సాక్షి, విజయవాడ : మరో 40 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం యూటర్న్ తీసుకుని డ్రామాలాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ ధ్వజమెత్తారు. సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని విమర్శించారు. వైఎస్ జగన్ కోసం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్న శివాజీ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తులని చంద్రబాబు కీ ఇచ్చి ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు.
(సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!)
నేరం చేయనప్పుడు ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఎందుకు హైకోర్టులో పిటిషన్ వేశాడని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ పనీ పాట లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అందుకే గుంటూరు జిల్లాలోని గొరిజవోలులో శివాజీని బహిష్కరించారని చెప్పారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు శివాజీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత డేటాను బజార్లో పెట్టిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు.
(స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?)
Comments
Please login to add a commentAdd a comment