
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడ: ఆంధ‍్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార కాంక్షతోనే తన కుమారుడు లోకేష్‌ను అందలం ఎక్కించాలని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్ ఆరోపించారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంలో కోసూరి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ దాకవరం అశోక్‌తో, సేవా మిత్ర యాప్ తయారు చేయించి ప్రజల డేటాను చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దొంగిలించారని ఆరోపించారు. అశోక్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లోకేష్ బాబు సంరక్షణలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చేసే అక్రమాలకు టీడీపీ భూస్థాపితం అవ్వటం ఖాయమన్నారు. చంద్రబాబు మూట ముళ్లు సద్దుకుని కట్ట పక్క నుంచి హైదరాబాద్‌కి వెళ్లేపోయే సమయం దగ్గర పడిందని విమర్శించారు. చంద్రబాబు ఓట్ల తొలగింపు ఆగడాలపై ఎంపీ జీవీఎల్ నర్సింహరావు, కన్నా లక్ష్మీనారాయణలు ఎన్నికల సంఘానికి ఇదివరకే ఫిర్యాదు చేశారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేసి లోకేష్‌ని, చంద్రబాబు నాయుడు, అశోక్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment