
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, ఐటీ గ్రిడ్స్ వ్యవహారాన్ని కేంద్రం నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆరోపించారు. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వ పెద్దలందరూ ఏపీపై తెలంగాణ దాడిగా భావిస్తున్నారన్నారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక ప్రైవేట్ కంపెనీపై, ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఏపీ ప్రభుత్వానికి ఎందుకంత భయం పట్టుకుందని నిలదీశారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!)
డేటా చోరీ ఓ పెద్ద కుంభకోణం లాంటిదని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేసి దొరికినా ప్రధాని నరేంద్ర మోదీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైనది కాదని పేర్కొన్నారు. ఏపీలోని ప్రతి శాఖ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని వాఖ్యానించారు. రాష్ట్రంలో ఏది జరిగినా మోదీ, జగన్, పవన్ చేస్తున్న కుట్రగా చంద్రబాబు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. (ఇదీ జరుగుతోంది!)
Comments
Please login to add a commentAdd a comment