సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తాను రాజీ పడ్డానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఇంతకాలం రాష్ట్ర ప్రజల కోసం కట్టుబట్టలతో, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేశానంటూ బిల్డప్‌లు ఇచ్చిన ఆయన... అనుకోకుండా అసలు రహస్యం బయటపెట్టేశారు. శనివారం మధ‍్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్లు పాటు కేంద్రం అనుమతి ఇచ్చినా, తన రాజకీయ అవసరాల కోసమే రాజీ పేరిట ఉమ్మడి రాజధానిని వదిలేశానంటూ లోగుట్టును తానే బయట పెట్టుకున్నారు. దీంతో నాలుగున్నరేళ్ల తర్వాత అసలు విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించినట్లు అయింది. చదవండి... (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!)
సాక్ష్యాలంటూ తుస్సుమనిపించారు...
మరోవైపు చంద్రబాబు వెల్లడించిన అంశాలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సాక్ష్యాలు బయటపెడతానంటూ భారీగా ముందు నుంచి లీకులు ఇచ్చి... తీరా తుస్సుమనిపించారు. సీఎం ప్రెస్‌మీట్‌పై ఉదయం నుంచి ఎల్లో మీడియా ఊదరగొట్టగా, మరోవైపు టీడీపీ భూమి బద్దలయ్యేలా ఏదో జరగబోతోందంటూ హడావుడి చేసింది. డేటా చోరీ వ్యవహారంలో కుట్ర అంటూ.. దానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ప్రజలకు ఇస్తారంటూ ప్రచారం చేశారు. తీరా ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు పాత పాటనే తిప్పి తిప్పి పాడినట్లు అయింది. డొంక తిరుగుడు మాటలతో బాబుగారు సుమారు గంటసేపు ప్రెస్‌మీట్ నిర్వహించారు. చివరకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును చూపించారు. చదవండి....(స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?)
నోరు మెదపని చంద్రబాబు..
ప్రజల డేటా ఎలా చోరీ అయిందన్న విషయంపై మాత్రం చంద్రబాబు నోరు మెదపలేదు. కాగా ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి... అదే సమయంలో దొంగ ఓటర్లను చేర్పిస్తున్నట్లు జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఫిర్యాదు చేశారు. అయినా దొంగ ఓట్లపై చర్య తీసుకోకపోవడంతో ఎన్నికల కమిషన్‌కు విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ చర్యలకు దిగకముందే చంద్రబాబులో వణుకు ప్రారంభమైంది. ఐటీ గ్రిడ్స్ సంస్థకు ప్రభుత్వ డేటా ఎలా వచ్చింది?. టీడీపీ సేవా మిత్ర యాప్‌కు ప్రజల రహస్య సమాచారం ఎలా వచ్చింది?. బ్లూ ఫ్రాగ్ సంస్థకు ఏపీ ప్రభుత్వానికి ఉన్న రహస్య సంబంధం ఏంటి?. ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ దాకవరం ఎక్కడున్నాడు?. అతడిని ఎక్కడ దాచారు?? తప్పు చేయకపోతే దర్యాప్తుకు అశోక్ ఎందుకు రావడం లేదు?. విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయడమే చంద్రబాబు దృష్టితో తప్పా?. అనే అభిప్రాయాలు వ‍్యక్తమవుతున్నాయి. చదవండి... (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!)
Comments
Please login to add a commentAdd a comment