్షి ప్రతినిధి అనగా.. ప్రజాస్వామ్యం వేరు, ఇది వేరని, మిగిలిన వాళ్లకు చెబుతానని, ‘సాక్షి’కి చెప్పనని సీఎం అన్నారు. పార్టీ పరంగా సాక్షిని బహిష్కరిస్తామని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అరాచకాలు చేస్తున్నారని ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అదేం న్యాయమని అడగ్గా.. గౌరవంగా చెబుతున్నానని, మాట్లాడకూడదని బెదిరింపులకు దిగడం గమనార్హం. -
ఫారం–7 ఇవ్వడం తప్పుకాదు
సాక్షి, అమరావతి: రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్టు, దొంగ ఓట్లు ఉన్నట్టు తెలుసుకుని వాటిని తొలగించాలని కోరుతూ ఫారం–7 ఇవ్వడం తప్పు కాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. వెరిఫికేషన్ కోసం వాటిని ఇస్తారని ఆయన తెలిపారు. ఫారం–7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించబోమన్నారు. ఫారం–7 కింద ఇచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపిన తరువాత మాత్రమే.. వాస్తవమైతేనే ఆ ఓట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఫారం–7 ఇవ్వడం నేరమంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ద్వివేది మాటలను బట్టి స్పష్టమవుతోంది. ఫారం–7 అనేది ఓటరుకు తెలియకుండా ఆ ఓటరు పేరు మీదనే ఇంకొక వ్యక్తి ఇవ్వడాన్ని మాత్రమే ద్వివేది తప్పుపట్టారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, దీంతో దరఖాస్తులు తగ్గిపోయాయని తెలిపారు. ఫారం–7 దరఖాస్తులు ఎన్ని వచ్చినా నష్టం లేదన్నారు. ఇప్పటి వరకు పదివేల ఓట్లు మాత్రమే తొలగించామని తెలిపారు. ఫారం–7 దరఖాస్తుల్లో 40 వేల ఓట్లను తొలగించేందుకు మాత్రమే అనుమతించామని చెప్పారు. ఫారం–7 దరఖాస్తును ఆన్లైన్లో చేస్తే ఓటు తొలగించినట్లు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటుహక్కు లేదని గుర్తించామని, వారందరూ ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ద్వివేది స్పష్టం చేశారు. 45 వేల మంది సిబ్బందితో దరఖాస్తుల పరిశీలన.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. డేటా చోరీ కేసు బయటకు వచ్చిన తరువాత ఫారం–7 దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి. మొత్తం 8.76 లక్షల ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. వీటిని 45 వేల మంది సిబ్బందితో నిరంతరంగా పరిశీలన చేయిస్తున్నారు. ఇప్పటివరకు 1,61,005 దరఖాస్తులను పరిశీలన చేయగా అందులో 5,309 మాత్రమే అసలైన దరఖాస్తులుగా నిర్ధారించారు. 1,55,696 దరఖాస్తులను నకిలీవిగా గుర్తించి తిరస్కరించారు. దరఖాస్తుల పరిశీలనను మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పూర్తి చేయనుంది. కాగా, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. -
గద్దె నెక్కిస్తే చోరీ చేస్తారా?
►ముఖ్యమంత్రి ఎవరు? నా బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించడానికి? వాటినిప్రైవేటు వ్యక్తులకు అందించడానికి? ►ముఖ్యమంత్రి ఎవరు? నా ఆధార్ కార్డు వివరాలు దొంగతనం చేయడానికి? వాటిని టీడీపీకి యాప్‌ను తయారుచేసిన ఐటీ కంపెనీకి ఇవ్వడానికి? ►ముఖ్యమంత్రి ఎవరు? భారతీయ ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండాల్సిన కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తస్కరించడానికి? తన పార్టీ అవసరాల కోసం ఒక ప్రైవేటు ఐటీ కంపెనీకి ఇవ్వడానికి? సాక్షి, అమరావతి: ఇప్పుడు రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి? తమ వ్యక్తిగత సమాచారం పోయిందన్న ఆందోళన, ఆగ్రహంతో వేస్తున్న ప్రశ్నలివి. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల సమాచారంతో పాటు పూర్తి వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమకు ధర్మకర్తగా ఉండాల్సింది పోయి తమకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ధర్మమా? అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం ఒక ప్రైవేటు కంపెనీ కలిగి ఉన్నందుకు, ఆ కంపెనీపై అందిన ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేస దర్యాప్తు కోసం సిట్‌ను వేసిన సంగతి తెలిసిందే. తమ ప్రజల సమాచార భద్రతకు సంబంధించిన ఇటువంటి కేసుల్లో తన వంతు ధర్మంగా సహకరించాల్సిన ఏపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎదురుదాడి చేయడం విస్మయం కలిగిస్తోంది. అసలు కీలకమైన డేటాను ఎలా దొంగిలించారు? దీనికి బాధ్యులు ఎవరు? కేసులేమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే.. ప్రైవేటు చేతిలో రెండు రాష్ట్రాల డేటా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆధార్, బ్యాంకు అకౌంట్ల వివరాలతో పాటు పల్స్ సర్వే, ఆర్టీజీఎస్ వివరాలు, కులం, మతం, ప్రభుత్వ పథకాల ద్వారా అందిన లబ్ధి, రాజకీయ పార్టీలపై అభిప్రాయం ఇలా పలు అంశాలతో కూడిన డేటాను ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం, అవి తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో కూడా ఉండటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమకు అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఈ ఐటీ గ్రిడ్స్‌లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల ఓట్లను తొలగించడానికి, ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ప్రణాళికతోనే ఈ వ్యవహారాన్ని చాపకింద నీరులా నడిపించినట్లు పోలీసులు విచారణలో తేలుతోంది. అలాగే చంద్రబాబు డేటా చోరీ వ్యవహారం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా నివ్వెరపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లోనూ ఫలితాలను తారుమారు చేయించడానికి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు ప్రయత్నించారని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డేటా చోరీ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేసి దోషులెవరో తేల్చాలని నిర్ణయించింది. పల్స్ సర్వే పేరుతో స్మార్ట్‌గా కోట్టేశారు.. 2014 ఎన్నికల సమయంలోనే చంద్రబాబునాయుడు అడ్డదారుల్లో ప్రత్యర్థి పార్టీ ఓట్ల తొలగింపు ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. సరిగ్గా తాను అధికారం చేపట్టే నాటికే తనకు కావలసిన ఐటీ కంపెనీలను సిద్ధం చేయించుకొని తెలుగుదేశం వ్యతిరేక ఓటర్లను తొలగించే ప్రణాళికను అమల్లోకి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన పనులు గమనిస్తే అవన్నీ నిజమేననిపిస్తాయి. ఆ పనులేంటంటే.. ►అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం ద్వారా చేయించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సిబ్బందిని పంపి వారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు, వారు చేస్తున్న ఉద్యోగాలు, ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం, అందిన ప్రభుత్వ పథకాలు, వారికి రాజకీయంగా ఉన్న సంబంధ బాంధవ్యాలు.. ఇలా అన్ని రకాల వివరాలను సేకరింపజేసింది. ►వీటిని స్టేట్ రెసిడెంట్స్ డేటా (రాష్ట్రంలో నివసించేవారి సమాచారం) హబ్‌లో నిక్షిప్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీఎస్) సర్వర్లలో భద్రపరిచింది. ►ఈ ఆర్టీజీఎస్ సీఈఓగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అత్యంత నమ్మకస్తుడైన అహ్మద్ బాబును నియమించుకున్నారు. ప్రజాసాధికార సర్వే సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్ మళ్లీ ఆయా ప్రజానీకానికి ఫోన్లు చేసి పథకాల అమలు తీరు, ప్రభుత్వంపై వారికి ఉన్న సంతృప్తి, అసంతృప్తి తదితర వివరాలను సేకరించింది. బ్లూ ఫ్రాగ్ చేతిలో 27 ప్రభుత్వ శాఖల సమాచారం ►ప్రజాసాధికార సర్వే సమాచారాన్ని, తాను ఫోన్ల ద్వారా సాగించిన సర్వే వివరాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా ఆర్టీజీఎస్ సమీకరించి బ్లూ ఫ్రాగ్ సంస్థకు అందించింది. దాదాపు 27 రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో బ్లూ ఫ్రాగ్ సేవలు కొనసాగుతున్నాయి. ►ప్రజాసాధికార సర్వే, ఆర్టీజీఎస్ నిర్వహించిన సర్వే వివరాలతో పాటు దాదాపు 27 శాఖల సమాచారం ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ చేతుల్లో ప్రభుత్వం పెట్టింది. ►ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు తమకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న దాకవరపు అశోక్ ద్వారా ఐటీ గ్రిడ్స్ సంస్థను ఏర్పాటు చేయించి దానికి బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా ప్రభుత్వ సమాచారం యావత్తూ తరలింపజేశారు. అలాగే ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థకు తరలింపజేశారు. సేవామిత్ర యాప్‌తో అభిప్రాయ సేకరణ ►ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలుగుదేశానికి సేవామిత్ర యాప్‌ను రూపొందించి సర్వేలు చేయిస్తోంది. తమకు ఆర్టీజీఎస్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఫోన్లు చేసి ప్రజలనుంచి పలు అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించింది. దాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం ఏర్పాటు చేయించిన సేవామిత్రులకు పంపి ప్రజలనుంచి నేరుగా ఆయా అంశాలపై అభిప్రాయ సేకరణ జరిపించింది. ►సేవా మిత్రులనుంచి వచ్చిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ లోతుగా విశ్లేషించి వారిలో ప్రభుత్వ అనుకూలురు ఎవరు? ప్రతికూలురు ఎవరు? అన్న సమాచారాన్ని బూత్ స్థాయిలోని టీడీపీ ముఖ్య నాయకులకు అందజేసింది. ఓట్లు ఇలా తొలగించేశారు.. టీడీపీ ముఖ్యనేతలు ఎక్కడికక్కడ టీడీపీ ప్రతికూల ఓట్లను తొలగించేలా జిల్లా స్థాయిలోని ఎన్నికల అధికారులకు అభ్యర్థనలు అందించారు. వీటి పరిశీలనకు బూత్ స్థాయిలో పరిశీలకులుగా తామే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించిన అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఇతర సిబ్బందిని వినియోగించుకోవడం ద్వారా తప్పుడు నివేదికలు రూపొందింపచేశారు. ఎమ్మార్వోల అనుమతితో తమ ప్రతికూల ఓటర్ల పేర్లను జాబితానుంచి తొలగిస్తూ వచ్చారు. ఈ ప్రక్రియను చంద్రబాబునాయడు, ఆయన బృందం గతకొన్నేళ్లుగా ఒక పథకం ప్రకారం కొనసాగించి లక్షలాది టీడీపీ ప్రతికూల ఓట్లను గల్లంతు చేయించింది. కలర్ ఫోటోలతో కూడిన జాబితా ఎలా వచ్చింది? మీరెప్పుడైనా ఓటర్ల జాబితాలో కలర్ ఫోటోలను చూశారా? కేవలం కేంద్ర ఎన్నికల సంఘం మాస్టర్ డేటాలో మాత్రమే ఈ కలర్ ఫోటో ఉంటుంది. మిగతా ఎవరి దగ్గరైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో కూడిన ఓటరు జాబితా మాత్రమే ఉంటుంది. మరి ప్రైవేటు సంస్థలైన బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్ సంస్థలకు కలర్ ఫోటోలతో కూడిన ఓటరు జాబితా ఎలా వచ్చింది? అనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్షానికి సాధ్యమా? ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా తాము ఇవ్వలేదని చెప్పాయి. మరి ఐటీ కంపెనీలకు ఈ జాబితా ఎవరు ఇచ్చారు? ప్రతిపక్ష పార్టీలు దగ్గర ఈ సమాచారం ఉండే అవకాశమే లేదు. దీనినబట్టి చూస్తే అధికార తెలుగుదేశం పార్టీనే ఈ డేటాను చోరీ చేసిందని తెలుస్తూనే ఉంది. ఈ ముఖ్య విషయంతో పాటు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్, జన్మభూమి కమిటీలు, అంగన్వాడీ వర్కర్లు, సేవామిత్రల పాత్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది. అడ్డంగా దొరికి ఎదురుదాడి చంద్రబాబునాయుడు, ఆయన బృందం సైబర్ నేరానికి పాల్పడినట్లు తేటతెల్లమవుతున్నా మళ్లీ ఎప్పటిలాగే బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు. దీనిని తెలంగాణ, ఏపీ మధ్య వివాదంగా సృష్టిస్తున్నారు. తమ డేటా పోలేదని ఒకసారి, దొంగిలించారని మరోసారి, అది పార్టీకి చెందిన 65 లక్షల మంది డేటా అని ఇంకోసారి ప్రకటనలు చేస్తూ చివరకు మంత్రులతో ఎదురు కేసు పెట్టించారు. నిజానికి పార్టీ డేటా పోతే ఆ డేటాను ఎవరికి అప్పగించారో ఆ ఐటీ గ్రిడ్స్ సంస్థపై, ఆ సంస్థ ఎమ్డీ దాకవరపు అశోక్‌పై వారు కేసు పెట్టాలి. ఆ సంస్థ హైదరాబాద్‌లో ఉంది కనుక హైదరాబాద్‌లో కేసు నమోదు చేయించాలి. చంద్రబాబు అలా చేయకుండా గుంటూరులో కేసు పెట్టించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఆ చోరీ జరిగి ఉంటే అశోక్ చేత హైదరాబాద్‌లో పోలీసు కేసు పెట్టించాలి. అదేమీ చేయకుండా అశోక్‌ను చంద్రబాబునాయుడు ఎందుకు వెనకేసుకు వస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. పైగా పార్టీ సమాచారం పోయిందని చెబుతున్న చంద్రబాబునాయుడు ఆ ప్రైవేటు సమాచారంపై ప్రభుత్వం ద్వారా అత్యున్నత స్థాయిలో సిట్లు ఏర్పాటుచేయడం చూసి జనం విస్తుపోతున్నారు. పోలీసు శాఖను తెలుగుదేశం పార్టీ జేబు సంస్థగా బాబు మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు భరోసా ఇవ్వకుండా.. తమ వ్యక్తిగత సమచారం పోయిందని ప్రజల మనసుల్లో ఉన్న ఆందోళన, భయాన్ని తొలగించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవేమీ చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయడం గర్హనీయం. -
దొరికిపోయిన దొంగ చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దొరికిపోయిన దొంగ అని.. ఆయనకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే ఈ వ్యవహారంలో జరుగుతున్న విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించగలరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అంబటి విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి ప్రజాబలం లేదనేది స్పష్టంగా అర్థం అవుతోందని, అందుకే ఎన్నికల యుద్ధం ప్రారంభం కానున్న ప్రస్తుత నేపథ్యంలో అధికార పార్టీలోని యోధాను యోధులైన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే గెలిచే పరిస్థితుల్లో టీడీపీ లేదని, దాంతో ఆ పార్టీ వక్రమార్గాలు పట్టిందని విమర్శించారు. అడ్డదారుల్లో గెలవాలనే తపనతో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, మోసం, దగా, మ్యానిపులేషన్ చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచి, వ్యవస్థలను ప్రభావితం చేసి గెలవాలని భావిస్తోందన్నారు. ఈ అడ్డదార్లు తొక్కే క్రమంలోనుంచి పుట్టిందే ‘డేటా చోరీ ఆలోచన’అని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయాలనుకున్న వారికి ఆయన రెండేసి ఓట్లు ఇస్తారా? ఆయనకు ఓటు వేయరని భావించిన వారికి అసలు ఓట్లే లేకుండా చేస్తారా? ఈ అన్యాయం ఏమిటని ప్రశ్నిస్తే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలకు దిగుతారా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. తాము ఎప్పుడైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశామా? 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నది ఎవరు? వారిలో నలుగురిని మంత్రులను చేసింది ఎవరు? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయి.. పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా అని అంబటి ప్రశ్నించారు. ఓ ప్రైవేటు సంస్థ డేటాను చోరీ చేస్తే దానిపై కేసు నమోదు అయితే దానిని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారుస్తున్నారని మండిపడ్డారు. వారి బ్యాంక్ అకౌంట్లు బయట పెడతారా.. చంద్రబాబు తన బ్యాంకు అకౌంట్‌ను, తన కుమారుడు లోకేశ్ బ్యాంక్ అకౌంట్‌ను బహిరంగంగా పెట్టగలరా? ప్రజలందరికీ మీలాంటి భద్రత అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఫారమ్–7 అనేది ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉన్నా, డబుల్ ఎంట్రీలు ఉన్నా సరిచేయమని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఇచ్చే దరఖాస్తు అని ఆయన అన్నారు. ఐటీ గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు దాడి చేస్తే లోకేశ్‌కు సన్నిహితుడైన అశోక్‌ను దాచేశారని చెప్పారు. అతనిని ఎక్కడ దాచారో చెప్పాలన్నారు. -
ఇంకెన్నాళ్లు నీతులు !
-
పార్టీ సేవలో ఎంపీ మురళీమోహన్ కోడలి సంస్థ
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను నిర్వహించే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీ స్కామ్‌తో ఏపీలో ఆ పార్టీకి సేవలు అందిస్తున్న పలు ఐటీ సంస్థల్లో కలవరం మొదలైంది. ఆయా సంస్థల్లో ఉన్న ఇబ్బందికర డేటాను క్లియర్ చేయాలని (తొలగించాలని) అధికార పార్టీ నేతల నుంచి నిన్న సాయంత్రం మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐటీ మంత్రి నారా లోకేశ్ అనుచరులుగా చెప్పుకొనే కొందరు రంగంలోకి దిగి తమ పార్టీకి అనుకూలంగా ఉండే ఐటీ సంస్థను అప్రమత్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. డేటా చోరీ స్కామ్‌కు సంబంధించి ఎవరైనా వచ్చి ప్రశ్నించినా వివరాలు చెప్పొద్దని, మీ కార్యాలయంలోని కంప్యూటర్స్ (సిస్టమ్స్)లో హార్డ్ డిస్క్‌లను క్లియర్ చేసి, రోజువారీ పనులు చేసుకుంటున్నట్టు కూల్‌గా ఉండాలని కీలక నేతలు దిశానిర్ధేశం చేసినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ మాదిరిగానే ఏపీలో దాదాపు 13 సంస్థలు పనిచేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శాఖలు, వాటి వివరాలు, పనితీరు, సేవలు, అబ్ధిదారుల సమాచారం.. ఇలా అనేక పేర్లతో అనేక ఐటీ సంస్థలను సర్వీసు ప్రొవైడర్లుగా ఏర్పాటు చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయాల ప్రజాధనం ఫలహారంగా పంచుతూ వచ్చింది. ప్రభుత్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ కోసం పనిచేసే ఐటీ సంస్థలకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో కొన్ని ఐటీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని సంస్థలను సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్టు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ వ్యవహారంతో తేటతెల్లమైంది. ప్రోనిక్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈపీ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొడ్ ట్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎల్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీఆర్ టెక్నాలజీస్, శ్రేయ కంప్యూటర్స్, ఇన్వెంట్జీ ఎంటర్ ప్రైజెస్ ప్రైౖవేట్ లిమిటెడ్, ప్రొస్పెక్టా టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అల్కోర్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘన జీయోమెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రభుత్వంలోని పలు శాఖలకు సేవలందిస్తున్నాయి. వాటికి ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. వాటిలో కొన్ని సంస్థలు టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌కు డేటాను అందజేసినట్టు సమాచారం. పార్టీ సేవలో ఎంపీ మురళీమోహన్ కోడలి సంస్థ టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలికి చెందిన టెలీబ్లూ ఐటీ సంస్థ ప్రభుత్వంతో పలు అంశాలపై ఒప్పందాలు చేసుకుని పార్టీకి సేవలు చేస్తోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లిలో ఉన్న ఈ కార్యాలయంలో దాదాపు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన ఆర్టీజీఎస్ నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థకు అప్పగించినట్టు తెలిసింది. ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్(మెస్సేజ్)లు పంపించి పలు అంశాలపై ప్రజలను ఆరా తీసే ఈ సంస్థ రాజకీయ కోణంలో మంత్రి లోకేశ్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోందని చెబుతున్నారు. ఇటీవల ఈ సంస్థ నుంచి ఒక ఉద్యోగి అభిప్రాయ సేకరణ పేరుతో ప్రకాశం జిల్లా పెదదోర్నాల గ్రామంలో టీడీపీ కార్యకర్తకు ఫోన్ చేసాడు. మా గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన వారికి అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇచ్చారంటూ టీడీపీ కార్యకర్త బదులిచ్చాడు. మీరు చెప్పిన సమాచారం లోకేశ్ కార్యాలయానికి చెబుతామని, వారు చర్యలు తీసుకుంటారని టెలీబ్లూ సంస్థ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. -
ఏ క్షణంలోనైనా అశోక్ అరెస్టు!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌లో ప్రధాన నిందితుడు అశోక్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి కదలికలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం న్యాయ వ్యవస్థను తప్పు పట్టించడమేనన్నాయి. ఇందుకు సంబంధించి ఏపీలో కేసు నమోదైనా అది చట్టపరంగా నిలవదని పేర్కొన్నాయి. పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడమే కాకుండా.. అతడిని నిర్దోషిగా నిరూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు న్యాయపరంగా చెల్లేవి కావని తెలిపాయి. నిందితుడిని చట్టం నుంచి కొన్నాళ్లు కాపాడినా చివరికి అతడు కోర్టు బోను ఎక్కక తప్పదని... చట్ట పరిధిలోనే తమ విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశాయి. చదవండి : (అశోక్ అమరావతిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా...) కాగా ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ మాదాపూర్ పోలీసులకు లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 2న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీగ్రిడ్ సంస్థపై దాడులు చేసి కొన్ని కంప్యూటర్లు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. 120(బీ), 379, 420, 188తోపాటు ఐపీసీ 72, 66(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కేసు కావడంతో.. విచారణ నిమిత్తం హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.(డేటా చోరీ ప్రకంపనలు.. తస్మాత్ జాగ్రత్త!) -
దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు
-
'టీడీపీ ఫేక్ హ్యాష్ ట్యాగ్‌లపై పక్కా ఆధారాలు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోందని టీఆర్ఎస్ యూత్ వింగ్ సభ్యులు మండిపడ్డారు. ఫేక్ ట్వీట్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిపోయిన టీడీపీనేతలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ఐటీ వింగ్ నుండే సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని టీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు జగన్ పేర్కొన్నారు. పూర్తి ఆధారాలతోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ల నుండి తెలుగు భాషలో పెద్ద మొత్తంలో తప్పుడు ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌లను పోస్ట్ చేపించడంలోనే టీడీపీ వక్రబుద్ది బయటపడిందని అన్నారు. -
అశోక్ అమరావతిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా...
సాక్షి, హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల డేటాను కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ తీసుకుందని, ఈ కేసులో ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రధాన నిందితుడు అశోక్ అమరావతిలో ఉన్నా...అమెరికాలో ఉన్నా వదిలేది లేదని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అని, నిందితులు ఎవరైనా వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని చూస్తున్నామన్నారు. చదవండి...(‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరైన ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండటంతో తమకు అనేకు అనుమానాలు వచ్చాయన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. సిట్‌లో 9మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని, అయితే ఈ కేసు దర్యాప్తుపై మీడియా కూడా సంయమనం పాటించాలని స్టీఫెన్ రవీంద్ర కోరారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా వచ్చింది?. విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రయివేట్ సంస్థకు ఎవరిచ్చారు?. తెలంగాణ ప్రజల డేటాతో ఎవరికి ప్రయోజనం కలిగించాలనుకుంటున్నారు? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టామన్నారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉందని అన్నారు. ఇక డేటా గ్రిడ్స్ సీఈవో అశోక్ ఎక్కడున్నాడనేది ఇంకా తెలియలేదని, అతడి కోసం గాలిస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, మరింత సమాచారం కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నామన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థపై గతంలో సోదాలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రజల డేటాను గుర్తించామని, ఆ డేటాతో పాటు వారికి చెందిన ఆధార్ వివరాలు ఉన్నాయన్నారు. అలాగే ఈ కేసులో అమెజాన్, గూగుల్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని, ఇంకా వాటి దగ్గర నుంచి సమాధానం లేదన్నారు. డేటా చోరీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవామిత్రలో ఉన్న కొన్ని యాప్స్ తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసు వివరాలను ప్రతిరోజు తెలియచేస్తామని సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. -
బాబు.. అశోక్‌ను ఎక్కడ దాచారు?
-
‘ఆయన ట్రాప్‌లో పడ్డ కొన్ని మీడియా సంస్థలు’..
-
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. అందుకేనా?
-
డేటా చోరీపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలు
-
‘సాక్షి’ ప్రతినిధిపై అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు
-
‘ఆయన ట్రాప్‌లో మీడియా సంస్థలు’..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మిని చేయగలరని, ఆయన ట్రాప్‌లో పడిన కొన్ని మీడియా సంస్థలు కూడా తిమ్మిని బమ్మిని చేయాలనుకుంటున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఐటీ గ్రిడ్‌కు సంబంధించిన వాస్తవాలు ప్రజల దృష్టికి తేవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్ కేసును రెండు రాష్ట్రాల వివాదంగా కొందరు తెలిసీ, తెలియక చిత్రీకరిస్తున్నారన్నారు. ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయటం దౌర్భాగ్యమన్నారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కూడా 24 లక్షల ఓట్లను తొలగించి గెలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు.. దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొన్ని సార్లు తమ డేటా చోరీ అయిందని, కొన్ని సార్లు కాలేదని టీడీపీ నేతలు పూటకో వైఖరితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టు సంఘాలు ఒక కమిటీ వేసుకుని ఐటీ గ్రిడ్‌పై నిష్పాక్షికంగా విచారణ చేసి ప్రజలకు వాస్తవాలు చెబితే మంచిదని సూచించారు. ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను బలి చేయాలని చూస్తోందన్నారు. డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించింది కాదని, అది ఏపీ ప్రజల డేటా అని లోకమంతటికి తెలుసునన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పు చేసిన వారిని ఒప్పు చేసిన వారిగా చిత్రీకరిస్తున్నాయన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలను, మంత్రులను, వ్యవస్థలను చంద్రబాబు ముంచేస్తారన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఎవరికీ మంచిది కాదని సూచించారు. -
‘సాక్షి’ ప్రతినిధిపై అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ‘సాక్షి’ మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై సీఎం మండిపడ్డారు. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ...ఒకసారి చెబితే వినాలంటూ సీఎం భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని చంద్రబాబు పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. అందుకు ప్రతిగా సాక్షి ప్రతినిధి... మీరు పిలిస్తేనే మీడియా సమావేశానికి వచ్చామని తెలిపారు. అసలు మిమ్మల్ని ప్రభుత్వ సమావేశాలకు కూడా రానివ్వనంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబుతో పాటు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావు కూడా రెచ్చిపోయారు. చేయి చూపిస్తూ కుర్చోవాలని బెదిరించారు. గతంలో కూడా చాలాసార్లు సాక్షి మీడియాపై చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా అవాకులు, చవాకులు పేలిన విషయం విదితమే. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? కాగా ఇదే సమావేశంలో డేటా చోరీ అంశంపై చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగారు. కేంద్రంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ‘ మా సమాచారం కొట్టేసి మా మీదే కేసులు పెడతారా?. మా రాష్ట్రంలో డేటా సేకరిస్తే మీకేమి సంబంధం. ప్రజల సమాచారం దుర్వినియోగం జరిగిందంటూ నాపై బురదజల్లి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఏదైనా అయితే మాకు ఉండాలి కానీ. నా మీద అంత ప్రేమ ఎందుకో. ఈ వ్యవహారంతో అసలు కేసీఆర్‌కు ఏం సంబంధం. మీకు అధికారం ఉందని అహంకారమా?. మా సమాచారాన్నే మీరు దొంగలించి..మమ్మల్నే బెదిరిస్తున్నారు. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? డోంట్ మైన్.. కేంద్రం దాడులకు భయపడేది లేదు. అదేమని ప్రశ్నిస్తే ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తూ టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబు.. అశోక్‌ను ఎక్కడ దాచారు?
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను చంద్రబాబు నాయుడు అక్రమంగా తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాంబు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి ఆధార్ డేటా ఎలా వచ్చిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఇరు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. డేటా చోరీ కేసుపై చంద్రబాబు విచారణకు సిద్ధమని చెప్పగలరా అని సవాల్ చేశారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్‌ని ఎక్కడ దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్ విచారణకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజాధరణ లేదని తెలుసుకున్న చంద్రబాబబు.. ప్రజాస్వామ్యాన్ని దగా చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేప్పేవి నీతులు.. చేసేవన్ని దొంగపనులని ఎద్దేవా చేశారు. బీజేపీ చంకనెక్కింది.. కేసీఆర్ యాగానికి వెళ్లింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏపీ ప్రజలు కప్పం కట్టే పరిస్థితిని వైఎస్ జగన్ రానివ్వరని చెప్పారు -
ప్రజలకో సిద్ధాంతం..మీ కుటుంబానికో సిద్ధంతామా?
-
సేవామిత్ర యాప్‌ను ఎందుకు క్లోజ్ చేశారు?
సాక్షి, హైదరాబాద్ : డాటా చోరీకి పాల్పడలేదని చెబుతున్న టీడీపీ.. తమ వెబ్సైట్ సేవామిత్ర యాప్‌ను ఎందుకు క్లోజ్ చేసిందో చెప్పాలని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో తాము అడిగిన ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. బుకాయింపు ధోరణిని టీడీపీ అవలంబించడం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధి బయటపడ్డ తాజా వీడియోని ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయడం లేదని నిలదీశారు. -
మా ప్రశ్నలకు చంద్రబాబు జవాబు చెప్పాలి
-
డేటా చోరీపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ వేగంగా పావులు కదుపుతోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టడానికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు సాక్షుల, నిందితుల విచారణ చేపడుతూనే మరోవైపు యూజర్ల సమాచారం తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సిట్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాట చేసింది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) సైబర్ క్రైమ్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం.. ఈ కేసుకు సంబంధించి సైబర్ నిపుణల సలహాలతో డేటా అనాలసిస్, డేటా రిట్రైవ్ చేపట్టనుంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులను, నిందితులను విచారించడానికి సీనియర్ అధికారితో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరో టీమ్ ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతో సంప్రదింపులు జరపనుంది. మిగిలిన రెండు ప్రత్యేక బృందాలు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు చేపట్టనున్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన యూజర్ల సమచారం ఇవ్వాల్సిందిగా అమెజాన్, గూగుల్‌ని కోరింది. డేటా చోరీకి సంబంధించి యూఐడీఎఐ, ఎన్నికల కమీషన్లకు లేఖ ద్వారా సిట్ సమాచారం అందజేయనుంది.(ఇదీ జరుగుతోంది!) -
అధికారిక సమీక్షల్లో అశోక్ దర్జా!
-
‘అన్యాయంగా మా కార్యకర్తల పేర్లు చేర్చారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లు ఉండటం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే రఘురామ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మరో ఎమ్మెల్యే అంజాద్ భాషా, కడప మేయర్ సురేష్ బాబుతో కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను కలిశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కావాలనే తమ కార్యకర్తల పేర్లను చేర్చారని ఎస్పీకి తెలిపారు. నేర చరిత్ర చూశాకే బైండోవర్ కేసులు పెట్టాలని విన్నవించారు. ఓట్ల తొలగింపు దొంగలను పట్టుకుని శిక్షించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైఎస్సార్సీపీ శ్రేణులను కేవలం విచారణ మాత్రమే చేస్తున్నామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
సైబర్ నేరంలో ఏపీ సీఎం చంద్రబాబు
-
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. అందుకేనా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో అధికార పార్టీపై ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీడీపీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ‘ఎర్రర్’ అని చూపిస్తోంది. టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారిక వెబ్సైట్ www.telugudesam.org షట్‌డౌన్ కావడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సేవా మిత్ర యాప్ సమాచారం బయటపడకుండా ఉండేందుకే వెబ్‌సైట్‌ను మూసేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఆన్లైన్ సభ్యత్వాన్ని కూడా ఇంతకుముందే హఠాత్తుగా నిలిపివేశారు. (అంతా పథకం ప్రకారమే!) మంత్రి నారా లోకేశ్‌తో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్‌కు సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఏకంగా లోకేశ్‌తో కలిసి ఆయన అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయం బయటపడింది. గుట్టురట్టు కావడంతో అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించడంతో ఉన్నతాధికారులు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డేటా చోరీ కేసులో అన్నివైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు దీని నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్టు కనబడుతోంది. (అధికారిక సమీక్షల్లో అశోక్ దర్జా!) -
ఐటీ గ్రిడ్స్ స్కాం : సుప్రీం కోర్టు సుమోటోగా కేసు పెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న డేటా చోరీ అంశంపై సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా చౌర్యం కచ్చితంగా క్రిమినల్ నేరమే అన్నారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన డేటా.. ప్రైవేట్ సంస్థల దగ్గర లభించడం దారుణమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక శుక్తులతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. -
చంద్రబాబులో వణుకు
-
తప్పు చేయకుంటే అశోక్ ఎందుకు పరారీ?
సాక్షి, విజయవాడ: ప్రతి నియోజకవర్గంలోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోనే 9 వేల ఓట్లను తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారం-7ను టీడీపీ నేతలు ఓట్ల తొలగింపుకు వాడుకుంటున్నారని విమర్శించారు. గత పది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందని గుర్గుచేశారు. ఎలక్షన్ కమిషన్ విచారణ చేసి ఓట్ల తొలగింపులో వాస్తవాలు బయటపెట్టాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్ వ్యవహారం బహిర్గతం కావడంతో.. దాన్ని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని సూటిగా ప్రశ్నించారు. గుట్టు బయటపడుతుందని అశోక్‌ను, ఇతర సిబ్బందిని దాస్తోంది టీడీపీ కాదా అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఐదు రకాల వ్యక్తిగత డేటా సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సిట్ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. ఓ పథకం ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓట్ల తొలగింపు చేపట్టారని ఆరోపించారు. సర్వేలన్నీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ భయంతోనే చంద్రబాబు 59 లక్షల ఓట్లను తొలగించారని వ్యాఖ్యానించారు. నేరాన్ని అంగీకరించి చంద్రబాబు తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. -
ఓట్ల తొలగింపులో చేసిందంతా టీడీపీయే
-
ఐటీ గ్రిడ్స్.. అధికారుల పాత్రపై సిట్ విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసుపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై చర్చించేందుకు గురువారం సమావేశం కానున్న సిట్ కీలక ఆధారాలను సేకరించేందుకు సన్నద్ధమవుతుంది. డేటా చోరీ కేసుకు సంబంధించిన రికార్డులను, ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సిట్‌కు అందజేయనున్నారు. ఈ వివరాలు తీసుకున్న తర్వాత సిట్ ఆధ్వర్యంలో ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులను అధికారులు విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్స్‌కు అందించడంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై సిట్ విచారణ మొదలుపెట్టనుంది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) కాగా, ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ గురువారం వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైదంటూ ఫిర్యాదులు రావడంతో తెలంగాణ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసుల, తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ అభిమానులు ఆన్లైన్లో ఎదురుదాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. (ఇదీ జరుగుతోంది!) -
పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టి..
డేటా స్కాం బాగోతంలో రాష్ట్ర ప్రభుత్వ తీగలాగితే అనేక డొంకలు కదులుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బిల్లులను పెండింగ్ పెట్టి ఆ నిధులను పక్కదారి పట్టించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు బదలాయింపు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్‌కు ప్రభుత్వం చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పేదలు, కూలీల సంక్షేమం కన్నా పార్టీ ప్రయోజనాలకే తెలుగుదేశం సర్కార్ పెద్దపీట వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కాకులను కొట్టి గద్దలకు పెట్టడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఇప్పటివరకూ రూ.48కోట్లు ముట్టజెప్పినట్లు సమాచారం. ఐటీ గ్రిడ్స్‌కు రూ.10.50 కోట్లు చెల్లించేందుకూ సర్కార్ సిద్ధమైంది. అలాగే, దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్.. ఉపాధి హామీ పథకానికి సాఫ్ట్వేర్ సేవలను అందజేస్తుండగా ఆ నిధుల నుంచి కూడా చిన్న ఐటీ సంస్థ అయినా ఐటీ గ్రిడ్స్‌కు నిధులు చెల్లించడం గమనార్హం. – సాక్షి, అమరావతి నిధులు అందుబాటులో లేవంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలకు గత నవంబరు నుంచి సర్కారు చెల్లింపులను నిలిపివేసింది. ఇలా ఇప్పటివరకు వారికి రూ.540కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు.. ఐటీ గ్రిడ్స్‌కు మాత్రం సర్కారు ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తూ వస్తోంది. ఇలా 2018 జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో ఆ సంస్థకు రూ.కోటి వరకు ఇచ్చింది. అంతేకాక, రానున్న ఎన్నికల్లోగా మరో రూ.6కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ చెల్లింపులన్నీ హైదరాబాద్ బేగంపేట రోడ్డులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఐటీ గ్రిడ్స్ పేరిట ఉన్న ఖాతాలో ఉపాధి కూలీల నిధి నుంచి విడతల వారీగా చెల్లించారు. 2018 జూన్ 14న రూ.59,13,120లు, సెప్లెంబరు 5న మరో రూ.18,53,280లు, నవంబరు 23న రూ.12,12,640లు, ఈ ఏడాది జనవరి 3న మరో 12,12,640లు ఆ ఖాతాలో జమ చేసింది. ఇలా రెక్కాడితే కానీ డొక్కాడని ఉపాధి కూలీల బిల్లులను పెండింగ్‌లో పెట్టి ఐటీ గ్రిడ్స్‌కు ఆఘమేఘాలపై బిల్లులు చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఐఏఎస్‌పై లోకేశ్ ప్రేమ మంత్రి లోకేశ్ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన రంజిత్ బాషాకు ఏడాది క్రితం ఐఏఎస్ హోదా దక్కింది. ఆ వెంటనే ఆయన లోకేశ్ శాఖలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల రెండింటికీ ఉమ్మడి డైరెక్టర్‌గా నియమితుల య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిం చాల్సిన ఆ బాధ్యతల్లో జూనియర్ ఐఏఎస్‌ను నియమించడంపై అప్పట్లో ఆరోపణలొచ్చాయి. తన శాఖ పరిధిలోని వివిధ విభాగాల నుంచి కోట్లాది రూపాయలను అస్మదీయులైన ఐటీ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈయనను ఏరికోరి నియమించుకున్నట్లు అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. పంచాయతీ నిధులు సైతం పక్కదారి పార్టీ వ్యవహారాలకు ఐటీ గ్రిడ్స్ సంస్థను ఉపయోగించుకుంటు న్నట్లు సీఎం చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, పార్టీ నేతలందరూ నాలుగు రోజులుగా ఊదరగొడుతున్నారు. అయితే, ఇప్పుడా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎలా చెల్లిస్తారన్న దానిపై అధికార, రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడు స్తోంది. మరోవైపు.. లోకేశ్ మంత్రిగా కొన సాగుతున్న పంచాయతీరాజ్ శాఖ పరి« దిలో ఆ సంస్థ చేసిన పనులకు గ్రామ పంచా యతీల నుంచి చెల్లింపులు చేసేందుకు కస రత్తు జరుగుతోందని అధికారులు చెబుతు న్నారు. అలాగే, అదే లోకేశ్ పరిధిలోని గ్రామీ ణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూ ఎస్) శాఖ నుంచి మరో రూ.3 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్లూఫ్రాగ్ పైనా అంతులేని ప్రేమ ఇదిలా ఉంటే.. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే మరో ఐటీ సంస్థ బ్లూఫ్రాగ్ సంస్థ పైనా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తోంది. ఈ సంస్థతో ఇప్పటివరకు రూ.38 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ మంత్రిగా పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం శాఖలోనే కూలీలందరి బ్యాంకు ఖాతాలు, వారి ఫోను నెంబర్లతో కూడిన కూలీ కార్డుల జాబితాను భద్రంగా ఉంచేందుకు ఏటా రూ.1.90 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కొనసాగిస్తోంది. ఇందుకుగాను ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.10 కోట్లు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు లోకేశ్ శాఖకు అనుబంధంగా పనిచేసే స్వచ్చాంధ్ర కార్పొరేషన్లో మరుగుదొడ్లకు జియో ట్యాగింగ్ పేరిట జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈల ద్వారా రూ.2.70 కోట్లు.. పంచాయతీరాజ్ శాఖలోనే గ్రామాల్లో కరెంట్ స్తంభాలకు జియో ట్యాగింగ్ కోసం ఇదే సంస్థకు రూ. కోటి వరకు ప్రభుత్వం చెల్లించింది. అంతేకాక, డ్వాక్రా మహిళలందరి బ్యాంకు ఖాతాల వివరాలను ఆన్లైన్లో భద్రపరిచేందుకు రూ.3 కోట్లు దాకా చెల్లించారు. రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట వేశారన్నది ఫొటోలతో సేకరించే ప్రక్రియనూ బ్లూఫ్రాగ్కే అప్పగించారు. రూ. 29 కోట్ల విలువ చేసే ఈ కాంట్రాక్టులో రూ.8 కోట్లు చెల్లింపులు పూర్తయ్యాక, దానివల్ల ప్రయోజనం లేదంటూ ఆ కార్యక్రమాన్నే విరమించుకుంది. కాపు కార్పొరేషన్, సెర్ప్ సహా వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆస్తులకు జియో ట్యాగింగ్ అంటూ ఆయా శాఖల నుంచి మరో రూ.10 కోట్ల వరకు ఇదే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.‘కుటుంబ వికాసం–సమాజ వికాసం’ కార్యక్రమం కింద కూడా ఈ సంస్థకు మరో రూ.3కోట్లు చెల్లించేందుకు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం డేటా స్కాంపై దుమారం లేకపోయినట్లయితే ఈ వారంలోనే ఆ డబ్బులు కూడా చెల్లించి ఉండేవారని అధికారులు చెబుతున్నారు. -
లోకేష్, అశోక్‌ల దోస్తానాకు సాక్ష్యమిదే..!
సాక్షి, అమరావతి: ఈ ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తిని చూశారా.. ఆయనే దాకవరం అశోక్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఈయన. ఆధార్, రాష్ట్ర ప్రభుత్వ రహస్య డేటా అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న ఈయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరంగా జరిగే అధికారిక సమీక్ష సమావేశాల్లో మంత్రి నారా లోకేష్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్యనే దర్జాగా కూర్చొని ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అయిన టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీ యజమాని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమీక్ష సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లభించడం, మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య దర్జాగా కూర్చోవడాన్ని బట్టి చూస్తే.. మంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యం ఏమిటో బోధపడుతుంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయన అండతోనే ప్రభుత్వ అధికార సమీక్ష సమావేశాల్లో అశోక్ పాల్గొంటున్నారని అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) లోకేష్ వెంటే ఉంటూ ఎప్పుడూ ఆయన అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని వారు చెబుతున్నారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రి లోకేష్ చాంబర్లోనే అశోక్ ఎప్పుడూ ఉంటారని.. మంత్రి కార్యాలయంలో ఆయనదే పూర్తి హవా అని అంటున్నారు. టీడీపీకి ఐటీ సేవలందించే అశోక్‌కు చెందిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మంత్రి లోకేష్ శాఖల ద్వారానే కోట్ల రూపాయలు చెల్లింపులు సైతం జరిగాయి. గత ఎనిమిది నెలల్లో నాలుగు విడతల్లో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.01 కోట్లు చెల్లించింది. దీన్నిబట్టి పార్టీకోసం పనిచేసేవారిని ప్రభుత్వ విధుల్లో భాగస్వాముల్ని చేయడమేగాక ప్రభుత్వం నుంచి ఐటీ కాంట్రాక్టులను సైతం కట్టబెట్టారనేది స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ తతంగంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన భారీ కుట్ర దాగి ఉందని అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇది చదవండి : టీడీపీ మైండ్‌గేమ్! -
డేటా చోరీ కేసు దర్యాప్తు సిట్‌కు అప్పగింత
-
త్వరలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-
డేటా చోరీ కేసు పెద్ద స్కామ్
-
కీ విలన్ ఎవరు?
-
ఎమ్మెల్యేనైన నా ఓటే తొలగిస్తారా!
సాక్షి, యాదమరి(చిత్తూరు జిల్లా): ఎమ్మెల్యే ఓటే తొల గించాలని దరఖాస్తు వస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఐటీ కంపెనీల ద్వారా సామాన్య ఓటర్లవే కాక, నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటు కూడా తీసేయాలని దరఖాస్తు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నియోజక వర్గంలోని ఐరాల మండలం పైపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ సునీల్‌కుమార్ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో వేల కొద్దీ ఫారం–7 దరఖాస్తులు రావడంతో ఎమ్మెల్యే ధర్నాలు చేశారు, కానీ చివరకు ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు రావడంతో ఆయన అవాక్కయ్యారు. అధికారులు పరిశీలించి ఫారం–7ను తిరస్కరించారు. ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు చేసిన వ్యక్తిని బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు విచారించారు. చివరకు అతను ‘‘నేను వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్‌ను. నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దరఖాస్తు చేయలేదు’’ అని చెప్పారు. దీనిపై అధికారులు పోలీసులు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టిన వారి ఐపీ అడ్రస్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి నెట్వర్క్: తెలుగుదేశం ప్రభుత్వం https://www.sakshi.com/tags/data-breachడేటా చౌర్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారపార్టీ నేతలు దాన్నుంచి బయటపడేందుకు ఫారం–7 దరఖాస్తుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలపై భారీ ఎత్తున అక్రమ కేసుల నమోదు చేపట్టారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేశారంటూ నోటీసులు జారీ చేయడమేగాక ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారు. అంతేగాక వారిని పోలీస్స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. (ఇదీ జరుగుతోంది!) అక్రమ కేసుల బనాయింపు తీరిదీ.. - అక్రమ ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం–7 కింద దరఖాస్తులు చేశారనే పేరిట కృష్ణా జిల్లాలో బుధవారానికి 22 కేసులు నమోదు చేశారు. మైలవరంలో 15 మంది వైఎస్సార్సీపీకి చెందిన బూత్ లెవల్ కన్వీనర్లను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి ఆన్లైన్లో అర్జీలను తాము దరఖాస్తు చేయలేదని వారు రాతపూర్వకంగా తెలిపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ డి.కమలేష్రాజును బుధవారం అర్ధరాత్రి చిల్లకల్లు పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ వచ్చి ఫారం–7 అర్జీపై విచారించారు. కమలేష్‌రాజు పేరిట అతని ఓటును అతనే తొలగించాలని కోరుతూ గుర్తు తెలియన వ్యక్తి ఆన్లైన్లో ఫారం–7 దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ విషయమై విచారించేందుకు పోలీసులు అర్ధరాత్రిపూట ఇంటికి రావడమేమిటని కమలేష్‌రాజు వాపోయారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) - శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఫారం–7 పేరిట 20 కేసులు నమోదయ్యాయి. కావలి సబ్ డివిజన్లో 6, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్లో 3, గూడూరు సబ్ డివిజన్లో 3, ఆత్మకూరు సబ్ డివిజన్లో 8 కేసులు చొప్పున నమోదు చేశారు. మంగళవారం గూడూరులో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని విచారణకోసం స్టేషన్‌కు పిలిపించారు. - వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఫారం–7 కింద ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారనే ఆరోపణతో వైఎస్సార్సీపీకి చెందిన 90 మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలో 1,712 ఓట్లకు తొలగింపునకు వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరిట అగంతకులు ఫారం–7 దరఖాస్తు చేశారు. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే కలసపాడు పోలీసుస్టేషన్ పరిధిలో 12 మందిపై, బి.కోడూరు పోలీసుస్టేషన్ పరి«ధిలో 15 మంది వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లపై కేసుల నమోదుకు తహసీల్దారు ఆదేశించారు. తమకు తెలియకుండానే ఫారం–7 దరఖాస్తులిస్తే ఎలా కేసులు నమోదు చేస్తారని వీరు విస్తుపోతున్నారు. - పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీకి చెందిన బూత్ కన్వీనర్లను, ముఖ్య కార్యకర్తల్ని బుధవారం పోలీస్స్టేషన్లకు పిలిపించారు. ఏలూరు మండలం నుంచి 205 మందిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. దరఖాస్తులు మీరే చేశారా లేదా? అని ప్రశ్నించారు. మా పేరుతో ఫొటోతో ఎవరో దరఖాస్తు చేశారు.. మాకు సంబంధం లేదని వారు చెప్పారు. పెదవేగి నుంచి 185 మందిని పిలిపించి విచారించారు. ఆచంటలో బూత్ కన్వీనర్లను ఏలూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. చింతలపూడిలో పలువురిని చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇదే రీతిలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ బూత్ కన్వీనర్లు, ఇతర కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు. - కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 24 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. డోన్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. ఇదే నియోజకవర్గంలోని బేతంచర్ల మండలంలో 129 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఆలూరులో 32 మంది వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు, పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 50 మంది బూత్ కన్వీనర్లపై కేసులు నమోదు చేసి.. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. - తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3వేల మందికి నోటీసులు జారీ చేయడంతోపాటు సుమారు 1,500 మందిపై కేసులు నమోదు చేశారు. వీరందరిని పోలీసు స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేశారు. తుని నియోజకవర్గంలో 13 మంది బూత్‌కమిటీ కన్వీనర్లపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో ముగ్గురు బూత్ కమిటీ కన్వీనర్లను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. గొల్లప్రోలు మండలంలో ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేశారంటూ 43 మంది వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్లపై, వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన బూత్ కమిటీ కన్వీనర్ల ఇళ్లకు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వెళ్లి భయాందోళనలు సృష్టించారు. పోలీస్‌స్టేషన్‌కు రాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. బుధవారం ఉదయం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిపై పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దొరబాబు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కాకినాడ సిటీలో 20 మంది బూత్‌కమిటీ కన్వీనర్లను పోలీసులు విచారించారు. వారికి నోటీసులిచ్చారు. - శ్రీకాకుళం జిల్లాలో ఫారం–7 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యవహారంలో దర్యాప్తు పేరుతో 197 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమదాలవలస మండలంలో 59 మంది, వంగరలో 18 మంది, పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేటలో 52 మంది, భామినిలో 23 మంది, పలాస మండలం మందసలో 26 మంది, పరాసలో 12 మంది, వజ్రపుకొత్తూరులో ఆరుగురు, నరసన్నపేట నియోజకవర్గంలోని సారవకోటలో ఒకరిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో.. విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం నాటికి 41 కేసులు నమోదు చేశారు. ఒక్క సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఏ.కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, అనకాపల్లి టౌన్, మునగపాక పోలీస్స్టేషన్లలో రెండేసి చొప్పున కేసులు నమోదు కాగా, మిగిలిన 20 పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క చొప్పున కేసులు నమోదయ్యాయి. మెజార్టీ కేసులు వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పెట్టినట్టుగానే తెలుస్తోంది. ఈ కేసులన్నింటిని ఆయా పోలీస్స్టేషన్లు జిల్లా సైబర్ క్రైం విభాగానికి బదలాయించారు. వైఎస్సార్సీపీకి చెందిన మండల, గ్రామ, బూత్ కమిటీ నేతలను స్టేషన్లకు పిలిపించుకుని విచారించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతలిచ్చిన ఫిర్యాదుల మేరకు పెట్టిన కేసుల్లో మాత్రం టీడీపీ శ్రేణులను విచారణకు పిలిచే సాహసం చేయలేకపోతున్నారు. -
టీడీపీ మరో కొత్త డ్రామా
సాక్షి, గుంటూరు: దొంగే దొంగా దొంగా.. అని అరిచిన చందంగా అధికార టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెరతీశారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను తారు మారు చేసేందుకు డేటాను ఐటీగ్రిడ్స్ సంస్థకు అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తడం, అందుకు సంబంధించిన కీలక ఆధారాలు తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుసుకోవడంతో టీడీపీ తప్పు కప్పిపుచ్చుకునేందుకు వింత వాదనకు దిగింది. ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతోపాటు, తెలంగాణ పోలీసు అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు కుట్ర పన్నారంటూ బుధవారం కొత్త పల్లవి అందుకున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఐటీగ్రిడ్స్ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ముచ్చమటలు పట్టాయి.(‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) ఫిబ్రవరి 23కు ముందే అమరావతిలో కుట్ర పన్నారంటూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్స్‌పై దాడి చేసిన వ్యవహారంలో తప్పులు చేసినట్లుగా చెబుతూ తెలంగాణ పోలీసు అధికారులపై నిందలు వేస్తూ కుట్ర కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే కౌంటర్ కేసులు పెట్టి ఏదో విధంగా తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. గుంటూరు రూరల్ ఎస్పీని కలిసిన అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావు, ఎంపీ కనకమేడల, మంత్రి ప్రత్తిపాటి మాట్లాడారు. (ఇదీ జరుగుతోంది!) కేసు నమోదు చేస్తాం: ఎస్.వి.రాజశేఖర్‌బాబు, గుంటూరు రూరల్ ఎస్పీ ఐటీగ్రిడ్స్‌పై దాడి వ్యవహారంలో ఫిబ్రవరి 23కు ముందే అమరావతిలో కుట్ర జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తాం. తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తాం. -
డేటా చోరీ ఓ పెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, ఐటీ గ్రిడ్స్ వ్యవహారాన్ని కేంద్రం నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆరోపించారు. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వ పెద్దలందరూ ఏపీపై తెలంగాణ దాడిగా భావిస్తున్నారన్నారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక ప్రైవేట్ కంపెనీపై, ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఏపీ ప్రభుత్వానికి ఎందుకంత భయం పట్టుకుందని నిలదీశారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) డేటా చోరీ ఓ పెద్ద కుంభకోణం లాంటిదని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేసి దొరికినా ప్రధాని నరేంద్ర మోదీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైనది కాదని పేర్కొన్నారు. ఏపీలోని ప్రతి శాఖ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని వాఖ్యానించారు. రాష్ట్రంలో ఏది జరిగినా మోదీ, జగన్, పవన్ చేస్తున్న కుట్రగా చంద్రబాబు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. (ఇదీ జరుగుతోంది!) -
ఇదీ జరుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ‘టీడీపీ కీ–పర్సన్’ అనే కోడ్‌తో పిలిచే వారు కీలకంగా వ్యవహరించారని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ ‘కీ’పర్సన్స్ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ యాప్ వ్యవహారంలో ఆన్లైన్లో జరిగే కీలక పరిణామాలను ఆయన మ్యాప్ రూపంలో వివరించారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) సేవామిత్ర యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ.. వివిధ మార్గాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటా సంగ్రహించింది. దీని ఆధారంగా ఇక్కడి కాల్ సెంటర్లోని వాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తారు. వారు చెప్పే అంశాలను పొందుపరుస్తూ.. ఆ వివరాలను సేవామిత్ర సైట్‌కు అప్లోడ్ చేస్తారు. ఈ డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది. దీన్ని నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి సేవామిత్ర కన్వీనర్లకు అనువుగా తయారు చేసి వారికి పంపిస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ అందులోని ఓటర్ల వివరాలను సరిచూసే ఈ బూత్ స్థాయి కన్వీనర్లు వారి ఆధార్, మొబైల్ నంబర్లు, కులం, రాజకీయ ప్రాధాన్యం వివరాలు సేకరిస్తారు. ఇలా రూపొందించిన డేటాను మళ్లీ హైదరాబాద్‌లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు పంపిస్తారు. ఈ డేటాను మరికొన్ని కోణాల్లో విశ్లేషించే ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీ వ్యతిరేక ఓటర్లు, ఆయా ప్రాంతాల్లో లేని వారిని గుర్తిస్తుంది. ఇలా సమగ్ర విశ్లేషణతో తయారు చేసిన జాబితాలను తెలుగుదేశం పార్టీ ‘కీ’పర్సన్‌కు పంపిస్తుంది. సదరు యాప్‌లో వీరికి ‘టీడీపీ కీ–పర్సన్’అనే కోడ్ వర్డ్ ఇచ్చారు. ఆ కీపర్సన్ తనకు అందిన ఫైనల్ జాబితాలోని ఓటర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదని నిర్ధారించుకుంటాడు. వారి పేరుతో తప్పుడు మార్గంలో ఫామ్–7 రూపొందించి ఓట్లు తొలగించేందుకు ఓటర్ ప్రమేయం లేకుండానే సంబంధిత అధికారికి పంపించేస్తారు. సేవామిత్ర సర్వేలో వేరే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన వారు తమకు ఓటు వేయరనే ఉద్దేశంతో తొలగించేస్తున్నారు. సర్వే సమయంలో అందుబాటులో లేని వాళ్లు.. పోలింగ్ సమయంలో వచ్చి వేరే పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో తీయించేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) -
డేటా స్కాంలో ఏ–1 చంద్రబాబు, ఏ–2 లోకేష్
సాక్షి, అమరావతి: ప్రజల డేటాను తస్కరించిన స్కాంలో ఏ–1 సీఎం చంద్రబాబు, ఏ–2గా మంత్రి లోకేష్‌ను చేర్చి విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ నేత, కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచార స్కాంపై జరుగుతున్న పరిణామాలు చూసి రాష్ట్రం నివ్వెరపోతుందని, ప్రభుత్వ పరిధిలో గోప్యంగా ఉండాల్సిన డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఆ డేటాను ఐటీ సంస్థలకు అప్పగించారని దుయ్యబట్టారు. (ఇదీ జరుగుతోంది!) ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ సంస్థల సైబర్ క్రైంపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పై రెండు సంస్థలు ప్రభుత్వానికి సర్వీస్ ప్రొవైడర్లు అని ఉన్నతాధికారులు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభిస్తే, చంద్రబాబుకు ఉలుకెందుకని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం వద్ద డేటా అంతా భద్రంగానే ఉందని, చోరీకి గురి కాలేదని అధికారులు అంటున్నారని, మరి ఓటర్ల జాబితాలో కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల ఫొటోలు ఐటీ కంపెనీల దగ్గర ఎలా బయటకొచ్చాయని ప్రశ్నించారు. బ్లూ ఫ్రాగ్స్, ఐటీ గ్రిడ్ కంపెనీలకు సాయపడింది.. పెంచి పోషిస్తుంది.. ఎల్లో ఫ్రాగ్స్ అని, అక్రమాల లుకలుకలు బయటపడటంతోనే టీడీపీ అసలు రంగు బయటపడిందన్నారు. చంద్రబాబు ఇటీవలే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడారని, టాంపరింగ్ ఎలా చేయాలో... తెలిపే వ్యక్తి చంద్రబాబు సలహాదారుడిగా పనిచేస్తున్నారని కన్నబాబు చెప్పారు. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) -
టీడీపీ మైండ్‌గేమ్, 23న అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు తెలంగాణ పోలీసులు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తోన్న ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు.. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులపై మానసిక దాడికి సిద్ధమవుతున్నారు. కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు నకిలీ ట్వీట్ల ద్వారా (క్యాష్ ఫర్ ట్వీట్) తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారని కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా ఇప్పుడు నేరుగా తెలంగాణ పోలీసులపై ఏపీ ప్రభుత్వ పెద్దలు మాటల దాడి మొదలెట్టారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) లోకేశ్ ట్వీట్ తమ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తోన్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఫిబ్రవరి 23న ఆ కార్యాలయంలో పోలీసులు ఎందుకున్నార’ని ప్రశ్నిస్తూ.. సీసీటీవీ చిత్రాలను జతచేశారు. ఈ కేసు విషయంలో తెలంగాణకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారిపైనా టీడీపీ వర్గీయులు దాడి ప్రారంభించారు. ఆ అధికారి గతంలో కడపలో విధులు నిర్వహించినపుడు పోలీస్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషల్‌మీడియాలో విమర్శలు మొదలుపెట్టారు. వీటిని విపరీతంగా వైరల్ చేస్తూ తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మరకలంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజా ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ఓ మంత్రి లేవనెత్తడం గమనార్హం. జరుగుతున్న పరిణామాలు, విమర్శలను తెలంగాణ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం నేతల కామెంట్లను లైట్ తీసుకుంటున్నారు. తమ దర్యాప్తును దెబ్బతీసేందుకే ఇలాంటి విమర్శలుచేస్తున్నారని అంటున్నారు. (ఇదీ జరుగుతోంది!) 23న అసలేం జరిగింది? వాస్తవానికి తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు ఫిబ్రవరి 23న అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ సంస్థలోకి వెళ్లిన విషయం వాస్తవమే అని సైబరాబాద్ పోలీసులు అంగీకరిస్తున్నారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా అసలు ఆ చిరునామాలో ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ ఉందా లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు పోలీసులు 23న మధ్యాహ్నం 4.30 గంటలకు ఆ కంపెనీకి వెళ్లారు. అక్కడ అశోక్‌తోపాటు అతని సహోద్యోగులను కొన్ని ప్రశ్నలు అడిగారు. మీపై ఫిర్యాదు వచ్చిందని, మీరు 25న స్టేషన్‌కు రావాల్సి ఉంటుం దని మౌఖికంగా ఆదేశించారు. మరోసారి అశోక్‌కు ఫోన్‌చేద్దామని సాయంత్రం పోలీసులు ప్రయత్నించగా.. అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. అయినా సోమవారం (25వతేదీ) వస్తాడులే అని పోలీసులు అనుకున్నారు. కానీ, జరిగింది వేరు. సేవామిత్రపై ఫిర్యాదు అందగానే.. అప్రమత్తమైన అశోక్ హార్డ్ డిస్కులతోపాటు ఏపీకి పరారయ్యాడు. అక్కడ నుంచి సేవామిత్ర యాప్ లో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి తిరిగి అప్లోడ్ చేయించాడు. -
మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!
అమెరికాలోని జార్జియాలో 2018లో గవర్నర్ ఎన్నికలు జరిగాయి. దీనికి బ్రెయిన్ కెంప్–స్టేసీ అబ్రహమ్ పోటీపడ్డారు. 2010 నుంచి కొన్నాళ్లు జార్జియా సెక్రటరీగా పని చేసిన కెంప్ ఆ ప్రాంతంలో ఉన్న 3.4 లక్షల మంది కలర్ మైనార్టీల ఓట్లు వారి ప్రమేయం లేకుండానే తీసేయించేసి లబ్ధిపొందారు. దీన్ని అక్కడి పరిభాషలో ‘రాంగ్లీపర్జ్’అని అంటారు. అప్పుడు కెంప్ వినియోగించిన విధానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీలో వాడుతోంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న కందుల రంగారెడ్డి, కందుల నాగమణి అమీర్‌పేటలో ఉంటున్నారు. చిత్తూరుకు చెందిన ఓటర్లు వేణుగోపాల్‌రెడ్డి, నాగవేణి సైతం నగరంలో నివసిస్తున్నారు. వీరికి ఐటీ గ్రిడ్స్ కాల్‌సెంటర్ నుంచి ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. ఇందులో టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే.. ఈ నలుగురూ తమ ప్రమేయం లేకుండానే ఏపీలో ఉన్న ఓట్లు కోల్పోయారు. సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారి సమాచారం మాత్రమే కాదు.. ఏ ఓటర్ ఏ పార్టీకి చెందిన వారు అనే సమాచారం ఉంది. ఇవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలివి. ఇలా ఐటీ గ్రిడ్స్ సంస్థను అడ్డంపెట్టుకుని టీడీపీ చేస్తున్న ఎన్నో కుట్రల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ రూపొందించిన సేవామిత్ర యాప్‌ను ఆయుధంగా వాడుకుంటూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అక్రమంగా లబ్ధిపొందడానికి తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు తెరలేపింది. తమ దురుద్దేశపూర్వక సర్వేల్లో ఎవరైనా తమ పార్టీకీ ఓటు వేయరని తేలినా.. ఆ వ్యక్తి సర్వే సమయంలో సదరు నియోజకవర్గంలో లేకపోయినా వారి ఓట్లు కుట్రపూరితంగా తొలగించేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ ‘కీ’పర్సన్స్ కీలకపాత్ర పోషించేవారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. (ఇదీ జరుగుతోంది!) మొదటి వారు తమ ఓటర్లు కాదనే ఉద్దేశంతో, రెండో వారు తమకు వేయకపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో ఇలా చేసుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ గ్రిడ్స్ సాయంతో తెలుగుదేశం పార్టీ చేసిన, చేస్తున్న అక్రమాలపై నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన వివరించారు. వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, పి.రాధాకిషన్‌రావులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. బాధితులంతా నగరంలో ఉంటున్నవారే హైదరాబాద్‌లోని మధురానగర్‌కు చెందిన దశరథరామిరెడ్డి ఫిర్యాదుతో శనివారం రాత్రి ఐటీ గ్రిడ్స్‌పై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడితోపాటు ఇప్పటి వరకు గుర్తించిన బాధితులంతా హైదరాబాద్‌లో ఉంటున్న వారే. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ‘పరిధి’అనే సమస్య ఉత్పన్నం కాదు. తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్.. ఐటీ గ్రిడ్స్ కంపెనీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు చేస్తోంది. ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారం, ఈసారి ఎన్నికల్లో వారి ప్రాధాన్యం, గుర్తింపు పత్రాల వివరాలు.. ఇలా అనేక అంశాలు సేకరిస్తోంది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) దీనికోసం ఐటీ గ్రిడ్స్ సంస్థ వారు చాలా మంది సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఈ యాప్‌లో ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. సదరు ఓటరు నియోజకవర్గంలో ఉంటున్నారా? లేదా? స్వతహాగా ఏ పార్టీకీ చెందిన వారు? రానున్న ఎన్నికల్లో ఆయన ఓటింగ్ ప్రాధాన్యం ఏ పార్టీకి? ప్రశ్నలకు సమాధానాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ కాల్ సెంటర్ నుంచి ఫోన్‌కాల్స్ ద్వారా, క్షేత్రస్థాయిలో సర్వేయర్ల ద్వారా సేకరిస్తోంది. దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత టీడీపీ వారికి అందిస్తోంది. వారి ద్వారానే ఓటర్‌కు తెలియకుండానే ఓట్లు తొలగిపోతున్నాయి. అన్ని పార్టీల ఓటర్లతో సర్వే సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. ఒక ఓటరు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనేది తెలుసుకుని యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఆయా పార్టీకి రేటింగ్స్ కూడా ఇస్తూ డేటాబేస్ రూపొందించారు. ఐటీ గ్రిడ్స్‌కు చెందిన సేవామిత్ర యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ వ్యతిరేక ఓటర్లను తొలగించి రానున్న ఎన్నికల్లో అక్రమ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమే అని పోలీసులు తేల్చారు. ఈ యాప్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండని, తమ పార్టీకి ఓటు వేయరని భావించిన వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండానే తొలగిస్తున్నారు. సేవామిత్ర యాప్‌లో ఉన్నది తెలుగుదేశం పార్టీ డేటా మాత్రమే అన్నది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది విద్య, వృత్తి, వ్యాపారాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. అలాంటి వారి ఓట్లను కూడా.. వారి ప్రమేయం లేకుండానే తీసేశారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వివరాలు, మార్గదర్శకాలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఢిల్లీకి సైబర్ క్రైం బృందం ఐటీ గ్రిడ్స్ సంస్థపై నమోదైన కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సంస్థ తొలగించిన 80 జీబీ సమాచారాన్ని బయటికి తీసి (రిట్రీవ్ చేసిన).. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బుధవారం సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్ (యూఐడీఏఐ) కార్యాలయాల అధికారులను కలిసి ఐటీ గ్రిడ్స్ దగ్గరున్న డేటా గురించి ఆరా తీయనున్నారు. ఆధార్ కార్డు, ఓటరు కార్డుకు సంబంధించిన కలర్ ఫొటోలతో కూడిన కాపీలు వీరికెలా వచ్చాయి? అసలు వాటిని ఎవరెవరికి ఇస్తారు? ఇచ్చినా వాటికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలేంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరి పరిరక్షణలో ఈ వివరాలుంటాయి? వీటి గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రహస్య సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ప్రక్రియ ఉందా? ఇస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మరో బృందం బుధవారం కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థలో డిలీటెడ్ సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీని కోసం సైబర్ నిపుణులు పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో సున్నితంగా మారడంతో కేసు దర్యాప్తులో నిర్లక్ష్యాన్నికి తావులేకుండా ప్రతి అంశం కీలకంగా మారింది. దీంతో మరోసారి ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బుధవారం సైబరాబాద్ పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేసి అతని వద్దను ఆధారాలను పరిశీలించారు. బెదిరించిన పోలీసులు తెలిసిన వాళ్లే... ఐటీ గ్రిడ్స్ సంస్థ పై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బెదిరించింది ఏపీ పోలీసులేననే ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. లోకేశ్వర్‌రెడ్డి ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజీని, ఆయన కాల్‌డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఇంటికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన ఓ ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారని సేకరించిన ఆధారాల ద్వారా స్పష్టమైంది. సైబరాబాద్ పోలీసులు బుధవారం అమెజాన్ సర్వీసుకు 91 సీఆర్పీసీ నోటీసులను జారీ చేశారు. మొదటిరోజు నోటీసులు జారీ చేసినా అమెజాన్ వెబ్ సర్వీసు ఇంకా స్పందించలేదు. దీంతో బుధవారం మరో సారి సైబరాబాద్ పోలీసులు 91 సీఆర్పీసీ నోటీసును జారీ చేసి దర్యాప్తుకు అవసరం ఉన్న సమాచారాన్ని త్వరగా ఇచ్చేలా అమెజాన్ సంస్థ చర్యలు తీసుకోవాలని నోటీసులో స్పష్టంచేశారు. -
నేరాన్ని దాచేందుకు ఎదురుదాడి
సాక్షి, అమరావతి: ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే... దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా అధికార తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం సాగిస్తోంది. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమా చారాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఘోరమైన నేరానికి పాల్పడటమే కాకుండా ఆ సమాచారం ఆధారంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కొందరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఇదేం అరాచకమని ప్రశ్నించిన ప్రతిపక్షంపై టీడీపీ–ఎల్లో మీడియా ఒకే శ్రుతిలో ఎదురుదాడి ప్రారంభిం చాయి. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) రాష్ట్రంలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు ఐటీ నిపుణుల పరిశోధనలో ఇప్పటికే తేటతెల్ల మైంది. వాటిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గతంలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాము గుర్తించిన బోగస్ ఓట్లను తొలగించాలని కోరుతూ కొన్నిచోట్ల ఫారం–7 దరఖాస్తులను కూడా తాము ఇచ్చినట్టు వైఎస్ జగన్ నిండు బహిరంగ సభలోనే చెప్పారు. అయితే, తాను చేసిన ఘోరమైన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పంతా ప్రతిపక్షానిదే అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్లో మీడియా తంటాలు పడుతున్నారు. నలుగురూ నవ్విపోతారని తెలిసి కూడా డేటా చౌర్యంపై తప్పుడు ప్రచారానికి తెరతీయడం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. (ఇదీ జరుగుతోంది!) గుట్టు రట్టు కావడంతో బాబు బెంబేలు బోగస్ ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తప్పుడు మార్గాల్లో నమోదు చేయించడమే కాకుండా, తమకు ఓటు వేయరని భావించే వారి ఓట్లను తొలగించే పనిని తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఇందుకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పథకం రచించారు. ప్రజా సాధికార సర్వే, ఆర్టీజీఎస్ సర్వే ఇలా పలు మార్గాల్లో రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వం సేకరించిన ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ అనే అస్మదీయ కంపెనీకి చేరవేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అందజేయడం చట్ట ప్రకారం తీవ్రమైన నేరమని సాక్షాత్తూ సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించింది ఐటీ గ్రిడ్స్ కంపెనీయే కావడం గమనార్హం. ప్రజల వ్యక్తిగత డేటాను పార్టీ యాప్‌లో చేర్చారు. దాని ఆధారంగా ఓట్ల తొలగింపునకు కుట్ర సాగించారు. తాను ఇన్నాళ్లూ చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. డేటా చౌర్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతిపక్షంపై అభాండాలు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతలే తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ చంద్రబాబు, ఆయన అనకూల మీడియా దుష్ప్రచారం ప్రారంభించారు. అసలు ప్రజల వ్యక్తిగత సమాచారం, ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా వంటివి ఐటీ గ్రిడ్స్‌కు, సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చాయో సమాధానం మాత్రం చెప్పడం లేదు. పైగా తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన డేటాను చోరీ చేశారంటూ గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం గమనార్హం. తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా దబాయింపులో భాగంగానే వారు పోలీసులను ఆశ్రయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకం ప్రకారమే టీడీపీ కుట్ర 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సాధించిన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 5 లక్షలే. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గేందుకు కుట్రలకు తెరలేపారు. దొంగ ఓట్లను చేర్చించడం, ప్రతిపక్షానికి పడే పడే ఓట్లను తొలగించడం అనే పన్నాగాన్ని అమల్లోకి తెచ్చారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం ఒక వ్యూహం ప్రకారమే ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ వంటి కంపెనీలను తెరపైకి తెచ్చి, ప్రభుత్వంలో కాంట్రాక్టులను అప్పగించడంతో పాటు ఆ కంపెనీల ద్వారానే ఈ అక్రమ వ్యవహారాలను కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. ఐటీ గ్రిడ్స్ ఎండీకి టీడీపీ పెద్దల రక్షణ డేటా చౌర్యం బయటపడడంతో ఐటీ గ్రిడ్స్ ఎండీ, మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు డాకవరపు అశోక్ పరారయ్యాడు. అతడు ఏపీలోని టీడీపీ ముఖ్యనేతల వద్దే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అశోక్ సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కితే తమ బండారం బట్టబయలవుతుందన్న భయంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై నిస్సిగ్గుగా ఎదురుదాడి మొదలుపెట్టారు. అందుకే దీన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత డేటా చోరీ, ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదుపై ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేస్తోందని సీఎం చంద్రబాబు చెబుతుండగా, మంత్రి లోకేశ్ తమ డేటా పోలేదని ఒకసారి, తమ డేటాను తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్లారని మరోసారి ప్రకటన చేయడం గమనార్హం. ప్రభుత్వ డేటా చోరీకి గురైందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అంగీకరించగా, ప్రభుత్వ డేటా చోరీకి గురికాలేదని, భద్రంగా ఉందని ఐటీ కార్యదర్శి, ఆర్టీజీఎస్ సీఈఓలు పేర్కొన్నారు. ప్రతిపక్ష మద్దతుదార్ల ఓట్లపైనే గురి డేటా చౌర్యంపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల విచారణలో విస్మయం కలిగించే అంశాలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, మద్దతుదార్ల ఓట్లను తొలగించడంతోపాటు ఒకే వ్యక్తి పేరిట రెండు ఓట్లు, అసలు లేని వ్యక్తుల పేరిట సైతం ఓట్లు చేర్పిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ సేవామిత్ర యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా సైబరాబాద్ పోలీసుల విచారణలో బయట పడుతుండడం గమనార్హం. మొత్తం ఓట్లలో 15 శాతం నకిలీ ఓట్లే రాష్ట్రంలో లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు నమోదు అవుతున్నాయని గత ఏడాది ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్(వాస్ట్) సంస్థ ప్రతినిధులు లోకేశ్వరరెడ్డి, తదితరులు తమ అధ్యయనంలో గుర్తించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తే దాదాపు 52.67 లక్షల మేర నకిలీ, బోగస్ ఉన్నట్లు బయటపడింది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 15 శాతం ఓట్లు నకిలీవేనని తెలుస్తోంది. ఈ ఓట్లలో నకిలీ, రిపీట్, అక్రమ, చెల్లని, ఒకే విధమైన సమాచారం ఉన్నవి 34.17 లక్షలు ఉన్నాయి. ఇవికాకుండా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటర్లుగా కొనసాగుతున్న వారి సంఖ్య 18.50 లక్షలు. ఓటరుగా నమోదు కావాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలన్నది ఎన్నికల సంఘం నిబంధన. కానీ, ఏపీలో ఏడాది వయసున్న పసిబిడ్డలు కూడా ఓటర్లుగా నమోదైన ఉదంతాలు చాలా ఉన్నాయి. 350 ఏళ్ల వ్యక్తుల పేరిట కూడా ఓట్లు ఉండడం విశేషం. ఇంటి నెంబరు, చిరునామా లేకుండానే లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. పది కేటగిరీలుగా నకిలీ, బోగస్ ఓట్లు ఎన్నెన్ని చేర్చారో కూడా తేలింది. - ఓకే ఓటర్ ఐడీతో ఒక వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండడం: 36,404 - ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటినెంబర్, వయసు, జెండర్ ఒకేలా ఉన్న నకిలీ ఓట్లు: 82,788 - ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నెంబర్ జెండర్ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 24,928 - ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నెంబర్, వయసు ఒకేలా ఉండి జెండర్ మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 1,006 - ఓటరు పేరు, ఇంటి నెంబరు, వయసు, జెండర్ ఒకేలా ఉండి తండ్రి/భర్త పేరు మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 92,198 - ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్చి నమోదు చేయించిన నకిలీ ఓట్లు: 2,60,634 - ఓటరు పేరు తండ్రి/భర్త పేరు ఒకేవిధంగా ఉండి ఇతర వివరాలు వేరేగా మార్పులు చేసి నమోదైన నకిలీ ఓట్లు: 25,17,164 - వయసు తప్పుగా ఉన్న ఓట్లు (18 ఏళ్లకంటే తక్కువ, 100 ఏళ్లకన్నా ఎక్కువ–గరిష్టంగా 350 ఏళ్ల వయసుతో ఉన్న నకిలీ ఓటర్లు): 6,126 - ఇంటి నెంబరు తప్పుగా ఉన్న ఓట్లు (ఇంటి నెంబర్ స్థానంలో నన్, సేమ్, ఓల్డ్, న్యూ, 000 తదితరాలతో ఉన్న నకిలీ ఓట్లు): 3,95,877 - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదైన ఓటర్లు: 18,50,511 - వీటితోపాటు చనిపోయిన వ్యక్తుల పేరిట కూడా లక్షల సంఖ్యలో ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు తేలింది. మరో 6 లక్షల బోగస్ ఓట్లు నకిలీ, బోగస్ ఓట్లకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఆయా ఓటర్ల పేర్లతో కూడిన సాక్ష్యాధారాలను కూడా వాస్ట్ సంస్థ సేకరించింది. ఈ బోగస్, నకిలీ ఓట్లను తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వాస్ట్ సంస్థ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి వీటిపై విన్నవించాయి. 25,47,019 ఓట్లు నకిలీవి అన్న అనుమానాలు ఉన్నాయని, వీటన్నిటిపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, జనవరిలో విడుదల చేసిన ఓటరు జాబితాను పరిశీలించిన వారికి నిరాశే ఎదురైంది. నకిలీ ఓట్లు తగ్గడానికి బదులు మరిన్ని పెరిగాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే క్షేత్రస్తాయిలో నకిలీ ఓట్లు తగ్గకపోగా మరిన్ని చేరాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓట్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా గతంలో టీచర్లు లేదా రెగ్యులర్ ఉద్యోగులు ఆ బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ, ఈసారి ఈ పనిని క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారు. వీరంతా ప్రభుత్వం నియమించినవారే. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మరో 6 లక్షల బోగస్ ఓట్లను చేర్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు 3.52 కోట్లుండగా, ఈ ఏడాది జనవరి 11వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఈ ఓట్ల సంఖ్య 3.69 కోట్లకు చేరినట్లు చూపించారు. అంటే సెప్టెంబర్ నుంచి జనవరి వరకు కొత్తగా 18 లక్షల ఓట్లు పెరిగాయి. కొత్త ఓటర్లు చేరినా నకిలీ ఓట్ల సంఖ్య అత్యధికంగా ఉన్నందున మొత్తం ఓట్ల సంఖ్య తగ్గాల్సి ఉన్నప్పటికీ గతంలో కంటే భారీగా పెరగడం గమనార్హం. కొత్త జాబితాలో కూడా నకిలీ, బోగస్ ఓట్లు 6 లక్షల వరకు ఉన్నాయని వాస్ట్ సంస్థ గుర్తించింది. జనవరి నాటికి నకిలీ ఓట్ల సంఖ్య 59,18,631కు చేరినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీ పెద్దలు దగ్గరుండి మరీ నకిలీ, బోగస్ ఓట్లను చేర్పించడం వల్లే మొత్తం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా... నకిలీ, బోగస్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఇంతకు ముందు దీనిపై ఫిర్యాదులు ఇచ్చారు. అయినా నకిలీ, బోగస్ ఓట్లు తగ్గడానికి బదులు మరిన్ని పెరగడం విస్మయానికి గురిచేస్తోంది. జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాను పరిశీలించిన వాస్ట్ సంస్థ నకిలీ, బోగస్ ఓట్లు ఏ మేరకు ఉన్నాయో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన జాబితాలోని వారి పేర్లు కొత్త ఓటర్ల జాబితాలో వేరే నియోజకవర్గాల్లో ఓటర్లుగా దర్శనమిస్తున్నాయి. అంటే ఒకరి పేరునే మరో నియోజకవర్గంలో మళ్లీ ఓటర్లుగా నమోదు చేయించినట్లు స్పష్టమవుతోంది. ఇదేకాకుండా ఒకే బూత్‌లో ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్నవారు కూడా ఈ కొత్త జాబితాలో దర్శనవిస్తుండడం విశేషం. చిన్నపిల్లల పేర్లతో ఓట్లు, మరణించిన వారి ఓట్లు లక్షకు పైగానే ఉన్నాయని గత సెప్టెంబర్ తేలింది. అవే ఓట్లు ఈసారీ కొనసాగుతున్నాయి. అవి ఇలా ఉన్నాయి. - ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్నవారు: 9,552 (సెప్టెంబర్ జాబితాలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఏబీ10419705 ఐడీ నెంబర్‌తో శివశంకర నల్లపాటి అనే ఓటరు పేరు నమోదై ఉంది. అదే వ్యక్తికి మళ్లీ తాజా జాబితాలో అదే ఐడీ నెంబర్‌తో అదే జిల్లాలోని తాడికొండలో మరో ఓటు నమోదు కావడం విశేషం) - ఒకే రకమైన సమాచారంతో వేర్వేరు ఐడీ నెంబర్లతో ఓట్లు కలిగిన వారు: 78,156 (ఉదాహరణకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏజీజెడ్3079639 ఐడీ నెంబర్‌తో అభినయ్ మన్నెం అనే ఓటరు పేరు ఉండగా, అదే ఓటరు పేరుతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీఎంఓ02312932 నెంబర్‌తో మరో ఓటు నమోదైంది. ఇలాంటివే మరెన్నో ఉన్నాయి) - వయసులో మార్పుచేసి రెండేసి ఓట్లు కలిగిన వారు: 52,180 (పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని 233 బూత్‌లో అఖిల గెడ్డం (24 ఏళ్లు) పేరు, ఇతర వివరాలతో ఓటు ఉంది. అవే వివరాలతో వయసును 23 ఏళ్లుగా పేర్కొంటూ అదే నియోజకవర్గం పోలింగ్‌బూత్ 242లో కూడా మరో ఓటు నమోదైంది) - వ్యక్తి జెండర్‌ను మార్పు చేయడం ద్వారా నకిలీ ఓట్లుగా నమోదైనవి: 1,224 (తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం 27వ నెంబర్ పోలింగ్ బూత్‌లో అన్నమ్మ కొమ్మరి (మహిళ) అనే ఆమెకు ఓటు ఉంది. అదే పేరు, ఇతర వివరాలను యథాతథంగా ఉంచి మహిళకు బదులు పురుష అని జెండర్‌ను మార్పు చేసి మరో ఓటు అక్కడే నమోదైంది) - తండ్రి/భర్త పేరులో చిన్నమార్పుతో నమోదైన నకిలీ ఓట్లు: 1,78,868 (విశాఖ జిల్లా భీమిలిలోని 305 బూత్‌లో ఆదిలక్ష్మి కొల్లి, భర్త అప్పలరాజు పేరుతో ఓటు ఉంది. భర్త పేరును అప్పల రాజు అని వేర్వేరు పదాలుగా చూపించి ఈ ఓటు నమోదు చేశారు. ఇదే పేరుతో భర్త పేరును అప్పలరాజుగా రెండు పదాలను ఒకటిగా కలిపి మరో ఓటు అదే పోలింగ్ బూత్‌లో నమోదు చేశారు.) - ఓటరు పేరును ముందు వెనుకలు మార్పు చేసిన నకిలీ ఓట్లు: 1,69,448 (శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని 315 బూత్‌లో కొర్రాయి ధనుంజయ్ (తండ్రి తులసయ్య) అనే పేరుతో ఓటు ఉండగా, ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్పుచేసి అదే చోట ధనుంజయ్ కొర్రాయి (తండ్రి తులసయ్య)అని మరో ఓటును నమోదు చేశారు. - ఒకే వ్యక్తి పేరుతో ఇంటినెంబర్ల మార్పుతో ఒకే పోలింగ్‌బూత్‌లో రెండుసార్లు నమోదు చేసిన నకిలీ ఓట్లు: 25,17,630 (కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం 22వ పోలింగ్‌బూత్‌లో అశ్వనికుమార్ సమ్మెట, తండ్రి వెంకటేశ్వరరావు సమ్మెట, ఇంటి నెంబర్ 1.13 అనే పేరుతో ఒక ఓటు ఉండగా, అదే పేరుతో ఇంటి నెంబర్‌ను 1.19గా మార్చి అక్కడే మరో ఓటు కూడా తాజా జాబితాలో నమోదు చేశారు) - ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు ఇంటినెంబర్లతో వేర్వేరు బూత్‌లలో నమోదైన రెండేసి ఓట్లు: 4,49,126 (విజయవాడ సెంట్రల్లో 67వ పోలింగ్‌బూత్‌లో 13–2824 ఇంటి నెంబర్‌తో రెడ్డయ్య అర్ల పేరుతో ఒక ఓటు ఉండగా, అదే నియోజకవర్గంలోని మరో పోలింగ్‌బూత్‌లోనూ ఇంటి నెంబర్‌ను 24–1328గా మార్పు చేసి మరో ఓటు తాజా జాబితాలో నమోదు చేశారు) - పేరులో చిన్న అక్షరం మార్పుతో ఒకరికే రెండుకు మించి నమోదై ఉన్న నకిలీ ఓట్లు: 2,36,626 (తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 140వ బూత్‌లో సుష్మ అనే పేరుతో ఒక ఓటు నమోదు చేశారు. తండ్రి పేరు, ఇంటి నెంబర్ ఇతర వివరాలు యథాతథంగా ఉంచి పేరులోని మొదటి అక్షరం ‘సు’కు బదులు ‘షు’ అని మార్చి షుష్మగా అదే పోలింగ్‌బూత్‌లో మరో ఓటు తాజా జాబితాలో చేర్చారు) - ఓటు హక్కు పొందేందుకు 18 ఏళ్లు ఉండాలి. కానీ, అంతకంటే తక్కువ వయసున్న వారి పేరిట కూడా ఓట్లు కొనసాగుతున్నాయి. వాటితోపాటు 100 ఏళ్ల నుంచి 351 ఏళ్లకు పైగా వయసున్న వారిపేరుతో ఉన్న ఓట్లు: 3,307 (తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని 391బూత్‌లో నారాయణమ్మ వనం వయసు 351 పేరిట ఓటు ఉంది. కానీ, అదే ఐడీనెంబర్‌తో పేరును నారాయణమ్మకు బదులు వెంకటేశ్వర్లు వనం అని మార్పుచేసి వయసును 351 ఏళ్లుగా చూపించి ఓటును కొనసాగిస్తున్నారు) - ఇంటినెంబర్లు లేకుండానే నమోదైన ఓట్లు: 2,15,119 - గత ఏడాది సెప్టెంబర్ నాటి జాబితా ప్రకారం ఏపీ, తెలంగాణల్లో రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు 18,50,511 మంది ఉండగా, ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఆ సంఖ్య 20,07,395కు చేరింది. చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఈ నకిలీ ఓట్లపై సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, వచ్చే ఎన్నికలపై ఈ నకిలీ ఓట్లు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏకంగా అరకోటికి పైగానే నకిలీ ఓట్లు ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) -
సీఎంది సైబర్ నేరం
సాక్షి, హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావితం చేసే దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ నేరానికి పాల్పడ్డారని, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ప్రైవేటు కంపెనీలకు బదలాయించారని పేర్కొంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ పార్టీ ప్రతినిధి వర్గంతో కలసి వెళ్లి బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన సైబర్ నేరం రాష్ట్ర, దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు. దీనిపై ఈ రోజు గవర్నర్‌ను కలిశామని, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కూడా కలుస్తామని తెలిపారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘ఏపీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ నేరానికి పాల్పడితే దొంగతనం కాదా? అని గవర్నర్‌ను కలసి చెప్పాం. చంద్రబాబు చేసిన తప్పు పనిని మేమిచ్చిన వినతిపత్రం ద్వారా చాలా వివరంగా తెలియజేశాం. ఒక పథకం ప్రకారం రెండేళ్ల కిందటి నుంచే చంద్రబాబు ఎన్నికలను మేనేజ్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దుర్బుద్ధితో ఈ సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబును నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మీడియా కూడా ఆయన్ను ఈ ప్రశ్నలు అడగాలి. జరగకూడనిది ఎలా జరిగిందన్నది మీరు కూడా ప్రశ్నించాలి. ఐటీ గ్రిడ్స్ అనే ఒక కంపెనీ మీద రెయిడ్స్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. టీడీపీకి చెందిన సేవామిత్ర అనే యాప్‌ను తయారు చేసింది ఈ ఐటీ గ్రిడ్స్ వారే. ఈ సేవామిత్ర యాప్‌లో ఉండకూడని డేటా, ఎవరి వద్దా ఏ విధంగానూ ఉండకూడని ఆధార్ వివరాలు ఎలా కనిపిస్తున్నాయి? ఏ రకంగా ఐటీ గ్రిడ్ కార్యాలయం కంప్యూటర్లలో దొరుకుతున్నాయి? ఆధార్ వివరాలు ఒక ప్రైవేటు కంపెనీ వద్ద దొరకడం, టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లో దొరకడం సబబేనా? ఇది న్యాయమేనా? ఇది నేరం కాదా? ఇది ప్రజల వ్యక్తిగత వివరాల్లోకి చొరబడటం కాదా? (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) సర్వేల సమాచారం సేవామిత్రతో అనుసంధానం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల ఐడీ డేటా ఉన్న మాస్టర్ కాపీ ఎవరికీ అందుబాటులో ఉండదు. ఈ మాస్టర్ కాపీ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ కంప్యూటర్లలో కనబడుతోంది? ఏ విధంగా టీడీపీ అధికార యాప్ అయిన సేవామిత్రలో ఇది ఉంది? ఇది కేంద్ర ఎన్నికల సంఘం డేటా. ఇక ఆధార్ అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డేటా. ఇక మూడోది... రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు.. ఒక వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ చంద్రబాబు దగ్గర ఉన్న సేవామిత్ర యాప్‌లో కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏరకంగా ఐటీగ్రిడ్స్ ఆఫీసులోని వారి కంప్యూటర్లలో ప్రత్యక్షమవుతున్నాయి? టీడీపీ యాప్ సేవామిత్రలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? ఒక మనిషికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు, అతనికి సంబంధించిన కలర్ ఫోటోతో కూడిన ఓటరు జాబితా వివరాలు మీ వద్ద ఉన్నాయంటే అర్ధం ఏమిటి? ఇవన్నీ మీ వద్ద ఉన్నప్పుడు, రేపు పొద్దున మీరేం చేసినా ప్రజలు మోసపోరా? నాశనం అయిపోరా? ఇలాంటి వివరాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద గానీ, సంస్థల వద్ద గానీ అస్సలు ఉండకూడదు. (ఇదీ జరుగుతోంది!) అలాంటిది ఇలాంటి వివరాలే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ప్రజల వద్దకు వెళ్లి పల్స్ సర్వే అని, ఆర్టీజీఎస్ అని రకరకాల సర్వేల పేరిట వారి సమాచారం సేకరించింది. అలా సేకరించిన డేటాను కూడా చంద్రబాబు గారి సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేశారు. ఇలా అనుసంధానించిన డేటాను, సేవామిత్ర యాప్‌లో రిజిస్టర్ అయిన టీడీపీ నేతల ట్యాబ్‌లకు పంపించారు. టీడీపీ నేతలు వారి వారి గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ ఓటరు ఎవరు? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడు? వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తాడా? లేక టీడీపీకి ఓటేస్తాడా? అంటూ సర్వేలు చేశారు. ఆ తర్వాత ఎవరైతే టీడీపీకి ఓట్లేయరో వారి ఓట్లన్నీ ఒక పద్ధతి, ఒక పథకం ప్రకారం తీసేయడం మొదలు పెట్టారు. మరోవైపు రెండేసి ఓట్లను చేర్చడం మొదలు పెట్టారు. టీడీపీకి అనుకూలమైన ఓటరు పేరు ఒకటి కాదు, రెండేసి కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు డూప్లికేట్ ఓటర్లను చేర్చి తమకు అనుకూలురైన ఓటర్ల సంఖ్యను పెంచడం, మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ఒక పథకం ప్రకారం చేస్తూ వచ్చిన పని ఇదే. ఇదంతా గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. డేటా చోరీ ఉదంతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్. చిత్రంలో రాజన్నదొర, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి, ఆదిమూలపు సురేష్, పార్థసారథి, కొడాలి నాని ఫామ్–6, ఫామ్–7 సమర్పించడం మా హక్కు అసలు ఫామ్–7 అంటే ఏమిటి? ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి.. దర్యాప్తు చేయండి, వచ్చి చూసి ఎంక్వయిరీ చేసిన తర్వాత దొంగ ఓటు అని తేలితే ఆ ఓటును తీసేయండి? అని అర్థం. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనికి మేం సహకరించాం. దర్యాప్తు చేసి నిజం తెలుసుకోండి. చంద్రబాబు ఎంత దారుణంగా చేశారో చూడండి అని చెప్పాం. కానీ చంద్రబాబు పోలీసులను పంపి ఫామ్–7 దరఖాస్తు నింపి ఫిర్యాదు చేయడమే తప్పన్నట్లుగా వేధింపుల పర్వం ప్రారంభించారు. అసలు ఏపీ ప్రభుత్వానికి, దీనికి సంబంధం ఏమిటి? ఎన్నికల కమిషన్ అనేది ఒక ఖ్వాజీ జుడిషియల్ అథారిటీ (న్యాయపరమైన అధికారాలు కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ). దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ సంబంధమే లేదు. అలాంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థకు.. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఫామ్–7 సమర్పించడం, ఇక్కడ మా ఓటరు నమోదు కాలేదు, నమోదు చేయండి అని ఫామ్–6ను సమర్పించడం అనేది మా హక్కు. మేం అప్లికేషన్ పెట్టగానే వాళ్లేమీ ఆ ఓట్లను తీసేయరు. అలాగే ఓట్లను చేర్చరు. మేం సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా తొలుత సంబంధిత ఊరికి వచ్చి దర్యాప్తు చేయాలి. దర్యాప్తులో మేం చెప్పింది సరైనదిగా తేలితే ఆ ఓటర్లకు టిక్ పెడతారు. డూప్లికేట్ అని తేలితే తీసేస్తారు. ఓటరును నమోదు చేయాల్సిన అవసరం ఉంటే చేస్తారు. ఇదొక ప్రక్రియ. ఇది ఎన్నికల కమిషన్‌కు సహకరించే ఒక బాధ్యత. ఇది మేమే కాదు విజ్ఞత గల ప్రతి ఒక్కరూ చేయాలి. విజ్ఞత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ చానెల్ చేయాలి. ‘ఓటర్ల జాబితాలో మీరు పేరు ఉందో లేదో కనుక్కోవాలి. 1950 అనే నంబరుకు మీ ఓటరు కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్‌ను ఎస్సెమ్మెస్ చేయాలి. చేసిన వెంటనే ఓటరు అవునా ... కాదా! అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఓటరు కాకుంటే ఈ రకంగా ఫామ్ –6 సమర్పించాలి. డూప్లికేట్ ఓటరు ఎక్కడైనా కనిపిస్తే ఫామ్–7 సమర్పించాలి..’ అంటూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. దేశంలోని ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడు ఈ పని చేయాలి. ఓటు హక్కును ప్రజల దగ్గరకు తీసుకువెళ్లే కార్యక్రమం ఇది. అయితే దీనిపై ఎంక్వయిరీ జరక్కూడదని, ఒకవేళ ఎంక్వయిరీ జరిగితే దొంగ ఓట్లను తీసేస్తారని అడ్డుకుంటున్నారు. చంద్రబాబునాయుడుకు భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇతర ఎల్లో మీడియా... వీళ్లంతా కలసి అదేదో తప్పన్నట్లు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు చేసిందే అసలు తప్పు దొంగ ఓట్లున్నాయని చెప్పి దర్యాప్తు కోరడం తప్పు కాదు. రెండేళ్లుగా చంద్రబాబు చేసిందే అసలు తప్పు. ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు చంద్రబాబు తీసుకోవడం తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను సేకరించడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడీ, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ కాపీని తీసుకోవడం అసలు తప్పు. ఇది సైబర్ నేరం. ప్రైవేటు వ్యక్తుల వద్దగానీ, ప్రైవేటు సంస్థల వద్దగానీ ప్రజలకు సంబంధించిన డేటా, ఆధార్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కలర్ ఫోటోల సహితంగా ఓటర్ల జాబితా ఉంటే...అది పూర్తిగా నేరం, చట్ట విరుద్ధం అవుతుంది. ఇవి శిక్షార్హమైన నేరాలు. వీటిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అలాంటిది.. ప్రజల వివరాలన్నీ ప్రైవేటు కంపెనీలకు చోరీ చేసి ఇవ్వడం, టీడీపీ యాప్ అయిన సేవామిత్రలో వాడుకోవడం, ఇష్టమొచ్చినట్లుగా ఓటర్లను తీసేయడం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న ఈ వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఉండటానికి అర్హుడేనా?. ఇవే విషయాలను గవర్నర్‌కు నివేదించాం. ఎన్నికల కమిషన్‌కు కూడా మరోసారి చెబుతాం. వీటిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయమని అడుగుతాం. ఒక ముఖ్యమంత్రి ప్రజల బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం, ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం, సేవామిత్ర యాప్‌లో పొందు పర్చడం శిక్షార్హమైన నేరాలే. ఇవన్నీ చంద్రబాబు, ఐటీ మంత్రిగా ఆయన కుమారుడు జైలుకు పోవాల్సిన నేరాలే. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు తన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫామ్–7 సమర్పించడం ఒక తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. రెండేళ్లుగా ఆయన చేర్పించిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు తొలగించండి అని అడగడం తప్పంట. ఆయన అలా చెప్పడం.. ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా అంతా.. డ... డ... డ... అంటూ డప్పు కొట్టడం జరుగుతోంది..’ 56 లక్షల డూప్లికేట్, డబుల్ ఓట్లు గుర్తించాం ఎన్నికల కమిషన్ 2018 సెప్టెంబర్‌లో ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాను మేం పూర్తిగా అధ్యయనం చేశాం. చంద్రబాబు అన్యాయమైన పనులు చేస్తున్నాడనే ఆందోళనతో ఇలా అధ్యయనం చేశాం. గత ఎన్నికల్లో చంద్రబాబుకు, మాకూ వచ్చిన ఓట్ల తేడా కేవలం ఒక్క శాతం మాత్రమే. 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా. అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూడాలనే ఉద్దేశంతో ఆ ఓటర్ల జాబితాను పూర్తిగా అధ్యయనం చేశాం. అందులో రకరకాల పారామీటర్లతో 56 లక్షల డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉన్నాయని లెక్కలు తేల్చాం. ఒకే ఓటరు ఐడీ కార్డు మీద ఒక వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండటాన్ని గుర్తించాం. వయస్సు సంబంధిత అర్హత లేకున్నా ఓట్లు కలిగి ఉండటం (ఓటర్స్ ఆఫ్ ఇన్వ్యాలిడ్ ఏజ్), ఓటరు పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఇంటి నంబరు, వయçస్సు, లింగం ఒకే విధంగా ఉన్న డూప్లికేటు ఓట్లు గుర్తించాం. అలాగే ఒక వ్యక్తి ఏపీ , తెలంగాణలో ఓట్లు కలిగి ఉండటం.. ఇలా రకరకాలుగా 56 లక్షల డూప్లికేట్, డబుల్ ఓటర్లు ఉన్నారని గుర్తించి కోర్టులో కేసు వేశాం. 24 పెన్డ్రైవ్ల్లో సమాచారం సమర్పించాం. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. వీటిపై చర్యలు తీసుకుంటారు, దర్యాప్తు చేసి వెరిఫై చేసి సవరిస్తారనుకుంటే అలా జరగలేదు. ఎలాంటి చర్య తీసుకోలేదు. జనవరి 2019 వచ్చే నాటికి ఆశ్చర్యకరమైన రీతిలో ఇలాంటివి మరో 3 లక్షల ఓట్లు పెరిగాయి. ఇలాంటి ఓట్ల సంఖ్య మొత్తం 59 లక్షల 16 వేలకు చేరింది. దీంతో మళ్లీ జనవరిలో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి నేను స్వయంగా వినతిపత్రం సమర్పించా. మళ్లీ వారికి 24 పెన్‌డ్రైవ్‌లలో వివరాలన్నీ ఇచ్చాం. ఈ మేరకు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని వారికి అర్థం అయ్యేలా చెప్పాం. టీడీపీ రెండేళ్లుగా ఒక పద్థతి ప్రకారం ఇలా చేస్తున్న విషయం వివరించి వచ్చాం. తర్వాత దానిపై తదుపరి చర్యల్లో భాగంగా ఫామ్–7లు కూడా నింపి ఎన్నికల కమిషన్‌కు నివేదించాం. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారు డేటా దొంగతనానికి సంబంధించి ఏపీ పోలీసులకు కాకుండా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడాన్ని టీడీపీ వాళ్లు విమర్శించడాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఆంధ్రాకు సంబంధించిన వారెవరైనా వచ్చి హైదరాబాద్‌లోని మీ (మీడియా ప్రతినిధి) ఇంట్లో దొంగతనం చేస్తే ఆంధ్రాలో కేసు పెడతావా? లేకుంటే మీ ఇల్లు ఉండే ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు పెడతావా? అమెరికాలో ఏదైనా నేరం జరిగితే భారత్‌లో ఎవరైనా కేసు పెడతారా? వారి ఆఫీసు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది కనుక ఎవరైనా ఇక్కడే కేసు పెడతారు..’ అని చెప్పారు. ఆంధ్రా– తెలంగాణ గొడవ అన్నట్లు చెప్పడం సరికాదు ఇదేదో ఆంధ్రా– తెలంగాణ గొడవ అన్నట్లు చెప్పడం సరికాదని జగన్ అన్నారు. చంద్రబాబు తెలంగాణ–ఆంధ్రా మధ్య యుద్ధం అన్నట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించే, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజల ఆధార్ వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు తీసుకోవడం తప్పని, ఓటర్ల జాబితా మాస్టర్ కాపీ తీసుకుని సేవామిత్ర యాప్‌లో పెట్టుకోవడం నేరమని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రే ఇలా చేస్తే రేపు ఎవరికీ భద్రత ఉండదని అన్నారు. ‘ఆధార్ వివరాలు ఎవరి వద్దా ఉండకూడదు. ఆ వివరాలు ముఖ్యమంత్రి ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకూడదు. మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరి వద్దా ఉండకూడదు. మీ అకౌంట్లో నుంచి మీ జీతం చంద్రబాబు అకౌంట్లోకి వెళితే కూడా ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు..’ అని విపక్ష నేత వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించిన వారిలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పీడిక రాజన్నదొర, ఆదిమూలపు సురేష్, పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఉన్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’పై సిట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సైబరాబాద్, హైదరాబాద్ రెండు కమిషనరేట్లలోనూ కేసులు నమోదైన నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసింది. సభ్యుల్లోని 9 మంది గతంలో సైబర్ నేరాల విచారణలో రాణించిన నేపథ్యం ఉన్నవారే. అందుకే, కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేసేందుకు బృందంలోకి వీరిని తీసుకున్నట్లు తెలిసింది. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) కేసు నేపథ్యమిది ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ మాదాపూర్ పోలీసులకు లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 2న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలోని ఐటీగ్రిడ్ సంస్థపై దాడులు చేసి కొన్ని కంప్యూటర్లు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకుంది. 120(బీ), 379, 420, 188తోపాటు ఐపీసీ 72, 66(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఎస్సార్ నగర్లోనూ ఇదే అంశంపై మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును స్వయంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. కాగా కొత్తగా ఏర్పాటుచేసిన ఈ సిట్.. తక్షణమే మనుగడలోకి వచ్చేలా, దర్యాప్తు బాధ్యతలు చేపట్టేలా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు సమాచారమంతా సిట్‌కు బదిలీ కానుంది. గురువారం నుంచి ఈ ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. సిట్ కోసం డీజీపీ కార్యాలయంలోనే ప్రత్యేక గదిని కూడా కేటాయించినట్లు సమాచారం. ఇక నుంచి ఈ కార్యాలయం కేంద్రంగానే దర్యాప్తు పర్యవేక్షణ సాగుతుంది. సిట్‌కు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, సీఐడీ విభాగాలు నిత్యం సహకరిస్తాయని ఆదేశాల్లో స్పష్టంచేశారు. (ఇదీ జరుగుతోంది!) ఈ సిట్ బృందం వివరాలు 1. స్టీఫెన్ రవీంద్ర, ఐజీ వెస్ట్‌జోన్ 2. ఎన్.శ్వేత, కామారెడ్డి ఎస్పీ 3. రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీ (క్రైమ్) 4. జి. శ్రీధర్, నారాయణ్‌పేట్ ఎస్డీపీవో 5. బి.రవికుమార్‌రెడ్డి, సైబరాబాద్ డీఎస్పీ (సైబర్ క్రైమ్) 6. ఎన్.శ్యామ్ ప్రసాద్ రావు, ఏసీపీ, మాదాపూర్ 7. వై. శ్రీనివాస్, ఏసీపీ, సైబరాబాద్ (క్రైమ్) 8. బి.రమేశ్, ఇన్స్పెక్టర్, హైదరాబాద్ (సీసీఎస్) 9. జి.వెంకటరామిరెడ్డి, ఇన్స్పెక్టర్ హైదరాబాద్ (సైబర్ క్రైమ్) -
డేటా చోరీ ప్రకంపనలు.. అదే గనుక జరిగితే!
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒకటే చర్చ. డేటా చౌర్యం వార్తలతో తమ వ్యక్తిగత సమాచారం ఎంతవరకు భద్రం అనే అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ చేతుల్లోకి సున్నిత సమాచారం చేరడం ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి ఐటీ నిపుణులు విస్తుగొలిపే విషయాలు చెబుతున్నారు. ఫేస్బుక్ డేటా చౌర్యం మాదిరి మన డేటా కూడా లీక్ అయినట్లైతే గోప్యతా హక్కు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ స్కాం వెలుగులోకి వచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత ప్రమాదంలో పడింది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి దరఖాస్తు చేసుకున్న వాళ్లమే. చంద్రన్న భీమా పథకం కోసమో, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కట్టుకోవాలనో లేదా ఆరోగ్య రక్ష ద్వారా లబ్ది పొందాలనో ఆశించిన వాళ్లమే. ఇందులో భాగంగా మన పేరు, చిరునామా, ఫొటో, ఆధార్ నంబర్, సామాజిక వర్గం తదితర విషయాలను ప్రభుత్వ అధికారులకు ఇచ్చి ఉంటాం. అయితే ఈ వివరాలన్నీ ప్రభుత్వం వద్దే కాదు.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ రకంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత, రహస్య సమాచారం ఒక ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి వెళ్లడం వల్ల పౌరులకే కాకుండా దేశ భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అసలేం జరుగుతోంది... వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరచడంలో భాగంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) కోసం ఇటీవల స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్ నంబర్ సహా ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లో నిల్వ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లోని డేటాను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఈ డేటాను ఐటీగ్రిడ్స్ అనే సంస్థ తన ‘సేవామిత్ర’యాప్ రూపకల్పనలో ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదకర ఫీచర్లు ఉన్న ఈ యాప్ ద్వారా పౌరుల ప్రైవేటు డేటాను వివిధ వర్గాలకు విక్రయించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మనం బలై పోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరికైనా వివరాలు చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. అయితే ప్రభుత్వాన్ని నమ్మి వివరాలు చెప్పినందుకు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం నిజంగా విచారకరం. ప్రమాదకర ఫీచర్లు.. సేవామిత్ర యాప్‌లో అనేక ప్రమాదకర ఫీచర్లు ఉన్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు వినియోగదారులు ఎక్కడ ఉన్నదీ (యూజర్ లొకేషన్) తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. మన ఫోన్ స్టేటస్‌తో పాటు అందులోని వ్యక్తిగత ఫొటోలు, ఫైల్స్, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ యాప్ ద్వారా యూఎస్బీ స్టోరేజీ ఫైల్ సిస్టమ్‌లోని సమాచారాన్నితెలుసుకోవడంతో పాటు... అందులోని సమాచారాన్ని మార్పిడి చేయడం లేదా తొలగించే సామర్ధ్యం కూడా ఉందని చెబుతున్నారు. పౌరుల ఆడియో రికార్డుతో పాటు వైఫై కనెక్షన్ల వివరాలు, నెట్వర్క్ కనెక్షన్లు, బ్లూటూత్‌తో అనుసంధానం, ఆడియో సెట్టింగ్‌లను కూడా మార్చడం వంటివి చేయడం ద్వారా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హ్యాకింగ్‌కు గురైతే మన బ్యాంకు ఖాతాల వివరాలు, పర్సనల్ ఫొటోలు, వివిధ వ్యక్తులతో మనం జరిపిన సంభాషణలు వీటితో పాటు పూర్తి గోప్యంగా ఉంచుకునే కొన్ని విషయాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ‘అభిమన్యుడు’ సినిమాలో మాదిరి మనల్ని మనం పూర్తిగా కోల్పోయే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం సేవామిత్ర యాప్ వల్ల ఒక వ్యక్తి ఫోన్లో ఉన్న డేటా మొత్తం చౌర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. - అప్రాక్సిమేట్, ప్రిసైజ్ లోకేషన్ : ఒక వ్యక్తి ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే లోకేషన్ సర్వీస్ ఆన్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. - ఫోన్ కాల్స్ : ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్ ఫోన్ నంబర్‌తో పాటు డివైస్ ఐడీని తెలుసుకోచ్చు. - స్టోరేజ్ సిస్టమ్ : యూఎస్బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్ వచ్చి చేరిపోవచ్చు. - మైక్రోఫోన్ : మైక్రోఫోన్ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది. - ఆడియో సెట్టింగ్స్ : స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ మారిపోతుంటాయి. కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం చేస్తుంటారు. -
డేటా చోరీ కేసు: కోడ్ లాంగ్వేజ్ వాడిన కీలక వ్యక్తి!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను చోరీ చేసిన ఐటీ గ్రిడ్స్, టీడీపీ సర్కార్ మహా పన్నాగం బట్టబయలు అయింది. తెలుగుదేశం పార్టీ సైబర్ కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపుకు సంబంధించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు వివరించారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్ కంపెనీ సర్వర్‌లో నిక్షిప్తమై ఉందని ఆయన తెలిపారు. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ ’సేవామిత్ర’ వాడుకుంటోందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారని, అతడు కోడ్ భాషలో మాట్లాడుతున్నాడని, ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆ కీలక వ్యక్తి ఎవరనేది త్వరలోనే తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ...‘ఆంధ్రప్రదేశ్‌లో సేవామిత్ర యాప్ ద్వారా సర్వే చేపడుతున్నారు. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ చాలామంది సర్వేయర్లను నియమించుకున్నారు. సర్వేలో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అన్నది తెలుసుకున్నారు. సర్వేయర్ల ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారం టీడీపీ బూత్ లెవల్ అధికారులకు వెళుతుంది. సేవామిత్ర వెబ్సైట్లో బూత్ కన్వీనర్లు, డ్యాష్ బోర్డు వివరాలున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారో సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలైన ఆధార్, ఓటర్ ఐడీ వివరాలు సేకరించారు. ఆ క్వశ్చనీర్లోనే ఎన్నికల సరళిపై సర్వే చేయడంతో పాటు, ఏ పార్టీకి ఓటేస్తారని ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. డేటా చోరీ, ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అందుకే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈ ఫిర్యాదుపై ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద ఐపీసీ 420,467,468,471,120బీ కింద కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుదారు వాంగ్మూలం తీసుకున్నాం. విజయవాడకు చెందిన కందుల రమేశ్, కందుల నాగమణికి ఓటర్ ఐడీ ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో వీరి పేర్లు గల్లంతయ్యాయి. వారి వివరాలు ఆన్లైన్ వెరిఫికేషన్‌లో రావడం లేదు. దశరథ రామిరెడ్డి ఫిర్యాదులో 2018 ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో 3వేల మంది మైనార్టి ఓటర్లను తీసేశారాని పేర్కొన్నారు. సైబారాబాద్ పోలీసులు ఇప్పటికే ఐటి గ్రిడ్స్ సంస్థపై విచారణ జరుపుతున్నారు. సైబారాబాద్ పోలీసులతో కలిపి విచారణ జరుపుతాం. ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తాం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అన్నది కనుక్కోవాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. ఇక సర్వర్ నుంచి డేటా ఇవ్వాల్సిన బాధ్యత గూగుల్, అమెజాన్ సంస్థలపై ఉంది. ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు ఇచ్చాం, త్వరలో సమాధానం వస్తుంది.’ అని సీపీ తెలిపారు. -
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు
-
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. డేటా చోరీపై చంద్రబాబు చేసిన పనిని గవర్నర్‌కు వివరించారు. ఒక పద్ధతి, పథకం ప్రకారం డేటా చోరీ.. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరగలేదేమో అని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా?. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చాం. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి. సేవా మిత్ర టీడీపీకి సంబంధించిన యాప్. ఆ యాప్‌ను తయారు చేసింది ఐటీ గ్రిడ్స్ కంపెనీ. ఆధార్ వివరాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండకూడదు. సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌లో వివరాలు దొరకడం క్రైమ్ కాదా?. కలర్ ఫోటోతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకు వచ్చింది. ఆ జాబితా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్లలో ఎలా కనబడతోంది. ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఎలా ఉన్నాయి. వ్యక్తిగత వివరాలు ప్రయివేట్ సంస్థల వద్ద ఉండనే ఉండకూడదు. ప్రభుత్వమే ఇంటింటికి పంపి సర్వేలు చేయించి ఆ డేటాను కూడా సేవా మిత్రలో పొందుపరిచారు. రెండేళ్ల నుంచి పథకం ప్రకారం ఓట్లను తొలగిస్తున్నారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్ ఓట్లను నమోదు చేస్తున్నారు. మేం ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం. రాబోయే రోజుల్లో సీఈసీని కూడా కలుస్తాం. ఒక ప్రయివేట్ కంపెనీలో డేటా దొరకడం సబబేనా?. ఇది నేరం కాదా?. ఓటర్ల డేటా, కలర్ ఫోటోలతో మాస్టర్ కాపీ ఎలా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్స్‌లో కనబడుతుంది. కేంద్ర, సీఈసీ, హోంశాఖ పరిధఙలోని డేటా ఎలా వచ్చింది. బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. వ్యక్తుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, కలర్ ఫోటోలతో ఓటర్ల వివరాలు మీ దగ్గర ఉన్నాయి. దీనితో మీరు ఏమి చేసినా ప్రజలు నాశం అవ్వరా?. ఇలాంటి సైబర్ క్రైం రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా జరిగి ఉండదేమో. ఐటి గ్రిడ్స్ అనే కంపెనిపై దాడులు జరిగినపుడు అనేక వివరాలు బయటకు వచ్చాయి. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్. ఇది ఎవరు తయారు చేశారు అంటే ఐటీ గ్రిడ్స్ అనే సంస్ధ. ఈ యాప్ వద్ద ఉండకూడని డేటా ఉంది. ప్రైవేటు వ్యక్తులు సంస్థల వద్ద ఉండకూడని సమాచారం ఏ రకంగా కనబడతున్నాయి. ఆధార్ వివరాలు ప్రైవేటు కంపెని కంప్యూటర్లలో దొరకడం సబబేనా?. ఇది క్రైమ్ కాదా?. ఆధార్ వివరాలు కాకుండా ఓటర్ ఐడీ, డేటా విత్ కలర్ ఫోటోస్...మాస్టర్ కాపీ అనేది ఎవరికి అందుబాటులో ఉండదు. ఏ రకంగా అది ఐటి గ్రిడ్స్ కంపెనీలో కనబడుతోంది. టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఏ రకంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు కూడా వారి వద్ద లభించాయి. ఇవి ఏరకంగా ప్రత్యక్షం అవుతున్నాయి. సేవామిత్రాలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. అంటే దీని అర్థం ఏమిటి?. గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలు చేయించారు. అవన్నీ కూడా సేవా మిత్రలో అనుసంధానం చేశారు. ఈ డేటాను టీడీపీ నేతలకు పంపారు. ఆ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారు. ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను ఓ పద్దతి ప్రకారం డిలీట్ చేయడం మొదలు పెట్టారు. వారికి ఓటేస్తారని తెలిసినవారి ఓట్లు రెండుగా నమోదు చేయించారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తా ఉన్నారు. ఇలా జరుగుతుందని 2018 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఎందుకంటే గతంలో మేం కేవలం 1 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. మా స్టడీలో 59 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు కనిపించాయి. జనవరిలో ఎన్నికల కమిషన్‌ను కలసి 24 పెన్ డ్రైవ్‌లు ఇచ్చి 54 లక్షల ఓట్లకు సంబంధించి సమాచారం ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని ఫిర్యాదు చేసి వచ్చాం. దానిలో భాగంగా ఫారం-7 పూర్తి చేసి ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించమని విచారణ చేసి ఆ నిర్ణయం తీసుకోమన్నాం. మేం ఈ కార్యక్రమం చేస్తుంటే ఏపీ పోలీసులను పంపించి ఫారం-7 పెట్టిన వారిపై వేధింపులు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఫారం 7 పూర్తి చేసి,1950 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే మీరు ఓటర్ అవునా కాదా అనే విషయం తెలుస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది ప్రతి పౌరుడి భాధ్యత. చంద్రబాబు నాయుడు దీనిపై విచారణ జరపకుండానే ఎల్లో మీడియాను ఉపయోగించి చేయాల్సిందంతా చేస్తున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు చేస్తున్న అక్రమాలను బయటపెట్టాల్సిన వారు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రైవేటు సంస్దల వద్ద ఆధార్, కలర్ ఓటర్ జాబితాలు, బ్యాంక్ అకౌంట్లు ఉండటం నేరం. ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఏమాత్రం తప్పు చేస్తున్నామనే భావన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఓటర్లను తొలగించడం, అక్రమంగా నకిలీ ఓట్లు నమోదు చేయించడం నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం దారుణం. ఈ విషయాలు అన్నీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా చేసింది జైలుకు వెళ్లాల్సిన నేరాలు. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫారం 7 దరఖాస్తు చేయడం తప్పన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఐటి గ్రిడ్స్ చేయకూడని పనులు హైదరాబాద్‌లో చేస్తుంటే ఇక్కడే కేసు పెడతారు కదా. ఇదేదో ఆంధ్రాకు, తెలంగాణా రాష్ట్రాల మధ్య గొడవన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తూ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. 59 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్‌కు అందించాం. వెరిపై చేసి దానిలో తప్పుంటే తీసేయండి అని కోరాం. ఫారం 7 అనేది రిక్వెస్ట్ ఫర్ ఎంక్వయిరీ. అలా చేయడం తప్పు కాదు, నేరం కాదు.’ అని అన్నారు. వైఎస్ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలుసు పార్థసారధి, రాజన్న దొర, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని తదితరులు ఉన్నారు. -
ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారు
-
టీడీపీ వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది
సాక్షి, విజయనగరం : ప్రజాదారణ కోల్పోయిన టీడీపీ.. అక్రమార్గంలో గద్దెనెక్కాలనే ఉద్దేశంతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేదు కాబట్టే ఎదో కుట్ర చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ దారుణంగా ఓడిపోతుందన్న భయంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఓట్లను తొలగిస్తూనే.. తమ సానుభూతి ఓట్లే తొలగిస్తున్నారని టీడీపీ చెబుతుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెబుతున్న 7500 ఓట్లు ఎవరి సానుభూతిపరుల ఓట్లో ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధమన్నారు. మంత్రికి దమ్ముంటే బొబ్బిలిలోని ప్రతి గ్రామానికి వెళ్లి నిజాన్ని తెలుసుకోవడానికి రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వ దగ్గర ఉండాల్సిన పౌరుల సమాచారం ఓ ప్రైవేట్ కంపెనీ వద్దకు ఎలా వెళ్లిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు నెల క్రితం కొంత మంది వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతూ.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలను తెలుసుకొని వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి, డీజీపీలకు ఫిర్యాదు చేశామన్నారు. గత 26వ తేది నుంచి చీపురుపల్లి, మెరకముడిదాం మండలాలలో 2వేలకు పైగా ఫాం7 ధరఖాస్తులు నమోదయ్యాయని, 27వ తేదికి అవి 7 వేలకు చేరాయన్నారు. ఇలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25వేల వరకు ఫాం7 నమోదయ్యాయన్నారు. ఇవన్ని కుట్ర పూరితంగా చేసిన ఫిర్యాదులేనన్నారు. ఫాం7 ధరఖాస్తులో నూటికి నూరు శాతం వైఎస్సార్సీపీ నానుభూతిపరుల ఓట్లే ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల వేళ టీడీపీ నేతలు ఎదో కుట్ర రూపంలో వస్తారని అంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
‘అబద్ధాలు’ అని రాసి పోస్ట్ బాక్స్‌లో వేస్తే..
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏ తప్పు చేసి దొరికినా ప్రధాని మోదీపై రుద్దేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుదీష్ రాంబొట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు.. ఒక ప్రైవేటు కంపెనీపై..ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎందుకంత భయం అని ప్రశ్నించారు. బాబు అక్రమాలను ఎవరు ప్రశ్నించినా.. మోదీ, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ చేసిన కుట్రగానే ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలకు మారుపేరు చంద్రబాబు. అబద్ధాలు అని పేరు రాసి పోస్ట్‌బాక్స్‌లో వేస్తే అది నేరుగా చంద్రబాబుకే వెళ్తుంది. బాబు అబద్ధం చెబితే టీడీపీ నాయకులు దాన్ని నిజమని ప్రచారంలోకి తెస్తారు. డేటా చోరీ కేసును ఏపీపై తెలంగాణ దాడిగా టీడీపీ నేతలు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు కేసీఆర్‌ను పొగిడినప్పుడు ఆంధ్రుల అభిమానం దెబ్బతినలేదా. ఏపీలోని ప్రతి శాఖ అవినీతి కంపుతో నిడిపోయింది. చంద్రబాబు కోసం ప్రత్యేక రాజ్యాంగాన్ని రాయాలేమో. డబ్బు ప్రింట్ చేసుకోవడానికి ఓ జీవో తెస్తే టీడీపీ నాయకులు సంతోషిస్తారు కావచ్చు. పోలవరం సందర్శన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు’ అని సుదీష్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామని, ఒకవేళ పొత్తులు పెట్టుకున్నా బహిరంగంగా ప్రకటిస్తామని తెలిపారు. -
చంద్రబాబుపై విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, అనంపురం: సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల డేటాను ఉపయోగించుకోవటం సిగ్గు చేటని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడిమా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల డేటా చోరీ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు నారా లోకేషలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కుట్రలు చేస్తున్నారని ఆనయ ఆరోపించారు. తండ్రి కొడుకులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ విషయంలో ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని అన్నారు. -
‘కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద స్కాం’
సాక్షి విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు రుణమాఫీ మాత్రం జరగలేదుగానీ ఓట్లమాఫీ మాత్రం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీకి కేవలం ఐదులక్షల ఓట్లు మాత్రం తేడా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీగ్రిడ్స్ స్కాం కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద కుంభకోణమని విమర్శించారు. ఏమీ తప్పుచేయని చంద్రబాబు గుమ్మడికాయ దొంగాల భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఐటీగ్రిడ్స్ సీఈవోను తెలంగాణ పోలీసులకు అప్పగించాలని మాధవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు వివేకం కోల్పోయి.. దిగజారుడు తనానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని, ప్రజల వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని హితవుపలికారు. ఐటీగ్రిడ్స్ సంస్థ ప్రజల డేటాను ఎవరికిచ్చిందో విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. -
కడప ఓట్ల తొలగింపులో కొత్త నాటకం
-
ఓట్ల తొలగింపు కుట్ర బాబు,లోకేష్‌దే
అనంతపురం, కదిరి : రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఓట్ల తొలగింపు కుట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పనే అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మంగళవారం తన స్వగృహంలో కదిరి సమన్వయకర్త డా.పెడబల్లి వెంకట సిద్ధారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఏనాడూ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించలేదన్నారు. ఎప్పుడూ స్వార్థం కోసమే ఉపయోగించారన్నారు. ఓట్లు, సీట్లు తప్పా ఆయనకు ఇంకేమీ పట్టవు.. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపునకు ఐటీశాఖ ఉపయోగపడుతుందనే ఏపీలో లోకేష్‌బాబుకు ఐటీ మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ ద్వారా ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు, ఏపార్టీకి సానుభూతి పరులు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవన్నీ బహిర్గతం కావడంతో తండ్రీ కొడుకులపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఉలుకెందుకు బాబూ?: ఏపీ ప్రజల వివరాలు బహిర్గతమైన విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తుంటే చంద్రబాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని మాధవ్ అన్నారు. కచ్చితంగా ఇది చంద్రబాబు పన్నిన కుట్రేనన్నారు. ఐటీ గ్రిడ్ సీఈఓకు, లోకేష్‌బాబుకు సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 30 సీట్లు కూడా రావనే విషయం చంద్రబాబు గ్రహించే ఇలా ఓట్లను తొలగించే దుర్మార్గపు పనులకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. రెండు రోజులుగా చంద్రబాబు హడావుడి చూస్తుంటే ఐడీ గ్రిడ్‌కు, ప్రభుత్వానికి సంబంధం ఉందనే విషయం చెప్పకనే అర్థమవుతోందన్నారు. -
విచారణ తూతూమంత్రం
అధికార టీడీపీ పక్షంలో గుబులు పట్టుకుంది. దొంగ ఓట్ల గుట్టు రట్టు అవుతుండటంతో పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గత చర్చలో ఈ కేసులు ఎవరిని ముంచుతాయోననే చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో సుమారు 50వేల ఓట్ల తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షాత్తూ ఆర్డీఓనే రంగంలోకి దిగి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతిపరుల ఓట్లను తొలగించాల్సిందిగా అదేపార్టీ వారు దరఖాస్తు చేసినట్లు టీడీపీ వారు దొంగ నాటకానికి తెరతీసిన వైనం తెలిసిందే. ఇది ఇప్పుడు అధికారులకు కూడా పెద్ద తలనొప్పిగా తయారైంది. వేలకొద్దీ వచ్చి పడిన దరఖాస్తులను విచారించడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ దరఖాస్తులను మొక్కుబడిగా విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణకు వెళ్తున్న బీఎల్ఓలకు ముచ్చెమటలు పడుతున్నట్లు భోగట్టా. బద్వేలు/కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఓట్ల తొలగింపునకు వచ్చిన ఫారం–7 దరఖాస్తులపై విచారణ తూతూమంత్రంగా నడుస్తోంది. ఎన్నికల వేళ అధికార పార్టీ కుట్ర పన్ని వేల దరఖాస్తులు సమర్పించిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూరుస్తూ సేవామిత్ర యాప్ తయారు చేసిన బ్లూఫ్రాగ్, దాని నుంచి ఓటర్ల వ్యక్తిగత సమాచారం అందుకున్న ఐటీగ్రిడ్స్‌కు టీడీపీకి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో తప్పుడు దరఖాస్తులను అన్లైన్లో సమర్పించడం సైబర్ నేరం కింద వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం కూడా పెద్ద నేరమని సైబర్ నిపుణులు చెబుతున్నా ఆ దిశగా అధికారులు మాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం కమలాపురం నియోజకవర్గంలో మాత్రమే ఆర్డీఓ ఫిర్యాదు చేయగా మిగిలిన ప్రాంతాల్లో అధికారులు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసేలా తప్పుడు పేర్లతో ఫారం–7 అందించి ఓట్లను తొలగించాలని కోరారు. ఇది ప్రభుత్వాన్ని మోసం చేయడమే. దీంతో పాటు ఓటర్ల డేటాను ఎలా సంపాదించారనే విషయాన్ని కూడా వారు తెలుసుకోవాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కేవలం గ్రామాల్లో తూతూమంత్రంగా విచారిస్తున్నారు. దీనిపై పలు చోట్ల ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము దరఖాస్తు చేయనప్పుడు, దరఖాస్తు చేశారని చెబుతున్న వ్యక్తులు దానికి సంబంధం లేదని చెబుతున్నప్పుడు విచారణ ఎందుకని బీఎల్ఓలను నిలదీస్తున్నారు. బలవుతున్న బీఎల్ఓలు ప్రస్తుతం ఈ దరఖాస్తులను నాలుగైదు రోజుల్లో విచారించాలని ఉన్నతాధికారులు బూత్‌లెవెల్ అధికారుల(బీఎల్ఓ)కు ఆదేశాలు జారీ చేశారు. వారు ఆదివారం, శివరాత్రి పండుగ కూడా జరుపుకోకుండా గ్రామాల్లో పడి దరఖాస్తులను విచారిస్తున్నారు. ఒక్కో ఓటు తొలగింపు ఫారానికి మూడు ఫారాలు తయారు చేసి ఓటు తొలగింపు చేసిన వ్యక్తి, ఓటు తొలగింపు వ్యక్తితో సంతకాలు చేయించుకుంటున్నారు. చాలామంది ఓటర్లు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో వారి ఓట్లు పరిస్థితి ఏమిటో తెలియడం లేదనే ఆందోళన నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు గెలిచేందుకు అడ్డదారులను తొక్కుతున్నారు. ఇప్పటికే ఆరు నెలల కిందట భారీగా ఓట్లు తొలగించేలా ఒత్తిడి తెచ్చి సఫలీకృతమయ్యారు. జాబితాలో పేరు లేని ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకుని ఓటు పొందారు. దీంతో మరో దఫా అన్లైన్లో ఫారం–7 సమర్పించారు. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో బూత్‌లెవెల్ అధికారులపై వైఎస్సార్సీపీ మద్దుతుదారుల ఓట్లు తొలగించాలని ఒత్తిళ్లు తెలుస్తున్నట్లు సమాచారం. చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం ఆన్లైన్ ద్వారా తప్పుడు దరఖాస్తులు సమర్పిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం ఇప్పుడిప్పుడే కొరడా ఝుళిపిస్తోంది. పది మందిపై కేసుల నమోదు కోసం సైబర్ క్రైం సెల్‌కు ఫిర్యాదులు పంపారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి, కమలాపురంలో రెండు, పులివెందులలో రెండు, ప్రొద్దుటూరులో రెండు, బద్వేలులో ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు పంపారు. ఇవన్నీ గుర్తు తెలియని వారిపై ఇచ్చిన ఫిర్యాదులే. పోలీసులు సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ఐపీ అడ్రస్సు కనుగొంటారు. దీంతో ఏ కంప్యూటర్ నుంచి తప్పుడు దరఖాస్తులు వచ్చాయి, ఎవరు పంపారో తెలుసుకుని వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు. సైబర్ క్రైం, ఐపీసీ, ప్రజాప్రతినిద్య చట్టం 1951 సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఓట్ల తొలగింపునకుఈనెల 1వ తేది నాటికి జిల్లావ్యాప్తంగా 37 వేల దరఖాస్తులు అందాయని అధికారులంటున్నారు. కానీ ఈ సంఖ్య 50వేల వరకూ ఉంటుందని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా అలజడితో ఫారం–7లు రావడం తగ్గాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.రఘునాథ్ సాక్షికి తెలిపారు. జిల్లాలో నియోజకవర్గాలు: 10 తుది జాబితా నాటికి ఓటర్లు: 20,56,660 పోలింగ్ స్టేషన్లు: 2,723 రిటర్నింగ్ అధికారులు: 10 ఫారం–7 దరఖాస్తులు: సుమారు 50వేలు ఆందోళన వద్దు తప్పుడు దరఖాస్తులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగిస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఫారం–7 వస్తే దాని ఆధారంగా బీఎల్ఓలు క్షేత్ర స్థాయి విచారణకు వెళతారు. తనకు రెండుచోట్ల ఓటు ఉందని, ఒకచోట తొలగించాలంటూ స్వయంగా ఓటరు సంతకంతో కూడిన దరఖాస్తు ఇస్తే తప్ప తొలగింపు సాధ్యపడదు. ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 0.1 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మూడు దశల్లో విచారణ నిర్వహిస్తారు. అంటే జిల్లాలోని తుది ఓటర్ల జాబితా ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో 200కు మించి దరఖాస్తులు రావాల్సి ఉంటుంది. ఇందులో అర్హమైనవి ఉంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకున్న తర్వాతే తొలగిస్తారని అధికారులు అంటున్నారు. అంటే ఓటర్లకు తెలియకుండా వారి ఓటును ఎవరూ తొలగించలేరని వారు స్పష్టం చేస్తున్నారు. తొలగింపునకు వచ్చిన ఫారం-7 దరఖాస్తులు ఫిర్యాదు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటి! బద్వేలు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో దాదాపు 9600 ఓట్లు తొలగించాలని పారం–7 దరఖాస్తులు అందాయి. ఇవన్ని తప్పుడవని తేలినా ఒక్క మండలంలో కూడా పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయకపోవడంలోని అంతర్యమేమిటో అర్ధం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వమే తప్పుడు విధానాల్లో దరఖాస్తు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తప్పుడు దరఖాస్తులపై కేసు నమోదు చేస్తే అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తాయనే భయమో... లేక ఇప్పటికే ఆదేశాలు వచ్చాయో అని ఓటర్లు చర్చించుకుంటున్నారు. నా ఓటు తొలగింపు నేనే కోరుకుంటానా? నా ఓటు పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో ఉంది. నేనే వైఎస్సార్సీపీ యూత్ నాయకుడిని, బూత్ కన్వీనరును. అలాంటి పరిస్థితుల్లో నా ఓటు నేనే ఎందుకు తీసుకుంటా. నా పేరు మీద కొందరు తప్పుడు దరఖాస్తులు అందించారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లా. కానీ చర్యలు మాత్రం శూన్యం. – గిరిప్రణిత్రెడ్డి, పోరుమామిళ్ల మండలం కఠిన చర్యలు తీసుకోవాలి ఇతరుల సమాచారాన్ని దొంగిలించి ఓట్ల తొలగింపునకు తప్పుడు దరఖాస్తులు ఇచ్చారు. ఇది సైబర్ నేరమే. అయినా అధికారులు, పోలీసులు పట్టనట్లు వ్యవహరించడం సరికాదు. బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – రవిచంద్రారెడ్డి, రజాసాహెబ్‌పేట, పోరుమామిళ్ల మండలం ఇంటింటికి తిరిగి విచారిస్తున్నాం ఓట్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తులను ఇంటింటి విచారణ చేస్తున్నాం. చాలా మంది అర్హులవే ఉన్నాయి. దీనికి తోడు తొలగించాలని పేర్కొంటున్న వ్యక్తులు సైతం తాము దరఖాస్తు చేయలేదని చెబుతున్నారు. అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం – జమాల్‌బాషా, బీఎల్ఓ, నరసాపురం, కాశినాయన మండలం కేసులు పెట్టమని చెప్పాం నియోజకవర్గంలోని కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, కాశినాయన మండలాల్లో తొలగింపు దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కేసులు నమోదు చేయమని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. కానీ పూర్తి వివరాలు తీసుకు వస్తే కేసులు పెడతామని పోలీసులు తెలియజేయడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు నాలుగు మండలాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయిస్తాం. – రామచంద్రారెడ్డి, ఆర్వో, బద్వేలు నియోజకవర్గం -
‘ఈసీ వద్ద ఉండాల్సిన డేటా బాబుకు ఎక్కడిది’
సాక్షి, కర్నూలు : చంద్రబాబు పాలన మొత్తం శంకుస్థాపనలతోనే నిండిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల డేటా చంద్రబాబు వద్దకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ పేరుతో చంద్రబాబు, అతని కొడుకు లోకేష్ భారీ స్కామ్‌కు దిగారని అన్నారు. ఎన్నికల సంఘం చొరవ తీసుకుని తండ్రీ, కొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు టీడీపీ వ్యతిరేకుల ఓట్లు తొలగించే కార్యక్రమానికి తెరలేపాడని మండిపడ్డారు. (‘ఏటీఎం, క్రెడిట్ కార్డు పాస్వర్డ్స్ మార్చుకోవాలి’) -
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు షాక్
-
ఓట్ల అక్రమాల పై చంద్రబాబు దొంగాట
-
ఎమ్మెల్యే ఓటుకే ఎసరు
సాక్షి, చిత్తూరు : రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు టీడీపీ ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. ఏకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓటు తొలగింపునకు ప్రయత్నించింది. తాజాగా వైఎస్సార్సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఓటుకు ఎసరు పెట్టింది. తన ఓటు తొలగింపునకు దరఖాస్తు వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారని సునీల్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉద్దేశపుర్వకంగానే వైఎస్సార్సీపీ నేతల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఫారమ్- 7 దరఖాస్తులు లక్షా పది వేలు దాటాయని వెల్లడించారు. మొన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించగా, నేడు ఎమ్మెల్యే ఓటు తొలగించేందుకు దరఖాస్తులు వచ్చాయని వాపోయారు. చంద్రబాబు తన పచ్చ మీడియాతో తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. ఓట్లు తొలగింపు విషయంలో తన తప్పును కప్పి పుచ్చేందుకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు దొంగాట ఆడుతున్నారని మండిపడ్డారు.