
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి కేసు వ్యవహారంలో విచారణ జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన వ్యాఖ్యలతో చంద్రబాబు.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని టీఆర్‌ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదుచేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.